you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 3

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 3

ఆదిత్య ఫ్రెష్ గా స్నానం చేసి బాత్రూంలో నుంచి బయటికి రాగానే అక్షయ బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది . అతను స్నానానికి వెళ్లే ముందు వరకు  బాగానే ఉంది .అతను స్నానం చేసి బయటకి రాగానే తన మొహం ఎందుకో వాడిపోయినట్టు కనిపించింది. అతను స్నానానికి వెళ్లి వచ్చిన ఈ కాస్త సమయంలో ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు.

వాళ్ల అమ్మ ఎలాగో ఈరోజు బయటికి వెళ్ళాలి అని ముందుగానే చెప్పడంతో పొద్దున్నే లేచి రెడీ అయింది అక్షయ.  ఆదిత్య కూడా స్నానం చేసి వచ్చాడు .
ముందుగానే సిద్ధం చేసుకున్న బట్టలు తీసుకుని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డ్రెస్ వేసుకొని మెల్లగా వెళ్లి తన పక్కన కూర్చుని తన భుజం చుట్టూ చేతులు వేసి " ఏం జరిగింది బంగారం  అలా ఉన్నావు ?  ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా ? " అని అడిగాడు. 

అక్షయ ఒకసారి తన హస్బెండ్ వైపు  చూసి గడ్డం కింద చేతులు పెట్టుకొని " ఈరోజు న మూడ్ బాగాలేదు "  డల్ గా చెప్పింది.

" స్నానానికి వెళ్లే ముందు వరకు కూడా బాగానే ఉన్నావు కదా ఈ లోపు ఏం జరిగింది , ఇంతకీ  నీ మూడ్ ఎవరు డిస్ట్రబ్ చేశారు , "అని అడిగాడు ఆదిత్య. 

" ఏమీ లేదులే ,  మనం అనుకున్నట్లు కలలు కంటే అవి జరుగుతాయా ఏంటి జరగవు ఏం చేస్తాం" డల్ గా చెప్పింది.

ఆదిత్య కన్ఫ్యూజ్ అవుతూ ' ఏం అయ్యింది  దీనికి? ఇలా మాట్లాడుతుంది , కొంచెం సేపటి ముందు వరకు బాగానే ఉంది కదా, బహుశా ప్రెగ్నెంట్  లేడీస్ మూడ్ స్ప్రింగ్ ఇలాగే చేంజ్ అవుతూ ఉంటాయి కావచ్చు'  అని అనుకున్నాడు.

  " ఇంతకీ నువ్వు ఏమనుకున్నావు? ఏం జరగలేదు ?  చెప్పు ముందు నాకు"  అని అడిగాడు.

ఆదిత్యా ని అస్సలు పట్టించుకోకుండా పొద్దున్నే ప్రియా చెప్పింది గుర్తుతెచ్చుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ కొంచెం కోపంగా " ఆ బావ ఎవరైనా సరే అది నచ్చింది అన్నాడు అనుకో నా చేతిలో చచ్చాడు "  .

మళ్లీ అంతలో  డల్ గా అయిపోతుంది  "   అయినా ఎవరినంటే ఏం లాభం , అది అంత అందంగా ఉంటే ఎవరు మాత్రం వద్దంటారు " తనలో తను మాట్లాడుకుంటూ . 
అంతలోనే కోపం అంతలోనే  బాధ  అని ఎక్స్ప్రెషన్ తన ఫేస్ లో చూపిస్తుంది అక్షయ .

ఆదిత్య కి సెకండ్స్ లో మారుతున అక్షయ ఫేస్  ఫీలింగ్స్ చూస్తుంటే ఏమి జరిగిందో అర్థం కాలేదు.

" ఏమైంది దీనికి ఈరోజు ఎలా బిహేవ్ చేస్తుంది " అని ఆలోచిస్తూ తననే చూస్తున్నాడు.

