వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
“నేను తనూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. తనకి జరిగింది, ఇంకా తన ప్రస్తుత పరిస్థితి కూడా నాకు తెలుసు. మెంటల్ కేర్ కె వేచిచూద్దామనుకున్నాను. కానీ కేవలం చాలా కొద్దిమందిని మాత్రమే తనని చూడ్డానికి ఎలొ చేస్తున్నారని తెలిసి రాలేదు. తరువాత నేను అర్జెంటు పనిమీద వేరే వూరు వెళ్లాల్సి వచ్చింది. అందుకనే పెళ్ళికి కూడా రాలేకపోయాను. నాకు తనని చూడ్డానికి ఇప్పుడే రావడం అయింది. “
“ఇప్పుడు కూడా ఎవరినీ తనని కలిసి మాట్లాడ్డానికి ఎలొ చెయ్యడం లేదు. తన పరిస్థితి ఇంకా పూర్తిగా బాగు కాలేదు.” సమీర అంది.
“చెప్పానుగా, నేను తనతో చాలా క్లోజ్. నన్ను చూస్తే తనకి ఎమన్నా గుర్తుకురావచ్చు.”
దానికి సమీర ఎదో చెప్పబోతూవుండగా అక్కడికి అరవింద్ వచ్చాడు.
“సమీ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్?” రేవతి వైపు చూస్తూ అడిగాడు.
“అరూ .........నేను నీకు గుర్తుకురావడం లేదా? మనిద్దరం చిన్నప్పటినుండి ఫ్రెండ్స్. కలిసి పెరిగాం.” అరవింద్ దగ్గరికి వెళ్లి తన కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుని, మొహం లోకి చూస్తూ అడిగింది రేవతి.
“నాకు నా మామ్ ఇంకా సిస్టరే గుర్తుకు రావడం లేదు ఇంకా నువ్వేం గుర్తుకువస్తావ్?” తన చేతిని విడిపించుకుంటూ చిరాగ్గా అన్నాడు శరత్ .
“కూచోండి” రేవతి ని చూడగానే లేచినిలబడ్డ తను సోఫా లో మళ్ళీ కూలబడుతూ చిరాగ్గా అంది సమీర కూడా. ఈ రేవతి రావడం తనకి నచ్చడం లేదు.
అరవింద్ సోఫాలో సమీర పక్కన కూచుంటే, వాళ్ళకి అపోజిట్ లో వున్న కుర్చీలో సెటిల్ అయింది రేవతి.
“మీరే అరవింద్ కి భార్యగా రావడం మా అందరి అదృష్టం. మీరు కచ్చితంగా అరవింద్ కి అన్నీ జ్ఞాపకం వచ్చేలా చేయగలరు.” సమీర మొహం లోకి చూస్తూ అంది రేవతి.
“నేనూ అలాగే అనుకుంటున్నాను.” సమీర అంది.
“ఇంతకీ తనకి అన్నీ గుర్తుకురావడానికి ఎంతకాలం పట్టొచ్చంటారు?” అలాగే సమీర మొహం లోకి చూస్తూ అడిగింది రేవతి.
“ఏం తను గుర్తు చేసుకుని నీకు చెప్పాల్సిన విషయాలు ఎమన్నా ఉన్నాయా?” ఎప్పుడు వచ్చిందో సుస్మిత, సమీర పక్కన సోఫా లో కూచుంటూ అడిగింది.
“నువ్వుకానీ, నీ మాట తీరు కానీ మారలేదు.” నవ్వేసింది రేవతి.
“కొంతమంది మారరు. వాళ్లతో మనమే జాగ్రత్తగా ఉండాలి.” మర్మగర్భంగా అంది సుస్మిత.
వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు టిబ్బూ. తన మొహం లో ఎక్స్ప్రెషన్ కూడా రేవతి అక్కడకి రావడం తనకి ఎంతమాత్రం ఇష్టం లేనట్టుగానే వుంది.
“తను నాకు చాలా క్లోజ్. తనకి ఇలా అయ్యేసరికి నేనూ బాగా అప్సెట్ అయ్యాను. ఏ రకంగానయినా నేను సహాయం కాగలనేమో కనుక్కుందామని వచ్చాను.” కాఫీ సిప్ చేస్తూ అంది రేవతి.
