వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"ప్లీజ్, నువ్వు నీ మామ్ ఫాలో అయినా వే ని ఫాలో అవ్వకు. నీ సబ్స్టిట్యూట్ గా నీ హబ్బీ ని అప్పగించే ప్రయత్నం చెయ్యకు." వేడుకోలుగా అన్నాడు భుజంగరావు.
గలగలా నవ్వింది సారిక. "నో డాడ్. నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. నేనలా చెయ్యను."
"మరి దేనికి అంత ఆలోచన?" నొసలు ముడేసాడు భుజంగరావు.
"డాడ్............" గట్టిగా నిట్టూర్చింది సారిక. ".............ప్రస్తుతం నన్ను చూసుకుంటూ ఉంటే నాకే భయంగా వుంది. ఎం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో నాకే బోధపడడం లేదు. అటువంటిది నేను మన బిజినెస్ కి అసెట్ కాగలనా?"
"నో డియర్. నువ్వలా ఆలోచించకు." కూతుర్ని దగ్గరికి తీసుకుని తన ఎడమ బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు భుజంగరావు. "నీకున్నది కేవలం ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్. అది తప్పకుండా క్యూర్ అయిపోతుంది."
"నాకలా అనిపించడం లేదు డాడ్." తండ్రి కౌగిలినుండి విడిపించుకుని ఆయన మొహంలోకి చూస్తూ అంది సారిక. "నన్నెంతగానో ప్రేమించే మామ్ ని చంపబోయాను. మనకంత ఫెయిత్ ఫుల్ సర్వెంట్ ఆ ఓబులేసు ని చంపబోయాను. ఇవన్నీ నేను కేవలం ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్ తో చేసినవా?"
"నువ్వు మమ్మల్నందరినీ చంపేసినా ఏమనుకొం. నీకు ఎప్పటికీ ఏమీ కానివ్వం. నువ్వు ధైర్యంగా వుండు. నీ జీవితం లో ప్రతీదీ సరిచేసే పూచీ నాది. యు జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్." సారిక భుజాలు పట్టుకుని తన మొహంలోకి చూస్తూ అన్నాడు భుజంగరావు.
"తన మీద నీకెంత ప్రేమ నాన్నా. ఆ ప్రేమలో నా మీద కొంచెం కూడా చూపించలేకపోయావే."
ఉలిక్కిపడ్డాడు భుజంగరావు అదివినగానే. తన జీవితంలోనే సారిక తనని నాన్నా అని పిలవడం అదే మొదటిసారి.
"అదేమిటమ్మా? నేను నీమీద ప్రేమ చూపించకపోవడమేమిటమ్మా?" ఆశ్చర్యంగా అడిగాడు భుజంగరావు.
"నన్నెందుకు నాన్నా అలా వదిలేసావ్? నన్నెందుకు పట్టించుకోలేదు?"
"నువ్వంటున్నది నాకు బోధపడడం సారికా, నేను నిన్నెప్పుడు వదిలేసాను? నువ్వే కదా నాకు అతిముఖ్యమైన విషయం."
"తనే నీకు ముఖ్యమైన విషయం. నేను కాదు." కోపంగా అరుస్తూ రెండు చేతులతో భుజంగరావు మెడ పట్టుకుంది సారిక. "నేను చనిపోయినా నీకు పర్లేదు. అందుకనే నేను నిన్ను చంపేస్తాను." భుజంగరావు మెడ ని పిసకడం ప్రారంభించింది.
"సారికా.........ప్లీజ్ .......... ప్లీజ్ ............ నన్ను వదిలిపెట్టు." సారిక పట్టునుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు భుజంగరావు.
"నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను చంపే తీరతాను." ఇంకా గట్టిగా భుజంగరావు పీకనొక్కుతూ అంది సారిక.
