వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
"నా ప్రేమ మీద నమ్మకం ఉంటే నువ్వు వేరే ప్రశ్నలు అడగకుండా నాకా ప్రామిస్ చెయ్యి." శరత్ తన చేతిని అలాగే ఉంచి అన్నాడు.
సుస్మిత అదే కోపం తో ఇంకా ఎదో అనబోతూ ఉండగా అరవింద్ అన్నాడు. "ప్లీజ్ నువ్వా ప్రామిస్ చేసేయ్. నేనిక్కడ ఎక్కువసేపు కూచోలేకపోతున్నా. ఇది త్వరగా పూర్తికానిద్దాం."
గట్టిగా ఊపిరి పీల్చి వదిలి శరత్ కుడిచేతిలో తన కుడిచేతిని పెట్టి "ఒకే. ఐ ప్రామిస్ యు దట్, ఇనఫ్?" అని తన చేతిని తీసేసాక సమీర వైపు చూస్తూ అంది. "వదినా, స్టార్ట్ ఇట్ ఎట్ లీస్ట్ నౌ."
"ఆల్రైట్. ఐ స్టార్ట్ ఇట్ నౌ." అంటూ అక్కడ వున్నా ఆడియన్స్ వైపు చూస్తూ అంది. "మీరెవ్వరూ ఏం మాట్లాడకూడదు. ఎలాంటి డిస్టర్బన్స్ క్రియేట్ చెయ్యకూడదు. జస్ట్ చూస్తూ వుండండి, ఓకే."
"ఓకే " వాళ్ళందరూ ఒకేసారి అన్నారు.
అరవింద్ ముందు పొజిషన్ తీసుకుంది సమీర. "నేను అంటున్నదానిమీద కాన్సంట్రేట్ చెయ్యి. మనసులో ఆలోచనలు వాటిదారిన వాటిని వదిలేయ్. జస్ట్ నేను చెప్తున్నది జాగ్రత్తగా వింటేచాలు."
"అలాగే" చిరునవ్వుతో అన్నాడు అరవింద్.
నవ్వింది సమీర. "అనవసరం గా మాట్లాడకూడదు. నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి మాత్రమే మాట్లాడాలి. అదీ నువ్వు అనుకోకుండానే జరుగుతుంది."
మళ్ళీ అలాగే అనబోయి, ఆగి, చిరునవ్వుతో తలూపాడు అరవింద్.
"ఒకే నౌ." గట్టిగా ఊపిరి పీల్చుకుని ప్రారంభించింది సమీర అరవింద్ మొహంలోకి చూస్తూ. "ఇప్పుడు నీకు చాలా ప్రశాంతం గా వుంది. చాలా ప్రశాంతం గా ఉంది. నీ దృష్టి కేవలం నేను చెప్పే మాటల మీద మాత్రమే కేంద్రీకృతమై వుంది."
ఒక్కసారిగా పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది అక్కడ వాతావరణం. అక్కడ వాళ్ళందరూ చాలా ఆసక్తిగా సమీర చెప్పే మాటలు వింటున్నారు. ఆ మాటల్లో ఎదో మ్యాజిక్ టచ్ వున్నట్టుగా, సమీర వైపే చూస్తూ ఆ మాటలు వింటున్నాడు అరవింద్ కుర్చీలో వెనక్కి జారగిలబడి. ఆమె మాటలు అప్పటికే కొంత ప్రభావం చూపినట్టుగా అరవింద్ మొహం చాలా ప్రశాంతం గా ఉంది.
"ఇప్పుడు నీ కనురెప్పలు నెమ్మది నెమ్మది గా మూత పడుతున్నాయ్. నెమ్మది నెమ్మది గా మూతపడుతున్నాయి. నెమ్మది నెమ్మది గా మూతపడుతున్నాయి."
