Yevaru..? - 13 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 13

Featured Books
Categories
Share

ఎవరు....? - 13

Part - 13 

సమయం : సాయంత్రం 5:15 గంటలు.
ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ పాఠశాల

అక్కడ అప్పటికె పాఠశాల పిల్లలు మరియు టీచర్లందరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. పాఠశాల మొత్తం ఖాళి. 

కాని పాఠశాల ఆవరణ వెనుక బాత్రూంకి వెళ్ళె దారిలొ మాత్రం ఇద్దరు విద్యార్దులు చాటుగా మాట్లాడుకుంటూ నించున్నారు.

ఆ ఇద్దరిలొ ఒకరు 9వ తరగతి చదివె అమ్మాయి. ఇంకొకరు 10వ తరగతి చదివె అబ్బాయి. అక్కడ వాళ్ళిద్దరు కొంచెం హద్దు మీరే ప్రవర్తిస్తున్నారు. 

అదె సమయంలొ ఆ పాఠశాల ప్రధానోపాద్యుడు అదె ఆ స్కూల్ ప్రిన్సిపాల్ "కేశవ". అప్పుడె ఆఫిసులొ తన పని ముంగించుకొని బయలుదేరె ముందు బాత్రూంకి వెళదామని అటు వైపు వెళ్ళాడు. బాత్రూం పని ముగించుకొని బయటకి వచ్చాక తనకి ఏవొ గుస గుసలు వినపించాయి..

ఏంటా అని పాఠశాల వెనక వైపు వెళ్ళి చూస్తె. అక్కడ వీళ్ళద్దరు అసబ్య రీతిలొ తన కంటబడ్డారు.

ప్రిన్సిపాల్ కేశవ : రేయి ఏం చేస్తున్నారా అక్కడా...?

అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఇద్దరు ఒక్కసారి తుళ్ళిపడి అటు వైపు చూశారు. 

ఎదురుగా కేశవం సార్...

ప్రిన్సిపాల్ కేశవ : ఏం చేస్తున్నారు...? ఏంటా పాడు పనులు...?

అని దెగ్గరకు వచ్చి ఆ 10వ తరగతి అబ్బాయి చెంప మీద గట్టిగా కొట్టాడు. తరువాత ఆ అమ్మాయి వైపు కోపంగా చూసేసరికి. తనని కూడా కొడతారు అని ఆ అమ్మాయి భయపడింది. కాని కొట్టలేదు.

వాళ్ళిద్దరి చెతులు పట్టుకొని స్కూలు లోపల తన ఆఫిసుకు తీసుకువెళ్ళాడు.

ప్రిన్సిపల్ కేశవ : చెప్పండి ఎన్ని రోజులు నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం...?

అని కోపంగా అడుగుతాడు. కాని వాళ్ళు నోళ్ళు విప్పకుండా మౌనంగా భయంతొ అలాగె నించున్నారు. ఆ అమ్మాయి అయితె ఏడవడం మొదలుపెట్టింది.

ప్రిన్సిపల్ కేశవ : ఏం మాట్లాడరేం...? ఈ వయసులోనె ఇంతలా హద్దులు దాటారంటె. పెద్దయ్యాక ఇంకేం ఏం చేస్తారో...

కేశవ మాస్టారు కోపంగా మాట్లాడుతున్నా కూడా వీళ్ళిద్దరు భయం కారణంగా అలా మౌనంగ నించుండిపోయారు. ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తూనె ఉంది.

ప్రిన్సిపల్ కేశవ : మీకు ఇలా కాదు. రేపు మీ తల్లిదండ్రులను తీసుకురండి. వాళ్ళతోనె మాట్లాడుతాను. 

తల్లిదండ్రుల గురించి ఎత్తగానె ఇద్దరు భయపడిపోయారు.

10వ తరగతి అబ్బాయి : సార్ ..సార్..  ప్లీజ్ సార్ వాళ్ళకి చెప్పొద్దు సార్

9వ తరగతి అమ్మాయి : (ఏడుస్తూ) అవును సార్ మా నాన్నకి తెలిస్తె చంపేస్తాడు సార్. వద్దు సార్

ప్రిన్సిపల్ కేశవ : అదేం కుదరదు. రేపు గనక మీరు వాళ్ళను తీసుకురాకపోతె. నేనె మీ ఇండ్లకు వచ్చి మీ తల్లిదండ్రులతొ మాట్లాడతాను. వెళ్ళండి..

ఆ 10వ తరగతి అబ్బాయి తన సైకిల్ ఎక్కి ఇంటి వెళ్ళిపోయాడు. 

