pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 48

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 48


ప్రభా ఇంటికి రావడంతో గౌరీ ఎదురుగా వస్తుంది.
ప్రభ!  మీ మేడం ఇంటికి వెళ్లావంట సర్ బాగున్నారా అడిగింది గౌరీ .
 ఇంత తొందరగా  ఆ న్యూస్ ఎలా వచ్చిందబ్బా అనుకొని ,  ఏంటో అమ్మ సార్ అలా జీవితం ఇలాగే పడి ఉన్నారు.  అయినా మేడం సార్ ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.  నాకు తెలిసి అతను త్వరలో రికవరీ అవుతాడు . అమ్మ  ! నీకు ఈ విషయం తెలుసా మేడం వాళ్ళు కొడుకున్న చోటికి వెళ్ళిపోతారంట ఆ అబ్బాయి ఈరోజు వస్తానని కాల్ చేశాడన్నారు.  నాకు తెలిసి మేడం ఒక నెల రోజులు కూడా ఇక్కడ ఉండాలనిపిస్తుంది ఇప్పుడు ఆ అబ్బాయి రావడమే ఇద్దర్ని తీసుకెళ్లడానికి అని అనుకుంటున్నా అన్నాడు ప్రభ. 
 అవును,  మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడికి దగ్గరేనని చెప్పారు కాబట్టి వెళ్లొచ్చేమో అంది గౌరి.
 అది విన్న తర్వాత ప్రభ తన రూమ్ కి వెళ్ళబోగా " ప్రభ" అనే పిలిచింది గౌరీ . 
 ఏంటమ్మా  అని ప్రభ తిరిగేసరికి మీ మేడం వేరే ఏ విషయమైనా నీతో చెప్పారా అడిగింది గౌరీ.
 ఎందుకమ్మా తెలిసి  తెలిసి  అడుగుతున్నావ్ . మేడమ్ ఈపాటికి నీకు విషయం చెప్తే ఉంటారు . కాకపోతే నన్ను ఎలా అడిగేదని నీ అభిప్రాయం.  నీ కొడుకు దగ్గర అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకమ్మ . నేనేమనను ఇకపోతే నీ మనసులోని మాట  నాకు తెలుసు కాబట్టి నేను పెళ్లి చూపులకి వెళ్లాలనుకుంటున్న సరేనా అన్నాడు ప్రభ.
 ఆ మాట విన్నం గౌరీ కళ్ళల్లో ఆనందం వెల్లి విరిసింది.
 థాంక్యూ రా రేపు నువ్వు , మీ మేడం కలిసి వెళ్లి రండి అని చెప్పింది గౌరీ.
 అలాగే అమ్మ అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు ప్రభ.
 హ్యామ్మయ్య , వాడు ఎలాగో పెళ్లిచూపులు కి వెళ్లడానికి ఒప్పుకున్నాడు మంచి సంబంధం అని లోపల చాలా సంతోషంతో ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది గౌరీకి. 
 ఉదయం 9 గంటలకి  తన మేనల్లుడి కొడుకు  ఉన్నత్ తో   కలిసి వచ్చారు మేడం. బహుశా వాడికి ఐడు సంవత్సరాలుండి  ఉండొచ్చు చూడడానికి చాలా చురుగ్గా అనిపిస్తున్నాడు. 
 ప్రభ ! రెడీనా అంటూ లోపలికి వచ్చారు మేడం .
 ప్రభాస్ సింపుల్ గానే రెడీ అయ్యి తలదువుకోవాలని అద్దం ముందుకి వెళ్లగా రెండు అడుగులు వేసి అద్దంలో ముఖం చూసుకోనేదే వద్దు ఎందుకంటే కళ్ళు మనసుని  కలవరపెడతాయి కాబట్టి వద్దని    అద్దంలో చూడకుండా తల దువ్వుకుని బయటికి వచ్చాడు ప్రభ.
