pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 35

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 35

పెద్దాయన ప్రభను అర్జున్ వాళ్ళ ఇంటికి వెళదామని పిలవడంతో ఇద్దరు వెళ్లినా అక్కడ లోపలికి రానివ్వక పోవడంతో పెద్దాయన బాధపడుతూ ఉండగా " అందరికీ ధైర్యం చెప్పే మీరే ఇలా అధైర్యంగా ఉంటే ఎలా 
గురూజీ,  సమస్యలనేవి కామన్ గా వస్తూనే ఉంటాయి కానీ మనం వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి ,అంతే కానీ మరి ఇంత మైనస్ గా తీసుకోకూడదు .మనం ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించాలి కచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది . మీరు ముందు బాధపడకండి సీటు బెల్టు పెట్టుకోండి " అని చెబుతున్నా అతను వినిపించుకోకుండా ఉన్నందుకు తనే సీట్ బెల్ట్ పెట్టి, తాను పెట్టుకుని బండిని కాస్త వేగంగా నడుపుతూ ఫామ్ హౌస్ కి చేరుతాడు.
పెద్దాయనని ఇంటికి తీసుకెళ్లేసరికి సాయంత్రం 6 గంటలు అవుతూ ఉండగా, "ఈరోజు ఇతన్ని వదిలి నేను ఊరికి వెళ్లడం అంత బాగుండదు. ఈరోజు ఇక్కడే ఉంటేనే బాగుంటుంది," అనుకొని అతన్ని మంచం మీద పడుకుని ఉంటే, తను కట్టమీద కూర్చొని ఉంటాడు.

వెహికల్ సౌండ్ వినిపించిన తర్వాత అరణ్య లోపలి నుంచి వస్తూ ప్రభను చూసి కట్ట దగ్గరికి వస్తుంది.
"హలో! ప్రభ ఏంట్రా మీ పెద్దాయనని ఎక్కడ కలిశావేన్టి? సాయంత్రం ఇద్దరూ కలిసి వస్తున్నారు."

"లేదు అరణ్య, ఇక్కడికే రావాలని వస్తూ ఉంటే వెహికల్ రావడంతో నేను కూడా బండిలోనే ఎక్కి వచ్చాను."
"మరి తను ఎందుకు పడుకున్నారు?"
అలసిపోయినట్టున్నారేమో!
"కాఫీ ఏమైనా తీసుకురానా" అడుగుతుంది అరణ్య.
"ఓకే, అడిగి మంచి పని చేశావు ముందు ఓ గ్లాస్ కాఫీ తీసుకురావా నాకు కూడా చాలా హెడ్ ఏక్ గా ఉంది."
అరణ్య కాఫీ తీసుకొస్తుంది. "ముందు ప్రభ కి ఇచ్చి తర్వాత పెద్దాయనకి ఇవ్వాలని అనుకుంటుండగా" "నేను ఇస్తాను " అని ప్రభ కాఫీ గ్లాసు చేతికి తీసుకోవడంలో " సరే నాకు కంప్యూటర్ వర్క్ ఉంది ఇక్కడికి ల్యాప్‌టాప్ ఇక్కడికి తెస్తాను కాసేపు కూర్చున్నట్టు అవుతుంది నాకు కూడా బోర్ కొడుతోంది కదా అని చెప్పి లోపలికి వెళుతుంది.
"గురూజీ కాఫీ అయినా తాగండి ."అంటూ కాఫీ కప్పు ముందుకు పెడతాడు ప్రభ.
వద్దు ప్రభ "అంటూ మరో వైపుకు తిరుగుతాడు పెద్దాయన.
తాగండి గురూజీ అని బలవంత పెట్టేసరికి లేచి కాఫీ తాగి నేను కాసేపల పొలం వైపు వెళ్లొస్తాను అని  వెళ్లబోతాడు.
"చీకటి పడుతుంది గురూజీ కాసేపు విశ్రాంతితీసుకోండి"
"వద్దు ప్రభా, అరణ్య ఇక్కడికొస్తుంది. నాకు అమ్మాయిని చూస్తూ ఉంటే నా బాధను తట్టుకోలేకపోతున్నాను. నాకు చీకట్లో వెళ్లడం కూడా అలవాటే. కాసేపు పొలంలోకి వెళ్లి వస్తే దాన్ని ఏమైనా కొద్దిగా మరచిపోగలనేమో" అని చెప్పి పెద్దాయన లేచి వెళుతూ ఉంటే, "నేను కూడా వస్తాను" అని ప్రభ తనతో పాటు బయలుదేరుతాడు.
"సరే రా" అని పెద్దాయన చెబుతూ ఉండగానే, అరణ్య లాప్‌టాప్ తీసుకుని వచ్చి ప్రభను పిలుస్తుంది.
"రా ప్రభ, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చో" అన్న అనన్య మాటలు విన్న పెద్దాయన, అక్కడే ఉండు అని సైగ చేసి పొలం వైపు వెళ్తాడు....
కట్టమీద కూర్చొని ఉన్న ప్రభతో "ఆ రోజు నేను కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్లాను కదా, అది ఒక ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి వెళ్లాను" అని అరణ్య చెబుతూ ఉంటుంది.
అరణ్యా! ఎందుకని వేరే వాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటావు? అదే నీ జీవితానికి ప్రమాదం కూడా కావచ్చు, ఏదో ఒక ఉద్యోగం వచ్చిందని నీ పని నువ్వు చూసుకుని రావచ్చు కదా!"

