వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
కానీ ఆ రోజు రాత్రంతా ఆ నలభై ఐదు ఏళ్ల వాడితో గడిపాక అందుకు కారణం బోధపడింది. సెకను కూడా వృధా చెయ్యకుండా ఆ రోజంతా వాడు తనని రాక్షసం గా అనుభవించాడు.
“తక్కువ డబ్బిచ్చి నిన్నీరోజు కి కొనుక్కోలేదు. నువ్వేమాత్రం ప్రతిఘటించినా నీ తల్లికి చూపించిన నరకమే నీకూ చూపిస్తాను.” ఎక్కడన్నా నొప్పిగా అనిపించి తను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా వాడు అన్నాడు.
తెల్లవారాక మిగిలిన డబ్బు తన అమ్మమ్మకి ఇస్తూ వాడు అసంతృప్తిగా మాట్లాడినా, వాడిలో తృప్తి తనకి తెలుస్తూనే వుంది. ఆ రోజంతా కుదిరినప్పుడల్లా తనని పట్టుకుని ఏడుస్తూనే వుంది తన తల్లి.
“ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం మంచిది. ఆలా చచ్చే ధైర్యం లేక ఇలా బతికున్నాం. నన్ను క్షమించమ్మా. నీ కన్నతల్లిని అయివుండీ ఆ నరకం నుండి నిన్ను నేను కాపాడలేక పోయాను.” కళ్ళనుండి నీళ్లు కారిపోతూవుంటే అంది తన తల్లి.
“నిన్ను నువ్వే కాపాడుకోలేనిదానివి నన్నేం కాపాడతావమ్మా? జరిగినదాంట్లో నీ తప్పేం లేదమ్మా.” తన కళ్ళవెంట కారిపోతూవున్న నీళ్ళని పట్టించుకోకుండా తన తల్లి కన్నీళ్ళని తుడుస్తూ అంది తను. “నీ తల్లి ఆలోచించినట్టుగా నా తల్లి ఆలోచించడం లేదు. అదే పదివేలు.”
కాలింగ్ బెల్ మోగడం తో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది శకుంతల. ఇప్పుడూ కారిపోతూవున్న కన్నీళ్ళని పట్టించుకోకుండా కుర్చీలోనుండి పైకిలేచింది. ఈ సమయం లో వచ్చిందెవరో తను వూహించగలదు
&&&
“అరవింద్ సార్ కి ఆలా అయినా దగ్గరనుండి నాకేం తోచడం లేదు. అయన మాట్లాడుతూ ఇలాగన్నా ఉండడం పెద్ద రిలీఫ్. కానీ అయన తన పేరు కూడా గుర్తు చేసుకోలేని పరిస్తితుల్లోవున్నారు అని ఇన్వెస్టర్స్ కి తెలిస్తే మన మమూత్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏమిటి? ఈ కంపెనీ కి ఆయన ఓనర్.”
సుస్మిత ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, తన బ్రదర్ దగ్గర సెక్రటరీ గా పనిచేసే మాలతి అంది.
“ఆ విషయం బయటపడకుండా తన పెళ్లి మానేజ్ చేయగలిగాము. ఇంకొన్ని రోజులు ఆలా మానేజ్ చేయలేమా?” తనుచెప్పింది విన్నాక కొంచెం అనీజీ గా అనిపించినా నవ్వుతూ అంది కుర్చీలో వెనక్కి జారబడుతూ సుస్మిత. “నువ్వేం కంగారుపడకు. చాలా త్వరలోనే మీ బాస్ మామూలుగా అయిపోతాడు.”
“అలాగ జరగాలనే నేను కోరుకుంటున్నాను.” మాలతి అంది. “కానీ అరవింద్ గారు ఇక్కడికి వస్తూ ఉండొచ్చు కదా. ఈ ఆఫీస్ ని అదీ చూస్తూ ఉంటే తనకి మంచి కాలక్షేపం అవుతుంది. అలాగే ఆయనకి విషయాలన్నీ గుర్తుకొచ్చే అవకాశమూ ఉంటుంది.”
“గుడ్ ఐడియా! నేను అన్నయ్య తోటి, వదిన తోటి ఈ విషయం మాట్లాడతాను.” సుస్మిత అంది.
