you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 5

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 5

ప్రియా ఫ్రెష్ గా స్నానం చేసి బయటికి రాగా వాళ్ళ అమ్మ సునంద ఎదురుగా నవ్వుతూ కనిపించింది ఆవిడ చేతిలో సాంబ్రాణి ధూపం పట్టుకొని ఉంది .

ఆవిడని చూస్తూ నవ్వుతూ" మామ్ ఈరోజు నువ్వు వచ్చావ్ ఏంటి నానమ్మ  ఎక్కడ,  రోజు తానే కదా నా తలకి సాంబ్రాణి ధూపం వేయడానికి వస్తుంది " అని అడిగింది.

"  మీ నానమ్మ,.. వాళ్ళ కూతురు వస్తుందన్న ఆనందంలో కింద సర్వెంట్స్ కి ఆర్డర్స్ ఇస్తూ ఉంది , అది ఎలా చేయాలి ఇది అలా చేయాలి అంటూ , సో ఆవిడ పని ఈరోజు నాకు  అప్పగించింది"  అని నవ్వుతూ చెప్పింది సునంద. 

" సరే మమ్మీ త్వరగా కానివ్వవా? నా కృష్ణయ్య నాకోసం వెయిట్ చేస్తున్నాడు " అని అంటూ బెడ్ మీద పడుకొని తల కిందకి వేలాడేసింది.

సునంద వచ్చి తన కూతురి జుట్టుకి దూపం వేస్తూ ఉంది.

"అమ్ము.."  అని సునంద  పిలుస్తుంటే వాళ్ళ అమ్మని అడ్డుకుంటూ  " మామ్  నీకు ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దు అని ..." కొంచెం కోపంగా అనింది ప్రియ .

" సరే స్వీటీ.."  అని చెప్పి " నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా " అని అనింది ఆవిడ. 

" ఎందుకు మీ ఆడబిడ్డ వస్తుందానా ఈ సంతోషం " అని అడిగింది ప్రియా.

" లేదు తల్లి,  నిజం చెప్పాలి అంటే అది కూడా ఒక కారణం అనుకో ...కానీ నా అసలు సంతోషానికి కారణం నువ్వు పెళ్లికి ఒప్పుకోవడం" అని అంది సునంద. 

ప్రియా ఏమి మాట్లాడకుండా కళ్ళు మూసుకుని వాళ్ళ అమ్మ చెబుతూ ఉన్న మాటలు వింటుంది. 

"నీ పెళ్లి గురించి నేను ఎన్నో కలలు కన్నా కానీ ఆ రోజు ....అలా ..." అని చెబుతూ ఆగింది ఆవిడ , ఆవిడ గొంతులో  తెలియని బాధ తొంగి చూసింది.

ఆవిడ అలా అనగానే ప్రియా కంటిలో నుంచి ప్రియా కి తెలియకుండానే కన్నీటి బొట్టు జారింది .మెల్లగా "అమ్మ...."  అనింది.
కూతురి గొంతులోని  బాధ ఆవిడ గుండెకి చేరింది

ఇద్దరి మధ్యలో కొంచెం సేపటి వరకు మౌనం. 

ఇంతలో ఎవరో తలుపు కొట్టారు వచ్చింది, పనిమనిషి  రాదా " అమ్మగారు మీరు అడిగినట్లు వెన్న ముద్ద, లడ్డూలు ఇంకా పాలు తీసుకొచ్చాను  " అని చెప్పింది. 

రాధా చేతిలో ఒక ట్రే ఉంది.  ఆ ట్రైన్ లో చిన్న చిన్న వెండి గిన్నె లో లడ్డూలు,  వెన్న ముద్ద ఇంకా పాలు ఉన్నాయి. 

ప్రియా వెంటనే బెడ్ మీద నుంచి లేచి " నా కృష్ణయ్య మందిరం దగ్గర పెట్టు వెళ్ళు వస్తున్నాను"  అని చెప్పింది. 

