tholipournami in Telugu Love Stories by sreelu books and stories PDF | తొలి పౌర్ణమి - 20

The Author
Featured Books
Categories
Share

తొలి పౌర్ణమి - 20

నేను వేసే ప్రతి అడుగూ అక్కడి వాతావరణాన్ని కాస్త భారంగా, నా వెనక ఉన్న వాళ్ల గుండెల్లో ఓ అనుమానంతో కూడిన భయాన్ని మిగిలిస్తున్నాయి..

లాస్ట్ ఆడియో అయిపోయింది.
ఇంకా తర్వాత వినడానికి ఎలాంటి రికార్డింగ్స్ లేవు..
గదిలో నిశ్శబ్దం.
ఆకాష్ ఆలోచనల్లో పడ్డాడు….
 అసలు నాన్న తర్వాత ఏం చేశాడు, మా అమ్మ చూస్తే నాన్నని పెళ్ళి చూపుల్లో చూసి పెళ్ళి చేసుకున్నా అని చెప్తోంది..
ఇక్కడ చూస్తే నాన్న చాందినీ ని ప్రేమించి తనని మహా అని పిలుస్తున్నాడు, బహుశా చాందిని వదిలేసి వెళ్లిపోయినందుకు ఆ పేరు ఉన్న అమ్మని పెళ్ళి చేసుకున్నాడా, అయితే కథలో ఉన్న చాందిని ఏమైపోయింది..
 అలా అయితే నాన్న ఇద్దరికీ మోసం చేసినట్టే కదా…?, ఇలాంటి అనుమానాలు వానలా కురుస్తున్నాయి..
టైం చూస్తే రాత్రి 12 అవుతుంది ఆతృత తట్టుకోలేక వెళ్లి వాళ్ళ అమ్మ ఉన్న రూమ్ తలుపు కొట్టాడు.
డోర్ తీసి, ఏంట్రా నాన్న ఈ టైంలో నిద్ర లేపుతున్నావ్ అని అడిగింది అమ్మ. 
“అమ్మా నాన్న నిన్ను మోసం చేసాడమ్మా”, తన గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరు విడిపోయేసరికి అదే పేరు ఉన్న నిన్ను పెళ్ళి చేసుకొని నీలో తనని ఊహించుకుంటున్నాడు, అంతేగాని నిజంగా ప్రేమించట్లేదు అంటూ వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాడు. 
“ఇవన్నీ నీకు ఎలా తెలుసు రా?” అని అమ్మ కళ్ళలోకి చూసింది. 
“నాన్న ఫోన్లో క్లౌడ్ బ్యాకప్ పెట్టినప్పుడు కొన్ని ఆడియో ఫైల్స్ దొరికాయి… అందులో అన్నీ రికార్డ్ చేశాడు.”
“ఎందుకురా లేనిపోని అనుమానాలు? రేపు మీ నాన్న వస్తాడు గా… అప్పుడు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్లి పడుకో.”
“లేదమ్మా… నీకు నిజం తెలిసుంటే ఇప్పుడే చెప్పాలి!”
“చెప్పేది విను ఆకాష్… ఇప్పుడు నువ్వు పడుకో. రేపు పొద్దున కల్లా సమాధానం నీ టేబుల్ మీద ఉంటుంది.”
“రేపు కాదు… ఇప్పుడే చెప్పు!”
నాన్న వెళ్లి పడుకో పొద్దున కల్లా అన్నిటికీ సమాధానం నేను చెప్తా..
“సరే అమ్మ” అంటూ వెళ్లి నిద్రపోయాడు. 
…………
ఉదయం — సమయం ఆరు. అవుతోంది.
ఆకాష్ కు మెలకువ వచ్చింది.
పైకి లేచి కళ్ళు రుద్దుకున్నాడు.
అప్పుడే… పక్కన టేబుల్ మీద పేపర్లు గాలికి కదులుతున్న శబ్దం వినిపించింది.
ఆవైపు తిరిగి వాటిని తీసుకున్నాడు.
అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరిదో కాదు వాళ్ళ అమ్మదే, ఆ పేపర్ లో ఎంత చక్కగా రాస్తుందో డిజిటల్ స్క్రీన్ మీద కూడా అలాగే రాసేది , పేజీలు తిప్పి నెమ్మదిగా చదవడం మొదలుపెట్టాడు…

నా భావాలు ఎవరితోనూ చెప్పుకోలేను కనీసం ఈ కాగితం తో అయినా చెప్పుకుంటా…
ఎందుకో తెలియదు కానీ చిన్నప్పుడు నుంచి ఆకాష్ అంటే నాకు చాలా ఇష్టం, అతనే మో భయస్తుడు నేనే మో చాలా మొండిదాన్ని, ఆకాష్ ఏం చేసిన నాకు చాలా కొత్తగా అనిపించేది, చిన్నప్పుడు సరదాకి ఆకాష్ తో నాకు పెళ్ళి చెయ్యాలని మా వాళ్ళు సరదాకి మాట్లాడుతుంటే అతను సిగ్గుపడితే నేను మాత్రం లోపల సంతోషపడేదాన్ని…
ఆకాష్ తిరిగి వచ్చాక నా మనసులో ఉన్న విషయం చెప్పాలనుకున్నా, కానీ అతని శవం తిరిగి వస్తుందని నేను ఊహించలేదు, ఏడ్చడానికి కన్నీళ్లు సరిపోవట్లేదు, దీనికి తోడుగా మా అమ్మ చావు నన్ను నిలువునా కుదిపేశాయి, మనసులో ఆ భారాన్నంతా పెట్టుకొని ఎలా బ్రతికానా అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది
అలా మొదలైన నిశ్శబ్దం నా జీవితంలో 10 ఏళ్ల పాటు కొనసాగింది..
అప్పుడు వచ్చాడు విక్రమ్, నా నిశ్శబ్దాన్ని ముక్కలు చేసి, నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు.., మొదట్లో అతన్ని నేను పట్టించుకోలేదు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తరవాత ఆకాష్ నాతో ఉండుంటే ఇలాగే ఉండేవాడా అనిపించింది, ఆకాష్ చనిపోయాక నేను ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడలేదు, అలా మౌనంలోనే ఉండిపోయిన నాకు తన ప్రేమతో ఓ కొత్త ప్రయాణాన్ని అందించాడు, నేను కారణం చెప్పలేను… కానీ విక్రమ్ ప్రేమలో నేను నెమ్మదిగా పడిపోయా.
చివరికి తన వల్లనే ఆకాష్ చనిపోయాడు అన్న విషయం తెలియగానే అతని మీద పట్టరానంత కోపం వచ్చింది, ఆ ఆవేశంలో చాలా మూర్ఖంగానే ప్రవర్తించాను, ఆ పరిస్థితిని విక్రమ్ స్థానంలో ఉండి ఆలోచించలేకపోయా.
తర్వాత నేను రియలైజ్ అయ్యేలోపే, నేను విక్రమ్ ను ప్రేమించిన సంగతి ఇంట్లో తెలిసింది.
వాడు నీకు కరెక్ట్ కాదు అని రమణ మామయ్య అంటున్నాడు, ఇంకోవైపు “ విక్రమ్ తో మాట్లాడితే నేను ఛస్తా” అంటూ మా నాన్న బెదిరిస్తున్నాడు..
 ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు
ఆరోజు హాస్పిటల్ లో అడక్కుండానే వచ్చి మా మావయ్య ప్రాణం కాపాడాడు, తీరా అతని కలిసి మాట్లాడదాం అని వెళ్ళినప్పుడు, మా నాన్న నోరు జారి తనని హంతకుడు అన్న మాటని నా మీద రుద్దేసాడు విక్రమ్.., ఆరోజు నాకర్థమైంది ఏంటంటే మా నాన్న అన్న మాటకి నేనేం ఎదురు చెప్పలేదు అంటే నేను అంగీకరించినట్లేకదా. అయినా విక్రమ్ తో మాట్లాడితే నేను ఛస్తా అని మా నాన్న బెదిరిస్తే నేనేం చేయాలి..
 “ప్రేమించిన విక్రమ్ కోసం నాన్నను చంపుకోనా, లేదా పెంచిన నాన్న కోసం విక్రమ్ ని వదిలేసి నన్ను నేను చంపుకోనా, ఇదంతా ఆలోచిస్తే ఉండాలనిపించట్లేదు…”
ఆరోజు విక్రమ్ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాక, తిరిగి మా మావయ్య దగ్గరికి వెళ్ళాం, ట్రీట్‌మెంట్ అయ్యాక డాక్టర్ ఏం ప్రమాదం లేదన్నారు…
మరుసటి రోజు కోలుకున్నాక డాక్టర్ వార్డు లోనికి వచ్చాడు ..
“ఇప్పుడు ఎలా ఉంది?” అని మావయ్యని అడిగాడు..
పర్వాలేదు డాక్టర్..
“మీరు హిందూపూర్ లో ఉండేవారు కదా” అని మావయ్యని అడిగాడు
అవును డాక్టర్, మీకు ఎలా తెలుసు…. 