“అయన మిసెస్ సైకియాట్రిస్ట్ కదా. తనని హిప్నోటైజ్ చేసి విషయాలు గుర్తుకొచ్చేలా చేస్తున్నారా?” మాలతి అడిగింది.
చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే సమీర ఏమిటి ఆలోచిస్తూందో చెప్పింది సుస్మిత. “తన ఉద్దేశం లో తనేదో అక్కడ చూసి అలా అయ్యాడు. హిప్నోటైజ్ చేస్తే తనకి అది కూడా గుర్తుకి వచ్చి మళ్ళీ సిమిలర్ అఫక్ట్ ఉండొచ్చేమో అని భయపడుతూ వుంది. అందుకని అన్నీ తనకి వాటంతట అవే గుర్తుకు వచ్చేవరకూ ఆగాలంటూంది. కానీ మాకు అప్పుడప్పుడు ఆ భవనానికి వెళ్లే అలవాటు వుంది. నా బ్రో కూడా అలాగే వెళ్లి ఉంటాడు. తాను ఇనిషియల్ గా చెప్పినట్టుగా ఎదో లాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్లే అలా జరిగివుంటుంది కానీ, నా బ్రో అక్కడ ప్రత్యేకంగా ఎదో చూసివుంటాడని నేను అనుకోవడం లేదు. ఎనీహౌ నా వదిన మాత్రం ప్రత్యేకంగా ఏదీ అతనికి గుర్తుకువచ్చేలా చెయ్యడానికి ఇష్టపడడం లేదు.”
“అరవింద్ గారికి ఆ బ్లాంక్ మ్యాడ్నెస్ ఎందుకువచ్చింది అన్నదాని గురించి నేను ఏమీ చెప్పలేను మిస్ సుస్మితా. కానీ ఆ బంగ్లాకి తను అప్పుడు వెళ్లడం మాత్రం ఎదో మామూలుగా జరిగిన విషయం కాదని నాకు అనిపిస్తూంది.” మాలతి అంది.
“నువ్వేం చెప్పదలుచుకున్నావు మాలతీ?” వెంటనే అలెర్ట్ అయిపొయింది సుస్మిత.
“సండే మార్నింగ్ తను ఆ బంగ్లాకి వెళ్లారు కదా. సాటర్డే ఈవెనింగ్ తన దగ్గరికి చింటూ వచ్చాడు.”
“చింటూ. మా ఇంట్లో సర్వెంట్. టిబ్బూ తీసుకునివచ్చాడు. ఎనీహౌ నా బ్రో కి చాలా క్లోజ్. తనకి నమ్మిన బంటులా ఉంటాడు. తన వూరు వెళ్లివస్తానని చెప్పివెళ్ళాడు. ప్రెజంట్ లీవ్ లో వున్నాడు.” విషయం అర్ధం కాకుండా అయోమయం లో వుంది సుస్మిత.
“ఆ విషయం నాకు తెలీదు. తనిలా వచ్చి అరవింద్ గారిని కలుసుకోవడం కొత్తేమీ కాదు. వచ్చినప్పుడల్లా నన్ను నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. కానీ ఆరోజు మాత్రం చాలా సీరియస్ గా వున్నాడు. తను అరవింద్ గారితో చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ మాట్లాడాలని, కాసేపు తమనెవరూ డిస్టర్బ్ చెయ్యకూడదు అని చెప్పాడు.” అంటూ ఆగింది మాలతి.
“ఆ తరువాత ........” అసహనం గా అడిగింది సుస్మిత.
“కానీ నేనొక ఇంపార్టెంట్ విషయం మీ బ్రో కి ఇంటిమేట్ చెయ్యాల్సి వచ్చింది. అందుకనే ఆయన దగ్గరకి వెళ్ళాను. అప్పుడప్పుడు అరవింద్ గారు నా మీద కోప్పడ్డం మామూలే. కానీ అప్పుడు నామీద కోప్పడ్డంతగా ఎప్పుడూ పడలేదు. “గెట్ అవుట్. నన్నడక్కుండా ఎందుకు లోపలి వస్తావ్? బుద్ధిలేదా నీకు.” అంటూ అరిచారు. దానితో నాకూ కోపం వచ్చి వెలుపలికి వచ్చేసాను.”
