వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
“అంత అవసరం నాకు లేదు.” వాడు కోపంగా అని , కళ్ళు మూసుకుని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. “నేనది చేసుండకూడదు. నేనది చేసుండకూడదు. తప్పు చేసాను.”
“నువ్వు ఏం చేసుండకూడదు. ఏం తప్పు చేసావ్?”
“నేను తప్పుచెయ్యడం కాదు, వాడలా గొణుక్కున్నాడు. ఇంకా ఏమన్నాడంటే “అలా అవుతుందనుకోలేదు.”
“ఏంటలా అవుతుందనుకోలేదు?”
“నాకెలా తెలుస్తుంది? వాడు గొణుక్కున్నది చెప్తున్నాను.” చిరాగ్గా అన్నాడు వాడు.
వీడు అబద్ధం చెప్పడం లేదు. వీడు చెప్పినదానికి, జరిగినదానికి సింక్ అవుతూంది.
తరువాత ఇంకొన్ని నిమిషాలకి వాడు అన్నాడు. “ఇంక ఎంత ఆలోచించినా అంతకన్నా గుర్తుకురావడం లేదు. ఎదో మందుకోసం వాడు మాట్లాడనిది నీకు కల్పించి చెప్పలేను.”
“ఒకే. ఈ వెయ్యి రూపాయలు ఉంచుకుని, నీకు కావలసినంత తాగు.” ఒక రెండు ఐదువందల రూపాయల నోట్లు వాడి జేబులోపెట్టి, కుర్చీలోనుండి లేచాడు శరత్.
“ఒక్కసారి ఆగు. నాకు ఇంకొంచెం గుర్తుకువచ్చింది.” శరత్ అక్కడనుండి వచ్చేయబోతూ ఉండగా సడన్ గా అన్నాడు వాడు.
“ఏమిటది?” ఆసక్తిగా వాడి మొహంలోకి చూస్తూ అడిగాడు శరత్.
“ఆ చీఫ్ నన్ను బతకనివ్వడు. నేను చేసినదానికి ముక్కల కింద నరికేస్తాడు. ఇది కూడా వాడి దగ్గరనుండి విన్నాను.”
“ఎవరా చీఫ్?” శరత్ లో ఆసక్తి ఇంకా పెరిగింది.
“నేనూ అడిగాను వాడిని చీఫ్ ఎవరని. “వాడి గురించి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది.” అన్నాడు వాడు.”
“ఇంకేమన్నా చెప్పగలవా?”
“లేదు, ఇంకేం చెప్పలేను. ఇంతకన్నా నాకేం వాడు మాట్లాడుకున్నది గుర్తుకు వస్తుందని నేను అనుకోవడం లేదు.” నిట్టూరుస్తూ అన్నాడు వాడు. “కానీ నీ ఫోన్ నంబర్ ఇచ్చివెళ్ళు. నాకేమన్నా గుర్తుకువస్తే ఫోన్ చేసి చెప్తాను.”
అది మంచి ఆలోచనలా శరత్ కి కూడా అనిపించింది. “నువ్వు నాకేమన్నా విలువైన సమాచారం ఇస్తే నీకు చాలా డబ్బిస్తాను.” జగ్గడు చెప్పిన నంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తూ అన్నాడు వాడు.
“ఒక చిన్న మాట.” శరత్ పేరు అడిగి ఆ నంబర్ ని సేవ్ చేసుకున్నాక అన్నాడు వాడు.
“ఏమిటది?” నుదురు చిట్లించి అడిగాడు శరత్ ఆసక్తితో.
“నువ్వు కావాలనుకుంటే మనిద్దరం మల్లిక దగ్గరికి వెళ్లొచ్చు. చాలా అందంగా ఉంటుంది. ఎలా కావాలంటే అలా ఒప్పుకుంటుంది. కాకపోతే కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది.”
“అక్కర్లేదు.” మరోసారి మనసంతా అసహ్యంతో నిండిపోతూవుంటే, అక్కడనుండి వేగంగా వచ్చేసాడు శరత్.
