pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 19

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 19

రామాపురంలో
పెద్దాయన ఏదో ముఖ్యమైన పని ఉందని టౌన్ కి వెళ్లడంతో ఆరోజు లీవ్ పెట్టమని చెప్పిన ప్రభ ఎంతసేపైనా రాలేదు. ఎందుకు లీవ్ పెట్టమన్నాడో అర్థం కాలేదు అనుకుంటూ ఎలాగూ లీవ్ పెట్టాను కాబట్టి ఇల్లంతా సర్దుదామని చెప్పేసి లోపల రూములన్నీ సర్ది హాలు శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి సింపుల్ డ్రెస్ వేసుకొని బయటికి వస్తూ ఉండగా ఏదో కారు వచ్చిన శబ్దం కావడంతో పతంగి వెళ్లి వచ్చిన వారిని లోపలికి తీసుకొచ్చాడు.

వచ్చిన వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి 'అరణ్య 'అంటూ లోపలికి వెళ్ళగా తను కిచెన్ లో ఉండడం చూసి "అరణ్య కొంచెం స్ట్రాంగ్ గా నీ చేతులతో కాఫీ చెయమ్మ" అని పతంగి చెప్పడంతో ఎందుకలా అడుగుతున్నాడో అర్థం కాలేదు అరణ్యకి.

"అన్నయ్య ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు ఉన్నది మనిద్దరమే కదా నాలుగు గ్లాసులు కాఫీ ఎందుకు ?"  అన్నది అరణ్య ప్రశ్న.

'అరణ్య, కాఫీ తీసుకుని ఒక్కసారి హాల్ లోకి వస్తే నీకే అర్థమవుతుంది' అంటూ తను రెండు గ్లాసుల మంచినీళ్లు తీసుకుని వెళ్లి హాల్లో కూర్చున్న ఒక నడి వయస్సు జంటకి ఇవ్వగా అరణ్య లోపల నుంచి కాఫీ తేవడం ఇద్దరూ చూసిన తర్వాత జంటలో భార్య గంగ అరణ్యని తన పక్కన కూర్చోమని చెబుతుంది. 

ఎవరో అర్థం కాకుండా అయోమయంగా చూస్తున్న అరణ్య    " నా పేరు వీళ్ళకి ఎలా తెలుసు "అనుకుని చూస్తూ ఉంటే నీ పేరు నీ గురించి నా కొడుకు అర్జున్ అంతా చెప్పాడు అందుకే ఒకసారి చూసి రమ్మని చెప్పడంతో నేను మా ఆయన వచ్చాము అని చెప్పి తాము తీసుకొచ్చిన గాజులు చీరని అరణ్యకిస్తూ బొట్టు పెట్టి వెళ్ళగా అరణ్యకి చాలా సంతోషం అనిపిస్తుంది.

వాళ్లు కారు ఎక్కుతూ పతంగితో మీ అయ్యగారిని ఒక్కసారి మా ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి వెళ్ళగా ప్రభ అక్కడికి వస్తాడు.

"ఏరా విషయం చెప్పకుండా నన్ను ఎంత ఆందోళనకి గురిచేస్తావా?"అని అరణ్య  అడిగేసరికి  "ముందే చెబితే త్రిల్లేముంటుంది  చెప్పు అందుకే నేను చెప్పలేదు నువ్వు ఇప్పుడు హ్యాపీనే కదా  'అని ప్రభ అడుగుతూ ఉంటే వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా హ్యాపీనా అని అడుగుతావేంట్రా. ఇంతకీ వాళ్ళు వస్తారని నీకు ముందే తెలిసిన ఎందుకు చెప్పలేదు.

