వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
కళ్ళవెంట నీళ్లు కారూతూవున్నాయి భుజంగరావు కి, మాలతి కి.
"ఏంటమ్మా, ఏంటి చూస్తున్నారు మీరంతా ఇక్కడ?" అక్కడికి వచ్చి అడిగింది సారిక.
"ఏం లేదమ్మా, పద మనం ఇక్కడనుండి వెళ్ళిపోదాం." సారిక ని అక్కడనుండి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ అంది మాలతి.
అక్కడనుండి వెళ్లబోతూన్నదల్లా, సింహరాజు వైపు చూసింది సారిక. ఆ మొహం లో ఎదో మార్పు కనిపించింది. ఎదో గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం కనిపించింది. "నువ్వు.........నువ్వు రాజు వి కదా."
"అవును మల్లికా. నేను నీ సింహరాజు ని." చిరునవ్వుతో అన్నాడు సింహరాజు.
"ఎంతకాలమైంది నిన్ను చూసి." సింహరాజు దగ్గరికి వెళ్లి గట్టిగా కౌగలించుకుని, రెండు బుగ్గలమీద ముద్దుపెట్టుకుంది. "నువ్వెక్కడికి వెళ్లిపోయావ్? ఇంతకాలం ఏమైపోయావ్?"
"నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఏమీ అయిపోలేదు. ఇక్కడే వున్నాను." చిరునవ్వుతో అన్నాడు సింహరాజు.
"నువ్వు.... నువ్వు.... ఇంత పెద్దవాడివి ఎలా అయిపోయావ్?"
"కాలం నన్నింత పెద్దవాడిగా మార్చింది. నువ్వు ఇక్కడనుండి వెళ్ళిపోయాక చాలా కాలం గడిచింది." అదే చిరునవ్వుతో అన్నాడు సింహరాజు.
"మరి నేనెందుకు నీలా పెద్దగా మారలేదు." తనవైపు అయోమయంగా చూసుకుంటూ అంది సారిక. అంతలోనే తల తిప్పి అక్కడవున్న భుజంగరావు, మాలతి వైపు చూసింది. "వీళ్ళిద్దరూ ఇక్కడ ఎందుకుఉన్నారు? ఇక్కడకూడా వీళ్ళు నన్ను ప్రశాంతంగా వుండనివ్వరా? వీళ్ళని ఇప్పుడే నేను చంపేస్తాను." కోపంగా వాళ్ళమీదకి వెళ్లి మాలతి మెడ పట్టుకుంది.
"మల్లికా నా మాట విను. వాళ్ళనేమీ చెయ్యకు. ఆవిడని విడిచిపెట్టు." మల్లిక పట్టుని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు సింహరాజు.
"మమ్మల్ని చంపినా పర్లేదు. కానీ అందువల్ల నువ్వు జైలుకి వెళ్తావు. మమ్మల్ని విడిచిపెట్టు. మా అంతటా మేముగానే చనిపోతాం." భుజంగరావు కూడా ఆ పట్టుని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు.
"లేదు. మీరు నా చేతుల్లోనే చావాలి. నేను జైలు కి వెళ్లడం కాదు, నన్ను వురి తీసినా పర్లేదు." మాలతి మెడని ఇంకొంచెం గట్టిగా నొక్కుతూ అంది సారిక.
తన పట్టుని విడిపించడానికి సింహరాజు, భుజంగరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఈలోగా వెనకనుండి "అక్కా..............." అన్న పిలుపు వినిపించింది.
"ఎవరు, ఎవరు నన్ను పిలిచింది?" కరెంట్ షాక్ కొట్టినట్టుగా వెనక్కి తిరిగి చూసింది మల్లిక. మల్లిక వెనకాతల కళ్ళనీళ్ళతో నిలబడివున్నాడు శ్రవణ్.