“మీ సహాయం ఏమన్నా అవసరమైతే తప్పకుండా అడుగుతాం.” సమీర అంది.
“మరింక నేను వెళ్ళొస్తాను.” కాఫీ వేగంగా సిప్ చేసి కప్పు పక్కనే కిందన పెట్టి లేచినిలబడింది రేవతి. “మిమ్మల్ని ఏరకంగానైనా ఇబ్బందిపెట్టివుంటే నన్ను క్షమించండి.”
“అటువంటిది ఏమీ లేదు.” చిరునవ్వు పులుముకుంటూ అంది సమీర.
“నిజం గా మేమిద్దరం క్లోజ్ గా వుండేవాళ్ళమా?” సుస్మిత మొహం లోకి చూస్తూ అడిగాడు అరవింద్ రేవతి అక్కడనుండి వెళ్ళిపోయాక.
దానికి ఏం చెప్పాలో తెలియక, కన్ఫ్యూజ్ అయి, సమీర మొహంలోకి చూసింది సుస్మిత.
“పర్వాలేదు. అంతా చెప్పేయ్ . తనకి అన్ని విషయాలు తెలిసివుండడమే మంచిది.” సమీర అంది.
“గాడ్! తాను అలాంటిదా?” సుస్మిత నుండి అంతా విన్నాక అన్నాడు అరవింద్.
“అవును, అలాంటిదే.” సుస్మిత అంది. “గుడ్ థింగ్ ఏమిటంటే ఆ ఎపిసోడ్ వల్ల నువ్వేం అసలు ఎఫెక్ట్ అవ్వలేదు. నిజానికి ఆ తరువాత కూడా నువ్వూ ఆ చక్రవర్తి, ఇంకా ఈ రేవతి స్నేహితులుగానే వున్నారు.”
“అందుకే తను ఇక్కడికి అంత జరిగిన తర్వాత కూడా రాగలిగింది” సమీర అంది. “ అసలు ఆ చక్రవర్తి అన్నవాడు రేవతి కి ఎలా పరిచయం?”
“వాడు తనకి కజిన్ వరస అవుతాడు. పేరెంట్స్ పోవడం తో చిన్నపట్నుండి వాళ్ళింట్లో పెరిగాడు.” సుస్మిత చెప్పింది. “నిజం చెప్పాలంటే నా బ్రో తో కూడా చిన్నపట్నుండి క్లోజ్ గానే వుంది. కాకపోతే నా బ్రో కన్నా ఎక్కువగా వాడిలో ఏం చూసిందో నాకు అర్ధం కాదు.”
“హృదయాన్ని అర్ధం చేసుకోవడం కష్టం. అది ఎవర్ని ఎందుకు ఇష్టపడుతుందో, ఎందుకు ఇష్టపడదో చెప్పలేం.” సమీర అంది.
“ఒక సైకియాట్రిస్ట్ వి అయివుండీ నువ్వీ మాట అనడం నాకు ఆశ్చర్యం గా వుంది. “ సుస్మిత అంది
“సైకాలజిస్ట్ లు, సైకియాట్రిస్ట్ లు మనసుని అర్ధం చేసుకోగలరు. హృదయాన్ని కాదు.” సమీర అంది నిట్టూరుస్తూ. “నేను నీ బ్రో తో రెలాషన్షిప్ కేవలం ప్రొఫెషనల్ గానే ఉంచాలనుకున్నాను. కానీ అది ఎందుకు లవ్ గా మారిందో ఇప్పటికీ నాకు అర్ధం కాదు.”
ఆ మాట విని నవ్వారు సుస్మిత, అరవింద్ కూడా.
“అంటే నువ్వు నా బ్రో ని నా మామ్ అడిగిందని పెళ్లిచేసుకోలేదు.” చిరునవ్వుతో అంది సుస్మిత.
“ఎంత మాత్రం కాదు.” తనూ చిరునవ్వుతో అంది సమీర. “అప్పుడు మీ మామ్ అడిగివుండకపోతే మేమె కొన్నిరోజుల తరవాత మేమే అడిగేవాళ్ళం.”
“నాకు అలా మ్యాడ్నెస్ వచ్చినందుకు రిగ్రెట్ ఏమీ లేదు. అందువల్లే కదా నాకు ఈ అందాల రాశిని పెళ్లిచేసుకోగలిగే అదృష్టం పట్టింది.” సమీర వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు అరవింద్.