&&&
“ఎవరో చీఫ్ వాడిని చంపడం కాదు. వాడిని నేనే ముక్కలు, ముక్కలు గా నరికేస్తాను. వెధవ వాడిలా తయారవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు.” సుస్మిత చెప్పింది వినగానే కోపంగా అన్నాడు టిబ్బూ.
శరత్ తను తెలుసుకున్నదంతా చెప్పగానే, అది తెచ్చి ఇంట్లో పోస్ట్ చేసింది సుస్మిత అరవింద్ లేని సమయం చూసుకుని.
“నువ్వు తీసుకొచ్చి ఈ ఇంట్లోపెట్టిన నీ మేనల్లుడు ఏం చేస్తున్నాడో కూడా తెలీని పరిస్థితుల్లో నువ్వున్నావ్! నిజానికి మీ ఇద్దరూ కలిసి ఎదో గూడుపుఠాణి చెయ్యడం లేదు కదా?” టిబ్బూ మొహం లోకి చూస్తూ కోపంగా అరిచింది శకుంతల.
“ఈ ఇంటి ఉప్పు తిని బతుకుతున్నాను. ఈ ఇంటికి ద్రోహం చేసే ఆలోచన ఎప్పుడూ రాదు.” టిబ్బూ మొహం లో బాధ స్పష్టంగా వుంది. “అరవింద్ బాబు కే అలా ద్రోహం చేస్తాడని తెలిస్తే, వాడిని ఈ ఇంటికి తీసుకురాకపోవడం కాదు, ఎప్పుడో చంపేసేవాణ్ని.”
“మామ్, ఇందులో టిబ్బూ తప్పులేదు. టిబ్బూ అలా చేసే మనిషి కాదు.” సుస్మిత కోపంగా అంది.
“ఇంతకీ దేవి గారికి ఇంత సమాచారం ఎలా తెలిసింది? ఎలా సేకరించగలిగారు?” సడన్ గా గుర్తుకువచ్చినట్టుగా సుస్మిత మొహం లోకి చూస్తూ అడిగింది శకుంతల.
“మామ్ అదీ...........” విషయం ఎలా చెప్పాలో తెలియక తడబడింది సుస్మిత.
“నసక్కుండా విషయం చెప్పు. నాకు చెప్పకుండా చాలా చేస్తున్నావన్నమాట.” శకుంతల లో కోపం ఇంకా ఎక్కువైంది.
తనప్పుడు ఇంక అక్కడ అనవసరం అన్నట్టుగా టిబ్బూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.
“నేను శరత్ ని పంపించాను. శరత్ వాడి వూరికి వెళ్లి ఈ సమాచారం అంతా సేకరించాడు.” స్ట్రెయిట్ గా చెప్పేసింది సుస్మిత. ఇంకా అడిగితె చాలా విషయాలు స్ట్రెయిట్ గా చెప్పెయ్యాలన్న నిర్ణయానికి వచ్చేసింది.
“శరత్ అంటే ......... మన ఆఫీస్ లో పనిచేస్తున్నాడు.........”
"అన్నయ్యకి మంచి ఫ్రెండ్ కూడా."
"అన్నయ్యకి మంచి ఫ్రెండ్, మరి నీకు? జస్ట్ నువ్వు చెప్తే అంత దూరం వెళ్లి ఈ సమాచారం అంతా సేకరించుకుని వచ్చాడా?" ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్ అలాగే వుంది ఆవిడ మొహం లో.
"మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్ళిచేసుకోవాలని అనుకుంటున్నాం." ఎలా అలా చెప్పేగలిగిందో సుస్మిత కె బోధపడ్డం లేదు.
తరువాత ఇంక తన తల్లిమొహం లోకి చూడలేక తలదించుకుంది. “తను చాలా మంచివాడు. బాగా చదువుకున్నాడు కూడా. అన్నయ్యకి......."
"రేపు ఈవెనింగ్ వచ్చి నన్ను కలవమని చెప్పు." సుస్మితని కట్ చేస్తూ అంది సుస్మిత. "నేను తనతో మాట్లాడాలి." ఆవిడ మొహం లో సీరియస్ ఎక్స్ప్రెషన్ అలాగే వుంది.