 గౌరీ !  ప్రభ ఇప్పుడే పెళ్లి కొడుకులా కనిపిస్తున్నాడే ఇక పిల్లని కాయం చేసుకోవడమే బాకీ అన్నారు మేడం. 
 మేడం ఎప్పుడు చాలా సరదాగా నిండు మనసుతో మాట్లాడతారు.  అందుకే ప్రభుకి తనంటే అభిమానం,  గౌరవం . తను తన మేడమ్  అయిన అది తరగతి వరకే ఉండేది . బయటికి వస్తే గౌరీతో కూడా ప్రభా అంత ఫ్రీగా ఉండడు మేడం తో అంత బాగా కలిసిపోతాడు.  ఇప్పుడు కూడా పెళ్లి చూపులకి మేడం తో పాటు వెళితేనే ఫ్రీగా ఉంటుందని అనుకున్నాడు ప్రభ . 

 గౌరీ వెళ్ళొస్తాం అని చెప్పి మేడం బాబుతో పాటు బండి బయటికి రావడంతో ప్రభ అమ్మకు చెప్పి బండి బండిలో మేడం బాబుని ఎక్కించుకొని అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు బండిని నిలిచాడు ప్రభ.
పదరా అని మేడం అంటుంటే లోపల నుండి వియ్యంకురాలు ఒక అమ్మాయితో వచ్చి రండి అని ఆహ్వానించగా బయట రంగవల్లిక,  ముస్తాబులు అలాంటివేమి లేకపోయినా లోపల మాత్రం వాతావరణం చాలా బాగుంది . ప్రభకి ఇదే మొదటి పెళ్లి చూపులు కాబట్టి ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది మనసుకి. ఇంటి లోపలికి చూస్తూ ఉంటే ఆ సింపుల్ డిజైన్స్ చూసి చాలా సింప్లిసిటీ అనిపించింది.  ఒకసారి కళ్ళు మూసుకుని మనసును కఠినం చేసుకొని గంభీరంగా గడప లోపలికి కుడికాలు పెట్టి నడిచాడు ప్రభ . ఓనర్ చెల్లెలు కూర్చొమని సోఫా చూపించడంతో వెళ్లి కూర్చున్నారు ముగ్గురు .
 సోఫాకి ముందర టేబుల్ పై అలంకరించిన గులాబీ రంగు పూల మీద కిటికీ నుండి సూర్యకిరణాలు పడుతూ ఉంటే అప్పుడే పీకిన పెరికిన పూలు కాబట్టి ఇంకా నీటి చుక్కలు వాటి మీద ఉండడంతో మెరుస్తున్నాయి ఆ వెలుతురుకి ఆగది ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది . 
 ప్రభ వాళ్లకి ఎదురుగా మరొక సోఫాలో కూర్చున్న అవ్వ,  తాతలు ప్రభని   తదేకంగా చూస్తూ పర్లేదు అన్నట్టు ఒకరికొకరు సైగ చేసుకుంటున్నారు అది పక్కనే కూర్చున్న మేడం గమనించకపోలేదు.  అంతలో లోపలి నుంచి ఒక అమ్మాయి చీరకట్టుతో మంచినీళ్లు తీసుకురావడం చూసిన మేడం  'ప్రభ' అనడంతో ప్రభ అలర్ట్ అయ్యాడు . ఒకసారి ఆ అమ్మాయిని తలెత్తి చూడకుండా ఆమె పాదాల వైపు చూసాడు. .ఇక చూపు ఇటు తిప్పుకునే లోగా అమ్మాయి మంచినీళ్లు అందించడంతో థాంక్స్ అండి అన్నాడు ప్రభ.  
 ప్రభ!  అని మేడం పలకరించడంతో  " మేడం తను అమ్మాయి కాదు ఆమె "ఒకసారి కాళ్ళ వైపు చూడండి కాలికి మెట్టెలు ఉన్నాయి. "అని మెల్లగా చెవిలో చెప్పాడు ప్రభ.  మేడం ఒకసారి చూసి అవును రా నువ్వు చెప్పింది నిజమే ఇంతకీ అమ్మాయేది అంది మేడం.
