Ventaade Needalu - 13 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 13

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 13

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"ఎక్జాట్లీ." నవ్వింది సమీర.  "తను మర్డర్ అటెంప్ట్ చేసిన ఇద్దరూ కూడా తనని చాలా అభిమానించే వాళ్లే.  వాళ్ళు చచ్చిపోవడానికి కూడా అంతబాధపడరేమో కానీ, కానీ తను జైలుకి వెళ్ళిపోతుంది కదా. తనేదో సైకలాజికల్ డిజార్డర్ వల్ల చంపేసిందంటే లా ఒప్పుకుంటుందా?"  

"ఈ ఇద్దరిమీద తప్ప ఇంకెవరిమీదా తను అలాంటి మర్డర్ అటెంప్ట్ చెయ్యలేదా?"

"లేదు." తల అడ్డంగా ఊపింది సమీర. "అసలు తను వాళ్ళిద్దరిమీద మర్డర్ అటెంప్ట్ చేసివుండకపోతే, వాళ్ళునన్ను సంప్రదించి ఉండేవారు కాదు."

"తను కాలేజ్ స్టూడెంట్ కదా." సమీర చెప్పింది గుర్తుచేసుకుంటూ అన్నాడు నిరంజన్. "కాలేజ్ లో ఎవరిదగ్గరన్నా అబ్నార్మల్ గా బిహేవ్ చేసిందా?"

"లేదు. అటువంటి హిస్టరీ ఏమీ లేదు. ఎక్సెప్ట్ దీజ్ టూ మర్డర్ అటెంప్ట్స్, తక్కినవి మనం అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. మరీ తోటి స్టూడెంట్స్ నోటిఫై చేసేంత అబ్నార్మల్ గా ఎవరితో బిహేవ్ చెయ్యలేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం వుంది." కొంచెం అనీజీ గా ఫీలవుతూ అంది సమీర.

"ఏమిటది?" నొసలు చిట్లించాడు నిరంజన్.

సారిక తనకి చెప్పిన తన సెక్స్ లో ఫెయిల్యూర్ గురించి చెప్పింది సారిక. "లాస్ట్ మూమెంట్ లో ఎందుకు అలా జరుగుతూందో తనకి అర్ధం కావడం లేదు. తనూ కావాలనుకుని అంతదూరం వెళుతూందేమో, అది జరగకపోవడం తో చాలా ఫ్రస్ట్రేటింగ్ గా, అన్కంఫర్టబుల్ గా ఉంటూంది తనకి."

"సహజమే కదా మరి. పాపం ఆ గైస్ పరిస్థితి ఆలోచించాలి." నవ్వాడు నిరంజన్.

"మరిందులో నీ సజెషన్ ఏంటిప్పుడు? మనం ఏం చేస్తే బావుంటుంది? ఆ ఫ్యామిలీ కి ఏంటి సజెస్ట్ చెయ్యాలి?" సమీర అడిగింది.

అప్పుడప్పుడు వున్న చనువుతో నువ్వు, నీ అని ఏకవచనం తో  అనేస్తుంది సమీర. సమీర అలా ఏకవచనం తో పిలిచినప్పుడు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాడు నిరంజన్.

"ఏక్సెప్ట్ దోజ్ టు మర్డర్ అటెంప్ట్స్, తన తక్కిన బిహేవియర్ నార్మల్ గానే తీసుకోవచ్చు. ఆ అబ్నార్మల్ బిహేవియర్ కి మనకి క్లూ ఏమీ దొరకటం లేదు. ఇప్పటికే తీసుకొచ్చిమన మెంటల్ కేర్ లో జాయిన్ చేసేమనడం టూ మచ్ గా ఉంటుంది కదా. మనం మనీ గురించే అలా చెప్పినట్టుగా ఉంటుంది."

"దట్ మచ్ ఈజ్ ట్రూ." తలూపింది సమీర.

"కానీ ఆ భుజంగరావు చాలా వెల్తీ పెర్సన్. పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేసినట్టుగా కూడా వుండకూడదు. నువ్వు పీరియాడికల్ విజిట్స్ చేసి, హిప్నోసిస్ ద్వారా ఎమన్నా విషయం తెలుస్తుందేమో, క్యూర్ చెయ్యడానికి అవుతుందేమో చూడు. ముఖ్యంగా నువ్వే అలోచించి చూడు ఎం చేస్తే బాగుంటుందో."