  అరణ్య వాళ్ళు   ఇక్కడికొస్తారన్న విషయం కానీ వాళ్లు అర్జున్ అన్నయ్య తల్లిదండ్రులని గాని నాకు ముందు తెలియదు .అర్జున్ అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక అమ్మాయి ఉన్న ఇంటికి అబ్బాయి వాళ్ళు రావడం సహజమే కదా అని ప్రభ అంటూ ఉంటే "అది సహజమని నాకు తెలుసురా కానీ   వచ్చిన వాళ్ల కొడుకు కనీసం మీ పెద్దాయనతో కూడా ఒక మాట చెప్పకుండా  వాళ్ళ అమ్మ నాన్నల్ని  పంపించాడు చూడు అది నాకు అర్థం కాలేదు."

ఓ ! అదా అర్జున్ అన్నయ్య నిన్ను చదువుకునేటప్పుడు చూసాడంట .నీవు ప్లే గ్రౌండ్కి ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా కష్టపడి టీమని గెలిపించాలని నీ ఆటిట్యూడ్ తనకు నచ్చిందని నాతో చెప్పాడు లే.ఆ తర్వాత  పెద్దాయన మీకు సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో తను నాకు కూడా తెలియకుండా ఇక్కడికి వాళ్ళ అమ్మానాన్నకి అరన్య అనే ఒక అమ్మాయి ఉందని తన ఎమ్మార్వో అని చెప్పడంతో వాళ్లు ఇక్కడికి చూడడానికి వచ్చారు" అన్న ప్రభ మాటలు విని అంటే నాకు తెలియకుండా ఇన్ని విషయాలు జరిగాయన్నమాట. 

నాతో ఒక మాట కూడా చెప్పకుండా ఇలా చేస్తాడు ఏంటి అన్న అరణ్య మాటలకి , 'అంటే  అన్నయ్య నీకు కూడా పరిచయమే అన్నమాట' అంటూ ఒక్క అడుగు ముందుకు వేస్తాడు ప్రభ.

అవును, అర్జున్ గురించి నేను విన్నాను అతనితో బాగా అప్పుడప్పుడు గొడవలు పడ్డాను కూడా మొన్న కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కూడా కనిపించాడు. తను కూడా ఎంప్లాయ్ అని అరణ్య చెబుతుంది 

"అంటే నీకు కూడా అన్నయ్య సుపరిచితుడే అన్నమాట . నీ మాటలు వింటుంటే నీకు కూడా    అన్నయ్య అంటే ఇష్టం అనిపిస్తుంది ..

అవును, నువ్వు ఊహించింది  నిజమేరా తనంటే నాకు కూడా ఇష్టం 

  అయితే  ఇంకేమి వాళ్లు వచ్చినప్పుడు గురూజీ ఇంట్లో లేరు ఉండి ఉంటే ఒకరికొకరు పరిచయం చేసుకుని వాళ్ల గురించి  తెలుసుకునే వాళ్ళు  అయినా ఏదేమైనా కచ్చితంగా గురూజి ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంక భజంత్రీలు మోగుతాయన్నమాట "అని ప్రభ అనేసరికి చిరునవ్వు నవ్వుతుంది అరణ్య.

సరే అరణ్య అదే జరిగితే నాకు చాలా సంతోషం వెళ్ళొస్తానని చెప్పి వెళతాడు ప్రభ.

**
  గీతిక వాళ్ళ ఆఫీసులో
మరుసటి రోజు గీతిక ఆఫీసులో తన చాంబర్ కి వెళ్ళగా ఆఫీస్ బాయ్ వచ్చి పిలవడంతో రాణి మేడమ్ భర్తకి విష్ చేసి లోపలికెళ్ళి తన ప్లానింగ్ ని ఇవ్వగా అతను పరిశీలించి  " డెమో ప్రిపేర్ అయ్యావా? ప్రాజెక్టు కోసం వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు అని అడుగుతుంది రాణి. 

