pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 28

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 28

లాయర్ లవ్లీ వైపు చూడడంతో మళ్లీ చెప్పడం ప్రారంభించింది లవ్లీ. శ్రీహరి మనసు పడ్డ అమ్మాయి పనిచేసేది కూడా ఈ కంపెనీలోనే శ్రీహరి తనని చూసిన మొదటి రోజు నుండి అతనిలో మార్పు గమనించాను. నేను చివరి రోజు గెస్ట్ హౌస్ కి వెళ్ళిన రోజు కూడా నాతో ఇంతకుముందులా ఉండింది లేదు అందుకే ..... అని లవ్లీ ఏదో చెప్పబోగా అందుకే   "శ్రీహరిని చంపాలని ప్లాన్ చేసావా?" అన్నాడు లాయర్ కల్పించుకుని. 

 చి!చి! నేనెందుకు అతనిని చంపాలనుకుంటాను. అసలు నాకు  ఆ ఉద్దేశమే లేదు. ఎందుకంటే అతను నన్ను ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు.

 మరి లక్షని కోటిగా ఎందుకు మార్చావు.

 ఆ సమయంలో నాకు డబ్బు చాలా అత్యవసరం అది కాక అతనికి నాలోని నా మీద అభిరుచి తగ్గింది కాబట్టి సెటిల్ అవ్వాలని అందుకే అలా చేశాను.

 అయితే శ్రీహరి ఎలా చనిపోయాడు.

 అది నాకు తెలీదు.

 పోనీ నీతో పని చేసే అమ్మాయి ఎవరు తనెం తన నేమ్ చేసావ్.? అసలు ఉందా ?లేదా?  అని లాయెర్  ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ  ఉన్నాడు.

 ఆ అమ్మాయి కాలేజ్ డేస్ నుంచి నాకు చాలా వాటిలో పోటీగా నిలిచింది..ఇక్కడ కూడా నాకు పోటీ అని... మాటలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది లవ్లీ.

 ఆ... అనిపించగా అనే లాయర్ మళ్లీ అనడంతో,

 నేను ఆ అమ్మాయిని మేడం ఏదో అర్జెంట్ వర్క్ ఉండి ఊరెళతారని తెలిసి సర్ ఒక్కరే ఉంటారని తను ఎవరు లేనప్పుడు సార్ దగ్గర ఉంటే మేడం ఆ అమ్మాయిని  అనుమానించి జాబ్ నుండి తీసివేస్తారని అనుకొని నా స్కూటీ ఇచ్చి పంపించాను అని చెప్పింది లవ్లీ.

 అది వినగానే రానికీ తనని చంపేయాలని అంతా కోపం వచ్చింది కృష్ణ మురళి అయితే పైకి లేచి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి చూసిన దాన్ని చంపేస్తాను అని అంటుంటే రాణి చెయ్యి పట్టుకుని కూర్చోమని సైగ చేయడంతో కూర్చున్నాడు కృష్ణ.

 ఇంతకీ అమ్మాయి పేరు చెప్పలేదు అన్నాడు లాయర్.

 లవ్లీ మరొక్కసారి డోర్ వైపు చూడగా ప్రభ అక్కడే నిలబడి ఉండడం చూసి మాలతి అని చెప్పింది లవ్లీ.

 ఆ అమ్మాయి ఎక్కడ అడిగాడు లాయర్.

 తను చనిపోయింది.

 అలాంటప్పుడు శ్రీహరిని ఎవరు చంపారు లాయర్ ప్రశ్న.

 అది నాకు తెలీదు,తెలియదు,తెలీదు అతను చనిపోయాడని తెలిసి ఉంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు

 మాలతిని కృష్ణ సార్ వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు శ్రీహరి అక్కడ ఉన్నాడని నీకు తెలీదా  మళ్ళీ ప్రశ్నించాడు లాయర్.

 సర్ తెలీదని చెప్పానుగా ."నేను కృష్ణ సార్ ఉంటారని అతనికి హార్ట్ ప్రాబ్లమ్ ఉందని అతన్ని చూడడానికి నేను కూడా వస్తున్నానని చెప్పాను అందుకే ఆ అమ్మాయి సార్ ఇంటికి వెళ్ళింది అప్పుడు అతను ఎందుకు ఉన్నాడో, సార్ ఎందుకు లేడో నాకు తెలీదు. " అంటుంటే "కృష్ణ మురళి ! కృష్ణ మురళి! " అనడంతో అతన్ని జడ్జి పిలవగా రాని లేచి నిలబడి సర్ నేను మా ఆయన అంటుంటే  ..ఇక్కడికి వచ్చి మాట్లాడమ్మా అని జెడ్జ్  చెప్పడంతో రాణి లేచి వెళ్లి బోన్లో నిలబడి " సర్ నేను మా ఆయన ఊరు వెళ్దామని బయలుదేరుతుండగా వాడు రాత్రంతా నాకు నిద్ర లేదని కొద్దిసేపు పడుకుని వస్తానని చెప్పడంతో నేను మా ఆయన ఇద్దరు ఊరికి వెళ్ళాము. "అని రాణి చెప్పడంతో ' సరే మీరు ఇక వెళ్ళొచ్చు' అన్న జడ్జి గారి మాటలతో రాని వెళ్లి కూర్చుంది.

