you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 4

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 4

అరుణ్ విల్లా.
టైమ్ ఉదయం :8:00.
అరుణ్ స్నానం చేసే రెడీ అయ్యి అదం ముందు  తన తల దువ్వుకుంటా ఉన్నాడు.

ఇంతలో సంధ్యా గారు ( అరుణ్ అమ్మ) అరుణ్ కి కాఫీ తీసుకుని వచ్చింది.
" ఎక్కడికి రా ప్రియా వాళ్ళ ఇంటికేనా"  అని అడిగింది.

వాళ్ళ అమ్మ చేతిలో నుంచి కాఫీ తీసుకుంటూ"  ఎస్ మా కరెక్ట్ గా గెస్ చేశావు,  ప్రియ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను బ్రేక్ ఫాస్ట్ ప్రియా వాలా ఇంట్లో చేస్తాను నాకోసం బ్రేక్ ఫాస్ట్ చేయొద్దు" అని చెప్పాడు.

" ఈరోజు మార్నింగ్ మాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది జగదీష్ అన్నయ్యగారు పొద్దున్నే ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ ఉంది డెఫినెట్ గా రావాలి అని చెప్పారు " అని చెప్పింది. 

" అవును మామ్ అంకుల్ వాళ్ళ సిస్టర్ వస్తున్నారు అంట సో చిన్న వెల్కమ్ పార్టీగా పెడుతున్నారు , ప్రియా పొద్దున్నే ఫోన్ చేసి నన్ను వన్ అవర్ ముందే రమ్మని చెప్పింది మేము వెళ్తున్నాము, పనులు ఉంటాయి కదా తనకి హెల్ప్ ఫుల్ గా అంటుందని మేమందరం ముందే వెళ్తున్నాము"  అని చెప్పాడు.

" సరే నాన్న వెళ్ళు,  మేము తర్వాత వస్తాములే" అన్నారా ఆవిడ.

అరుణ్ కాఫీ తాగి వాళ్ళ అమ్మకి బాయ్ చెప్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా  అమ్మ వైపు చూసి " ఒక చిన్న హెల్ప్ మా "  అని  అడిగాడు , అతని బెడ్ వైపు చూస్తూ. 

అతని బెడ్ మీద హాయిగా నిద్రపోతూ కనిపించింది అతని వైఫ్ ప్రీఉష. రోజు 10 అయితే గాని నిద్ర లేవదు తను. 
'   ప్రపంచమంతా ఎటు పోయిన సరే, ఇది మాత్రం నిద్రకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది'  అని తనలో తాను అనుకున్నాడు.

" మామ్ అది లేచే పాటికి ఎలాగో 10 అవుతుంది అది లేచిన తర్వాత దాన్ని మాత్రం దయచేసి ఫంక్షన్ కి తీసుకురావద్దు. అది రావడం ప్రియా కి ఇష్టం లేదు సో నువ్వే చూసుకోవాలి అది రాకుండా ఎలాగైనా ఈ యొక్క చిన్న హెల్ప్ చేయవా అమ్మ" అని అడిగాడు.

వాళ్ల అమ్మ చిన్నగా నవ్వుతూ " డోంట్ వర్రీ నాన్న నేను చూసుకుంటాను"  అని చెప్పింది.

వాళ్ళ అమ్మ బుగ్గ మీద ముద్దు పెడుతూ "యు ఆర్ ద బెస్ట్ మామ్"  అని అన్నాడు.

ఈ లోపల బయట నుంచి ఎవరో గట్టిగా కార్ హోరెన్ మోగిస్తూ గట్టిగా అరుణ్ పేరు పిలుస్తున్నారు.

వచ్చింది నితిన్ .

" మా నితిన్ వచ్చినట్లు ఉన్నాడు నేను వాడి కార్లో వెళ్ళిపోతాను " అని చెప్పాడు.

" సరే బాయ్ నాన్న టేక్ కేర్ " అని చెప్పారు ఆవిడ.