ఇంక మాట్లడడం కూడా మాట్లాడలేకపోతూవున్నాడు భుజంగరావు. సారిక పట్టునుండి విడిపించుకోవడానికి చేసే ప్రయత్నమేదీ ఫలించడంలేదు. తన రెండుచేతులతోటి తన రెండు చేతులూ పట్టుకుని ఎంత గట్టిగా విడిపించుకోవడానికి ప్రయత్నించినా ఇంచి కూడా కడపలేకపోతున్నాడు. తనకంత బలం ఎక్కడనుండి ఎలా వచ్చిందో బోధపడడం లేదు. అంతబాధలోనూ తన భార్య, ఓబులేసు చెప్పిన విషయాలు గుర్తుకువచ్చాయి. వాళ్ళని కూడా ఇదే బలంతో ఇలాగే చంపబోయింది. వాళ్ళు అదృష్టం కొద్దీ తప్పించుకున్నారు. తనకది కుదిరేలా లేదు. ఇంకాస్సేపట్లో చనిపోవడం తధ్యమన్న నిర్ణయానికి వచ్చేసాడు భుజంగరావు.
"నువ్వేం చేస్తున్నావ్ సారికా, నీ డాడ్ ని కానీ చంపేస్తావా ఏమిటి?" సారిక రూమ్ లోకి సారికతో మాట్లాడదామని వచ్చిన మాలతి అక్కడ జరుగుతూంది చూసి నిర్ఘాంతపోయింది. కొన్ని సెకన్లలోనే షాక్ నుండి బయటపడి, తనూ సారిక దగ్గరికి వెళ్లి, తన చేతులు పట్టుకుని విడిపించే ప్రయత్నం ప్రారంభించింది.
"మామ్, ఏం జరిగింది? ఏమిటవుతూంది?" మాలతి తన చేతుల్ని పట్టుకోగానే ఆ స్పెల్ నుండి బయటకి వచ్చి, మాలతి మొహంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది సారిక.
"మై గాడ్!" మెడ ని రెండుచేతులతో పట్టుకుని బెడ్ మీద పక్కకి ఒరిగిపోయాడు భుజంగరావు.
"నువ్వు నీ డాడ్ మీద కూడా అటాక్ చేశావమ్మా." సారిక ని రెండు చేతులతో పట్టుకుని తన పక్కన కూచుంటూ అంది మాలతి.
"ఈ రోజు కి ప్రాణాలతో బయటపడతాననుకోలేదు." చాలా నీరసంగా వుంది భుజంగరావు గొంతు. బెడ్ మీద ఇంకా అలాగే పడుకుని, మెడ చుట్టూ చేతులుపెట్టుకుని వున్నాడు భుజంగరావు.
"అంటే నేను డాడ్ ని కూడా చంపబోయానా?" సారిక మొహం షాక్ తో నిండిపోయింది.
"నువ్వేది చేసినా నీకు తెలీకుండా చేశావమ్మా. తెలిసి ఏదీ చెయ్యలేదు." తన కూతుర్ని ఇంకా దగ్గరికి తీసుకుంటూ అంది మాలతి.
బెడ్ మీద నుండి కిందకి దిగింది సారిక. "నేనిప్పటికి ముగ్గురిని చంపబోయాను. అందులో ఇద్దరు నేనంటే ప్రాణం పెట్టె నా మామ్ అండ్ డాడ్. నా పిచ్చి అందరికీ ప్రాణాంతకంగా పరిణమిస్తూంది. నన్ను వెంటనే మెంటల్ కేర్ లో జాయిన్ చెయ్యండమ్మా." గట్టిగా అరుస్తున్నట్టుగా అంది సారిక.
"సారికా, నువ్వలా మాట్లాడకమ్మా." తనూ బెడ్ మీద నుండి దిగి, సారిక దగ్గరికివెళ్ళి తనని మరోసారి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసింది మాలతి.
"నో మామ్ .......నో........" మాలతి ని దూరంగా నెట్టేసింది సారిక. "నేను ఎవళ్ళనో ఒకళ్ళని చంపి జైలు కి వెళ్లే ముందే నా పిచ్చిని కుదర్చండి. నాకు ట్రీట్మెంట్ జరిపించండి. ప్లీజ్ ఇలాంటి జీవితం నేను జీవించలేను." రెండుచేతులతోనూ మొహం కప్పుకుని భోరుమంది సారిక.
ఇంక ఏం చెప్పాలో తోచక మ్రాన్పడిపోయింది మాలతి. అప్పటికి సెటిల్ అయి బెడ్ దిగి సారిక దగ్గరికి వచ్చాడు భుజంగరావు.