 మళ్లీ  లాయర్ కల్పించుకొని అయితే శ్రీహరి మాలతి వల్లే చనిపోయిందంటావ్ అనడంతో ' ఉండొచ్చేమో' నాకైతే తెలీదు అంటుంటే లాయర్ జడ్జ్ వైపు తిరిగి  "యువరానర్!    దోషి ఆపరాధము తనకు తెలియదని చెబుతోంది అక్కడ జరిగిన విషయం చెప్పడానికి ఆ అమ్మాయి లేదు . ఇక అసలు వ్యక్తి శ్రీహరి.    శ్రీహరి  ఎలాంటి ఆధారాలు లేకుండా కరెంట్ షాక్ తోనే మృతి చెందాడని పోస్ట్మార్టం చెబుతోంది. 

ఏది ఏమైనా శ్రీహరి చావుకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రం ఈ దోషి కారకు రాలే."అని లాయర్ అంటూ ఉండగా లవ్లీ ఏడుస్తూ నిజంగా నేను శ్రీహరిని చంపాలని ఎప్పుడూ అనుకోలేదు సార్. నన్ను నమ్మండి అయ్యో ! ధన వ్యామొహం  వల్ల ఎంత పని జరిగిపోయింది అందుకే  "ఆలోచించు లవ్లీ, డబ్బు మనం కష్టపడి సంపాదిస్తే మనకు కష్టంలో తోడవుతుంది. పేరాశగా వచ్చిన డబ్బు అలాగే నీరు గారి పోతుంది ."అని అన్నయ్య ఎన్ని సార్లు చెప్పాడు అయినా నేను వినిపించుకోలేదు అటు అన్నయని హింసించాను.ఇటు శ్రీహరిని  చంపించినట్టయింది అనీ రోదిస్తూ అటు ఇటు చూసి ఇక నేను బతికి ప్రయోజనం లేదు అని మనసులో అనుకొని పక్కన నిలబడిన కానిస్టేబుల్ పాకెట్ నుండి గన్ తీసి ఎదపై పెట్టి కాల్చుకుంది పోలీసులు అడుగులు కదిలించే లోపు తన ఊపిరి గాలిలోకి కలిసిపోయింది.

లవ్లీ కోర్టులోనే చనిపోవడంతో అక్కడినుంచి ఎవరికి వారు వెళ్లిపోతున్నారు.  తన తప్పుకి తానే శిక్ష విధించుకుంది అని ఒకరు , ఆడపిల్ల అనకువగా ఉండాలి మరి ఇలా తయారైపోతున్నారు ఏంటి   అని మరొకరు, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారని కొందరు మాట్లాడుకుంటూ వెళుతున్నారు.  రాని,  కృష్ణలిద్దరు ఇంటికి వెళ్లారు. చివరగా భుజంగం కొడుకుని తలచుకుని భారమైన మనసుతో  పైకి లేస్తుండగా" భుజంగం గారు" అన్న తన లాయర్ మాటలు విని అటు తిరిగాడు భుజంగం.

 "చూడండి! నిజంగా నీ కొడుకు కేసు ఎంత ఈజీగా క్లోజ్ అవుతుందని నేను అనుకోలేదు." అన్నాడు లయర్.

 "మరెలా అనుకున్నారు. " అడిగాడు బుజంగం.

   "నాకు తెలిసి లవ్లీ ఆ సమయంలో అక్కడ లేదు కాబట్టి తనకు అక్కడ ఏం జరిగిందో తెలీదు. నేను నా అనుభవంలో ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. " అన్న లాయర్ మాటలు విని సరే లాయర్ గారు మీరు చెప్పింది నిజమే అనుకుంటే ఆ కాముకిలిద్దరూ చచ్చారు కదా ఇక ఆధారాలు ఏముంటాయి అన్నాడు భుజంగం.

" ఉండొచ్చు "అదేంటంటే మీ కూతురు ఇంటి దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉంటాయి కదా వాటిని చెక్ చేసి చూడండి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో వాటిని తీసి చూడండి ఒకవేళ అక్కడ ఏమి లేదు ఏమీ లేదంటే ఇక మనం ఈ కేసు గురించి మర్చిపోవాల్సిందే అన్నాడు లాయర్.

