pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 23

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 23

శ్రీహరి, లవ్లీ మోసాన్ని సహించలేక తన మనుషులతో ఆమెను చెంపేయమని చెబుతాడు. వాళ్ళ నుండి లవ్లీ తెలివిగా తప్పించుకుంటుంది.

 ఓనర్ కొత్త బిల్డింగ్ వర్క్ చూసి రమ్మని  చెప్పడంతో  వెళ్లాడు ప్రభ.

 మాలతి తో పాటు కృష్ణ మురళిని చూడడానికి వచ్చిన గీతిక పెద్ద బంగ్లా ను చూసి సర్వాళ్ల ఇల్లు ఎంత బాగుందో అనుకుంటూ ముందుకెళుతూ గేటు దగ్గరికి వెళ్లి మాలతి కోసం చూడగా మాలతి బండి దగ్గరే ఫోన్లో ఏదో మాట్లాడుతూ తలెత్తడంతో గీతిక రమ్మని పిలవగా ఏదో అర్జెంట్ కాల్ ఫైవ్ మినిట్స్ నువ్వు వెళ్ళు వస్తాను అనడంతో గీతిక లోపలికి వెళ్ళింది.

 చుట్టూ ఉన్న రకరకాల కాంపౌండర్ లోపల చుట్టూ ఉన్నారు రకరకాల పూల మొక్కల్లోని పూలను చూస్తుంటే చేతితో అలా తాగుతూ  ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది అన్ని ఫెసిలిటీస్ తో అద్భుతంగా ఉందని అనిపిస్తోంది. అయినా ఇక్కడ ఎక్కువసేపు కాలాన్ని  వృధా చేయకుండా కృష్ణ సార్ ని చూసి వెంటనే వెళ్ళిపోవాలి. అనుకుని గడప లోపలికి అడుగు పెట్టాలని చూసి మాలతి ఏంటి ఇంకా రాలేదు. అనుకుని వెనక్కి తిరిగితే గేటు మూసి ఉండడంతో లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరికి పరిగెత్తుకొచ్చి "మాలతి!  మాలతి!  ఎక్కడికెళ్లావ్? గేటు ఎవరు మూసారు?" అంటూ డోర్ ని తట్ట సాగింది.  కమ్మీల మధ్య నిడివి ఉన్న  , ఫ్లవర్ డిజైన్ తో ఉన్న ప్లాస్టిక్ డోర్ లాంటిది వేసి ఉన్నందువలన అవతలి వాళ్ళు కనిపించడం లేదు. ఎవరు క్లోజ్ చేసారో ఏంటో ఎందుకిలా చేశారు. కొంపదీసి నన్ను, మాలితి  మోసం చేసిందా ? చూడ్డానికి ఎంత బాగా నటిస్తారో జనాలు. ఇప్పుడేం చేయాలి. సార్ వాళ్ళు ఇల్లు ఇదేనని మాత్రం కన్ఫామ్ . అయితే "సార్ కి బాగోలేదన్నది మాత్రం అబద్ధం. "అని తల పట్టుకుని కిందకు కూర్చుంది గీతిక.

గాలి వేగంగా వేస్తూ ఉండగా చెట్ల ఆకులు చేసే శబ్దం పెద్దగా రావడంతో భయపడుతూ మెల్లగా లేచి లోపల సార్ గాని , మేడంగాని ఉన్నారేమో అనుకుంటూ ఇంటి మొదటి గడప దగ్గర నిల్చని లోపలికి తొంగి చూస్తే అంతా నిర్మానుషంగా ఉంది . ఇదేంటి ఇంత పెద్ద బంగ్లాలో నిశ్శబ్దం కమ్ముకుంది . మేడం వాళ్ళు లేరా? ఎక్కడికి వెళ్లారు ? బహుశా నేను లోపలికి వెళ్తే ప్రమాదమేమో!  ముందు ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం వెతకాలి.  అనుకుంటూ వెనక్కి తిరిగి అడుగు వేయబోతుండగా ఒక నీడ కనిపించడంతో భయంతో అరవడానికి ప్రయత్నించగా గొంతు పెకిలించే కి రాకపోవడంతో ఓనీని తీసి నోటి నిండా పెట్టి మరో అడుగు వేయబోవుగా ఆ నీడ కదులుతూ ఉండడం చూసి వణుకుతూ వెనక్కి తిరిగేసరికి శ్రీహరి కనిపించడంతో "అమ్మయ్య !  రాణి మేడమ్ తమ్ముడు "అనుకొని ఊపిరి పీల్చుకున్నా ,   లోపల ఉన్న భయం అక్కడ నిలబడదు. "అంటుంటే అడుగు వేగం పెంచింది గీతిక.