"నన్ను మర్చిపోయావా అక్కా? నీ శ్రవణ్ బాబు ని. నా చిన్నప్పుడు నన్ను అడిచేదానివికదా." కళ్ళవెంట అలాగే నీళ్లు కారిపోతూవుంటే అన్నాడు శ్రవణ్.
"శ్రవణ్........ శ్రవణ్ బాబూ .........." పరిగెత్తుకుంటూ వెళ్లి శ్రవణ్ ని కౌగలించుకుంది సారిక. "నువ్వు ఇంత పెద్దవాడివైపోయావా?"
"అవును. అయిపోయాను. నువ్వు మాత్రం నాకన్నా చిన్నగానే వున్నావ్." చిరునవ్వుతో కళ్ళవెంట నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు శ్రవణ్.
"అవును నిజమే." ఆశ్చర్యంగా అంది సారిక. "ఇదెలా సాధ్యమైంది?"
"నువ్వు నాకూడా వస్తే ఇదెలా సాధ్యమైందో నీకు చెప్తాను." ఆ చిరునవ్వు సింహరాజు పెదాల మీద ఇంకా అలాగే వుంది.
&&&
"అవునా? నేను చనిపోయి మళ్ళీ మా నాన్నకే పుట్టానా?" సింహరాజు చెప్పిందంతా విన్నాక అయోమయంగా చూస్తూ అడిగింది సారిక.
"అవును తల్లీ. నేను నీకంత ద్రోహం చేశానన్న కోపం లేకుండా నువ్వు మళ్ళీ నాకే పుట్టావు." సారిక ని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు భుజంగరావు. "కానీ నువ్వు నన్ను చంపి జైలుకి వెళ్ళకు. నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. నీకు, నీ అమ్మకు చేసిన ద్రోహానికి అదే ప్రాయశ్చిత్తం."
"అంతపని చెయ్యకు. శ్రవణ్ బాబు ని అనాదని చెయ్యకు." భుజంగరావు నోటికి తన చేతిని అడ్డుపెడుతూ అంది. "శ్రవణ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం."
తరువాత అక్కడే వున్న మాలతి ని కోపంగా చూస్తూ అంది సారిక. "నువ్వు ఒకదానికి ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను."
"ఏమిటి తల్లీ అది? నువ్వేం చెప్పినా నేను ఒప్పుకుంటాను." గద్గద స్వరం తో అంది మాలతి.
"నేను జీవితాంతం మల్లిక గానే వుంటాను. సింహరాజు ని పెళ్లిచేసుకుంటాను, నీ కిష్టమేనా?"
"నాకిష్టమే తల్లీ. నువ్వు ఎప్పటికీ మల్లికగానే వుండు. ఆ సింహరాజు ని పెళ్లిచేసుకో. నాకు అభ్యంతరం ఏమీ లేదు." మాలతి అంది.
"సరే అయితే" తలూపింది సారిక.
"మరైతే సారిక ని ప్రేమించి పెళ్లిచేసుకుందామనుకుంటున్న నేనేం కావలి?" సారిక ముందుకొచ్చి కోపంగా అడిగాడు ప్రదీప్.
"నువ్వెవరో నాకు తెలీదు. ముందు నువ్విక్కడనుండి పో." గట్టిగా అరుస్తూ ప్రదీప్ ని రెండుచేతులతో వెనక్కి తోసింది సారిక.
"అక్కా.... అక్కా.......కోపం తెచ్చుకోకు." వేగంగా వచ్చి మల్లికని పట్టుకుని అన్నాడు శ్రవణ్.
"నువ్వు చెప్పు శ్రవణ్ బాబూ, నీకు అక్క మల్లిక కావాలా? చెల్లెలు సారిక కావాలా?" శ్రవణ్ మొహం లోకి చూస్తూ అడిగింది సారిక.
"నన్ను అంత ముద్దుగా చూసుకుని ప్రేమించే మల్లికే కావాలి."