"ఒకే సర్." మళ్ళీ బహువచనం లో సంభోదిస్తూ అంది సమీర.

సమీర ఇంకా ఎదో మాట్లాడబోతూ ఉండగా తనకి ఫోన్ కాల్ వచ్చింది ఒక అన్నోన్ నంబర్ నుండి. ఆ కాల్ అటెండ్ చేసి మాట్లాడింది సమీర.

"ఇప్పుడు నాతో మాట్లాడింది ఆ అమ్మాయే, సారిక." ఒక అర నిమిషం అలా  సారికతో మాట్లాడడం పూర్తయ్యాక, నిరంజన్ తో అంది సమీర.

"ఏమంటుంది?" కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ అడిగాడు నిరంజన్.

"ఎప్పుడూ తను ఒక బొమ్మ గీస్తూ ఉంటుందని చెప్పిందని చెప్పాను కదా. తను ఇప్పుడూ ఒక బొమ్మ గీసింది. ఫోటో తీసి వాట్సాప్ లో పంపింది." అని చెప్తూ వాట్సాప్ లో ఆ ఫోటో ఓపెన్ చేసింది. అది కాసేపు చూసాక "ఇదే తను తరచూ గీసే బొమ్మ." అంటూ ఫోన్ నిరంజన్ కి ఇచ్చింది.

"ఒంటె తల తో మగవాడి నగ్నశరీరం." ఫోన్ తిరిగి సమీరకి ఇచ్చేస్తూ అన్నాడు నిరంజన్. "తనకెందుకు ఇలాంటి బొమ్మ గియ్యాలనిపిస్తూవుంటుంది?"

"తెలీదు. ఆ బొమ్మ గీసే సమయం లో తననెవరో ఆవహించినట్టుగా వుంటుందట. గీసిన తరువాత చూస్తే ఏవగింపుగా అనిపిస్తుందట. అందుకని అలా గీసిన బొమ్మలన్నీ చింపిపారేసింది. ఇక్కడనుండి ఆ బొమ్మ గీస్తే చింపిపారేయవద్దని, వుంచమని చెప్పాను. నాకొక ఐడియా రావడం కోసం కాబోలు వాట్సాప్ లో పంపింది."

"ఒకే సమీరా. మరోసారి అలాంటి మర్డర్ అటెంప్ట్ ఎవరిమీదన్న చేస్తే, మన మెంటల్ కేర్ లోనే ట్రీట్ చేద్దామని చెప్దాము. అంతవరకూ నేను చెప్పినట్టుగా చెయ్యండి." నిరంజన్ సజెస్ట్ చేసాడు.

"అలాగే సర్" అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.     

&&&

"నువ్వలా ఏడుస్తూ ఉంటే నాకేమీ బోధపడదు. అసలు ఏం  జరిగిందో సరిగ్గా చెప్పు." ఫోన్ లో కోపంగా అన్నాడు భుజంగరావు.

"నా మొగుడు చాలా చిత్రం గా ప్రవర్తిస్తున్నాడు బాబూ. గొంతులో నీళ్లు పోసుకుని పుక్కిలించినట్టుగా చేస్తాడు.  తల అటూ, ఇటూ ఆడిస్తాడు. నేనేం చేసినా తిడతాడు. ఏం పెట్టినా తిడతాడు. ఏదీ బావులేదంటాడు. మాకు కనిపించనివి ఏవో కనిపిస్తున్నాయంటాడు. మాకు కనిపించేవి కొన్ని తనకి కనిపించడం లేదు. తనకి ఏం జరిగిందో బోధపడడం లేదు బాబూ." ఏడుస్తూ చెప్తోంది ఓబులేసు భార్య.

"వాడెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఏమయి ఉంటుంది వాడికి?" ఆశ్చర్యంగా అన్నాడు భుజంగరావు.

"అదే నాకూ తెలియడం లేదు బాబూ. కానీ ఇదంతా కేవలం ఆ రోజు తరువాత మాత్రమే ప్రారంభం అయింది." ఇంకా ఏడుస్తూనే వుంది ఓబులేసు భార్య.

"ఆ రోజు అంటే ఏ రోజు?" ఇంకా చిరాకు పడుతూ అడిగాడు భుజంగరావు.

