Vennela Poolu - 6 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెన్నెల పూలు - 6

Featured Books
Categories
Share

వెన్నెల పూలు - 6

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

“ఆ రోజు అతను చూసిన విషయం ఎంత తీవ్రమైనదంటే, అది జీర్ణం చేసుకోలేక అలా బ్లాంక్ గా మారిపోయాడు. మనం హిప్నటైజ్ చేసి తనకి అన్నీ గుర్తుకు వచ్చేలా చేసినప్పుడు, అదీ గుర్తుకు వస్తుంది. కాకపోతే అది ఎటువంటి  అఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడు అంచనా వెయ్యలేం. మళ్ళీ బ్లాంక్ మ్యాడ్ గా మరొచ్చు. లేదూ వయొలెంట్ గా మనం కంట్రోల్ చెయ్యలేకుండా మారొచ్చు. అప్పుడు సెల్ఫ్ డామేజ్ చేసుకోవచ్చు. లేదా ఎవరినన్నా డామేజ్ చెయ్యొచ్చు కూడా. అందువల్ల హిప్నటైజ్ చేసి అతనికి అన్నీ గుర్తుకు వచ్చేలా చెయ్యడం ప్రస్తుతానికి అయితే మంచిది కాదు."

ఎం మాట్లాడాలో తెలియనట్టుగా శకుంతల, సుస్మిత  మరోసారి ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు.    

“ఇది కేవలం ప్రస్తుతానికి సంభందించి మాత్రమే. భవిష్యత్తులో అతనిని హిప్నటైజ్ చేసి అన్నీ గుర్తుకు వచ్చేలా చేయాల్సిన పరిస్తితి కూడా రావచ్చును. అప్పుడు అది నేను చూసుకుంటాను. కానీ ప్రస్తుతానికి మాత్రం అతను విషయాలు ఏవీ ప్రత్యేకంగా గుర్తుచేసుకునేలా మనం చేయవద్దు. వేచిచూడదమే ఉత్తమమైన విషయం. నేచురల్ గా తనకి అన్నివిషయాలు గుర్తుకు వచ్చేవచ్చు కూడా. అప్పుడు ఆ విషయం కూడా అతనికి గుర్తుకువచ్చినా, అతని సబ్కాంషస్ అది ఫేస్ చెయ్యడానికి అతన్ని ప్రిపేర్ చేస్తుంది.”

“ఆ విషయం గుర్తుకు రాకుండా తక్కిన విషయాలు అన్నీ గుర్తుకు వచ్చేలా చేయలేమా?” సుస్మిత అడిగింది.

నవ్వింది సమీర. “అది సాధ్యమౌతుందని నేను అనుకోను. అన్నిటితో పాటు అదీ గుర్తుకు వచ్చే అవకాశం వుంది. నిజానికి అదేమిటో తెలియకుండా అది గుర్తుకు రాకుండా మాత్రం మనం ఎలా చేయగలం?”

“ఆల్ రైట్ సమీరా. నీ అడ్వయిజ్ నాకు అంగీకరమే. విషయాలన్నీ అతనికి ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడే రానివ్వు.” నిట్టూరుస్తూ అంది శకుంతల. “నా కొడుకు ఇలాగన్న నా కళ్ల ముందు వుంటే నాకు అదే చాలు.”

“కానీ డాక్టర్ మా అన్నయ్యకి విషయాలన్నీ గుర్తుకు రావడానికి ఎంతకాలం పట్టవచ్చు?” సుస్మిత అడిగింది.

“అది చెప్పడం కొంచెం కష్టం. అతనికి గుర్తుకు వస్తే అన్నీ ఒకవారం లోనే గుర్తుకు రావచ్చు. లేకపోతే ఒక సంవత్సరం  అలా పట్టవచ్చు.”

“మై గాడ్! నాకు ఏం మాట్లాడాలో బోధపడడం లేదు.” సుస్మిత అంది.

“ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ వుంది. ఈ లోపున విషయాలు గుర్తుకు వస్తూ రాకుండా అతను సఫర్ అవ్వవచ్చు. అతనితోటి జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. మీకు ఎప్పుడు అవసరం అనిపించినా నాకు కబురు చేయండి, నేను వస్తాను.” సమీర అంది.

