వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"మనం వున్నది మెంటల్ కేర్ లో. అదీ కాకుండా ఇంతమందిమి వున్నాం కాబట్టి తను వయొలెంట్ గా మారినా మనం కంట్రోల్ చెయ్యగలం. కాబట్టి ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. నాకూ చాలా ఆతృతగా వుంది తెలుసుకోవాలని." ప్రమీల కూడా అంది.
దానితో శ్రవణ్ సింహరాజు, యస్మణి తమకి చెప్పినదంతా క్లియర్ గా చెప్పేసాడు. శ్రవణ్ చెప్పేదంతా సారిక చాలా ఇంట్రెస్టింగా వింది కానీ, చివరివరకూ విన్నతరువాత కూడా తనలో ఎటువంటి మార్పు రాకపోవడం తో అందరూ రిలాక్స్డ్ గా ఊపిరి పీల్చుకున్నారు.
"నువ్వు పనిమనిషవనే అనుకున్నాను. కానీ నాకు అక్కవని తెలుసుకోలేకపోయాను. ఐ యామ్ సారీ." శ్రవణ్ అన్నాడు.
"చిన్నపిల్లవని కూడా చూడకుండా నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంట్లోనుండి పారిపోయేలా చేసాను. చివరికి నీ చావుకి కారణం అయ్యాను. నువ్వు క్షమించే లాంటి తప్పు నేను చెయ్యలేదు." మాలతి అంది.
"వాట్ ద హెల్ యు పీపుల్ ఆర్ టాకింగ్? నాకసలు ఏమీ అనిపించడం లేదు." నవ్వుతూ అంది సారిక. "ఐ యామ్ సింప్లీ యువర్ సారిక. ఆ మల్లిక ఎవరో, అసలు నాకు నేను తనన్న ఫీలింగే రావడం లేదు."
"ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్ప్లిట్ పెర్సనాలిటీ అలాగే ఉంటుంది. స్ప్లిట్ పెర్సనాలిటీ ఇంకా ఒరిజినల్ క్యారక్టర్ పూర్తి అన్నోన్ గా వుంటారు ఒకరికొకరు." చిరునవ్వుతో అంది ప్రమీల.
"వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్ గారు చెప్పినతరువాత కూడా కాదని ఎలగంటాం?" వంశీ కూడా చిరునవ్వు నవ్వాడు.
"కానీ డాడ్........" భుజంగరావు మొహం లోకి చూస్తూ అంది సారిక. "..............నీకు ముందొకసారి పెళ్లి అయిందా? ఒక పాప కూడా వుందా? నేను నమ్మలేకపోతున్నాను."
దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక దీర్ఘంగా నిట్టూర్చి మౌనంగా ఊరుకున్నాడు భుజంగరావు.
"జరిగినదానికి ఆలోచించడం కాదు, జరగబోయేది ఆలోచించాలి. సారిక ఇప్పుడు ఇలా మాట్లాడుతూండడం వల్ల సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయిందని నేను అనుకోవడం లేదు. నా మనవరాలు పూర్తిగా ఏ ప్రాబ్లెమ్ లేకుండా క్యూర్ కావాలంటే ఏం చెయ్యాలో ఆలోచించాలి." మోహనరావు అన్నాడు.
"మనం ఎం చేయాలన్నది రేప్పొద్దున పూర్తిగా డిస్కషన్ జరుగుతుంది. నాకు ఆ కొత్తగా వచినవాళ్ళని కూడా చూస్తూవుంటే మన ప్రాబ్లెమ్ కి ఏదో సొల్యూషన్ దొరుకుతుందనే అనిపిస్తూంది." మాలతి అంది.
"ఆ ఇంకోవ్యక్తి మాటలప్రకారం సారిక స్ప్లిట్ పెర్సనాలిటీ కన్నా కూడా సాల్వ్ చెయ్యడానికి వున్న పెద్ద సమస్య ఆ కబుసా." వంశీ అన్నాడు.
"కబుసా ఎవరు?" ఆసక్తిగా నొసలు చిట్లించింది సారిక. ప్రమీల కూడా ఆసక్తిగా చూసింది. అప్పటివరకూ కబుసా గురించి అయితే మాత్రం ఏం చెప్పలేదు శ్రవణ్.