"నన్ను కావాలనుకునేవాళ్లే ఇక్కడవుండండి. ఆ సారిక కావాలనుకునేవాళ్ళు ఇక్కడనుండి పొండి." కోపంగా అరిచింది మల్లిక.
అక్కడనుండి బయటకి వెళ్ళిపోయాడు ప్రదీప్ కోపం ఇంకా బాధతో. ప్రదీప్ వెనకాలగానే వచ్చాడు సింహరాజు.
"మీరు అనవసరం గా బాధపడకండి. కంగారుపడకండి. తను మళ్ళీ సారిక గా మారుతుంది. అప్పుడు ఈ మల్లిక, నేను ఎవరన్నది కూడా తనకి తెలియదు." అన్నాడు ప్రదీప్ మొహం లోకి చూస్తూ.
"కానీ తను తరచూ ఇలా మల్లికగా మారుతూవుంటే ఎలా?" ఆవేదనగా అడిగాడు ప్రదీప్.
"నేను ఒక పెద్ద సమస్య తీరే మార్గం చూస్తున్నా. ఆ సమస్య తీరిపోతే ఇది పెద్ద సమస్య కాదు. మా ప్రఖ్యాత గురువు గారు యస్మణి ఈ సమస్య ని తేలికగానే పరిస్కహరిస్తారు."
"సరే అయితే" తలూపాడు ప్రదీప్.
&&&
"ఈ సమస్య పరిష్కారానికి వున్న ఒకే ఒక మార్గాన్ని నేను అనుసరించబోతున్నా. అది మీకు తెలుసును కదా." యస్మణి ఒంటరిగా వున్నప్పుడు కలిసి అన్నాడు సింహరాజు.
"నేనూహిస్తూనే వున్నాను నువ్వు ఇదే అంటావని." దీర్ఘం గా నిట్టూర్చాడు యస్మణి. "కానీ ఇందువల్ల ఖచ్చితంగా పని జరుగుతుందంటావా? నీ మల్లిక సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందా?"
"తమని తాముగా అర్పించుకునే ఆత్మలు కబుసా కి ఇష్టం కాదు, అవసరం. అలాగ స్వచ్చందంగా అర్పించుకునే ఆత్మలు లేకపోతే, కొంతకాలానికి శక్తీ నశించి, ఉనికి లో లేకుండా పోతాడు. కాబట్టి అలాంటి ఆత్మలు అడిగే ఏ కోరికయినా తీరుస్తాడు."
యస్మణి మౌనంగా వుండిపోయాడు, ఆయన మోహంలో సింహరాజు చేస్తున్నది తనకి ఇష్టం లేదు అన్నట్టుగా వుంది.
"ఇంతకన్నా వేరొక ఉపాయం ఏదన్నా వుందా? వుంటే అది చేద్దాం."
"సరే రాజూ, నీ ఇష్టం అయితే."
"నేను చేసే ఈ పనితో కబుసా సమస్య మల్లిక కి పూర్తిగా పరిష్కారమవుతుంది. ఇంక తనని పూర్తిగా సారిక గా మార్చే పూచీ మీదే."
"ఇదే పెద్ద సమస్య. అది నేను చూసుకుంటాలే. దాని గురించి నువ్వు ఆలోచించకు." హామీ ఇస్తూ అన్నాడు యస్మణి
&&&
"రేపు తెల్లవారుఝామున మనం మా ఇంటికి వెళ్ళాలి." సారిక తో అన్నాడు సింహరాజు.
"దేనికి? అక్కడవున్న పిచ్చి దేవుళ్ళు, దేవతల బొమ్మల్ని చూడ్డానికా? నేను రాను." చిరాగ్గా అంది సారిక.
"ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఆ కబుసా ప్రసాదించే శక్తుల గురించి నువ్వెంతగా కోరుకున్నావో." చిరునవ్వుతో అన్నాడు సింహరాజు.
