అరణ్య మీటింగ్ ఉందని ఆఫీస్ నుండి సచివాలయం కి, అక్కడి నుండి గెస్ట్ హౌస్ కి వెళ్లి ఎమ్ .డి. వో, M.E.O, A. E. O లు కూర్చుని ఉండగా తనూ వెళ్లి కూర్చుంది.
కాసేపు నిశ్శబ్దం. ఇంతకీ మీటింగ్ ఎందుకు జరుగుతుందో అర్థం కాక అరణ్య ఎం.ఈ.ఓ వైపు చూసి అడుగుదామనుకుంటుండగా ఒక వ్యక్తి లోపలికి వచ్చి మా అయ్యగారు వస్తున్నారు అని చెప్పి పక్కకు నిలబడగా చూస్తే ఒక మీడియం ఎత్తు ఉన్న ఒక నల్లని ఆకారం ముందుకొస్తున్నట్లు అనిపిస్తోంది. తీరా మనిషి దగ్గరికి రావడంతో కళ్ళ లో కనుగుడ్డు, అతను నవ్వగా పళ్ళు మాత్రమే తెల్లగా కనిపిస్తున్నాయి. ఇంకా అతని కాలికి వేసిన బంగారు రంగు షూస్ మెరుస్తున్నాయి . అతను ఇంకాస్త దగ్గరికి వచ్చేసరికి జడుసుకున్నారు ఆఫీసర్లు.
పచ్చి రాగానే నమస్తే ఆఫీసర్స్ అంటూ రెండు చేతులు జోడించి నమస్కరించడంతో ఐదుగురు లేచి తాము చేతులు జోడించి ప్రతి నమస్కారం చేయగా కూర్చోండి అన్నట్లు అతను చిరునవ్వుతో సైగ చేయడంతో అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు.
ముందుగా మీరు పిలవగానే వచ్చినందుకు ధన్యవాదములు. ఇక్కడి సమావేశం గురించి మీ హయ్యర్ ఆఫీసర్ బహుశా చెప్పే ఉంటారు. అన్న అతని మాటలు వినగానే ఐదుగురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అది చూసిన అతను మిమ్మల్ని చూస్తుంటే మీ సార్ మీకు విషయం చెప్పినట్టు లేదనిపిస్తుంది అయితే నేనే చెబుతాను వినండి "ఈ ఊరికి ఏ కొత్త ఆఫీసర్ వచ్చినా ముందుగా ఇక్కడ విందు ఆరగించి ఆ తర్వాత తన పనిని ప్రారంభిస్తాడు. " కాబట్టి మీరు కూడా ఈ ఊరికి కొత్తగా వచ్చినవారు మీకు ఈ విందు ఏర్పాటు చేసాము. ముందు విందు ఆరగించండి. ఆ తరువాత విషయం చెబుతాను అని అతను చెప్పడంతో మేము వచ్చేటప్పుడే తినొచ్చాము కాబట్టి వెళ్లేటప్పుడు తింటాము ముందు విషయం చెప్పండి అని ఆఫీసర్స్ అనడంతో ఆ నల్లటి వ్యక్తి " ఈ ఊరి గురించి కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండవు కాబట్టి మీరు మాకు కొన్ని విషయాలలో సహకరిస్తే మేము మీకు సహకారంగా ఉంటాము. ఎందుకంటే కోరి కోరి పులి నోట్లో తలపెట్టడం ఏమాత్రం మంచిది కాదు కదా ! " కాబట్టి విషయం అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంతకన్నా విపులీకరణ అవసరం లేదనుకుంటా ఎందుకంటే అందరూ బాగా చదువుకున్న వాళ్లే కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అని అతను చెప్పడంతో ఆఫీసర్స్ ఒకరికొకరు చూసుకొని విషయం అర్థమైంది అన్నట్టు తలూపుతూ ఉంటే అరణ్యకి, ఏ.ఈ.ఓ కి ఎందుకో బాధ అనిపించింది . అయినా అరణ్య అక్కడ ఏమాత్రం తన భావాల్ని బయటికి కనిపించనీకుండా ఉండడంతో అతను అరణ్యవైపు ఒకలా చూసి "ఏంటి మేడం గారు ఆలోచిస్తున్నారు." అనడంతో ఏమీ లేదన్నట్టు తలూపింది అరణ్య.