"నీకు చెప్పాల్సిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ మిస్ చేసాం." అంటూ వంశీ, సింహరాజు కబుసా గురించి చెప్పినదంతా క్లియర్ గా చెప్పాడు. "నువ్వు మల్లిక గా వున్నప్పుడు ఆ కబుసా ని ఆరాధించావ్. అందుకనే ఈ జన్మలో కూడా ఆ కబుసా నిన్ను విడిచిపెట్టలేదు. ఆ కబుసా తో వున్న సంభంధం వల్లే నువ్వు అతని బొమ్మ అలా గీస్తున్నవ్."
"గాడ్! నాకసలు మల్లికననే అనిపించడం లేదు. మల్లికగా వున్నప్పుడు ఆ వింత దేవుణ్ణి పూజించడం ఏమిటో నాకు బోధపడడం లేదు." నవ్వుతూ అంది సారిక.
"కానీ ఇక్కడ ప్రతీదీ సింక్ అవుతూంది, గమనించావా?" ప్రమీల అడిగింది. "నువ్వా ఒంటె తల తో నగ్నంగా వున్నమగ మనిషి బొమ్మ ఎందుకు గియ్యాలి? అలాగే నువ్వు సెక్స్ లో లాస్ట్ మూమెంట్ లో ఎందుకు అన్నిసార్లు అలా బిహేవ్ చేసావ్?"
కింద పెదవిని పళ్ళ మధ్య బిగించి ఆలోచనలో పడింది సారిక.
"ఇంతకీ ఇక్కడ ఒక విషయం." వంశీ అన్నాడు. "మన సిస్టర్ లో ఆ మల్లిక స్ప్లిట్ పెర్సనాలిటీ యా? లేకపోతె ఆ మల్లికే మన సిస్టర్ గా పునర్జన్మ ఎత్తిందా?"
"మనం సైంటిఫిక్ గా ఆలోచిస్తే స్ప్లిట్ పెర్సనాలిటీ. లేదూ ట్రాడిషనల్గా, మూఢనమ్మకాలతో ఆలోచిస్తే పునర్జన్మ" నవ్వుతూ అన్నాడు శ్రవణ్.
"ఓకే, రేపు మన సమావేశం లో అన్నివిషయాలు నిర్ణయమవుతాయి. ఈ లోపున ఇంతకన్నా ఆ విషయాల గురించి ఆలోచనలు అనవసరం. మనం ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుందాం." కుర్చీలోనుండి లేచి అన్నాడు భుజంగరావు.
"సారిక దగ్గర శ్రవణ్, ప్రమీల వుంటారు. మేమందరం ఉదయం మళ్ళీ వస్తాం." మాలతి కూడా కుర్చీలోనుండి లేచింది.
ఆ తరువాత సారిక, శ్రవణ్, ప్రమీల లని అక్కడ విడిచిపెట్టి తక్కిన అందరూ ఇంటిముఖం పట్టారు.
&&&
"నా కూతుర్ని చంపమని ఆ ఓబులేసు ని పంపించారా మామయ్యా?" ఇంటికివెళ్ళాక మోహనరావు కి ఎదురుగుండా వెళ్లి అడిగాడు భుజంగరావు. "తను బతికుంటే వచ్చి మీ ఆస్తిపాస్తుల్లో వాటా అడుగుతుందేమోనని భయపడ్డారా మీరూ, మీ కూతురు?"
"ఓహో, ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు సడన్ గా ఆ కూతురిమీద మమకారం పుట్టుకొచ్చిందా నీకు?" వెటకారంగా అడిగాడు మోహనరావు.
"నాకు పదిహేడేళ్లకే పెళ్లయింది. ఆ పెళ్లి నా అవసరం కోసం చేసుకున్నాను. నాకు తనంటే ఇష్టం లేదు. అలాగే వెంటనే తన ద్వారా పుట్టిన కూతురంటే కూడా ఇష్టం కలగలేదు." కొంచెం ఆగాడు. "నేను చేసిన అతి పెద్ద పొరపాటు నీ కూతురితో ప్రేమలో పడ్డాక నాకు ఒక కూతురు కూడా ఉందని చెప్పకపోవడం. చేసిన ఇంకో పెద్ద పొరపాటు నా అమ్మ కోరిక ప్రకారం తనని నాతో ఉంచుకోవడం. ఈ పొరపాట్లలో ఏది చెయ్యకపోయినా తనకా గతి పట్టేది కాదు."