“నేనూ అలాగే అనుకొంటూ వుంటాను.” అదే చిరునవ్వుతో అంది సమీర.
“ఆ మ్యాడ్నెస్ మీకు బాగానే వున్నట్టువుంది, కానీ మా అందరికీ కాదు. నువ్వు కొంచెం అన్నీ గుర్తుచేసుకోవడానికి ట్రై చెయ్యరా.” చిరుకోపంతో అంది సుస్మిత
“మీ వదిన నన్ను అనవసరం గా ఏవీ గుర్తు చేసుకోవడానికి ట్రై చేసి స్ట్రైన్ అవద్దని చెప్పింది.” సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు అరవింద్.
“ఇంక ఇలా అయితే నాకు ఏం చెప్పాలో బోధపడ్డం లేదు.” చిరాగ్గా అంది సుస్మిత. “అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నీ సెక్రటరీ మాలతి నువ్వు నీ ఆఫీస్ కి వస్తూవుంటే బావుంటుందని చెప్పింది. నువ్వు ఆఫీస్ కి వెల్తూవుంటే బావుంటుంది కదా. ఆస్తమాటూ ఇంట్లోవుంటే నీకూ బోర్ కొడుతుంది .”
“అసలు అదేం ఆఫీసో అక్కడికి వెళ్లి నేను ఏం చేసేవాడినో నాకు గుర్తు లేదు. ఇంక ఏం బావుంటుంది? “ అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయాడు అరవింద్.
“వదినా నువ్వు చెప్పకపోతే బ్రో ఏం చేసేలా కనిపించడం లేదు.” హెల్ప్లెస్స్ ఎక్స్ప్రెషన్ తో చూస్తూ అంది సుస్మిత.
“ఒకే . నీ బ్రో తో మాట్లాడి ఆఫీస్ కి వెళ్లేలా చూస్తాలే.” నవ్వి అంది సమీర .
“వదినా యిప్పటివరకూ ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పలేదు.” అని సమీర ఆసక్తిగా చూస్తూ ఉంటే తను మాలతి ద్వారా తెలుసుకున్నదంతా చెప్పింది సుస్మిత.
“అంటే అక్కడ ఏదో చూసే అరవింద్ అలా అయ్యాడన్న నా వూహ కరక్టేనన్నమాట.” సమీర సాలోచనగా అంది.
“అవును వదినా. కానీ అది ఏమయివుంటుందీ అన్నదే చాలా పెద్ద పజ్లింగ్ గా వుంది. “
“కరక్టే. చూద్దాం. అన్నీ గుర్తుచేసుకునే క్రమంలో అదే గుర్తుచేసుకుంటాడేమో నీ బ్రో.”
“బట్ వదినా, మనం ఏ ప్రయత్నం చెయ్యకుండా బ్రో కి ఏదీ గుర్తుకు వచ్చేలా కనిపించడం లేదు. నువ్వలా చెప్పావేమో తనేదీ గుర్తుచేసుకునే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు.” చిరాగ్గా అంది సుస్మిత. “నువ్వెందుకు తనని హిప్నోటైజ్ చేసి అన్నీ గుర్తుకువచ్చేలా చెయ్యకూడదు? “
“ఆల్రెడీ చెప్పాగా. దట్ మే బి ప్రూవ్డ్ ఏజ్ డేంజరస్. తనకి అన్నీ నాచురల్ గా గుర్తుకు వస్తాయేమో చూడ్డమే మంచిది.”
“ఎంతకాలం ఇలా? ఇప్పటికి నెల దాటింది. తనకి కొంచెం కూడా ఏమీ గుర్తుకు రాలేదు. మనం కొంచెం రిస్క్ తీసుకోవడం వల్ల నష్టం ఏమీ లేదు. అయినా భయపడుతూన్నంతగా ఏమీ జరగదనే నాకు అనిపిస్తూంది. “ చిరాగ్గా అంది సుస్మిత.
“చూడు సుస్మితా. ఇప్పుడు నేను కేవలం సైకియాట్రిస్ట్ ని మాత్రమే కాదు, తన భార్యని. తనకి కొంచెం కూడా రిస్క్ వచ్చేలా నేనేమీ చెయ్యను. నేచురల్ గా అన్నీ గుర్తుకువచేస్తాయేమో అని చూస్తాను మరికొంతకాలం. తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే మాత్రమే తనని హిప్నోటైజ్ చేసి విషయాలు గుర్తుచేసే ప్రయత్నం చేస్తాను. “ దృఢస్వరం తో అంది సమీర.