 అటు, ఇటు చూస్తూ దారి ఎటు ఉందో తెలియక తల మీద చేతులు పెట్టుకుని తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక ముందుకు వస్తుంటే ఎదురుగా నిలబడ్డాడు శ్రీహరి.

 "ఆ లవ్లీ ని  ఓకే అనుకున్నాను కానీ డబ్బు పిచ్చిది. నన్ను మోసం చేసింది. ఇక ఈ అమ్మాయిని నమ్మకూడదు.'చెరుకులో రసం ఉన్నంతవరకు పిలిచి పిప్పిని పడేయాలి ". అని మనసులో అనుకొని ముందుకు వచ్చి ఏంజెల్ అన్నాడు శ్రీహరి. 

 సర్, మీరెవరో నాకు తెలుసు. "మేడం తమ్ముడు కదా! " నా పేరు ఏంజెల్ కాదు గీతిక అంది గడుసుగా. 

 నీ పేరుతో నాకు పని లేదు నేను నిన్ను ఏంజెల్ అనే పిలుస్తాను.
సార్ ముందు పక్కకు జరగండి నేను వెళ్ళాలి.

 ఎక్కడికి?

 'బయటికి 'అంది  గీతిక.

 ఇంతకీ వచ్చింది ఎందుకు? పోయేది ఎందుకు? 

 నా బుద్ధి గడ్డి తిని దాని మాయమాటలు నమ్మి ....అని కోపంతో చెప్పింది గీతిక.

 ఎలాగైతేనేo , ఏంజెల్ ని ఆ దేవుడు నా కోసమే పంపించినట్టున్నాడు.  అనుకుని గీతికని చూడడంతో "ఏంటి వీడు చూపు మారింది. "అనుకుంటూ  అడుగు వెనక్కి వేసింది గీతిక.

 నవ్వుతూ మౌనంగా తన అడుగులో అడుగు వేస్తూ వస్తున్న శ్రీహరిని చూసి గుండెల్లో దడ ప్రారంభమైంది. కళ్ళల్లో భయం కమ్మేస్తుంటే కాళ్లకు పరిగెత్తమని పనిపెట్టింది గీతిక.

 "ఏంజెల్ ! నువ్వు ఎంత పరిగెత్తినా ఇక్కడి నుండి బయటపడే మార్గం నీవు చేరలేవు." అన్న శ్రీహరిmo మాటలు వింటూనే గుండె ఆగినంత పని అయింది గీతికకి . నిలుచున్న చోటే కుప్ప కూలిపోయిన గీతిక దగ్గర నిలబడి  "ఏంజెల్ ! నేను ప్రాజెక్టు ప్లానింగ్ రోజు నిన్ను చూసినప్పటినుండి మాట్లాడించాలని అనుకుంటూనే ఉన్నా కానీ ఆ సందర్భం రాలేదు. ఇవాళ చిలక వచ్చి పంజరంలో ఉంటే నాకింక పండగే సుమా " అన్నాడు శ్రీహరి.

 ఛీ   స్టుపిడ్ అంటూ మరొకవైపుకు జరుగుతున్న గీతికను  "చూడు! నేను ఇంతవరకు ఎంతోమంది అమ్మాయిలని చూసాను . కానీ నీలాంటి చందమామను చూడలేదు. ఒక్క పది నిమిషాలు నాకోసం స్పెండ్ చేస్తే నీవు ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తా ఒకవేళ డబ్బు వద్దు అంటే నా గెస్ట్ హౌస్ లో ఉంచుకుంటా మహారాణిలా  "అని నవ్వుతూ గీతిక వైపు  చూసి ఈ రెండిటిలో ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పాడు శ్రీహరి.

