వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
“ఒక్క విషయం మీరు ముగ్గురూ గుర్తుపెట్టుకోండి.” కొంచెం ఆగాక మళ్ళీ వినిపించింది ఫోన్ లోనుండి ఆ గొంతు. “నా వల్ల మీ కుటుంబం ఈ వేళ ఇలా వుంది. లేకపోతె ఎప్పుడో రోడ్డునపడి ఉండేవారు. నాకేమన్నా వ్యతిరేకంగా చెయ్యాలని చూస్తే మిమ్మల్ని ఎలా చంపుతానో మీరూహించలేరు. నాకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళని నేను ఏం చేస్తానో త్వరలోనే మీకుతెలుస్తుంది .”
చీఫ్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నాడో ముగ్గురికీ అర్ధమయ్యి, వాళ్ళ హృదయాల్లో భయం ఇంకా ఎక్కువ అయిపోయింది .
“అలా ఎందుకు ఆలోచిస్తారు చీఫ్? మీకు ద్రోహం చెయ్యాలన్న ఆలోచన మాకు కలలో కూడా రాదు.” భుజంగరావు అన్నాడు.
“మన అందరికీ అంత పెద్ద సమస్య అయిన ఆ అరవింద్ ని ప్రాణాలతో ఉంచడం ఎందుకు? వాడిని లేపేస్తే ఒక పని అయిపోతుంది కదా.” ఎలా అన్నాడో చక్రవర్తి అనేశాడు.
“నీ సలహా నేను అడిగానా? నాకు ఎవరివిషయం లో ఏం చెయ్యాలో తెలుసు. బుర్రల్ని అనవసరపు విషయాలకి వాడకుండా నా దగ్గర కుక్కల్లా పడి వుండండి. లేకపోతె కుక్కచావు చస్తారు.”
అలా అన్నాక ఆ కాల్ కట్ అయిపొయింది. ముగ్గురూ భయంతో మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు.
&&&
మరొకసారి అదే భవనం లో వుంది శకుంతల. ఈ భవనం లో తనవి మిక్స్డ్ ఫీలింగ్స్. తను ఆయనతో గడిపిన మధురమైన జ్ఞాపకాలు ఈ భవనం లో వున్నాయి. అలాగే ఆయనని పోగొట్టుకున్న అతి చేదు జ్ఞాపకం, ఇంకా కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా తనకి ఈ భవనం లో వున్నాయి.
తనకి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యం ఇంతా అంతా కాదు, తనని ఆయన ప్రేమించింది కూడా ఇంతా అంతా కాదు. తనని మమూత్ ఇండస్ట్రీస్ లో పెద్ద స్టేక్ హోల్డర్ ని చెయ్యడమే కాకుండా, మేనేజింగ్ డైరక్టర్ ని కూడా చేసేశారు.
“ఈ ఇంట్లో మీ నీడలో నన్ను హ్యాపీగా ఉండనివ్వండి. నా మీద ఎందుకు ఇలాంటి బాధ్యతలు పెడతారు?” తను అయిష్టంగా అంది. నిజం చెప్పాలంటే తనకి ఎటువంటి బాధ్యతలు ఇష్టం లేదు.
అయన నోటివెంట అప్పుడు ఆ మాటలు ఎందుకువచ్చాయో తెలీదు. భవిష్యత్తు తెలిసిన భగవంతుడే పలికించాడేమో. “ఒకవేళ నేనేమన్నా అయితే, ఈ కంపెనీ ని చూసుకోవాల్సినది నువ్వే. ఎట్టిపరిస్థితులలోనూ ఈ కంపెనీ ని మూతపడనివ్వనని నాకు మాట ఇవ్వు.”
అయిష్టం గానే ఆయనకి ఆ మాట కూడా ఇచ్చింది, ఆయన బలవంతం చేయడంవల్ల. అంతేకాదు తను రోజూ ఆయనతో పాటుగా వచ్చి కంపెనీ వ్యవహారాలన్నీ నేర్చుకుంటేకానీ ఆయన వూరుకునేవారు.