నన్ను గుర్తు పట్టారా, అప్పుడు మీ అబ్బాయి ఆకాష్ ని ట్రీట్ చేసింది నేనే.
అవును గుర్తొచ్చింది డాక్టర్, “చిన్నగా నవ్వి” కానీ మీరు ట్రీట్ చేసినా వాడి చావు ముందే వేరే వాడి చేతిలో రాసి పెట్టింది కదా..
 ఎవరో అబ్బాయి ఆకాష్ ని తోస్తే కిందపడి చనిపోయాడు అని నాతో చెప్పారు కొంతమంది.
అవును అది కక్షసాధింపు లో చేసిన పని.
“కానీ సార్ అది సగమే నిజం” అన్నాడు డాక్టర్.
నేను హేమ జాగ్రత్తగా వింటున్నాం.
“ఏంటి మీరనేది” అడిగాడు రమణ మావయ్య..
అవును , యాక్చువల్ గా మీ అబ్బాయికి ఒక “బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్” అనే సమస్య ఉంది, అది ఉంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా షాక్ కి గురి అయినప్పుడు హాట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాడు, విక్రమ్ తోయడం వల్ల ఆకాష్ చనిపోలేదు, ఆకాష్ కి అలాంటి సమస్య ఉందని విక్రమ్ కు తెలియదు కాబట్టి చనిపోయాడు.
నేను నమ్మను..డాక్టర్
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, మీ అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు దాని వల్ల వచ్చిన ప్రాబ్లమే ఇది, ఆరోజు నేను అదే చెప్పాలని మిమ్మల్ని వెయిట్ చేయమన్నా, కానీ మీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు..
“ఎనీవేస్, డోంట్ బ్లేమ్ విక్రమ్ ఫర్ ఎవ్రీథింగ్, హి ఈజ్ నాట్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్…”
ఈ నిజం తెలియగానే, నేను ఉన్న చోటే కూలబడిపోయా, చిన్నప్పటినుంచి విక్రమ్ ఎంత బాధ అనుభవించాడో అని గుర్తుకొస్తున్నా ప్రతిసారి ఏడుపొస్తుంది నాకు…, విక్రమ్ ని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చెయ్యాలనుంది..నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు..
ఇంతలో ఎవరో నా తల నిమిరి పైకి లేపారు, చూస్తే మావయ్య.
నన్ను క్షమించమ్మా, మా కుటుంబం వల్ల చాలా ఇబ్బందులు పడ్డావు, మేము అనవసరంగా గతాన్ని వెలిక్కి తీసి నిన్ను అతన్ని చాలా ఇబ్బంది పెట్టాం..
ఏంటి బావ నువ్వనేది అన్నాడు నాన్న..
“నువ్వు ఆగు, తనని ప్రశాంతంగా వదిలేయ్” అన్నాడు రమణ మావయ్య..
 ఒకవైపు తన చేతుల్ని భుజాల పైన వేసి ధైర్యం చెప్పింది హేమ… 
ఆ తర్వాత రోజు నుంచి విక్రమ్ ని కలుద్దామని చాలా ప్రయత్నించా…, కాని ఆతను సరిగ్గా ఆఫీస్ కి రావట్లేదు.., ఒకవేళ వచ్చినా నాకు ఎదురు పడట్లేదు..
విక్రమ్ నా కోసం తాగి బాధపడుతున్నా డు అని తెలుసుకున్న ప్రతిసారి, నేను బాధపడేదాన్ని.
 రెండు మూడు సార్లు విక్రమ్ ఎదురుపడినా మాట్లాడాలని ప్రయత్నించి ధైర్యం సరిపోక ఆగిపోయా, 
ఆ తర్వాత మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయేలా ఉంది, ఎందుకంటే విక్రమ్ సడెన్గా పెళ్లి కార్డు ఇచ్చి తన పెళ్ళికి రమ్మని పిలిచాడు, నాకు ఏం చెయ్యాలో తెలియని అయోమయం.
అసలు విక్రమ్ లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నా, నిద్ర లేని రాత్రులు, నాకు ఇది ఒక నిశ్శబ్ద నరకంలా ఉంది, మనల్ని చిత్రహింసలు పెట్టే శత్రువులకైన ఇలాంటి బాధ రాకూడదు..
ఆరోజు విక్రమ్ పెళ్ళి, శృతి నేను వెళ్ళాం..,మేం వెళ్ళగానే పెళ్ళి మంత్రాలు ఆగిపోయాయి.
“అక్కడ చూడవే ఏదో గొడవ జరుగుతున్నట్టు ఉంది” అంటూ పిలిచింది శృతి.
