Ventaade Needalu - 19 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 19

Featured Books
  • యూ ఆర్ మై డెస్టినీ

    ఇది అక్క క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ .తన జీవితంలో పెళ్లి అనేది...

  • అంతం కాదు - 84

    క్యాంపస్ బయట – ఈవెనింగ్ టైమ్మీరా, రాజు, ఆసిఫ్, ప్రవీణ్ కారు...

  • వెంటాడే నీడలు - 19

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ప్రణయ గీతిక - 7

    గుణేష్ ని   అతని రూమ్ కి వదిలి వచ్చిన ప్రభ అర్జునుని ఏదో అడగ...

  • అంతరంగ శుద్ధి

    కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనే ఆరు దుర్గుణాలను అరిషడ్వ...

Categories
Share

వెంటాడే నీడలు - 19

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"అప్పుడెప్పుడూ  చెప్పాలనిపించలేదు. ఇప్పుడూ చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేనేమో అనిపిస్తూంది. అందుకనే చెప్తున్నాను."

"అవేం మాటలు. మనం ఎప్పటికీ కలిసుంటాం. ఎన్ని విషయాలన్నా మాట్లాడుకుంటాం." ఎందుకనో ఎదో భయం కలిగింది సింహరాజు గుండెల్లో.

"నువ్వున్నావన్న ధైర్యంతోనే వున్నాను. నీ గురించిన ఆలోచనలే నన్నా అవమానాలు భరించేలా చేశాయి. కేవలం నీ మీద ప్రేమవల్లే మా నాన్న నన్ను అంతగా వదిలేసినా నేను ఆనందంగా ఉండగలిగాను."

"ఈ విషయాలన్నీ నాకు చాలా కొత్తగా వున్నాయి. నువ్విలా మాట్లాడతావని నేనెప్పుడూ అనుకోలేదు." మల్లిక అలా మాట్లాడుతూ వుండడం ఒకపక్క భయం ఇంకోపక్క ఆనందం కలిగిస్తూ వున్నాయి. "నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్ళిరాగానే మనిద్దరం పెళ్లిచేసుకుందాం. అప్పుడు చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం."

ఆ తరువాత ఎలాగో మల్లిక ని విడిపించుకుని బయలుదేరాడే కానీ మనసంతా ఎదో భారంగానే వుంది సింహరాజుకి. ఆ రెండురోజులు రెండు యుగాల్లా గడిచాయి. ఎలాగో ఆ పనులుచేసి, ఆ డబ్బులు తీసుకుని, మల్లిక కి ఇష్టమైనవి ఏవో కొని తిరుగుప్రయాణం అయ్యాడు సింహరాజు.              

తలుపులు గడియ వెయ్యకుండా తొయ్యగానే వచ్చాయి. ఇల్లంతా వెదికినా మల్లిక ఎక్కడా కనిపించలేదు. ఎదో భయం గుండెలనిండా కమ్ముకుంటూ వుంటే ఊరంతవెతికాడు. వూళ్ళో ప్రతిఒక్కరినీ అడిగిచూసాడు. ప్రతి ఒక్కరు తమకేమీ తెలియదనే చెప్పారు. ఊరంతా వెతికి వెతికి అందర్నీ అడిగి అడిగి చీకటిపడుతూండగా తిరిగి ఇంటికొచ్చాడు సింహరాజు. తను ఎక్కడికి వెళ్లిందో, ఎందుకు వెళ్లిందో బోధపడడం లేదు.  మల్లిక లేని ఆ యింట్లో అసలు వుండబుద్ధి కావడం లేదు. ఇంక ఆ ఇంటిని మూసి తన ఇంటికి పోదామనుకుంటూ పెరట్లోకి వెళ్ళాడు.

ఆ రోజు పున్నమి కావడం వల్ల నెలంతా వెన్నెల పరుచుకుని అన్నీ స్పష్టంగా కనిపిస్తూ వున్నాయి.