సునంద వెంటనే టాపిక్ మారుస్తూ "  స్వీటీ ఒక్క నిమిషం తల్లి " అని చెప్పి తన ముందు గానే తెచ్చిన ఒక డ్రెస్ తీసుకొని ప్రియ  చేతికి ఇచ్చింది "వెళ్లి ఈరోజు ఇవి వేసుకో " అని చెప్పింది.

అది ఒక్క పర్పుల్ కలర్ డిజైనర్ లెహంగా దాని నిండా కూడా సిల్వర్ కలర్ తో డిజైన్ చేసి ఉంది అక్కడక్కడ ముత్యాల కూడా అంటించి ఉన్నారు , దాని బ్లౌస్ మొత్తం అందంగా వర్క్ చేసి ఉంది దానికి మ్యాచింగ్ సేమ్ పర్పుల్ కలర్ నెట్టేడ్ చున్నీ , చున్నీ మీద వర్క్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు ఎంత అందంగా డిజైన్ చేశారు అంటే అంత అందంగా డిజైన్ చేశారు ఆ చున్నీ మీద.

" మా ఈ డ్రెస్ .." అని ప్రియా ఏదో అంటుండంగానే .

సునంద మాట్లాడుతూ " చాలా బాగుంది కదా మొన్న నేను షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ నాకు కనపడింది నీకు బాగుంటుంది అని వెంటనే తీసేసుకున్నాను, బ్లౌజ్ కూడా స్టిచింగ్ చేసి ఉంచాను ,  ఏదైనా ఫంక్షన్ ఉంటే వేసుకుంటావు కదా అని ఇంతలో ఈ ఫంక్షన్ వచ్చింది, వేసుకో తల్లి ఎంతో ఇష్టంగా కొన్నాను ఈ దాస్ నీకోసం నేను" అని చెప్పారు. 

ప్రియ సునంద వైపు చూసి నవ్వుతూ " మామ్ ఈ డ్రెస్ కి మ్యాచింగ్ కపుల్ డ్రెస్ కూడా ఉంది అది కూడా తీసుకున్నావా నువ్వు " అని అడిగింది.

సునంద ఆశ్చర్యపోతూ " నీకెలా తెలుసు దీనికి కపుల్ డ్రెస్ ఉంది అని , నువ్వు వెళ్ళావా షాపింగ్ కి నీకు నచ్చిందా ఈ డ్రెస్" అడిగింది.

" మందు ఇది చెప్పు మామ్ ఈ డ్రెస్ సింగిల్ గా కావాలి అంటే ఇవ్వరు? మరి దీని పేర్ ఎక్కడ ఉంది" అని అడిగింది ప్రియా. 

" ఆరోజు ఎవరో ఆవిడ నాకు పరిచయం అయ్యారు వాళ్ల కోడికి బాయ్ డ్రెస్ అడిగితే ఇవ్వను అని అన్నారు తీసుకుంటే రెండు తీసుకోవాలి అని చెప్పారు  , మా ఇద్దరికీ డ్రెస్సెస్ నచ్చడంతో  ఇద్దరం కలిసి డ్రెస్సెస్  కొన్నాము కలిసి .  ఆవిడ గారు బాయ్ డ్రస్ తీసుకున్నారు నేనేమో ఈ డ్రెస్ తీసుకున్నాను ఇప్పుడు అదంతా ఎందుకు  తల్లి వేసుకోవచ్చు కదా ఎంత ఇష్టంగా తీసుకున్నాను"  అని అడిగింది.

వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకేమీ మాట్లాడకుండా " సరే వేసుకుంటాను " అని చెప్పి వెళ్లి డ్రెస్ వేసుకొని వచ్చింది.

ఆ డ్రెస్ లో ప్రియా ఇంకా అందంగా కనిపించింది. సునంద ఆనందపడిపోతూ " నా కూతురికి ఈరోజు ఎవరి దృష్టి తగలకూడదు " అని అంటూ తన కాళ్ళకున్న కాటుక తీసి ప్రియా చెవి వెనక దిష్టి చుక్క పెట్టింది.

ప్రియా నవ్వుకుంటూ " మామ్  అయిపోయిందా నీ దిష్టి చుక్కలు పెట్టడం ,  ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే త్వరగా  కానివ్వు నా కృష్ణయ్య నాకోసం వెయిట్ చేస్తున్నాడు " అని అంది.

