Naa Nuvvey in Telugu Love Stories by Vijayalaxmi Velamala books and stories PDF | నా నువ్వే ❤️ - 5

Featured Books
Categories
Share

నా నువ్వే ❤️ - 5



నాకు ఇంకా ఈ కాలేజ్‌లో ఉండాలని ఉంది. TC తీసుకొని వెళ్ళిపోవాలని లేదు...


అయినా ఒకవేళ లవర్ ఉంటే పాపం, ఆ అమ్మాయి ఈ సైకోని ఎలా భరిస్తుందో ఏంటో!

సర్లే... బస్‌కి టైమ్ అవుతుంది. త్వరగా వెళ్దాం పద... అని ఇద్దరూ వెళ్ళిపోతారు.

@@@@@@

ఒసేయ్! గంట నుంచి అద్దం ముందు కూర్చున్నావ్. కాలేజ్‌కి టైమ్ అవుతుంది. ఎంతసేపు రెడీ అవుతావ్? అని ప్రియ అంటుంది.

నీకు గుర్తులేదా? ఈరోజు అభితో మూవీకి వెళ్లాలి అని సిగ్గుపడుతూ అంటుంది కీర్తి. 

కానీ మధ్యాహ్నం క్లాస్ ఉంది కదే...

విరాట్ సార్ క్లాస్ లేదు కదా! మార్నింగ్ ఎలాగో విరాట్ సార్ క్లాస్ ఉంది. ఇంకా మధ్యాహ్నం వెళ్లిపోవచ్చు.

ఈరోజు ఎలాగైనా అభి మనసులో ఏముందో తెలుసుకోవాలి... అని కీర్తి అంటుంది.

చాలా అందంగా ఉన్నావే! ఇలా చూస్తే పడిపోతాడు అభి... అని దిష్టిచుక్క పెడుతూ అంటుంది ప్రియ.

అభి వచ్చి టికెట్ ఇస్తా అన్నాడు. త్వరగా వెళ్ళాలి పద... అని ఇద్దరూ కాలేజ్‌కి వెళ్తారు.

కీర్తి కోసం అభి కాలేజ్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు.

కీర్తి, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇదిగో టికెట్.

మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేసేయ్...

సరే అభి...

ఓకే, నేను వెళ్తున్నా. బాయ్... అని అభి వెళ్ళిపోతాడు.

కీర్తి, ప్రియ ఇద్దరూ క్లాస్‌లోకి ఎంటర్ అవ్వగానే, కీర్తికి విరాట్ తనని ఫస్ట్ బెంచ్‌లో కూర్చోమన్న మాటలు గుర్తొస్తాయి.

అమ్మో! ఈ సైకో చెప్పిన మాటలు వినకపోతే మళ్ళీ బయటికి పొమ్మంటాడు. ఎందుకొచ్చిన బాధలే! కూర్చుంటే అయిపోద్ది... అని అనుకొని,

ప్రియ, ఫస్ట్ బెంచ్‌లో కూర్చుందాం రా...

సరే... అని ప్రియ, కీర్తి ఇద్దరూ ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటారు.

సరిగ్గా టైమ్ 9 అయ్యేసరికి విరాట్ క్లాస్‌లోకి వచ్చాడు.

క్లాస్‌లోకి రాగానే కీర్తి ఫస్ట్ బెంచ్‌లో కనిపించింది. తనవైపు ఒకసారి చూసి క్లాస్ మొదలుపెట్టాడు.

కీర్తి మాత్రం క్లాస్‌లో ఉంది అని మాటే గానీ, తన మనసు, ఆలోచనలు అన్నీ అభి చుట్టూనే తిరుగుతున్నాయి.

అభితో మధ్యాహ్నం మూవీకి వెళ్తుంది అని గాలిలో తేలిపోతుంది.

విరాట్ సార్ తనవైపు చూస్తున్నాడని గమనించి ఒక్కసారిగా కిందకి వచ్చింది.

అమ్మో! ఈ సైకోకి నేను క్లాస్ వినట్లేదు అని అర్థమైపోయిందా ఏంటి? అని అనుకొని క్లాస్ వినడం మొదలుపెట్టింది.

@#&&&

సరిగ్గా టైమ్ 1 అవ్వగానే...

ప్రియ, నేను వెళ్తున్నా. నా అటెండెన్స్ మేనేజ్ చెయ్యి.

సరే... జాగ్రత్తగా వెళ్ళు.

ఓకే బంగారం, బాయ్.. అని కీర్తి వెళ్ళిపోతుంది.

అభి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడేమో! అయినా నన్ను మూవీకి రమ్మన్నాడు అంటే తనకి కూడా నేను అంటే ఇష్టమే. ఈరోజు ఎలాగైనా తన మనసులో ఏముందో తెలుసుకోవాలి... అని తనలో తానే అనుకుంటుంది.

ఇలా పరధ్యానంలో ఉన్న కీర్తి వైపు ఒక స్టూడెంట్ బండిని ర్యాష్‌గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు.

ఒక్కసారిగా కీర్తి చెయ్యి పట్టుకొని పక్కకు లాగుతుండగా, ఇద్దరూ కలిసి కింద పడతారు.

కీర్తి భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి, తను విరాట్ షర్ట్ కలర్ పట్టుకొని విరాట్ మీద ఉంటుంది.

విరాట్ కళ్ళు గుంటూరు మిర్చిలా ఎర్రగా ఉండడం చూస్తుంది.

వెంటనే తను విరాట్ మీద నుంచి లేచి...

వి... వి... విరాట్ సార్...

ఏయ్! నీ బుర్ర మురికి కాలువలో పెట్టి వచ్చావా?

రోడ్ మీద నడుస్తున్నప్పుడు చూసుకొని నడవడం తెలియదా? అని విరాట్ కోపంగా అంటాడు.