అలా ఆ పెరట్లో తిరుగుతూ వుంటే ఒకచోట కొంచెం లోతుగా, తేడాగా కనిపించింది . కాస్త పరిశీలించి చూసిన మీదట ఎవరో గొయ్యి తవ్వి మళ్ళీ కప్పినట్టుగా వుంది. ఏదో అనుమానం వచ్చి ఇంట్లోనుండి గునపం తెచ్చి నెమ్మదిగా మట్టి బయటకి తీసి చూసాడు. ఎవరో కొంచెం లోతుగానే గొయ్యి తవ్వినట్టుగా వున్నారు. ఇంచుమించులో అదిరిపోతున్న గుండెలతో ఒక అరగంట పైగానే అలా తవ్వి మట్టి బయటకి తీసాడు సింహరాజు. లోపల ఏ ఆచ్చాదనా లేకుండా నగ్నంగా వున్న మల్లిక సెవం బయటపడింది.  

&&&

గట్టిగా అరుస్తూ కుర్చీలోనుండి లేచాడు సింహరాజు.

"మల్లిక  ఆ పరిస్థితి కి కారణమైన వాళ్ళు శిక్ష అనుభవించకుండా వుండరు. వాళ్ళు ఎందుకు పుట్టామా అనుకునేలా శిక్ష అనుభవిస్తారు. నువ్వు సంయమనం తో వుండు." యస్మణి కూడా కుర్చీలోనుండి లేచి సింహరాజు కుడిభుజం మీద చెయ్యివేసి అన్నాడు.

"మల్లిక ని దారుణంగా మానభంగం చేసి, పూర్తి నగ్నంగా బతికుండగానే గొయ్యితీసి పాతిపెట్టేసాడు. ఎంత కర్కోటకుడైతే అలా చేసివుంటాడు?" ఆవేదనగా అన్నాడు సింహరాజు.

"నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చివుండాల్సింది."

"ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో, ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా వచ్చి, ఎలాంటి సాక్ష్యాలు మిగల్చకుండా పనిపూర్తి చేసివెళ్ళాడు. కానీ నాకు తెలుసు. వాళ్ళింట్లో వాళ్ళకి చాలా నమ్మకంగా పనిచేసే పనివాడు ఒకడు వున్నాడని మల్లిక నాకు చెప్పింది. మల్లిక అడ్డు తొలగించడానికి వాడిని పురమాయించి వుంటారు. వాడు కోరిక కూడా తీర్చుకుని అలా అడ్డు తొలగించాడు."

"ఎంత దారుణమైన విషయం?"

"ఎవరికీ కనిపించకుండా మల్లిక ఇంటికి వచ్చివుంటాడు. తెలిసివున్నవాడు అవడం వల్ల లోపలి రానిచ్చివుంటుంది. వాడు బలమైన వాడు అయితే మల్లిక లాంటి అమ్మాయిని లోబరుచుకుని, మానభంగం చేసి చంపడం ఏమంత కష్టం?"

"అంతే కాదు వాడు ఆనుపాను అన్నీ కనిపెట్టి, ఒక పధకం వేసుకుని, నువ్వు కూడా లేని  సమయం లో వచ్చాడు. తనని చంపి పెరట్లోనే పాతేస్తే ఎవరికన్నా ఏ  అనుమానమన్నా ఎలా వస్తుంది?" యస్మణి కూడా బాధగా అన్నాడు. అతనికి కూడా తను అప్పుడు చూసిన అమాయకమైన మల్లిక రూపం గుర్తుకువస్తూ వుంది. "ఎంత ఇష్టం లేకపోయినా అలా చంపించేయాలా?"

"అది ముఖ్యంగా అతని మామగారు, భార్య పురమాయించివుంటారు. తను బతికివుంటే ఎప్పటికన్నా అతని కూతురినంటూ ఆస్తిలో వాటా అడుగుతుంది అని భయపడి వుంటారు. అందుకనే అలా చంపించేసారు." సాలోచనగా అన్నాడు సింహరాజు.