“ఈ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ మీకు అన్నిరకాలుగా సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది.” మరొకసారి మాట్లాడుతూ అన్నాడు నిరంజన్.

“మనం ఇంక వెళ్ళి అరవింద్ ని చూద్దాం. అతనిని మీతో రావడానికి నేను ప్రిపేర్ చేశాను.” లేచి నిలబడుతూ అంది సమీర.

ఆ తరువాత సమీర తో సహా ఆందరూ అక్కడనుండి కదిలారు.

&&&

“మీరిద్దరూ మాత్రమే కాదు, నాకు ఎవరూ ఏమీ గుర్తుకు రావడం లేదు. ప్రస్తుతం నాకు తెలుస్తూన్నది, ఆత్మీయురాలిగా అనిపిస్తూన్నది కేవలం ఈ సమీర మాత్రమే. నాకు కేవలం ఇక్కడ మాత్రమే వుండాలని వుంది.” అరవింద్ అన్నాడు.

“నేను వచ్చి నిన్ను చూస్తూనే వుంటాను కదా. నువ్వలా ఆలోచించకు.” సమీర అంది.

“ఇక్కడ  కి వచ్చినంత  తరచూ వస్తావా? ఇక్కడ నాతో స్పెండ్ చేసినంత సమయం అక్కడ స్పెండ్ చేస్తావా? ఒకవేళ నువ్వు అవును అని చెప్పినా అది నీ వలన అవ్వదు అని నాకు తెలుసు.” చిరాకు గా అన్నాడు అరవింద్.

“నీకెలా అనిపించినా నువ్వు నీ వాళ్ళతో నీ ఇంట్లో వుంటేనే బావుంటుంది. మమూత్ ఇండస్ట్రీస్ మానేజింగ్ డైరెక్టర్ ఒక మెంటల్ కేర్ లో వున్నాడని తెలిస్తే, మన కంపెనీ పరిస్తితి ఏమవుతుంది? ఇప్పటికి నీ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం.” సుస్మిత అంది చిరాకు గా.

“అదంతా నాకు తెలియదు. సమీర లేకుండా వుండగలనని నాకు అనిపించడం లేదు.” మొండిగా అన్నాడు అరవింద్.

“అదేమిటి అరవింద్. నువ్వు నీ వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్?” సమీర కోప్పడింది.

“నేను ఒప్పుకోలేదు. అలాని నా నోటితో చెప్పలేదు. ఒప్పుకున్నానని నువ్వు అనుకున్నావ్. అది నా తప్పుకాదు.” అరవింద్ కూడా కోపం గా అన్నాడు.

“డాక్టర్ సమీరా, నేను నీతో ఒక పావుగంట పర్సనల్ గా మాట్లాడొచ్చా? నేను కేవలం ఒక పావుగంట మాత్రమే మాట్లాడతాను. కాకపోతే పూర్తి పర్సనల్ గా.” అక్కడదేదీ తను విననట్టుగా సడన్ గా అంది శకుంతల. ఆమె స్వరం లో ఒక సీరియస్నెస్ వుంది.

“తప్పకుండా మేడమ్. మీరు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మాట్లాడొచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు.” ఆశ్చర్యపడుతూ అంది సమీర.

“నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి. మనం ఒక పావుగంట పాటు డిస్టర్బ్ కాకుండా మాట్లాడుకోగలిగిన ప్లేస్ ఏమన్నా వుందా?” అదే సీరియస్నెస్ తో అడిగిందావిడ.

“మీరు నా ఛాంబర్ లో కావలసినంత సేపు మాట్లాడుకోవచ్చు. మిమ్మల్నెవరూ డిస్టర్బ్ చేయరు.” నిరంజన్ అన్నాడు.