ఇదేమి పట్టించుకోని అక్షయ తన ఫ్లో లో తన మాట్లాడుకుంటూ  పోయింది " నేనే అబ్బాయిగా పుట్టి  ఉంటే ఈపాటికి ప్రియా నీ పెళ్లి చేసుకొని డజన్ మంది పిల్లల్ని  కనేదానిని , ఏం చేస్తాం ఆ దేవుడు ఏమో అమ్మాయిగా పుట్టించాడు".

ఆదిత్య కి అక్షయ ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు కానీ అక్షయ అబ్బాయిగా పూట్టుంటే  ప్రియ నీ పెళ్లి చేసుకొని పిల్లలను కంటాను  అనగానే కళ్ళు పెద్దవి చేసి అక్షయ వైపు చూశాడు ఏదో వింత జీవిని చూసినట్లు  .
'ఏంటి ఇది అబ్బాయిగా పుడితే ప్రియని  పెళ్లి చేసుకొని పిల్లల్ని కాంటుందా అది కూడా డజన్ మందిని' 

"  ఏంటి బంగారం  అబ్బాయిగా పుడితే ప్రియ నీ పెళ్లి చేసుకుని  పిల్లల్ని కంటావా అది కూడా డజన్ మందిని , ఇప్పుడు మాత్రం ఏం పోయింది ఆపరేషన్  చేయిస్తా రా  అబ్బాయిగా మారిపోయి వెళ్లి నీ బెస్ట్ ఫ్రెండ్  ప్రియ నీ పెళ్ళి చేసుకుని డజన్ మందిని ఏ కర్మ   ఏకంగా 50 మందిని కందువ గాని " అని వేటకారంగా అన్నాడు. 

ఆదిత్య మాటలకి  ఆదిత్య వైపు తిరిగి చూసింది . ఆదిత్య తన వైపే కొంచెం కోపంగా  చూస్తూ కనిపించాడు
అప్పుడు గాని అక్షయ కి అర్థం కాలేదు తను చేసిన తప్పు ఏంటో,  తనలో తాను అనుకుంటున్నాను అనుకొని బయటికి అనేసాను అని అప్పుడు అర్థమైంది  . 

' ఏంటి నేను ఇలా మాట్లాడాను అసలే నా హస్బెండ్ పోసెస్సివెనెస్ కి బ్రాండ్ అంబాసిడర్ . నా ఫ్రెండ్స్ లో బాయ్స్ సంగతి వదిలేయ్  గర్ల్స్ తో కూడా కొంచెం క్లోజ్ గా ఉన్నా ఊరుకోడు ఈయన గారు,  అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రియని పెళ్లి చేసుకుంటాను అన్నాను , ఇప్పుడు ఈయనతో ఎలా వేగాలి రా బాబు.  చి చి ఈ రోజు పొద్దున్న లేసి ఎవరి మొహం చూసానో ఏంటో  ' అని తనలో తాను అనుకుంది.

" పాపం అమ్మాయిగా పుట్టినందుకు ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు కదా, ఇప్పుడు ఉన్న మెడికల్ ఫెసిలిటీ తో అబ్బాయిగా ఈజీగా మారిపోవచ్చు , అప్పుడు ఎంచక్కా దాని పెళ్లి చేసుకో సరిపోతుంది   " అని అంటున్న ఆదిత్య మాటలకు ఆడు చెబుతూ 

" అది..ఆది.. అధిగారు నా ఉద్దేశం అది కాదు ...."  అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున అక్షయ మాటలు వినకుండా .

" ఏంటే అది... ఆది... అయినా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే నీకు"

అబ్బా ఈయన గారు మొదల పెడితే ఇప్పుడే ఆపడు  ఎలాగైనా సరే ఆపాలి లేకపోతే ఈరోజు మొత్తం నా బుర్ర తింటూ ఉంటాడు అని అనుకోను వెంటనే
ఆదిత్య పెదవులు అందుకుంది. 

అక్షయ అలా చేయగానే ఆదిత్య కళ్ళు పెద్దవి అయ్యాయి .