ఆ 9వ తరగతి అమ్మాయి మాత్రం ఇంకా అలాగె ఏడుస్తూ నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది.

కాసేపటికి దారిలొ ఆ అమ్మాయి తండ్రి "సతీష్" కనిపించాడు. ఏడుస్తున్న తన కూతురుని చూసి ఏమైంది అని అడిగాడు. 

ఆ అమ్మాయి భయంతొ ఏం చెప్పాలొ తెలియక మాట్లాడుకుండా ఉండిపోయింది. 

తండ్రి సతీష్ మరింత గుచ్చి గుచ్చి అడిగేసరికి భయంతొ ప్రిన్సిపాల్ కేశవ తనని లైంగికంగా వేధించాడు అని అబద్దం చెప్పి నిందమోపింది.

అంతె ఆ అమ్మాయి తండ్రి సతీష్ కోపంతొ ఊగిపోయాడు. వెంటనె తమ దళిత వాడలొ ఉన్న వాళ్ళందిరిని పిలుచుకు వచ్చాడు. 

అప్పుడె ఇంటికి దగ్గరకు చేరుకున్న ప్రిన్సిపాల్ కేశవని చుట్టుముట్టి కొట్టడం మొదలుపెట్టారు. 

అది చూసి కేశవ భార్య సుమతి ఇంటి నుండి బయటకు వచ్చి వాళ్ళు తన భర్తని కొట్టకుండా అడ్డుకోవాలని చూసింది. 

కాసేపటికె ఆ ఇంటి చుట్టూ మరింత ఎక్కువ మంది జనం పోగయ్యారు. అందరు కర్రలు పట్టుకొని కేశవని కొట్టడంతొ సుమతి తన భర్తని తీసుకొని ఇంటి లోపలికి పరిగెత్తింది. తరువాత తలుపులు అన్నీ ముసేసింది

అప్పుటికె సాయంత్రం 6 గంటలు దాటింది. నెమ్మదిగా చీకటి పడడం మొదలైంది.

బయట ఉన్న జనాలు కోపంతొ ఆ ఇంటిపై రాళ్ళు వెయ్యడం మొదలుపెట్టారు. 

కాసేపటికి రాళ్ళు పడే శబ్దం ఆగిపోయింది. కాని లోపలున్న కేశవకి సుమతకి ఏదొ పెట్రోల్ వాసన రావడం మొదలైంది. 

వెంటనె కిటికి తలుపులు తీసి చూస్తె బయట జనాలు తమ ఇంటిపై పెట్రోల్ జల్లుతున్నారు. అది చూసి సుమతి

సుమతి : అయ్యా అయ్యా మీకు పుణ్యం ఉంటుంది. వద్దు అయ్యా..  

అని అరుస్తుంది. కేశవ లోపల నుంచి ఇంటి తలుపులు తియ్యాలని చూశాడు కాని వాళ్ళు బయట నుంచి గడియ పెట్టి తాళం వేయడంతొ తలుపులు తీయలేక పోయాడు. 

ఈ లోపు బయట వాళ్ళలొ ఉన్న  ఒక వ్యక్తి కాలుతున్న కాగడాను తీసుకు వచ్చాడు. ఆ ఇంటికి నిప్పు అంటించడానికి. 

ప్రిన్సిపాల్ కేశవ : దయచేసి నా భార్య బిడ్డనైన కాపాడండి. తలుపులు తెరవండి మీకు దణ్ణం పెడతాను.

కేశవ మాటలు విన్న ఆ అమ్మాయి తండ్రి సతీష్ మనుసు కొంచెం కరిగి నిప్పు అంటించకుండా ఆపాలని చూశాడు...

సతీష్ : రేయి వద్దురా వాడు చేసిన తప్పుకి వాడి భర్యా బిడ్డను కూడా ఎందుకు బలితీసుకోవాలి. పోలీసులని పిలిచి వాళ్ళకి అప్పగిద్దాం.

కాగడా పట్టుకున్న వ్యక్తి : నువ్వు అడ్డురాకు. ఈ రోజు ఊరుకుంటె రేపటి నుంచి ఇలాగె మన ఆడపిల్లలుపైన తప్పుడు పనులు చేస్తారు. అలాంటి వాడిని కట్టుకున్నందుకు తన పెళ్ళాన్ని. ఇంతటి దుర్మార్గుడి కడుపున పుట్టినందుకు వాడి కూతురు కూడా బ్రతక కూడదు.

సతీష్ : అది కాదురా నేను చెప్పేది వినరా. వద్దు రా మనం చేసేది పాపం రా...