ఏదో చెప్పాలనుకుంది కానీ, ఏం చెప్పాలో బోధపడలేదు సుస్మిత కి. "ఒకే మామ్ “ అని అక్కడనుండి వెళ్తూ ఉంటే వెనకాలగా ఆవిడ అంది.
“నువ్వు నీ బ్రో దగ్గర అనవసరం గా ఏదీ వాక్కు. ఏది చెయ్యాలో అదంతా నేను చేస్తాను.”
“అలాగే మామ్.” వెనక్కి తిరక్కుండానే అని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సుస్మిత.
&&&
"ఇంతకీ నీ మామ్ నన్ను ఎందుకు రమ్మన్నట్టు?" ఆందోళనగా చూస్తూ అన్నాడు శరత్. "నిన్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్తుందా, లేకపోతె నా కూతురివైపు కన్నెత్తి చూసావంటే కాళ్ళు విరగ్గొడతానని చెప్తుందా?"
అది విని నవ్వింది సుస్మిత. "రెండిట్లో ఎమన్నా ఆశ్చర్యం లేదు. చెప్పాను కదా నా మామ్ చాలా టిపికల్ క్యారక్టర్."
"అయినా మన పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది? నెమ్మదిగా ఎప్పుడో చెప్పేవాళ్ళం." కోపంగా అన్నాడు శరత్.
"ఎప్పుడన్నా నా మామ్ క్యారక్టర్ అంతే. ఎదో ఒక రోజు మనం ఈ రిస్క్ తీసుకోక తప్పదు. అందుకనే ఈ డేరింగ్ చేసాను. ప్రేమించుకునేవాళ్ళకి ఈ మాత్రం డేరింగ్ లేకపోతే ఎలా?" కళ్ళు చిట్లించింది సుస్మిత.
"ఎందుకో నీ మామ్ విషయం తల్చుకుంటూ ఉంటే, ఇది డేరింగ్ కన్నా ఎక్కువ అనిపిస్తుంది. నాతో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడినా, ఆవిడ చాలా స్ట్రిక్ట్ అని నాకూ తెలుసు. నువ్వెప్పుడూ ఆవిడ తో భయపడుతూనే మాట్లాడతావు. ఒక్క నీ బ్రో ఆవిడతో ఫ్రీ గా బిహేవ్ చెయ్యడం చూసాను."
"నువ్వు ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే నేను నా మామ్ తో మాట్లాడడం చూసావు. నిజానికి నా మామ్ తక్కిన మామ్ ల అందరికన్నా మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తుంది. నా బ్రో కన్నా కూడా నేనే ఎక్కువ చనువుగా నా మామ్ తో వుంటాను. సర్వెంట్స్ ని పెట్టి చేయించుకునే శక్తివున్నా, మా ఇద్దరి బాగోగులు స్వయం గా తానే చూసేది."
అది విని గట్టిగా నిట్టూర్చాడు శరత్ కానీ ఏమీ మాట్లాడలేదు.
"తన మీద చాలా ప్రెజర్ ఉంటుంది ఈ బిజినెస్ వల్ల. అందువల్ల తన మనసు ఎప్పుడూ ఆక్యుపైడ్ గా ఉంటుంది. దాని కారణం గా ఆవిడా స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది."
"అయితే ఆవిడ మన పెళ్ళికి అంగీకరించవచ్చంటావా?"
"హండ్రెడ్ పెర్సెంట్. నువ్వు బాగా చదువుకున్నావు. బ్రో కి మంచి ఫ్రెండ్ వి. నిన్ను కాదనడానికి కారణం ఏముంటుంది చెప్పు?" మళ్ళీ కళ్ళు చిట్లించింది సుస్మిత.
శరత్ ఇంకా ఎదో చెప్పబోతూ ఉంటే అతనిని గట్టిగ కౌగలించుకుని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. "ఇంక వేరే ఏం మాట్లాడకు. నేను చెప్పానుగా, అంతా పాజిటివ్ గా వుంటుంది."