“కానీ అంత మాత్రం చేత ఎదో కారణం గా నా బ్రో ఆ బంగ్లాకి వెళ్లాడని అనుకోలేం కదా? ఆ మర్నాడు ఎదో మామూలుగా అక్కడికి వెళ్ళివుండొచ్చు.” కళ్ళు చిట్లించి అడిగింది సుస్మిత.
“నేనిలా నీ బ్రో ఛాంబర్ లోకి అడుగు పెట్టగానే “ఆ బంగ్లా” అన్న మాటవిన్నాను చింటూ నోటినుండి. ఆ తురవాత అయన ఏం మాట్లాడారో నాకు వినిపించలేదు కానీ “ఆ బంగ్లా” అన్న మాట మాత్రం చాలా స్పష్టం గా విన్నాను. అందువల్ల చింటూ ఆ బంగ్లా గురించి ఎదో చెప్పడం వల్లే అరవింద్ గారు అక్కడికి వెళ్లారని నాకు అనిపిస్తూంది.” మాలతి అంది.
“ఇంత ముఖ్యమైన విషయం ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదు మాలతీ?” కుర్చీలోనుండి లేచి కోపంగా అడిగింది సుస్మిత.
“ఐ యాం సారీ. నా పనుల్లో నేను బిజీ అయిపోయి ఈ విషయం పూర్తిగా మర్చిపోయాను. ఈ రోజు మీరు ఈ ప్రస్తావన తెచ్చేవరకూ నాకు ఈ విషయం గుర్తులేదు.” తనూ కుర్చీలోనుండి లేచి అంది మాలతి. “అయినా ఒక్కసారి చింటూ కి ఫోన్ చేసి అడిగిచూడండి విషయం తెలుస్తుంది.”
“యూ ఆర్ రైట్.” అని తన ఫోన్ లో చింటూ నంబర్ డయల్ చేసి చూసింది సుస్మిత అది స్పీకర్ లో పెట్టి. “దిస్ నంబర్ ఈజ్ ప్రెజంట్లీ అన్ రీచబుల్” అన్న మెసేజ్ ఇద్దరికీ స్పష్టంగా వినిపించింది.
“రాస్కెల్. వాడి విషయం టిబ్బూ తోనే మాట్లాడతాను.” కోపంగా అక్కడనుండి వెళ్ళిపోయింది సుస్మిత
&&&
“చింటూ అరవింద్ బాబు కి ప్రాణ స్నేహితుడు. తనకి అపాయం కలిగించేలా ఏదన్నా ఎందుకు చేసుంటాడన్నది నాకు బోధపడడం లేదు.” షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు టిబ్బూ సుస్మిత చెప్పింది వినగానే.
“అసలు ఆ బంగ్లా కి ఎందుకు వెళ్ళమని చెప్పాలి? మనకెవరికీ ఏం చెప్పకుండా అరవింద్ చెప్పడం ఏమిటి?” శకుంతల కూడా సిమిలర్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది. తరువాత టిబ్బూ మొహం లోకి చూస్తూ అడిగింది “టిబ్బూ ఆ బంగ్లా లో యాంటీ సోషల్ థింగ్స్ ఎమన్నా జరుగుతున్నాయా?”
“అలాంటివేమన్నా జరుగుతూ వుంటే నేను చూస్తూ ఊరుకుంటానా మేడం? అందులోనూ మీరు తరచూ అక్కడికి వెళుతూనే వున్నారు. అక్కడ ఎమన్నా అలాంటివి జరుగుతూ ఉంటే మీకు తెలియకుండా ఉంటాయా? అందులోనూ మనం ఆ బంగ్లాని ఎప్పుడూ లాక్ చేసి ఉంచుతాం” టిబ్బూ అన్నాడు.
“ఎస్ మామ్. ఒకవేళ అలాంటివేమన్నా జరుగుతూ వాటిని బ్రో చూసివున్నా అలా మాడ్ గా మారాల్సిన అవసరం ఏముంటుంది?” సుస్మిత అడిగింది.