కీర్తికి అర్థమైంది. విరాట్ సార్ తనని పక్కకు లాగకపోతే ఆ బండి కీర్తిని గుద్దేసేది.

థాంక్యూ సార్...

అమ్మో! మూవీకి టైమ్ అయిపోతుంది. ఈ సైకో నన్ను ఆపకముందే వెళ్ళిపోవాలి... అని అనుకొని, అటువైపుగా వెళ్తున్న ఒక ఆటోని చూసి...

ఇదిగో ఆటో భయ్యా, ఆగు! థియేటర్‌కి పోవాలి... అని ఆటో ఎక్కుతుండగా, ఎవరో తనను వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది.

హే... ఎవరు? అని కోపంగా వెనక్కి తిరుగుతుంది.

వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విరాట్ ఉంటాడు.

అమ్మో! ఈ రాక్షసుడు కంట్లో పడ్డాను. అయినా ప్రతిసారీ ఈ రాక్షసుడి ఎంట్రీ ఏంటి రా దేవుడా! అని అనుకొని,

విరాట్ సార్... ఏమైనా కావాలా? అని నవ్వుతూ అడుగుతుంది కీర్తి.

ఎక్కడికి వెళ్తున్నావ్?

సార్, అది...

అక్కడ ఉన్న ఆటోని వెళ్ళిపోమంటాడు విరాట్.

ఆటో భయ్యా, ఆటో భయ్యా, ఆగు... అని కీర్తి పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు ఆటో డ్రైవర్.

ఏంటి? క్లాస్ బంక్ కొడుతున్నావా?

అయ్యో, లేదు సార్!

మరి... కాలేజ్ ఇంకా అయిపోలేదు కదా! ఇప్పుడే వెళ్ళిపోతున్నావ్ ఏంటి? అని అడుగుతూ కీర్తి చేతిలో ఉన్న మూవీ టికెట్ చూస్తాడు విరాట్.

వెంటనే కీర్తి చేతిలో నుంచి మూవీ టికెట్ బలవంతంగా తీసుకొని చించేస్తాడు విరాట్.

క్లాస్‌కి పో... అని కోపంగా వెళ్ళిపోతాడు.

అయ్యో దేవుడా! నీకు నా మీద కొంచెం కూడా జాలి లేదా? అయినా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, తొక్కుడుబిళ్ళ... ఇలా అన్ని గేమ్స్ నాతోనే ఆడాలా? నీకు ఇంకా ఎవరు దొరకలేదా దేవుడా?

ఆ విరాట్ సార్‌తో కూడా కొన్ని గేమ్స్ ఆడొచ్చు కదా! చూడడానికి కూడా బాగుంటాడు...

ఇప్పుడు ఏం చెయ్యాలి? పాపం అభి నా కోసం వెయిట్ చేస్తాడు. ఈ సైకో వచ్చి మొత్తం పాడు చేసేశాడు. ఇప్పుడు అభికి ఏం చెప్పాలి?

సరే, కాల్ చేద్దాం... అని అభికి కాల్ చేస్తుంది.

హలో అభి...

కీర్తి, ఇంకా రాలేదేంటి?

సారీ అభి, క్లాస్ బంక్ కొట్టడం అవ్వలేదు. సార్‌కి దొరికిపోయా...

అవునా?

నువ్వు మూవీకి వెళ్ళు అభి. సాయంత్రం కలుద్దాం.

ఓకే, బై...

ఛా! ఈ సైకో వల్ల మంచి ఛాన్స్ మిస్ అయిపోయా... అని క్లాస్‌కి వెళ్ళి ప్రియ పక్కన కూర్చుంటుంది కీర్తి.

కీర్తి... నువ్వేంటే ఇక్కడ? మూవీకి వెళ్ళలేదా? అని ప్రియ అడిగేసరికి, జరిగినదంతా చెప్తుంది కీర్తి.

అయినా పక్షులు వేటగాడికి దొరికినట్టు నువ్వు ప్రతిసారీ విరాట్ సార్‌కి దొరికిపోతున్నావ్ ఏంటే?

నా కర్మ! ఏం చేస్తాం... అని కీర్తి నిరాశగా అంటుంది.

@@@@@

సాయంత్రం ప్రిన్సిపాల్ సార్ క్లాస్‌లోకి వస్తారు.

అందరూ లేచి నిలబడి విష్ చేస్తారు.

గుడ్ ఈవెనింగ్ ఆల్...

మీ అందరూ ప్రాజెక్ట్ కోసం రెండు నెలలు ఇండస్ట్రీస్‌కి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ 100 మార్కులకి ఉంటుంది.

ఈ రెండు నెలలు కాలేజ్ సెలవులు. ఒకవేళ మీకు బయటికి వెళ్ళి చేయాలనిపించకపోతే, కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కూడా చేయొచ్చు.

కాలేజ్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ చేసుకుంటున్న వాళ్ళ పేర్లు నాకు ఇప్పుడు ఇవ్వండి... అని ప్రిన్సిపాల్ అంటారు.

నేను ఈ రెండు నెలలు బెంగళూరు వెళ్ళి చేస్తానే. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావ్? అని ప్రియ అడుగుతుంది.

నేను ఎక్కడికి వెళ్ళాను? ఈ రెండు నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తా.

మరి ప్రాజెక్ట్?

ప్రాజెక్ట్ లేదు, ఏం లేదు! కాలేజ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారులే.

ఈ రెండు నెలలు నచ్చిన చోటికి తిరుగుతా... అని నవ్వుతూ అంటుంది కీర్తి.

తర్వాత ప్రిన్సిపాల్‌కి తన పేరు ఇస్తుంది కీర్తి.



To be continued ❤️....