"తన కుటుంబం గురించి కానీ, కూతురి గురించి ఆలోచించకూడదని నేనే కండిషన్ పెట్టాను. అయినా తనని తీసుకొచ్చి మనింట్లో ఉంచితే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోయాను. తను కూడా ఒక తల్లి కూతురేనని, ఆ తల్లి కూడా నేను నా కూతురిగురించి ఆలోచించినట్టే తన కూతురిగురించి ఆలోచిస్తుందని నేను ఆలోచించగలిగితే ఇలా జరిగివుండేది కాదు." మాలతి అంది.
"మీ ఇద్దరికీ సడన్ గా బాగానే జ్ఞానోదయం అయినట్టుంది." మోహనరావు లో వెటకారం అలాగే వుంది. "కానీ నువ్వొచ్చి నాదగ్గర ఏం చెప్తే నేను ఓబులేసు ని అందుకు పురమాయించానో ఒకసారి గుర్తుచేసుకో." అలా అన్నాక కోపంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు మోహనరావు.
"మీ నాన్న కి నువ్వేం చెప్పావ్?" మాలతి మొహం లోకి చూస్తూ అడిగాడు భుజంగరావు.
దానికి సమాధానం చెప్పలేనట్టుగా తల విదిలించి అక్కడనుండి పడకగదిలోకి వెళ్ళిపోయింది మాలతి. మాలతి వెనకాతలే వెళ్ళాడు భుజంగరావు కూడా. ఇద్దరూ పక్కపక్కనే పడుకున్నారు. ఇద్దరూ ఒకే ఆలోచనలతో వ్యధచెందుతూ వున్నారు. సముద్రపు కెరటాల్లా మీద కమ్ముకుంటూన్నగతం నుండి తప్పించుకునే ప్రయత్నం ఇద్దరూ చెయ్యలేదు
&&&
"ఈ వుబ్బెర గ్రామం లో పదవతరగతి పాసయింది నువ్వొక్కడివే. నువ్వు చాలా తెలివైన వాడివే. నాకు చాలా సంతోషమే. కానీ నిన్ను పట్నం పంపించి పెద్ద చదువులు చదివించే అంత స్తోమత నాకుందా?"
"మనకున్న ఈ చిన్న ఇల్లు, ఆ పొలం అమ్మేస్తే డబ్బులు రావా? వాటిమీద అప్పయినా తీసుకోవచ్చును." భుజంగరావు కోపంగా అన్నాడు.
"ఆ రెండూ నాకిష్టం లేదు. నువ్వనుకుంటున్నట్టుగా నువ్వు పెద్ద చదువులు చదవలేకపోతే? ఒకవేళ చదివి జీవితం లో స్థిరపడ్డా నన్ను పట్టించుకోకపోతే? ఇల్లు పొలం కూడా లేకుండా ఆ పెద్ద వయసులో నేనెక్కడికి పోతాను?" సాముదమ్మ కూడా కోప్పడింది.
భుజంగరావు లో చదువుకోవాలన్న ఆశ పోలేదు. కాకపోతే తన తల్లి మాత్రం ఇల్లు పొలం ఆమ్మో, అప్పుచేసో తనకి చదువుకోవడానికి డబ్బులు సమకూర్చదని అర్ధం అయిపోయింది. ఇంక ఏ రకంగా చదువుకోవడానికి డబ్బులు సంపాందించాలో తనకి అర్ధం కాలేదు.
"నువ్వు చదువుకోవడానికి ఒక ఉపాయం దొరికింది." అకస్మాత్తుగా ఒకరోజు భుజంగరావు తో సాముదమ్మ అంది. "మనం మన ఇల్లు పొలం అమ్మక్కర్లేదు. అలాగే వాటిని తాకట్టు పెట్టక్కర్లేదు కూడా."
"ఏమిటది?" ఆశ గా అడిగాడు భుజంగరావు.
"నువ్వు సావిత్రి ని పెళ్లి చేసుకోవడం. నువ్వు తనని పెళ్ళిచేసుకుంటే తన ఇంటిని, తన తల్లి బంగారాన్నీ కూడా అమ్మి నీ చదువుకి ఇస్తానంటూంది."
సావిత్రి ఆ వూళ్ళో చాలా మొండిపిల్ల. తన తల్లీ తండ్రీ చనిపోయినా మొండిగా ఒక్కర్తీ ఆ యింట్లో బతికేస్తూంది. సావిత్రి, సాముదమ్మ ఒకళ్ళకొకళ్ళు చాలా సాయంగా వుంటారు.