అదేమిటో తమ కంపెనీ లో సడన్ గా లాసెస్ స్టార్ట్ అయ్యాయి. తమ ప్రోడక్ట్స్ కి గిరాకీ తగ్గిపోవడమే కాకుండా, కాంపిటీటర్స్ చిన్నా , పెద్ద చాలా మంది మార్కెట్ లోకి వచ్చేసారు. నష్టాలు ఎక్కువై తమ కంపెనీ షేర్ ప్రైస్ కూడా చాలా పడిపోయింది. ఎదో ఒకటి చేసి కంపెనీ ని తిరిగి పట్టాలు ఎక్కించడానికి ప్రయత్నిస్తూన్న సమయం లో ఆయన హార్ట్ ఎటాక్ తో పోయారు.
ఆయన పోవడం తనకి ఎంత పెద్ద షాక్ అయినా, ఆయనకి ఇచ్చిన మాట మాత్రం మరిచిపోలేదు. ఒకపక్క కాంపీటీటర్స్ ని ఎదుర్కొనే వ్యూహాలు ప్రయోగిస్తూనే, పడిపోయిన ప్రైస్ దగ్గరే తమ కంపెనీ షేర్స్ ని తానే కొంది మళ్ళీ. అందువల్ల ఇన్వెస్టర్స్ కి తమ మీద నమ్మకం పెరిగి, తమ కంపెనీ షేర్ ప్రైస్ చాలా తక్కువ కాలం లోనే మామూలు స్థాయికన్నా కూడా పెరిగింది. తమ ప్రోడక్ట్స్ లో క్వాలిటీ, పబ్లిసిటీ పెంచడం వాళ్ళ మళ్ళీ సేల్స్ కూడా మామూలు స్థాయికి వచ్చేసాయి.
కంపెనీ ని నష్టాలనుండి బయటపడేసి, అలా సకెస్ఫుల్ గా నడుపుతూండడం వల్ల తనకీ చాలా మంచిపేరొచ్చింది. మ్యాగజైన్స్ లోనూ, పేపర్స్ లోనూ తనగురించి రాశారు. టీ.వీ. లోనూ తనగురించి చెప్పారు. తను ఆ స్థాయికి రావడానికి ఎవరు కారణమో తనెంత గట్టిగా అరిచిచెప్తూన్నా అదెవరూ పట్టించుకునేవారు కాదు. అదంతా తన గొప్పే అన్నట్టుగా మాట్లాడేవారు. అదిచూసి అయన పైనుండి గట్టిగా నవ్వుతున్నట్టుగా తనకి అనిపిస్తూ ఉండేది. ఇప్పటికీ, ఎప్పటికీ అయన లేనిలోటు తనకి అతిపెద్ద లోటే. అప్పుడూ, ఇప్పుడూ , ఎప్పుడూ తనకి ఇలాంటివి ఏమీ అవసరం లేదు. అయన తనుకూడా ఉంటే చాలు. అయన తనని అంతగా ప్రెమించారు. తనూ ఆయనని అంతగానూ ప్రేమించింది.
తన అప్పటి ఆ గతం తెలిస్తే ఆయన ఎలా ఫీల్ అయ్యవారో. అదంతా తెలిస్తే తనమీద ఆయనకున్న ప్రేమ ఏమైవుండేదో. ఏం జరిగినా సరే, చాలాసార్లు చెప్పాలనుకునేది, నోటి చివరివరకూ వచ్చేది, కానీ చెప్పలేకపోయేది. చివరికి తన గతం ఆయనకి తెలియకుండానే ఆయన చనిపోయారు. ఇది సంతోషించాల్సిన విషయమో, బాధపడాల్సిన విషయమో కూడా తనకి అర్ధం కాదు.
ఎంత భయంకరమైన గతం! ఎంత భయంకరమైన జీవితం! అందులో తమ తప్పు ఏమీ లేకపోయినా, అటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళని ఎవరన్నా అసహ్యించుకుంటారు. ఎంత వద్దనుకున్నా ఆ గత జీవితానికి సంభందించిన జ్ఞాపకాలు మళ్ళీ ముసురుకున్నాయి శకుంతలకి.
మరీ తనంతగా పడుకోకుండా చూడగలిగినా, మంచిబేరాలు వచ్చినప్పుడు మాత్రం తన తల్లి తప్పించగలిగేది కాదు. అయినా తాను మంచి అందంగా, బాగా యవ్వనం లో ఉండడం వల్ల, తన అమ్మమ్మ కూడా బాగా డబ్బిస్తే మాత్రమే తనతో ఎవరన్నా పడుకోడానికి అంగీకరించేది. ఎవడన్నా బాగా డబ్బిచ్చి వస్తే మాత్రం, తనకి మర్నాడు పరీక్ష వున్నా కూడా వాడితో గడపక తప్పేది కాదు. బాగా డబ్బిచ్చి ఉండడం వల్ల, వాడు రాత్రంతా తనని పూర్తిగా అనుభవిస్తే కానీ వదిలేవాడు కాదు.