"అదే తనని అమ్మాయిగారు చంపడానికి ప్రయత్నించిన రోజు. ఆ రోజు నుండి తను చాలా కలవరంగా వున్నాడు. 'ఇది అదే అదే. ఇది అదే అదే.' అంటాడు కానీ అదేమిటో చెప్పడు."      

"సర్లే, నువ్వేం పెద్దగా కంగారుపడకు. వాడిని ఎవరన్నా డాక్టర్ కి చూపించే ఏర్పాటు చేస్తాలే. అంతా సర్దుకుంటుంది." అలా అన్నాక ఇంక ఓబులేసు భార్యకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసాడు భుజంగరావు 

తరువాత తన తన మామగారు ఉంటున్న రూమ్ లోకి విషయం చెప్పాడు భుజంగరావు ఆయన కి.

"చాలా ఆశ్చర్యంగా వుంది! వాడెందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు?" ఆశ్చర్యంగా అడిగాడు మోహనరావు.

"అదే అర్ధం కావట్లేదు." భుజంగరావు లో కూడా ఆశ్చర్యం సమపాళ్ళల్లోనే వుంది. "వాడేదో మామూలు మనిషి అయితే నేను ఇలా ఆశ్చర్యపడను. కానీ వాడెలాంటివాడో మీకూ నాకూ కూడా బాగా తెలుసు. దేనికీ వంగి కంగీ రకం కాదు. మనకెలాంటి పనులు చేసిపెట్టాడు?"

"వాడిగురించి నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అనాధ వెధవలా తిరుగుతూవుంటే నేనే చేరదీసాను. వాడు చాలా మొండి, దేనికీ భయపడే రకం కాదు. వాడికి నేనంటే చాలా భక్తి, గౌరవం కూడా. నేను చెప్తేనే వాడు పెళ్ళిచేసుకుని సంసారిగా స్థిరపడ్డాడు."    

"వాడేమిటి మావయ్యా సడన్ గా ఇలా బిహేవ్ చెయ్యడం? అందులోనూ వాడిమీద సారిక అలా మర్డర్ అటెంప్ట్ చేసినతరువాతే వాడిలా బిహేవ్ చెయ్యడం ప్రారంభించాట్ట."

"నాకూ ఏమీ అంతుపట్టడం లేదు." కుర్చీలో వెనక్కి వాలి అన్నాడు మోహనరావు. "ఇంతకీ ఆ సైకియాట్రిస్ట్ ఎవరో మన ఇంటికి వచ్చిందా? ఆవిడతో మీరు మాట్లాడారా?"

"ఆ వచ్చింది. మేము మాట్లాడాం కూడా. ఇంతకీ తనెవరో కాదు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అరవింద్ భార్య." అన్నాక సమీర రావడం, తరువాత జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు భుజంగరావు. "తన సీనియర్ తో డిస్కస్ చేసిన తరువాత మన సారిక ట్రీట్మెంట్ విషయంలో ఒక నిర్ణయానికి వస్తానని చెప్పింది."

"ఆల్రైట్. ఒకటి రెండు రోజుల్లో తనే ఫోన్ చేసి మాట్లాడకపోతే, నువ్వే ఫోన్ చెయ్యి. కావాలంటే అంతకన్నా కూడా మంచి సైకియాట్రిస్ట్ కి మన సారిక ని చూపిద్దాం."

"అవసరం ఉండదు లెండి మావయ్యా. తను కాపబుల్ లాగ కనిపిస్తూ వుంది. ప్రమీల కూడా తనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పింది."

"సరే అయితే." తలూపాడు మోహనరావు. "చెప్పిన విషయం గుర్తుందికదా. సారిక కి నువ్వు అనవసరం గా ఈ ఓబులేసు విషయం అదీ చెప్పి భయపెట్టకు. తనసలే అప్సెట్ అయివుంది."

"ఓకే."తలూపాడు భుజంగరావు. "ఓబులేసు విషయం సారిక కి చెప్పను. వాడిని ఏ డాక్టర్ కి చూపించాలి అన్నది ఆలోచిద్దాం."