"ప్రిపేర్ అయ్యానని "గీతిక చెప్పగా గీతికని తమ పార్ట్నర్స్ అంతా కలిసి కూర్చున్న ఒక గదిలోకి తీసుకువెళతారు .
ఆమె పెద్దలకి నమస్కరించి డెమో స్టార్ట్ చేసి మొత్తం ప్లానింగ్ ని వివరించింది. అది విన్న వాళ్లు ప్లానింగ్ చక్కగా బావుందని చెప్పట్లు  కొట్టారు. వచ్చిన వాళ్ళు బయటికి వెళ్లడంతో గీతిక కూడా వెళదామని తన లాప్టాప్ , ప్లానింగ్ పేపర్స్ లని తీసి పెట్టుకోగా రాణి భర్త వచ్చి " కంగ్రాట్స్ గీతిక" అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వబోగా గీతిక ఒక్క క్షణం ఆలోచించి తను కూడా చిన్న స్మైల్ తో  చేతిని అందించడంతో అతను షేక్ హ్యాండ్  ఇస్తూ  "థాంక్యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ సర్ అంది .

 ఇట్స్ ఓకే అని తల ఊపుతూ బయటికి వెళ్లాడు అతను.

అన్ని సర్దుకుని  బయటికి రాగా లవ్లీ, మాలతి, మిగిలిన ఇద్దరు అబ్బాయిలు కనిపించకపోవడంతో మరో రూమ్ కి వెళ్లి తొంగి చూడగా నలుగురు గుసగుసలాడుతున్నారు.

 సార్ ఈరోజు గీతికని చీవాట్లు పెట్టాడేమో ఇంతసేపైనా రాలేదు. పాపం రాత్రంతా నిద్ర లేకుండా వర్క్ చేశానంది గీతిక అంది లవ్లీ.

 అవును, తను చాలా హార్డ్ వర్కర్   అనుకుంటా అంది మాలతి.

 అబ్బాయిలైతే ఏం మాట్లాడలేదు. గీతిక అక్కడ నిలబడకుండా తన చేంబర్కి వెళ్లి లాప్టాప్  బ్యాగ్ లో పెడుతూ ఉంటే ఆఫీస్ బాయ్ మళ్లీ వచ్చి "మేడం సర్ మిమ్మల్ని పిలుస్తున్నారు "అని చెప్పడంతో ఎందుకబ్బా!  నేను ఇంకా ఇప్పుడే కదా బయటికి వచ్చింది అనుకొని మళ్లీ డెమో రూమ్ కి వెళితే అక్కడ అతను కనిపించలేదు.

" అమ్మో!  ఇతనేంటి నన్ను ఒంటరిగా పిలుస్తున్నాడు అని ఓణి కొనని పట్టుకొని నొక్కుతూ పక్కనే ఉన్న మరో రూంలో చూడగా అతను కనిపించేసరికి" మే ఐ కమ్ ఇన్  సర్"? అని అడిగింది తడబడుతూ.

 "ఎస్,  కమ్ ఇన్ " అని  చెప్పి తలదించుకొని ఏదో పుస్తకం  తిప్పేస్తుండగా గీతిక వెళ్లి నిలబడింది.

 గీతిక వెనుకనే వచ్చిన లవ్లీ, మాలతీలు  రాణి మేడమ్ ఇప్పుడే బయటికి వెళ్లారు  . సర్ ఏంటి గీతికని లోపలికి పిలిచారు అనుకుంటూ డోర్ దగ్గరికి వచ్చి తొంగి చూస్తుండగా ఆ డోర్  కాస్త మూతబడడంతో వెనుదిరిగారు ఇద్దరు.

రాణి భర్త ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా రాణి నుంచి మెసేజ్ రావడంతో  అతను ఆ మెసేజ్ చూసి "గీతికా నాకు టైం లేదు  తర్వాత మాట్లాడతాను అని కృష్ణమురళి చెప్పడంతో  "సమయానికి మేడo మెసేజ్ చేశారు కాబట్టి సరిపోయింది. థాంక్యూ మేడం నన్ను బతికించారు అనుకుని బయటకు వచ్చింది గీతిక.

 వస్తున్న గీతిక వైపు చూసి మాలతి ఇంతకీ మ్యాటర్  ఏమై ఉండొచ్చు అంది లవ్లీ తో.