&&&

“మా అబ్బాయి అరవింద్ ఒక ప్రెస్టీజియాస్ యూనివర్సిటీ లో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు. తరువాత   మరో ప్రెస్టీజియాస్ యూనివర్సిటీ లో ఏం బి ఏ చేశాడు. తన చదువు పూర్తయిన దగ్గరనుండి మమూత్ ఇండస్ట్రీస్ తనే చూసుకుంటున్నాడు. నేను కేవలం పేరుకి మాత్రమే తనతో పాటుగా మరో మానేజింగ్ డైరెక్టర్ ని.”

నిరంజన్ ఛాంబర్ లో ఇద్దరూ సెటిల్ అయ్యాక చెప్పడం మొదలు పెట్టింది శకుంతల, మధ్యలో టేబల్ మీద చేతులు ఆన్చుకుని సమీర మొహం లోకి చూస్తూ. సమీర మౌనం గా ఆమె చెప్పేది వింటోంది.  

“మమూత్ ఇండస్ట్రీస్ గురించి నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీ దగ్గర మా కంపనీ షేర్స్ కూడా వున్నాయి. అది ఎంత పెద్ద కంపెనీయొ, మా ప్రాఫిట్ ఇంకా టర్నోవర్ ఏమిటో చాలా మందికి తెలుసు. కానీ అరవింద్ గురించి మాత్రం ప్రత్యేకం గా చెప్పాలి. అరవింద్ చాలా స్పోర్టివ్ అండ్ యాక్టివ్. తన నాన్నగారిలాగే చాలా అందంగా ఉంటాడని కూడా ఆందరూ అంటారు.”

“ఆ విషయం నేను గ్రహించాను మేడమ్.” నవ్వుతూ అంది సమీర.

“నేనెలా ప్రాఫిట్స్ తో మైన్టైన్ చేశానో, మమూత్ ఇండస్ట్రీస్ ని తనూ అలాగే ప్రాఫిట్స్ తో మైన్టైన్ చేస్తున్నాడు. ఫారిన్ కంట్రీస్ లో మా ప్రొడక్ట్స్ సేల్స్ బాగా ఇంక్రీజ్  కావడానికి తనే కారణం. తను బాగా తెలివైనవాడు. మంచి ఫుట్బాల్ ప్లేయర్ కూడా. ఈ రోజు తనని ఇలా చూస్తున్న వాళ్ళెవరూ ఒకప్పుడు తనలా వుండేవాడు అంటే నమ్మకపోవచ్చు. కానీ నేను చెప్పేది నిజం.” శకుంతల అలాగే సమీర మొహం లోకి చూస్తూ అంది.

“నేను మీరు చెప్పేది హండ్రెడ్ పెర్సెంట్ నమ్ముతున్నాను.” ఆవిడ అదంతా ఎందుకు చెప్తూందో అర్ధం కాకపోయినా అంది సమీర.

“తన ప్రెజంట్ కండిషన్ కేవలం టెంపరరీ. తను త్వరలోనే పూర్తి మామూలుగా అయిపోతాడు కదా.” భృకుటి ముడేసింది శకుంతల.

“కచ్చితంగా మేడమ్. కొంచెం టైమ్ అయితే పడుతుందేమో, కానీ అతను పూర్తి మామూలుగా అవడం మాత్రం ఖాయం.” ధృడ స్వరం తో అంది సమీర.  

“నేను ఏదయినా నిర్ణయం తీసుకుంటే, అది మంచి నిర్ణయమో, కాదో నా ఇన్నర్ మైండ్ నాకు వెంటనే చెప్తుంది. అప్పుడు నేనది ఆలస్యం లేకుండా అమలు పరుస్తాను. ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకున్నాను. అది చాలా మంచి నిర్ణయం అని నా ఇన్నర్ మైండ్ నాకు చెప్తూంది. కానీ నేనది అమలుచేయాలంటే నీ అంగీకారం కావాలి.”

“మేడమ్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు.” అయోమయం గా చూస్తూ అంది సమీర.

“నీకు మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలన్నది నా నిర్ణయం. ప్రస్తుత పరిస్తితులలో అదొక్కటే మా సమస్య కి మంచి పరిష్కారం లా అనిపిస్తూ వుంది. నువ్వేమంటావు?”