డియర్ ఆఫీసర్స్ మీకోసం మటన్ బిర్యానీ రెడీ చేయించాం. హాయిగా కడుపునిండా ఆరగించి వెళ్ళండి. అని చెప్పి తను కూడా వాళ్ళ జతలో భోజనానికి కూర్చున్నాడు నల్లవ్యక్తి.
అరణ్య విందు ఆరగించే డైనింగ్ హాల్ కి రాకపోవడంతో అతనే బయటికి వచ్చి మేడం ఎందుకు మీరు హాట్ తినకపోతే స్వీట్ కూడా ఉంది. మీకు ఏది కావాలో అది తినొచ్చు.అని పిలవడం చెప్పడంతో వద్దండి , ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. అని చెప్పి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఏమీ తినలేదు.మిగిలిన వాళ్ళు విందు ఆరగించి బాగుంది అని చెప్పి బయటికి వచ్చారు.
ఆఫీసర్లు బ్రేవ్ మని తేపుతుంటే " సార్ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంది కదా అన్నాడు ఏ.ఈ.ఓ. " వంట మాత్రం అదుర్స్ కానీ మనం కడుపునిండా తిన్నామని ఆనందపడడం కాదు వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా సమస్య కల్పించినా లేదా వాళ్లకి ఏ సమస్య అయినా ఎదురైనా మనం కాస్త కామ్ గా ఉంటే వాళ్లు మనల్ని ఎక్కడో ఉంచుతారు అని ఆఫీసర్ అనేసరికి , "లేదంటే "అన్నాడు ఏ.ఈ.ఓ కల్పించుకుని.
లేదంటే రూట్ లేని మారుమూల ప్రాంతానికి ఫ్యామిలీ అన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది అంతే సింపుల్ అన్నాడు ఆఫీసర్.
' ఏం సార్ ఇప్పుడు బిర్యానీ బాగుందా? 'అని అడిగింది అరణ్య నవ్వుతూ.
బయటికి రాలేక పోతుంది మేడం తిన్న తర్వాత ఏమి చేయలేము కక్కలేము , ఉంచలేము మీరు తినకుండా మంచి పని చేశారు అన్నాడు ఏ.ఈ.ఓ.
సరే సార్ ఆఫీస్ బాయ్ కి ఇంటికి వెళ్లే టైం అయింది. పాపం స్కూటీ అడిగిన వెంటనే ఇచ్చాడు అని చెప్పి ఆఫీస్ కెళ్ళి స్కూటీ అబ్బాయికి ఇచ్చి కారు తీసుకుని ఇంటికి వెళ్ళింది అరణ్య.ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రభకి ఫోన్ చేసి మీటింగ్ గురించి చెబుదామని అనుకున్నా అరణ్యకి నిద్ర ముంచుకు రావడంతో ఫోన్ పక్కన పెట్టి నిద్రపోయింది.
సింహాగిరిలో
ప్రభా ఆలోచిస్తూ తన గది నుంచి బయటికి వచ్చి కాంపౌండ్ దగ్గర అటు ఇటు నడుస్తూ ఉండగా కొత్తగా వచ్చిన శైలు భర్త వడివడిగా రావడంతో ప్రబా అటువైపు కదులుతుండగా అతనిని ఢీకొడతాడు. అతని చేతిలో ఉన్న బ్యాగు కిందపడేసరికి అందులో ఉన్న గాజు సీసా పగిలిపోయి లోపల ఉన్న ద్రవం కారిపోయింది.
అంతే! కోపంతో కళ్ళు పెద్దవి చేసి కోపోదృక్తుడై కళ్ళు కనబడలేదా! దీని విలువెంతో తెలుసా ! అంతా నేలపాలు చేసావ్ అనేసరికి వెనక్కి తిరిగి చూసిన ప్రభ పగిలిన గాజు సీసాను చూసి ఆ షాక్ అయ్యాడు.