"అది ఒకప్పుడు. కానీ నాకిప్పుడేమీ వద్దు. నువ్వు, నీతో జీవితం చాలు." సారిక అంది. "అయినా ఆ జీవితం చాలించేసెను కదా. ఈ జీవితం లో నాకు కబుసా తో ఏంటి సంభందం?"
"కబుసా తోటి సంభందం పెట్టుకుంటే అది జన్మజన్మలకి కొనసాగుతుంది." సింహరాజు అన్నాడు. "అయినా రేపు ఒక్కరోజుకి రా. ఇంకెప్పుడూ రానవసరం లేదు."
"సరే అయితే." అంగీకరించింది సారిక.
&&&
తన ఇంట్లో కబుసా ముందు పద్మాసనం వేసుకుని కూచుని ధ్యానం లోకి వెళ్ళిపోయాడు సింహరాజు . "నేను ధ్యానం నుండి బయటకి వచ్చేవరకూ నువ్వు ఇక్కడే వుండు. ధ్యానం లో మన తప్పుల్ని క్షమించమని, మనల్ని పూర్తిగా విడిచిపెట్టేమని కబుసాని ప్రార్ధించబోతూవున్నాను." ధ్యానం లోకి వెళ్ళబోయేముందు సారిక కి చెప్పాడు.
అందుకు అంగీకరించి సింహరాజు పక్కనే నిలబడింది మల్లికగా మారిన సారిక.
"నీకేం కావాలి? ఏదో ఒక కోరిక తీర్చకుండా ఎవరి ఆత్మని నన్ను నేను బలోపేతం చేసుకోవడానికి తీసుకోను." సింహరాజు మనోనేత్రం ముందు ప్రత్యక్షం అయిన కబుసా అన్నాడు.
"నువ్వు ఎన్నుకున్న మల్లిక ని విడిచిపెట్టెయ్యాలి. తనని పూర్తిగా మర్చిపోవాలి. ఇంక ఏ జన్మలోనూ తనని నువ్వు కోరుకోకూడదు."
ఒంటె తల అటూ ఇటూ ఊపుతూ "అది నాకు అంగీకారమే. ఇంక నువ్వు ఆలస్యం లేకుండా నీ ఆత్మని నాకిచ్చెయ్."
ఊపిరి పీల్చడం ఆపేసాడు సింహరాజు. సింహరాజు లో ప్రాణం ఎప్పుడు పోయింది పక్కన నిలబడ్డ సారిక కి తెలీలేదు. ఆ తర్వాత తనకి తెలీకుండానే సారికగా మారిపోయింది
&&&
సింహరాజు, సారిక సింహరాజు ఇంట్లో ఉండగా వంశీ నుండి ఫోన్ వచ్చింది మాలతి కి. ముందురోజు రాత్రి మోహనరావు గుండెపోటుతో చనిపోయాడు.
"సారిక సమస్య ఇంకా తీరనే లేదు, ఇప్పుడు ఈ వార్త. నాకు ఇక్కడ ఉండాలో, అక్కడికి వెళ్లాలో తెలియడం లేదు." మాలతి ఆదుర్దా గా అంది. ఆశ్చర్యంగా తన తండ్రి చనిపోయాడన్నాతనకి అక్కడకి వెళ్లాలనిపించడం లేదు, ఆయన గురించి బాధగానూ అనిపించడం లేదు
"సారిక సమస్య గురించి మరోసారి ఇక్కడికి వద్దాం. అక్కడ ఆయన చనిపోయివుంటే మనం ఇక్కడ ఎలా వుంటాం? మనం వెంటనే బయలుదేరాలి." భుజంగరావు అన్నాడు.
"సారిక ఆ సింహరాజు తో వెళ్లి చాలా సేపు అయింది. ఇంకా రాలేదు. తను వస్తే బయలుదేరి వెళ్ళిపోదాం." శ్రవణ్ అన్నాడు.
"సారిక ఇప్పుడు మల్లిక గా వుంది. మనతో రావడానికి ఒప్పుకుంటుందా?" ప్రమీల అడిగింది.
