వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"మీరెవరూ నాకు పరాయి మనుషులు కారు. మీరు పేస్ చేసేది ప్రతీదీ నేనూ ఆనందంగా పేస్ చేస్తాను." ప్రమీల అంది.
"నీ అక్కకి ఇక్కడ ఏ ఇబ్బందీ లేకుండా చూసుకునే పూచీ నీదే." సమీర మొహం లోకి చూస్తూ అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది శకుంతల.
"పద అక్కా మళ్ళీ నీ రూమ్ లోకి. అక్కడ నీకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటాను." తనూజ కుడిభుజం మీద చెయ్యివేసి నవ్వుతూ అంది సమీర.
ఇద్దరూ నవ్వుకుంటూ తనూజ రూమ్ లోకి నడిచారు మళ్ళీ.
&&&
శకుంతల మళ్ళీ అదే రూమ్ లో అదే గదిలో వుంది. ఇదే గదిలో తనకీ, వర్ధన్ వర్మకి మొదటిరాత్రి జరిగింది. ఆ మొదటిరాత్రి నే కాదు, ఆ రోజు తామిద్దరిమధ్య జరిగిన సంభాషణని కూడా తనెప్పుడూ మర్చిపోలేదు.
"నా మొదటి భార్య మమత మరీ అంత అందగత్తె కాకపోయినా చాలా మంచింది. అందుకనే తను పోయినతరువాత, నా బంధువులందరూ బలవంతపెడుతూన్నా నేను మళ్ళీ పెళ్ళికి అంగీకరించలేదు."
"కానీ నన్ను చూసాక నా అందానికి మోహితులైపోయారు, అవునా?" తను నవ్వుతూ అడిగింది.
"నీ అందానికి నేను ఆకర్షించబడ్డమాట నిజమే. కానీ కేవలం నువ్వు అందంగా ఉన్నావని మాత్రమే నేను నిన్ను పెళ్లిచేసుకుంటున్నానా? ఈ ప్రశ్న నన్ను నేను చాలా సార్లు అడిగాను." ఒక సీరియస్ ఎక్సప్రెషన్ తో అంటున్నారు అయన. "నిజం చెప్పాలంటే మమత కన్నా బాగా అందంగా వున్నఅమ్మాయిని పెళ్లిచేసుకునే అవకాశం నాకుంది. మంచి అందమైన అమ్మాయిల్ని నాకు ప్రొపోజ్ చేశారు కూడా. కానీ మమత నాకు నచ్చి, ఆమెని నేను పెళ్లిచేసుకున్నాను."
అయన కాస్త ఆగారు. అయన ఏం చెప్తారో విందామని మాట్లాడకుండా చిరునవ్వుతో తను మౌనంగానే వుంది.
"నేను చూసిన అమ్మాయిలు అందరికన్నా కూడా నువ్వు అందంగానే వున్నావు. ఒప్పుకుంటాను. ఆ అందానికి నేను ఆకర్షించబడ్డాను కూడా. ఇదీ ఒప్పుకుంటాను. కానీ కేవలం నీ అందం కోసం మాత్రమే నేను నిన్ను పెళ్లిచేసుకోలేదు."
తను నవ్వి అంది. "అంతగా బయటకి కనిపించనిది ఏం చూసారు మీరు నాలో?"
"అది నా సబ్కాంషస్ మైండ్ కి తెలుస్తూంది. కానీ పైకి ఎక్స్ప్రెస్ చెయ్యలేను." ఒక ఇబ్బందికరమైన ఎక్స్ప్రెషన్ తో అన్నారు అయన.
"అయితే అది ఎక్స్ప్రెస్ చెయ్యడానికి ఇబ్బంది పడకండి." ఆయన్ని కౌగలించుకుని అయన రెండుబుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ అంది తను. "నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తినాకు భర్తగా దొరికారు, అంతకన్నా నాకు ఇంకేం కావలి?"
తను ఆయన్ని కౌగలించుకుని అలా ముద్దులు పెట్టుకోవడం ఆయనలో ఎదో ట్రిగ్గర్ చేసినట్టుంది, అసలు కార్యక్రమానికి ఉద్యుక్తులయ్యారు. చాలా ఆనందంగా అయన చేతుల్లో తను పూర్తినగ్నంగా మారిపోయింది. తాను పట్టుపట్టడం వల్ల ఇబ్బందిపడుతూనే తనూ, తన చేతుల్లో పూర్తి నగ్నంగా మారారు.