సతీష్ మాటలను పట్టించుకోకుండా తనని ప్రక్కకి లాగేశారు. తరువాత ఆ కాగడాతొ ఆ ఇంటికి నిప్పు అంటిచారు.

కొంచెం సేపట్లోనె మంటలు ఆ ఇంటిని కమ్మేశాయి. ఆ ఇంట్లొ బంధింపబడ్డ భార్య,భర్త, కూతురు ముగ్గరి ఆర్తనాదాలు ఆ గ్రామం అంతటా వ్యాపించాయి.

కేశవ కూతురు : అమ్మా....... మంటలు కాలిపోతున్న....

సుమతి : అయ్యో... ఆఆఆఆఆఆఆ.. ఆఆఆఆఆ

కేశవ : ఆఆఆఆఆఆఆఆ...... ఆఆఆఆఆ...

కేశవ, తన భార్య సుమతి, మరియు తన 9 ఏళ్ళ కూతురు గిరిజా. మంటల్లొ కాలిపోతున్నారు. 

2 గంటల తరువాత వాళ్ళ కేకలు ఆగిపోయాయి. ఆ ఇంటితొ పాటు ఆ ఇంట్లోని వాళ్ళు ముగ్గురు తగలబడిపోయారు.
------------------------------------------------------------------------

సమయం :  ఉదయం 9:20 గంటలు
విజయవాడ కమీషనరేట్ - SIT కార్యాలయం

గదిలో టేబుల్ మీద రాఘవ రావు ఫౌండేషన్ నంబర్‌కు సంబంధించిన రిపోర్టులు పడి ఉన్నాయి.
సాగర్ వర్మ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు.
జాన్ బాబు, సుందర్ ఎదురుగా కూర్చున్నారు.

ఎస్.ఐ సుందర్ : సార్..డా.రాఘవ రావు గారి ఫౌండేషన్ నంబర్ ఇప్పటికీ యాక్టీవ్‌గా ఉంది.
ఫోన్‌లో SIM లేదు. అంటే ఎవరొ కావాలనే SIM తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

సాగర్ వర్మ నెమ్మదిగా తిరిగి వాళ్ళ వైపు చూశాడు.

సాగర్ వర్మ : అవును..కాని ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ఒక నంబర్ మాత్రమే. ఆ నంబర్ వెనకాల పరిగెత్తడం కంటే. ముందు ఆ నంబర్ యజమాని గురించి తెలుసుకోవడం మంచిది.

ఎస్.ఐ జాన్ బాబు : డా. రాఘవ రావు గురించా సార్...?

సాగర్ వర్మ : అవును. అతను ఎలా జీవించాడు. ఎవరితో పనిచేశాడు. మరణానికి ముందు ఏమి చేశాడు. అన్నీ కావాలి.

రెండు గంటల తరువాత

సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్ నుంచి మరిన్ని ఫైళ్లు.
• మెడికల్ క్యాంప్ రిపోర్ట్స్ (Medical camp reports)
• ఎడ్మినిస్ట్రేటివ్ రికార్డ్స్ (Administrative records)
• డాక్టర్ ప్రోఫైల్స్ (Doctor profiles)
• ఫౌండేషన్ ఫైల్స్ (Foundation files)
ఇవి అన్నీ SIT కార్యాలయానికి చేరుకున్నాయి.

జాన్ బాబు వాటిని పరిశీలిస్తున్నాడు. అప్పుడే ఒక ఫైల్ దగ్గర అతని చూపు ఆగిపోయింది.

"డాక్టర్ శ్వేత"

అతను ఆ ఫైల్ తీసి తెరిచాడు.కొద్దిసేపు చదివాడు. తర్వాత వెంటనే తలెత్తి చూశాడు.

ఎస్.ఐ జాన్ బాబు : సార్...

సాగర్ వర్మ : ఏమైంది..?

ఎస్.ఐ జాన్ బాబు : డా. రాఘవ రావు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం తెలిసింది సార్. 

సాగర్ వర్మ : ఏంటది..?

ఎస్.ఐ జాన్ బాబు : జూనియర్ డాక్టర్ శ్వేత...

సాగర్ వర్మ : డాక్టర్ శ్వేత...?

ఎస్.ఐ జాన్ బాబు : తను డా. రాఘవ రావు గారి దత్తపుత్రిక.

గదిలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

ఎస్.ఐ సుందర్ : అంటే...?

ఎస్.ఐ జాన్ బాబు : అంటే వాళ్ళిద్దరూ కేవలం సహచరులు మాత్రమె కాదు. తండ్రి కూతుళ్ళు కూడా. 