"ఇంతకీ మల్లిక చనిపోయిన విషయం తన తండ్రికి చెప్పావా?"

"చెప్పాలనిపించలేదు. తన తల్లి చనిపోయినప్పుడు చెపితే చూడ్డానికి కూడా రాలేదు. కూతురిమీద ఏ రోజూ ప్రేమ చూపించలేదు. ఇంకెందుకు చెప్పడం?" సింహరాజు కోపంగా అన్నాడు. "అయినా అతని భార్యా, మామగారు అతనికి చెప్పకుండా ఇంతపనికి పురమాయించివుంటారా?"

"నువ్వు చెప్పింది నిజమే." తలూపాడు యస్మణి

"తను నాకు చిన్నప్పటినుండి తెలుసు. తను నాకు అయిదేళ్లో ఎంతో వయసు ఉండగా పుట్టింది. నా అమ్మ, తన అమ్మ మంచి స్నేహితులు. తన అమ్మ నన్నెప్పుడూ నువ్వు నా కూతుర్ని పెళ్లిచేసుకుంటావా అని అడుగుతూండేది." కుర్చీలో మళ్ళీ కూచోడం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు సింహరాజు.

యస్మణి కూడా అలాగే నిలబడి వింటూవున్నాడు. ఎందుకో ఆ సమయం లో సింహరాజు ని మాట్లాడనివ్వడమే మంచిది అనిపిస్తూ వుంది.

"నాకు తనంటే ఇష్టం ఉండేది. తనని పెళ్లిచేసుకోవాలి అనుకుంటూ ఉండేవాడిని. కానీ తన మామ్మ మాత్రం తనకు మంచి సంభందం తెచ్చి పెళ్ళిచేద్దామనుకుంటూండేది. నా దగ్గరికి తరచూ వస్తూవున్నా, నా మీద ప్రేమ అభిమానం వున్నట్టుగా మల్లిక  అంత స్పష్టంగా చెప్పలేదు నాకు. అయినా నాలాంటి వాడిని పెళ్ళిచేసుకుని తను సుఖపడేదేమిటి అని నేను మౌనంగా ఉండిపోయాను.  కానీ..........." అంటూ ఆగాడు సింహరాజు.

ఏమిటో చెప్పమన్నట్టుగా నొసలు ముడేసాడు యస్మణి.

"నేను వంటరిగా విడిచి వెళ్లబోయే ఆ రోజు తన మనసులో మాట స్పష్టంగా బయటపెట్టింది. తనకి మొదటినుండి నేనంటే ప్రేమ. కేవలం నా ఆలోచనలతోటి, నా మీద ప్రేమతోటి మాత్రమే తన తండ్రి ఇంట్లో అవమానాలు భరించిందిట. నేను తిరిగి రాగానే మేమిద్దరం పెళ్లిచేసుకుందామని చెప్పింది. అది విని నేనెంతగా సంతోషించానో చెప్పలేను. మల్లిక కి నా మీద అంత ప్రేమ ఉందని, తనలా మాట్లాడుతుందని నేనెప్పుడూ అనుకోలేదు."

"సరే రాజూ. మనం ప్రస్తుతం గతం కన్నా భవిష్యత్తుమీద ఎక్కువ దృష్టిపెట్టడం మంచిది." ఇంకేం మాట్లాడాలో తెలియక అన్నాడు యస్మణి.

"నేను ఆ రోజు వెళ్లడం తనకి ఎంతమాత్రం ఇష్టం లేదు. నన్ను వెళ్ళొద్దని చెప్పింది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఆ పనులు చేసుకోవడానికి పట్నం పోక తప్పలేదు. క్రూరంగా తనని వంటరిగా విడిచిపెట్టి నేను పట్నం వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి ఆ రాక్షసుడు అలా చేసాడు." కళ్ళవెంట నీళ్లు కారిపోతూ వున్నాయి యస్మణి కి.

"రిలాక్స్ రాజూ, ఎమోషనల్ అయి ప్రయోజనం లేదు. మల్లిక చనిపోయింది. కానీ మళ్ళీ పుట్టింది. ఇంకో జన్మ ఎత్తిన ఆ మల్లిక ఈ జన్మలోనన్న సుఖపడేలా చూడు. ఆ కబుసా నుండి రక్షించు."

కళ్ళు తుడుచుకుని గట్టిగా నిట్టూర్చాడు సింహరాజు. "అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు?"

"అది మనిద్దరం ప్రశాంతంగా కూచుని ఆలోచించాల్సిన విషయం." అలా అన్నాక సింహరాజు కుడిచెయ్యి రెండుచేతులతో పట్టుకుని కూచోపెట్టి, తనూ అతనికి ఎదురుగా వున్నా కుర్చీలో కూచున్నాడు యస్మణి   

&&&

అర్ధరాత్రి అవుతూ వుంటే ఉలిక్కిపడి లేచింది మాలతి. తనకెందుకు అలా తెలివి వచ్చిందా అని ఆలోచిస్తూంటే పక్కన వింత శబ్దాలు వినిపిస్తూవున్నాయి. కంగారు పడుతూ లేచివెళ్లి లైట్ ఆన్ చేసింది.

సారిక గుటకలు మింగుతున్నట్టుగా, పుక్కిలిస్తున్నట్టుగా శబ్దాలు చేస్తూ తల అటూ ఇటూ ఊపుతూ వుంది. గాభరా పడుతూ దగ్గరికి వెళ్లి తనని తట్టిలేపింది.

"ఎందుకు మామ్, మంచి నిద్రలో వున్ననన్ను డిస్టర్బ్ చేసావ్?" చిరాకుపడుతూ అడిగింది సారిక.

"నీకు అంతా బాగానే వుందా?" నొసలు చిట్లించి తన మొహం లోకి చూస్తూ అడిగింది మాలతి.

"బాగా ఉండకపోతే ఇలా ఎలా నిద్రపోతానమ్మా? అదేం ప్రశ్న." చిరాకుపడుతూ అడిగింది సారిక

"నీకు గదిలో వంటరిగా నిద్రపట్టడం లేదని నా దగ్గరికి వచ్చావ్. అందుకని అడిగాను. సరేలే, పడుకో." లైట్ ఆఫ్ చేసి పడుకుంటూ అంది సారిక.

"నీ దగ్గరికి వచ్చాక నాకు ఏం భయం వుంటుంది మామ్? నువ్వనవసరంగా ఆలోచించకుండా పడుకో." తల్లిని గట్టిగా పట్టుకుని అంది సారిక.

"ఒకే ఐతే." తనని పట్టుకున్న కూతుర్ని, తనూ గట్టిగా పట్టుకుని అంది మాలతి. ఎప్పుడు నిద్రలోకి జారిపోయారో ఇద్దరికీ గుర్తులేదు.

&&&

"ఇది కంగారు పడాల్సిన విషయమో కాదో నాకు తెలియడం లేదు." విషయం అంతా వివరించి చెప్పాక భుజంగరావు తో అంది మాలతి. "కానీ తన లైఫ్ లో అంత అబ్నార్మాలిటీ ఉండడం వల్ల భయం వేస్తూంది."

"ఏం లేదు, అంతా బాగానే ఉందని చెప్పింది కదా."

"ఆ, తనకి ఇబ్బందేమీ లేదు. నేనలా లేపి అడిగినందుకు నామీద చిరాకు పడింది కూడా.

"సరే అయితే. ఇంక ఆ విషయం గురించి ఏమీ ఆలోచించకు." నిట్టూరుస్తూ అన్నాడు భుజంగరావు.

"కాసేపట్లో ఆ సైకియాట్రిస్ట్ మళ్ళీ వస్తూందిట. ప్రమీల చెప్పింది. ఆ సమయం లో మీరూ అక్కడవుండండి. తను తన సీనియర్ తో మాట్లాడి ఏం డిసైడ్ చేసింది చెప్తుంది అనుకుంటా."

"అలాగే ఉంటాలే." తలూపాడు భుజంగరావు.

"మరి నేను వెళ్తాను." కుర్చీలోనుండి లేచి అక్కడనుండి వెళ్ళడానికి సిద్ధపడింది మాలతి.

"ఒక్క నిమిషం ఆగు." తనూ కుర్చీలోనుండి లేచి అన్నాడు భుజంగరావు. అప్పుడే అతనికి సడన్ గా ఒక విషయం గుర్తుకువచ్చింది. "అమ్మాయి ఎటువంటి శబ్దాలు చేసింది అన్నావు?"

"గుటకలు మింగుతున్నట్టుగా........... నీళ్లు పుక్కిలిస్తున్నట్టుగా.......... ఇంకా నేను లేచి లైట్ వేసి చూసేసరికీ తల అటూ ఇటూ ఆడిస్తూ వుంది." సడన్ గా అలా అడిగినందుకు ఆశ్చర్యపడుతూ అంది మాలతి.

"నిజంగానా?"

"లేదు, నేను నీకు కల్పించి చెప్పాను, ఎంటర్టైన్ చెయ్యడానికి వేరే విషయం ఏదీ కనిపించలేదు." చిరాకు పడుతూ అంది మాలతి. "ఇంతకీ ఎందుకు నన్ను  మళ్ళీ ఆ విషయం గురించి అడిగినట్టు?"

"ఏం లేదులే. విషయం పూర్తిగా తెలుసుకుందామని అడిగాను. ఇంతకీ ఎన్నిగంటలకి ఆ సైకియాట్రిస్ట్ వస్తుందన్నావ్?"

"ఇంకొక అరగంటలో తానొస్తుంది."

"సరే ఆ సమయానికి నేనెక్కడికి వస్తాలే. నువ్వెళ్లు."

మరోసారి భర్త మొహం లోకి చిరాగ్గా చూసి అక్కడనుండి వెళ్ళిపోయింది మాలతి.     

&&&

ప్రమీల ఫోన్ చేద్దామని అనుకొంటూ వుండగా, సమీర ఫోన్ చేసి తానే రాబోతూ వున్నట్టుగా చెప్పింది. తనే సమయానికి వస్తూందో చెప్పడం వల్ల అందరూ ఆ సమయానికి హాల్లో సిద్ధం అయ్యారు.

"మీరు మీ సీనియర్ తో మాట్లాడి ఏం డిసైడ్ చేశారో వినాలని మేమందరం చాలా ఆసక్తిగా వున్నాం." భుజంగరావు అన్నాడు.

"ఎస్, నేను ఈ విషయాన్ని నా సీనియర్ తో చాలా డీప్ గా డిస్కస్ చేసాను. మీ అమ్మాయి విషయం లో కొంత అబ్నార్మాలిటీ వుంది. తను చేసిన రెండు మర్డర్ అటెంప్ట్స్ కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సినవే. ఎనీ హౌ .........." కాస్త ఆగింది సమీర. "............. ఈ మూడు నాలుగు రోజుల్లో తనేమన్నా అబ్నొర్మల్ గా బిహేవ్ చేసిందా? ఎవరిమీదన్నా మళ్ళీ మర్డర్ అటెంప్ట్స్ చేసిందా?"

"మరీ సీవియర్ అబ్నార్మాలిటీ ఏమీ లేదు. కానీ ఒక సందర్భం లో కొంచెం డిఫెరెంట్ గా బిహేవ్ చేసింది." శ్రవణ్ అన్నాడు.

"కొంచెం వివరించి చెప్పండి."

తను పనిమనిషి రూమ్ లోకి వెళ్లిన రోజున తనతో సారిక ఎలా బిహేవ్ చేసింది వివరంగా చెప్పాడు శ్రవణ్.

"ఇందంతా నువ్వా రోజు నాకు చెప్పలేదు." సారిక కోపంగా అంది.

"ఈ ఒక్క సంఘటనేనా. ఇంకేమన్నా ఉన్నాయా?"

"ఒకటి వుంది." మాలతి అని, తను వింత శబ్దాలు విని లేచి లైట్ వేసి చూస్తే సారిక ఎలా శబ్దాలు చేసింది, ఎలా తలా ఊపింది చెప్పింది.

"స్టిల్ వెరీ మచ్ పజ్లింగ్." గట్టిగా ఊపిరి పీల్చి అంది సారిక.

"డాక్టర్ మీరు సారిక ని హిప్నటైజ్ చేసి,  మైండ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఈ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యొచ్చు కదా." ప్రమీల అంది.

"నా ఉద్దేశం లో సారిక లో ఎదో స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అవుతూ వుంది. ఈ సమయం లో తనని హిప్నటైజ్` చేస్తే ఆ స్ప్లిట్ పెర్సనాలిటీ పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం వుంది. కొన్ని సందర్భాల్లో ఎటువంటి ప్రమాదం వస్తుంది అంటే ఒరిజినల్ క్యారక్టర్ ని బయటకి నెట్టి ఆ స్ప్లిట్ పెర్సొనాలిటీ పెర్మనెంట్ అయిపోతుంది."

"మై గాడ్! మరయితే ఇప్పుడేం చేద్దాం డాక్టర్?" భయంగా అడిగింది ప్రమీల.     

“"ఇప్పుడే హిప్నటైజింగ్ లాంటివి మొదలుపెట్టడం కొంచెం ప్రమాదకరం. మనం ఇంకొంచం కాలం వెయిట్ చేద్దాం. సారిక కూడా మర్డర్ అటెంప్ట్స్ ప్రతి వొక్కరిమీద చెయ్యడం లేదు. ఇక్కడ మనకి అర్ధం కానీ పాటర్న్ ఎదో వుంది." కాస్త ఆగాక మళ్ళీ అంది సమీర. "కొంచెం కాలం తనని క్లోజ్ గా అబ్సర్వ్ చెయ్యండి. తను ఎమన్నా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూవుంటే వెంటనే మామూలు చేసేకుండా కొత్త విషయాలు ఎమన్నా తెలుస్తాయా అని కూడా చూడండి. ఏ కొత్త విషయాలు తెలిసినా అవి రేపు ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యడానికి చాలా ఉపయోగం అవుతాయి."

"ఒకే డాక్టర్, అలాగే చేస్తాం" మాలతి అంది.        

  "మరయితే తనలా ఎందుకు బిహేవ్ చేసింది? నన్ను శ్రవణ్ బాబూ అని ఎందుకు పిలిచింది? నా చిన్నతనం లో ఇక్కడ పనిచేసే పనిమనిషి నన్నలా పిలిచేది." శ్రవణ్ అన్నాడు. "ఈ విషయం గురించి మనమేమీ ఆలోచించాల్సిన అవసరం లేదా?"

"అవును డాక్టర్. అలా బిహేవ్ చేసినట్టు, అలా పిలిచినట్టు కూడా నాకు తెలియదు." సారిక అంది.

"ప్రస్తుతానికి దీనికి ఎక్స్ప్లనేషన్ నేను ఏమీ ఇవ్వలేను. తన లైఫ్ లో సమాధానం దొరకని ప్రశ్నలు కొన్నివున్నాయి కదా. క్రమం గా సమాధానాలు వాటితో పాటుగా దీనికీ దొరకొచ్చు." అలా అన్నాక మాలతి మొహం లోకి చూసి అంది సమీర. "మీరు చెప్పిన స్ట్రేంజ్ బిహేవియర్ కి  కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. కొంత వెయిట్ చేసి చూద్దాం. అన్ని ప్రశ్నలకి సమాధానం దొరకొచ్చు."

"ఒకే డాక్టర్."భుజంగరావు అన్నాడు కానీ, అతని మొహం లో కొంత అసంతృప్తి వుంది.

"బ్లాక్ యాంట్ మెంటల్ కేర్, ఇంకా నేను, నా సీనియర్ ఎప్పుడూ మీ వెనకే ఉంటాం. సారిక పూచీ పూర్తిగా మాదే. కాకపోతే ఇంకొంత కాలం పాటు వెయిట్ చేసి చూడ్డం మంచిదని మాత్రమే నేను అభిప్రాయపడుతున్నాను. ఏమాత్రం విషయం క్రిటికల్ అయినా నేననుకున్న ట్రీట్మెంట్ ని వెంటనే మొదలుపెడతాను."

"మీరలా అంటే ఈ విషయం లో మేము ఆలోచించాల్సినది ఏమీ లేదు డాక్టర్." రిలాక్స్డ్ గా ఫీలవుతూ అన్నాడు భుజంగరావు.

"ఈ సారి మీరు మా ఇంట్లో లంచ్ చేసి వెళ్లాల్సినదే. కిందటి సరి మాట ఇచ్చారు." మాలతి అంది.  

"సరే అయితే అలాగే." నవ్వుతూ తలూపింది సమీర.

భోజనం పూర్తిచేశాక సారిక దగ్గరికి వెళ్లి అంది సమీర. "నీతో ఒక్క ఐదు నిముషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి."

"తప్పకుండా అలాగే. ఎప్పట్లాగే నా గదిలో మాట్లాడుకుందాం." అలా అన్నాక సమీర ని తన గదిలోకి తీసుకుని వెళ్ళింది సారిక.

"సెక్సువల్ ఇంటర్కోర్స్ సమయం లో నువ్వెదుర్కుంటున్న సమస్య ని నాతొ షేర్ చేసుకున్నావు కదా." ఆ రోజులాగే అక్కడ బెడ్ కి అపోజిట్ లో వున్నా కుర్చీలో సెటిల్ అవుతూ అడిగింది సమీర.

"ఎస్, డాక్టర్. అవును." బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతూండగా బెడ్ ఎడ్జ్ మీద కూచుంటూ అంది సారిక.

"ఈ సజెషన్ నేను ఆ రోజే ఇచ్చి ఉండాల్సింది." కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ అంది సారిక. "ఇంతకీ నీకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ వున్నారా ప్రస్తుతం?"

"వున్నారు డాక్టర్. తన పేరు ప్రదీప్." బుగ్గలు ఇంకా ఎర్రబడుతూవుంటే అంది సారిక. "నిజానికి మేమిద్దరం చాలా చిన్నప్పటినుండి స్నేహితులం.  ఆ ప్రదీప్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కొడుకు ఇంకా నా ఫ్రెండ్ ప్రమీల తమ్ముడు. వాళ్ళు చాలా కాలం నుండి మా ఇంటిపక్కనే వుంటున్నారు."

"వెరీ నైస్. అయితే ఇది చాలా ఈజీ." నవ్వింది సమీర.  "అతనితోటి నువ్వడేప్పుడన్నా ట్రై చేసి చూసావా?"

"నో డాక్టర్." నవ్వింది సారిక. "నిజానికి మేమిద్దరం పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది కూడా ఈ మధ్యనే. ఫ్రెండ్స్ మే అయినా ఇటీవల వరకూ మా మధ్య అటువంటి అభిప్రాయం లేదు."

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)