"అలా ఒప్పుకోకపోతే మనం సింహరాజు దగ్గరే వదలి వెళదాం. సింహరాజు చాలా మంచివాడు." భుజంగరావు అన్నాడు.
"మనం ముందు సింహరాజు ఇంటికి వెళ్లిచూద్దాం. అక్కడి పరిస్థితిని బట్టి ఏం చెయ్యాలో ఆలోచిద్దాం." యస్మణి సలహా ఇచ్చాడు.
ఆ సలహా అందరికీ నచ్చింది.
&&&
యస్మణి పరివారం అంతా సింహరాజు ఇంటికి వెళ్లేసరికి అతని ఇంటిముందు ఆదుర్దాగా తచ్చాడుతూంది సారిక. మాలతి ని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకుంది.
"సడన్ గా నాకు తెలివి వచ్చి చూస్తే నేను ఎక్కడో ఏదో ఇంట్లో వున్నాను. పక్కనే మనదగ్గరికి వచ్చారు కదా ఒకరు, ఆయన పద్మాసనం వేసుకుని, కళ్ళుమూసుకుని వున్నాడు. నేను ఎంత లేపినా లేవడం లేదు. నాకు మనింటికి ఎలా రావాలో తెలియక ఇతని ఇంటిముందు ఇలా తిరుగుతున్నాను."
ఒక్క ఉదుటున అందరూ సింహరాజు ఇంట్లోకి వెళ్లారు. అతన్ని పూర్తిగా పరిశీలించిన తరువాత యస్మణి అన్నాడు "మల్లిక కోసం సింహరాజు ఆత్మార్పణం చేసాడు."
ఎపిలాగ్
"గాడ్! ఆలోచిస్తూంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది!" ప్రమీల అంది. "అంత పెద్ద ప్రాబ్లెమ్ అలా ఎలా సాల్వ్ అయిపోయింది? ఇప్పుడు సారిక లో ఏ అబ్నార్మల్ బిహేవియర్ లేదు. తను ఒక బిడ్డకి తల్లి కూడా అయింది."
"ఏమీ చెయ్యకుండా ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ కాలేదు. సింహరాజు తన ఆత్మని కబుసాకి సమర్పించడం వల్ల ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ అయింది." యస్మణి అన్నాడు.
"సర్, మీరు ఆ పారానార్మల్ విషయాల్ని వదలరా? మీరు ఇంత గొప్ప వ్యక్తి అయివుండీ అలాంటి పిచ్చి విషయాల్ని నమ్మడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది." సమీర అంది.
ఆ రోజు సింహరాజు మరణం తరువాత మామూలుగా మారాక సారిక లో మళ్ళీ మల్లిక ఎక్స్పోజ్ అవ్వలేదు. తనూ, ప్రదీప్ కలవడానికి చేసిన ప్రయత్నం ఏ ఇబ్బందీ లేకుండా ఫలించింది. తరువాత నెలరోజులకు జరిగిన పెళ్ళికిముందు మూడుసార్లు వరకూ కలిశారు ఇద్దరూ. పెళ్లి తరువాత నెలరోజులకు సారిక ప్రేగ్నన్ట్ అయింది.
పెళ్ళికి మోహనరావు అందర్నీ ఇన్వైట్ చేసాడు కానీ, అప్పుడు అందరూ లేకపోయారు. ఇప్పుడు నేమింగ్ సెరిమోనీ కి కూడా అందర్నీ ఇన్వైట్ చేసాడు సమీర కుటుంబ సభ్యులతో సహా. పెళ్ళికి రావడానికి అవ్వలేదు కానీ, ఈ నేమింగ్ సెరిమనీ కి మాత్రం తనూజ, సుస్మిత కూడా రాగలిగారు. అరవింద్ రావాలని అనుకున్నా రాలేక పోయాడు.