అరవింద్ కళ్ళు నెమ్మదిగా మూతపడ్డాయి. మూసుకున్న కళ్ళతో చాలా ప్రశాంతం గా కనిపిస్తూవున్నాడు అరవింద్ అందరికీ.
&&&
ఆ బంగ్లాలో అదే రూమ్ లో వుంది శకుంతల. కాసేపటి క్రితమే తన జీవిత చరిత్ర అంతా రాయడం పూర్తి చేసి ఆ పుస్తకాన్ని డ్రా లో ఉంచింది. ఎప్పుడూ ఆ డ్రా ని మర్చిపోకుండా లాక్ చేసేది. ఈ సారి మాత్రం కావాలనే తీసి వదిలేసింది. తన జీవితం తన పిల్లలకి తెలియాల్సిన సమయం వచ్చేసింది. అది ప్రపంచానికి తెలియాలా వద్దా అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం.
ఈ రోజు ఆ ప్రోగ్రాం కి తన కోడలు తననీ ఆహ్వానించింది. తన కోడలిమీద తనకి పూర్తినమ్మకం వుంది. ఈ రోజు తను అనుకున్నట్టుగానే తన కొడుక్కి అంతా గుర్తుకువచ్చేలా చేస్తుంది, ఆ రోజు ఈ బంగ్లాలో తను చూసిన ఆ సంఘటన తో సహా. ఆ సంఘటన, ఆ నిజం తన కొడుక్కి తెలిసే క్రమం లో తను అక్కడ ఉండగలదా? ఆ నిజం తెలిసాక, విషయం అర్ధం అయ్యాక అరవింద్ ఏమైపోతాడు? ఒకసారి అది జీర్ణించుకోలేక బ్లాంక్ మాడ్ అయిపోయాడు. తరువాత కూడా ఏమీ గుర్తులేని పరిస్థితి లోకి వెళ్ళిపోయాడు. మరి ఈ సారి ఏం కాబోతూ వుంది? ఎలాంటి విపరీతం చోటుచేసుకోబోతూ వుంది?
ఆ రోజు ఈ బంగ్లాలో, ఈ కిటికీ పక్కన, అరవింద్ ని స్పృహ కోల్పోయిన స్థితిలో తనే గమనించింది. ఎవరూ చెప్పకుండానే తనకి తెలుసు అందుకు కారణం ఏమిటో. ఆ తరువాత బ్లాంక్ మాడ్ గా మారినప్పుడు తనంతగా బాధపడలేదు. ఆ నిజాన్ని జీర్ణించుకుని బాధపడడం కన్నా, ఆ బ్లాంక్ మ్యాడ్నెస్ ఉత్తమం. అటుపైన తను తన సెన్సెస్ లోకి వచ్చినా గతాన్నంతా మర్చిపోవడం భగవంతుడి దయే అనిపించింది. తను ఎంతకాలం అలా ఉండగలిగితే అంతకాలం అలాగే ఉండాలని భగవంతుడిని ప్రార్ధించింది.
కానీ తనకి తెలుసు. ఈ రోజు ఒకటి వస్తుందని. ఆ భయంకర నిజం తన పూర్తి నాలెడ్జ్ లోకి రాకుండా ఎప్పటికీ తప్పించుకోలేడని. ఆ నిజాన్ని భరించడం కన్నా చావు కూడా మేలే. కానీ తను ఇప్పుడు పూర్తిగా నిస్సహాయురాలు. తన కొడుకు ఆ నరకం అనుభవించకుండా తను తప్పించలేదు. ఆ నిజాన్ని తెలుసుకున్న తరువాత, తన కొడుకు ఏం చెయ్యదలుచుకున్నా అది పూర్తిగా తనకి అంగీకారమే.