"ఏమిటి? అక్షరం ముక్క రాని దానిని నేను పెళ్లిచేసుకోవాలా?" కోపంగా అన్నాడు భుజంగరావు. "అసలు నన్ను పెళ్లిచేసుకోవాలన్న ఆలోచన దానికెలా వచ్చింది?"
"అదంతా నాకు తెలియదు. నువ్వు చదువుకుందామనుకుంటే మాత్రం వున్న ఉపాయం అదొక్కటే." తేల్చి చెప్పేసింది సాముదమ్మ.
రెండు కారణాలుగా ఆ పెళ్ళికి అంగీకరించాడు భుజంగరావు. ఒకటి, తనని పెళ్లిచేసుకోకపోతే తను పై చదువులు లేకుండా ఈ ఊళ్ళోనే వ్యవసాయమో, కూలిపనో చేసుకుంటూ ఉండిపోవాలి. రెండు, అక్షరం ముక్క చదువు లేకపోయినా సావిత్రి నిండు యవ్వనం తో అందంగానే ఉంటుంది. సావిత్రి ఒప్పుకుంటే పెళ్లిచేసుకోవడానికి లొట్టలు వేసుకుంటూ ఎదురుచూసే యువకులు ఆ వూళ్ళో చాలామందే వున్నారు.
చదువు సంధ్యా లేనివాళ్లే వున్న ఆ మారుమూల గ్రామంలో ఎవరికీ ఒక ఆడ మగా పెళ్లిచేసుకోవాలంటే మేజర్లవ్వాలనే నిబంధన వున్నట్టుగా కూడా తెలీదు. అందువల్లే సావిత్రికి పధ్నాలుగేళ్ళు, భుజంగరావు కి పదహారు ఏళ్ళు ఉండగా పెళ్లయిపోయింది. పెళ్లవ్వగానే ఆలస్యం లేకుండా సావిత్రికి కడుపు కూడా వచ్చింది. ఆ తరువాత తొమ్మిదినెలలు కాగానే సావిత్రిలాగానే అందంగా వున్న కూతురు కూడా పుట్టింది.
ఒకపక్క సంసారం వున్నా, సంసారం కన్నా చదువు మీదే ఎక్కువ నిమగ్నం అయిపోయాడు భుజంగరావు. తనకొక భార్య, కూతురు వున్న విషయం కూడా మర్చిపోయాడు.
తను కెమికల్ ఇంజనీరింగ్ చదువుతూన్నసమయం లో సావిత్రి కి కాన్సర్ వచ్చింది. ఎలాంటి ట్రీట్మెంట్ కి ఒప్పుకోలేదు సావిత్రి. "నా డబ్బంతా తన చదువు కి ఖర్చుపెడతానని చెప్పి పెళ్లిచేసుకున్నాను. ఇప్పుడా డబ్బు ని నా చికిత్స కి వాడుకోలేను. అయినా చికిత్స చేసినా, చెయ్యకపోయినా నేనెలాగూ కొన్ని రోజులలో చనిపోతానని డాక్టరు చెప్పాడు కదా."
కాలం అలాగే గడిచింది. సావిత్రి కాన్సర్ తో బాధపడుతూండడం కానీ, తరువాత చనిపోవడం కానీ భుజంగరావు మీద ప్రభావం ఏమీ చూపలేదు. మల్లిక మీద ఎలాంటి కొత్త మమకారం కలగలేదు. అసలు తను తన కూతురనే అనిపించేది కాదు ఎప్పుడూ. సముదమ్మే మల్లికని పెంచి పెద్ద చేసింది. తనకొక అక్షరం ముక్క చెప్పించాలన్న సాముదమ్మ తాపత్రయం మాత్రం పెద్దగా ఫలించలేదు. కేవలం ఐదవ తరగతి వరకూ మాత్రమే చదువుకోగలిగింది. అది చాలదన్నట్టుగా ఆ సింహరాజు తో తిరుగుతూ ఆ చెడ్డ దేవతలు, దేవుళ్ళ మీద ఆసక్తి చూపిస్తూ ఉండేది.