తనని చదువుకోనివ్వకపోతే ఇద్దరం ఆ వృత్తి మానేస్తామని తన తల్లి బెదిరించడం తో, తన అమ్మమ్మ కి తనని కాలేజ్ కి పంపడానికి అంగీకరించక తప్పలేదు. అలాగే తను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వరకూ వచ్చింది. ఎవడూ బాగా డబ్బిచ్చి తనగురించి రాకపోతే, ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ బాగా రాసి తను మంచి మార్కుల తో పాసవ్వగలుగుతుంది. ఎవడూ తనగురించి రాకూడదని దేవుడికి నమస్కారాలు చేసుకుంది.
కానీ ఆ దేవుడికి తమ మీద దయవుంటే తమకి ఇలాంటి జీవితం ఎందుకువస్తుంది? తనకి మర్నాడు మొదటి పరీక్ష అనగా ఒకడు వచ్చాడు.
"రేపు నాకు ఫిజిక్స్ ఎగ్జామ్. రాత్రి మీరు నాకు కొంత సమయం అయినా మిగిలిస్తే , నేను చదువుకుంటాను.” అతను సాఫ్ట్ గా కనిపిస్తూవుండడం తో ఆశగా అడిగింది.
“కొంత సమయం మాత్రమే కాదు, నువ్వు రాత్రంతా చదువుకోవచ్చు. నేను నీ వంటిమీద చెయ్యికూడా వెయ్యను.” అతను అన్నాడు.
తను తన జీవితం లో ఎప్పుడూ అంతగా ఆశ్చర్యపోలేదు. “నువ్వు కనీసం లక్ష రూపాయలన్నాఇవ్వకుండా నా అమ్మమ్మ నిన్ను నా దగ్గరికి రానివ్వదు. నువ్వేం చెయ్యలేదని చెప్పినా కనీసం నీకు పైసా కూడా తిరిగిరాదు.”
నవ్వాడు అతను. “మరేం ఫర్వాలేదు. నేనా డబ్బంతా వదులుకోవడానికి సిద్ధపడే వున్నాను.”
“ఏం మాట్లాడుతున్నారు మీరు? కేవలం నాతో ఉండడానికి అంతడబ్బు ఖర్చుపెట్టారా? పిచ్చిగానీ పట్టలేదు కదా!” తను షాక్ అయిపోయింది.
“లేదు. రేపు నువ్వు పరీక్ష బాగా రాయాలని ఇలా చేస్తున్నా. నువ్వెంత సేపు కావాలంటే అంతసేపు చదువుకో. నానుండి నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు.” బెడ్ మీద ఒకపక్కగా పడుకుంటూ అన్నాడు అతను.
షాక్ నుండి బయటపడి, ఇంకేమీ ఆలోచించకుండా తను చదువుకోవడం మొదలుపెట్టింది. తను చదువు అంతా ఆ ఎక్జామ్ కి పూర్తిచేసుకునేసరికి రాత్రి రెండో ఎంతో అయింది. అతను అసలు ఎక్కడఉన్నాడో కూడా తెలియనట్టుగా నిద్రపోతూ వున్నాడు.
“నేను చదవల్సినదంతా చదివేసుకున్నాను. మీరు కావాలంటే నాతో ఇప్పుడు మీ కోరిక తీర్చుకోవచ్చు.” తనకీ నిద్రవస్తూంది కానీ బలవంతంగా ఆపుకుని, అతన్ని లేపి అంది.
“ఇప్పుడు పడుకోకపోతే రేపు ఎక్జామినేషన్ హాల్లో పడుకుంటావు. ఇంతకష్టపడి చదివి ఏం ప్రయోజనం ఉంటుంది? ఏమీ ఆలోచించకుండా ముందు హాయిగా పడుకో.” అతను అన్నాడు.
తన ధోరణి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తూవున్నా, నిద్రముంచుకొస్తూండడం వల్ల ఏమీ ఆలోచించకుండా పడుకుంది. మర్నాడు తను లేచే సమయానికి అతను వెళ్ళిపోయాడు కృతజ్ఞతలు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా.