 లాయర్ గారు మీరు మీ సమస్య కాదు కాబట్టి మర్చిపోవచ్చు కానీ నేను మరవను నిజంగా వాడిది సహజ మరణం కాదు అని తెలిస్తే అలా చేసిన వాళ్ళని చంపకుండా నిద్రపోను. అంటూ పక్కనున్న మనుషులతో వెళ్లి రాణి తో చెప్పి ఆ సీసీ కెమెరాలు తీసుకురండి.అని చెప్పగా " భుజంగము గారు!  ఇలాంటివి మీరు ముందుండి చేయిస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఏ కొంచెం మిస్సయిన ఆధారం కూడా మిస్ అవ్వచ్చు. " అని లాయర్ చెప్పడంతో అయితే నేను కూడా వస్తాను అంటూ బయలుదేరుతుండగా భార్య ఫోన్ చేయడంతో భుజంగం ఫోన్ తీసి ఏదో వినగానే త్వరగా బండి తీయండి అంటూ కృష్ణ మురళి నిలయానికి రావడంతో రానే స్పృహ తప్పి పడి ఉండడం చూసి చాలా ఆందోళన' రాణీ ! రాణీ ! అంటూ లోపలికి వచ్చాడు భుజంగం. 

 "కృష్ణ! అమ్మాయికి ఏమైంది " ముందు హాస్పిటల్ కి వెళదాం పదండి అంటూ భుజంగం తొందర పెడుతుండగా డాక్టర్ అమ్మ లోపలికి రావడంతో కృష్ణ ఎదురుగా వెళ్లి తీసుకుని రాగా రాణి అమ్మ కృష్ణ ఇద్దరు కూడా లోపలికి వెళ్లారు.

 బెడ్ మీద ఉన్న రాణిని కనురెప్ప ఓపెన్ చేసి చేతిని పట్టుకుని నాడీ పరీక్ష చేసి చెక్ చేస్తుంటే కృష్ణ డాక్టర్ ముఖాన్ని చూస్తు' ఏమి చెప్పకుండా ఎంత సేపు చెక్ చేస్తోంది అనుకుంటూ ఉండగా' ఆమె కృష్ణ వైపు తిరిగి చిరునవ్వుతో చూడగా 'అమ్మయ్య 'అంటూ ఊపిరిపించుకున్నాడు కృష్ణ.

 డాక్టర్ అంటూ  రాణి అమ్మ డాక్టర్ ముఖం చూడడంతో ఆమె అటు తిరిగి " చింతించవలసిన అవసరం లేదు మీరు అమ్మమ్మ కాబోతున్నారు. " అని చెబుతుంటే కృష్ణ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. "థాంక్యూ డాక్టర్ "అని చెప్పి కార్లు డాక్టర్ని కార్లో పంపించి లోపలికి వస్తూ ఉండగా భుజంగం కృష్ణ ఏం చెప్పారు డాక్టర్ అని అడిగే సరికి " మావయ్య, మీరు తాతయ్య కాబోతున్నారు. "అని చెప్పగానే భుజంగం మనసులోని భారం  తగ్గిపోయింది.మనసు ప్రశాంతంగా మారిపోయింది. చాలా చల్లని వార్త చెప్పావంటూ కూతురు గదికెళ్ళి బెడ్ మీద అప్పుడే కళ్ళు తెరుస్తున్న కూతుర్ని చూసి చిరునవ్వు నవ్వుతూ నుదుటిపై చేయిపెట్టి, చేతితో తల  నిమరగా' నాన్న 'అంటూ పలకరించింది రాణి.

 రాణి ! లేవకు పడుకో రెస్టు తీసుకో అమ్మ రెండు రోజులు ఇక్కడే ఉంటుంది అని భుజంగం చెబుతుంటే 'నాకేమైంది నాన్న నేను బాగానే ఉన్నాను గా ఇంతకీ కృష్ణ ఎక్కడ'  అని అడుగుతుంటే 'మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు ఒకర్నూదిలి  ఇంకొకరు ఒక్క      క్షణం కూడా ఉండలేరు. ఒకవేళ నిన్ను ఇంటికి తీసుకెళ్లిన నీ మొగుడు అక్కడికి ఎక్కువగా రాడు కాబట్టి నువ్వు ఉండలేవు వాడికి నువ్వంటే ప్రాణం అందుకే నీకోసం అమ్మని వదిలి పెడుతున్నా జాగ్రత్త ' అని చెబుతుండగా కృష్ణ వచ్చేసరికి ఇదిగో మీ ఆయన వచ్చాడు చూడు వాడి నోటితోనే  శుభవార్త విను అని చెప్పి భుజంగం బయటికి రావడంతో రాణి లేవపోతే  కృష్ణ  రాణిని పడుకో అని పడుకోబెట్టి ప్రేమగా తల నిమురుతూ ముద్దు పెట్టి అలాగే పెదవుల్ని చెవి దగ్గరికి రానిచ్చి చెవిలో చెప్పగా చాలా ఆనందం అనిపించింది రానికి. కడుపుని తడుముకుంటూ కృష్ణ వైపు చూడగా తను అక్కడ చెయ్యి పెట్టి మరోసారి ఆమె వైపు చూస్తూ "కంగ్రాట్స్" అన్నాడు కృష్ణ.  "నాకేనా నీకు కంగ్రాట్స్" అంది నవ్వుతూ రాణి.