Tholipournami in Telugu Love Stories by sreelu books and stories PDF | తొలి పౌర్ణమి - 17

The Author
Featured Books
Categories
Share

తొలి పౌర్ణమి - 17

ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ విషయం గురించి ఎవరు ఏం మాట్లాడలేదు, ఆ రోజు నుండి చాందిని తిరిగి వచ్చే వరకూ నా మనసు కుదుటపడలేదు.
చాందిని వాళ్ల నాన్నతో పాటు వచ్చింది, నేనూ ఆయన్ని పలకరించా..
తను తిరిగి వచ్చాక నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, తనతో సమయం గడపడం నాకు మెడిసిన్ అని డాక్టర్ ఓబెరాయ్ చెప్పక ముందే నాకు తెలుసు. 
నాకిప్పుడు ఆకాష్ గురించి ఆలోచించడం క్యాజువల్ విషయం లా అనిపిస్తోంది, ముందులా ఎక్కువ యాంగ్జైటీ రావడం, వాడు కనిపించడం ఇలాంటివి అస్సలు జరగట్లేదు..
  ****
ఒకరోజు ఉదయం టీం మొత్తం కాఫీ తాగడానికి వెళ్ళాం.. 
అందరం ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని, మాట్లాడుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాం.
అంతా బానే ఉంది, కానీ నాకు హోటల్ బయట హేమ కనబడింది…
ఎందుకో తెలియదు కానీ ఈ సిచ్యుయేషన్ లో తనకు ఎదురుపడడం నాకు ఇష్టం లేదు, “తొందరగా తాగండి వెళదాం” అన్నా..
అంత తొందరెందుకు ?.. అడిగింది చాందిని.
త్వరగా, నేను మీకు తర్వాత చెప్తా..
ఎందుకు కంగారుపడుతున్నావ్ విషయమేంటో చెప్పు, అడిగింది చాందిని..
హేమ వంక చూపిస్తూ “నేను తనని ఫేస్ చేయలేను” అని చెప్పా.
ఎందుకు, తను నీ పాత గర్ల్ ఫ్రెండ్ ఆ… అడిగింది చాందిని..
హే ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావ్, నిన్ను తప్ప ఏ అమ్మాయిని నేను ఇష్టపడలేదని నీకు ఇదివరకే చెప్పానుగా..
 మరి ఎందుకు ఈ దాపరికాలు..
అదికాదు చాందిని అసలు విషయం ఏంటంటే అంటూ చెప్పబోయాడు జయ..
నువ్వు ఆగరా ఇది నేనే చెప్పాలి.. అంటూ నేను చెప్పడం మొదలుపెట్టా, చిన్నప్పటి నుంచి జరిగినదంతా ఒక్కొక్కటిగా చెప్తున్నాను.
తను మౌనంగా వింటోంది.
చెప్తూ చెప్తూ సరిగ్గా “ నేను ఆకాష్ ని పొరపాటున తోయడం వల్ల చనిపోయాడు” అన్నాను. 
“కాదు…. నువ్వే చంపేసావ్” అని వినబడింది. 
అది విన్న వెంటనే తల పైకెత్తి ముందుకు చూసా హేమ నా ఎదురుగా ఉంది, కానీ ఆ మాట అంది తను కాదు, ఆ గొంతు నేను చాలా రోజుల నుంచి ఇష్టంగా వింటున్నది, అంటే ఆ మాట చాందినీ.. నోటి నుండి వచ్చింది…
అవును, “మా ఆకాష్ బావని నువ్వే చంపేసావ్”..
నాకు దిమ్మ తిరిగిపోయింది. 
ఏంటి చాందినీ.. నువ్వనేది.
నాకు చిన్నప్పటినుంచి ఆకాష్ అంటే చాలా ఇష్టం, అలాంటిది నువ్వు తనని నాకు దూరం చేసి చిన్నప్పటినుంచి నేను ఒంటరితనానికి గురయ్యేలా చేశావు..
 అవేవీ నేను కావాలని చెయ్యలేదు కదా..