"ఆల్రైట్ డియర్........ ఆల్రైట్ .......... ఫస్ట్ యు రిలాక్స్ యువర్ సెల్ఫ్. రిలాక్స్." కూతుర్ని రెండుచేతులతో దగ్గరికి తీసుకుంటూ అన్నాడు భుజంగరావు.
"సారీ డాడ్. ఐ యాం సారీ. అబ్సల్యూట్లీ సారీ." భుజంగరావు కుడిభుజం మీద తలా పెట్టుకుని ఏడుస్తూ అంది సారిక.
"ఇట్స్ ఒకే డియర్. నువ్వేమన్నా కావాలని చేసావా? నువ్వేం చేస్తున్నావో తెలీని పరిస్థితుల్లో చేసావ్. రిలాక్స్డ్ గా వుండు. అన్నీ సరిఅవుతాయి." కూతుర్ని ఇంకా దగ్గరికి తీసుకుంటూ అన్నాడు భుజంగరావు.
&&&
“ఒకే, సారిక ని ఇక్కడే వుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఈ విషయం పూర్తిగా మాకు విడిచిపెట్టేసెయ్యండి. మీరు అనవసరంగా కంగారుపడొద్దు.” నిరంజన్ అన్నాడు.
ఆ మర్నాడు భుజంగరావ్ ఫోన్ చేయగానే వెంటనే సారిక ని తీసుకుని మెంటల్ కేర్ కి రమ్మని చెప్పింది సమీర. మోహనరావ్, శ్రవణ్ లు అత్యవసరమైన పనిమీద బయటకి వెళ్లడంవల్ల వాళ్ళు తప్ప, తక్కిన ఫామిలీ మెంబర్స్ ఆందరూ సారిక తో పాటుగా మెంటల్ కేర్ కి వచ్చారు.
“సారిక ని ఇక్కడే వుంచాలా? తను మా ఇంటిదగ్గర వుండగా ట్రీట్మెంట్ కుదరదా?” భుజంగరావ్ అడిగాడు.
నవ్వింది సమీర. “తనని ప్రస్తుత పరిస్తితులలో డీప్ గా అబ్జర్వ్ చేయడం కూడా అవసరం. అది ఇక్కడవుంటేనే బాగా అవుతుంది. అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సారిక లాంటివారికోసం ఇక్కడ చాలా కంఫర్టబుల్ ఎయిర్ కండిషన్డ్ రూంస్ అన్ని ఫేసీలిటీస్ తో వుంటాయి.”
“డాడ్, నేను ఇక్కడ వుంటాను. నాకు ఇబ్బందేమీ లేదు. మొదట నా ప్రాబ్లం సాల్వ్ కావాలి.” సారిక అంది.
“దట్స్ ఇండీడ్ గుడ్.” చిరునవ్వుతో అంది సమీర. “తను ఇంత నిశ్చయంగా వున్నప్పుడు మనం వేరే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా తనని ఇక్కడ వుంచేవచ్చు.”
“డాక్టర్ తన ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఎంతకాలం పట్టవచ్చు?” వంశీ అడిగాడు.
“ఐ వాంట్ టు బి ఫ్రాంక్.” దీర్ఘంగా నిట్టూర్చింది సారిక. “ఇంకా తన ప్రాబ్లం ఏంటన్నది ఐడెంటిఫై కాలేదు. అదేమిటో తెలిస్తే కానీ అది క్యూర్ కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేను. బట్...........” తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగింది సమీర. “............ తన ప్రాబ్లం ని పూర్తిగా సాల్వ్ చేసే పూచీ నాది. మీరేం కంగారుపడాల్సిన అవసరం లేదు.”
“తనతో పాటుగా మేమెవరమన్నా ఇక్కడవుండొచ్చా?” మాలతి అడిగింది.
“మీరెంతమంది కావాలన్నా ఇక్కడ వుండొచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాం.” నిరంజన్ అన్నాడు. “అది మంచిది కూడా. తనకి బాగా ధైర్యంగా వుంటుంది.”
“ఒకే అయితే. నేను ప్రమీల తన కూడా వుంటాం.” మాలతి డిక్లేర్ చేసింది.
