pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 21

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 21

ప్రాజెక్టు ప్లాన్ సక్సెస్ అయినందుకు ప్రభనీ పిలవకుండా పప్పుకి,  ఇంకా తన కొలీగ్స్ కి చిన్న ట్రీట్  ఇచ్చింది గీతిక. మధుర హోటల్లో నుండి ఇంటికి వచ్చిన గీతికకి రాత్రంతా నిద్ర పట్టలేదు . పదే పదే రాణి మేడం భర్త కృష్ణ మురళి చెప్పింది గుర్తుకొస్తోంది. ఏం చేయాలో ఏమో అర్థం కావడం లేదు. ఆ టెన్షన్ తో రాత్రి కొన్ని డ్రాయింగ్ షీట్స్ తీసుకొని ఏవేవో డ్రాయింగ్ వేస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయింది.

 తర్వాత రోజు ఆదివారం కావడంతో ఎప్పుడూ ఆలస్యంగా లేచే గీతిక తొందరగా లేచి మళ్లీ ఆలోచనలో పడింది. " సర్ నా ప్రాజెక్టు సక్సెస్ అయిందన్న సంతోషం ఎంతో సేపు నా మనసులో నిలవలేదు.  మీరు చెప్పిన మాటలతో నా మనసు సతమయితమైపోతోంది." అబ్బా!  ఏం చేయాలి అంటూ అటూ ఇటూ తిరుగుతుంటే కురలకి పెట్టిన క్లిప్ జారడంతో కురులు విచ్చుకోగా విసుగుతో మళ్లీ ముడేసుకుని అక్కడి నుంచి వడివడిగా   వస్తుంటే 11 గంటల సమయం ఓనర్ రమ్మనడంతో పప్పు బండి నడుపుతుంటే ప్రభా వెనక కూర్చున్నాడు . ఇద్దరూ రూము దగ్గర బయలుదేరడం చూసిన గీతిక ఇంటి వెనకాల ఉన్న గేటు దగ్గరికి పరిగెత్తుకొచ్చి  'పప్పు ఆగు!  అనేసరికి బండిని ఆపాడు పప్పు'.

" రేయ్!  ఎందుకు ఆపావ్ ముందు పద " అన్న ప్రభ మాటలకి ఒక్క నిమిషం రా అన్ని పప్పు అంటుంటే గీతిక వచ్చి ' పప్పు ! నాకు హెల్ప్ కావాలి ' అని అడిగింది.

 ప్రభ మాత్రం గీతిక వైపు చూడకుండా ఎటో చూస్తుంటే అది గమనించిన పప్పు చెప్పు గీతిక అన్నాడు.

 గీతక ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా  "అవసరానికి అమ్మాయిలు అబ్బాయిల్ని ఎంత బాగా వాడుకుంటారో  "అనుకున్నాడు ప్రభ.' పప్పు! నాకు టెక్నికల్ వర్క్ కి సంబంధించినది కొంచెం హెల్ప్ కావాలి.'అని గీతిక అనడంతో  "నాకు అవన్నీ తెలీదు వీడికి తెలుసు " అన్నట్టు  ప్రభావైపు బొటనవేలు చూపించగా  , ప్రభా మరోవైపు చూస్తూ ఉండడం చూసిన గీతిక ముఖం చిన్నబోయి ఇంటి వైపు తిరగగా , 'రేయ్ ప్లీజ్ రా' అని పప్పు అంటుంటే నువ్వు ముందు బండి పోనీ అని ప్రభ వాయిస్ పెంచేసరికి బండిని ఫోనిచ్చాడు పప్పు.
రూమ్ కి వెళ్ళిన  లాప్టా.ప్ ఓపెన్ చేసి తనే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయేసరికి ఏదో ఒక పని చేయాలంటే ఎవరో ఒక సపోర్ట్ కచ్చితంగా ఉండాలని అర్థమైంది గీతికకి.  లాప్టాప్ మూసేసి ఆకలేస్తున్న అన్నం తినాలనిపించడం లేదు.  నాకెంటో!  సండే  కూడా ఈ టెన్షన్ అనుకొని జేజితో అయినా కాసేపు మాట్లాడితే అలా మైండ్ రిలీఫ్ అవుతుందని వెళ్లి చూస్తే తాతయ్య జేజేలు ఇద్దరూ లేరు బహుశా బయటికి వెళ్ళారేమో అనుకొని టైం చూస్తే మధ్యాహ్నం రెండు గంటలవుతుంది. ఈపాటికి పప్పు రూమ్ కి వచ్చి ఉంటాడేమో అనుకొని ఫోన్ చేసి"  హలో పప్పు నేను  గీతిక. చెప్పింది ఏం చేసావు?  మీ ఫ్రెండ్ ని అడిగావా? ఏమన్నాడు?  .   నాకిది చాలా ఇంపార్టెంట్ వర్క్ దీని వలన ఒక జీవితం నిలబడుతుంది . లేదంటే దాని పరిణామం నా మీద పడుతుంది . ప్లీజ్ పప్పు అతనితో చెప్పవా అంటుండగా పప్పు రావడంతో ఫోన్ ప్రభ పప్పు చేతికి ఇవ్వగా చెప్పు గీతిక అన్న పప్పు మాటలు విని " ఏంట్రా ఎంతసేపు నేను చెప్పింది నువ్వేమీ వినలేదా "అడిగింది గీతిక.