కానీ ఆ నిజం ఒక్క అరవింద్ ని మాత్రం బాధపెట్టి ఊరుకోదు. అరవింద్ కి తెలిసిన తరువాత అది తన కూతురు సుస్మిత కి తెలియడానికి ఎంతో సమయం పట్టదు. అది తెలిసిన తరువాత తను కూడా అరవింద్ లా షాక్ తో బ్లాంక్ మాడ్ అయిపోవడమో, లేక గతాన్నంతా మర్చిపోవడమో జరిగితే తను చాలా అదృష్టవంతురాలు. కానీ అలా జరుగుతుందని తనకి అనిపించడం లేదు.
కుర్చీలో వెనక్కి జరగిలబడి కళ్ళు మూసుకుంది శకుంతల. "అరవింద్ ....సుస్మిత ....... నన్ను క్షమించొద్దు. నేను చేసింది క్షమించగల తప్పుకాదు. ఏ తల్లీ నా అంత క్రూరం గా వుండలేదు. నేను బాధపెట్టినంతగా పిల్లల్ని బాధపెట్టలేదు. మీరెప్పటికీ నన్ను క్షమించొద్దు." కళ్ళవెంట నీళ్లు కారిపోతూఉన్నాయి శకుంతలకి. ఇది మొదటిసారి కాదు తనకలా కన్నీళ్లు కారడం. వాటిని తుడుచుకోకుండా ఎప్పటిలానే అలాగే వదిలేసింది.
తనకి వర్ధన్ వర్మ తో పెళ్లయ్యాక, తను అనుకున్నట్టుగా ఆయనతో ఉండగలిగితే ఏ ఇబ్బందీ ఉండేది కాదు. తను గతాన్నంతా మర్చిపోయి ఆనందంగా ఉండేది. కానీ అంత ప్లాన్ చేసి తన పెళ్లి ఆయనతో జరిగేలా చేసిన చలపతి అలా వదిలేస్తాడా?
"లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు వున్నావ్ కదా ఆ వర్ధన్ వర్మతో." ఆ రోజు ఈ బంగ్లా లోనే తన దగ్గరికి వచ్చి అన్నాడు చలపతి.
తనకీ ఆయనకి పెళ్ళైన తరువాత తన దగ్గరికి అలా వచ్చి చలపతి మాట్లాడ్డం అదే మొదటిసారి. ఆ సమయం లో ఆయన వేరే చోటుకి ఎక్కడికో వెళ్లారు. తనూ చలపతి తప్ప ఈ బంగ్లాలో అప్పుడు ఇంకెవరూ లేరు. తనకి చాలా అనీజీగాను, భయంగాను వుంది. ఏం మాట్లాడకుండా తను మౌనంగా ఉండిపోయింది.
"నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నావ్. అయినా వాడితో లైఫ్ అంత బావుండి, వాడంతా సుఖం ఇస్తూంటే నేనెందుకు గుర్తుంటాను?"
"నోర్ముయ్. నేను నీ యజమాని భార్యని అని మర్చిపోకు. కావాలంటే నీ విషయం ఆయనకి చెప్పి క్షణాల్లో నిన్ను గెంటించగలను." తను కోపం గా అరిచింది.
"నిజంగానా?" అని అప్పుడు వాడు నవ్విన నవ్వు తను ఎప్పటికీ మర్చిపోలేదు. "నీ వేశ్య బతుకు వాడికి చెప్తే, వాడు నన్ను గెంటడం కాదు, ముందు నిన్నే ఇక్కడినుండి గెంటేస్తాడు."
తన గుండెమొత్తం భయం తో నిండిపోయింది. తన గత జీవితం గురించి తెలిస్తే అయన ఎలా ఫీల్ అవుతారు? తనని ఇంట్లోనుంచి గెంటేక పోవచ్చు. కానీ అయన హృదయం బద్దలైపోతుంది.
"నన్ను అయన క్షమిస్తారు. ఆయనలో ఆ మంచితనం నేను చూసాను." తను అంది తన లోపలి ఫీలింగ్ బయటపడకుండా జాగ్రత్త పడుతూ.