ఆ తరువాత మరికొంత సేపు మాట్లాడాక భుజంగరావు తన మామగారి రూమ్ లోనుండి వెళ్ళిపోయాడు             

&&&

 "ఒరేయ్, దాన్ని నువ్వే పెళ్లిచేసుకో. దాన్నేదో కాస్త చదువుకున్నవాడికి, మంచి వుద్యోగం చేసేవాడికి ఇచ్చి చేద్దామనుకున్నాను కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదు. దాని నాన్నే  తనని వదిలేసాడు. ఇంకా ముసలిదాన్నయిపోయాను, నేనేం చెయ్యగలను?" ఆరోజు సింహరాజు, మల్లిక తనతో పాటుగా ఇంట్లో ఉండగా సాముదమ్మ అంది

మల్లిక సింహరాజు మొహంలోకి చూసి చిరునవ్వు నవ్వింది. సింహరాజు మాత్రం మౌనంగానే వుండిపోయాడు.

"నువ్వు వాడి వెనకాల మోజుపడి తిరుగుతున్నావు. నాకున్నదంతా అమ్మి నీకేదో కాస్త మంచి వుద్యోగం చేస్తున్నవాడిని తెచ్చినా ప్రయోజనం ఏమిటి నువ్వు వాడంటే పడి ఏడుస్తున్నప్పుడు? అందుకనే నాకున్న కాస్త ఆస్తితో పాటుగా నిన్ను కూడా వీడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాను." మళ్ళీ సాముదమ్మే అంది.

"చాలా మంచి ఆలోచన." ఆనందంగా అంది మల్లిక. "మా పెళ్ళికి మాత్రం  నా నాన్నని పిలవకు. నాకు తనంటేనే అసహ్యంగా వుంది." మల్లిక కోపంగా అంది.

"తను నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇంకెప్పుడూ ఇక్కడికి రావద్దని కూడా చెప్పేసాను. అలాంటి కృతఘ్నుడి నీడ కూడా మనమీద పడకూడదు." సాముదమ్మ కూడా కోపంగానే అంది.

"ఎంత మంచిపని చేసావు మామ్మా."  కూచున్నచోటునుండి లేచివెళ్లి   సాముదమ్మ ని కౌగలించుకుని కుడిబుగ్గ మీద ముద్దుపెట్టుకుని అంది మల్లిక.

"చాల్లే దూరంగా వుండు. నువ్వన్నా కూడా నాకు కోపంగాను, చికాగ్గానే వుంది." మల్లికని దూరంగా తోస్తూ అంది సాముదమ్మ.

"మల్లిక కబుసా ని ఆరాధిస్తూంది." ఎంతసేపటినుండో ఉగ్గబట్టుకుని చెప్పాలనుకున్నది చెప్తున్నది చెప్తున్నట్టుగా చెప్పాడు సింహరాజు.

"ఏమిట్రా వాగుతున్నావ్?" ఆశ్చర్యం గా చూస్తూ లేచినిలబడింది సాముదమ్మ.

"అవును. నీ మనవరాలు కబుసా ని ఆరాధించడం మొదలుపెట్టింది. కబుసా ఇష్టపడితే కన్నెపిల్లలకి కనిపించే లక్షణాలు తనకి కనిపించాయి. అందుకనే తనని ఆరాధిస్తోంది." సింహరాజు బెరుగ్గానే అన్నాడు. సాముదమ్మ లో అలంటి ప్రతిస్పందన ఊహించిందే.

"నాకూ కనిపించాయి ఆ చిహ్నాలు. నేను తనని పూజించడం మొదలుపెట్టానా? ఎవరో ఆ వచ్చే శక్తులకు కక్కుర్తిపడేవాళ్లు తప్ప కబుసా ఇష్టపడుతూన్నా తనని ఆరాధించరు. ఇంతకీ తనెలాంటి దేముడో తనకి ఏమి ఇష్టమో వివరంగా తెలుసా తనకి?"

"అన్నీ వివరంగా చెప్పాను. వద్దనే వారించాను. అయినా కబుసా ని ఆరాధిస్తానని పట్టుపడితేనే, తనని నడిపిస్తున్నాను." సింహరాజు ఇంకొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు.

"నీతో తను తిరిగితే తొందరపడి కడుపు తెచ్చుకుంటుందేమోనని భయపడ్డాను తప్ప, ఇలాంటి ప్రమాదం ఉంటుందనుకోలేదు. అంతకీ తను కావాలనుకుంటే ఎంతమంది అలాంటి దేవుళ్ళు ఇంకా లేరు? కబుసా నే పూజించాలా? నీకు అన్నీ తెలిసి అలా ఎలా చేసావురా? వారించి ఆపడం పోయి, తనని అందులో ముందుకునడిపిస్తావా?" సాముదమ్మ లో కోపం, భయం రెండూ వున్నాయి.