కానీ జరిగింది అదే కదా, మొదట్లో నీతో సరిగ్గా మాట్లాడక పోవటానికి కారణం కూడా నీ పేరే, ఆకాష్ ని నాకు దూరం చేసిన ఆ పేరు నీకు ఉంది అనుకున్నా, కానీ ఆ పేరు వెనుక ఉన్న నువ్వే అది చేసుంటావని అస్సలు ఊహించలేదు, అసలు నిన్ను ఎందుకు ప్రేమించానా అని ఇప్పుడు బాధపడుతున్నా..
పద హేమ అంటూ, చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది..
“చాందిని నేను చెప్పేది విను” అంటూ ఉండగానే, అక్కడినుంచి వెళ్ళిపోయారు…
ఆ రోజంతా నిశ్శబ్దంగానే గడిచిపోయింది..
      ****
తరువాతి రోజు ఆఫీస్ కి వెళ్ళా..,ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడట్లేదు. 
అక్కడున్న పరిస్థితిని సరి చేద్దామని జయ కలుగజేసుకొని మాట్లాడాడు..
“ఏంటి అందరూ మౌన వ్రతం చేస్తున్నారా” అన్నాడు జయ.
ఎవరూ మాట్లాడలేదు..
 ఏంటి చాందిని ఇదేనా నువ్వు వాడిని అర్థం చేసుకుంది.., అని తనని సూటిగా అడిగాడు..
తను ఏం మాట్లాడట్లేదు, శృతి పలకరించినా అదే తీరు..
కాసేపటికి బ్రేక్ కి వెళ్ళాం, చాందిని దూరంగా కూర్చొంది…
జయ శృతి నా దగ్గరకు వచ్చారు..
ఏంటి మావ ఏం చేద్దామంటావ్, అడిగాడు జయ..
“ మీరేం చేయొద్దు, విషయం ఏంటో నేనే తేల్చుకుంటా” అన్నాను, ఆ తర్వాత క్యాబిన్ కి వెళ్ళాక మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వాళ్ళు వేరే చోట కూర్చున్నారు..
వాళ్లు వెళ్లినప్పటి నుంచి సాయంత్రం వరకు తనని పలకరిస్తూనే ఉన్నా, తను మాత్రం ఒక మాట తిరిగి మాట్లాడట్లేదు. 
 అసలు నాతో ఎందుకు మాట్లాడవు చాందిని, నా లైఫ్ లో జరిగింది ఏది నేను తెలిసి చేయలేదు ఒక్క నిన్ను ప్రేమించడం తప్ప, అసలు నువ్వు నాతో మాట్లాడకపోవడానికి ఆకాష్ ది కాకుండా ఒక్క రీజన్ చెప్పు అని అడిగా..
నాకు వర్క్ ఉంది నన్ను డిస్టర్బ్ చేయకండి, అంది చాందిని….
నా మీద నాకే చిరాకేసింది, ఏం మాట్లాడలేక అక్కడినుంచి వెళ్ళిపోయా..
ఈ విషయం అంతా సోహమ్ కి ఎలా తెలిసిందో కానీ, నేను చాందిని ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు అన్న విషయాన్ని అతను అడ్వాంటేజ్ గా తీసుకొని పాత విషయాన్ని కంప్లైంట్ చేశాడు.
తరువాతి రోజు ఉదయం ఒక కాల్ పెట్టారు.
“Hi Krithika, this is Soham. Vikram assaulted me in the parking lot. He was angry that I was assigning too much work to Chandini. Even she is supporting him. Is this acceptable corporate behavior? I request you to take strict action against these people. Thank you.” అంటూ సోహమ్ ముగించాడు..
చాందిని ,లావణ్య ఇద్దరు కాల్ లో ఉన్నారు, చాందిని ఏం మాట్లాడట్లేదు.
ఇక తప్పక నేనే మాట్లాడా..
“Hi Krithika and Lavanya, actually I have something important to say. I’d prefer to speak with you in person. Please give me a chance to prove the truth.". 