 ఇంతసేపు నువ్వు మాట్లాడింది వాడితోనే గీతిక అంటూనే , "అవునా! అయితే అన్ని వినేశాడేమో ఇక అస్సలు ఒప్పుకోడు అని గీతిక అంటూ సైలెంట్ అవ్వడంతో గీతిక కాల్  కట్ చేసిందేమొ అని ఫోను టేబుల్ మీద పెట్టాడు పప్పు.

 ప్రభ ! ఒక అమ్మాయి అంతగా బతిమాలుతుంటే ఎందుకురా ఇంత మౌనంగా ఉన్నావ్ అడిగాడు పప్పు. 

 మౌనంగా ఉండక ఏం చేయాలి   నేనేం చేసినా తన నుండి ఎలాంటి స్పందన కూడా లేదు కాబట్టి మౌనమే సమాధానం అన్నాడు ప్రభా.

 అలా అనకురా.

 పప్పు , నీకేం తెలియదు నాతో మాట్లాడేది తనకి ఇష్టం లేనప్పుడు  నేను ఇచ్చే సలహా ఏమి ఇష్టమవుతుంది. నీకు తెలీదు , నాకు తెలిసి అది టెక్నీక్ తో తొలగిపోయే సమస్య కాదు. ప్రాక్టికల్ గా ఉంటేనే సమస్యకి పరిష్కారం ఉంటుంది . వదిలెయ్   తనకు నచ్చిన విధంగా తను చేసుకొని. ఎన్నాళ్ళని వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంది. తనకు సొంత ఆలోచన అనేది వస్తుందిలే. ముఖ్యంగా అమ్మాయికి కావలసింది మనో ధైర్యం.  అవన్నీ రావాలి అంటే తను సొంతంగా పోరాటం చేయాల్సిందే. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు తనకు ఐడియా ఉంది. ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తుంది అని చెప్పి ప్రభ కిందికి వెళ్ళాడు.  పప్పు ఫోన్ తీసుకోవాలని చూడగా ఇంకా కాల్ కట్ చేయకుండా అలాగే ఉన్నందుకు అరే నేను   గీతిక కాల్ కట్ చేసింది అనుకున్నానే అంటూ కాల్ కట్ చేశాడు పప్పు.

 పప్పు పొరపాటున  ఫోన్ కాల్ కట్ చేయకుండా పెట్టినప్పుడు ప్రభా అంటున్న మాటలు విన్న గీతిక అవును,  నేనెందుకు అన్నింటికీ వాళ్ల మీదే డిపెండ్ కావాలి నేను కూడా నా సొంతంగా ఆలోచించుకో లేనా ఈ సమస్యకి నేనే పరిష్కారం వెతుక్కోవాలి అనుకుంది గీతిక.

 ఆఫీస్ కి వెళ్ళగానే గీతిక కృష్ణ మురళి వచ్చాడేమో అని  అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఎక్కడ కనిపించలేదు. అప్పటికే రాణి మేడమ్ వచ్చి ఉండడంతో వెళ్లి తన పని తాను చేసుకో సాగింది .  గీతిక  ఫేస్  ఆందోళనగా కనిపిస్తూ ఉండడంతో రాణి మేడం  " ఏం గీతిక  ఆరోగ్యం బాగాలేదా అడిగారు. " " లేదు మేడం బాగానే ఉన్నాను కొంచెం నీరసంగా ఉంది అంతే. "  అని రాణి మేడమ్ తో చెబుతున్నా కూడా తన కళ్ళు మాత్రం కృష్ణమురళిని వెతుకుతూ ఉన్నాయి.

 లంచ్ అవర్ తర్వాత రాణి మేడమ్ ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళితే వెళ్లగా కృష్ణ మురళి వస్తారేమోనని ఆశగా చూసిన గీతిక రాకపోవడంతో ఫోన్ చేసి చెబుతాలే అనుకొని తన పని చూసుకుంది గీతిక.

గీతిక ఎప్పటిలా ఆఫీసుకు  పోయేటప్పుడు లేదా వచ్చేటప్పుడో తను చూడడమా లేదా నాతో ఒకటి రెండు మాట్లాడడం జరిగేది కానీ    ప్రభ ఎదురు రావడంతో చూడనట్టు వెళుతున్న గీతికను చూసి 'గొడవపడేటప్పుడే బాగుండేది కనీసం మాట్లాడేది మౌనం నాకు అస్సలు నచ్చదు మౌనాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను నాకనిపిస్తుంది.' "మాటల్ని తగ్గించే కొద్దీ దూరం కూడా అలాగే పెరుగుతుంది." అని మనసులో అనుకుంటూ వెళ్లిపోయాడు ప్రభ.