 అమ్మ ! చెల్లి వచ్చింది అంటూ  పెద్దమ్మాయి ఎదురు వెళ్ళాగా చిన్నమ్మాయిని ఇంటికొన్న మరో వాకిలి గుండా రమ్మని చెప్పడంతో తను అలాగే చేసింది . జర్నీతో అలసిపోయిన చాందిని అక్క ఎందుకు ఇంత హడావిడిగా పిలిపించారు అక్కడ చూస్తే మా హెచ్ఆర్ చాలా స్ట్రిక్ట్ కారణం చెప్పనిదే లీవ్ ఇవ్వడు.  ఇక్కడ ఏదో ఒకటి చెప్పి ఇక ఏదో ఒకటి చెప్పి అడిగి వచ్చేసరికి తల ప్రాణం తోక కొచ్చినట్టు అయింది అంది చాందిని.
 సరే సరే ముందు ఫ్రెష్ అప్ అయ్యి రా నీతో కాస్త పనుంది చెప్పింది అక్క.
ఏం పని అంది  చాందిని.
 అదే నే, ఆ విషయమే చెప్పాలనుకున్న నిన్ను ఎందుకు రమ్మన్నారంటే పెళ్లి చూపుల కోసం అంది అక్క. 
 అవునా ! ఆ మాట ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చుగా నేను ఎంతగా కంగారు పడ్డానో తెలుసా  అంది చాందిని.
 సరేలే ఆల్రెడీ అబ్బాయి వాళ్ళ వచ్చేసారు.  నువ్వు కూడా త్వరగా వచ్చెయ్ .అమ్మ అప్పటినుంచి   డోర్ వైపు చూస్తూనే ఉంది చూడు అని చూపించంది అక్క. 
 సరే పదా వెళ్దాం ఇక పెళ్ళికొడుకు  వచ్చి కూర్చున్న తర్వాత వద్దు గిఫ్టు అంటే బాగుండదు అమ్మ బాధపడుతుంది అని చాందిని ముందుకు వస్తుంటే 'చాందిని ఆగు' అంది అక్క.
 చాందిని ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకుని హాల్లోకి రావడంతో చాందిని ఫ్రూట్ జ్యూస్ తీసుకెళ్ళు చెప్పింది అక్క.
 చాందిని ఫ్రూట్ జ్యూస్ తీసుకుని హాల్లోకి రావడంతో అందరి చూపులు అటువైపు మళ్ళాయి.  ప్రభ తన చూపును మెల్లగా వస్తున్న అమ్మాయి వైపు మళ్ళించాడు.  అమ్మాయిని చూస్తుంటే తన కళ్ళు మెరిసాయి . అమ్మాయి  పైనుండి తన చూపుని పక్కకి కూడా మరల్చలేకపోతున్నాడు . పెదవులపై చిరునవ్వు  తొణికిసలాడుతోంది.  వస్తున్న అమ్మాయి ని తదేకంగా చూస్తూ స్ట్రైట్ గా కూర్చోవడంతో మేడంకి ఆశ్చర్యం వేసింది.
 చాందిని ముందు అబ్బాయికి ఇవ్వకుండా మేడమ్ కి,  బాబుకి జ్యూస్ ఇచ్చి తర్వాత ప్రభావైపు తిరగడంతో చాందిని ప్రభ వైపు సూటిగా చూడలేక తన చూపు  నేలవైపు మరల్చింది . ప్రభ మాత్రం జ్యూస్ ని తీసుకుంటూ చాందినిని చూస్తూ ఉండగా చాందిని చేతిలో ఉన్న  పెళ్ళాన్ని కాస్త పైకెత్తినట్లు నటిస్తూ కొంచెం కొంచెం దించుతూ ఉంటే ప్రభ జ్యూస్ ని నోటి దగ్గర పెట్టి తన వైపే చూడడం గమనించి మెల్లగా  చూపుని కిందికి దించి కాళీ అయినా గ్లాసును తీసుకోవాలని చేయి చాపగా ప్రభ తనని చూస్తూ గ్లాసు చేతికి ఇవ్వడంతో అక్కడి నుండి లోపలికి వెళ్ళింది చాందిని .