సారీ! చూసుకోలేదు అని ప్రభ అంటుంటే చూడు నీ సారీలు, పూరీలు నాకు అవసరం లేదు ఇది చాలా కాస్ట్లీ బ్రాండ్ ఇక్కడ దొరకదు.ఎంత దూరం నుండి తెచ్చానో తెలుసా ! అని అతను అరుస్తుంటే , సార్! సారీ చెప్తున్నా కదా అన్న ప్రభ తో మళ్ళీ సారీ ఏంట్రా సారీ అని మీదకి వస్తూ ఉంటే , సర్! ప్లీజ్ అరవకండి. అదెంతో చెప్పండి నేను డబ్బులు ఇస్తాను అని డబ్బు బయటకి తీస్తుంటే నీ డబ్బులు ఎవరికి కావాలి నాకు ఈ బ్రాండెడ్ వైన్ ఏ కావాలి అని అరిచేసరికి ఇంకా ఎవరైనా చూస్తే బాగుండదు కాక శైలు ముందే గీతిక స్నేహితురాలు కాబట్టి మళ్లీ నాకే తలనొప్పి అని అనుకొని సరే కవర్ ఇవ్వండి అని తీసుకుని ఆ బ్రాండ్ నేమ్ కవర్ తీసి పేపర్ తీసుకొని పప్పు కోసం చూస్తే అక్కడెక్కడ కనిపించకపోవడంతో తనే వైన్ షాప్ కి వెళ్లాడు.
వైన్ షాప్ దగ్గర ఉన్న పెద్ద క్యూ చూసి అందుకే అతను అలా అన్నాడు ఈ క్యూ ముగిసేకి ఒకరోజు పట్టేటట్లుంది అనుకొని క్యూలో నిలబడగా రెండో వరుసలో నిలబడిన ఓ నడివయసు వ్యక్తి తన వైపే చూడడం చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే అనుకొని ఆలోచించగా ఇతను అపార్ట్మెంట్ కి పక్కన ఏడో ఇంటి బాబాయ్ కదా అనుకొని హాయ్ ! అన్నట్లు చెయ్యి ఊపగా అతను నీకూ ఈ అలవాటు ఉందా ? అని సైగ చేస్తే చి! చి! లేదన్నట్లు తలపాడు ప్రభ. మరెవరికి అన్న ప్రశ్న అని అడుగు అని అడుగుతుంటే అంతలో పక్కన ఉన్న వ్యక్తి ఏం బాబు ఊరికే నిల్చోలేవా ఏంటి? ఆ పక్క ఈ పక్క అడుగులు అలా వేస్తున్నావు అనడంతో ఇటు తిరిగితే తనవంతు రావడంతో వైన్ బాటిల్ తీసుకొని వెనుదిరిగి వస్తూ ఎంత కాస్ట్ వైన్ ఇది చేజేతులా నా ఖర్చులకోసం పెట్టుకున్న డబ్బుల్ని వేస్ట్ చేసుకున్నాను . ఈరోజు లేచి ఎవరి ముఖం చూసానో ఏమో అనుకొని బైక్ బ్యాగ్ లో పెట్టాలని బ్యాగ్ ఓపెన్ చేసి ఒకసారి బాటిల్ ఉన్న బాక్స్ ఓపెన్ చేసి బాటిల్ ని చూద్దామని బయటికి తీస్తూ ఉండగా అటువైపు విసురుగా పరిగెత్తుకొచ్చిన ఒక వ్యక్తి ప్రభ పైకెత్తుతున్న బాటిల్ మూత దగ్గర పట్టుకొని ఫాస్ట్ గా కదులుతుంటే ఎవడ్రా నా బాటిల్ తీసుకొని వెళుతున్నావు అని వెను తిరుగుతుంటే వెనక నుండి మరో ముగ్గురు అతను వెళ్ళిన వైపు వెళ్ళగా ప్రభ వెనకాలే పరిగెత్తుతుంటే బాటిల్ పట్టుకున్న వ్యక్తి ముందుకు పరిగెత్తుతున్న మరో నడి వయస్సు వ్యక్తికి ఆ బాటిల్ ని విసరగా అది కాస్త గురితప్పి స్తంభానికి పడడంతో పగిలి ముక్కలైపోయింది.