 ఏమో ఎవరికి తెలుసు ప్రాజెక్ట్ ఎలాగో ఫెయిల్యూర్ అయిఉంటుంది కదా ఇంకొక దాంట్లో సక్సెస్ అవుదామని ఏమైనా ప్రయత్నిస్తుందేమో అని లవ్లీ అంటూ ఉండగా పక్కనున్న జున్ను కల్పించుకొని  "అందరూ అందరిలా ఉండరులే వాళ్లకి ఆత్మాభిమానం ఒకటి చచ్చింటుదిగా దానిని ఎలా చంపుకుంటారు. ప్రపంచంలో గెలిచిన వాళ్ళు చరిత్రకి ఎక్కారు .పోరాడి ఓడిన వాళ్ళు చరిత్రకి ఎక్కారు. అంతేకానీ తలదించి తమఆత్మాభిమానాన్ని పోగొట్టుకోరు."   అని గుర్తు పెట్టుకోవాలి బావ అంది గుండు వైపు చూసి.

 ఇదొకటి దానికి వంతు పలుకుతుంది అని మూతి తిప్పుకుంది మాలతి.

 ఇలా పక్క వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్  చేసే ఐదేళ్లయిన ప్రమోషన్ లేకుండా " ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. " అంది మరోసారి జున్ను.

 మాలతి,  జున్ను ని ఏదో అనాలని నోరు కదుపుతుండగా గీతిక అక్కడికి రావడంతో సైలెంట్ అయ్యారు అందరు.

 గీతిక!  మేడం లేదు కదా  పి. ఏ వర్క్ లేదని ఈరోజు ఇక్కడికి వచ్చావా అన్న లవ్లీ తో, " మేడం లేరు. కానీ సర్ ఉన్నారుగా వర్క్ ఎవరికైనా ఒకటే. అయితే సార్ నన్ను ఈరోజు ఇక్కడే వర్క్ చేసుకోమని చెప్పారు అందుకే వచ్చాను అంది గీతిక.

  ఇక లవ్లీ సైలెంట్ అవడంతో  "జున్ను!  పెళ్లి ఫిక్స్ చేశారంట కదా." అడిగింది గీతిక.

 అవును, వారంలో పెళ్లి అందుకే మాకిచ్చిన పనిని ఈ రెండు రోజుల్లో ఫినిష్ చేసి పది రోజులు లీవ్ పెడుతున్నాం అని చెప్పింది జున్ను.

 అయితే ఇక బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నరన్నమాట.

 ముందు నన్ను అడుగు గీతిక నే చెప్తాను అంటూ "బ్యాచిలర్ లైఫ్ అంటేనే త్రిశంకు స్వర్గం ఉన్నట్లు ఏం చేద్దాం అక్కడి నుండి బయటికి రావాల్సిందే ఈ మరదలితో ఏగాల్సిందే "అన్నాడు జున్ను ని చూపిస్తూ గుండు.

 ఏ బావ!  అని జున్ను చేయి చూపించగా " లేదులే నీతో కలిసి సంసార సాగరాన్ని ఈది నిజమైన స్వర్గానికి వెళ్తా. " అన్న గుండు మాటలు కి నవ్వి ఇప్పుడు బాగా చెప్పావు అంది జున్ను నవ్వుతూ.

 అయితే ఆఫీసులో మీ చిలిపి గొడవల నుండి ఇక పది రోజులు మా చెవులు ఉపశమనం పొందుతాయన్నమాట అంది లవ్లీ కల్పించుకొని.

 అవునవును అది నిజమే అంది మాలతి.

 మాలతివైపు కోపంతో   చూసి గీతిక వైపు తిరిగి గీతిక!నిన్ను ఒక విషయం  అడగాలనుకున్న కానీ ఈ ఆర్గ్యూ మెంట్  లో మరచిపోయాను అంటూ ఉండగా ఆఫీస్ టైం కూడా అయిపోవడంతో ఎవరికి వారు వెళ్ళిపోయారు.