'ఈయన గారికి ఎలా బ్రేక్ వేయాలో నాకు బాగా తెలుసు ' అక్షయ మనసులో కన్నింగా నవ్వుతూ వెనక్కి జరగబోయింది

అక్షయ కొంచెం వెనక్కి జరుగుతుంటే తనని వెంటనే పట్టుకుని ఆ ముద్దుని ఇంకా బీపీగా చేశాడు ఆదిత్య.

ఈసారి అక్షయ కళ్ళు పెద్దవి అయ్యాయి.  అక్షయాకి ఊపిరి ఆడనంత సేపు వరకు తనని కిస్ చేస్తూ ఉన్నాడు.

అక్షయ ఇబ్బంది పడుతుందని గమనించి తనని మెల్లగా వదిలాడు. ఆదిత్య తనని వదలడంతో ఒకసారిగా ఊపిరి గట్టిగా తీసుకుంటూ ఆదిత్య వైపు చూసింది.

అక్షర వైపు చూసి కన్నుకొట్టి  '"ఏంటి బంగారం ముద్దు  పెట్టి నన్ను డైవర్ట్ చేద్దాము అనుకుంటున్నావా ఆ పప్పులేమి ఉడకవు , ఎలాగో నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు కాబట్టి .... అలా స్టార్టింగ్ లో వదిలేస్తే ఏమి బాగుంటది  చెప్పు , అమ్మ మనకు రెడీ అవ్వమని ఇచ్చిన టైం లో ఇంకా వన్ అవర్ మిగిలి ఉంది  , ఈ టైం లో మొదలు పెట్టింది ఫినిష్ చేసేద్దాము అసలే చాలా గ్యాప్  వచ్చింది" అని హస్కి గా అంటూ అతను  వేసుకున్న షార్ట్ బటన్ ఒకటొకటిగా తీయడం స్టార్ట్ చేశాడు.

ఆదిత్య అలా అనడంతో , అక్షయ కంగారుగా గుటకలు మింగుతూ " అధి గారు  ఇంకెప్పుడు అలా చేయను ప్లీజ్  , అయినా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ మీరు అలా చేయకూడదు"  అని అంట అధి కి కొంచెం దూరంగా వెనక్కి వెనక్కి జరిగింది.

ఆదిత్య తనలో తాన నవ్వుకుంటూ " ఎవరు చెపరు ప్రిగ్నెంట్ గా ఉంటే అలాంటివి చేయకూడదు అని  " అని అంటూ  తన మీదకి మెల్లగా చేరుతున్నాడు.

అక్షయ ఇప్పుడు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్.
ఆదిత్య కి అక్షయ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి  తనకి దూరం గానే అంటున్నాడు ,తనకి వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని,  కానీ ఇప్పుడు తనని ఏడిపిద్దాం అని అలా చేస్తున్నాడు.

అక్షయ కొంచెం భయపడుతూ " అధి గారు ప్లీజ్  వదు" అని బతిమాలింది.

ఆదిత్య అక్షయా తో ఎక్కువసేపు కోపంగా ఉండలేదు అండ్  ప్రెగ్నెంట్ గా ఉన్న తనని  మరి ఏడిపించడం ఇష్టం లేక "మరి ఇంకెప్పుడైనా  అంటావా అలా " అని అంటున్న ఆదిత్య మాటలకి 

"నో నో  ఇంకెప్పుడు అనను ఐ యాం సారీ " అని వెంటనే చెప్పింది.

ఆదిత్య తనని దగ్గరికి తీసుకుంటూ "  ఇప్పుడు చెప్పవే అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నావా, అసలే నీకున్నది చిన్ని బుర్ర ఆ బుర్రలో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి  " అని అడిగాడు. 

అక్షయ ఆదిత్య  కౌగిలిలో గవ్వ పిట్టలాగా ఒదిగిపోతూ అతను అడిగిన కోషన్స్ కి ఆన్సర్ చెప్పకుండా " నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా?". అడిగింది 

"హెల్ప్ ? అయినా  అడగడం ఏంటి ఆర్డర్ వే బంగారం నీకేం కావాలన్నా  చేస్తాను"  అని అన్నాడు ఆదిత్య అక్షయ ని మరి కాస్త దగ్గరికి తీసుకుంటూ. 