సునంద ప్లక్కర్ తీసుకొని ప్రియా జట్టుకు పెడుతూ " సరే వెళ్ళు నీ పూజ అయిన తర్వాత బ్యూటిషన్ వస్తుంది నిన్ను రెడీ చేయడానికి " అని చెప్పి వెళ్ళిపోతుంది.

ప్రియా తన గదిలో ఉన్న కృష్ణయ్య మందిరం దగ్గరికి వెళ్లి కూర్చుని కృష్ణయ్య పూజకి అన్ని సిద్ధం చేసుకుని దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉంటుంది. 

ఈ లోపు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రియా రూమ్  దగ్గరికి వచ్చి ఉంటారు , తను అప్పటికే పూజ స్టార్ట్ చేసి ఉంటుంది.  ప్రియా పూజ చేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడదు అని తెలిసి వాళ్ళందరూ కూడా ప్రియ వెనకాల ఒకరి తర్వాత ఒకరి కూర్చుంటారు పూజకి జాయిన్ అవుతూ.


ప్రేమ్ కూడా అప్పుడే ఎవరు చూడకుండా పైపు సహాయంతో పైకి ఎక్కి ప్రియా బాల్కనీ చేరుకొని ఉంటాడు .

ప్రియా కృష్ణుడికి పూజ చేస్తూ పాట పాడుతుంది.

జగజ్జాలపాలం కనత్కంఠమాలం
శరచ్చంద్రఫాలం మహాదైత్యకాలమ్ ।
నభోనీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్

ప్రేమ్ ప్రియా మధుర మైన వాయిస్ వింటూ తన్మయత్వం లో  ప్రయా నీ చూస్తూ ఉండిపోతాడు. ప్రియా ఆ పర్పుల్ కలర్ డ్రెస్ లో ఇంకా అందంగా కనిపిస్తుంది.

పూజ లో ఉన్నప్పుడు ప్రియా కి అనుకోకుండా తన గుండె వేగం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది అది తనకి ప్రేమ్ చుట్టుపక్కల ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు తను పూజలో ఉండడంతో ఆ గుండె వేగాన్ని తగ్గించుకుంటూ తన కృష్ణయ్య ధ్యానంలో మునిగిపోయింది.

సదాంభోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ 
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ 

రమాకంఠహారం శ్రుతివ్రాతసారం
జలాంతర్విహారం ధరాభారహారమ్ 
చిదానందరూపం మనోజ్ఞస్వరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ 

జరాజన్మహీనం పరానందపీనం
సమాధానలీనం సదైవానవీనమ్ 
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్ 

కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానమ్ 
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ 

సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బింబలేశం హృదాకాశవేశమ్ 
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుంఠగేహం భజేఽహం భజేఽహమ్ 

సురాలీబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ 
సదా యుద్ధధీరం మహావీరవీరం
భవాంభోధితీరం భజేఽహం భజేఽహమ్ 

రమావామభాగం తలాలగ్ననాగం
కృతాధీనయాగం గతారాగరాగమ్ 
మునీంద్రైస్సుగీతం సురైస్సంపరీతం
గుణౌఘైరతీతం భజేఽహం భజేఽహమ్ 


(ఇతి శ్రీ పరమహంసస్వామి బ్రహ్మానందవిరచితం శ్రీహరిస్తోత్రమ్)

పూజ పూర్తయ్యాక కృష్ణుడికి  నైవేద్యం పెట్టి  హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా ఇంకొకసారి నమస్కరించుకుంది ప్రియా.

పూజ చేసిన ప్రసాదం తన ఫ్రెండ్స్ అందరికి కూడా ఇచ్చింది. 

ప్రేమ్ ప్రియా అందాన్ని చూస్తూ ' ఇంత అందంగా ఉన్నావేంటే ,  ఆ దేవుడు దేవలోకానికి పంపించాల్సిన నిన్ను పొరపాటున ఈ భూలోకానికి పంపించినట్టు ఉన్నాడు ' అని తనలో తాను అనుకున్నాడు. 