"అయితే అప్పుడు మన విచిత్ర ప్రవర్తనకి కారణం ఏమిటంటావ్? అలాంటి ఇరిసిస్టిబుల్, అన్రీజనబుల్ సెక్సుల్ డిజైర్ మనకెందుకు కలిగింది? నీ అంతటా నువ్వే చెప్పావ్, మనం ఎదో పారానార్మల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నామని." తనూజ అడిగింది.
సమీర వాళ్లందరినీ అప్పటికి వెళ్లిపొమ్మని అడగడం తో సుస్మిత, శరత్, తనూజ, అభినవ్ అప్పటికి వెళ్లిపోయారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఆ ఇరిసిస్టిబుల్ సెక్సువల్ అర్జ్ వాళ్లలో తగ్గిపోయింది.
"మా ఇంట్లో పరిస్థితి కూడా అప్పుడు అందుకు ఏం భిన్నం గా లేదు. అందుకనే అప్పుడు సమీర ని అడక్కుండానే మా గురువుగారిని రమ్మనమని చెప్పాను." పక్కనే కూచున్న యస్మణి వైపు చూస్తూ అన్నాడు నిరంజన్.
"అప్పుడప్పుడు మనలో అటువంటి ఇరిసిస్టిబుల్, అన్రీజనబుల్ సెక్సువల్ డిజైర్ కలుగుతుంది. అది కొన్ని రోజులు పోయాక సెటిల్ అయిపోతుంది. మనందరి విషయం లో జరిగింది అదే." కాస్త ఆగి మళ్ళీ అంది. "సారిక మల్లిక వుండే రూమ్ లోకి తరచూ వెళ్ళింది. మల్లిక రాసిన నోట్ బుక్ చదివాక సారిక కి మల్లిక ఎవరో, అక్కడనుండి ఎందుకు వెళ్లిపోయిందో అర్ధం అయింది. మల్లిక కి జరిగిన అన్యాయానికి తనెంత అప్సెట్ అయిందంటే, తనలో మల్లిక స్ప్లిట్ పెర్సనాలిటీ డెవలప్ అయింది. మల్లిక గురించి ఆలోచించినప్పుడల్లా తను మల్లిక గా మారిపోయేది. అందుకనే తను చదివిన పుస్తకం గురించి కానీ, మల్లిక గురించి కానీ ఎవరితో మాట్లాడలేకపోయింది. మల్లిక ఇష్టపడ్డ కబుసా బొమ్మని తాను చూసింది. అందుకే మల్లిక గా వున్నప్పుడు ఆ బొమ్మని తానెందుకు గీస్తూందో సారిక గా వున్నప్పుడు అర్ధం చేసుకోలేకపోయింది."
"గ్రేట్ ఎక్స్ప్లానేషన్ సమీరా!" నవ్వాడు యస్మణి. "ఇంక కబుసా గురించి నువ్వేం చెప్తావో నేనూహించగలను, వినదలుచుకోలేదు."
"వినదలుచుకోకపోయినా నేను చెప్తాను. కబుసా లాంటి బాడ్ గాడ్స్ జస్ట్ ద క్రియేషన్ ఆఫ్ సిక్ మైండ్స్. అటువంటివి ఎప్పుడూ లేవు. ఇంక సింహరాజు ఆత్మార్పణం చేసి మల్లిక ని కాపాడేడు అనడం పెద్ద భ్రమ. తన తల్లీ తండ్రీ తన దగ్గర అలా పశ్చాత్తాప పడగానే సారిక లో మల్లిక స్ప్లిట్ పెర్సనాలిటీ శాటిస్‌ఫై అయింది. ఇంక తన అవసరం లేదని ఎక్స్పోజ్ అవ్వడం మానేసింది."
"తను అంతకాలం సెక్స్ లో పార్టిసిపేట్ చెయ్యలేకపోవడానికి కారణం?" ఇబ్బందిగానే అనిపించినా ఆ ప్రశ్న కూడా అడిగింది ప్రమీల.