పూర్తి శక్తిని ఉపయోగించి తనకి సడన్ గా కలిగిన ఆనందం అంతా తన మొహం లో ప్రస్ఫుటం కాకుండా జాగ్రత్త పడింది సమీర . విషయాలు ఇంత త్వరగా తమకి అనుకూలం గా వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.

“నువ్వు చెప్పిందంతా విన్నాక అరవింద్ ఎప్పుడూ ఒక సైకియాట్రిస్ట్ కేర్ లో ఉండడం మంచిది అనిపిస్తూంది. అందులోనూ అరవింద్ నీకెలాగూ అటాచ్ అయ్యాడు. నువ్వే తన భార్యవి అవడం కన్నా మంచి సొల్యూషన్ ఈ సమస్యకి ఏం వుంటుంది?”

సమీర కి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. వెంటనే దానికి ఒప్పుకోవాలని వుంది. కానీ అలా ఒప్పుకుంటే ఈ శకుంతలకి కొంచెం అనుమానం వచ్చే అవకాశం వుంది. అలాని ఒప్పుకోకపోతే తన నిర్ణయం మారిపోయే అవకాశం వుంది.

“నువ్వు నీ కెరీర్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే నీ గురించి ఒక మెంటల్ కేర్ కట్టించగలను. లేదూ నువ్వు ఈ మెంటల్ కేర్ కి వస్తూవున్న ఫరవాలేదు. అరవింద్ నీ ఫస్ట్ ప్రియారిటీ కావాలి , అది చాలు నాకు. నువ్వు తన భార్యగా వున్నావూ అంటే , అరవింద్ గురించిన చింత నాకు చాలా వరకూ తగ్గుతుంది.” సమీర కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుని నొక్కుతూ ప్రాధేయ పూర్వకంగా అడిగింది శకుంతల.

“నేను కొంచెం ఆలోచించుకోవచ్చా? ఏ విషయం రేపు మార్నింగ్ చెప్పొచ్చా?” ఆమె చేతులనుండి తన చేతిని విడిపించుకుంటూ అంది సమీర.

“ఓహ్ ష్యూర్. అందుకు అభ్యంతరం ఏమీ లేదు. " ఆనందం గా నవ్వింది శకుంతల. "కానీ రేపు మార్నింగ్ కన్నా ఎక్కువ ఆలస్యం మాత్రం అవ్వనివ్వొద్దు. అంతేకాదు, నేను నీ నుండి ఒక పాజిటివ్ ఆన్సర్ గురించి ఎదురుచూస్తూ వుంటాను.”

&&&

“నేను నా పేషేంట్స్ తో వుండే రెలాషన్షిప్ ఎప్పుడూ మర్చిపోనని చెప్పావుగా, మరి ఇదేమిటి?” సమీర చెప్పినది వినగానే నవ్వుతూ అడిగింది తనూజ.

ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రతివిషయాన్ని ఫోన్ లో షేర్ చేసుకుంటూవుంటారు. తను అరవింద్ లో వచ్చిన డెవెలప్మెంట్ గురించి చెప్పగానే , తనూ ఆనందపడి సమీర ని కంగ్రాట్యులేట్ చేసింది తనూజ. అలాగే అరవింద్ ని పెళ్లిచేసుకోబోయే విషయంలో శకుంతలకి తన నిర్ణయం చెప్పబోయేముందు తనూజ కి చెప్పకుండా వుండలేకపోయింది సమీర .

“పో అక్కా.  అందుకే నేను నీకసలు చెప్పకూడదనుకున్నాను. నువ్వీ మాట అంటావని నాకు తెలుసు.” బుంగమూతిపెట్టి కోపంగా అంది సమీర.

"ఆల్రైట్ డియర్. నువ్వు ఆ శకుంతల గారితో ఎస్ అని చెప్పడానికి నిర్ణయానికి వచ్చిన తరువాతే ఈ విషయాన్ని నాతొ షేర్ చేసుకున్నావని నేను అనుకుంటున్నాను. హార్టీ కంగ్రాట్యులేషన్స్. "

“థాంక్స్. " ఆనందంగా చెప్పింది సమీర.