అరుణ్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ దగ్గరకి నడుస్తూ "  అబ్బా.. ఆపరా ..పొద్దున్నే ఈ  సైరన్ సౌండ్ , చెవులు చిల్లులు పడేలాగా ఉన్నాయి, ముందు ఆ హోరెన్ కొట్టడం ఆపు "అని విసుకున్నాడు.

" ఎంతసేపురా రెడీ అయ్యేది , పొద్దున్నే అది ఫోన్ చేసినప్పటి  నుంచి టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ , వెంటనే దాని దగ్గరికి వెళ్ళాలి , త్వరగా కార్ ఎక్కు"  అని అరిచాడు నితిన్.

అరుణ్ కార్ ఎక్కుతూ "  అయినా ప్రియ నీ అంతగా చూడాలి అనిపిస్తే , మందు దాని దగ్గరికి వెళ్ళొచ్చుగా ఇలా మా ఇంటికి రావడం ఎందుకు"  అని అడిగాడు..

" నీకు తెలిసిందే కదా నాకు కోపం వస్తే ఏం మాట్లాడతాను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు , పొద్దున్న అది ఫోన్ చేసి అలా అనపటినుంచి నాకు ఏం చేయాలో తెలియట్లేదు ఒక పక్క కోపం ఒక పక్క బాధ , కోపంలో నా మాటలు దాని హాట్   చేస్తే . అది కొంచెం బాధపడిన  నేను  తట్టుకోలేను
నువ్వుంటే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది "  అన్నాడు నితిన్ కారు మందికి పోనిస్తూ.

అరుణ్  "  అయినా ఇంత పిరికి వాడివి నీకెందుకురా ప్రేమ , నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం చేతకాదు , ప్రతి దాంట్లోనూ నా హెల్ప్ కావాలి అంటే ఎలా రా , ఎవడి లవ్ లైఫ్ వాడ చూసుకోవాలి, ధైర్యం చేసి చెప్పేస్తే సరిపోతుంది కదా ఈ టెన్షన్స్ అన్ని అవసరమా నీకు ,  పోనీ నేను చెప్తాను అంటే ,దానికి కూడా ఒప్పుకోవు, నువ్వు చెప్పక  నేను చెప్పక దానికి ఎలా తెలుస్తుంది నీ గురించి" అని అన్నాడు. 

" చ.. నీకే మాటలు బాగానే చెబుతావు ఒక్కసారి నా పోసిషన్ లో ఉండి చూడు అప్పుడు నీకు అర్థం అవుతుంది " అన్నాడు నితిన్. 

" చిన్నప్పటినుంచి తనతో  పెరిగావు ఒక్కసారి ధైర్యం చేసి చెప్పలేవా? మళ్ళీ ప్రియకి నాకు మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండవు అంటావు . నిఖిల్ గాడు చూసావా శైలు తో ఎలా సెటిల్  ఐపోయాడో "  అని అన్నాడు అరుణ్.

" చెప్పలేక కాదురా , నీకు ప్రియా గురించి బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తునమూ తనని ,తన పాస్ట్ , పడిన స్ట్రగుల్ మనం చూసిందే,  ఇప్పుడు నేను వెళ్లి ప్రియ నేను నిను  ప్రేమిస్తున్నాను అని చెబితే , ఆది నన్ను దూరం పెడుతుందేమో అన్న చిన్న భయం ,  నేను దానిని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను " అన్నాడు నితిన్ బాధగా.

" ప్రియ  ఇప్పుడు ఇంకొకడిని చేసుకుంటాకి రెడీ అయింది,  అది ఇంకొకడిని చేసుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉండగలవా " అని అడిగాడు అరుణ్.

