వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
“నా పరిస్థితి కూడా అదే. నాతొ ఎంత ప్రేమగా అభిమానం గా వున్నా, కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. నాకేదో చాలా పెద్ద సంబంధం తెచ్చి పెళ్ళిచెయ్యాలని ఆలోచిస్తూందనుకుంటాను. ఇప్పుడు మన ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో బోధపడడం లేదు.” డ్రెస్ చేసుకోవడం పూర్తయి అక్కడవున్న కుర్చీలో కూలబడింది సుస్మిత.
“నీ బ్రో కి అలా కాకుండావుండివుంటే ఎంత బావుండేదో. మన ప్రేమ విషయం నీ మామ్ తో మాట్లాడతానని మాట కూడా ఇచ్చాడు.” తనూ లేచి డ్రెస్ చేసుకోవడం పూర్తి చేసుకుని బెడ్ మీద ఎడ్జ్ లో కూచుంటూ అన్నాడు శరత్.
“బ్రో గురించి ఆలోచిస్తూంటే ఏం తోచడం లేదు. ఏం చెయ్యాలో బోధపడడం లేదు.” సడన్ గా ఆందోళనతో నిండిపోయింది సుస్మిత మొహం. “అసలు నేను నీ దగ్గరికి ఇన్ని రోజులుగా రాకపోవడానికి కూడా అదే కారణం. దేనిమీదకి నా మనసు పోలేదు అసలు.”
“నాకూ అదే పెద్ద మిస్టరీ గా వుంది. ఎంతో ఆరోగ్యంగా వుండే మనిషికి సడన్ గా ఆలా ఎలా అయింది?” శరత్ భృకుటి ముడిపడింది తను కూడా అది అర్ధం చేసుకోలేకపోతున్నాడని తెలియచేస్తూ. “ఇంతకీ నీ సైకియాట్రిస్ట్ వదిన ఏమంటూంది? తను ఎంతకాలానికి మామూలుకావచ్చు అంటూంది.”
“తను చాలా టిపికల్ గా మాట్లాడుతూంది.” సమీర ఏం అంటూంది అన్నది చెప్పింది సుస్మిత. “తను తనకి అన్నీ జ్ఞాపకం వచ్చే ప్రయత్నమేమీ చెయ్యడం లేదు సరికదా, మమ్మల్ని కూడా అటువంటి ప్రయత్నం ఏదీ చెయ్యొద్దంటూంది.”
“తను ఇప్పుడు కేవలం తన సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు తన భార్య కూడా. ఏం చెప్పినా తన మంచికోసమే చెప్తుంది. ఆలోచించకుండా తనేమీ చెప్పదు.” శరత్ అన్నాడు.
“కావచ్చు. కానీ........” హుస్సురని నిట్టూర్చింది సుస్మిత. “........ఎన్ని సార్లు నేనూ నా బ్రో ఆ బంగ్లా లోకి వెళ్ళలేదు. అక్కడ టైం గడపలేదు. మాకక్కడ ఎప్పుడూ ఏదీ స్పెషల్ గా కనిపించలేదు. మేమే కాదు మా మామ్ , టిబ్బూ అందరం అక్కడ టైం గడుపుతూ ఉంటాం. మా మామ్ అయితే ప్రతి సండే మార్నింగ్ వెళ్లి అక్కడ టైం స్పెండ్ చేస్తుంది. మాకెప్పుడూ, నా అన్నయ్య తో కలిపి, ఎలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలగలేదు అక్కడ. అలాంటిది ఏం జరిగి సడన్ గా వాడు అలా అయ్యాడో నాకు బోధపడడం లేదు.”
“ఆ సమీర ఇనీషియల్ గా చెప్పిందే కారణం అయివుంటుంది. లాక్ ఆఫ్ ఆక్సిజన్. నువ్వు ఆ విషయం గురించి ప్రత్యేకంగా ఆలోచించకు.”
“ఏమిటాలోచించకు? మా అన్నయ్యని అలా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను. తనేమీ చెయ్యడం లేదు, మమ్మల్నేమీ చెయ్యనివ్వడం లేదు, తనకన్నీ గుర్తుకురావడానికి.” చిరాకుగాను కోపంగాను అంది సుస్మిత .