***
తన గదిలో అద్దంలో చూసి తల దువ్వుకుంటున్న ప్రభా గార్డెన్ హౌస్ వైపు ఓ లుక్ వేయగా గీతిక గేటును తీసి హుందాగా బ్యాగ్ తిప్పుతూ హాయిగా నవ్వుతూ ఓ చుట్టూ తిరిగి ఎదురుగా వచ్చిన జేజీని హగ్ చేసుకుని "నాకు చాలా హ్యాపీగా ఉంది జేజి" అని చెబుతున్న ఆమె లిప్స్ మూమెంట్స్ ని కళ్ళతో చదివిన ప్రభా " బహుశా మేడం గారి ప్రాజెక్ట్ సక్సెస్ అయి ఉంటుంది" అనుకున్నాడు మనసులో.

 రూమ్ కి వెళ్ళిన గీతిక ఫోన్ తీసుకొని నారాయణ కి ఫోన్ చేసి ప్రాజెక్టు విషయం చెప్పగా " కంగ్రాట్స్ బుజ్జి". యాక్చువల్లీ ఈరోజు సాయంత్రం నేను, బంగారం వద్దామనుకున్నాం కానీ మీ అమ్మ ఏదో పూజ చేస్తుందట ఈరోజు కచ్చితంగా ఉండాల్సిందేనని పట్టు పట్టింది. ఇక రేపటి నుండి వాడిని కోచింగ్ సెంటర్ కి పంపిస్తున్నా అని నాన్న చెప్పడంతో అలాగే నాన్న హాలిడే రోజు నేనే ఊరికి వస్తా అని చెప్పి , "నాన్న!  సాయంత్రం మా కొలీగ్స్ కి చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా. తాతయ్య,  జేజీలను కూడా బయటికి తీసుకెళ్లినట్లు ఉంటుంది అని గీతిక చెప్పడంతో "నీ ఇష్టం బుజ్జి" అని నారాయణ అనగానే "థాంక్యూ నాన్న" అని ఫోన్ కట్ చేసి జున్ను, గుండు, లవ్లీ, స్వాతి, మాలతి, మిగిలిన ఇద్దరు అబ్బాయిలకు ఫోన్ చేసి ట్రీట్ కి రమ్మని చెప్పి శైలు కి ఫోన్ చేయడంతో " ఎక్కడో బయట ఎందుకే మీ ఇల్లే ఒక బృందావనంలా  ఉంది అందులోనే ట్రీట్ ఇవ్వకూడదు అంది శైలు.

 అమ్మో !  వాళ్ళు , వీళ్ళు  అంటూ ఇంటికి తీసుకువచ్చి పార్టీ, పబ్బాలు చేయడం మా నాన్నకి ఇష్టం ఉండదు. "కొని తెచ్చి కొరవికి తెచ్చుకోవడం "అంటారు కాబట్టి "మధుర హోటల్" లో ప్లాన్ చేశాను కాబట్టి మీ ఆయన్ని కూడా  తీసుకురా లేదంటే నేనే కాల్ చేసి చెప్తాలే అనడంతో ఆయన డ్యూటీ మీద వైజాగ్ వెళ్లారు. రేపు సాయంత్రం వస్తారు అని శైలు చెప్పగా సరే నువ్వే రా మిస్ చేయకు అని చెప్పి మరొక నంబర్ నొక్కింది గీతిక.
"ఫోన్ రింగ్ అవుతుంది చూడరా" అన్నాడు ప్రభ.

 వస్తున్నారా . లేదంటే నువ్వే లిఫ్ట్ చేయి అని పప్పు అంటుంటే వద్దు బాబు మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు ఫోను నేను లిఫ్ట్ చేయను నువ్వే వచ్చి తీయి అని బెడ్ మీద పడుకున్నాడు ప్రభ.

 హలో!  అన్నాడు పప్పు కొత్త నెంబర్ నుండి వచ్చిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తూ.

 హలో బ్రో!  నేను గీతిక.

 చెప్పు గీతిక అని పప్పు అనగానే లేచి కూర్చున్నాడు ప్రభ.

 ఆ గీతిక వినిపిస్తుందా ? అంటూ స్పీకర్ ఆన్ చేశాడు పప్పు.