"అదీ నిజమే. అయినా ఇంత అందాన్ని వదిలేసుకోవడానికి ఆయనేం పిచ్చోడు కాదు. అసలు ఈ అందాన్ని చూసే కదా, పెళ్లే వద్దనుకున్నవాడు నిన్ను పెళ్లిచేసుకున్నాడు."
వాడి మోహంలో ఎక్స్ప్రెషన్, ఆ చిరునవ్వు తనకి అర్ధం కావడం లేదు. వాడు వేరే ఎదో ధైర్యం తో వున్నాడు. తన గుండెల్లో భయం ఇంకా ఎక్కువ అయింది.
"అయినా నేను నీకు అంత తెలివితక్కువగా కనిపిస్తున్నానా? నువ్వు ఇలా ఆలోచిస్తావని, అంటావని నేను వూహించలేనా? నువ్వేం అంటావో చూద్దామని అలా అన్నాను అంతే."
"మరి ఇంకేం చేస్తావ్? మనిద్దరి మధ్య శారీరక సంభందం వుంది, మనం పెళ్లిచేసుకునేవరకూ కూడా వచ్చాం అని చెప్తావా? దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు." భయపడుతూనే అంది తను.
మరోసారి వాడు అలాంటినవ్వే నవ్వాడు తనలో భయాన్ని రెట్టింపు చేస్తూ. "ఒక బజారు మనిషిని మాయ చేసి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కి భార్యగా చెయ్యగలిగిన వాడిని. ఈ మాత్రం ఆలోచించనని ఎలా అనుకున్నావ్?" కనుబొమ్మలు మూడేసి చిరునవ్వుతో అడిగాడు వాడు. "మనిద్దరిమధ్య జరిగిన సెక్స్ అంతా నీకు తెలియకుండా వీడియో తీసి అట్టేపెట్టాను. అది చూపిస్తే వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలని నాకు చాలా కోరికగా వుంది."
వాడు తన జేబులోనుండి ఒక వీడియో క్యాసెట్ తీస్తూవుంటే తన గుండెల్లో భయం ఇంకా ఎక్కువ అయిపోయింది. "నేను ఏ విషయాలలోనయినా జాగ్రత్తగానే వుంటాను. నువ్వొకవేళ ఇది తీసుకుని ముక్కలకింద చేసేసినా ఇబ్బంది లేకుండా దీనికి రెండుమూడు కాపీలు తీసే వుంచాను." వికృతంగా నవ్వాడు వాడు. "అయినా ఇందులో వున్నది ఏమిటో నీకు చూపించకుండా నమ్మమని అడగడం అత్యాశే అవుతుంది. నేను కేవలం బ్లఫ్ చేస్తూ వుండొచ్చుకదా." అక్కడ వున్న టీ.వీ. ఆన్ చేసి, అక్కడవున్న వీ. సి. ఆర్. తో ఆ వీడియో క్యాసెట్ ప్లే చేసాడు. సెల్ ఫోన్ లు లాంటివి లేని రోజులవి.
వాడు తనతో సెక్స్ చేసిన విధానం తనకి గుర్తున్నా, అదంతా అలా చూస్తూవుంటే ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయినట్టుగా అయింది. ఎలా మానేజ్ చేసాడో కానీ, తమ మొహాలు చాలా స్పష్టంగా కనిపించేలా చేసాడు. ఆ రోజుల్లో వీడిమీద గుడ్డినమ్మకం తో, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తనసలు పట్టించుకోలేదు. ఇంక అది చూడలేక తనువెళ్ళి టీ.వీ. ఆఫ్ చేసింది.
"ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఊహించాను. నువ్వు మామూలు బెదిరింపులు కి లొంగవనీ అనిపించింది. అందుకనే ఈ ఏర్పాటు చేసుకున్నాను. ఇది పనిచేస్తుందనే అనుకుంటున్నాను." వాడి మొహం మీద చిరునవ్వు చూస్తూ ఉంటే తనకి వంటిమీద తేళ్లు, జర్రులు పాకుతున్నట్టుగా వుంది.