"నీకో విషయం తెలుసా? నాకూ, మమతకు మొదటిరాత్రి జరిగింది ఈ గదిలోనే. ఈ బెడ్ మీదే."
"మీకేం అనీజీగా అనిపించడం లేదా అలా ఆలోచిస్తూంటే?" ఒక ఇబ్బందికరమైన ఎక్స్ప్రెషన్ తో అంది శకుంతల. నిజంగానే తనకి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తూంది అలా ఆలోచిస్తూంటే.
అయన నవ్వారు అది విని. "లేదు. మమత కి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టమైన విషయం. నేను నిన్ను పెళ్లిచేసుకున్నందుకు తనెంతో ఆనందంగా వున్నానని నాకు తను నా కలలో నవ్వుతూ కనిపించి చెప్పింది."
దానికి ఏం చెప్పాలో తెలియక నిట్టూర్చి ఊరుకుంది శకుంతల.
"తను నా భార్యగా బతికివున్నన్నాళ్లు నా సుఖాన్ని మాత్రమే కోరుకుంది. నా సుఖం లోనే తన సుఖం చూసుకుంది. తనకంటూ ఏమీ ఆశించలేదు."
"నేనూ అలాగే వుంటాను. మీ సుఖం తప్ప నాకూ కావల్సినది ఏమీ లేదు." అయన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ అంది తను.
తనలా ముద్దుపెట్టడం ఆయనకి తాము ప్రారంభించినది గుర్తుచేసినట్టుగా వుంది. సడన్గా తనని రెండుబుగ్గల మీద ముద్దుపెట్టుకుని, ఎక్కడ ఆపారో అక్కడ ప్రారంభించారు.
ఆయన చేసేదేదీ తను కాదనలేదు. ఆయన ప్రతిచర్యకీ పూర్తిగా కో-ఆపరేట్ చేస్తూనే వుంది. ఈ విషయం లో మాత్రం ఆయనకి తక్కిన మగాళ్ళకి పెద్దగా తేడా లేదనిపించింది. తన శరీరం లో అయన తన నోటితోనూ, చేతులతోనూ ఎంజాయ్ చెయ్యని ప్రాంతం ఏదన్నా ఉందా అనిపించింది.
"ఈ విషయం లోనే తను నన్ను కొంచెం ఇబ్బంది పెట్టేది. నన్ను కనీసం అక్కడ చూడనిచ్చేది కూడా కాదు."
తన ఆడతనం మీద ముద్దులు పెట్టుకున్నాక, తన మీద కి ఎక్కిపోయి తన మొహంలోకి చూస్తూ అన్నారాయన. దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది తను.
"గాడ్! రియల్లీ వండర్ఫుల్!" తనలో అయన ఎప్పుడు వేడి దింపుకున్నారో తనకి తెలీనే లేదు, కానీ తన మీద గాలి తీసిన బెలూన్ లా వాలిపోయి అన్నారాయన. "నిజం గా నిజం గా చాలా ఆనందించేను నిన్ను నేను."
ఏవో ఆలోచనలతో మనసు నిండిపోయివున్నా తనూ సుఖం అనుభవిస్తూనే వుంది. ఆయన చుట్టూ వున్న తన కౌగిలిని సున్నితంగా టైట్ చేసి అయన కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుంది. ఎందుకో అయన ఎప్పుడూ తనమీద అలాగే ఉండిపోవాలని వుంది.
కాసేపటికి ఆయన తనమీదనుండి దిగి, డ్రెస్ చేసుకున్నారు. తనూ నగ్నం గా ఆలా ఉండలేక వెంటనే బెడ్ దిగి డ్రెస్ చేసుకుంది.
"ఇది మన భవనం. ఇందులో మనిద్దరికీ తప్ప వేరే ఎవరికీ చోటువుండదు." మరోసారి బెడ్ ఎడ్జ్ మీద ఇద్దరూ పక్క పక్కన కూచున్నాక, తనని దగ్గరికి తీసుకుంటూ అన్నారు అయన. "రేపు మనకి పుట్టే పిల్లలకి కూడా ఇందులో చోటులేదు. ఇది కేవలం మనిద్దరిదీ మాత్రమే."