“బట్ సమీ ......” సడన్గా సీరియస్ గా మారింది తనూజ వాయిస్ “.......తనకి తనెవరో కూడా గుర్తులేని పరిస్థితుల్లో తనున్నాడు. ఎందువల్ల ఆలా మాడ్ గా అయ్యాడో కూడా మనకి తెలియదు. మీరిద్దరూ ఎంత ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతూ ఉంటే మాత్రం భవిష్యత్తు లో ఎమన్నా ప్రొబ్లెమ్స్ వస్తాయేమో ఆలోచించావా?" 

“నో అక్కా. నేను ఏ విషయాలగురించీ ఆలోచించడం లేదు. అతనితో జీవితం గడపాలని నాకూ గట్టిగా అనిపిస్తూ వుంది. అందువల్ల అతని వైఖరీవల్ల ఏమన్నా ఇబ్బందులు వచ్చినా, ఐ యాం జస్ట్ ప్రిపేర్డ్ టు ఫేస్.” గట్టిగా నిట్టూర్చి అంది సమీర.

అది వినగానే పెద్దగా నవ్వింది తనూజ.

“నువ్వలా నవ్వకు . నాకు కోపం వస్తుంది.” మళ్ళీ కోపంతో బుంగమూతి పెట్టింది సమీర. “ఒక సైకియాట్రిస్ట్ ని అయినా నాకు నేను అర్ధం కాకపోవడం నన్ను చాలా ఫ్రస్ట్రేట్ చేస్తూంది. బట్ పరిస్తితి అది.”

“సైకాలజిస్ట్ లు సైకియాట్రిస్ట్ లు మనసుని అర్ధం చేసుకోగలరు. కానీ హృదయాన్ని కాదు.” మళ్ళీ నవ్వింది తనూజ. “ఒకే డియర్. నువ్వు అలాంటి పెద్ద ఇంటికి కోడలి గా వెళుతున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది. నువ్వు అట్టే ఆలస్యం చెయ్యకుండా ఆ శకుంతల గారికి నీ అంగీకారం చెప్పు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.”

“ఒకే అక్కా." కొత్త ఉత్సాహం వచ్చింది సమీర లో. “అసలు నీ పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. కానీ నీకన్నా ముందే నేను చేసుకోవాల్సి వస్తూంది. ఇదొక్కటే నాకు నచ్చడం లేదు.”

“ప్రస్తుతానికి ఆ విషయం గురించి నువ్వు ఆలోచించకు. నన్ను అంతగా అర్ధం చేసుకునే వాడు వస్తే అలాగే పెళ్లిచేసుకుంటాను.”

ఆ ఇద్దరూ మరి కాసేపు మాట్లాడుకున్నాక ఆ సంభాషణ ముగిసింది.

&&&

““నిన్ను మొదట చూడగానే నాకు కొంచెం డిస్టర్బడ్ ఫీలింగ్ కలిగింది.”

ఆ సమయం లో సమీర, సుస్మిత, సుస్మిత గదిలో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.

“ఆశ్చర్యంగా వుంది. ఎందుకలా?” చిరునవ్వుతో అడిగింది సమీర.

సమీర తన అంగీకారం తెలిపిన తరువాత , అరవింద్ , సమీరల పెళ్ళికి పెద్ద ఆలస్యం చెయ్యలేదు శకుంతల. అలాగే అరవింద్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పెళ్లి పెద్ద ఆర్భాటంగాను చెయ్యలేదు. అయినప్పటికీ రెండువేలమందికి తక్కువకాకుండా ఆ పెళ్ళికి వచ్చారు. అరవింద్ పరిస్థితి ఎవరికీ తెలియకుండా ఉండడానికి ఆ ఫ్యామిలీ అంతా బాగానే కష్టపడవలసి వచ్చింది.

“నన్ను మా కాలేజ్ లో అంతా కాలేజ్ బ్యూటీ అని చెప్పుకునేవారు. నా కన్నా ఎవరూ అందంగా వుండరేమో అనుకునేదాన్ని. కానీ నిన్ను చూసిన తరువాత నా ఇగో హర్ట్ అయింది.  నాకన్నా కూడా అందంగా వుండేవాళ్ళు వుంటారని తెలిసి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను.”