" నేను పిచ్చి వాడిలాగా కనిపిస్తున్నానా నీకు,  దాని గురించి నాకు మొత్తం తెలుసు అది ఇంకొకడిని పెళ్లి చేసుకుంటాను అని అంటే నమ్ముతాను అనుకుంటున్నావా  అది ఈ లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉంటానికి ఇష్టపడుతుంది కానీ ఇలా పెళ్లి చేసుకుంటాకి మాత్రం ఇష్టపడదు నాకు బాగా తెలుసు దాని గురించి"  అన్నాడు నితిన్ కాన్ఫిడెంట్గా. 

"మరి ఎందుకు రా ఈ టెన్షన్ " అడిగాడు అరుణ్.

" ఉందిగా  ఇంట్లో ఒక ముసలిది.  నాకు తెలిసి అది విసిగించి ఉంటుంది ప్రియా అని. దాని గోల తట్టుకోలేక  పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఉంటుంది, అంతేగాని  నిజంగా పెళ్లి చేసుకుంటుంది అంటే నమ్మను,  దీని వెనకాల ఏదో ఉంది,  అది ఏమిటో  తెలుసుకోవాలి " అన్నాడు నితిన్.

మళ్లీ నితిన్ మాట్లాడుతూ"   ప్రియా ముందు వెనక ఆలోచించకుండా ఏ మాట ఇవ్వదు , నా గెస్  కరెక్ట్ అయితే ఆ బావ బయోడేటా కలెక్ట్ చేసి ఉంటుంది ముందుగానే , కానీ ఎందుకో తెలియదు , నా సిక్స్ సెన్స్ అదో  బ్యాడ్ గా జరుగుతుంది అని చెబుతోంది" .

" ఏమోరా ఎలాగో ఇప్పుడు వెళ్తున్నాం కదా ,  ప్రియా చెప్తుంది జరిగింది ఏంటి అనేది ,అసలు ప్లాన్ ఏంటో కూడా" అన్నాడు అరుణ్ .

ఇంతలో వాళ్ళ పక్కకి BMW CE-04
మీద  ఒక జంట వాళ్లని ఫాలో అవుతూ వచ్చింది. 
అరుణ్ బయటికి చూస్తూ "  అదిగో వచ్చేసారు మన లవ్ బర్డ్స్ కూడా" అన్నాడు.

నిఖిల్ వాళ్లని టేక్ ఓవర్ చేస్తూ ముందుకు వెళ్లాడు. 

నితిన్ వాళ్లని చూస్తూ " వీడి పని  బాగుంది చక్కగా లవర్ ని వేసుకొని బండిమీద ఊరంతా చెక్కర్లు కొడుతూ ఉంటాడు నాకెప్పుడు వస్తుందో ఆ ఛాన్స్" అనుకున్నాడు.

" నవ్వు కూడా ధైర్యం చేసి ప్రియా కి నీ లవ్ మేటర్ చెప్పినప్పుడు నీకు వస్తుంది అలాంటి ఛాన్స్ "  అన్నాడు అరుణ్  నితిన్ మాటలకి .

నితిన్ ఏమి మాట్లాడలేదు ఇంతలో వాళ్ళందరూ ప్రియ వాళ్ళ మెన్షన్ కి చేరుకున్నారు.

" గుడ్ మార్నింగ్ " అని నవ్వుతూ విష్ చేసింది శైలు కార్లో నుంచి దిగుతున్న అరుణ్ ఇంకా నితిన్ ని చూసి. 

అరుణ్  శైలు నీ చూస్తూ " గుడ్ మార్నింగ్ శైలు"  అని అన్నాడు.

నితిన్ మాత్రం డల్ గా " ఆ మార్నింగ్ మార్నింగ్"  అని అన్నాడు.

నిఖిల్, నితిన్ నీ చూస్తూ  ' ఏమైంది వీడికి' అని అనుకున్నాడు.

శైలు నవ్వుతూ " నితిన్  పొద్దు పొద్దున్నే నీ వాట్సాప్ మెసేజ్ ,మా అందరిని బెదరగొట్టేసింది తెలుసా పాపం  బామ్మ గారిని అలా ఎలా చంపేసావురా "  అని అడిగింది.