అది విని నవ్వాడు శరత్. “మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. తను తన భార్య. తన నిర్ణయం ఫైనల్.”
“యూ ఆర్ రైట్. అంతే కాకుండా నా మామ్ తనకి ఫుల్ గా సపోర్ట్. అరవింద్ అలాగన్నా ఉంటే చాలు , తనకేమీ గుర్తుకు రాకపోయినా ఫర్వాలేదని ఆలోచిస్తూంది. “
“ఒక తల్లిగా తను అలా ఆలోచించడం లో ఆశ్చర్యం లేదు. “ శరత్ అన్నాడు. “అయినా నీ బ్రో చాలా లక్కీ. అలాంటి అందమైన అమ్మాయిని భార్యగా కొట్టేసాడు.”
“నేనొప్పుకుంటా.” నవ్వింది సుస్మిత కూడా. “నేను కూడా అసూయ పడేంత అందంగా ఉంటుంది.”
“తను సైకియాట్రిస్ట్ అయినా పేదింటి అమ్మాయే. అయినా నీ మామ్ తనని కోరి మరీ నీ బ్రో కి ఇచ్చి పెళ్ళిచేసింది. మన పెళ్ళికి కూడా తను ఏమీ అభ్యంతరం చెప్పదనే నేను అనుకుంటున్నాను.” శరత్ అన్నాడు.
“అక్కడ అవసరం వుంది శరత్. కొంతకాలం పాటు నా బ్రో ఒక సైకియాట్రిస్ట్ పర్యవేక్షణ లో ఉండాలి, తను నా బ్రో ని ట్రీట్ చేస్తున్న సైకియాట్రిస్ట్. తనే నా బ్రో భార్య అయితే చాలా అడ్వాంటేజ్ కదా. నా మామ్ ఆదాలోచించి తనే ఆమెని కోడలిగా తీసుకువచ్చింది , ఇంకా అది చాలా మంచి నిర్ణయమని నేనూ ఒప్పుకుంటాను. తను నా బ్రో భార్యగా ఉండడం వల్లే నేనూ నా మామ్ ఈ మాత్రం ప్రశాంతం గా వున్నాం.”
“అయితే తను మన పెళ్ళికి ఒప్పుకోకపోవచ్చంటావా?” భయంగా అన్నాడు శరత్.
“అలాని చెప్పలేను. నన్నూ, నా బ్రో ని ఎంతో ముద్దుగా చూస్తుంది. ఏమడిగినా కాదనదు. అదే ఒకోసారి చాలా స్ట్రిక్ట్ గా డిస్ప్లేయిన్డ్ గా ఉంటుంది. నేను నిన్ను పెళ్లిచేసుకుంటానని చెప్తే నవ్వుతూ వెంటనే అంగీకరించొచ్చు. లేదూ కుదరదు పొమ్మనొచ్చు. తను చాలా టిపికల్ క్యారక్టర్.”
దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు శరత్.
“నిజానికి తానొక పేద కుటుంబం లోనుండి వచ్చింది. పేదవాళ్ల ఫీలింగ్స్ తనకీ తెలిసి ఉండాలిగా. మా ఇంట్లో సర్వెంట్స్ ని అందరిని చాలా లో లెవెల్లో ట్రీట్ చేస్తుంది. ఏమన్నా అంటే సర్వెంట్స్ ని అలాగే చూడాలి అంటుంది. అలాగని తను చదువుకోని , ఆలోచనలేని నేరో మైండెడ్ అని ఆలోచించడానికి లాసెస్ లో వున్న మమూత్ ఇండస్ట్రీస్ ని ఒంటిచేత్తో ప్రాఫిట్స్ లోకి తెచ్చింది. డాడ్ పోయాక ఆ ఇండస్ట్రీస్ ని తనే నడుపుతూ వుంది. కేవలం ఒక త్రి ఫోర్ ఇయర్స్ నుండి మాత్రమే బ్రో మమూత్ ఇండస్ట్రీస్ లో మెయిన్ రోల్ తీసుకున్నాడు.”
“మరయితే మనం ఏం చేద్దాం?” శరత్ అడిగాడు.