సుస్మిత అలా అన్నాక , తన బెంగ మర్చిపోయి సుస్మిత ని ఎంజాయ్ చెయ్యడం లో పడ్డాడు శరత్. కాకపోతే తమ పెళ్ళికి శకుంతల స్ట్రెయిట్ గా ఒప్పుకుంటుందా లేదా, ఒప్పుకోకపోతే ఏం చెయ్యాలి అన్న బెంగ ఇద్దరికీ వుంది, కాకపోతే ఇంకప్పుడు నెగటివ్ గా మాట్లాడుకోవడం ఇష్టం లేక ఆ విషయం చర్చించుకోలేదు. మరీ ఆ ఆలోచనతోటె సతమవుతూ ఉండడం వల్ల, ఒకసారి వేడిదింపుకున్నాక శరత్ ని మళ్ళీ బలవంతం చెయ్యలేదు సుస్మిత.
“ఈ చీఫ్ ఎవరు? బ్రో విషయం లో ఈ కొత్త ట్విస్ట్ ఏమిటి? అసలు ఆ బంగ్లా లో ఎవరూ చూడలేని విషయానికి ఇంత పెద్ద మిస్టరీ ఏమిటి?" డ్రెస్ చేసుకుని బెడ్ మీద ఇద్దరూ పక్క పక్కన కూచున్నాక సుస్మిత అంది.
"ఎవరూ చూడకపోవడమేమిటి? నీ బ్రో చూసాడు." శరత్ అన్నాడు. "సో ఫార్, మనకి సందేహం లేకుండా ఎస్టాబ్లిష్ అయినా విషయం ఏమిటంటే అక్కడ ఎదో చూడ్డం వల్లే నీ బ్రో అలా అయ్యాడు. అది మరింకెవరూ ఎందుకు చూడలేకపోయారు అన్నదే అర్ధం కావడం లేదు."
"వన్ మినిట్. ఆ చింటూ గాడు కూడా అదిచూసాడు. వాడికి అది తెలుసుకాబట్టే బ్రో ని అక్కడికి వెళ్ళమని ప్రాంప్ట్ చేసాడు." సడన్ గా అప్పుడే తట్టింది సుస్మిత కి ఆ విషయం.
"అంతే కాదు, ఆ చీఫ్ కి కూడా ఆ విషయం తెలుసుండాలి. లేకపోతె ఆ చీఫ్ కి చింటూ ఎందుకు అలా భయపడుతూ ఉండాలి తనలా చేసినందుకు?" శరత్ కూడా ఆ యాంగిల్లో అప్పుడే ఆలోచించాడు.
"యూ ఆర్ రైట్." సుస్మిత అవునన్నట్టుగా తలూపింది. "ఇంకా కొంతమందికి ఆ విషయం తెలిసివుండొచ్చు. కాకపోతే ఆ విషయం ఏమిటి, ఇంకా ఎంతమందికి ఆ విషయం తెలుసు అన్నదే మనకి తెలియడం లేదు." చిరాగ్గా అంది.
"మీ అన్నయ్యకి గతం గుర్తుకు వచ్చేస్తే మనకి ఆ విషయం ఏమిటన్నది మాత్రమే కాదు, అది ఇంకా ఎంతమందికి తెలుసు, మరి ఆ చింటూ కి కూడా ఆ విషయం తో వున్న సంబంధం ఏమిటి అన్న విషయాలు కూడా తెలిసే అవకాశం వుంది. ఆ చీఫ్ ఎవరు అన్నది కూడా తెలీ వచ్చేమో. "
"కానీ ఆ మహా పతివ్రత తనని ఇబ్బంది పెట్టె ఏ పనీ చెయ్యనివ్వడం లేదు. తనకి సహజం గా గుర్తుకువచ్చినప్పుడే గుర్తుకువస్తాయి తప్ప ప్రత్యేకంగా ఏదీ చెయ్యకూడదంటూంది." ఇంకా చిరాకు పడిపోయింది సుస్మిత.
సుస్మిత చిరాకు చూసి ఆపుకోలేక నవ్వాడు శరత్. దానికి కోపంగా ఎదో అందామనుకున్న సుస్మిత కి సడన్ గా ఒక ఆలోచన వచ్చింది.
"ఐడియా .........." అంది బెడ్ మీదనుండి లేస్తూ.
"ప్లీజ్ మళ్ళీ నన్ను ఇంకా ఎక్కడికో పంపే ఆలోచన మాత్రం చెయ్యకు." వేడికోలుగా అన్నాడు శరత్ తాను కూడా బెడ్ మీద నుండి లేస్తూ.