“ముందా వెధవకి ఫోన్ చేసి అన్నయ్య తో ఏం మాట్లాడాడో కనుక్కో. విషయం అంతా తెలుస్తుంది.” కోపంతో అంది శకుంతల
“నాకా మాత్రం ఆలోచన రాలేదు మరి. నేను వాడికి ఫోన్ చేస్తూనే వున్నాను. నాట్ రీచబుల్ అని వస్తూంది.” చిరాగ్గా అంది సుస్మిత.
"అరవింద్ బాబు పెళ్ళికి పిలవడానికి నేనూ ఫోన్ చేసి చూసాను. అప్పుడు తన ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. తరవాత చాలా సార్లు వాడికి ట్రై చేశాను. నాట్ రీచబుల్ అనే వస్తూంది." టిబ్బూ అన్నాడు.
“టిబ్బూ ఏంట్రా ఇది? నువ్వే వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావ్. తిన్నింటి వాసాలనే లెక్కపెట్టినట్టు వాడిలా చేసాడు.” మరోసారి టిబ్బూ మొహం లోకి చూస్తూ కోపంగా అరిచింది శకుంతల.
“ఏం జరిగిందన్నది నాకూ అంతుపట్టడం లేదు. వాడిని ఇంత పిల్లాడిగా వున్నప్పుడు ఇక్కడ తీసుకొచిపెట్టాను. మంచివాడిలాగే వున్నాడు. అరవింద్ బాబు తో స్నేహం గా, ఆ బాబు కి ఏ ఇబ్బందీ రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. అలాంటిది అతనికి హాని కలిగించేలా ఏదన్నా చేస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు.” టిబ్బూ అన్నాడు.
“ఎస్ మామ్. మేమిద్దరం అంటే చాలా అభిమానం చూపించేవాడు. అందులోనూ బ్రో అంటే తనకి ప్రాణం. తనకి అలా అపాయం వచ్చేలా ఏం చేసాడో నాకూ బోధపడడం లేదు.” సుస్మిత అంది.
“అది వాడిని మనం కలుసుకుని మాట్లాడితే కానీ తెలియదు. వాడు తన వూరు వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళాడు. టిబ్బూ వాడు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా?” టిబ్బూ మొహంలోకి అలాగే చూస్తూ అడిగింది శకుంతల.
“ఇక్కడికి చాలా దూరం లో దబ్బెర అని ఒక కుగ్రామం లో నాకు అక్క వాడికి తల్లి అయిన ఒక ముసలావిడ ఉంటూంది ఇప్పుడు. అక్కడికే వెళ్లి ఉంటాడు.”
“ఆవిడకి ఒకసారి ఫోన్ చేసి అడిగితె అక్కడ వున్నాడో లేదో చెప్తుంది కదా.”
“ఆవిడకి ఫోన్ లాంటిది ఏమీ లేదు. ఏమీ చదువుకోని నిరక్షరాస్యురాలు.” టిబ్బూ అన్నాడు. “నేనే ఒకసారి అక్కడికి వెళ్లివస్తాను. వాడు ఏమన్నా తప్పు చేసాడని తెలిసిందో ముక్కలకింద నరికేస్తాను.” సడన్ గా కోప్పడుతూ అన్నాడు టిబ్బూ.
“నువ్వే అక్కడికి వెళ్తే ఇక్కడ పనులు చేసి తగలడేది ఎవరు? అక్కడ ఎవరన్నా నీకు తెలిసినవాళ్ళు ఉంటే, వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ వున్నాడేమో కనుక్కో. ఒకటి రెండు రోజుల్లో వాడి సమాచారం ఏమీ తెలీక పోతే వాడిమీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.” కోపంగా అంది శకుంతల.
“సరే మేడం.” అని ఇంకా అక్కడే నిలబడ్డాడు టిబ్బూ.
“నువ్వింకా ఇక్కడే తగలడ్డావెందుకు? వెళ్లి పనులు చూడు. ఒక పనికిమాలిన వెధవని తీసుకొచ్చి మా పీకల మీద పెట్టావు. ఇప్పుడు వాడు మా కొంపకే నిప్పెట్టాడు.” ఇంకా కోప్పడుతూ అంది శకుంతల.