  తర్వాత రోజు  గీతిక వెహికల్ కోసం వెయిట్ చేస్తుండగా కృష్ణ మురళి అటువైపే రావడంతో కారు ఆపితే అటు చూసి విష్ చేసింది  గీతిక.

 కారు దిగి గీతిక ముందు నిలబడి"  థాంక్యూ వెరీమచ్ గీతిక చిన్నదానివైనా చాలా బాగా ఆలోచించావు. "అని అతను చెబుతుంటే 'ఇట్స్ ఓకే సార్ మీరు బాగుంటే ఆఫీస్ స్టాప్ మేము కూడా బాగుంటాం' అన్న గీతికతో గీతికా!  నీకు ఒక విషయం చెప్పాలనుకున్న అన్నాడు కృష్ణ.

 చెప్పండి సార్. 

 "నీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సాయం కావాలన్నా  మీ సార్ ఉన్నారని మర్చిపోకు "అని చెబుతున్న కృష్ణని చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది గీతికకి. 

 అలాగే సార్ అంటూ గీతిక తెలూపడంతో  "గీతిక! నేను కూడా ఆఫీస్ వైపు వెళ్తున్నాను 'అని అనబోయి వద్దులే పాపం అమ్మాయి ఇబ్బంది పడుతుందేమో అనుకొని మాటవరసకి వస్తావా గీతిక నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని అడిగాడు కృష్ణ.

 "నో థాంక్స్ సర్ బస్సు చేసింది మీరు వెళ్ళండి." అని గీతిక అనడంతో కృష్ణ వెళ్లిపోయాడు.

 కొద్ది దూరంలో పిల్లర్ వెనక నిలబడి వీరిద్దరి సంభాషణ వినబడకుండా వాళ్లు నవ్వుతున్న సందర్భాన్ని చూడకనే చూసింది లవ్లీ.

 ఏంటి వీళ్లిద్దరూ రోజు రోజుకి భలే క్లోజ్ అయిపోతున్నారే అనుకొని గీతిక బస్సు ముందు డోర్ లో ఎక్కగా లవ్లీ వెనకడోరులో ఎక్కింది.
గుర్తు చేసుకుంటూ ఉండగా వెనక నుండి చేయి తగలడంతో ఈ లోకానికి వచ్చింది గీతిక. వెనక్కి తిరిగి చూస్తే లైలా కనిపించేసరికి లైలా ! అంది గీతిక.

 చిన్న స్మైల్ ఇచ్చింది లైలా. లైలా కళ్ళు మాత్రం సీటులో కూర్చుని గీతిక వైపు చూస్తున్న మనిషి వైపే ఉంది అది బస్సు కాక పోయి ఉంటే వాడి కనుగుడ్లు పీకి బయటపడేసే దాన్ని అనుకుంది మనసులో లవ్లీ. అంతలో ఆఫీసుకు దగ్గరలోనే స్టాప్ లో బస్సు ఆపేసరికి   బస్స్టాప్ లో దిగి ఆఫీస్ చేరారు ఇద్దరు. 

 అప్పటికే జున్ను,  గుండులు ఇద్దరు వచ్చి స్టాఫ్ ని పెళ్లికి ఇన్వైట్ చేస్తుండగా గీతికను లవ్లీ ని కూడా ఇన్వైట్ చేశారు. మాలతి సెలవు పెట్టిందని చెప్పడంతో రాణి మేడమ్ ని కూడా ఇన్వైట్ చేసి గీతికకి మరోసారి చెప్పి వెళ్లారు ఇద్దరు. 

 గీతిక తను కంప్యూటర్లో ఏదో వర్క్ చేస్తూ ఉండగా రాణి అబ్జర్వ్ కని  అటు వచ్చి "|ఈ కంపెనీకి జాబ్ కి చేరిన తర్వాతే కృష్ణా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుండి చూస్తున్నా. ఎన్ని ప్రాజెక్టులు సక్సెస్ అయ్యాయి అయినా వాళ్ళకి ఏ బహుమతి ఇవ్వని కృష్ణ గీతికకెందుకు ఇవ్వాలనుకుంటున్నాడు. తనంటే కృష్ణకి అభిమానమా లేదా......  అనుకుని చ! చ! ఆయనకు అటువంటి ఆలోచన లేదు ఊరికే ఒకరిని అనుమానించడం భావ్యం కాదు అనుకుని వెళ్ళిపోయింది రాణి..

 పనిచేస్తున్న లవ్లీకి సడన్గా మెసేజ్ రావడంతో రాణి మేడం ఆఫీస్ రూమ్ కి  రాగానే మేడం తో     పర్మిషన్ తీసుకొని లీవ్ లెటర్ టైప్ చేసి గీతికకి సెండ్ చేసింది లవ్లీ.