ఆ గదిలో ఉన్న కృష్ణయ్య కి దండం పెట్టుకుంటూ 'కృష్ణయ్య ఏదో  ఒక మాయ చేయవయ్యా  , ఈ మొండి ఘటం ఎలాగైనా సరే నన్ను పెళ్లి చేసుకునేలాగా , ప్లీజ్ ఈ జన్మలో ఇంకేమీ అడగను నిన్ను'  అని దేవుడిని విన్నవించుకున్నాడు. 

అప్పుడే కృష్ణయ్య తల మీద నుంచి ఒక పువ్వు కిందకు పడింది . ప్రేమ్ అది చూసి కొంచెం షాక్ అవుతాడు
' హే ఇది కృష్ణయ్య గ్రీన్ సిగ్నల్ కాదు కదా  ' .

ఆ కృష్ణుడు విగ్రహం వైపు చూస్తుంటే  కృష్ణయ్య  తనకి సపోర్ట్ గా ఉన్నట్లు అనిపించింది ప్రేమ్ కి.

ఇంతలో నితిన్ ప్రసాదం తీసుకుంటూ " ఇదంతా ఏంటి ప్రియా నిజంగానే నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటాకి ఒప్పుకున్నావా  , ఆ ముసల్ది  అన్నట్లుగా"  అని అడుగుతాడు,  కొంచెం కోపంగానే వస్తుంది అతని వాయిస్.

ప్రేమ్  కి కూడా  ఇదే విషయం తెలుసుకోవాలి ఉంది అందుకే మౌనంక ప్రియా ఏం చెప్తుందో విందాం అని అక్కడే బాల్కనీలో దాక్కొని వాళ్ళ మాటలు వింటున్నాడు.

ప్రియా తన డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వెళ్లి కూర్చుంటూ తన హెయిర్  దువ్వుకుంటూ " అబ్బా పొద్దున్నుంచి చూస్తున్నాను ఏంట్రా నీ గోల , అండ్ ఇంకో విషయం మా నాన్నమ్మని ఇంకోసారి ముసలి,  అన్నావు అనుకో నా చేతిలో చస్తావు జాగ్రత్త , మా నాన్నమ్మని అలా అనే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి"  అంది.

నితిన్ కొంచెం కోపం లో ఏదో చెప్పబోతుంటే అరుణ్ నితిన్ చెయ్యి పట్టుకొని ఆపుతాడు కొంచెం ఆగమన్నట్లు.

ప్రియా తన గుండె మీద చెయ్యి  వేసుకుంటూ వేగంగా కట్టుకుంటున్న తన గుండెని అదుపులో తెచ్చుకుంటాకి  ప్రయత్నిస్తూ.
' ఏంటిది? ఇలా కొట్టుకుంటుంది కొంపతీసి ఆ ప్రేమ్ గాడు కానీ వచ్చాడా ఏంటి ' అని చుట్టూ చూస్తుంది.

' ఏంటిది ఆన్సర్ చెప్పకుండా అటు ఇటు చూస్తుంది కొంపతీసి నేను వచ్చినట్లు దీనికి తెలిసిపోయిందా ఏంటి? నేను దాని చుట్టూ పక్కల ఉంటే ఇట్టే పసిగడుతుంది '  అని అనుకున్నాడు ప్రేమ్ వాళ్ళకి కనపడకుండా దాక్కుంటూ .

" ఏంటి నేను మాట్లాడుతుంటే నాకు ఆన్సర్ ఇవ్వకుండా  చుట్టూ చూస్తున్నావ్"  అని అడుగుతాడు నితిన్.

' ఇప్పుడు వీడికి నేను ఆ ప్రేమ్ వచ్చాడా లేదా అని చూస్తున్నాను అని చెప్తే నామీద ఇంత ఎత్తు లెగుస్తాడు, అసలే వీడికి ఆ ప్రేమ్ మాట వింటేనే కోపం , అవసరమా ' అని తనలో తాను అనుకుంటుంది .

నిఖిల్ కొంచెం అసహనంక " ఒరేయ్ కొంచెంసేపు ఆగుతావా , స్వీటీ నువ్వు చెప్పరా అసలు ఏంటి ఇదంతా" అని అడుగుతాడు. 

ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూస్తూ"  నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే మీరు ఎలా నమ్మారు"  అని అంటుంది. 

అదే టైం కి ఊర్మిళాదేవి కూడా తలుపు దగ్గరికి వచ్చి వీళ్ళ మాటలు విని అక్కడే నిలబడిపోతుంది.

" ఒక్క నిమిషం" అని  చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఫైల్ తీసి వాళ్ల ముందు పెడుతుంది.

శైలు ఆ ఫైల్ తీసుకుంటూ " ఏంటే ఇది"  అని అడుగుతుంది. 

" మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ బయోడేటా మొత్తం దాంట్లో ఉంది"  అని చెప్తుంది ప్రియా.

నిఖిల్  నవ్వుకుంటూ "  సో నా గెస్  కరెక్టే అన్నమాట ముందుగానే వాళ్ళ ఫ్యామిలీ బయోడేటా మొత్తం తీసి పెట్టుకున్నావు అన్నమాట " అని అంటాడు.

" మరి నన్ను ఏమి చేయమంటారు మా నానమ్మ పెళ్లి పెళ్లి అని రోజు నన్ను చావగొడుతుంది , దీని నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు , అంతలో మా నాన్నకి మా అత్తయ్య  ఇక్కడే ఈ ఊరిలోనే ఉంటుంది అని తెలిసింది ఒక డిటెక్టివ్ సహాయంతో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా కూడా కలెక్ట్ చేశాను అందులో మా అత్తకి ఒక్కడే కొడుకు అని తెలిసింది అండ్ ఆ కొడుక్కి ఆల్రెడీ పెళ్లి అయ్యి తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అని తెలిసింది " 

ఆ మాటలు వినగానే ఊర్మిళాదేవి చాలా బాధపడింది . తన మనవరాలు పెళ్లి చూసే భాగ్యం ఉంది అనుకుంది  కానీ అవి అన్నీ కూడా  కలగానే మిగిలిపోయాయి. కొంచెం నిరాశగా కిందకి వెళ్ళిపోయారు

" అంటే మీ అత్తయ్యకి ఒక్కడే కొడుకా"  అని అడిగింది శైలు.

" హా అవును యాక్చువల్లీ ఈ బయోడేటా అంతా కూడా నేను కావాలని కలెక్ట్ చేసింది కాదు మా నాన్నకి ఇద్దాము అని కలెక్ట్ చేసి ఉంచాను" అని అంది ప్రియ. 

" మరి మీ నానమ్మ  నువ్వు  మీ అత్త  కొడుకుని పెళ్లి  చేసుకోబోతున్నావు అని అంటుంది,  ఈరోజు ఎంగేజ్మెంట్ అని కూడా చెప్తుంది , మీ అత్తకి ఒక్కడే కొడుకు అన్న సంగతి  తెలియదా? "  అని అడిగాడు అరుణ్.

" ఆరోజు నేను ఫైల్ తీసుకుని ఇంట్లోకి వచ్చేటప్పుడు మా నాన్నమ్మ నాకు మా అత్తకి కొడుకు కానీ ఉంటే వాడీకి ఇచ్చి పెళ్లి చేద్దాము అప్పుడు మా అత్త మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పడం విన్నాను , 
నానమ్మ ఎలాగైనా సరే నా పెళ్లి గురించి ఇంకా మాట్లాడకూడదు అని ఇలా చేశాను"  అని చెప్పింది. 

" అసలు నువ్వు ఏం చేసావో, కొంచెం  అర్థమయ్యేలాగా చెప్తావా?   " అని అంది శైలు.

ప్రియా  నవ్వుకుంటూ "  ఏమీ లేదు మా నాన్నమని ఒక చిన్న కండిషన్ తో లాక్ చేశాను , ఇకమీదట నా పెళ్లి గురించి అసలు మాట్లాడదు"  అని చెప్పింది.

" ఏంటది?"  అని నితిన్ అడుగుతాడు. 