“కొంతకాలం వేచి చూద్దాం. ఈలోగా నా అన్నయ్యకి అన్నీ గుర్తుకు వచ్చేస్తే మనకసలు సమస్యే వుండదు . మన ప్రేమ గురించి నా మామ్ తో మాట్లాడి మన పెళ్లి కుదురుస్తానని మనకి మాట ఇచ్చాడు కదా.”
“యూ ఆర్ రైట్.” తలూపాడు శరత్. “నేను తన బెస్ట్ ఫ్రెండ్ ని కూడా. మనకి సాయం చెయ్యకుండా ఎందుకుంటాడు? వేచి చూడ్డమే ప్రస్తుతం బెస్ట్ థింగ్. ఈ లోగా ప్రేమికులుగా మనం ఇలా ఎంజాయ్ చెయ్యొచ్చు కదా.”
“సరే. మరి నేను వెళ్ళొస్తాను.” కుర్చీలోనుండి లేచింది సుస్మిత.
తనూ బెడ్ మీద నుండి లేచి, ఆమెని కౌగలించుకుని, రెండు బుగ్గలమీద ముద్దుపెట్టుకున్నాడు శరత్. అందుకు రెస్పాన్స్ గా తనూ అతన్ని కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకున్నాక “ఇనఫ్ ఫర్ దిస్ డే.” అని, అతని కౌగిలి నుండి విడిపించుకుని, అక్కడనుండి బయటపడింది.
శరత్ అరవింద్ తో కలిసి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. తన చదువు పూర్తయ్యాక అతనికి తన కంపెనీ లోనే వుద్యోగం ఇప్పించాడు అరవింద్. అరవింద్ కి చాలా మంచి స్నేహితుడు కావడం వల్ల, శరత్ సుస్మిత కి కూడా పరిచయం అయ్యాడు. శరత్ చాలా మంచివాడు కూడా కావడం వల్ల ఆ పరిచయం ప్రేమగా మారినా అరవింద్ అభ్యంతర పెట్టలేదు. అంతేకాదు తమ తల్లి శకుంతలా దేవి తో మాట్లాడి, వాళ్ళ పెళ్ళికి ఒప్పిస్తానని కూడా చెప్పాడు.
&&&
“ఓహ్ టిబ్బూ, నువ్వు పెట్టిన కాఫీ చాలా బావుంది.” టిబ్బూ ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అంది సమీర.
“థాంక్ యూ మేడం.” చిరునవ్వుతో అన్నాడు టిబ్బూ.
అరవింద్, సమీర అరవింద్ రూమ్ లో వుండగా కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు టిబ్బూ .
“ఇప్పటికీ మీకు ఏమీ గుర్తు రావడం లేదా బాబూ?” అరవింద్ మొహం లోకి చూస్తూ అడిగాడు టిబ్బూ.
“లేదు టిబ్బూ, నాకేం గుర్తుకు రావడం లేదు.” అరవింద్ అన్నాడు తను కూడా టిబ్బూ ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ. “కానీ నన్ను చిన్నప్పుడు నువ్వు చాలా ఆడించేవాడివిట కదా. మామ్ చెప్పింది.”
“అవును బాబూ. మిమ్మల్ని నేనే చాలా ఆడించేవాడిని. మీరు నేను పెడితేనే కానీ అన్నం కూడా తినేవారు కాదు.” టిబ్బూ అన్నాడు . “మీరెంతో చలాకీ గా ఉండేవారు. అలాంటిది మీరిలా అయిపోవడం నాకు చాలా బాధగా వుంది.”
“నువ్వలా బాధపడకు. త్వరలోనే నీ అరవింద్ బాబు పూర్తి మామూలుగా అవుతాడు.” సమీర అంది.
“మీ మాటల మీద నాకు నమ్మకముంది. ఏ ఉలుకు పలుకు లేకుండా వుండిపోయిన తనని ఇలా చేసింది మీరే కదా.” సమీర మొహం లోకి చూస్తూ అన్నాడు టిబ్బూ. “మిమ్మల్ని చూస్తూ వుంటే నా వర్ధన్ సార్ ని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టిన శకుంతలా మేడం గుర్తుకు వస్తూ వున్నారు. అచ్చం మీ లానే ఉండేవారు.”