“నువ్వు తన భార్యగా మొన్నమొన్నమాత్రమే వచ్చావు తన జీవితం లోకి. నేను తన చెల్లెలిగా ఎప్పటినుండో వున్నాను . నీకన్నా ఎక్కువ ప్రేమే వుంది తనమీద నాకు.” సుస్మిత కోపంగా అంది.
“ఏమిటి అర్గ్యూ చేసుకుంటున్నారు?” అప్పుడే అక్కడికి వచ్చిన శకుంతల వాళ్ళకి అపోజిట్ లో వున్న కుర్చీలో కూలబడుతూ అడిగింది.
తమ ఆర్గ్యుమెంట్ కి కారణం వివరించి చెప్పింది సమీర.
“ఈ విషయం లో సమీర డిసీజెన్ ఫైనల్. భార్యగా మాత్రమే కాకుండా, ఒక సైకియాట్రిస్ట్ గా కూడా తనే సరైన నిర్ణయం తీసుకోగలదు .” ధృడంగా అంది శకుంతల. “నాకొడుకు నా కళ్ళముందర ఇలాగన్నా ఉంటే నాకు అదే చాలు. వాడికి ఏ విషయం గుర్తుకు రాకున్నా పర్వాలేదు. వాడు అప్పట్లా బ్లాంక్ గా చూస్తూ ఉండిపోయే పరిస్థితిని నేను కనీసం వూహించలేను.”
“మీ అత్తాకోడళ్ళిద్దరూ ఆలోచించుకుని ఎలా బావుంటుందంటే అలా చేస్కోండి.” అలా అన్నాక కోపంగా అక్కడనుండి వెళ్ళిపోయింది సుస్మిత.
ఆ తరువాత కాసేపు మాట్లాడుకున్నాక శకుంతల, సమీరా కూడా అక్కడనుండి వెళ్లిపోయారు.
&&&
“ఎవర్నడిగి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావ్? నిన్ను చూసి వాడికి అంతా గుర్తుకొచ్చేసి ఉంటే ఏం జరిగివుండేది?” భుజంగరావు కోపంగా అడిగాడు రేవతి మొహంలోకి చూస్తూ.
“వాడితో మధురానుభవాలు వున్నాయి కదా, గుర్తుచేసుకోవడానికి వెళ్ళిందేమో.” చక్రవర్తి అన్నాడు తనూ చిరాకుపడుతూ.
“నువ్వు నోర్ముయ్. వాడితో వున్నవి నాకు మధురానుభవాలే. నా ఖర్మ కొద్దీ నిన్నుపెళ్లిచేసుకోవాల్సి వచ్చింది.” కోపంగా అంది రేవతి.
“ఇద్దరూ నోళ్లు ముయ్యండి. నువ్వు ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. వాడింటికి అసలు ఎందుకు వెళ్ళావ్? వాడికదంతా గుర్తుకు వచ్చేసి ఉంటే ఆ చీఫ్ మనల్ని ముక్కలుగా నరికేసి వుండేవాడు.” భుజంగరావు మళ్ళీ కోపంగా అన్నాడు.
“ఎంతకాలం ఆ చీఫ్ కి ఇలా భయపడతాం? అసలు ఆ చీఫ్ కి మనం ఎందుకు భయపడాలి?” రేవతి కూడా కోపంగా అంది.
“నీకు సమాధానాలు తెలిసివున్నప్రశ్నలకి నా దగ్గరనుండి సమాధానాలు రప్పించాలని చూడకు. నువ్వెంత తెలివితక్కువ పనిచేసావో నీకు తెలీదా? నిన్ను చూసి వాడికి గతం అంతా గుర్తుకు వచ్చిఉంటే ఏం జరిగివుండేది? ఆ చీఫ్ కి అదెంత ప్రమాదకరమో నీకు తెలుసు కదా.”
“డాడ్ ........ వాడికి తన తల్లిని, చెల్లెలిని చూస్తేనే ఏమీ గుర్తుకురాలేదు, నన్ను చూస్తే ఏం గుర్తుకువచ్చేస్తాయ్? ఆ ధైర్యం తోనే వెళ్ళాను.”