“అందుకు నాకు అభ్యంతరం ఏమీ లేదు.” ప్రమీల వెంటనే ఆక్సెప్ట్ చేసింది.
“డాక్టర్ సమీరా, ఈ కేసు మీరు, నేను కలిపి హాండిల్ చేద్దాం. ముందు మీరు అసలు ప్రోబ్లం ఏమిటో ఐడెంటిఫై చెయ్యండి.” నిరంజన్ అన్నాడు.
“తప్పకుండా సర్.” సమీర అంది.
ఆ తరువాత మరి కాసేపు డిస్కషన్స్ అయ్యాక సారిక, మాలతి, ప్రమీల మాత్రం అక్కడవుండి తక్కినవాళ్ళు వెనక్కి వచ్చేశారు.
&&&
“ఆ అమ్మాయిని మెంటల్ కేర్ లో జాయిన్ చేశారు.” యస్మణి తో అన్నాడు సింహరాజు.
“చాలా కీలకమైన సమయం వచ్చేసింది. వాళ్ళకి మన అవసరం రావడానికి ఇంక ఎంతో సమయం పట్టదు. మనం సిద్ధంగా వుండాలి.” యస్మణి అన్నాడు.
“మనం ఎప్పుడూ సిద్ధంగానే వున్నాం కదా సర్.” సింహరాజు అన్నాడు. “కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించబోతున్నాం అన్నదే అర్ధం కావడం లేదు.”
“అది ఆ కబుసా కె విడిచిపెట్టేడం తప్ప ప్రస్తుతానికి మనం చేయగలిగినది ఏమీ లేదు.” చేతిలో వున్న ఫోన్ వైపు చూస్తూ అన్నాడు యస్మణి.
“ఇంతకీ ప్రస్తుతం మీరు చూస్తూన్నది ఏమిటి?”
“ఒక రెండు రోజుల క్రితం ఆ పిల్ల కబుసా బొమ్మ మళ్ళీ వేసిందట. అది ఆ నిరంజన్ నాకు పంపించాడు.” నవ్వాడు యస్మణి. “అప్పుడప్పుడు ఆ అమ్మాయి ఆ బొమ్మ ఎందుకు వేస్తుందో అర్ధం కాక సతమతమవుతున్నారు వాళ్ళు.”
సింహరాజు కూడా నవ్వాడు. “ఆ అమ్మాయి ఎందుకు ఆ బొమ్మ వేస్తుందో నాకూ అర్ధం కాని విషయమే.”
“బహుశా తనకీ ఆ అమ్మాయికీ వున్న కనెక్షన్ తనకి తెలియడానికి కబుసా తనకి అటువంటి కోరిక కలిగిస్తూ వుండొచ్చు.”
“మల్లిక కి కబుసా మీద ఆసక్తి చిన్నతనం నుండీ వుండేది. అతని గురించి నన్ను అడిగి తెలుసుకుంటూ వుండేది. మానవాతీత శక్తులు అంటే అందరిలాగే తనకీ చాలా ఇస్టం. అందుకనే కబుసా కోరికలు, స్వభావం గురించి ఆలోచించకుండా అతని అనుగ్రహం లభిస్తే వచ్చే శక్తుల గురించే ఆలోచించేది. కానీ……..” కాస్త ఆగాడు సింహరాజు. “……….. తన తండ్రి ఇంటినుండి అలా వ్యవహరించబడి వచ్చాక వాళ్ళందరిమీద పగ తీర్చుకోవడానికి కూడా ఆ శక్తులు కావాలనుకుంది. ఇంక కబుసా తనని ఎన్నుకున్నాడని కూడా అర్ధం అయ్యాక, తనని ఆపడం నావల్ల కాలేదు. ఎన్ని చెప్పినా వినకుండా కబుసా ఆరాధన ప్రారంభించింది.”
ఏమీ మాట్లాడకుండా సింహరాజు చెప్పేది వింటున్నాడు యస్మణి.
“కబుసా ప్రభావం లో వుంటే అందరిలోనూ ఆ శృంగార వాంఛ పూర్తిగా రేకెత్తించబడుతూనే వుంటుంది, ఆ నియమం పాటించాల్సిన అతను ఎన్నుకున్న కన్నెపిల్లల్లో కూడా. ఆ రోజు ఆ వాంఛ ని తను తట్టుకోలేకపోయింది. అన్నీ తెలిసిన నేను కూడా…………..” ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు సింహరాజు.