“అవునా?” నవ్వింది సమీర. “అయినా మీ శకుంతలా మేడం అంత గొప్ప కాదు నేను.”
“మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. మా శకుంతలా మేడం అంత గొప్ప ఎవరూ కాలేరు. తను ఈ ఇంట్లో వర్ధన్ సార్ భార్యగా అడుగుపెట్టడం ఎవరికీ ఇష్టం లేదు. చాలా ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డారు. వర్ధన్ సార్ చనిపోయాక ఆ కంపెనీ బాధ్యత కూడా తనమీద పడింది. ఎక్కడా వెరవకుండా నష్టాల్లో వున్న కంపెనీని లాభాల్లోకి తెచ్చారు.”
“నిజంగా మా ఆంటీ చాలా గ్రేట్!” మెచ్చుకోలుగా చూస్తూ అంది సమీర.
“అరవింద్ బాబు చదువు పూర్తిచేసుకుని కంపెనీ బాధ్యతలు తీసుకున్నాక తన భారం తగ్గింది. అంతా బాగానే ఉందనుకుంటూన్న సమయంలో ఇలా జరిగింది.” అరవింద్ మొహం లోకి చూస్తూ అన్నాడు టిబ్బూ విచారంగా.
“నా మామ్ ఇంత గ్రేట్ అని నేననుకోలేదు.” అరవింద్ అన్నాడు ఆశ్చర్యంగా
“ఇంతకీ మా అరవింద్ బాబు కి పూర్తిగా నయం కావడానికి, ఆయనకి అన్నీ గుర్తుకు రావడానికి ఎంతకాలం పట్టొచ్చు?” సమీర మొహం లోకి చూస్తూ అడిగాడు టిబ్బూ.
“మళ్ళీ వీళ్ళని నీ మాటలతో విసిగించడం మొదలుపెట్టావా?” సమీర ఎదో చెప్పబోతూండగా ఆ రూమ్ లోకి వచ్చిన శకుంతల అడిగింది. “నువ్వు ఈ రూమ్ లోకి రావడం చూసాను. ఎంతకీ బయటకి రాకపోయేసరికి అనుమానం వచ్చి వచ్చాను.”
“లేదు మేడం. నేను ...........” ఏదో చెప్పబోయాడు టిబ్బూ .
“నోరుమూసుకుని బయటకి నడువ్. మరోసారి మమ్మల్నెవరినన్నా నీ మాటలతో విసిగించావా పళ్ళు రాలగొడతాను. అవుట్.” గట్టిగా కోపంగా అరిచింది శకుంతల.
తలవంచుకుని అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ
“మామ్, టిబ్బూ ఏమీ తప్పుగా మాట్లాడడం లేదు. ఎందుకలా కోప్పడతావ్?” చిరాకుగా అడిగాడు అరవింద్.
“ఎస్ ఆంటీ, మీరు అయినదానికీ కానిదానికీ టిబ్బూ మీద అలా కోప్పడ్డం నాకూ నచ్చడం లేదు.” సమీర అనకుండా వుండలేకపోయింది శకుంతల ఎలా ఫీలవుతుందో అన్న భయం వున్నా. అప్పటికి అదే మొదటిసారి కాదు శకుంతల టిబ్బూ మీద అలా కోప్పడ్డం సమీర చూడ్డం.
“నీకు ఆల్రెడీ చెప్పాను. సర్వెంట్స్ ఎంత మంచివాళ్ళయినా వాళ్ళని నెత్తిమీద పెట్టుకోకూడదమ్మా. చెప్పులు ఎంత బాగా ఉంటేమాత్రం, వాటిని నెత్తిమీద పెట్టుకుని తిరుగుతామా?”