సాగర్ వర్మ : ఇంట్రస్టింగ్...ఆయన పెళ్ళి చేసుకొకుండా ఉండడమె కాకుండా. ఒక ఆనాధ పిల్లని దత్తత తీసుకొని పెంచి డాక్టర్ ని చేశారు.

సాగర్ వర్మ : ఇప్పుడు శ్వేత ఎక్కడుంది.?

ఎస్.ఐ జాన్ బాబు : అదె ఇక్కడ అసలు సమస్య సార్. సరిగ్గ డా. రాఘవ రావు చనిపోయిన 6 నెలలకె ఈ శ్వేత కూడా రోడ్డు ఎక్సిండెంటులొ చనిపోయింది.

సాగర్ కుర్చీలో వెనక్కి వాలాడు.

సాగర్ వర్మ : వింతగా ఉందె. రాఘవ రావు గారు చనిపోయిన కొన్ని నెలల తరువాత ఆయన కూతురు శ్వేత కూడా చనిపోయిందా. 

అతను వెంటనే మరో ప్రశ్న అడిగాడు.

సాగర్ వర్మ : అసలు డా. రాఘవ రావు ఎలా చనిపోయారు.

ఎస్.ఐ సుందర్ : అధికారిక రిపోర్ట్స్ ప్రకారం ఆయన కార్డియాక్ ఎరెస్ట్ (Cardiac arrest) వల్ల చనిపోయారు అని ఉంది సార్.

సాగర్ వర్మ : కార్డియాక్ ఎరెస్టా..? మరి పోస్ట్మార్టెమ్ రిపోర్ట్..? 

ఎస్.ఐ సుందర్ : లేదు సార్. 

సాగర్ వర్మ : లేదా..?

ఎస్.ఐ సుందర్ : అంటె ఆయనకి పోస్టుమార్టమ్ చేయలేదు సార్

అని చెప్పగానె సాగర్ వర్మ ఎస్. ఐ జాన్ బాబు వైపు చూస్తాడు. 

ఎస్. ఐ జాన్ బాబు : అవును సార్. ఆయన్నీ పరీక్షించిన డాక్టర్ గుండె పోటు వల్ల చనిపోయాడు అని నిర్ధారించారు. సహజ మరణం కావడంతొ అప్పటి పోలీసులు ఆయనకి పోస్టుమార్టమ్ నిర్వహించ లేదు...

సాగర్ వర్మ : మరి శ్వేత మరణానికి సంబంధించిన ఫైల్ ఉందా...?

ఎస్.ఐ సుందర్ : ఉంది గాని ఇక్కడ లేదు సార్. తెప్పిస్తాను ...

సాగర్ వర్మ : వెంటనే తెప్పించండి.

సమయం : మధ్యాహ్నం 2:10 గంటలు

శ్వేత మరణానికి సంబంధించిన పాత కేసు ఫైల్ ఒకటి SIT కార్యాలయానికి చేరింది.

సాగర్ ఆ ఫైల్ తిరగేస్తున్నాడు. సరిగ్గ ఒక పేజీ దగ్గర ఆగిపోయాడు.

ఎస్.ఐ జాన్ బాబు : ఏమైనా దొరికిందా సార్...?

సాగర్ వర్మ : శ్వేత వ్యక్తిగత వస్తువులు (personal belongings) గురించి రికార్డ్ లొ వ్రాసి ఉంది

ఎస్.ఐ సుందర్ : అవి ఎక్కడ ఉన్నాయి అని వ్రాసారు సార్..?

సాగర్ వర్మ : పోలీసులు సీజ్ చేసిన తరువాత కుటుంబ ప్రతినిధులకు అప్పగించినట్టు ఉంది.

కొద్దిసేపు ఆలోచించి.

సాగర్ వర్మ : రాఘవ రావు ఫోన్ ఒకటి. శ్వేత ఫోన్ ఒకటి. ఆ రెండు ఫోన్లు నాకు కావాలి.

సమయం : సాయంత్రం 5:40 గంటలు
SIT కార్యాలయం.

టేబుల్ మీద ఇప్పుడు వాళ్ళిద్దరి రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
ఒకటి డాక్టర్ రాఘవ రావుది
మరొకటి ఆయన కూతురు డాక్టర్ శ్వేతది

సాగర్ ఆ రెండు ఫోన్ల వైపు చూస్తున్నాడు.

సాగర్ వర్మ : ఈ కేసులో ఇప్పటివరకు మనం చాలా ఫైళ్లు చదివాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ స్వయంగా ఏమి చెప్పాలనుకుంటున్నారో విందాం.

జాన్ బాబు, సుందర్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

ఎస్.ఐ సుందర్ : సార్...?