"ప్రభా! నేను  ఎవరి జోలికీ వెళ్లను. కానీ, అక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది. దాదాపు 100 ఎకరాల పొలం.. ఆ పొలాన్ని ఎవరో సాగు చేస్తున్నారనిపిస్తోంది. అక్కడి అరాచకాలను అసలు చూడలేకపోతున్నాను."
"అరణ్య! ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. ఈ కాలంలో అవన్నీ, సమస్యలను సాధించడం అంత సులభం కాదు."
"అది కాదురా! నేను ఆలోచిస్తున్నది జస్ట్ ఒక ప్రాపర్టీ గురించి మాత్రమే. అది ఎందుకో నాకు ఖచ్చితంగా దాని గురించి ఆరాతీయాలని నా మనసు చెబుతోంది."
"అరణ్య నువ్వు.ఆ ఊరి గురించి ఎక్కువగా ఆలోచించకు. ఆ ప్రాపర్టీ ఎవరిదైతే నేమి, అది నీకు సంబంధం లేదు కదా!" అని నువ్వు అంటున్నావు. కానీ నాకు ఎందుకో దాని గురించి మళ్లీ మళ్లీ ఆలోచించాలని ఉంది.అనిపిస్తోంది. నేను చెప్పేది ఒక్కసారి వినరా. ఈ ల్యాప్‌టాప్‌లో ఒక విషయం చూపిస్తాను, కాస్త ఓపికతో చూడవా ప్లీజ్.
సరేలే అని చెప్పి ఇద్దరూ కట్టమీద కూర్చుని కదిరినాడికి సంబంధించిన పొలం స్కెచ్ చూస్తూ ఉంటారు.
 అరణ్య 'అది చూడు, ఇల్లులా కనిపిస్తోంది కదా! అది నేను కదిరినాడుకు వచ్చినప్పుడు చూసి వచ్చాను' అని ప్రభతో చెబుతాడు.
'అవునా! అంత తొందరగా ఊరంతా ఎట్లా చుట్టేసావురా?'
'చూడాలనుకున్నప్పుడు చూసేయాలి అరణ్య. ఇంకా ఆ ఇల్లే కాదు, దానికి కొంచెం ముందుకు వెళితే అక్కడ రేసుగుర్రాలు కూడా కనిపించాయి. కానీ ఇంత చిన్న మండలంలో రేసుగుర్రాలు ఏంటని నాకు చాలా ఆశ్చర్యం వేసింది తెలుసా? అక్కడ ఉన్నవాళ్ళని అడిగితే అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడలేదు...'"అందుకే అక్కడి నుంచి వినతిరికి వచ్చాను అని ప్రభ ఇంటి స్కెచ్ చూపిస్తూ చెబుతాడు. 
చూడరా ఆ ఇంటి గురించి నువ్వే చెబుతున్నావు. ఇక నేను ఆరా తీయడంలో తప్పేం లేదు. అన్యాయం జరుగుతోందని అలా ఆలోచిస్తున్నా అంతే
అరణ్య నువ్వు నీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఓవర్గా థింక్ చేయకు దాని నుంచి నీకు సమస్యలు రావచ్చేమో!'
' ప్రభ ఆ ఇంటికి సంబంధించిన మనుషులు ఎవరుఅక్కడ లేరు కానీ వాళ్ళ ఇల్లు ఉన్న నంబర్ కి సంబంధించిన బ్యాక్ సైడ్ ఉన్న పొలాలన్నీ పంటలు పెడుతూ ఉన్నారు .అది ఎవరు పెడుతున్నారు అంటే భుజంగం మనుషులు. భుజంగం అయితే అప్పుడప్పుడు అక్కడ కనిపిస్తూ ఉంటాడు .అంటే వాళ్లే ఆ పొలంలో ఏదో పంటలు పెట్టుకుంటూ ఉన్నట్టున్నారు వాళ్ళ ఇల్లు అయినప్పుడు వాళ్ళందరూ ఉండాలి లేదా వాళ్ళకి సంబంధించి ఏదైనా పనికైనా వాడుకోవాలి కానీ అదేమీ జరగట్లేదు...అంటే అక్కడ ఏదో సంథింగ్ ఉంది."
"అరణ్య, వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నీ పనిగా నువ్వు చూసుకో. నా మాట విను. చిక్కుల్లో పడి చిక్కుకుపోవడం కంటే ఫ్రీగా ఉంది హాయిగా ఉండు. ఆ సంథింగ్ ని నథింగ్ అనుకో."
లేదు ప్రభ, నేను దీని గురించి కంపల్సరీ ఎవరినైనా తెలుసుకొనే తీరుతాను. ఎందుకో నాకు దీని గురించి ఆలోచించాలని నా మనసు తపన పడుతూనే ఉంది. నేను వాళ్ళ జోలికి వెళ్ళను, జస్ట్ ఎవరిది అనేది మాత్రమే తెలుసుకుంటానంతే. అది ఎవరికైనా ఉపయోగం కావచ్చేమో, అంతే కదా!"