 ఓకే మిస్టర్ విక్రమ్,” I am coming to office, meet me at 11”,అంది కృతికా
“థ్యాంక్యూ కృతికా” కాల్ ముగించా.
నన్ను ఆఫీస్ నుంచి పంపించేస్తారేమోననీ కంగారుపడుతున్నారు శృతి మరియు జయా. 
చాందిని మాత్రం మౌనంగా తలవంచుకుని కూర్చుంది .
11 దాటగానే కృతిక క్యాబిన్ లోకి వెళ్ళా, ఒక అరగంట సేపు డిస్కషన్ జరిగింది.
బయటకు రాగానే, “ఏం జరిగింది” అడిగారు జయ, శృతి.
 నేనేం మాట్లాడలేదు..
కృతిక 12:00 కి మా క్యాబిన్ కి వచ్చింది. 
“ ఐ యామ్ రియల్లీ సారీ చాందిని ఫర్ ది థింగ్స్ హప్పెన్ టు యు “. మేము ఫార్మాలిటీస్ చూసుకొని సోహమ్ మీద యాక్షన్ తీసుకుంటాం..
చాందిని ఆశ్చర్యంగా కృతికా ను చూస్తోంది..
“ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే మాకు వెంటనే కంప్లైంట్ చేయండి.. “.
తలూపింది చాందిని.
విక్రమ్…కొత్త ఆర్కిటెక్ట్ వచ్చేవరకు టీం బాధ్యత నీదే..
“ఓకే కృతిక..”, తను వెళ్ళిపోయింది.
 “విక్రమ్ ఏం చేశావ్ రా” అంటూ ఆశ్చర్యంగా అడిగాడు జయ.
ఏం లేదు మావ నా వాచ్ లో ఒక అసిస్టెంట్ ఉంది, చిటికేస్తే అది ఆన్ అయ్యి వెంటనే వాయిస్ రికార్డ్ చేస్తుంది, రెండోసారి చిటిక వేసినప్పుడు ఆపేస్తుంది. ఆరోజు సోహమ్ మాట్లాడిందంతా రికార్డ్ చేశా, అంటూ కన్ను కొట్టా. 
నువ్వు సూపర్ మావ అన్నాడు జయ. 
చాందిని ఎప్పటిలాగే ఏం మాట్లాడట్లేదు, సాయంత్రం ఐదు అవ్వగానే వెళ్లిపోయింది, శృతి కావాలని కొంచెం ఆలస్యంగా ఉండిపోయింది. 
విక్రమ్ ఐ యాం సారీ యాక్చువల్ గా మీ ఇద్దరి మధ్య ఇంత జరిగిన తర్వాత నేను తనతో మాట్లాడి ఉండాలి, కానీ అది నా బెస్ట్ ఫ్రెండ్ దీని గురించి మాట్లాడొద్దని చెప్పింది కాబట్టి నేను ఆగిపోయా, అది జరిగిన విషయం గురించి చాలా బాధపడుతోంది, ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తోంది , ఆ ఆవేదన నీకు తెలియకూడదని నీ వైపు చూడట్లేదు, కొన్ని రోజులయ్యాక అదే సర్దుకుంటుంది నువ్వు బాధపడకు అంటూ వెళ్లిపోయింది.
అలా మొదలైన మా మౌన ప్రయాణం కొన్ని రోజులు సాగింది..
తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, రోజులు గడుస్తున్నాయి మా మధ్య దూరం చాలా పెరిగిపోతోంది నేను ఓపిక పట్టి చూసా, ఇలా అయితే తనని కచ్చితంగా కోల్పోతానని భయమేసింది.. ఏదైనా సరే తనతో మాట్లాడించాలని నిర్ణయించుకున్నా..
ఆరోజు శుక్రవారం, మిస్ అయితే రెండు రోజులు తనని కలవడం కుదరదు, ఎలాగైనా తనతో మాట్లాడించాలి, శృతి మరియు జయ లేని సమయం చూసి, తన వద్దకు వెళ్లా, తన కుర్చీని నా రెండు చేతులతో పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చున్నాను. 