నవ్వింది తను. "మమత తో కూడా మీరు ఇదే అనేవారా?"
ఎందుకో అయన మొహం ఒక అనీజీ ఎక్స్ప్రెషన్ తో నిండింది. "అవును. ఇలాగె అనేవాణ్ణి. అలాగే వున్నాం కూడా." నిట్టూర్చి అన్నారు అయన.
"ఇందాకా మమత ప్రస్తావన మీరెంతో ఆనందంగా రిలాక్స్డ్ గా తెచ్చారు. ఇప్పుడెందుకు ఇలా ఫీలవుతన్నారు?" అయన మొహంలోకి చూస్తూ అడిగించి తను.
"చెప్పలేను. కానీ మనిద్దరం భార్యాభర్తలం అయ్యాక, మనిద్దరి మధ్య తన ప్రస్తావన అవసరమా?" కళ్ళు చిట్లించారాయన.
"అవసరమే." దృఢస్వరం తో అంది శకుంతల. "తన స్థానం ఖాళీ చేసి నాకు మీ జీవితం లో ప్రవేశించే అవకాశం కల్పించింది. ఆమె మనకెప్పుడూ పరాయిమనిషి కాదు. మన ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో, మాటలలో ఎప్పుడూ ఉంటుంది."
"ఈ విషయం లో నా కన్నా నువ్వే బెటర్ అనిపించావు." తనని కౌగలించుకుని తన పెదవులమీద ముద్దుపెట్టుకుంటూ అన్నారాయన.
ఆ తరువాత అలాగే జరిగింది కూడా. అరవింద్, సుస్మితలు పుట్టిన తరువాత, వాళ్ళని కూడా ఈ బంగ్లా లోకి ఎక్కువగా తెచ్చేవారు కాదు. తామిద్దరే ఎక్కువగా ఈ బంగ్లాలో గడిపేవారు. తను అన్నట్టుగానే, తమ మాటల్లో మమత కూడా ఉండేది. తాము ఆమె గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఆమె దగ్గరలోనే నిలబడి తమవైపు నవ్వుతూ చూస్తున్నట్టుగా అనిపించేది.
ఈ బంగ్లాలో ఎన్ని ఆనందకరమైన అనుభవాలు గడిచాయో తామిద్దరిమధ్య. ఇలాంటి మంచి వ్యక్తికి భార్యగా చేసినందుకు, ఆ చలపతి అన్నాకూడా కృతజ్ఞతగా అనిపించేది. కానీ తన గత జీవితం, తను ఆయన్ని మోసం చేసి ఎలా ఆయన జీవితం లోకి ప్రవేశించిందో ఆయనకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో అని భయంగా అనిపించేది. ఎలా రియాక్ట్ అయినా ఎన్నోసార్లు ఆ విషయాలన్నీ చెప్పేసి భారం దింపుకోవాలని కూడా అనుకునేది. కానీ ఆ అవకాశం రాలేదు.
మరి ఆయనలో తనకి నచ్చని విషయం. కుర్చీలో వెనక్కి జరగిలబడి గట్టిగా నవ్వుకుంది శకుంతల. తనకీ ఆయనకీ ఆ విషయాల్లో జరిగిన ఆర్గ్యుమెంట్లన్నీ గుర్తుకు వస్తున్నాయి.
"నన్నెందుకు ఈ బిజినెస్ విషయాల్లో ఇన్వాల్వ్ చేస్తారు? హాయిగా నన్ను నా భార్య పాత్రకి , ఇంకా ఆ తరువాత తల్లి పాత్రకి పరిమితం అయివుండనివ్వండి." అయన తనని మమూత్ ఇండస్ట్రీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని చేస్తాను అన్నప్పుడు ఆయనతో కోపంగా అంది తను.
"ఇక్కడే నాకూ మమతా కి కూడా తేడాలొచ్చేవి. నువ్వు కేవలం కుటుంబ భారం మాత్రమే కాదు, నేను చేసే బిజినెస్ భారం కూడా మొయ్యాలి. భార్య అంటే భర్తకి అన్నిరకాలుగా సహకారం గా ఉండాలి. భర్త చెప్పిన ప్రతిమాట వినాలి."