"అరణ్య, నేను చెప్పడం కొంచెం అర్థం చేసుకో. ఎవరిదో అయితే నీకెందుకు? ఇంతటితో వదిలేయ్."

"లేదు ప్రభ, నేను ఖచ్చితంగా తెలుసుకుని తీరుతాను" అని అరణ్య చెప్పడంతో, "సరే నీ ఇష్టం, కానీ కోరి కొని తెచ్చుకోకు" అని ప్రభ చెబుతాడు.
అలాగే ప్రభా! అంత సమస్య అనిపిస్తే నేను పట్టించుకోను."

"సరే అయితే, జాగ్రత్త!"

"అలాగే నేను జాగ్రత్తగానే దీని గురించి పరిశీలన చేస్తాను" అని అరణ్య చెప్పి, ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి లోపల పెట్టడానికి వెళుతుంది.
ప్రభా పొలం వైపు వెళదామని వెళ్తుంటే, పెద్దాయన...వస్తూ ఉండడంతో అక్కడే కూర్చుంటాడు. ఇంకా అప్పటికి పతంగి కూడా రావడంతో—విషయం పతంగి అన్నయ్యతో చెప్పాలా, వద్దా అని ప్రభ ఆలోచించి, "వద్దులే" అనుకొని చెప్పడు.
ఆ రోజు రాత్రి పెద్దాయన పక్కనే తను పడుకొని, రాత్రంతా పెద్దాయన నిద్రపోకపోవడం గమనిస్తాడు ప్రభ.