 తలెత్తి చూసిన గీతిక కళ్ళు ఎర్రబడ్డాయి. కనుబొమ్మలు ముడిపడి కోపంగా చూస్తూ  "ఆడపిల్లలంటే సంతలో అమ్మకానికి పెట్టిన ఆవులనుకున్నావా ! అందరూ అలాగే ఉంటారా ఏంటి నీ డబ్బు చూడు నువ్వు చూడు ముందు నన్ను బయటకు పోనీ లేదంటే " అంటూ బ్యాగ్  కోసం చూస్తే  'అయ్యో! ఆత్రంలో ఫోన్ కూడా మర్చిపోయి వచ్చానే' అని అనుకుని అటువైపు చూడగా శ్రీహరి గట్టిగా నవ్వి " పట్టు,  ఎవరికి కాల్ చేస్తావో చెయ్ అని ఫోన్ బయటికి తీసి మళ్లీ లోపల పెట్టుకోబోగా మొబైల్ జారి పక్కనున్న నీటి సంపులో పడిపోయింది. అయినా దాని గురించి ఆలోచించకుండా గీతిక వైపు చూస్తూ నా టైం వేస్ట్ చేయకు అంటూ దగ్గరికి వస్తుంటే  "ప్లీజ్ రావద్దు " అంటూ గీతిక చేతులు అడ్డం పెట్టగా ! "చూడు ! నాకున్నది కేవలం గంట మాత్రమే ఆ తర్వాత మా బావ వస్తారు హాయిగా నేను గంట సేపు నిద్రపోయే వాడిని ఈ గుమగుమలాడే మల్లెపూవు కనిపించగానే ఆ పరిమళానికి  నిద్రమత్తు పోయి వేరే మత్తు ముంచుకొస్తోంది.  నువ్వు గాని సహకరించకపోతే నా జీవితాంతం నిద్ర లేకుండా చేస్తావు  " అంటూ ఆమె భుజాన్ని గోకడంతో కోపం వచ్చి చంపచెళ్ళు మనిపించింది గీతిక.

 దెబ్బ తగిలిన చెంపని చేతితో తడుముకుంటూ గీతిక చెయ్యి పట్టుకొని ఇంత మృదువైనా చెయ్యి నా చెంపని తాకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని  తన పెదవుల్ని ఆమె చేతి దగ్గరికి తాకానివ్వ భోగ ఆమె తన చేతిని చెటుక్కున వెనక్కి తీసుకోవడంతో   పళ్ళు కొరుకుతూ మరి కోపంతో  "ఏంటి నన్ను కొడతావా? ఆడదాని అంగీకారం లేకుండా నేను ఇప్పటివరకు అనుభవించింది లేదు కానీ నువ్వెందుకొ నాకు ప్రత్యేకంగా   అనిస్తున్నావు " అందుకే నీకు రెండు ఛాన్సులు ఇచ్చాను కానీ నీకు రెండు  చాన్సులు కూడా వద్దని మొండికేస్తున్నట్టున్నావ్.  ఇంత సేపు నన్ను ఆడుక్కునేలా చేసావ్ . ఇక లాభం లేదు, నిన్ను ఎత్తుకెళ్లాల్సిందే! అంటూ గీతికని ఎత్తుకొని భుజం మీద వేసుకోవాలని అనుకొని ఎత్తుకోబోగా కాలితో అతని ఎదపై తన్ని కాంపౌండ్ లో ఎక్కడైనా తప్పించుకునే మార్గం కనిపిస్తుందని పరిగెత్త సాగింది గీతిక.

 ఎదను తడుముకుంటూ కోపోద్రిక్తుడై పైకి లేచిన శ్రీహరి పరిగెత్తి వస్తే , గీతిక ఒక పెద్ద ఒక చెట్టు వెనక దాక్కుని నొక్కి చూడగా ,అటు ఇటు తిరుగుతున్న శ్రీహరి మరో చిన్న గేటు దగ్గరికి వెళుతూ ఉండడంతో " అయ్యో!  చెట్టు ఎక్కడం నేర్చుకుని ఉంటే బాగుండేది " ఎలాగూ కాంపౌండ్ పక్కనే ఉంది అవతలికి జంప్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఈ టైంలో కచ్చితంగా ప్రయత్నం చేయాలి అనుకుని శబ్దం రాకుండా అలా పట్టుకొని ఎక్కి కాంపౌండ్ మీద నిలబడగానే వచ్చి వచ్చి చూసిన శ్రీహరి వెంటనే చెట్టు నెక్కుతూ ఉండడంతో అవతల ఏముందో అని కూడా చూడకుండా గీతిక కాంపౌండ్ వాల్ పై నుండి కిందికి దూకి పరిగెత్తుతూ ఉండగా శ్రీహరి కూడా కాంపౌండ్ వాల్ పైనుండి దూకి గీతిక వైపు పరిగెత్తి ఆమె వొణీ  లాగడంతో గొంతు దగ్గర  నొప్పి రావడంతో దగ్గుతూ కింద పడబోయి మళ్లీ పరిగెత్తసాగింది  గీతిక.