"కానీ నాకు బిజినెస్ గురించి ఏం తెలుసు? నేను మీకు ఎలా సహాయపడగలను?" తన కోపం ఆందోళనగా మారింది.
"నేను నీకు ప్రతివిషయం చెప్తాను. అన్నీ తెలుసుకునేలా చేస్తాను. నువ్వేం కంగారు పడనవసరం లేదు." అన్నారాయన.
ఇంకా ఏం మాట్లాడకుండా మౌనంగానే, ఆలోచిస్తూవున్న తనతో అన్నారాయన. "ఈ బిజినెస్ నేను కేవలం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రమే స్టార్ట్ చేసాను. కానీ ఈ రోజు ఈ ఇండస్ట్రీస్ మీద వేలమంది ఆధారపడి బతుకుతూ వున్నారు. ఏ కారణం గా అయినా ఈ బిజినెస్ మూతపడితే వాళ్లంతా రోడ్డు మీద పడతారు. ఒకవేళ నాకేమైనా అయినా కూడా ఈ బిజినెస్ మూతపడకూడదు. పగ్గాలు చేతిలోకి తీసుకుని నడిపించడానికి నువ్వు సిద్ధం గా ఉండాలి."
చటుక్కున తన కుడిచేతిని ఆయన నోటికి అడ్డుపెట్టి అంది. "తప్పకుండా మమూత్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ని అవుతాను. అన్నివిషయాలు తెలుసుకుంటాను. కానీ................" కాస్త ఆగి అంది. "............ మీ నోటివెంట మాత్రం అటువంటి మాటలు రానివ్వకండి."
తరువాత ఆయనతో పాటుగా తను ఇంకో మేనేజింగ్ డైరెక్టర్ గా మమూత్ ఇండస్ట్రీస్ లోకి అడుగుపెట్టింది. బిజినెస్ వ్యవహారాలు చూడడం ప్రారంభించింది. ఆయన సహకారంతో ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ ఆకళింపు చేసుకోవడం తనకి పెద్దగా కష్టం కాలేదు. కొన్ని రోజుల్లోనే ఆయనకే సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చేసింది. అందుకు అయన ఎంతో సంతోషించారు కూడా.
తమ ఇండస్ట్రీస్ ని స్టాక్ ఎక్స్చేంజి లో నమోదు చెయ్యడం కూడా ఆ సమయం లోనే జరిగింది. ఇంచుమించులో ఒక నలభై శాతం వరకూ అమ్మకానికి పెట్టారు. ఇన్వెస్టర్స్ ని ఆనందపరుస్తూ ఎంతో ఎక్కువ ప్రీమియం తో లిస్టింగ్ అయింది తమ కంపెనీ. త్రి ఫిగర్స్ తో లిస్టింగ్ అయిన తమ కంపెనీ షేర్ చాలా కొద్దికాలం లోనే ఫోర్ ఫిగర్స్ కి చేరుకుంది.
అలా, అలా జరుగుతూ ఉండగా అరవింద్, సుస్మిత తమ జీవితాల్లో ప్రవేశించారు. ఇద్దరు పిల్లలతో తనూ, అయన ఎంతో ఆనందంగా, సంతోషం గా గడిచిపోతూవుంది జీవితం. అలాంటి సమయం లో జరిగింది ఆ సంఘటన.
ఆ జ్ఞాపకాలు డిస్టర్బ్ చేస్తూవుంటే కుర్చీలో వెనక్కి కూచుని ఉండలేక ముందుకు వంగింది శకుంతల. ఇదే ఇంట్లో, ఇదే బెడ్ రూమ్ లో, తామెంతో ఆనందంగా, సంతోషం గా గడిపిన ఇదే ప్రదేశం లో ప్రాణాలు వదిలారు ఆయన తన వడిలో హార్ట్ ఎటాక్ తో. తను కూడా ఎంతమాత్రం ఎక్స్పెక్ట్ చెయ్యని చావు అది.