 చాందిని నీతో కొంచెం మాట్లాడాలి…
“తను ముఖం పక్కకు తిప్పేసింది..”
నేను చెప్పేది విను నువ్వు తిరిగి మాట్లాడకపోయినా పర్లేదు - మనం మొదటిసారి కౌగిలించుకున్న చోటు గుర్తుందా… అక్కడ కలుద్దాం, నేను చెప్పేది విన్నాక నువ్వేం చేసినా నేను అంగీకరిస్తాను, ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను, నిన్ను ఇబ్బంది పెట్టి నాతో తీసుకెళ్లాలని నాకు లేదు, ఒకవేళ నువ్వు రాకపోతే ఇంకెప్పుడు నీకు కనిపించను, సో నువ్వు వస్తావా రావా అన్నది నీ నిర్ణయం.
******
4:30 కల్లా అక్కడ ఎదురుచూస్తున్న, ఐదు దాటింది తను ఇంకా రాలేదు, 6 వరకు చూసా, తను రాలేదు అన్న నిజాన్ని నా మనసు అంగీకరించట్లేదు, ఇక వెళ్ళిపోదాం అని బైక్ ఎక్క, బైక్ స్టార్ట్ చేస్తుంటే మిర్రర్ లో తను నా వైపు నడుచుకుంటూ రావడం కనిపించింది
వచ్చి నా పక్కన నిలబడింది…
బండి దిగి తనకి ఎదురుగా నిలబడ్డ, తన కళ్ళలోకి చూస్తున్నా.., తను ఇంక నేలచూపులు చూస్తోంది.
 ఉఫ్…, చూడు మహా ఈ మౌనం ఇంకెన్ని రోజులో తెలియట్లేదు, నేను ఆల్రెడీ చెప్పా, నా లైఫ్ చాలా రోజుల తర్వాత ఏదన్నా ఒక బెస్ట్ థింగ్ జరిగిందంటే అది నువ్వే, నువ్వు అనుకున్నట్టు చిన్నప్పుడు నేను ఆకాష్ ‍ని చంపేసి ఉండొచ్చు, కానీ దాన్ని మార్చలేము, అలా అని జీవితాన్ని ఇలా వదిలేయడం కరెక్టేనా, నీకు తేలుసో తెలీదో, నేను నీతో జీవితాన్ని ఊహించుకున్న, నీతో మాత్రమే ఇక వేరే ఏ అమ్మాయి నా జీవితంలోకి వచ్చినా నేను ఆ పని చేయలేను, “ఎందుకంటే నువ్వు ఆరోజు అడిగినట్టు జీవితాంతం నీకు చాలా దగ్గరగా ఉండాలనుకుంటున్న”, దయచేసి ఏదైనా సమాధానం చెప్పు మహా, కనీసం నా కళ్ళలోకి చూడు.. 
తను ఇంకా మౌనంగా ఉంది..
ఏం మాట్లాడనప్పుడు అసలు ఎందుకొచ్చావ్.
తను గొంతు విప్పి ఏదో చెప్పబోయింది..
ఏంటమ్మా ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావ్ అంటూ గట్టిగా పిలిచారు ఎవరో.., చూస్తే చాందిని వాళ్ళ నాన్న.
“రండి అంకుల్” అంటూ పలకరించా.
 ఎవడ్రా నీకు అంకుల్, కొత్తగా జాబ్ లోకి చేరిన అమ్మాయిలతో ఇదేనా మీరు చేసేది..
నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకండి , నేను తనని ప్రేమిస్తున్నా..
అయితే ఇప్పుడు తనతో బలవంతంగా ఎందుకు మాట్లాడించాలనుకుంటున్నావ్, నీకు ఏమాత్రం సిగ్గున్నా తనని వదిలేసి వెళ్ళిపో… పోయి కొత్త అమ్మాయిలు ఎవరన్నా వచ్చింటే చూసుకో.., నీకు అలవాటే గా…
ఆ మాట అని తప్పు చేశాడు వాళ్ళ నాన్న, వెళ్లి అతని కాలర్ పట్టుకున్న,.