రాత్రంతా బాగా చదువుకుని, ఇంకా చక్కగా పడుకుని కూడా ఉండడం వల్ల ఎక్జామ్ మాత్రం చాలా చక్కగా రాసింది. ఈ పరీక్షలన్ని రోజులు ఎవడూ రాకుండా ఉంటే ఎంతోబాగుంటుంది. కానీ అలా ఆలోచించడం అత్యాశ. తన అందాన్ని డబ్బుతో అనుభవిద్దామని చూసేవాళ్ళు చాలామందే వున్నారు. ఎవడన్నా తన అమ్మమ్మ పెట్టిన రేట్ ని అంగీకరిస్తే, తనకి ఎగ్జామ్స్ వున్నాయన్న విషయం అసలు పట్టించుకోదు తను.
తను భయపడ్డట్టుగా ఆ రోజు రాత్రి కూడా తన అందాన్ని అనుభవించడానికి ఒక్కళ్ళు సిద్ధం గానే వున్నారు కానీ, అతను ఆ ముందురోజు వ్యక్తే.
“నువ్వేమీ ఆలోచించకుండా హాయిగా చదువుకో. నీ ఎక్జామ్స్ అయ్యేవరకూ నీకు ఏ డిస్టర్బన్స్ ఉండదు. అన్నిరోజులకి సరిపడేలా నీ అమ్మమ్మకి నేను డబ్బులు ఇచ్చేసాను.” అతను చిరునవ్వుతో అన్నాడు.
“మీకేమన్నాపిచ్చిపట్టిందా? నా మీద చెయ్యికూడా వెయ్యడం లేదు. అయినా నా అమ్మమ్మకి అంతడబ్బిచ్చి ఇన్నిరోజులు నన్నుకొనుక్కున్నారా?” తను విస్తుపోతూ అడిగింది. “దేనిగురించి ఇలా చేస్తున్నారు?”
“నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు పరీక్షలు బాగా రాసి మంచిమార్కులతో పాసయితే నాకు చాలు.” అతను అదే చిరునవ్వుతో అన్నాడు.
“నేను పరీక్షలు బాగా రాసి మంచిమార్కులతో పాసయితే నీకేం వస్తుంది?” తనలో ఆ ఆశ్చర్యం అలాగే వుంది.
అతనినుండి సమాధానం ఏమీ లేదు. ఆ చిరునవ్వు మాత్రం అలాగే వుంది.
“ఇది నామీద ప్రేమా? అలాంటిభావాలు ఎమన్నా పెంచుకునే ముందు నేనొక వేశ్యనన్నమాట మర్చిపోవద్దు.”
దానికీ అతనినుండి సమాధానం లేదు, ఆ చిరునవ్వుతప్ప.
“నాకు ఎదో ఒక సమాధానం కావాలి. లేకపోతె నేనసలు చదవను. మీరింత డబ్బు ఖర్చుపెట్టి ప్రయోజనం ఉండదు.” తను అంది.
“ప్రేమ లాంటి పదాలు చెప్పలేను. ఇది ప్రేమ అవునో కాదో చెప్పడానికి నేను ఇంతకుముందు ఎవరినీ ప్రేమించలేదు. ఆ ప్రేమ ఎలావుంటుందో నాకు తేలీదు. నిన్ను చూడగానే నాకు ఎందుకో నీ మీద నేనే అర్ధం చేసుకోలేని భావం కలిగింది. నీ గురించి తెలుసుకుని షాకయ్యను. నువ్వు పరీక్షలు బాగా రాసి మంచిమార్కులతో పాసవ్వాలనుకుంటున్నావని తెలుసుకున్నాను. అందుకువున్న ప్రధాన అవరోధం ఏమిటో కూడా నాకు అర్ధం అయింది. అందుకే పరీక్షలన్నీ రోజులు నీకు ఇబ్బంది ఉండకూడదని ఇలాంటి ఏర్పాటు చేసాను.”
ఆ మాటలు విని తను నిర్ఘాంతపోయింది. దానికి తనకి ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
“నేను చేసిందేదీ నీగురించి చెయ్యలేదు. నా గురించనే చేసాను. ఎందుకనంటే నీకు సహాయపడడం లో నాకు ఆనందం వుంది.”