ఒకపక్క అయన హఠాన్మరణం తన నరనరాల్ని పిండేస్తూ ఉంటే మరొక పెద్ద సమస్య కూడా వచ్చిపడింది. మమూత్ ఇండస్ట్రీస్ నష్టాల్లో పడింది. కాంపిటీటర్స్ ఎక్కువై తమ ప్రొడక్ట్స్ కి డిమాండ్ తగ్గిపోయింది. షేర్ ప్రైస్ కూడా డ్రాస్టిక్గా పడిపోవడం ప్రారంభమైంది. కొంతమంది తమ ఇండస్ట్రీస్ వేరే ఏదన్నా పెద్ద ఇండస్ట్రీ కి అమ్మేమని సలహా ఇచ్చారు. కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ లు తమ ఇండస్ట్రీ ని కొంటామంటూ కారుచవక ప్రైస్ తో ముందుకు వచ్చారు.
తనని మేనేజింగ్ డైరెక్టర్ గా చేసేప్పుడు తనతో ఆయన అన్న మాటలు తను మర్చిపోలేదు. మమూత్ ఇండస్ట్రీస్ మీద ఆధారపడి ఎంతోమంది బతుకుతూ వున్నారు. వాళ్ళందరి గురించి తను ఆలోచించాలి. తన దుఃఖాన్ని అంతా దిగమింగుకుని బిజినెస్ మీద కాన్సెన్ట్రేట్ చేసింది.
మళ్ళీ త్రి ఫిగర్స్ లో లీస్ట్ కి పడిపోయిన తన కంపెనీ షేర్స్ ని తనే కొనడం మొదలుపెట్టింది. ఇంజనీర్స్ తో డిస్కస్ చేసి బిజినెస్ పెరగాలంటే ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చింది. పెద్దగా డిమాండ్ లేని చాలా ప్రొడక్ట్స్ ని ఆపేసింది. డిమాండ్ వుండే న్యూ ప్రోడక్ట్స్ ని ప్రొడ్యూస్ చెయ్యడం ప్రారంభించింది. పబ్లిసిటీ లో కూడా చేంజెస్ చేసింది.
ఆశ్చర్యకరమైన విషయం! చాలా కొద్దికాలం లోనే డిఫరెన్స్ కనిపించింది. నష్టాల్లో వున్న తమ కంపెనీ లాభాల బాట పట్టింది. త్రీ ఫిగర్స్ లో లీస్ట్ కి చేరిన తమ కంపనీ ఫోర్ ఫిగర్స్ హైయెస్ట్ కి చేరింది మళ్ళీ. తన గురించి పత్రికల్లో రాశారు. టీవీలో చెప్పారు. ఇదంతా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే , ఆయన ప్రోత్సాహం వల్లే అని తను చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. అంతా తన గొప్పే అన్నారు.
ఇవన్నీ కూడా తను పుస్తకం లో రాయదగ్గ విషయాలే. రాయకుండా తను వుండలేదు. డ్రా లాక్ తీసి, లోపల వున్న బుక్ ని బయటికి తీసింది రాయడానికి శకుంతల.
&&&
తన రూమ్ లో వంటరిగా వుంది తనూజ. తన మనసు చాలా అల్లకల్లోలం గా, అశాంతిగా వుంది. అభినవ్ నుండి దూరం గా వచ్చేసి ప్రశాంతం గా వుందామనుకుంది, కానీ వున్న ప్రశాంతతని కోల్పోయింది. ఇలాగ ఎందుకయింది, తనకే బోధపడ్డం లేదు.
అభినవ్ దగ్గర ఉన్నంతసేపు తనకి అతని మీద ఏమీ ఫీలింగ్ వున్నట్టుగా అనిపించలేదు. అతని తో తను సెక్స్ చాలా ఎంజాయ్ చేసింది, కానీ అది తనలో ఎలాంటి ఫీలింగ్ కలిగించినట్టుగా తనకి అనిపించలేదు. తనకి పెళ్లి, ఇంకా ఫ్యామిలీ లైఫ్ మీద పెద్దగా ఇంటరెస్ట్ లేదు. తనకన్నావయసులో అంత చిన్నవాడైన అతన్ని పెళ్లిచేసుకోవడం, అతనికేదో అన్యాయం చేస్తున్నట్టుగా తనకి అనిపించింది. అందుకనే అతన్ని పెళ్లిచేసుకోనని ఖరాఖండీ గా చెప్పేసి ఇలా వచ్చేసింది.