 ప్రభ ! అంటూ మేడం మాట్లాడించినా ప్రబ అటువైపే చూస్తూ ఉండడంతో వీడు చూసేకి మామూలుగానే ఉంటాడు అయినా వీడికి అన్నీ తెలుసు అని నవ్వుకుంటూ 'ప్రభ ' అని భుజాన్ని తట్టుగా ఈ ప్రపంచంలోకొచ్చాడు ప్రభ. 
 ఏరా అమ్మాయి ఓకేనా అని అడగాలనుకున్న,  వద్దులే వాళ్ళందరూ ఉన్నారు వాడైనా ఎలా చెబుతాడు ఏంటి అనుకొని ఓనర్ చెల్లి వైపు చూడగా ఆమె నవ్వుతూ ఇంకేంటి మేడం అంది అమ్మాయి గురించి ఏదైనా చెబుతుందేమోనని అది అర్థం చేసుకున్న మేడం ప్రభావైపు చూడడంతో తను బాబు వైపు చూసాడు.  అక్కడ కూర్చున్న తాత మాత్రం   మేడం  నాకైతే అబ్బాయి చాలా బాగా నచ్చాడు . ఇక వాళ్ల సంగతి ఏంటో కాస్త చెబితే ముందుకు అడుగు వేయొచ్చు అన్నాడు తాత.
అది కాదు పెద్దయ్యా ఈ కాలంలో పిల్లలు మనకు నచ్చడం గొప్ప కాదు .  ముందు వాళ్ళిద్దరూ ఇద్దరికీ ముందు పిల్లలకి ఒకరినొకరు ఇష్టముందో లేదో తెలుసుకోవాలి  . ఆ తర్వాత గౌరీని రమ్మని చెప్పి తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి సాధ్యమైనంత వరకు తను ఒప్పుకుంటుంది ఎందుకంటే తను ఆల్రెడీ అమ్మాయిని చూశానని చెప్పింది  . ఇక వీళ్లిద్దరి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని మేడం చెప్పడంతో ప్రభ ఒకసారి మేడం వైపు చూసాడు.  అంతలో వీళ్ళ మాటలు విన్న పెద్దమ్మాయి చాందిని తో విషయం చెప్పగా నేను అతనితో మాట్లాడాలి అంది చాందిని . 
ప్రభ తో మేడం అమ్మాయి నీతో మాట్లాడాలనిటోంది. అని చెప్పడంతో సరేనని వెళ్ళాడు ప్రభ .
 ఆ అమ్మాయిని చూసిన ప్రభ షాక్ అయ్యాడు. చాందిని కూడా కోపంతో చూసింది ప్రభని.
 చా  .. చాందిని నువ్వా అన్నాడు ప్రభ.
 అవును,  నేనే  ఇప్పుడు గుర్తుపట్టావన్నమాట.  మరి పెళ్లిచూపులో ఎందుకు గుర్తుపట్టలేదు అంది చాందిని. 
 గుర్తుపట్టడం ఏంటి అసలు నువ్వు అని నాకు తెలియదు అన్నాడు ప్రభ.
 నేనని తెలిసి ఉంటే నువ్వు అసలు వచ్చే వాడివి కాదేమో కదా అంది చాందిని ప్రభ వైపు చూస్తూ.
 అది విని చేతులు తిప్పుకుంటూ అయమయంలో పడిపోయాడు ప్రభా. 
 ప్రభా!  నువ్వు నువ్వేనా అడిగింది చాందిని.
 నేను నేనే కదా ఇంకెవరు అనుకుంటున్నావు అన్నాడు ప్రభ.