“వాడితో నీకున్నది సెక్స్వుల్ కాంటాక్ట్. నువ్వు నన్ను సుఖపెడుతున్న తీరు చూస్తుంటే వాడిని ఎంత సుఖపెట్టావో అర్ధం చేసుకోగలను. నిన్ను చూడగానే వాడికి ఆ సుఖం అంతా గుర్తుకొచ్చి, దానితో పాటుగా గతం అంతా కూడా గుర్తుకువచ్చేసి ఉంటే......” అదే చిరాకుతో అన్నాడు చక్రవర్తి.
“అటువంటిది ఏమీ జరగలేదులే. వాడికి అసలు ఏమీ గుర్తుకు రాలేదు” చక్రవర్తి చెప్పింది వినగానే భయం కలిగి అది మొహం లో ప్రస్ఫూటమైంది రేవతికి. ఆ ఆలోచన తనకి రాలేదు. “అయినా మరోసారి వాడిదగ్గరికి వెళ్ళను.”
నిజానికి తమ కుటుంబానికి, చీఫ్ కి వున్న సంభందం ఎలాంటిదో, చీఫ్ ఎంత ప్రమాదకరమైన మనిషో, ఆ చీఫ్ కి కోపం రాకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో రేవతి కూడా తెలుసు. ఏదో ఇంట్లో తోచక, అరవింద్ విషయం ఎలా వుందో తెలుసుకోవడానికి వెళ్ళిందే తప్ప, అటువంటి ప్రమాదం ఉండొచ్చని రేవతి ఆలోచించలేదు.
“మీరిద్దరూ పెద్ద పనికిమాలిన వెధవలు. అలాంటి పనిచేసి గొప్ప అదృష్టాన్ని చెడగొట్టిపారేసారు. అదలా జరిగివుండకపోతే నువ్వు హ్యాపీగా వాడికి పెళ్ళానివి అయిపోయివుండేదానివి. వాడిప్పుడు గతం కూడా ఆలా మర్చిపోయివున్నందుకు ఎంతో అడ్వాంటేజ్ తీసుకుని ఉండేవాళ్ళం” చిరాగ్గా అన్నాడు భుజంగరావు
“తప్పంతా వీడిది డాడ్. తెలివితక్కువగా సెల్ ఫోన్ వాడిదగ్గర వదిలేసాడు. వాడేమో అది యాక్సెస్ చేసి మొత్తం అంతా చూసేసాడు.” కోపంగా అంది రేవతి.
“అసలు ఆ పనికిమాలిన విషయం అలా సెల్ ఫోన్ లో రికార్డ్ చెయ్యాలన్న ఐడియా ఎవరిదీ? నీకేకదా అలాంటివన్నీ చూసుకుని చూసుకుని ఆనందించే అలవాటు. నీ ఫోన్ లో రికార్డ్ చేసుకుని అది నాకు కూడా ఫార్వర్డ్ చేసావ్. అసలు నా ఫోన్ లో ఆ వీడియోలు వున్నాయనే మర్చిపోయాను. అది గుర్తువుండి ఉంటే అంత తెలివితక్కువగా ఆ సెల్ ఫోన్ వాడిదగ్గర వదిలేసేవాడిని కాదు.” చక్రవర్తి కోపంగా అన్నాడు.
“నీ కింక్స్ దగ్గర నా కింక్ ఏపాటి? అసలు.........” రేవతి కూడా కోపంగా ఎదో అనబోయింది.
“ముయ్యండి నోళ్లు ఇద్దరూ. మీరిద్దరూ ఒకళ్ళని మించిన వెధవలు ఒకరు. అసలు దీనిమీద ఆ చీఫ్ ఎలా రియాక్ట్ అవుతాడో ..........” భయంగా అన్నాడు భుజంగరావు.
ఆ ఆలోచన కేవలం అప్పుడే తమకి వచ్చినట్టుగా రేవతి, చక్రవర్తుల మొహాలు కూడా భయం తో నిండిపోయాయి.
“ఆ చీఫ్ అరవింద్ ని ఇంకా ప్రాణాలతో ఎందుకు అట్టేపెట్టాడు? వాడిని ఫినిష్ చేసేస్తే సమస్య తీరిపోతుంది కదా. వాడికేదో గుర్తుకు వస్తుందేమోనని భయపడాల్సిన అవసరం ఉండదు.” చక్రవర్తి అన్నాడు.