అది విని బాధగా అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ.
““మామ్.......” అంటూ ఎదో చెప్పబోయింది సుస్మిత.
“నువ్వు నాకేం లెసన్ ఇవ్వక్కర్లేదు. నీకూ నీ వదినకి నేనెలా ఉండాలో చెప్పడం అలవాటు అయిపోయింది. ఊరి మీద పడి తిరక్కుండా, ఏవో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి కడుతున్నావుగా వాటికి చదువు.” కోపంగా అని కుర్చీలోంచి లేచి అక్కడనుండి వెళ్ళబోతూ మళ్ళీ సుస్మిత మొహం లోకి చూసి అంది. “ఆ, ఒక మాట. ఈ విషయం నీ అన్నయ్య కి తెలియనివ్వకు. వాడు అనవసరంగా ఎజిటెట్ అవ్వడం తప్ప ప్రయోజనం ఉండదు.” ఆ తరువాత అక్కడనుండి వెళ్ళిపోయింది.
ఆవిడ ఊరిమీద పడి తిరుక్కు అని ప్రత్యేకంగా అనకపోతే ఎక్కడికీ వెళ్లే ఉద్దేశం లేదు సుస్మిత కి. కానీ ఆవిడ అలా అన్నాక మాత్రం ఇక ఇంట్లోవుండబుద్ది కాలేదు.
&&&
మామూలుగానే పూర్తిగా సుఖపడ్డాక, డ్రెస్ చేసుకుని బెడ్ మీద ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూచున్నాక సుస్మిత మొహం లోకి చూస్తూ అన్నాడు శరత్ “ఇవాళ నువ్వంత వెహిమెంట్ గా పార్టిసిపేట్ చెయ్యలేదు.”
“నా మైండ్ చాలా ఆక్యుపైడ్ గా వుంది. ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది.” అని మాలతి తనకి చెప్పిన విషయం చెప్పింది.
“సో, తనేదో చూసి అలా బ్లాంక్ మాడ్ అయ్యాడన్న నీ వదిన ఆలోచన కరక్టే అన్నమాట.” ఆశ్చర్యపడుతూ అన్నాడు శరత్.
“అలాగే అనుకోక తప్పదు మరి.” నిట్టూరుస్తూ అంది సుస్మిత . “కానీ అదేమిటన్నది ఎంత ఆలోచించినా బోధపడడం లేదు.“
“వాడికో రెండు తగిలించి అడిగివుంటే విషయం అంతా చెప్పేసి వుండేవాడుగా.”
“ఈ మాత్రం ఆలోచన మా ఎవరికీ రాలేదు మరి.” చిరాకుపడుతూ అంది సుస్మిత. “వాడిప్పుడు ఇక్కడ లేడు. వాళ్ళ వూరు వెళ్లివస్తానని వెళ్ళాడు. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో వుంది.”
“ఆ వూరు ఎక్కడ వుంది?”
“అదేదో చిన్న కుగ్రామం. ఇక్కడికి చాలా దూరం లో వుంది.”
కాసేపు నిశబ్దం అలుముకుంది ఇద్దరిమధ్య.
“ఎగ్జాట్ గా చింటూ ఆ వూరికి ఎప్పుడు వెళ్ళాడు?”
“అంత కచ్చితం గా నాకు డేట్ గుర్తు లేదు. అరవింద్ మెంటల్ కేర్ లో ఉండగా ఒకసారి చూడ్డానికి వచ్చాడు అరవింద్ తన సెన్సెస్ లోకి వచ్చాక. కానీ తను తనని గుర్తుపట్టి మాట్లాడకపోవడం తో చాలా అప్సెట్ అయినట్టు కనిపించాడు. ఆ తరువాత తను వాళ్ళ వూరువెళ్తున్నాను కొద్దిరోజులలో వచేస్తానని చెప్పాడు. మేము అలాగే అన్నాము.”
“ఐ సీ “ సాలోచనగా అన్నాడు శరత్.
“వాడిని కలుసుకుని మాట్లాడితే విషయం చాలా వరకూ బోధపడే అవకాశం వుంది.”