సాగర్ వర్మ : మృతులు మాట్లాడరు. కాని వాళ్ళ ఫోన్లు మాట్లాడతాయి. హ్యాకర్ వంశిని మళ్ళి పిలవండి.

కొద్దిసేపటికి ఎథికల్ హ్యకర్ వంశి SIT కార్యాలయానికి చేరుకున్నాడు.

హ్యాకర్ వంశి : గుడ్ ఈవినింగ్ సార్.

సాగర్ వర్మ  : గుడ్ ఈవినింగ్ వంశి...

హ్యాకర్ వంశి : చెప్పండి సార్ ఏం చేయమంటారు..

సాగర్ వర్మ : ఈ రెండు ఫోన్ల నుంచి పూర్తి డేటా కావాలి. ముఖ్యంగా డిలీటడ్ కాల్ లాగ్స్ (Deleted call logs) మరియు డిలీటడ్ కాంటాక్ట్స్(Deleted contacts) 

వంశి : అలాగే సార్.

అని చెప్పి రెండు ఫోన్లు తీసుకొని బయటకు వెళ్లిపోయాడు.

గదిలొ కాసేపు నిశ్శబ్దం.

సాగర్ వర్మ కుర్చీలొ వెనక్కి వాలి కూర్చొని ఏదొ ఆలోచిస్తున్నాడు.. 

తరువాత నెమ్మదిగా ముందుకు వచ్చి. తన టేబుల్ పై ఉన్న సంజీవిని మెడికల్ క్యాంప్ రికార్డ్స్ ఉన్న ఫైల్ తెరిచాడు.

అందులో ముఖ్యంగా డా. రాఘవ రావు మరణానికి ముందు 6 నెలల నుంచి జరిగిన కార్యక్రమాల జాబితా పరిశీలిస్తున్నాడు.
• మెడికల్ క్యాంప్స్(Medical Camps)
• హెల్త్ ఎవేర్నెస్ డ్రైవ్స్ (Health Awareness Drives)
• విలేజ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్స్ (Village Outreach Programs) 
అన్నీ చూస్తున్నాడు. 

అప్పుడే ఒక ఎంట్రీ దగ్గర అతని దృష్టిని ఆకర్షించింది.

పోనికెగూడెం ప్రత్యేక వైద్య శిబిరం

సాగర్ కాసేపు ఆ పేజీని చూస్తూ ఉన్నాడు.

సాగర్ వర్మ : సుందర్ గారు...

ఎస్.ఐ సుందర్ : సార్... 

సాగర్ వర్మ : రాఘవ రావు గారు చివరిసారిగా మెడికల్ క్యాంప్ నిర్విహించింది ఇక్కడె. ఆ తరువాత 3 నెలలకు ఆయన చనిపోయారు.

ఎస్.ఐ సుందర్ : ఎక్కడ సార్ ...?

సాగర్ వర్మ : "పొనికె గూడెం..."

ఎస్. ఐ. జాన్ బాబు : పోనికె గూడెం ....? అదొక ఏజన్సీ ప్రాంతం సార్. విజయవాడ నుంచి 40-45 కి.మీ దూరంలొ కొండపల్లి కొండల వెనకాల ఉంటుంది ఈ ఊరు. అక్కడికి పెద్ద రావాణ సౌకర్యం కూడా లేదు. వెనకబడిన ప్రాంతం సార్ .

సాగర్ వర్మ : అందుకె అక్కడ మెడికల్ క్యాంప్ నిర్విహించారు.. నాకు ఆ క్యాంపులొ పాల్గొన్న వారి జాబితా కావాలి ఉందా...?

ఎస్.ఐ సుందర్ : ఇంకొ పేజీలొ ఉంది సార్...

అని సుందర్ మరో పేజీ తిప్పి చూపించాడు.

అది చూసి సాగర్ వర్మ చదవడం మొదలుపెట్టాడు.

"డాక్టర్ రాఘవ రావు..."
"డాక్టర్ శ్వేత..."
"డాక్టర్ హరీష్..."
"డాక్టర్ పద్మ..."
"మరియు సంజీవిని మెడికల్ టీమ్."

సాగర్ వర్మ : ఈ డా. హరీష్ మరియు డా. పద్మ గురించి వివరాలు కావాలి...

అని అడగగానె సుందర్ మరియు జాన్ ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు..

సాగర్ వర్మ : ఏమైంది...?

ఎస్.ఐ జాన్ బాబు : సార్ శ్వేత చనిపోయిన రోజున నుంచి వాళ్ళిద్దరు కనిపించడం లేదు సార్...

సాగర్ వర్మ : వాట్...?