“మల్లిక లాంటి కన్నెపిల్ల అది కావాలని అంతగా మీద పడితే, ఎంత పరిణామాలు బోధపడివున్న కాదనడం అసాధ్యం. ఆ విషయం లో నిన్ను కూడా నేను తప్పు పట్టలేను.” యస్మణి అన్నాడు.
“కానీ ఆ తరువాత అందుకు చాలా విచారించింది తను. అందువల్లే కబుసా కి కోపం వచ్చి తన మామ్మ ని చంపేసేడు అని కూడా అనుకుంది.”
దీర్ఘం గా నిట్టూర్చి మౌనంగా వుండిపోయాడు యస్మణి
“నిజం చెప్పాలంటే కబుసా ని ఆరాధిస్తూ మల్లిక చేసిన పొరపాటు తెలిసాక సామమ్మ చాలా ఆందోళన పడిపోయింది. ఆ తరువాత మాత్రమే ఆవిడకి అంత పెద్ద జ్వరం వచ్చింది. నిజంగా మేమారోజు ఆ పొరపాటు చేసివుండకపోతే తను కూడా ఈ రోజు బతికివుండేదేమో.”
“నువ్వింక అలా ఆలోచించకు. గతం లో చేసిన పొరపాట్ల గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏమిటి? మనం ఇప్పుడు చేయాల్సినదల్లా భవిష్యత్తులో చేయాల్సినదేమిటి అన్నదాని గురించి ఆలోచించడం.” యస్మణి అన్నాడు.
“మీరు చెప్పింది నిజమే.” సింహరాజు తలూపాడు.
ఆ తరువాత ఆ ఇద్దరూ ఆ విషయం గురించి చర్చించుకోవడం లో పడ్డారు.
&&&
“ఆ భుజంగరావ్ గారి అమ్మాయిని మా మెంటల్ కేర్ లో అడ్మిట్ చేశారు.”
బెడ్ మీద ఇద్దరూ పక్క పక్కన ఫుల్ న్యూడ్ గా వుండగా అరవింద్ తో అంది సారిక. అంతకి కొద్ది నిమిషాల క్రితమే, తన కూతురి డిస్టర్బెన్స్ లేకుండా వేడి దింపుకున్నాడు అరవింద్. కొద్ది నిమిషాల పాటు అతన్ని తనమీద అలాగే వుండానిచ్చాక పక్కకి ఒదగనిచ్చింది సమీర.
“అయితే మీ మెంటల్ కేర్ కి మంచి లాభం వుంటుందనడం లో సందేహం ఏమీ అవసరం లేదు. ఆ భుజంగరావ్ చాలా ధనవంతుడు.”
“ఇలాంటి రిచ్ పేషెంట్స్ వస్తేనే కదా మాకూ లభ్యం వుండేది.” సమీర నవ్వింది. “యిందువల్ల మాకు ఫైనాన్షియల్ గా లాభం వుండడమే కాదు, మా రెప్యుటేషన్ కూడా చాలా పెరుగుతుంది.”
"ఇంతకీ ప్రాబ్లెమ్ ఏమిటో ఐడెంటిఫై అయిందా?"
"అదే ఇప్పుడు జరగాల్సివుంది, ఈ రోజే తనని అడ్మిట్ చేశారు." ఆవలిస్తూ అంది సమీర. "థాంక్ గాడ్! మన డెవిల్ ఇప్పటివరకూ నన్ను డిస్టర్బ్ చెయ్యలేదు. నన్ను ప్రశాంతం గా ఇప్పటిలా పడుకోనిస్తే చాలు."
"నా సిస్టర్ ఫ్యామిలీ తో పాటుగా నీ సిస్టర్ ఫ్యామిలీ కూడా వచ్చాక నీ మీద కాస్త వత్తిడి ఎక్కువ అయిందా?"