"నిన్ను పంపడం కాదు నేనే వెళతాను."
"ఎక్కడికి? నువ్వు వెళ్లడం అన్నది నాకసలు ఇష్టం లేని విషయం." గాభరాగా అన్నాడు శరత్.
నవ్వి, శరత్ ని కౌగలించుకుని అతని కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది సుస్మిత. "ఎక్కడికో కాదు. రేవతి అండ్ ఫ్యామిలీ దగ్గరికి. వాళ్ళకి ఈ చీఫ్ గురించి ఎమన్నా ఐడియా ఉందేమో అడుగుతాను."
"కానీ ఆ రేవతి దగ్గరికి........." సందేహంగా చూసాడు శరత్. రేవతి కి అరవింద్ కి వున్న సంబంధం గురించి, ఆ తరువాత విషయాలన్నీ కూడా శరత్ కి తెలుసు.
"నీ సందేహం నాకు అర్ధమైంది. వాళ్లు అంటే నాకూ చెడ్డ చిరాకు. కానీ అలాంటి డర్టీ కేరక్టర్స్ కి చీఫ్ లాంటి వాళ్ళగురించి తెలిసే అవకాశం ఉంటుంది కదా."
"ఒకే అయితే." తలూపాడు శరత్ అంగీకారం గా.
"నువ్వు మాత్రం వచ్చి మామ్ ని కలవడం మర్చిపోకు. నువ్వు రాకపోతే నీ మీద చాలా బాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం వుంది మామ్ కి."
"అలా ఎందుకు చేస్తాను? తప్పకుండా వస్తాను." గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు శరత్.
మరోసారి కౌగలించుకుని అతని రెండుబుగ్గల మీద ముద్దుపెట్టుకున్నాక అక్కడనుండి బయటపడింది సుస్మిత.
&&&
"చీఫ్? ఆ చీఫ్ గురించి తెలుసుకోవాలని నువ్వెందుకు అనుకుంటున్నావు?" సుస్మిత మొహం లోకి ఆశ్చర్యం గా చూస్తూ అడిగాడు భుజంగరావు.
సుస్మిత కి భుజంగరావు ఇంట్లో చాలా వార్మ్ వెల్కమ్ లభించింది. సుస్మిత వెళ్లిన సమయానికి భుజంగరావు, అతని భార్య నిర్మల, రేవతి, ఇంకా చక్రవర్తి కూడా అక్కడే వున్నారు. మొత్తం విషయం అంతా వాళ్ళకి చెప్పడమే మంచిది అనిపించి, చింటూ అరవింద్ ని ఆ బంగ్లా లోకి వెళ్ళమని చెప్పడం, తరువాత శరత్ చింటూ వూరికి వెళ్లి విషయాలని తెలుసుకోవడం గురించి చెప్పింది.
“ఆ చింటూ గాడు ఇంత పెద్ద వెధవా! అరవింద్ కి నమ్మిన బంటులా ఉండేవాడు. వాడిలా చేసాడంటే నమ్మలేకపోతున్నాను." ఆశ్చర్యం ద్యోతకమవుతున్న మొహం తో అన్నాడు భుజంగరావు.
అక్కడవున్న తక్కిన ఇద్దరిలో కూడా అటువంటి ఆశ్చర్యమే కనిపించింది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే, భుజంగరావు భార్య నిర్మల సుస్మిత కి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది. ఒక చిరునవ్వుతో ఆవిడ మొహం లోకి చూస్తూ సుస్మిత కూడా చిరునవ్వు నవ్వింది.
“మాకూ అదే పెద్ద షాకింగ్! వాడు వాడికి తొమ్మిది, పదేళ్ల వయసునుండి మా ఇంట్లో వున్నాడు. ఎప్పుడూ వాడిని ఎదో దురుద్దేశం వున్నవాడిలా చూడలేదు. టిబ్బూ కూడా చాలా ఆశ్చర్యపోతూ వున్నాడు. చింటూ ని తీసుకు వచ్చింది టిబ్బూ నే. చింటూ టిబ్బూ అక్క కొడుకు.” సుస్మిత అంది.