ఒక అమ్మాయి ఉంటే తల్లిదండ్రులకి క్లిష్టతరం అని పెద్దాయనని చూస్తుంటే ప్రభకి అర్థం అవుతూ ఉంది. ఆడపిల్ల పుట్టాలి అనుకుంటారు కానీ, పుట్టిన తర్వాత పెంచడం చాలా ఈజీ. పెళ్లి చేయడం అనే ఘట్టం ఉంది చూడు, అది చాలా కష్టమని తెలుస్తోంది. అంత అవమానించినా తను ఇంకా...అరణ్య సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నారు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయాలని మాత్రం అనుకోవట్లేదు. అంటే తనకి అరణ్య అంటే ఎంత ప్రాణం అని అనిపిస్తుంది! ఇది మాత్రం చాలా ఘోరం. తను అనుకున్నది జరగాలి అని ప్రభా అనుకొని, ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయం పెద్దాయనకి ధైర్యం చెప్పి, 'మీకు ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఒక ఫోన్ చేయండి గురూజీ!'"నేను ఖచ్చితంగా వస్తాను, నీకు ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను. ఖచ్చితంగా అరణ్య, అర్జున్ అన్నయ్య పెళ్లి జరగాలి" అని ప్రభ చెప్పి ఆఫీసుకు బయలుదేరడంతో, అరణ్యతో కలిసి టౌన్ కొరకు వచ్చి అరణ్య డ్యూటీకి వెళుతుంది.
ప్రభ అక్కడినుంచి పనికి వెళతాడు.
**
అరణ్య ఆఫీసులో ఉండగా కదిరినాడులో కపటం జరుగుతుందని తెలిసినా కూడా, "ఊరిలో పోలీస్ స్టేషన్ ఉంది, నాకెందుకు?" అని వెళ్లి తన పని తాను చూసుకుంటూ ఉంటుంది.
ఎక్స్క్యూజ్ మీ మేడం, లోపలికి రావచ్చా?" అని భుజంగం ఆఫీస్‌కు వచ్చి అడగడంతో, రమ్మన్నట్టు తల ఊపుతుంది అరణ్య.
లోపలికి వచ్చిన భుజంగం, కూర్చోమని కూడా చెప్పకుండా వస్తూనే కుర్చీలో కూర్చుని ఒక చిన్న ఈవిల్ స్మైల్ ఇవ్వబోగా... అరణ్య కళ్ళు పెద్దవి చేసి కోపంతో చూస్తుంది. దాంతో కాస్త తన నవ్వుని ఆపుకొని అరణ్య వైపు చూడడంతో, "చెప్పండి" అని అడుగుతుంది అరణ్య.
"ఏం లేదు మేడం, మీరు ఊరికి ఉత్తర దిక్కులో ఉన్న ఏదో పొలాన్ని గురించి సర్వే చేస్తున్నారని నాకు తెలిసింది. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దని మీకు చెబుతున్నాను."
"సరే, నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను. దాని గురించి ఆలోచించే వాళ్ళు వచ్చినప్పుడు... నువ్వు కాదు, నేను కాదు, ఎవరు ఆపలేరు అప్పుడైనా..." అని ఏదో చెప్పబోతుంటే...
"అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పటికీ ఆ ప్రాపర్టీ అనేది కేవలం..."
కేవలం అంటే అర్థం ఏంటో?

అదంతా నేను విడమర్చి చెప్పలేను, మీరు మాత్రం కాస్త ఆలోచించి అడుగు వేస్తే మంచిదనుకుంటా" అని భుజంగం చెబుతాడు.
"నేను మీరు ఆలోచించినంత దూరం ఇంకా వెళ్లలేదండి."
"అదే అంత దూరం వెళితే..." అంటూ భుజంగం మాటలు ఆపుతాడు.
ఆ అంత దూరం పెడితే ఏమవుతుంది అని నేను ప్రశ్నించను. అసలు నేను దీని గురించి ఆలోచిస్తున్నాననేది మీకు తెలుసా? నేను నా వృత్తి గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. ఈ ఊరిలో వేరే దేని గురించి కూడా నాకు అవసరం లేదు. మీరు ఇంకా దయచేసి..." అని అరణ్య చేయి చూపించడంతో, భుజంగం ఒక ఈవిల్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి లేచి వెళతాడు.
**
ఇంటికి వెళ్ళిన భుజంగం కుర్చీలో కూర్చుంటూ ఉండగా, ధనుష్ రావడంతో తన తమ్ముడు శ్రీహరి గురించి ప్రస్తావిస్తాడు.