 ఇద్దరం అక్కడికి వెళ్లి చూస్తే విక్రమ్ అటువైపు తిరిగి మాట్లాడుతున్నాడు, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది..
“అది కాదు మావయ్య ఇప్పుడు జరిగే విషయాలు చెప్తా విను, శారీరక సుఖాల కోసం ప్రేమ అనే ముసుగులో బ్రతికేవాళ్ళు కొంతమంది, వాళ్ళ అవసరాల కోసం ప్రేమించి వాడుకొని వదిలేసే వాళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది ఎందుకు ప్రేమిస్తారో తెలియదు, ఎందుకు వదిలేస్తారో తెలియదు.., అంటూ నా వైపుకు తిరిగి నా కళ్ళలోకి చూసాడు”
విక్రమ్ ని సూటిగా చూడలేక, నేను పక్కకు వెళ్ళి కూర్చున్నా.., నేను చేసిన వాటికి గిల్టీ గా ఫీల్ అవుతున్నా..
 ఏమైందే..అడిగింది శృతి.
కళ్ళు తిరుగుతున్నాయి..
“పొద్దున్నే తినమంటే విన్నావా” అంటూ తిట్టింది శృతి..
“నన్నేం చెయ్యమంటావ్ నాకు పూరి నచ్చదు” అంటూ సీరియస్ అయ్యా..
ఎందుకంత సీరియస్ అవుతున్నావ్..
ఆకలేస్తుందే, ఈ పెళ్ళేదో త్వరగా అయిపోతే తినేసి వెళ్ళిపోదాం..
నీకస్సలు బాధెయ్యట్లేదా..
నాలో నేను చిన్నగా నవ్వుకుని, “జరిగేదాన్ని మార్చలేం..”(లోపల ఒకటి పెట్టుకుని బయట ఇంకోలా నటించడం చాలా దారుణం)
అక్కడ జరిగేదంతా చూస్తుంటే పరిస్థితి మారిపోయేలా ఉంది..
విక్రమ్, వాళ్ళ మావయ్యని ఒప్పించి జయ గౌతమీ ల పెళ్ళి జరిపించాడు.
నాకు ఆనందంగా ఉన్నా, తర్వాత ఏం చేద్దాం అనే ఒక బెంగ, విక్రమ్ తో మాట్లాడాలంటే గిల్టీ..
అంతా చుట్టూ కూర్చొని మాట్లాడుతున్నారు నేను మాత్రం పక్కన దూరంలో కూర్చున్నా ఎందుకంటే చాలా నీరసంగా ఉంది, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించి రెండు సార్లు లేచా, లేచిన వెంటనే శక్తి సరిపోక అలానే కూలబడిపోయా..
 విక్రమ్ వచ్చి నాతో మాట్లాడతాడు అనుకున్నా, కానీ ఇన్ని రోజులు నన్ను పిలిచి అలసిపోయాడో ఏమో నా మాటే ఎత్తలేదు...
వాళ్ళందరికీ విచిత్రంగా ఏదో చెప్పాడు నాకది సరిగ్గా వినిపించలేదు.., తర్వాత నా వైపు ఒకసారి చూసి అక్కడినుంచి లేచి వెళ్తున్నాడు..
విక్రమ్ వెళ్తూ ఉండగా జయ, శృతి నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. 
జయ మాట్లాడుతూ,” నీకెందుకు ఇంత ఈగో నాకు అర్థం కావట్లేదు చాందిని, వాడు చిన్నప్పుడు చేసింది తప్పే అయితే, నిన్ను ప్రేమించింది కూడా తప్పే, ఎందుకంటే నువ్వు వాడిని అర్థం చేసుకోలేని ఇంత చిన్న మైండ్ సెట్ తో బ్రతుకుతున్నావని వాడికి తెలియదు కాబట్టి.”
ఆ మాటలు నా గుండెలో బరువై పడ్డాయి.
“జయ చెప్పిన ప్రతి మాట నిజం… విక్రమ్‌ గురించి మా కంటే నీకే బాగా తెలుసు”, అంది శృతి.
తలవంచుకొని ఏడుస్తున్నా…“నాకు విక్రమ్ తో మాట్లాడే అర్హత లేదేమో అనిపిస్తోంది..”, తల పైకి ఎత్తాను.
“చాందినీ… ఒక్కసారి వెళ్లి అతని కళ్లలోకి చూడు. కచ్చితంగా అర్థం చేసుకుంటాడు. అదిగో, కనుచూపు మేరలోనే వెళ్తున్నాడు…” అన్నాడు జయ