" అంటే ఇప్పుడు కాదులే కానీ నేను అడిగినప్పుడు ఒక మంచి బలమైన  బాడీగార్డ్స్ నాకు ఒక ఇద్దరు కావాలి. వాళ్లు ఎలా ఉండాలి అంటే వాళ్లని చూడగానే అవతలి వాళ్ళు భయపడే పారిపోవాలి" అని అడిగింది. 

" బాడీగార్డ్స్?"  అని కన్ఫ్యూజన్ అవుతూ
" అయినా నీకు బాడీగార్డ్స్  ఎందుకు బంగారం?"  అని అడిగాడు.

ఇంతలో ఎవరో తలుపు కొట్టారు. 

" గుడ్ మార్నింగ్ వదిన తోపాలకి రావచ్చా?"  అని అడిగాడు ప్రేమ్ చిరునావుతో.  అతని చేతిలో ఒక పాల గ్లాస్ ఉంది. 

ప్రేమ్ నీ చూడగానే ఇద్దరు కొంచెం దూరం జరిగి కూర్చున్నారు. 

" లోపలికి రా.రా " అన్నాడు ఆదిత్య.

అక్షయ అప్పుడే వచ్చిన  ప్రేమ్ నీ చూడగానే , ప్రియా పొద్దున్న చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఫేస్ మళ్లీ డల్ గా పెట్టేసింది .

ప్రేమ్ నీ చూడగానే అతని  వదిన ఎందుకు అలా డల్ గా మొహం పెట్టిందో  అర్థం కాలేదు ప్రేమ్ కి .

ఆదిత్య కాడ అక్షయ సడన్గా డల్ గా అయిపోవడం గమనించాడు అతనికి కూడా ఏమీ అర్థం కాలేదు.

ప్రేమ్ అన్నయ్య వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ ఏం అయింది అన్నట్లు కళ్ళతో సైగ చేస్తూ అడిగాడు ,ఆదిత్య నాకు కూడా ఏమీ తెలియదు అన్నట్లు భుజాలు ఎగరేశాడు.

ప్రేమ్ మిల్క్ గ్లాస్  తీసుకొచ్చి అక్షయ కి ఇస్తూ  "ఏమైంది వదిన అలా డల్ గా ఉన్నావు ముందు ఈ పాలు తాగు"  అని ఇచ్చాడు. 

అక్షయ అది తీసుకోకుండా జాలిగా  ప్రేమ్ వైపు చూసింది. 
ప్రేమ్ కి వాళ్ళ వదిన చూపులు అర్థం కాలేదు,  అతని ఎందుకు అలా చూస్తుంది అని. ఏదో జరిగింది అని మాత్రం అతనికి అర్థమైంది.

గ్లాస్ పక్కనే మంచం దగ్గర ఉంచిన టేబుల్  మీద పెట్టి , వెళ్లి వదిన ముందు మోకాళ్ళ మీద కూర్చుని " ఏమైంది అలా ఎందుకు ఉన్నావు వదిన"  అని అడిగాడు.

అక్షయ డల్గా ప్రేమ్ వైపు చూసి " ఐయాం సారీ" అని అంది.

ప్రేమ్ కి ఎందుకు సారీ చెప్పిందో ఆదిత్య కి ఇంకా ప్రేమ్ కి అర్థం కాలేదు అయోమయంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అక్షయ వైపు చూసి 
"  ఏమి జరిగింది?"  లాలనగా అడిగారు ఇద్దరు ఒకేసారి.

అక్షయ ఒకసారి ప్రేమ్ వైపు చూసి "ఐ యాం సారీ ప్రేమ్ నీ లవ్ స్టోరీ కి నేను హెల్ప్ చేయలేకపోతున్నాను"  అని డల్ గా చెప్పింది.