"అటువంటిది ఏమీ లేదు. ఇంట్లో సర్వెంట్ మెయిడ్ వుందికదా అన్నీ చేసిపెట్టడానికి." నవ్వింది సమీర. "అందులోనూ సుస్మిత ఇంకా నా సిస్టర్ ఇద్దరికీ బాగా హెల్పింగ్ నేచర్ వుంది. వాళ్ళ కంపెనీ ఎప్పుడూ చాలా ఎంజొయబుల్." అలా అన్నాక సమీర మొహం ఎందుకో కొంచెం సీరియస్ గా మారింది.
"నువ్వింకా దేనికో వర్రీ అవుతున్నట్టున్నావ్." పరిశీలనగా చూస్తూ అన్నాడు అరవింద్.
"ఎందుకో ప్రస్తుతం ఈ రెండు ఫ్యామిలీలు మనతో పాటుగా ఉండడం నాకు ఇష్టం లేదు."
"ఎందుకని?" భృకుటి ముడేసాడు అరవింద్.
"ఆ రోజు యస్మణి చెప్పిన మాటలే గుర్తుకువస్తున్నాయి. మేము ఎదో పారానార్మల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్తున్నామని, మటపాటుగా ఎవరూ ఉండకపోవడం.........."
"స్థాపిట్ సమీ." సమీర ని ఇంటెరెప్ట్ చేస్తూ అన్నాడు అరవింద్. "అతను ఎంత ఇంటెలిజెంట్ అయినా కావచ్చు. కానీ ఇలాంటి ఫ్యూలిష్ వాగుడిని మాత్రం పట్టించుకోకు. నేను చెప్పాగా చాలా గొప్పవాళ్ళు కూడా కొన్ని విషయాలు చాలా ఫ్యూలిష్ ఆలోచిస్తారని. ఎన్నిసార్లు నేను నీకు చెప్పివుంటాను ఆ యస్మణి మాటలు పట్టించుకోవద్దని."
"యు ఆర్ రైట్" అరవింద్ పెదవుల మీద ముద్దుపెట్టుకుంటూ అంది సమీర.
"సో, నువ్వు ఆ యస్మణి అన్నదాని గురించి పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా వుండు. నువ్వు కావాలనుకుంటే మీ మెంటల్ కేర్ లో అడ్మిట్ అయిన ఆ అమ్మాయి డిజార్డర్ వివరాలు ఎమన్నా చెప్పు. నీ పేషేంట్స్ వివరాలు నాతొ షేర్ చేసుకోవడం నీకు అలవాటే కదా."
అరవింద్, సమీర వాళ్ళ, వాళ్ళ ప్రొఫెషన్స్ కి సంభందించిన వివరాలు ఒకళ్ళతో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ వుంటారు.
“టు బి ఫ్రాంక్, కొంచెం టిపికల్ గానే వుంది. ఏమీ అర్ధం కావడం లేదు.” అని ప్రస్తుతం సారిక పరిస్తితి గురించి వివరించింది. “తనని ఎంతో ప్రేమించే తల్లితండ్రులనీ కూడా ఎందుకు చంపాలని ప్రయత్నించిందో అర్ధం కావడం లేదు. ఇందులో ఆశ్చర్యపరిచే ఇంకో యాంగిల్ కూడా వుంది.” అని కంటిన్యూ చేసింది. “తను ఒక ఒంటె తల వున్న పూర్తి న్యూడ్ గా వున్న మగ మనిషి బొమ్మ గీస్తూ వుంటుంది. ఆ బొమ్మ తనెందుకు గీస్తూంది అన్న విషయం కూడా తనకి తెలీదు. తనేమీ ఆర్టిస్ట్ కాదు, తనకి వేరే బొమ్మలేవీ వేసే అలవాటు కూడా లేదు.”
“ఐ సీ” సాలోచన గా అన్నాడు అరవింద్.
“నిజం చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ కేస్ ఇప్పటివరకూ డీల్ చేయలేదు నేను. ఇది స్ప్లిట్ పర్సనాలిటీ యా లేక మరొకటా అన్నది కూడా తెలియడం లేదు.” నిట్టూరుస్తూ అంది సమీర.
“నువ్వేం కంగారు పడకు. ఇప్పటివరకూ నీకు ఎందులోనూ ఫైల్యూర్ లేదు. ఇందులో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తావ్.” ఎంకరేజింగ్ గా అన్నాడు అరవింద్.
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)