ఆ తరువాత అంతా మునపటిరోజులాగే వుంది. తను బెడ్ మీద పడుకోబోయే ముందు చెప్పాడు, తను చదువుకోవడం అయిపోతే తనని డిస్టర్బ్ చెయ్యొద్దని, తనదారిని తను పడుకోవచ్చని. తనూ అలాగే చేసింది. ప్రతిరోజూ తను లేచే సమయానికి అతను వెళ్లిపోయేవాడు. ఏవీ పెద్దగా మాట్లాడ్డానికి ప్రయత్నించేవాడు కాదు.
ఒకరోజు ఎలాగో ప్రయత్నించి కొంచెంగా అతని వివరాలు తెలుసుకోగలిగింది. అతని పేరు చలపతి. బి.ఏ. చదువుకున్నాడు. అక్కడకి చాలా దూరంలో వున్నవూళ్ళో ఒక కంపెనీలో చిన్నఉద్యోగం చేస్తున్నాడు. అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ వూళ్ళో చిన్న ఇల్లు వుంది. దానిగురించని వచ్చాడు.
&&&
ఆ రోజు ఈవెనింగ్ తనూజ ఒక్కర్తీ మాత్రమే వుంది ఆఫీసులో. తనతో పనిచేసే ఇద్దరు లాయర్లు వేరేవేరే కారణాల వల్ల వెళ్ళిపోతే, ఒక్క రూపేష్ మాత్రమే ప్రస్తుతం తనకూడా వున్నాడు. తనుకూడా వేరే పనుల మీద సెలవు పెట్టివెళ్ళాడు . తనకి రూపేష్ కి ఇద్దరికీ టైపింగ్ వచ్చు కాబట్టి, వేరే టైపిస్ట్ అవసరం తమకిరాలేదు.
ఇంకాస్సేపట్లో ఆఫీస్ క్లోజ్ చేసి , ఇంట్లోకెళ్ళి వంటా అదీ చేసుకుందాం అని ఆలోచిస్తూన్న సమయం లో ఒక జంట తన ఆఫీస్ లోకి వచ్చారు. అందులో అబ్బాయికి ఇరవైమూడు, అమ్మాయికి ఇరవై రెండు ఉండొచ్చు.
“మాకు విడాకులు కావాలి.” తనూజ ముందు కుర్చీల్లో కూచున్నాక స్ట్రెయిట్ గా విషయానికి వచ్చింది ఆ అమ్మాయి.
“డబ్బులు సమస్య కాదు. ఎంతైనా ఇస్తాం.” తనూజ ఏదైనా అనేలోపునే మళ్ళీ ఆ అమ్మాయే అంది.
ఇద్దరినీ కాసేపు పరిశీలనగా చూసింది తనూజ. చూడముచ్చటగా వున్నారు. అబ్బాయి హ్యాండ్సమ్ గా, అమ్మాయి యాక్టివ్ గా, అందంగా వుంది.
“ఎంతకాలం అయింది పెళ్ళై?”
“ఆరునెలలు.”
గట్టిగా నిట్టూర్చింది తనూజ. ఈ రోజుల్లో ఆరునెలలు కూడా ఆగకుండానే విడాకులు తీసుకుంటూన్నవాళ్ళు వున్నారు.
“ఏరంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్?”
“ఏరంజ్డ్”
సమాధానాలన్నీ ఆ అమ్మాయే ఇస్తూంది. ఆ అబ్బాయి మాత్రం మౌనంగా చూస్తూ వున్నాడు.
“విడాకులు తీసుకోవాలనుకోవడానికి కారణం?”
“ఇద్దరం కావాలనుకుంటే కారణం తో పనిలేదనుకుంటా.” చిరాగ్గా అంది ఆ అమ్మాయి. “డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ఎంతకాలం లో విడాకులు వస్తాయో ఆదిమాత్రం చెప్పండి.”
“అవును మేడం. మాకు త్వరగా విడాకులు వచ్చేలా చూడండి. ప్లీజ్.” మొదటిసారి మాట్లాడుతూ అన్నాడు ఆ అబ్బాయి.
“మీవల్ల కాదు అంటే చెప్పండి మేము మరో లాయర్ని చూసుకుంటాం.” ఆ అమ్మాయి అంది అదే చిరాకుతో.
“ఇద్దరూ కావాలనుకున్నాకూడా విడాకులు తీసుకోవాలంటే పెళ్లయి సంవత్సరం అయివుండాలి.” తనూజ చెప్పింది.
“అంతకాలం వెయిట్ చేసే ఓపిక నాకులేదు. మేము ఈ విడాకులు ఇప్పించడం లో స్పెషలిస్ట్ లయిన వేరే లాయర్ ని చూసుకుంటాం.” ఆ అమ్మాయి కుర్చీలోనుండి లేచింది.