ధనుష్, నాకు తెలిసి అది కరెంట్ షాక్ అయితే కాదు అని నా అనుమానం. కానీ, అది ఎలా జరిగిందని చోద్యంగా ఉంది."
"నాన్నగారు, అది ఒక సమస్య అయితే... ఆ శ్రేష్ట మిల్క్ డైరీ మేనేజర్ నాతో చేతులు కలిపి, మా మిల్క్ డైరీలోని పాలని నేను, ఆ యజమాని వ్యాపారం తగ్గాలని నేను, మేనేజర్ ఇద్దరు కలిసి కల్తీ పాలు అందులో పాకెట్ వేయగా... అలా ఒకవేళ వాళ్ళు ఎవరైనా మా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పాలని కనిపెడితే, అది ఇంకా చాలా క్లిష్టమైన సమస్య అవుతుంది."
అదెలా సాధ్యం రా నువ్వు పెట్టిన పాకెట్ కి సీలు లేదు పేరు లేదు ఇక నువ్వు ఎందుకు భయపడతావ్ అన్నది భుజంగం సమాధానం.
అది కాదు నాన్న అని ధనుష్ చెప్పబోతుంటే ఆ పని చేసి ఫ్యాక్టరీలో శ్రేష్ట డైరీ మిల్క్ కి సపోర్ట్ గా ఉండే వాళ్ళు, వాళ్ళందరూ కూడా అవసరానికి జీతం తీసుకునేవాళ్లే వాళ్లు నాకు తెలిసి సపోర్ట్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా అలాంటి వారు ఉన్నారంటే మేనేజర్ ని తెలుసుకోమని చెప్పు ఎవరైనా సీక్రెట్ గా ఒక మనిషిని అలాట్ చేయండి లేదా కొనేయండి.
అవును నాన్న మీరు చెప్పిన సలహా కూడా బాగుంది ఆ విషయం మేనేజర్ తో చెబుతాను..
కొడుకు మాటలు విన్న భుజంగం " ఈ సమస్యలకు పరిష్కారం నువ్వు అనుకున్నంత సులభం కాదు కాస్త జాగ్రత్తగా చాలా వ్యవహారికంగా నువ్వు అడుగు ముందుకు వేయాలి కానీ నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకో వాడు ఏ మాత్రం మన మిల్క్ డైరీ గురించి బయటపెట్టినా మన బిజినెస్కే చాలా ప్రమాదం అవుతుంది అందుకే ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిది ముఖ్యంగా చెప్పేవాడిని.
ఫినిష్ చేస్తే మనకు ఆ సమస్య ఉండదు" అని తండ్రి చెప్పడంతో, అలాగే చేస్తానని ధనుష్ వెళతాడు.
**
ప్రభ ఓనర్‌తో మాట్లాడుతూ ఉండగా, "సార్, నాకు ఏ చిన్న క్లూ దొరికినా కచ్చితంగా నేను అది చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని మన మేనేజర్‌ని ఎంత అడిగినా తనేతే నోరు విప్పలేదు. పైగా మంచి వాడినని, మారిపోయాను అంటూ ఇంకా ఇక్కడే పని చేస్తున్నాడు

అది నీకు సంబంధించినది కాబట్టి మీరు అతనితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ కొడుకు ఎలాగో వస్తాడు కాబట్టి తను చూసుకుంటాడు," అని ప్రభ చెబుతాడు.

అలాగే రా, ఖచ్చితంగా నేను దీని మీద కాన్సంట్రేషన్ చేస్తాను. ఏం చేయను? బిజినెస్ కాంట్రాక్టు మొత్తం గురించి వాడికి మాత్రమే తెలుసు. నా కొడుకు కూడా చదువుతున్నది అదే. అది ముగియగానే ఖచ్చితంగా వాడిని అన్నింటికీ పంపిస్తాను" అని ఓనర్ కి చెప్పడంతో, "సరే" అని చెప్పి తన పనికి తాను చూసుకుంటాడు ప్రభ.
సాయంత్రం వర్క్ అవర్ ముగియగానే ప్రభ వస్తూ ఉండగా, అక్కడ దూరంగా వెళుతున్న అమ్మాయి గీతిక.అని అనిపిస్తుంది.

కానీ తనో కాదో తెలియడం లేదు. అక్కడి నుంచి రూమ్‌కి వచ్చినా కూడా పప్పుతో అదే డిస్కషన్ చేస్తాడు. అలా బయటికి వెళ్లి  గార్డెన్ హౌస్ డోర్ వైపు చూడగా, తాత ఏదో పని చేస్తూ ఉంటే, జేజి పక్కన కూర్చుని ఉంది."







.."