“కొద్దిరోజులలో వచేస్తాడేమో. అన్నివిషయాలు తెలుస్తాయి.”
“వాడింక రాడేమో అని నాకు అనుమానం గా వుంది. బ్రో కి డామేజ్ జరిగేలా వాడేదో చేశాడు. అందుకని భయపడే ఇక్కడనుండి పారిపోయాడు. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని కూచున్నాడు.”
“పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరి. వాళ్లే అంతా చూసుకుంటారు.”
“ఒకటి రెండు రోజులు చూసి అలా చెయ్యాలనే మామ్ ఆలోచన.”
““అయితే ఆ విషయం గురించి నువ్వేం టెన్షన్ పడకు.”
“టెన్షన్ పడకుండా ఎలా వుండమంటావ్? నా బ్రో ఎలా ఉండేవాడు ఎలా వున్నాడు? అందులోనూ దానికి ఒక కారణం కూడా వుండివుండొచ్చు అన్నాక దానిగురించి తెలుసుకోడానికి ప్రయత్నించకుండా వుండగలనా?” మళ్ళీ చిరాకుపడుతూ అంది సుస్మిత.
“సరే ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామంటావ్?” బెడ్ మీద నుండి అపోజిట్ లో వున్న కుర్చీలోకి మారి సద్దుకుని కూచుంటూ అడిగాడు శరత్.
“నేను వెళ్ళడానికి మామ్ ఒప్పుకోదు. టిబ్బూ ని కూడా వెళ్ళొద్దని చెప్పేసింది. ఎవరో ఒకళ్ళం వాడి వూరు వెళ్తే, వాడిని కలిసి మాట్లాడి విషయాలు తెలుసుకోవచ్చు.”
“డొంకతిరుగుడు గా మాట్లాడకపోతే విషయం స్ట్రెయిట్ గా చెప్పొచ్చు కదా.” తనేం అనుకుంటూందో అర్ధమయ్యి చిరాకు పడుతూ అన్నాడు శరత్.
“నువ్వు వాడి వూరు వెళ్లి వాడితో మాట్లాడి రావచ్చు కదా.”
“నేనిదే ఎక్స్పెక్ట్ చేసాను. దేవి గారి ఆజ్ఞ అయినతరువాత తప్పుతుందా? అలాగే.” ఇంకా అలాగే చిరాకుపడుతూ అన్నాడు శరత్.
“ఓహ్ థాంక్ యూ, థాంక్ యూ, వెరీ మచ్.” బెడ్ మీద నుండి లేచి శరత్ దగ్గరికి వెళ్లి , అతని మీద చుట్టూ చేతులువేసి, నెత్తిమీద ముద్దు పెట్టుకుంది సుస్మిత.
“ఒక్క విషయం.” తన చేతుల్ని అలాగే ఉంచుకుని , తనూ లేచినిలబడి , ఆమె చుట్టూ చేతులు వేసి దక్కరకి తీసుకున్నాడు. “ఒకవేళ వాడు అక్కడలేకపోతే?
“అప్పుడు ఆలోచిద్దాం. ఏ ప్రయత్నం చెయ్యకుండా ఉండడం కన్నా ఇది మంచిది కదా.” అతని పెదవుల మీద ముద్దుపెట్టుకుంటూ అంది.
“సరే అయితే.” అలా అన్నాక మరోసారి అతను తనని బెడ్ వైపు నడిపిస్తూ ఉంటే కాదనలేదు సుస్మిత.
మరోసారి ఇద్దరూ పూర్తిగా సుఖం అనుభవించాక , అక్కడనుండి ఇంటికి చేరుకుంది సుస్మిత.
&&&
“నా పేరు రేవతి. అరవింద్ ని చూద్దామని వచ్చాను.”
హాల్లో వున్న సమీర దగ్గరకి ఒక అమ్మాయి వచ్చి అంది.
సుస్మిత ముందుగానే చెప్పివున్నా, రేవతి ని చూడగానే అప్సెట్ అయింది సమీర. నిజం చెప్పాలంటే అట్ట్రాక్టీవ్ గా, అందం గానే వుంది రేవతి.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)