" అయ్యో వదిన దాని గురించి  పొద్దున్నే ఆలోచిస్తూ డల్ గా కూర్చున్నావా ,  ప్రియా ఎప్పటికైనా నా లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అన్న  నమ్మకం నాకుంది . డోంట్ వర్రీ దాన్ని ఎలాగైనా సరే ఒప్పించి నీ తోడికోడలుగా తీసుకొస్తాను ఓకేనా ఇది నా ప్రామిస్" అన్నాడు.

అక్షయ ప్రేమ్ వైపు జాలిగా చూస్తూ " అది కాదు ప్రేమ అది మొన్నటి వరకు అసలు పెళ్లి చేసుకోను అంది.  ఇప్పుడేమో  ఎవరో వాళ్ల బావ అంట వాడిని చేసుకుంటాకి  రెడీ అయిపోయింది ఈరోజు ఎంగేజ్మెంట్ అని కూడా చెప్పింది ఫోన్ చేసి"  అని చెప్పింది.

అది వినగానే ఆదిత్య ఇంకా ప్రేమ్ షాక్ అయ్యారు.

ప్రేమ్ వెంటనే నవ్వుతూ " అదే నిన్ను ఫ్రాంక్ చేయడానికి అలా చెప్పి ఉంటుంది .దాని గురించి నాకన్నా నీకు బాగా తెలుసు అది పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నమ్మావా"  అని అడిగాడు.

" లేదు ప్రేమ నిజంగా ఈరోజు తాను ఇంటిని కూడా డెకరేట్ చేస్తున్నారు , ఇప్పుడే ప్రియ మా అందరికీ కాన్ఫరెన్స్ కాల్ చెప్పింది. మమ్మల్ని తన ఎంగేజ్మెంట్ కి కూడా ఇన్వైట్ చేసింది" అని డల్ గా చెప్పింది. 

ఆదిత్య అక్షయ వైపు చూస్తూ అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పమని అడిగాడు. అక్షయ  ఆదిత్య స్నానానికి వెళ్లిన తర్వాత తనకి వచ్చిన తన ఫ్రెండ్స్ కాల్ గురించి వాళ్లు మాట్లాడిన విషయం గురించి మొత్తం వివరించి చెప్పింది. 

ఆదిత్య"  ఏంటే నేను స్నానానికి వెళ్లి వచ్చిన ఈ కాస్త టైమ్ లో ఎంత జరిగిందా .అందుకేనా  ఇందాకడ అలా మాట్లాడావు"  అని అడిగాడు.

ఇంతలో ఆదిత్య ఏదో ఆలోచిస్తూ " వెయిట్ వెయిట్ ఇందాక ఆ బాడీగార్డ్స్ ఎందుకు అడిగావే "అని అడిగాడు ఏదో గెస్ చేస్తూ 

" ఏమీ లేదు ఆ బావ ప్రియా నచ్చి పెళ్లి చేసుకుంటాను అని అంటే ఆ బాడీగార్డ్ ని తీసుకుని  వెళ్లి వాడిని బెదిరిద్దామని అనుకున్నాను"  అని చెప్పింది అక్షయ.

ఆదిత్య నవ్వుతూ "  ఏంటి వెళ్లి ఆ బాడీగార్డ్ తో వాడిని బెదిరిద్దాం అనుకున్నావా , ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏంటి నీకు " అని అన్నాడు.

ఆదిత్య అలా నవ్వడంతో అక్షయకి కోపం వచ్చింది. 

రోషంగా "  మరి ఏం చేయను అది అంటే నాకు ఎంత ఇష్టమో మీ ఇద్దరికీ తెలుసు ,అసలు నేను మీతో పాటు బెంగళూరులో కాకుండా ఇక్కడే సెటిల్ అవ్వడానికి రీసన్ కూడా అదే,  ఎందుకంటే దానికి దూరంగా నేను అసలు ఉండలేను అది మీకు చెబితే మీరు ఇక్కడే సెటిల్ అయిపోయారు నామీద ఉన్న అతి ప్రేమతో మీ బిజినెస్ అన్నీ కూడా ఎక్కడికి  షిఫ్ట్ చేశారు,  ఇప్పుడేమో అదే ఇంకొకడిని  చేసుకుంటాను అంటుంది . మరి నన్ను ఏం చేయమంటారు మీరే చెప్పండి " అని ఏడుపు మొహం పెట్టుకుంది. 