"ఆ విషయం మాకు తెలిసిందే. అయినా టిబ్బూ ఒక దద్దమ్మ. వాడికి ఏమీ చేతకాదు. చింటూ చేసేదంతా వాడికి తెలియకపోవడం లో ఆశ్చర్యం లేదు." భుజంగరావు అన్నాడు.
"అది సరే డాడ్. కానీ ఆ చింటూ అరవింద్ ని ఆ బంగ్లాకి ఆ టైం లో ఎందుకుపంపించాడు? ఆ బంగ్లాలో ఏం చూసి అరవింద్ అలా అయ్యాడు?"
"అది ఆ చింటూ కి, అరవింద్ కి తెలియాలి. నాకెలా తెలుస్తుంది?" చిరాగ్గా అన్నాడు భుజంగరావు.
"ఆ విషయం ఏమిటో ఆ చీఫ్ కి కూడా తెలిసివుండే అవకాశం వుంది." చక్రవర్తి అన్నాడు. "లేకపోతె తను చేసినదానికి చింటూ ఆ చీఫ్ కి ఎందుకు భయపడతాడు?"
"ఎగ్జాట్లీ మై పాయింట్." మళ్ళీ సంభాషణ తను అనుకున్నదానికి వచ్చేసరికి ఆనందపడుతూ అంది సుస్మిత. "ఆ చీఫ్ ఎవరు? చింటూ చీఫ్ కి ఎందుకు భయపడుతున్నాడు? ఆ బంగ్లా కి చీఫ్ కి ఏమిటి సంబంధం?"
అది విన్నాక తక్కిన ముగ్గురూ మొహ మొహాలు చూసుకున్నారు తప్ప ఏం మాట్లాడలేదు.
"ప్లీజ్. మీకు విషయం అంతా తెలియకపోయినా, ఆ చీఫ్ గురించన్నా ఎమన్నా తెలిసుంటే చెప్పండి." బతిమాలుతున్నట్టుగా అంది సుస్మిత
"ఆ చీఫ్ ఒక మాఫియా డాన్. వాడికి చాలా నల్ల వ్యాపారాలతో సంబంధాలువున్నాయి. చిన్న సైజు రౌడీలు, గూండాలతో తన పనులు కానిచ్చుకుంటూ ఉంటాడు. వాడు తన పనులన్నీ ఇండైరెక్ట్ గా చేస్తాడు తప్ప ఎవరిముందుకీ రాదు. అందువల్ల వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ." తాను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగాడు భుజంగరావు. "కానీ వాడు చాలా పవర్ఫుల్ అని విన్నాను. తనకి నమ్మక ద్రోహం చేసినవాళ్ళని, ఎదురుతిరిగిన వాళ్ళని చాలా క్రూరంగా చంపేస్తాట్ట."
"మై గాడ్!" మొహం లో భయం ద్యోతకమవుతూ ఉంటే అంది సుస్మిత. "అలాంటివాడితో చింటూ ఎందుకు కనెక్షన్ పెట్టుకుని ఉంటాడు?"
"వాడికి అడ్డదారిలో ధనవంతుడు అయిపోవాలనే కోరిక పుట్టివుంటుంది." చక్రవర్తి అన్నాడు.
"కానీ........" కాస్త ఆగి అన్నాడు భుజంగరావు. "............ఆ చీఫ్ కి ఈ అరవింద్ ఇలా కావడానికి వున్న సంభందం ఏమిటో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు."
"అది సరే. అరవింద్ కి అన్నివిషయాలు గుర్తుకు వస్తే ఈ పజిలంతా విడిపోతుంది. తనకి ఎప్పుడు అన్నీ గుర్తుకు వస్తాయి? నీ సైకియాట్రిస్ట్ వదిన ఏమంటూంది?" రేవతి అడిగింది.
మనసులో చిరాకు పడుతూనే సమీర ఏమంటూ వున్నది చెప్పింది సుస్మిత.
"ఈ విషయం లో మనం తను ఎలా చెయ్యమంటే అలా చెయ్యడం మంచిది. అరవింద్ క్షేమమే ముఖ్యం." భుజంగరావు స్పష్టత నిండిన స్వరం తో అన్నాడు.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)