“ఆ చీఫ్ చాలా చిత్రం గా ఆలోచిస్తాడు. ఎందుకు వాడినింకా ప్రాణాలతో అట్టేపెట్టాడు అంటే నేను చెప్పలేను.” భుజంగరావు అన్నాడు .
“ఇదంతా ఆ చింటూ గాడివల్ల వచ్చింది. వాడు అరవింద్ కి అలా చెప్పకపోతే ఏ సమస్యా లేకపోను. నీ గురించి చీఫ్ ఆలోచిస్తాడు, తొందరపడకు అంటే వినలేదు.” చక్రవర్తి కోపంగా అన్నాడు.
“ఆ చింటూగాడెక్కడా కనిపించడం లేదు. వాడిని ఆ చీఫ్ ఫినిష్ చేసేసి ఉంటాడు. ఆ చీఫ్ వాడిని ఎలా చంపివుంటాడా అని ఆలోచిస్తూవుంటే నాకు భయంగా వుంది.” రేవతి అంది.
“చింటూ గాడు అసలు ఏం అలోచించి ఉంటాడు? చీఫ్ తో పెట్టుకుని బతికి బట్టకట్టగలననుకున్నాడా? వాడెలా హింసించి చంపుతాడో వాడికి తెలీదా? అసలు ...........” భుజంగరావు ఎదో అనబోతూవుంటే అతని సెల్ ఫోన్ మోగింది. స్క్రీన్ వైపు చూసి చిన్నగా అరిచాడు భుజంగరావు తక్కిన ఇద్దరి మొహాల్లోకి చూస్తూ “చీఫ్ దగ్గరనుండి ఫోన్.”
అందరి మొహాల్లోనూ భయం ద్యోతకమవుతూ ఉంటే ఆ ఫోన్ అటెండ్ చేసి “.......చీఫ్” అన్నాడు భుజంగరావు .
“ఫోన్ స్పీకర్ లో పెట్టు. నీ కూతురు , అల్లుడు కూడా నేను చెప్పేది వినాలి.” అవతలివైపు స్వరం కటువుగా వుంది.
“అలాగే” అంటూ ఫోన్ స్పీకర్ లో పెట్టి, మధ్యలో వున్న టేబుల్ మీద పెట్టాడు భుజంగ రావు
“అసలు నువ్వు ఏమనుకుంటున్నావ్ రేవతీ? వాడికి ఆ రోజు చూసిందేమిటో గుర్తుకు వచ్చేస్తే నేను ఫినిష్ అయిపోతే మీ కుటుంబానికి ఏ సమస్యా ఉండదని భావిస్తున్నావా? వాడికంతా గుర్తు చెయ్యాలనే నువ్వక్కడికి వెళ్ళావా?” ఫోన్ లోనుండి గొంతు కోపంగా అరుస్తూంది.
“నా ఉద్దేశం అదికాదు చీఫ్.” భయంగా తడబడుతూ అంది రేవతి. “వాడికి తన మామ్ ని, చెల్లెలిని చూస్తే ఏం గుర్తుకు రాలేదు కదా. అలాగే నన్ను చూసినా ఏమీ గుర్తుకురాదులే అనుకుని వెళ్ళాను.”
“అతి తెలివితేటలు ప్రదర్శించకు. వాళ్లతో వాడికి వున్న సంబంధం వేరు. నీతో వున్న సంబంధం వేరు. నీతో బాగా సుఖపడివున్నాడు వాడు.” ఇంకా కోపంగా మారింది ఆ గొంతు. “ఏదీ గుర్తుకు రాకపోయినా గతం లో అనుభవించిన ఆ సుఖం గుర్తుకు రావచ్చు, దానితో పాటుగా అన్నీ గుర్తుకు రావచ్చు.” చక్రవర్తి ఆలోచించినట్టుగానే చీఫ్ కూడా ఆలోచిస్తూ వున్నాడు.
“సారీ చీఫ్. నేనలా ఆలోచించ లేకపోయాను .” భయం అలాగే వుంది రేవతి గొంతులో . “నావల్ల అటువంటి పొరపాటు మళ్ళీ జరగదు. అయినా ఆ అరవింద్ కి ఏమీ గుర్తుకు రాలేదు.”
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)