" అది పోయిన బాగుండేది ప్రియా కి తన సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి"  అని అన్నాడు.

నితిన్ మాటలకి నిఖిల్ కొంచెం కోపంగా "నితిన్ ఏం మాట్లాడుతున్నావ్ అర్థమవుతుందా"  అని అడిగాడు.

' వీడొకడు మా గ్యాంగ్ కి వీడే లీడర్ అన్నట్టు బిల్డప్ ఇస్తూ  అందరికీ డిమాండ్ అండ్  ఆర్డర్ ఇస్తూ ఉంటాడు' తనలో తాన అనుకున్నాడు నితిన్. 

" సారీ రా నా మూడ్ అసలు బాలేదు ఈరోజు , పద ప్రియా దగ్గరికి వెళ్దాం అది  అసలు ఏం ప్లాన్ చేసిందో" ఆనాడు నితిన్.

" మూడ్ బాగోలేదా ఏం జరిగింది?" అని క్యూస్షన్ చేశాడు నిఖిల్.

" వాడి సంగతి వదిలేసి ముందు ప్రియా దగ్గరికి వెళ్దాం పదండి లేట్ అయితే అరుస్తుంది"  అని అన్నాడు అరుణ్.

అందరూ లోపలికి వెళ్లారు . డెకరేషన్ పనులు అప్పటికే పూర్తయిపోయాయి , ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేయించారు .

హాల్లో సోఫాలో కూర్చుని సర్వెంట్స్ కి ఆర్డర్ ఇస్తూ ఉంది ఊర్మిళాదేవి. 

ఆవిడని చూడగానే శైలు ఆవిడ దగ్గరికి వెళ్లి  "గుడ్ మార్నింగ్ అమ్మమ్మ"  అని అంటూ ఆవిడని హగ్ చేసుకుంది.

" గుడ్ మార్నింగ్ శైలు ఇదేనా రావడం , ఇండియా వచ్చి వన్ వీక్ అవుతుంది , ఇప్పటివరకు నన్ను చూడటానికి రాలేదు,  ఇప్పుడా రావడం పో నేను నీమీద అలిగాను " అని అన్నారు ఊర్మిళాదేవి.

" సారీ అమ్మమ్మ కొంచెం వర్క్ వాలా కుదరలేదు  ఇంకా నీకు తెలిసిందే కదా నా పెళ్ళికి ఇంకా ఎక్కువ రోజులు లేదు అని,  ఆ పెళ్లి షాపింగ్ లో కొంచెం బిజీ అయిపోయి రావడం కుదరలేదు , ఐ యాం సారీ" అని అంటూ ఊర్మిళాదేవి బుగ్గ పైన ముద్దు పెట్టింది.

ఊర్మిళాదేవి నవ్వుతూ " ఈ ముద్దులు నాకన్నా అదిగో  వాడికి ఇస్తే బాగుంటుంది ఏమో " అని అంటూ నిఖిల్ వైపు చూపించింది .

" అమ్మమ్మ ..." అని అంటూ శైలు సిగ్గు పడిపోయింది.
శైలు సిగ్గు చూసి ఊర్మిళాదేవి ఇంకా నవ్వేసింది , "కొంచెం నీ మొదటి రాత్రి వరకు ఆ సిగ్గు దాచుకోవే " అని ఇంకా ఏడిపించింది.

ఇంతలో నిఖిల్ కూడా ఊర్మిళాదేవి మాటలకి కొంచెం సిగ్గు పడుతూ వచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తూ " బాగున్నారా నానమ్మ గారు "  అని పలకరించాడు. 

" నాకే చాలా బాగున్నాను ఆ కృష్ణయ్య దయ వల్ల ఇన్నాళ్ళకి నేను అనుకున్నవి అన్ని  జరుగుతున్నాయి , ఈ రోజు నా ఇంటికి నా కూతురు రాబోతుంది , అలాగే నా మనవరాలు పెళ్లికి ఒప్పుకుంది , నా కూతురు రాగానే దాని కొడుక్కి నా మనవరాలికి ముడి వేస్తే ఆ కాస్త బాధ్యత కూడా తీరిపోతుంది ఈ జన్మకి " అని అంది ఊర్మిళాదేవి ఎంతో సంతోషంతో.