 హమ్మయ్య ! ఎలాగో బావ ఇల్లు దాటి బయటకు వచ్చాను. ఇప్పుడు ఫ్రీగా అనుభవించొచ్చు అనుకొని "అస్సలు వదలకూడదు దాన్ని " అంటూ గీతిక దగ్గరికి చేరాడు శ్రీహరి అతన్ని చూస్తూనే అక్కడ పడిన ఇటుక తీసి విసరగా అతనికి   కాలికి తగలడంతో తుడుచుకుని  రెండు అడుగులతో గీతికని చేరాడు శ్రీహరి.
పిల్లర్ వెనక వేగంగా గాలి పీల్చి వదులుతూ కంట్రోల్ చేసుకునే భయపడుతున్న గీతిక ను చూసిన శ్రీహరి వెనక నుండి వెళ్లి ఎగురుతూ ఉన్న ఆమె ఓణీ ని అలా తన చేతులతో చుడుతూ గాలికి ఎగురుతున్న ఆమె వెంట్రుకలను దగ్గరికి ముఖం పెట్టి అలా వెళుతూ ఉంటే ఆస్పర్ష తగలగానే  గట్టిగా అరిచిన గీతిక ఇంకా ముందుకెళ్లాలని ప్రయత్నించగా చేయి పట్టుకోవడంతో ఏడుస్తూ గింజుకుంటున్నా అతని బలానికి తన బలం సరిపోవట్లేదు వెంటనే ఆమె ఓనీ నీ లాగి వెనక్కి విసిరి గీతిక జుట్టు పట్టుకొని లాగేడు శ్రీహరి.

 విసిరినవోణి గాలికి ఎగురుతూ ఓనర్ బిల్డింగ్ చూసి పక్కనే ఉన్న మరో బిల్డింగ్ ఎలా ఉందో చూడాలని వెనక నుండి వస్తున్న ప్రభ ముఖం మీద పడడంతో ముఖం మీద వొణీ ని తీస్తూ ఇదేంటి ఎవరో అమ్మాయి వొణీ అయినట్టుంది. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి ఎందుకు వచ్చింది .ఎవరిదై ఉంటుందబ్బా ! అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ అడుగు ముందుకు వేసి ఓహో ! ఎవరైనా  "లవ్ బర్డ్స్ " ఉన్నారేమో మనకెందుకులే అనుకుంటూ వొణీ  ని పడేయాలని చూస్తుండగా అమ్మాయి అరుపు వినబడే సరికి అటు రెండు అడుగులు వేయగ గీతిక పిల్లర్ ముందు పరిగెత్తబోయి పడిపోడంతో జుట్టంతా విరబోసి ఉండడంతో ఎవరనేది అర్థం కాలేదు.  కొంచెం ముందుకెళ్లి చూద్దామని పరిగెత్త భోగ శ్రీహరి ఆమె కాలు పెట్టి గోడ వెనక్కి లాగడంతో అరవడానికి ప్రయత్నించిన గీతికకి మాటలు రాకపోవడంతో తల తిప్పి మూగబాదను ఎక్స్ప్రెస్ చేయడం చూసి  గీతిక!  అంటూ ప్రభా పరిగెత్తి వెళ్లి శ్రీహరిని నాలుగు తన్నాడు . ఇద్దరి మధ్య హోరా హోరీగా మల్ల యుద్ధం జరిగినట్టయింది. అయినవాడు ప్రధాని తోసేసి గీతికని పట్టుకోబోగా బిల్డింగ్ కట్టడానికి వేసిన ఇటుకలు, రాళ్లు ఉండగా దొరికిన దాన్ని తీసుకొని చితకబాధగా ఇక యుద్ధం చేసే ఓపిక లేక కిందపడ్డాడు శ్రీహరి . 

ఓణీ నీ తీసీ గీతికకిచ్చి  పద వేళదాం అన్న ప్రభని కళ్ళు పెద్దవి చేసి  చూసింది గీతిక రానని తలూపుతూ.

 హేయ్ నీకేమన్నా పిచ్చా ముందు బండెక్కు ఇంకాస్త ఉంటే  వాడి చేతిలో... అని తల మీద చేయి పెట్టి గీతిక వైపు తిరగడంతో నేను రానoది గీతిక .