సమీర నివ్వెర పోయింది ఆవిడా ఫిలాసఫీ కి. “మీరూ ఒక పేదింటినుండే కదా వచ్చారు. పేదవాళ్ల మనోభావాలు, వాళ్ళ ఆత్మాభిమానం మీరు అర్ధం చేసుకోలేరా? మీరలా మాట్లాడితే ఎవరికన్నా బాధకాలగకుండా వుంటుందా?” కొంచెం తీవ్రంగానే అడిగింది
ఆ మాటలు విని నవ్వింది శకుంతల. “నేను పేదదానిగా వున్నప్పుడు పేదవాళ్ళు ఎలా ఉండాలో అలాగే వున్నాను. ధనవంతురాలినయ్యాక ఇప్పుడెలా ఉండాలో అలా ఉంటున్నాను. నువ్వు ఆలోచిస్తున్న తీరుకి నిన్ను నేను తప్పు పట్టను. ఇలాంటి విషయాలు అర్ధం కావాలంటే బాగా అనుభవం కావాలి.”
ఆ మాటలకి ఇంకేం మాట్లాడాలో తెలీక మౌనంగా ఉండిపోయింది సమీర. అంత పెద్ద కంపెనీ కి అధినేత అలా ఆలోచిస్తుందని ఏ రోజూ అనుకోలేదు తను. ఆవిడ ఆలోచిస్తున్న తీరు, వ్యవహిరిస్తున్న విధానం చూసాక ఆవిడమీద గౌరవం కొంత తగ్గినట్టుగానే వుంది.
“నువ్వు ప్రత్యేకంగా ఏదీ గుర్తు చేసుకోవాలని స్ట్రైన్ అవ్వకు. అన్నీ ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడే రానీ. నువ్విలాగన్నా నా కళ్ళముందు ఉంటే నాకదే చాలు.” అరవింద్ కుడిపక్కన బెడ్ మీద కూచుంటూ అంది శకుంతల. “ఈ విషయం లో సమీర ఎలాగ చెప్తే అలాగ చెయ్యి.”
“ఒకే మామ్” తలూపి అన్నాడు అరవింద్.
ఆ తల్లీ కొడుకూ ఆలా మాట్లాడుకుంటూ ఉంటే, కుర్చీలో వెనక్కివాలి చూస్తూ ఉండిపోయింది సమీర . అరవింద్ ఎదో చెప్తూ వున్నాడు కానీ తనకేమీ గుర్తుకు వస్తున్నట్టుగా లేదు.
&&&
ఆ భవనం లో శకుంతల వంటరిగా వుంది. ఎందుకనో ఆ రోజు ఆదివారం కాకపోయినా, ఆ భవనానికి వచ్చి టైం స్పెండ్ చేయాలనిపించింది. నిజానికి ఈ ఇల్లు వర్ధన్ వర్మ పూర్వీకులు ఒక గెస్ట్ హౌస్ లా కట్టించింది. తామిద్దరూ మాత్రమే ఇందులో సమయం గడిపేవారు. ఆయన చెప్పారు, ఆయన మొదటిభార్య మమత బతికివున్నప్పుడు, ఆవిడా తను మాత్రమే ఈ భవనం లో గడిపేవారట. అది విన్నాక తనకి మొదట అదొకలా అనిపించింది, కానీ అలవాటు పడిపోయింది.
తామిద్దరూ ఎంత ప్రేమ గా గడిపే వారు. తను ప్రేమించినదానికన్నా, తనని వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమించారు ఆయన.
“నువ్వింత అందంగా ఉండడం వల్లే నేను నిన్ను ఇలా ప్రేమిచండం లేదని, నా ప్రేమ బాహ్యానికి సంభందించినది కాదని నేనెలా ప్రూవ్ చేసుకోను?” ఒకరోజు ఈ భవనం లో తామిద్దరూ బెడ్ మీద ఏకాంతం లో ఉండగా ఆయన అడిగారు.
“మీరు ప్రూవ్ చేసుకోనవసరం లేదు. మీ కళ్ళల్లోకి చూసి నేను అది అర్ధం చేసుకోగలను.” తను నవ్వింది. “కానీ నేను ఇంత అందంగా ఉండడం వల్లే మీ భార్యని కాగలిగాను కాదంటారా?”
“కాదనలేను. కానీ........” అయన ఆగి అన్నారు. “.......నీలో అందం కన్నా కూడా ఇంకా ఎదో చూసాను. అందుకనే నిన్ను పెళ్లిచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.”