ఆ మాట వినగానే నితిన్ కి  చాలా కోపం వచ్చింది కోపంతో తన పిడికిలి బిగించి ఊర్మిళాదేవి వైపు  చూస్తూ ఉంటే అరుణ్, నితిన్ చెయ్యి పట్టుకున్నాడు , నితిన్ నీ కంట్రోల్  అవమానట్లు.

" నిజంగా ప్రియా పెళ్లికి ఒప్పుకుందా అమ్మమ్మ"  అని అడిగింది శైలు నమ్మకం కుదరక.

" అవును తల్లి , అంతేకాదు వాళ్ళ బావ వచ్చే లోపు తను అందంగా కనిపించాలి అని తన రూమ్ లో  రెడీ అవుతుంది కూడా కావాలంటే నువ్వే వెళ్లి చూడు " అని చెప్పింది ఊర్మిళాదేవి. 

" సరే అమ్మమ్మ మేము వెళ్లి ప్రియా రెడీ అయిందా లేదా చూస్తాంలే కానీ నువ్వు ఇక్కడ పనులు చూసుకో" అని అన్నాడు నితిన్ అందరికీ కళ్ళతో సైగ చేస్తూ పైకి వెళ్దాం  అన్నట్లు.

అందరూ ఊర్మిళ దేవి గారికి బాయ్ చెప్పి ప్రియా రూమ్ వైపు ప్రయాణం అయ్యారు.

...

" మామ్ ఆఫీస్ లో చిన్న వర్క్ అంతే, అండ్  నాకు తెలుసు మామ్ ఈరోజు నీకు ఎంత స్పెషల్ డే అనేది కూడా,  సరే అయితే ఒక పని చేస్తాను ముందు నీతో పాటు వచ్చి దాని తర్వాత ఆఫీస్ కి వెళ్తాను ఓకేనా " అని అన్నాడు ప్రేమ్ వాళ్ళ అమ్మ నీ హాగ్ చేసుకుంటూ.

గాయత్రి గారు సంతోష పడిపోతూ " ఓకే నాన్న,  సరే పదండి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది" అని  చెప్పింది ఆవిడ. 

" ముందు నువ్వు పద మా మేము వస్తున్నాము " అన్నాడు ప్రేమ్ .గాయత్రి గారు ఇంకేమి మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోయారు.

" సో ఇప్పుడు నువ్వు మాతో వస్తున్నావా? మరి ప్రియా ఎంగేజ్మెంట్ సంగతి ఏంటి"  అని అడిగాడు ఆదిత్య.

అక్షయ ప్రేమ్ వైపు చూస్తూ "  ఏదో ఒకటి చెయ్ ప్రేమ్ అది మన ఇంటికి నా తోటి కోడలుగా వస్తుంది అని నాకు ప్రామిస్ చేసావు , ఇప్పుడు ఇంకొకడిని పెళ్లి చేసుకుంటే ఎలా"  అని డల్ గా చెప్పింది.

" వదిన నేను నీకు ఇచ్చిన ప్రామిస్ ని ఎలాగైనా సరే నిలబెట్టుకుంటాను, అది పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటుంది ,  ఇది ఫిక్స్ అయిపో నువ్వు"  అని అన్నాడు ప్రేమ.

" తనకి నువ్వంటే ఇష్టం లేకపోతే ఫోర్స్ చేయొద్దు ప్రేమ్. మనం ఎవరినైనా ప్రేమిస్తే మన ప్రేమతో వాళ్ళని గెలుచుకోవాలి,  ఎదుటి వాళ్లు ఇష్టపూర్వకంగా మనకి దగ్గర అవ్వాలి  కానీ బలవంతం చేయకూడదు ప్రేమ్  "  అని అన్నాడు ఆదిత్య.
ఎందుకంటే ప్రేమ్ అంటే ఇష్టం ఉంటే ఈ పెళ్ళికి ఒప్పుకోదు కదా అని అతని డౌట్.