"నువ్వంత భయపడకు మామ్మా. నేను ఆ కబుసా ని పూజించడం ఆపేస్తాను. ఆ శక్తులవి నాకిప్పుడు ఏమీ అక్కర్లేదు. నేను నిజంగా ప్రేమిస్తున్నది సింహరాజుని అని, నాకు కావల్సినది తనే అని నాకు బోధపడింది." మల్లిక అంది.

"నోరుముయ్యవే తింగరిదానా. కబుసా ఇష్టపడినవాళ్లు తనని పూజించడం మొదలుపెడితే ఇంక ఆపడం, వదిలేయడం ఉండదు. నువ్వు తనని పూజించడం మొదలుపెట్టిన క్షణం నుండి, నిన్ను తను తన వశం చేసుకుంటాడు. నువ్వు తనని పూజించడం అపి దూరంగా వెళ్లదలుచుకుంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాడు."

తన మామ్మ మాటలలో  అలాంటి తీవ్రత, మొహం లో అలాంటి భావం ఎప్పుడూ చూడలేదు మల్లిక. అందుకనే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది.

"మల్లిక కి కబుసా మీద ఆసక్తి ఈవేళ వచ్చింది కాదు. మొదటినుండి తనమీద ఆసక్తి కనబరుస్తూనే వుంది. అకస్మాత్తుగా తాను, కబుసా తనని ఇష్టపడుతున్నాడని తెలిసేసరికి తను ఆరాధించాలనుకుంది." సింహరాజు అన్నాడు. "కబుసా అనుగ్రహిస్తే వచ్చే శక్తులు నీకు తెలుసుకదా."

"ఒరేయ్ ఒకప్పుడు మా కుటుంబం అంతా వాటిల్లోనే వుంది. బాణమతులు, చేతబడులు లాంటివి మేమూ చేసాం. ఆ కబుసా అనుగ్రహిస్తే వచ్చే శక్తులు నాకు తెలుసు, అలాగే వాడు ఏది ఇష్టపడతాడో తెలుసు, ఆలా తన భక్తులు ఉండకపోతే ఏం చేస్తాడో కూడా తెలుసు. అందుకనే మేమెవరం ఎప్పుడూ కబుసా జోలికి పోలేదు. కబుసా నన్ను ఇష్టపడుతున్నాడని తెలియగానే మల్లిక సరదాపడ్డట్టుగానే నేనూ సరదాపడ్డాను తనని ఆరాధించడానికి. కానీ కబుసా గురించి పూర్తిగా తెలిసిన నా తల్లితండ్రులు అందుకు ఒప్పుకోలేదు. నువ్వే ఆ కబుసా అనుగ్రహం కోసం ఏడుస్తున్నావ్, వాళ్ళలోచించినట్టు ఎందుకు ఆలోచిస్తావ్?" మరోసారి కోప్పడిపోయింది సాముదమ్మ

మల్లిక కి, సింహరాజు కి ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారప్పుడు.

"సరే అది నీకు కాబోయే పెళ్ళాం. కబుసా గురించి అంతా తెలిసే నువ్వు తనని ముందుకు నడిపించావు. ఇంకో పదిహేను రోజుల్లో తను పద్దెనిమిదో సంవత్సరం లో అడుగుపెడుతుంది. తెలుసుకదా అప్పుడేం చెయ్యాలో? అలాగే కబుసా భక్తురాలి భర్తగా నీకేం చెయ్యాలో, ఎలా ఉండాలో కూడా నీకు నేను చెప్పక్కర్లేదు." రాజీ కి వచ్చినట్టుగా అంది సాముదమ్మ ఆఖర్లో మల్లిక మొహంలోకి చూస్తూ

"సామమ్మా ఇక్కడో చిన్న పొరపాటు జరిగింది." చిన్న గొంతుతో అన్నాడు సింహరాజు. 

"చెప్పరా, ఇంకా ఏం చేసి చచ్చారు?" అసహనం తోటి భయంతోటి అడిగింది సాముదమ్మ

 "మేమిద్దరం కలిసాం సామమ్మా." ఆ చిన్నగొంతుతో అలాగే అన్నాడు సింహరాజు.