"ఇంతకీ నీకేం కావాలి? ఆయన్ని దోచుకోవడమే కదా. కావలసినంత దోచుకో. కానీ ఇది మాత్రం ఆయనకి చూపించకు. అయన గుండె బద్దలు అయిపోతుంది." తన గొంతు చిన్నగా వణుకుతూ ఉండగా అంది.
"కొంత దోచుకుంటూనే వున్నాను. ఇంకా బాగా దోచుకోవడానికి నీ సహాయం కొంత అవసరం. నేను నా జీవితం లో బాగా ఎదగాలి. నువ్వెక్కడైనా నాకు సహాయం చెయ్యడానికి వెనకాడితే ఈ క్యాసెట్ తిన్నగా వర్ధన్ వర్మ చూసే ఏర్పాట్లు చేస్తాను." వాడి పెదవుల మీద ఆ విషపు చిరునవ్వు అలాగే వుంది.
"నేను నీకు అవసరమైన సహాయం చేస్తాను. అటువంటి అవసరం నీకు రాదు." చాలా కష్టపడుతూ, అయిష్టంగా అంది.
"అన్నిటికన్నా ముఖ్యమైనది." వాడి మోహంలో సడన్ గా మారిన ఎక్స్ప్రెషన్ తో తనలో కొత్తభయం ప్రవేశించింది. వాడు అడగకూడనిది ఎదో అడగబోతున్నాడన్న తన వూహ నిజం చేస్తూ వాడు అన్నాడు. "అప్పుడప్పుడు నీ అందం అనుభవించే అవకాశం నాకివ్వాలి."
"నోరుముయ్యరా వెధవా. నీకు తిండిపెడుతున్న యజమాని భార్యని. నన్నిలా అడుగుతావా?" వాడు అడగబోతూవున్నది తను ఎంతగా వూహిస్తూవున్నా, వాడలా అడిగేసరికి కోపం పట్టలేక మరోసారి గట్టిగా అరిచింది.
వాడా వెధవనవ్వు మరోసారి నవ్వాడు. "సరేలే. ఎంతో గొప్ప పతివ్రతలు కూడా నీలా మాట్లాడారు. వర్ధన్ వర్మ ని పెళ్లిచేసుకునే ముందు నాతొ ఎన్నిసార్లు పడుకున్నావో, ఇంకా అంతకుముందు ఎంతమందితో పడుకున్నావో ఒక్కసారి ఆలోచించుకో. వర్ధన్ వర్మ పెళ్లిచేసుకోగానే గొప్ప పతివ్రతవి అయిపోయావా?" వెటకారంగా అడిగాడు వాడు.
తనకేం మాట్లాడాలో తెలియడం లేదు. పూర్తిగా వాడి కంట్రోల్ లో వుంది తను.
"నువ్వు దీనికి ఒప్పుకోకపోయినా, ఈ క్యాసెట్ వర్ధన్ వర్మ చూస్తాడు."
ఇంక దానితో వాడు తమని దోచుకోవడానికి మాత్రమే కాదు, తనని అనుభవించడానికి కూడా ఒప్పుకోక తప్పలేదు. వర్ధన్ వర్మకి విషయం తెలియాకుండా మాత్రం జాగ్రత్తపడుతూ వచ్చాడు. కానీ వాడు తనని అనుభవించే విషయం లో మాత్రం తేడా ఉండేది కాదు. ఇద్దరి వంటిమీద నూలుపోగు లేకుండా చేసి, తనని కర్కశంగా అనుభవిస్తూవుండేవాడు. తను నరకయాతన అనుభవిస్తూనే వాడికి సహకరిస్తూ వచ్చింది. వర్ధన్ వర్మకి తెలియకుండా అలా చాలా కాలమే మేనేజ్ చేసాడు.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)