కానీ ఇక్కడికి వచ్చాక తనకి అతనే గుర్తుకువస్తూ వున్నాడు. తనే అర్ధం చేసుకోలేని ఏదో ఫీలింగ్ అతని మీద తనకి మొదలైంది. తను సైకియాట్రిస్ట్ కాకపోయినా, బి. ఏ సైకాలజీ తో చదివింది. అయినా తనని తనే అర్ధం చేసుకోలేకపోతూ వుంది. తనెందుకు ఇలా ఫీలవుతూందో, తన చెల్లెల్ని అడిగి చూడాలి. తను సైకియాట్రిస్ట్ కదా, తనేమన్నాకారణం చెప్పగలుగుతుందేమో.
ఎదో ఫీలింగ్ అతనిమీద కలుగుతూండడమే కాదు, తనేదో తప్పుచేస్తూందన్న భావం కూడా ఎక్కువ అయిపోతూవుంది. అంత అబ్రాప్ట్ గా తన ప్రేమ ని కాదని, తనిలా వచ్చేసి ఉండాల్సింది కాదు. తన నంబర్ని కూడా బ్లాక్ చేసేసింది, తన కి చాలా సార్లు కాల్ చేసే ఉంటాడు.
"నీ ఎదురుగుండా వున్న నీ చెల్లెల్ని కూడా గమనించనంతగా ఏం ఆలోచిస్తున్నావక్కా?" సమీర అలా అనేవరకూ తను ఈ లోకంలోకి రాలేదు.
"ఏం లేదులే. కూచో." బెడ్ ఎడ్జ్ మీద జరిగి, తన చెల్లెలు కూచోడానికి చోటు చూపిస్తూ అంది తనూజ.
“నువ్వేదో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నావు అన్నది మాత్రం నిజం, ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్?" ఆ ప్లేస్ లో కూచుంటూ అడిగింది సమీర.
"ప్రొఫెషనల్ విషయాలగురించి నేనెప్పుడూ సీరియస్ గా అలోచించి ట్రబుల్ అవ్వాల్సిన అవసరం రాలేదు." నిట్టూరుస్తూ అంది తనూజ
"అంటే దిసీజ్ సంథింగ్ పర్సనల్, ఏమిటది?" కళ్ళు చిట్లించి, చిరునవ్వుతో అడిగింది సమీర.
తనూజ నుండి సమాధానం ఏమీ లేదు. అలాగే మౌనంగా వుంది.
"ఈ ప్రపంచం లో వున్నది నాకు నువ్వు, నీకు నేనూ. నీ గురించి నీకన్నా నా గురించే ఎక్కువ ఆలోచిస్తావ్. అలాంటిది ఏ పర్సనల్ విషయం గురించి ఆలోచిస్తున్నావు అక్కా?" అదే చిరునవ్వుతో అడిగింది సమీర.
"ఒక విషయం వుంది సమీ. అది నీకు ఎలా చెప్పాలో బోధపడ్డం లేదు." ఒక చిరాకు ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ.
"నాక్కూడా ఎలా చెప్పాలో బోధపడని విషయమా? ఎక్కడో అక్కడ మొదలుపెట్టిచెప్పు. ఫర్వాలేదు." ఒక ఆసక్తికరమైన ఎక్స్ప్రెషన్ తో, అదే చిరునవ్వుని కంటిన్యూ చేస్తూ, అడిగింది సమీర.
అనీజీ గా ఫీలవుతూ, అదే అనీజీ ఎక్స్ప్రెషన్ మొహం లో ద్యోతకమవుతూ ఉంటే, అభినవ్ వ్యవహారం అంతా చెప్పుకొచ్చింది. తనలో తను మగాడిని కానన్న అపోహని పోగొట్టడానికి తను చేసింది చెప్తూవుంటే, తనూజ లో అనీజీనెస్ ఇంకా ఎక్కువ అయిపోయింది.
"గాడ్! నిజంగా అలా చేసావా?" తన అక్క ఫిలాసఫీ గురించి తెలిసినా కొంచెం షాక్ అయింది సమీర.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)