ఆదిత్య ఏడుపు మొహం పెట్టుకున్న అక్షయ ని దగ్గరికి తీసుకుంటూ"  అయ్యో బంగారం ఈ చిన్న విషయానికి డల్ అయిపోయావా ఏమి భయపడకు ఓకేనా . నీ ప్రియా ఎక్కడికి వెళ్ళదు నువ్వు కోరుకున్నట్లుగానే మన ఇంటికి నీ తోడుకోడలుగా వస్తుంది నాకు నా తమ్ముడి మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది ,వాడు అంత త్వరగా వాడు ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోడు ఏరా ప్రేమ్ అంతే కదా " అని అతని తమ్ముడి వైపే చూశాడు.

" యస్ వదిన డోంట్ వర్రీ,  ప్రియ ని పెళ్లి చేసుకునేదంటు ఎవరైనా ఉంటే అది నేను మాత్రమే మా ఇద్దరికీ జోడి  ఎప్పుడో రాసి ఉంచాడు తను నమ్మే ఆ కృష్ణయ్య , ఆ కృష్ణయ్య మా ఇద్దరిని కలుపుతాడు అండ్ షి ఇస్ మై డెస్టినీ . ఇప్పుడే నేను ప్రియా వారింటికి బయలుదేరుతాను ఆ బావ ఎవడో వారి సంగతేంటో నేను చూసుకుంటాలే నువ్వే వర్రీ  అవ్వకు ముందు ఈ పాలు తాగు"  అని పాల గ్లాసు చేతికి ఇచ్చాడు.

ఇంతలో గాయత్రి గారు హడావిడి పెడుతూ లోపలికి వస్తూ ముగ్గురిని చూసి అక్షయ చేతిలో ఇంకా పాలు  అలాగే ఉండడం చూసి " ఏంటి తల్లి ఇంకా పాలు తాగలేదా త్వరగా పాలు తాగమ్మా".
అని అంట తానే పాలు అక్షయకి తాగించింది.

తర్వాత తన ఇద్దరి కొడుకులు వైపు చూసి " పెద్దోడా ఇంకా రెడీ అవ్వలేదా త్వరగా వెళ్లి రెడీ ఆవు షర్ట్ బటన్స్ ఏంటి అలా పెట్టేసావు" అని వాళ్ళ అమ్మ అనగానే వెంటనే తన షర్ట్ బట్టన్ పెట్టుకున్నాడు. 

" త్వరగా రెడీ అవ్వండి ఇంకో 15 మినిట్స్ లో మనమందరం బయలుదేరాలి ఫస్ట్ ఫస్ట్  " అని తెగ హడావిడి పెట్టేశారు గాయత్రి గారు 

ప్రేమ్ " మామ్ నాకు ఒక చిన్న వర్క్ ఉంది అది చూసుకొని వస్తాను ఈ లోపల మీరు బయలుదేరండి"  అని అంటున్న ప్రేమ మాటలు వినిపించుకోకుండా 
" చిన్నోడా ఏంటిది నీకు ముందే చెప్పాను కదా అందరం కలిసి వెళ్లాలి అని ,  ఈరోజు ఏ వర్క్ పెట్టుకోవద్దు అని,  ఈరోజు నాకు ఎంత ఇంపార్టెంట్ కూడా నీకు చెప్పాను " అని చెప్పింది ఆవిడ కొంచెం డల్ గా. 

వాళ్ల మామ్ కి ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రేమ్ కి బాగా తెలుసు అలా అని తన ప్రయా నీ ఇప్పుడు వదిలేస్తే ఏం జరుగుతుందో అని భయం ఒకవైపు, ప్రియా వైపు వెళ్లాలో లేక తన అమ్మతో కలిసి వెళ్లాలో అనేది ప్రేమ్ కి అసలు అర్థం కాలేదు. 

కొనసాగుతుంది.

******