 నేను కాలేజీలో చూసిన ప్రభ అంటే నాకు చాలా అభిమానం కానీ పెళ్లి చూపుల్లోని ప్రభా నాకసలు నచ్చలేదు అంది చాందిని.
 ఏం మాట్లాడుతున్నావ్ .  పెళ్లి చూపుల్లో నేనేం చేశాను ఇచ్చిన జ్యూస్ తీసుకొని తాగాను అంతే కదా అన్నాడు ప్రభ.
 అంతేనా?
 అంతేగా అన్నాడు మరొక్కసారి.  
 అంత మాత్రమే అయితే నేను మాట్లాడదాన్నే కాదు కానీ నువ్వు మీ పెద్దల కోసం ,  ఫార్మాలిటీ కోసం పెళ్లి చూపులకు వచ్చావని నాకు అర్థమైంది అంది చాందిని .
 నువ్వు ఇంటెలిజెంట్ అని నాకు తెలుసు గానీ ఇంత ఇంటలిజెంట్ పని నాకు ఇప్పుడే అర్థమైంది అని మనసులో అనుకొని అదేం లేదే నేనే రావాలని వచ్చాను.  అసలు ఎందుకు ఇలా అడుగుతున్నావ్ అన్నాడు ప్రభ.
 ముందు అబ్బాయిలైనా,  అమ్మాయిలు అయినా వాళ్ళ మనసుని ప్రశ్నించుకుని గుండె గూటిలో ఏ  గువ్వ లేదు అని ఆలోచన ఉంటేనే పెళ్లి చూపులకి ముందడుగు వేయాలి . మనసులో ఒకటి పెట్టుకుని మనసుని చంపుకొని ఎవరికోసమో మరొకరి జీవితంలోకి అడుగు పెట్టాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి రావాలంటే సమయానికి బస్సు లేక ఎంత కష్టపడి వచ్చానో నాకు తెలుసు. కనీసం నా మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఇది మా అమ్మ నాన్న చేసిన మరో తప్పు . అమ్మాయి పుడితే లక్ష్మి అని పొగుడుతారు అదే వయసుకు వచ్చేసరికి ఎప్పుడు గడప దాటిద్దామా అనిu ఆలోచిస్తారు . వాళ్లది పక్కన పెట్టు నీవు చేసిన పని నాకేం నచ్చలేదు అందుకే చాందిని.
చాందిని అసలేం జరిగిందో చెప్పు.  నాకు తెలిసి నేను సాధ్యమైనంత వరకు తప్పు చేయడానికి అవకాశం ఇవ్వను . అది జరిగి ఉంటే పొరపాటు అయి ఉండొచ్చు అన్నాడు ప్రభా .
 పొరపాటు,  అసలు జ్యూస్ తీసుకుంటూ నువ్వేమన్నావో నీకు తెలుసా అది చాందిని .
 అదేదో చెబితే కదా తెలిసేది.
 నువ్వు నేను లోపలి నుంచి వస్తుంటే నన్నే తదేకంగా చూస్తూ నాకు చాలా కంగారుగా అనిపించింది.  జ్యూస్ తాగాక ఖాళీ కప్పు చేతికిస్తూ జ్యూస్ చాలా బాగుంది గీతిక  "అన్నావు అంది చాందిని .
 అంతే ! ఆ మాట విన్న ప్రభ కి కంగుతిన్నట్టయింది. ఆ క్షణం మాటల్లేవు .రెండు చేతుల్ని నలుపుకుంటూ అలా అన్నానా,  అయ్యో ! నేను నా మనసుని  కఠినంగా చేసుకునే ఇంత దూరం వచ్చాను అయినా నా మనసు నా మాట వినలేదా ఏంటి   ఈ లీల భగవాన్ అనుకొని సారీ చాందిని అన్నాడు ప్రభ.