పరిగెత్తుతున్న నడివయసు వ్యక్తి కాలికి రాయి తగలడంతో కిందపడి నన్నేమి చేయవద్దని చేతులు మొక్కి అడుగుతున్నాను అన్నా వాళ్లు వినిపించుకోకుండా కాలితో తన్నేసరికి అంత దూరం పడ్డాడు అతను. ప్రభ వెనక నుండి వేగంగా పరిగెత్తుకొస్తుంటే ఆ వ్యక్తి వెనుకున్న వాళ్ళు అడ్డు రావడంతో ఆవేశంతో కొట్టి పారేశాడు. తన బాటిల్ తీసుకున్న వాడు పగిలి ముక్కలైన బాటిల్ ముక్కని తీసుకుని ఆ వ్యక్తిని చంపాలని వెళుతుంటే వెనక నుండి వేగంగా పరిగెత్తి నాలుగు తన్నేసరికి వెనక తన మనుషులు ఉన్నారని చూస్తే అందరూ కిందపడి దొర్లుతూ ఉండడంతో కోపంగా ప్రభ మీదికి ఆగాజు ముక్క విసరగా పైకి ఎగిరి తప్పించుకున్న ప్రభ ఈరోజు నా చేతుల్లో చచ్చిపోతావ్ అంటూ చేతికి దొరికిన వాటిని తీసుకొని కొడుతుంటే ఆ దెబ్బలు తినలేక అన్నా! నువ్వు ఎవరు? ఎందుకు కొడుతున్నావ్ ? ఊ.. ఊ.. అని ఏడుస్తూ నీ దెబ్బల్ని తట్టుకోలేక పోతున్నా. ఎందుకు కొడుతున్నావ్ చెప్పన్నా ప్లీజ్ ! అని వాడు ప్రాధేయపడుతుంటే , " నేను కవర్లోని బాటిల్ తీస్తుంటే నీకెంత పొగరుంటే ఆ బాటిల్ని తీసుకుని పరుగెత్తుతావురా గూట్లే, అంటూ మరో దెబ్బని ప్రభ వాడి చంపకి వాయించగా, ఇంకో చంపకి చేతిని అడ్డంపెట్టి అన్నా! ముందు ఆ బాటిల్ ఎంతో చెప్పు. నీ డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు చిల్లర రౌడీ.
" 2000" అని చెప్పాడు ప్రభ.
" రెండు వేలా" అని వాడు నోరు తెరిచేసరికి,
ప్రభ వాడి మూతికి పిడికిలి బిగించి కొట్టగా రాలిన పండ్లను చేతిలో పట్టుకొని " బ్యా "అని ఏడుస్తూ అన్నా ! నా దగ్గర అంత డబ్బు లేదు ఒక్క నిమిషం టైం ఇస్తే మా తమ్ముళ్ళని అడుగుతాను అనేసరికి అలాగే అంటూ సైడ్ చేసిన ప్రభా వైపు కొడతాడేమో అని మరొక్కసారి చూసి పడి దొర్లుతున్న వాళ్ళని అడిగాడు చిల్లర రౌడీ.
లేదు, అని దొర్లుతున్న వారు చేతులూపారు.
చిల్లిగవ్వలేని చిల్లర నాయుళ్లారా! నీకెందుకురా ఈ రౌడీయిజం. కష్టపడి పని చేసి బతకడానికి మీకు సిగ్గు, ఇలా వీధుల వెంట తరిమి కొట్టించుకునేటప్పుడు సిగ్గు లేదా ? మరి ఈ పని ఎందుకోసం చేస్తున్నారు? నీ పక్కన పడి ఉన్న కర్ర తీసి ఒక్కొక్కరిని రెండు తగిలించాడు ప్రభ.
ఒక్క నిమిషం . మా అన్నకి ఫోన్ చేస్తా అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో ముఖంలో ఏడుపు మొదలైంది.
ఇది చూస్తున్నా కిందపడి దొర్లుతున్న వాళ్లలో ఒకడు పైకి లేచి అన్నా నా మెడలో గోల్డ్ చైన్ ఉంది కదా అనేసరికి ఇంటికి పోతే దీనికంటే రెట్టింపు దెబ్బలు తినాలి అంటూంటే కోపంతో ప్రభ ముందుకు వస్తుంటే భయపడిచ్చిన తను వేసుకున్న గోల్డ్ చైన్ తీసి ఇవ్వబోగా , "నాకు ఒక బాటిల్ అమౌంట్ ఇవ్వు చాలు." అని ప్రభ అనడంతో వాడికి దిక్కు తోచక కాళ్లు పట్టుకున్నంత పని చేస్తుంటే, దొర్లుతున్న వాళ్లలో ఒకడు అన్న ! అదిగో అక్కడ గోల్డ్ షాప్ ఉంది అనేసరికి వెళ్లి ఆ చైను అమ్మి ప్రభ కి డబ్బులు ఇవ్వగా మరొక్కసారి అందరినీ ఒక ఆట ఆడించడంతో ఇంకెప్పుడు నీ జోలికి రామని కాళ్లు పట్టుకోగా వదిలేస్తాడు ప్రభ.