“అలా తొందర పడకండి. మీది ఒక స్పెషల్ కేస్ గా చూపించి, మీకు విడాకులు తొందరగా వచ్చే ఏర్పాటు నేనే చేస్తాను. ముందు మీరు నాకు నేను అడిగినవి ఇవ్వండి. నేను పేపర్లన్నీ ప్రిపేర్ చేసాక మీరు వచ్చి సంతకాలు చేద్దురుగాని.” తనూజ చెప్పింది.
“మీకు కావలసినవి అన్నీ తీసుకుని ఇతను వస్తాడు. నేను సంతకాలు చెయ్యడానికి మాత్రం వస్తాను. ఎక్కువసార్లు తిరిగే ఓపిక నాకు లేదు.” ఆ అమ్మాయి అంది.
“సరే అయితే. రేపు సాయంత్రం మీరు నేను చెప్పేవాటితో రండి. మీరు సంతకాలు చెయ్యడానికి ఎప్పుడు రావాలో చెప్తాను. ఇంతకీ మీ పేరు........” అంటూ ఆగింది తనూజ.
“నా పేరు అభినవ్” ఆ అబ్బాయి చెప్పాడు.
“నా పేరు రూప.” అలా చెప్పాక ఆ అమ్మాయి లేచి నిలబడింది. “మీకు ఏమేమిటి కావాలో అతనికి చెప్పండి. అతను చూసుకుంటాడు. మరి నేను వస్తాను.” అని చెప్పి తను అక్కడనుండి వెళ్ళిపోయింది.
తీసుకురావలిసినవి ఏమిటో తెలుసుకున్నాక, అభినవ్ కూడా అక్కడనుండి వెళ్ళిపోయాడు.
&&&
మళ్ళీ మర్నాడు సాయంత్రం అభినవ్ వచ్చేవరకూ ఆ విషయమే మర్చిపోయింది తనూజ. ఎవరో ఒకరిద్దరు క్లైంట్స్ ఉంటే, అభినవ్ ని వెయిట్ చెయ్యమని చెప్పి, వాళ్ళ విషయం చూసి పంపించేసింది.
నిజానికి తనూజ విడాకులు ఇప్పించడం లో స్పెషలిస్ట్ కాదు. కానీ తన దగ్గరికి ఎవరన్నా విడాకులు కోసం వస్తే, వాళ్లతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి ఆ నిర్ణయం విరమించుకునేలా చూస్తుంది తప్ప విడాకులకి ప్రోత్సహించదు. అభినవ్, రూప విషయం లో కూడా సాధ్యమైనంత వరకూ వాళ్లతో విడాకుల నిర్ణయం విరమింప చేసుకునేలా చెయ్యడమే తనూజ ఉద్దేశం.
“అభినవ్, ఇద్దరూ కావాలనుకున్నా కూడా కోర్ట్ ఒక వాలిడ్ రీజన్ కోసం ప్రెస్ చేస్తుంది. అది లేకుండా విడాకులు కష్టం కావచ్చు. అసలు మీరు విడాకులు తీసుకుందాం అనుకోవడానికి కారణం ఏమిటి?"
తను అభినవ్ తో మాట్లాడే సమయం వచ్చాక, అతని మొహం లోకి చూస్తూ అడిగింది తనూజ.
“చెప్పక తప్పదా?” అభినవ్ మొహం ఇబ్బందిగా మారింది.
“చెప్పకపోతే విడాకులు లేటవుతాయి. ముఖ్యం గా కోర్ట్ భార్యాభర్తలు విడిపోతామంటే ఇష్టపడదు.”
“నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు.” ఇబ్బందిగా మొహం దించుకున్నాడు అభినవ్.
“నువ్వు తనకి అది చెయ్యలేకపోతున్నావ్. అంతేకదా.”
షాక్ తిన్నట్టుగా తనూజ మొహంలోకి చూసాడు అభినవ్. “మీరు, మీరెలా చెప్పగలిగారు?” ఆశ్చర్యంగా అడిగాడు.
నవ్వుతూ కుర్చీలో వెనక్కి జారగిలబడింది తనూజ. “భార్యాభర్తల మధ్య చెప్పడానికి ఇబ్బందిపడే విషయం అదితప్ప ఇంకేముంటుంది?”
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)