 సారీ ఏంట్రా సారీ మనసులో ఒకరిని పెట్టుకుని బయటికి నటిస్తూ అది నాకే పెళ్లి చూపులకు వస్తావా.  నిన్ను.. అంటూ వేలు చూపిస్తూ కోపంతో ముందుకొస్తుంటే చాందిని ప్లీజ్ నువ్వని నాకు తెలీదు . సారీ చెప్పానుగా అయినా నేను నిన్ను చూడ్డానికి వచ్చినంత మాత్రాన పెళ్లి ఫిక్స్ చేసుకోలేదు. అయినా నేను ఎలాంటి ప్రేమ మత్తులో ఉన్నాను కనీసం నువ్వు చూసి ఇచ్చేటప్పుడైనా ముఖం చూడాలిగా  ఇంత ఘాడమైన ప్రేమ మత్తు ఆవహించిందా ! అసలు నేనెందుకు అలా అన్నాను.  చి!  ఇక్కడ గీతిక నన్ను వదలలేదు అనుకున్నాడు ప్రభ.
 ప్రభ!  అది నీ తప్పు కాదు.  నీ మనసుది. నువ్వు ఆ గీతికని ఎంతగా ఇష్టపడితే నీకు పదేపదే గుర్తొస్తుంది చెప్పు ముందు తను ఎవరు ఎక్కడుందో అది ఆలోచించు.  అయినా నువ్వు చాలా ప్రేమలో ముదిరిపోయావు బాబు . చెట్టoత మనిషిని ఎదురుగా వచ్చినా    ప్రేమ మాయలో లీనమైపోయావు చూడు యువర్ లవ్ ఇస్ సో గ్రేట్  కానీ ఇలా మోసం చేసి పెళ్లి చూపులకు వచ్చావు చూడు థిస్ ఇస్ నాట్ గుడ్ అంది చాందిని. 
 నీకు దండం పెడతాను చాందిని ఇక టాపిక్ వదిలేయ్. అంటూ ప్రభ రెండు చేతులు జోడించడంతో అలారా దారికి అంటూ నవ్వుతూ చేతులు వెనక్కి పెట్టి అయినా ప్రభ నువ్వు నేను ఎవరో తెలియక వచ్చావు కాబట్టి నేను క్షమిస్తున్నాను . ఇంకో ఇంటికి పెళ్లిచూపులకని  వెళ్ళకు గుర్తుపెట్టుకో.  నీవు ఇష్టపడిన అమ్మాయిని ఎంత కష్టపడి అయినా తెచ్చుకో.  యాక్చువల్ గా నాకు పెళ్లి చూపులని  వినగానే వద్దని చెబుదామనిపించింది కానీ పెద్దవాళ్లు బాధపడతారని చెప్పలేకపోయాను. ఎందుకంటే మా అమ్మ తమ్ముడి కొడుకు ఉన్నాడు వాడంటే నాకు చాలా ఇష్టం కానీ అమ్మకి , మామయ్యకి కాస్త మాట పెరిగి ఇంటికి రాకుండా ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల తర్వాత అమ్మ నాన్నలతో చెప్పాలి అనుకున్నాను వాళ్ళను ఒప్పించి మా బావని పెళ్లి చేసుకోవాలి అంది చాందిని.
 అమ్మో  ! పెళ్లి చూపులకు వెళ్తే ఇన్ని విషయాలు జరుగుతాయా నిజంగా ఇది నా జీవితంలో మరచిపోలేని పెళ్లి చూపులు అనుకుని చాందిని ఇప్పుడెళ్ళి   వాళ్లతో ఏం చెప్పాలి అన్నాడు ప్రప్రభా.
 ఏముంది అబ్బాయికి నేను నచ్చలేదంట అని చెప్పేస్తా అంది నవ్వుతూ చాందిని.
 చాందిని అలా చెప్పకు ప్లీజ్ వేరే ఏదైనా కారణం చెప్పాలి అన్నాడు ప్రభ. 