“రియల్లీ?" నవ్వింది సమీర “అయితే నా సిస్టర్ ని చూసాక నువ్వు ఇంకా డిస్టర్బ్ అయివుండాలె. తను  నాకన్నా కూడా అందంగా వుంటుంది.”

“యూ ఆర్ రైట్ వదినా. మీ అక్కచెల్లెలిద్దరూ అందం లో ఒకళ్ళ తో ఒకళ్ళు పోటీ పడుతూ వున్నారు.” చిరునవ్వుతో అంది సుస్మిత

“కానీ నీ దగ్గరనుండి ఇది నిజమైన కాంప్లిమెంట్. చాలా మంది నేను అందంగా ఉంటానని అన్నారు కానీ , నేను అది నమ్మలేదు. కానీ నీ లాంటి అందమైన అమ్మాయే చెప్పిందంటే అది నేను నమ్మాల్సిందే.” తనూ చిరునవ్వుతో అంది సమీర.

“నేను అచ్చం నా మామ్ లానే వుంటానంటారు. తను నా డాడ్ దగ్గర ఒక సెక్రటరీ గా జాయిన్ అయింది. తను ఒక పేద కుటుంబం నుండి వచ్చినా తన అందానికి ముచ్చటపడి నా డాడ్ తనని పెళ్లిచేసుకున్నారట.”

“ఆ విషయం లో ఆశ్చర్యపడాల్సినది ఏమీ లేదు. ఇప్పుడు కూడా మీ అమ్మగారు ఎంతో అందంగా వున్నారు. దానినిబట్టి తను తన యవ్వనం లో ఎంత అందంగా వుండేవారో  యిట్టె ఊహించగలం.”

“అంతేకాదు, డాడ్ పోయాక తన తెలివితేటలూ సామర్ధ్యం కూడా మామ్ నిరూపించుకుంది. బ్రో ఇంకా నేను చాలా చిన్నపిల్లలం అప్పటికి. తనే మమూత్ ఇండస్ట్రీస్ ని తన కంట్రోల్ లోకి తీసుకుని లాసెస్ లో వున్న కంపెనీ ని ప్రాఫిట్స్ లోకి తెచ్చింది. ఆ కంపెనీ ని అతిపెద్ద టర్నోవర్ వున్న కంపెనీ గా డెవలప్ చేసింది.”

“మమూత్ ఇండస్ట్రీస్ సక్సెస్ స్టోరీ, దాని వెనక వున్న మీ  మామ్ గురించి నేను చదివాను. అందరికీ మమూత్ ఇండస్ట్రీస్ అంటే చాలా నమ్మకం వుంది. నా పోర్ట్ ఫోలియో లో మేజర్ పోర్షన్ మమూత్ ఇండస్ట్రీస్ షేర్స్ కే”

ఆ తరువాత అక్కడ కొంత నిశబ్దం అలుముకుంది. ఇంకా ఏం మాట్లాడాలా అని సమీర ఆలోచిస్తూండగా, సుస్మిత అంది సడన్ గా “నా బ్రో కి సంభందించిన ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి.”

“ఏమిటది?” ఆసక్తిగా భృకుటి ముడేసింది సమీర. 

“అసలు ఏమీ గుర్తులేని నా బ్రో ఇది నీకు చెప్పే అవకాశం లేదు. ఇది నీకు చెప్తే నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావో లేదో అన్న భయం తో , నా మామ్ నీకు చెప్పివుండకపోవచ్చు.”

“నన్ను సస్పెన్స్ తో చంపకుండా విషయం చెప్పు.” చిరాగ్గా అంది సమీర. ఎదో భయం కూడా ఆవహించింది తనని.

“తనకి పెళ్ళికి ముందు ఒక లవ్ అఫైర్ వుండేది. ఆ అమ్మాయి పేరు రేవతి. ఆ అమ్మాయి మా ఫ్యామిలీ ఫ్రెండ్ భుజంగ రావు గారి అమ్మాయి.”

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)