అందం కన్నా ఇంకా తనలో తనకే తెలియనిది అయన ఏం చూసారో తనకి తెలియదు. కానీ తన గతం ఏమిటో ఆయనకి తెలిసివుంటే ఎలా ఫీల్ అయ్యేవారో అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా చిన్నగా వణుకు వస్తుంది భయంతో శకుంతలకి.
కుర్చీలో వెనక్కి వాలి కళ్ళుమూసుకుంది శకుంతల. తన అందమైన కోడలు తనతో ఏమంది? తను ఒక పేదకుటుంబం లోనుండి వచ్చినా పేదవారి మనోభావాల్ని అర్ధం చేసుకోలేకపోతూంది. అసలు పేదరికం కన్నా కూడా తాను ఎంత భయంకరమైన స్థితిలోనుండి వచ్చిందో తెలుసుకుంటే తన కోడలు ఎలా ఫీలవుతుంది? చిన్న చిరునవ్వు వచ్చి చేరింది ఆవిడ పెదవుల మీదకి.
భయంకరమైన తన గతం ఎంత వద్దనుకున్నా తన మస్తిష్కం మీద మరోసారి దాడిచేసింది.
&&&
“తను పెద్దమనిషై ఆరునెలలు కూడా కాలేదు. ఇంకొంచం కాలం ఆగలేవా?” తన తల్లి, తన అమ్మమ్మ ని ఏడుస్తూ అడుగుతూంది. “ఈ దిక్కుమాలిన జీవితమే తనకీ జీవించక తప్పదని నాకు తెలుసు. కానీ దానికి కొంచెం అవగాహన అన్నా రానీ.”
“నేనసలు పెద్దమనిషినే కాకుండానే గదిలోకి పంపించారు తెలుసా?” తన అమ్మమ్మ అడిగింది. “పెద్దమనిషై మూడునెలలే అయితేనేం , ఏపుగా చక్కగా వుంది. ఇప్పుడుకాక నీలా ముదిరాక మంచిబేరాలు వస్తాయా? ఇంత పెద్దమొత్తం ఇస్తానని వస్తూన్నప్పుడు ఎవరన్నా వదులుకుంటారా?”
“అమ్మా, నువ్వు నీ కూతురి గురించి ఆలోచించినట్టుగా నేను నా కూతురి గురించి ఆలోచించలేను. నాలాంటి దిక్కుమాలిన బతుకు అది బతకడం నాకు ఇష్టం లేదు.” తన తల్లి ఇంకా ఏడుస్తూనే వుంది.
“మనం ఇలా బతకడం అన్నది నీ తోటి నాతోటి మొదలవలేదు. ఎప్పటినుండో వుంది. మనం ఇలా బతకాలి కాబట్టే మనల్ని ఇంత అందంగా పుట్టిస్తాడు ఆ భగవంతుడు.”
“నువ్వేమన్నా అను. కానీ ఇప్పటినుండే తనని అందుకు పంపిస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను.” తన తల్లి మొండిగా అంది.
“సరే అయితే. తను చదువుకోడానికి నేనూ ఒప్పుకోను. నీ దగ్గరికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు, నీ వల్ల రాబడి ఏం ఉండడం లేదు. నా దగ్గరికి ఎవరూ రావడం లేదు. ఊరికినే చదువులు సంధ్యలూ అంటూ డబ్బులు తగలెయ్యడానికి నేనేం రాసులు పోసుకుని కూచోలేదిక్కడ.”
ఉపయోగించాల్సిన అస్త్రమే ఉపయోగించింది తన అమ్మమ్మ. తన తల్లికి ఒప్పుకోక తప్పలేదు.
తను ఆరవ తరగతి చదువుకుంటాడగా, పది పదకొండేళ్ల వయసులో పెద్దమనిషి అయింది. ఏపుగా పదమూడేళ్లోమో అన్నట్టుగా ఉండేది కానీ తనకి ఏ విషయం తెలిసేది కాదు. తన తల్లి గదిలోకి మగవాళ్ళు వెళ్తూండడం, తరువాత ఆ మగవాళ్ల నవ్వులు, తన తల్లి ఏడుపులు ఆశ్చర్యంగా అనిపించేవి కానీ ఏమీ బోధపడేది కాదు. ఎందుకు తన తల్లి అలా ఏడుస్తూందా అని ఆశ్చర్యపడేది.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)