 సరే , సరే బాబు ఏం ఫీల్ అవ్వకు నేను ఏదో ఒకటి చెప్తాలే ఇంకా ఒక సంవత్సరం పెళ్లి గురించి మాట్లాడకండి అని మీరు వెళ్లిన తర్వాత చెబుతాను నీ గురించి ఎక్కడ టాపిక్ రానివ్వను.  సరేనా ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు రా నీతో ఉంటే కొండంతా అండగా ఉండేది కాలేజీలో . నాపై ర్యాగింగ్ కూడా తగ్గడానికి కారణం నువ్వు . నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అయితే నీ స్వీట్ హార్ట్ ని ఒకసారి చూడాలని ఉంది అంది  చాందిని.
 ప్రభ కి ఏం చెప్పాలో తోచలేదు . థాంక్యూ చాందిని నీలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ  "ఎనీవే నీ లక్కీ ఫెలో త్వరగా నిన్ను చేరాలి అంటూ చేయనందించగా నీకు కూడా నీ స్వీట్ హార్ట్  నిన్ను చేరాలి ఆల్ ద బెస్ట్  "అంటూ షేక్ హ్యాండిస్తుంటే బయటకొచ్చిన మేడం అది చూసి చాలా సంతోషించింది.
 సరే వెళ్దామా అన్నాడు ప్రభ.
 అలాగే వెళ్దాం అంటూ ఇద్దరు హాల్లోకి రావడంతో అక్కడున్న వారిలో చిరునవ్వు వెలిగింది .
 మేడం వెళ్దామా అన్నాడు ప్రభ .
 ఆ మాట వినగానే ఉలిక్కిపడింది మేడం . ఆ మాటని చాందిని వాళ్ళ అమ్మ , తాతయ్యలు విన్నారేమో అని అటువైపు చూస్తే వాళ్లు మాటల్లో మునిగి ఉన్నారు.  అమ్మయ్య ! వాళ్ళు ఎవరు వినలేదు వీడి మాటల్లో ఏదో తేడా కొడుతోంది అనుకొని ప్రభా వెళ్దాం కాదు నాన్న,  వాళ్లతో వెళ్ళొస్తామని చెప్పాలి అని చెప్పింది మెల్లగా మేడం. 
 అలాగే మేడం అని ప్రభచెప్పేసరికి వెళ్ళొస్తామండి  అంది మేడం.
 అలాగేనండి మంచిది వెళ్లి రండి అంది చాందిని అమ్మ. 
 అడుగు ముందుకు వేసి న ప్రభ ఒకసారి వెనక్కి తిరిగి చాందిని వైపు చూసి వెళ్ళొస్తానని తలూపేసరికి అలాగే అంటూ బొటనవేలు చూపించింది బెస్ట్ ఆఫ్ లక్ అంటూ. ప్రభ నవ్వుతూ బయటికి వెళ్తుంటే సంతోషించింది చాందిని అమ్మ .
 పెళ్లి చూపుల నుండి ఇంటికి వెళ్లిన ప్రభ , మేడం వెళ్లడంతో అమ్మ  ఎదురు వచ్చేసరికి కొడుకు ముఖంలో ఆనందం కనిపించకపోవడంతో కొడుకుని చూసి ప్రభ రా నాన్న అని పిలిచింది గౌరీ . 
 అమ్మ ఇప్పుడు ఎందుకు పిలుస్తోంది . అసలు లోపలికి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు . అలాగే కాసేపు బయట ఉంటేనే బాగుండేది అనుకుంటూనే లోపలికి వెళ్లి మంచం మీద కూల పడ్డాడు ప్రభ. 

 వీడివాలకం చూస్తుంటే పెళ్లిచూపులు సబబుగా జరిగినట్టు లేదనిపిస్తుంది.  అందుకే వాడిని అడగడమే వద్దులే.  వాళ్ళ మేడంని అడిగి తెలుసుకుంటా అనుకొని తన పని తాను చూసుకో సాగింది గౌరీ.