రోజులలా గడుస్తూ ఉండగా భుజంగరావు కెమికల్ ఇంజనీరింగ్ లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. వచ్చిన స్కాలర్షిప్ తో అందులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసాడు. తరువాత మోహనరావు కంపెనీ లో వుద్యోగం రావడానికి పెద్ద కష్టం కాలేదు. అప్పుడే మోహనరావు కూతురు మాలతి తో పరిచయం ఏర్పడింది.
అప్పటికి మాలతి కి కూడా ఒకసారి పెళ్లయింది. భర్త తో మనస్పర్థల కారణం గా విడాకులు తీసుకుంది. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయివుండడం వల్ల మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు తన తండ్రి ఎంతగా చెప్తూవున్నా కూడా.
కానీ భుజంగరావు తో పరిచయం పెరిగిన తరువాత తన తో తన జీవితం బావుంటుందనిపించింది. ఆ సమయం లో భుజంగరావు తనకి పెళ్ళై భార్య చనిపోయిందనే చెప్పాడు తప్ప తనకొక కూతురు ఉందని చెప్పలేదు. తనకి ఒక కూతురు ఉందని మాలతి కి తెలిసింది తన పెళ్ళైన తరువాత మాత్రమే. తన తల్లి మల్లిక ని తన కూడా తీసుకెళ్లి ఉంచుకోవాలని పట్టుబట్టిన తరువాత మాత్రమే.
"ఇంకా ఎన్ని ఇలాంటివి దాచావ్ నా దగ్గర? ఇప్పుడా దరిద్రాన్ని మన నెత్తిమీద వుంచుకోవాలంటావా?" పెద్ద గొడవ చేసింది మాలతి.
దానికి ఏం చెప్పలేకపోయాడు భుజంగరావు. సాముదమ్మ కూడా మల్లిక భుజంగరావు దగ్గరే ఉండాలని పట్టుపట్టింది.
"సరే వుండనీ. ఇంక మొత్తం విషయం అంతా నేను చూసుకుంటాను. నువ్వు నీ తల్లి గురించి కానీ, నీ కూతురిగురించి కానీ ఆలోచించడానికి వీల్లేదు. నువ్వు ఈ విషయాలు అసలు పట్టించుకోకు. అలాగని మాట ఇయ్యి."
తల్లి మీద కానీ, కూతురిమీద కానీ ఏ మూలా మమకారం లేని భుజంగరావు కి ఆ మాట ఇవ్వడం కష్టం కాలేదు. మల్లిక ఆ పెద్ద ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న ఒక చిన్న రూమ్ ఇచ్చారు. పనిమనిషి కన్నా హీనంగా చూసారు. ఇంటిపనంతా తనతోటె చేయించుకునేవారు.
మల్లిక ఇంట్లో పనంతా కూడా చేస్తూ వుండడం వల్ల తను వుండడం కొంచెం ఉపయోగంగానే వుంది మాలతి కి. పెళ్ళైన కొత్త లోనే మాలతి కి శ్రవణ్ పుట్టాడు. శ్రవణ్ కి మూడేళ్లు అలా వచ్చాక తనని ఆడించే బాధ్యత కూడా మల్లిక మీదే పడింది. ఏమాత్రం విసుక్కోకుండా శ్రవణ్ ని కూడా ఎంతో ముద్దుగా చూసుకుంటూ ఆడిస్తూ వుండేది. అప్పుడప్పుడు తన వూరు వెళ్తూవున్నా, మళ్ళీ తండ్రి దగ్గరకి వెళ్లెవరకూ ఊరుకునేది కాదు సాముదమ్మ
ఇదిలా వుండగా మాలతి కి ఒక కొత్త భయం పట్టుకుంది. రేప్పొద్దున్న మల్లిక ఆస్తిలో వాటా కూడా కావాలని అడుగుతుందేమో. ఎంతైనా తనకి కూతురు కదా. ఎంతో కస్టపడి తాము సంపాదించుకుంటున్న దాంట్లో దీనికెందుకు వాటా ఇవ్వాలి? ఆ భయం పట్టుకున్న తరువాత మల్లిక తమకి చేస్తున్న సాయం, ఉపయోగపడుతున్న తీరు కనిపించలేదు. తనని ఇంకా హింస పెట్టడం ప్రారంభించింది. ఇంక తట్టుకోలేక మల్లిక ఆ యింట్లోనుండి పారిపోయింది. రెండు నెలలైనా రాకపోయేసరికి ఇంక మల్లిక రాదని అర్ధం అయిపోయింది.