ప్రేమ్ తన అన్యాయ ఏమి ఆలోచిస్తున్నాడు అనేది గెస్ చేయగలడు.

" దానికి నేనంటే ఇష్టమే కానీ ఒప్పుకోవడానికి ఇష్టపడదు కావాలని నన్ను దూరం పెడుతూ ఉంటుంది ఎక్కడ నా మీద ఉన్న దాని ప్రేమ బయట పడుతుందో అని "అని అన్నాడు ప్రేమ్.

" అవును ఆదిత్య ప్రేమ్ చెప్పేది నిజమే ప్రియా కి ప్రేమ్ అంటే ఇష్టం ఉంది అది నాక్కూడా అర్థం అవుతుంది,  కానీ అది ఎందుకు ఓపుకోవట్లేదో  కూడా నాకు బాగా తెలుసు"  అని అంది అక్షయ.

"ఎందుకు?"  అని అడిగాడు ఆదిత్య. 

" దానికి మెయిన్ రీసన్  దాని పాస్ట్ "  అని అంది అక్షయ కొంచెం బాధగా. 

" మనం పాస్ట్  లోనే ఉండిపోతే ఫ్యూచర్లో ముందుకు వెళ్లలేము " అని అన్నాడు ఆదిత్య.

" ఆది దానికి అర్ధం కావాలి కదా , దానికి నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాను  కానీ అది మొండిది దాని మాట తప్ప వేరే వారి మాటలు అసలు వినదు , ఒక్కసారి ప్రేమ్ కి అవకాశం ఇస్తేనే కదా తెలిసేది దానికి " అంది అక్షయ.

ప్రేమ్ ఆదిత్య వైపు చూస్తూ"   అన్నయ్య నాకు ఒక హెల్ప్ చేస్తావా"  అని అడిగాడు.

" హా చెప్పు ప్రేమ్ " .

" నువ్వు మమ్మీ డాడీ ఇంకా వదినని తీసుకొని నీ కారులో వెళ్ళు , నేను మీ వెనకాల  నా కారులో ఫాలో అవుతూ వస్తాను కొంచెం దూరం, తర్వాత  ప్రియా వాళ్ల ఇంటికి వెళ్తాను .నువు  నీ డెస్టినేషన్ చేరుకున్న తర్వాత నీ లవ్ లొకేషన్ నాకు షేర్ చాయ్ . మామ్ అడిగితే నా కార్ ట్రబుల్ ఇచ్చింది అని ఏదో ఒకటి చెపీ కవర్ చెయ్  , నేను ఫస్ట్  ప్రియా ఇంటికి వెళ్లి అక్కడి సిట్యువేషన్ ఎలా ఉందో చూడాలి తర్వాత ఏమి చేయాలా అనేది ఆలోచిస్తాను" అన్నాడు ప్రేమ్ .

ఆదిత్య కూడా ఇది బెస్ట్ ఐడియా అనుకుని ఒకే చెప్పాడు. 

ఆఫ్టర్ 30 మినిట్స్:

ప్రేమ్ తన  రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII తో ప్రియా ఇంటి దగ్గరకి చేరుకున్నాడు.

అతని కారు నీ ప్రియ ఇంటి దగ్గరలో కాస్త దూరంలో ఆపి కిందకు దిగాడు. చెట్టు ఎవరు లేరు అని గమనించి మెల్లగా ప్రియా వాళ్ళ మెన్షన్ ప్రహరీ గోడ దూకి దొంగతనం గా ఎవరు చూడకుండా ప్రియా గది వైపు చేరుకున్నాడు. 

కొనసాగుతోంది...

*****

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.