"ఏమిటి కలిశారు? నాకర్ధమై చావలేదు. సరిగ్గా చెప్పు." అది అర్థమైనా, అది అయి ఉండకూడదనే కోరికతో గట్టిగా అడిగింది సాముదమ్మ.

"మా ఇద్దరిమధ్య అది జరిగిపోయింది. నేను తనని అనుభవించాను." ఎదో తెగించినట్టుగా, పెద్దగొంతుతో చెప్పాడు సింహరాజు.

నిర్ఘాంతపోయి, విభ్రమంగా నిలబడిపోయింది సాముదమ్మ కొంతసేపు. "ఎంతపని చేసావురా భ్రష్టుడా." అది అర్ధంకాగానే సింహరాజు దగ్గరకి వచ్చి వాడి కుడిచెంప మీద, కుడిచేత్తో గట్టిగా కొట్టింది.    

"మామ్మా ఇందులో సింహరాజు తప్పేమీ లేదు, నేను బలవంతపెడితేనే చేసేడు." వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అరిచింది మల్లిక.

"వాడేదో పెళ్ళికాకుండా నిన్ను అనుభవించినందుకు కాదే నా బాధ. రేపో మాపో పెళ్లిచేసుకోబోయేవాళ్లు మీరుతొందరపడితే కొంపలేం అంటుకుపోతాయ్? కానీ తను ఇష్టపడుతూన్న కన్నెపిల్ల, తనని పూజించడం మొదలుపెడితే, ఆ కన్నెపిల్లని కబుసా ఏ మొదట అనుభవించాలనుకుంటాడని వీడికి తెలీదా? ఒకవేళ ఇంకెవరికన్నా తన కన్యత్వం సమర్పించుకుంటే ఆ కబుసా ఏం చేస్తాడో వీడి తెలీదా?" కోపంగా అరిచింది సాముదమ్మ కూడా.

"ఏమిటి మామ్మా అలాంటివన్నీ నిజంగా ఉన్నాయా? నిజంగా వాటిని నమ్మి భయపడాలా?" అందికానీ నిజంగానే భయపడుతూ వుంది మల్లిక కూడా.

"చదివింది ఐదోక్లాసు లేదు, ఇలా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకున్నవే? నిన్నేం చూడకపోయినా, వాళ్ళ తెలివితేటలు మాత్రం నీకంటిచ్చారా వాళ్ళు?" మల్లిక మొహం లోకి చూస్తూ హేళనగా అంది సాముదమ్మ. అంతలోనే తన మోహంలో భావం మారి అంది. "అవన్నీ అబద్ధాలు అయితే, నిజం కాకపొతే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరూ వుండరు. కానీ ఆ కబుసా నిజం. వాడికి నచ్చినట్టుగా చేస్తే వాడు ఇచ్చే శక్తులు నిజం. వాడికి ఆగ్రహం తెప్పిస్తే ఘోరాతిఘోరంగా వాడు శిక్షించే విధానం నిజం. ఎంతపని చేసావు మల్లికా? కావాలని నిప్పుల గుండం లోకి దూకావు కదా." బాధ, భయం తో మిళితమై వుంది సాముదమ్మ గొంతు.

"అందుకు కారణం నేను. తప్పంతా నాది." సింహరాజు మొహం లోనూ, గొంతులోనూ కూడా బాధ, భయం పూర్తిగా వున్నాయి. "నువ్వు చెప్పినట్టుగా నేను తనని వారించి ఉండాల్సింది. కబుసా ని పూజించడానికి తనని ప్రోత్సహించకుండా ఉండాల్సింది."

"నాకు తెలీదురా. మీరిద్దరూ కలిసి ఇందులో దిగారు. ఇంక మీరే చూసుకోండి." అలా అనేసి అక్కడనుండి వెళ్ళిపోయింది సాముదమ్మ.

  సాముదమ్మ అలా వెళ్ళగానే వచ్చి సింహరాజు ని కౌగలించుకుంది మల్లిక. "నిజంగానే నేనంత పెద్ద తప్పు చేసానా? ఆ కబుసా నన్ను శిక్షిస్తాడా? మామ్మ ఇంత భయపడిపోవడం నేనెప్పుడూ చూడలేదు." మల్లిక గొంతునిండా భయం తో, ఏడుపు ఒకటే తక్కువగా వుంది.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)