" ఏముంది నేను చేసుకుంటే అత్త కొడుకుని చేసుకుంటాను ఒకవేళ వాడికి నేను నచ్చకపోతే ఇంకెప్పుడు కూడా నా పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ కూడా  తీసుకురాకూడదు అని లవ్ చేసి ఉంటుంది " అన్నాడు నిఖిల్.

" ఎగ్జాక్ట్లీ ", అంటుంది ప్రియా నిఖిల్ కి హై ఫై ఇస్తూ.

శైలే కొంచెం కంప్లీట్ అవుతూ "  అంటే ఇప్పుడు మీ అత్త కొడుకు నువ్వు నచ్చావు అని అంటే వాడిని పెళ్లి చేసుకుంటావా"  అని అడుగుతుంది.

శైలు అడిగిన క్వషన్ కి అందరూ శైలు నే విచిత్రంగా చూస్తారు.

నితిన్ " అసలు నువ్వు డాక్టర్ ఎలా అయ్యావు ? నాకు తెలియక అడుగుతాను"  అని నవ్వుతాడు.

" ఒరేయ్ ఆన్సర్ చెప్పమంటే  నేను డాక్టర్ ఎలా అయ్యాను అని నన్ను అడుగుతారు ఏంటి , నాకు  క్లియర్ గా చెప్తారా చెప్పరా"  అని అంటుంది శైలు.

" పెళ్లయిన వాడిని ఇచ్చి స్వీటీకి పెళ్లి చేయాలని ఎవరు అనుకోరు సో ప్రియ ఎవరిని పెళ్లి చేసుకోవట్లేదు " క్లారిటీ  చేస్తాడు అరుణ్.

ప్రేమ్ వీళ్ళ డిస్కషన్ అంతా విని ఊపిరి పీల్చుకుంటాడు.

" అంతా ఓకే బట్,  ఇలా చేయడం తప్పు స్వీటీ , మీ నానమ్మ నీ పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది మీ అమ్మానాన్న కూడా , నువ్వేమో ఇలా పెళ్లి చేసుకోను అని మొండి పట్టుదల పెట్టి కూర్చున్నావు, వాళ్లని ఇలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్"  అని అడుగుతాడు నిఖిల్. 

" నిజమే ఇలా చేసినందుకు నాకు కొంచెం గట్టిగా ఉంది , కానీ లైఫ్ లో పెళ్లి అనేది ఒక పార్ట్ మాత్రమే , అందరూ పెళ్లిళ్లు చేసుకునే ఉంటున్నారా పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు  " అని అడిగింది ప్రియా.

' నీ ఈ ఆలోచన ఎప్పటికైనా మారుస్తాను చూడవే ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను ,  నువ్వు నన్ను ప్రేమించేలాగా చేసుకుంటాను ఇది నా చాలెంజ్' అనుకున్నాడు తన మనసులో ప్రేమ్.

" కానీ లైఫ్ లో మన తోడుగా చివరి వరకు ఉండేది మన లైఫ్ పార్ట్నర్ మాత్రమే రా"  అని అంటాడు నితిన్.

ప్రియా ఏదో చెప్పే లోపల శైలు ఎక్సైట్ గా " ప్రియా ఇది చూసావా ఈ ఫ్యామిలీ  నెంబర్స్ పేర్లు ఎగ్జాక్ట్గా మనకి తెలిసిన వాళ్ళ పేర్లు లాగా  ఉన్నాయి చూడు ఒకసారి"  అని ఫైల్ తన వైపు చూపిస్తుంది.

నిఖిల్ కూడా ఆ ఫైల్ తీసుకుని చూసి " అవును ఈ  ఫ్యామిలీ డీటెయిల్స్ మనకి తెలిసిన వాళ్ళలాగా"   ఉంది అని అంటాడు. 

ఎంతలో బాలకానిలో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్. 
అందరూ ఒక్కసారిగా బాల్కనీ వైపు చూస్తారు. 
అక్కడ ప్రేమ్ తన ఫోన్ పట్టుకొని నిలబడడం చూసి అందరూ ఒకసారి షాక్ అవుతారు.

కొనసాగుతుంది....

*****
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు