వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"అలా ఎలా చేసానో నాకు అర్ధం కావడం లేదు. అదృష్టం బావుంది వాళ్ళెవరూ చనిపోలేదు. చనిపోయుంటే ఏమైవుండేది?" ఆందోళనగా అంది సారిక.
ఆ సమయం లో సారిక, ప్రదీప్ ఆమె రూమ్ లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.
"వాళ్ళు నిన్ను నిస్సహాయురాలిని చేసి, గ్యాంగ్ రేప్ చెయ్యబోతూవుంటే ప్రతిఘటించావు. ఒకవేళ వాళ్లెవరన్నా చనిపోయివున్నానీకేమయి ఉండేది కాదు." నవ్వాడు ప్రదీప్. "రాస్కెల్స్. ఎంతకి తెగించారు? నువ్వు తగిన శాస్తి చేసావు వాళ్ళకి. ఇంక నీకే కాదు, ఏ అమ్మాయికి ఆలా చెయ్యడానికి సాహసించరు వాళ్ళు."
"ఆ గ్యాంగ్ రేప్ తప్పదనే అనుకున్నాను. దానికి మానసికంగా సిద్ధపడిపోయాను. కానీ సడన్ గా నాకు అంత శక్తి ఎలా వచ్చిందో బోధపడడం లేదు." కాస్త ఆగాక మళ్ళీ అంది సారిక. "సందేహం లేదు. ఏ పవర్ అయితే ఇప్పటివరకూ నన్ను సెక్స్ లో పార్టిసిపేట్ చెయ్యకుండా అడ్డుపడుతూ వుందో, అదే నా మీద ఈ గ్యాంగ్ రేప్ కూడా జరగకుండా అడ్డుపడింది. నాకు సెక్సువల్ ఇంటర్ కోర్సు బలవంతంగా కానీ, నా ఇష్టం తో కానీ జరగడం ఆ పవర్ కి ఇష్టం లేదు. ఇది సంతోషించాల్సిన విషయమో, బాధపడాల్సిన విషయమో తెలియయడం లేదు."
"అయితే ఆ విషయం వెనుక ఎదో పారానార్మల్ పవర్ ఉందని నువ్వు అనుకొంటున్నావా?"
"ఆలోచిస్తూంటే నీకలా అనిపించడం లేదా? ప్రతిసారి లాస్ట్ మూమెంట్ లో సెక్స్ జరగకుండా అలా తప్పించుకునివచ్చాను. నన్ను బలంగా బెడ్ కేసి కట్టేసినా, ఆ కట్లన్నీ తెంపుకుని మరీ వాళ్ళమీద ప్రతిఘటించాను. అంత శక్తి నాకెలా వచ్చింది?" నొసలు ముడేసింది సారిక.
"నిన్ను మరీ అంత బలంగా, గట్టిగా కట్టివుండరేమో అనుకుంటున్నా. నీ హిస్టీరికల్ బిహేవియర్ తో వాళ్ళు షాక్ లో ఉండగా, నువ్వక్కడ టేబుల్ మీద వున్న బాటిల్ తో స్ట్రైక్ చేసావు. ఒకళ్ళ తల పగిలి కూలగానే, తక్కినవాళ్ళిద్దరూ ఇంకా షాక్ లోకి వెళ్లిపోయారు. అందులోనూ ఎదో స్పెల్ లో ఆవేశం గా వున్న నీకు తక్కిన ఇద్దరిమీద దాడిచేసి కూలగొట్టడం కష్టం కాలేదు."
"అంటే ఇది నేను ఏదో ఆవేశం లో వుండి చేసిందే తప్ప అంతకన్నా ఇంకేమీ కాదంటావ్. అటువంటప్పుడు మనం మరొకసారి ట్రై చేసి చూద్దామా? నేనేదో ఆవేశం లో అలా చేస్తున్నానే తప్ప అంతకన్నా ఇంకేం కాదు కదా." చిరునవ్వుతో అడిగింది సారిక.
"నో, నో, వద్దు. ఆ విషయం లో నువ్వలా బిహేవ్ చేయవని ఫుల్ గ్యారంటీ వచ్చేవరకూ మనం మరొకసారి అది ట్రై చెయ్యొద్దు." గాభరాగా అన్నాడు ప్రదీప్.
గలగలా నవ్వి ప్రదీప్ మెడ చుట్టూ చేతులువేసి, అతని కుడిబుగ్గమీద ముద్దుపెట్టింది సారిక. "నువ్వంతగా భయపడే మాట అయితే నేను నిన్ను బలవంత పెట్టను."
"చిన్న, చిన్న ముద్దులకి పరవాలేదు, కౌగిలింతలకి పరవాలేదు. కానీ ఆ విషయానికి వచ్చేసరికి నువ్వెందుకలా అవుతున్నావ్?" ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్.
"అదే నాకూ అర్ధం కావడం లేదు. సెక్స్ విషయం లో మామూలు ఆడపిల్లలకి వుండేపాటి మోరల్ ఫియర్ కూడా నాకు లేదు. ఫ్రీ గా తీసుకుని ఆ ముగ్గురితోటి కొంత ఫిజికల్ ఇంటిమసీ కూడా ఎంజాయ్ చేసాను. కానీ అదే ఈ పెద్ద విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకిలా అయిపోతున్నానో బోధపడడం లేదు." పజ్లింగ్ ఎక్స్ప్రెషన్ తో అంది సారిక.
"సరే నీ జీవితం లో చాలా అబ్నార్మాలిటీస్ వున్నాయ్. అందులో ఇదొకటి. ఆ సైకియాట్రిస్ట్ తక్కిన సమస్యలతో పాటుగా దీనికీ ఒక సొల్యూషన్ చూపిస్తుందిలే." ప్రదీప్ అన్నాడు.
"ఆవిడ ఇచ్చిన ఒకేఒక సొల్యూషన్ అలా ఫెయిల్ అయింది. ఇంకే సొల్యూషన్ ఆవిడ చూపించగలదు?" చిరాగ్గా అంది సారిక.
దానికి ప్రదీప్ ఎదో చెప్పబోతూ ఆ గదిలోకి ప్రవేశించిన మాలతిని చూసి ఆగిపోయాడు. ఆమెని చూసి ఇద్దరూ లేచి నిలబడ్డారు.
"మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళు చేరిక కావడం, ఇలా అభిమానం పెంచుకోవడం నాకు ఆనందం గానే వుంది. ఎవరో తెలియని వ్యక్తికి నా కూతురిని ఇచ్చేకన్నా, మాకు తెలిసిన ఇంకా బంధువు అయివున్న నీకు ఇచ్చి పెళ్ళిచేయడం నాకు ఆనందకరమే." మాలతి అంది.
"సారిక ని పెళ్లిచేసుకోగలగడం నాకెంతో ఆనందకరమైన విషయం." ప్రదీప్ అన్నాడు.
"కానీ.........." సారిక మొహంలోకి చూస్తూ అంది మాలతి. ".........నిన్న నీ మీద జరగబోయింది భయపడాల్సిన విషయం. వాళ్ళు నీమీద ఆ అఘాయిత్యం చేసివున్నా, లేక వాళ్లెవరన్నానువ్వు చేసిన ఎటాక్ కి చచ్చి వున్నా పెద్ద సమస్య అయివుండేది. ఇప్పుడు నిన్ను బయటకి పంపడానికి కూడా భయం వేస్తోంది. మీ డాడ్ ఎలాగో కస్టపడి ఆ విషయం పైకిరాకుండా, పెద్దది కాకుండా చూసారు. నువ్వు ఇంటి దగ్గర చదువుకుని అయినా పరీక్షలు రాయొచ్చు. ఇంక కాలేజ్ కి వెళ్ళకు."
"కాలేజ్ కి కూడా వెళ్లకుండా ఇంటి దగ్గరేవుంటే నాకు పిచ్చిపట్టునట్టుగా ఉంటుంది." చికాకుపడుతూ అంది సారిక.
"పరవాలేదాంటీ. నేను కూడా కాలేజ్ లో వుంటాను కదా, చూస్తూ వుంటాను. తనని కాలేజ్ కి పంపించండి." ప్రదీప్ అన్నాడు. "అయినా ఆ వెధవలు తనని తీసుకెళ్లి అలా చేయబోయారు కాబట్టి తనలా ప్రతిఘటించింది. లేకపోతె తనలా ఎటాక్ చేసివుండేది కాదు."
"సరే అయితే. తన బాధ్యత నీదే. నువ్వే చూస్తూ వుండు." అలా అన్నాక వెనక్కి తిరిగి అంది ఆవిడ. "లంచ్ కి రండి ఇద్దరూ. భోజనం సమయం అయింది. ప్రదీప్ నువ్వు ఈ రోజు ఇక్కడే లంచ్ చేసి వెళ్ళు."
ఆ తరువాత ఆవిడ బయటకి నడిస్తే ఆవిడని అనుసరించే వెళ్లారు సారిక, ప్రదీప్.
&&&
"ఆ అమ్మాయి పేరు నాకు గుర్తులేదు. నాకు అప్పట్లో మూడేళ్లు అలా వయసు ఉండేదేమో. నాకు ఇంతగా గుర్తుండదానికి కారణం నన్ను బాగా ఆడించేది, తన రూమ్ లో నన్ను పాడుకోబెడుతూ ఉండేది."
వంశీ, శ్రవణ్ వంశీ రూమ్ లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు. శ్రవణ్ చెప్పిన పనిమనిషి గురించి వంశీ అడిగితె శ్రవణ్ చెప్తున్నాడు.
"నాకా పనమ్మాయిని అసలు చూసినట్టుగా కూడా ఏం గుర్తుకురావడం లేదు." వంశీ అన్నాడు.
"భలే వాడివే" నవ్వాడు శ్రవణ్. "ఐ యాం స్యూర్. నువ్వు పుట్టనే లేదు ఆ సమయానికి."
"అయితే బ్రో......." వంశీ అన్నాడు. ".............మరి మన సిస్ కి ఆ సర్వెంట్ మెయిడ్ గురించి ఏ రకంగానూ తెలిసే అవకాశం లేదు. మరి నిన్ను అలా ఎలా పిలిచింది?"
"అదే కదా పెద్ద పజ్లింగ్! అప్పుడు నాకు ఆ పనిమనిషే గుర్తుకువచ్చింది. ఇంకా ఇందులో పెద్ద పజ్లింగ్, సిస్ కసలు అలా బిహేవ్ చేసినట్టుగా కూడా తెలీదు."
"తన జీవితం మొత్తం ఒక అబ్నార్మల్ ఇష్యూ లా తయారైంది. ఆ సైకియాట్రిస్ట్ కూడా మనకి పెద్దగా ఉపయోగపడడం లేదు." నిరాశగా అన్నాడు వంశీ.
"ఆ సైకియాట్రిస్ట్ చాలా కాపబుల్ అని ప్రమీల చెప్పింది. నేనూ వాకబు చేశా. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ ఇంకా అందులో సైకియాట్రిస్ట్స్ బాగా రెప్యుటేడ్." అలా అన్నాక మళ్ళీ వంశీ ఎదో అనే లోగానే శ్రవణ్ అన్నాడు. "మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన సిస్టర్ లో ఈ అబ్నార్మాలిటీస్ నిన్ననో, మొన్ననో స్టార్ట్ కాలేదు. తన చిన్ననాటినుండీ వున్నాయి. కాకపోతే రీసెంట్ గా సివియర్ అయ్యాయి. ఇది క్యూర్ చెయ్యడం అన్నది ఆలోచించే చెయ్యాలి."
"ఒకే అయితే." తలూపాడు వంశీ. సడన్ గా చిరునవ్వు వచ్చిచేరింది వంశీ పెదవులమీదకి. "రీసెంట్ గా తను ప్రదీప్ తో చాలా క్లోజ్ గా ఉంటూంది, నువ్వు గమనించావా?"
"ఆ గమనించాను." తనూ నవ్వాడు శ్రవణ్. "ఇందులో మనకి ఆబ్జెక్ట్ చెయ్యడానికి ఏమీ లేదుకదా. ప్రదీప్ మనకి చిన్నతనం నుండీ తెలుసును. మంచివాడు. ప్రస్తుత పరిస్థితులలో మన సిస్టర్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి తనకి భర్త కావడం మనకీ అవసరం."
"యు ఆర్ రైట్." తలూపాడు వంశీ. "ప్రదీప్ అయితే మనతోపాటు ఈ ఇంట్లోనే ఉంటాడు కూడా. మన సిస్టర్ మనల్ని వదిలి వెళ్ళిపోతుందని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు."
కొంత నిశబ్దం వచ్చింది ఇద్దరిమధ్య ఇద్దరికీ ఏం మాట్లాడుకోవాలో తెలియనట్టుగా. ఆ నిశబ్దాన్ని బ్రేక్ చేస్తూ అన్నాడు శ్రవణ్.
"కొన్ని డిస్టర్బ్ చేసే విషయాలు నీకు తెలియడం అవసరమా కాదా అని నేను ఆలోచిస్తున్నాను." శ్రవణ్ మొహం అనీజీ గా మారింది.
"నీకు తెలిసిన ఏ విషయమైనా నాకూ తెలియడం అవసరమే కదా, అలా ఆలోచిస్తావేమిటి?" వంశీ కోపంగా అన్నాడు.
"మన సిస్టర్ అనుకున్నంత ఇన్నోసెంట్ కాదు. కొన్ని ఇన్సిడెంట్స్ విని నేనే షాక్ అయ్యాను." అంటూ సారిక కాలేజ్ లో సెక్సువల్ ఇన్సిడెంట్స్ గురించి, అవి లాస్ట్ మూమెంట్ లో ఫెయిల్ అవ్వడం గురించి వివరంగా చెప్పాడు. "ఇవి తను ప్రమీల తో షేర్ చేసుకుంటే, తను నాతో షేర్ చేసుకుంది. అసలు అవి ఫెయిల్ అయి ఉండక పోతే ప్రమీల తోనూ షేర్ చేసుకుని ఉండేది కాదు. అదొక అబ్నార్మాలిటీ గా భావించి షేర్ చేసుకుంది అంతే."
"గాడ్! నాకేం మాట్లాడాలో బోధపడడం లేదు." షాక్ ఫీలింగ్ స్పష్టంగా వుంది వంశీ మొహం లో. "లవ్ అఫైర్స్, సెక్సువల్ ఇంటర్ కోర్సెస్ ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ లో కొత్త కాదు. కానీ మన సిస్టర్ గురించి ఇలా వింటూంటే మాత్రం నాకు షాకింగ్ గానే వుంది."
"అంతే కాదు. మన సిస్టర్ సెక్స్ ట్రై చేసి లాస్ట్ మూమెంట్ లో తన అబ్నార్మాలిటీ వల్ల, అది పూర్తికాకుండా మన సిస్టర్ వదిలేసి వచ్చినవాళ్లే మొన్న గ్యాంగ్ రేప్ కి ట్రై చేసిన ముగ్గురూ. అప్పుడు రగిల్చిన కోరిక తీర్చుకోవడానికో, లేకపోతె అవమానం తోటో అందుకు ట్రై చేసివుంటారు. ప్రమీల తో సారిక షేర్ చేసుకుంటే, ప్రమీల నాకు చెప్పింది."
"వెరీ మచ్ షాకింగ్!" వంశీ మొహం లో షాక్ ఫీలింగ్ అలాగే వుంది. "ఈ విషయాలన్నీ ప్రదీప్ కి తెలుసా?"
"తెలియకుండా ఎలా ఉంటాయి? ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నారు కదా." కుర్చీలో ఇంకొంచెం సర్దుకుంటూ అన్నాడు శ్రవణ్. "ఇలా ఆలోచించినా ప్రదీపే తన భర్త కావడం మంచిది. తన గురించి అన్నివిషయాలు తెలిసినవాడే పెళ్ళిచేసుకుంటే రేపు ఏ సమస్యా ఉండదు కదా."
"అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కోట్లకొద్దీ ఆస్తి కలిసివస్తుందంటే మన చెల్లెల్ని ఎవరన్నా ఆనందంగానే పెళ్లిచేసుకుంటారు. నువ్వేమనుకున్నా వదిన ఆలోచించే తన తమ్ముడిని ఈ ఇంటికి అల్లుడిగా చేద్దామనుకుంటూంది."
"నేనేం కాదనదలుచుకోలేదు." నవ్వాడు శ్రవణ్. "స్టిల్ ప్రదీపే ఈ ఇంటికి అల్లుడు కావడం మంచిది అని నా అభిప్రాయం."
"నా అభిప్రాయం కూడా అదే. ఏదో అన్నాను కానీ వదిన, తన తమ్ముడు ఇద్దరూ చాలా మంచివాళ్ళు."
"ఓకే, ఓకే." కుర్చీలో ముందుకువంగి అన్నాడు శ్రవణ్. "ఇవేమీ నువ్వు సారిక ని అడగకు. తను హర్ట్ అవుతుంది."
"నువ్వా విషయం నాకు చెప్పాలా అన్నయ్యా. తనేం చేసినా, ఎలా బిహేవ్ చేసినా మన ముద్దుల చెల్లెలు. తనపై మన ప్రేమ విషయం లో ఎప్పుడు ఎటువంటి తేడా ఉండదు. మనం కోరుకునేది కేవలం తన సంతోషం మాత్రమే." కుర్చీలోనుండి లేచి అన్నాడు వంశీ.
"సరే అయితే. నేను నీ రూమ్ లోనే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నువ్వెక్కడికన్నా వెళ్ళిరా." తనలా ఆ బెడ్ మీద పడుకుంటూ అన్నాడు శ్రవణ్.
తరువాత వంశీ ఆ రూమ్ లోనుండి వెళ్ళిపోతే, శ్రవణ్ నిద్రలోకి జారిపోయాడు.
&&&
అది ఆదివారం మధ్యాహ్న సమయం. తన రూమ్ లో వంటరి గా వుంది సారిక. మనసు పరిపరివిధాలుగా పోతూ చాలా వేదనగా వుంది. తన జీవితం లో వున్న అబ్నార్మాలిటీ వల్ల తను విచారపడుతూనే వున్నా, ఇటీవల కాలంలో బాధపడుతూన్నంతగా ఎప్పుడూ పడలేదు. ఇదంతా సరిగ్గా తన పుట్టినరోజు ముందునుండి ప్రారంభమైంది. ఆ రోజే తను తల్లిని చంపబోయిందట.
అసలు తను తన తల్లిని చంపబోవడమేమిటి? అలా చేస్తూన్నప్పుడు తనకా విషయం అసలు తెలియకపోవడమేమిటి? ప్రతి తల్లీ తన పిల్లల్ని ప్రేమగానే చూసుకుంటుందని తనకి తెలుసు. కానీ తన తల్లి తన మీద చూపించే ప్రేమని చూస్తే, ఏ తల్లి అయినా తన పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తుందా అనిపించేది. అలాంటి తన తల్లిని తను చంపబోయిందా?
ఇంక ఓబులేసు విషయం. వాడు ఎప్పటినుండో తమ దగ్గర నమ్మినబంటు లా వున్నాడు. 'అమ్మాయిగారూ' అంటూ తననెంతో అభిమానం గా చూస్తాడు. తనడిగినవెన్నో వాడు చేసాడు. అలాంటివాడిని కూడా తనెందుకు చంపబోయింది? అసలు తనలా చంపబోతూందన్న విషయం కూడా తనకి ఎందుకు తెలియడం లేదు? ఆ పనికిమాలిన ఒంటె తల వున్నమనిషి బొమ్మ తనెందుకు గీస్తూంది? అదీ తనకి తెలియకుండానే ఎదో ఆవహించినట్టుగానే చేస్తూంది. గీసిన తర్వాత ఆ బొమ్మని చూస్తే తనకి డోకు వచ్చినట్టుగా అనిపిస్తుంది.
అన్నిటికీ మించి తనెందుకు అసలు సెక్స్ లో పార్టిసిపేట్ చెయ్యలేకపోతూవుంది? తన ఫ్రెండ్స్ తమ బాయ్ ఫ్రెండ్స్ తో అనుభవాల గురించి మాట్లాడుకుంటూవుంటే తనలో ఆ అర్జ్ ఇంకా పెరిగి ముగ్గురితో ట్రై చేసింది. వాళ్లలో కాంక్షని పూర్తిగా పెంచి, వాళ్ళచేత బట్టలు పూర్తిగా విప్పించి, ఇక తనవంతు వచ్చేసరికి ఎదో ఆవహించినట్టుగా అక్కడనుండి వచ్చేసింది. ఆ మూమెంట్ లో అది మిస్సయినందుకు వాళ్ళెంతగా ఫ్రస్ట్రేట్ అయివుంటారు? వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. అలాగ వాళ్ళని వదిలివచ్చేడం వల్లే వాళ్ళు తన మీద గ్యాంగ్ రేప్ కి ట్రై చేసారు.
ఆఖరికి ఎంతో ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా తనని ఎంతగానో ప్రేమిస్తూన్న ప్రదీప్ తో కూడా అది పూర్తి చెయ్యలేకపోయింది. ఆఖరి నిమిషం లో దానిమీద తనకెందుకు అంత వ్యతిరేకమైన ఫీలింగ్ వస్తూంది? అసలు తనెప్పటికయినా అందరి అమ్మాయిల్లా సెక్స్ చేయగలదా, లేదా అన్న అనుమానం వస్తూంది.
అలా అన్నిసార్లు ఆ విషయం లో ఫెయిల్ అవ్వడం వల్లో, లేక తనెప్పటికీ సెక్స్ చేయలేదన్న అభిప్రాయం వల్లో, లేక మరింకే కారణం వల్లో తెలియదు కానీ, తనలో ఈ అర్జ్ మాత్రం భయంకరంగా వుంది. ఎంత భయంకరంగా ఉందీ అంటే, తననారోజు ఆ ముగ్గురూ గ్యాంగ్ రేప్ చేసివున్నాబావుండుననిపిస్తూంది. ఎవరితోనూ తను సెక్సువల్ ఇంటర్ కోర్సు చెయ్యలేకపోతూవుంది. ఇంటర్ కోర్సు లేని ఫోర్ ప్లే వల్ల తనలో ఆ అర్జ్ ఇంకా పెరిగిపోతూవుంది. అసలు ఈ తాపం ఎలా తీర్చుకోవాలో బాధపడడం లేదు. ఇంక తట్టుకోలేనట్టుగా బెడ్ మీద బోర్లా పడుకుని తలగడాకి తలని ప్రెస్ చేసింది.
ఆ బాధనుండి మైండ్ ని డైవర్ట్ చెయ్యడానికి అన్నట్టుగా సారిక కి మరొక విషయం గుర్తుకు వచ్చింది. తనెందుకు ఆ పనిమనిషి రూమ్ లోకి తరచూ వెళుతూంది? తనకి అనిపిస్తూంది శ్రవణ్ వెళ్లిన రోజు మాత్రమే తను ఆ రూమ్ లోకి వెళ్ళలేదు. అంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళింది. కానీ అలా వెళ్తూ వుండడం, ఆ రూమ్ లో టైం స్పెండ్ చేస్తూ వుండడం తనకి తెలియడం లేదు.
ఒక ఆలోచన వచ్చి లేచి కూచుంది సారిక. ఈ రోజు తను కాంషస్ గా ఉండగానే ఆ రూమ్ లోకి వెళ్లిచూడాలి. అసలు తను ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్తూంది, అక్కడ సమయం ఎందుకు స్పెండ్ చేస్తూంది అన్న విషయం తెలుసుకుంటే తన జీవితం లో వున్నఅబ్నార్మాలిటీ కి కారణం బోధపడొచ్చు.
ఆ ఆలోచన వచ్చాక బెడ్ మీద నుండి కిందకిదిగి తిన్నగా గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న ఆ రూమ్ వైపు నడిచింది. ఎప్పటిలాగే తలుపులు పైనగడియపెట్టివుంటే, అది ఓపెన్ చేసి ఆ రూమ్ లోకి ప్రవేశించింది. మధ్యాహ్న సమయమే అయినా రూమంతా కొంచెం చీకటిగానే వుంది. కాకపోతే అందులో వున్న విషయాలు మాత్రం బాగానే కనిపిస్తూవున్నాయి.
ఆ రూమ్ లోకి ప్రవేశించగానే అదొకలా అనిపించింది సారిక కి. తనకి తెలియకుండానే అక్కడవున్న కప్ బోర్డు దగ్గరికి నడిచి, అది ఓపెన్ చేయబోతూ వుంది. ఆ సమయం లో తనలో వస్తూన్న మార్పు సారిక కి తెలియ లేదు.
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)