"అదేం చిన్నపిల్ల కాదు. తన వూరికే పోయివుంటుంది. మనకి చెప్పకుండా పోయినదానిగురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు నాకిచ్చిన మాట గుర్తుంచుకో." భుజంగరావు తో అంది మాలతి.
నిజంగా ఆలోచించమని చెప్పినా ఆలోచించే ఉద్దేశం లేదు భుజంగరావు కి. తేలికగానే మల్లిక గురించి మర్చిపోయాడు.
కానీ మాలతి మాత్రం మర్చిపోలేకపోతూవుంది. రేప్పొద్దున్న అది తిరిగొచ్చి ఆస్తిలో వాటా అడగదని మాట ఏమిటి? తమ ఆస్తి మొత్తం ఎవరికైనా ఇచ్చేమన్నా తను ఇచ్చేగలదు. కానీ ఆ దరిద్రానికి కొంచెం కూడా ఇవ్వడం తనకి ఇష్టం లేదు.
"అది ఇంట్లోనుంచి పోయింది కదమ్మా, ఇంకా దానిగురించి ఆలోచన ఎందుకు?" తన కూతురు దేనిగురించి ఆలోచిస్తూందో ఊహించి ఒకరోజు మోహనరావు అన్నాడు.
"ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోయిందనుకుంటున్నావా నాన్నా? రేప్పొద్దున్న వచ్చి అది మన ఆస్తిలో వాటా అడగదని మాట ఏమిటి? ఎంత కాదన్నాఇది తన కూతురు. తను కూడా మన ఆస్తి ఇంతగా పెరగడం లో మెయిన్ రోల్ ప్లే చేసాడు."
తన కూతురు చెప్పింది విన్నాక ఆలోచనలో పడ్డాడు మోహనరావు.
"ఆ దరిద్రం మొహం మరోసారి చూడాలంటేనే నాకు కంపరంగా వుంది నాన్నా. అలాంటిది దానికి మన ఆస్తిలో వాటా కూడా ఇవ్వాలంటే నేనెలా తట్టుకోగలను?" ఆవేదనగా అంది మాలతి.
"సరేనమ్మా. ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. నేను చూసుకుంటాను." మోహనరావు అన్నాడు.
కానీ మాలతి ఆలోచించకుండా వుండలేకపోయింది. తనొచ్చి తనకీ ఆస్తిలో వాటా కావాలి అని అడుగుతున్నట్టుగానే అనిపించేది. ఆ తర్వాత ఒక పదిహేను రోజులో, నెలో గడిచాక తన తండ్రి తనతో అన్నాడు. "ఇకపైన నీకా మల్లిక బాధ ఉండదు. నువ్వు తన గురించి పూర్తిగా మర్చిపోవచ్చు."
"ఏం జరిగింది నాన్నా? అలా ఎలా చెప్పగలుగుతున్నావ్?" తను ఆశ్చర్యం గానూ, ఆనందంగానూ అడిగింది.
"నీకు వివరాలన్నీ చెప్పాలా? నీ తండ్రి మాటల మీద నమ్మకం వుంచలేవా?" చిరాగ్గా అడిగాడు తన తండ్రి. "నీకు తన పీడ పూర్తిగా విరగడైంది. ఆస్తిలో వాటా అడగకపోవడం మాత్రమే కాదు, తన మొహం కూడా నీకెప్పుడూ చూపించలేదు." అలా అన్నాక తన తండ్రి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
తన తండ్రి మాటల మీద తనకి నమ్మకం వుంది. ఒక్కగానొక్క కూతురైన తనంటే ప్రాణం తన తండ్రికి. తన గురించి ఎన్నో చేసాడు. ఈ సమస్యని తీర్చేసాను అని తనంటే తీర్చేసే ఉంటాడు. తను ఆలోచించక్కర్లేదు. ఆ తరువాత తను మల్లిక గురించి ఆలోచించలేదు. ఆనందంగానే వుంది.
కానీ ఇప్పుడాలోచిస్తూంది. అంటే తన తండ్రి మల్లిక అడ్డు తొలగించుకోవడానికి ఓబులేసు ని ఉపయోగించాడా? ఓబులేసు మల్లిక ని మానభంగం చేసి బతికుండగానే పాతిపెట్టేసాడా? అందుకేనా తన కూతురు అప్పుడప్పుడు తనకి ఊపిరి ఆడట్లేదమ్మా అని ఏడిచేది?
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)