"ఒక్క ప్రదీప్ తప్ప ముందు ముగ్గురు తోటి కేవలం అర్జ్ సాటిస్‌ఫాక్షన్ కోసమే సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంది సారిక. వాళ్ళ మీద ప్రేమ కానీ, వాళ్లతో జీవితం పంచుకోవాలన్న అభిప్రాయం తో కానీ లేదు. అందువల్లనే సరిగ్గా లాస్ట్ మూమెంట్ లో, తనలో మోరల్ కాన్షస్నెస్ తో పాటుగా ఒక అన్నోన్ రీజనబుల్ కంక్లూడింగ్, అంటే వాళ్లతో అది చేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను అన్న అభిప్రాయం, తనకు తెలీకుండానే ఒక స్ట్రాంగ్ సబ్కాన్షస్ వద్దు, వద్దు అనే సిగ్నల్ పంపి తనని అందులో పార్టిసిపేట్ చేయకుండా చేసింది."
"అయితే నేనూ, సారికా ట్రై చేసినప్పుడు కూడా ఎందుకు అది వీలు కాలేదు? అప్పటికి మేంప్రేమించుకుంటూ, పెళ్లిచేసుకోవాలన్న నిర్ణయానికి కూడా వచ్చేసాం. కేవలం సింహరాజు మరణం తరవాత మాత్రమే మా ఇద్దరిమధ్య అది సాధ్యం అయింది." అక్కడే వున్న ప్రదీప్ అన్నాడు.
"బహుశా మొదటిసారి మీరిద్దరూ ట్రై చేసినప్పుడు నీ ప్రేమ విషయం లో తను అంతగా సీరియస్ గా వుండివుండక పోవచ్చు. అందువల్ల మొదటి ముగ్గురి సమయం లో ఎలా బిహేవ్ చేసిందో అలాగే బిహేవ్ చేసింది. తర్వాత నువ్వు తనతో పాటుగా ఆ పల్లెటూరికి వెళ్లడం, తను అలా బిహేవ్ చేస్తున్నా నువ్వు తనే కావాలనుకోవడం తనకి నీమీద నమ్మకాన్ని పెంచాయి. తను నిన్ను పెళ్లి కూడా చేసుకోబోతూ వుండడం వల్ల మోరల్ కాన్షస్ నెస్ కూడా లూజ్ అయింది. సబ్ కాన్షస్ బ్లాక్స్ రిలీజ్ అయి తను నీతో సెక్స్ లో పార్టిసిపేట్ చెయ్యగలిగింది. అంతే తప్ప కబుసా లాంటి పారానార్మల్ పవర్ ఏదో అంతకాలం తను అది చేయకుండా లాస్ట్ మూమెంట్ లో అడ్డుకుంది అన్నది మాత్రం నాన్సెన్స్." అంది సమీర.
“"మరి ఓబులేసు అలా చిత్రంగా చనిపోవడానికి కారణం?" అందరికీ ఓబులేసు ఎలా చనిపోయాడు అన్నది కూడా నాలెడ్జ్ లోకి వచ్చింది అప్పటికి
"మనుషులకి కొన్ని సమయాల్లో అబ్నార్మల్ పవర్ వస్తుంది. సారిక లో మల్లిక ఎక్స్పోజ్ అయి తను తన పేరెంట్స్ ని, గ్రాండ్ పా ని ఇంకా ఓబులేసు ని చంపాలనుకున్నప్పుడు తనలో వున్నా అన్-కంట్రోలబుల్ యాంగర్ వాళ్ళ అబ్నార్మల్ పవర్ వచ్చింది. ఓబులేసు కి తను మల్లిక ని ఎలా చంపాడో గుర్తుకువచ్చింది. తన మీద సారిక అలా ఎటాక్ చేసినప్పుడు సారిక ని మల్లికా పూనింది అనుకునివుంటాడు. అంతేకాకుండా మల్లిక రాసిన నోట్ బుక్ ని అందులో తను వేసిన ఆ ఒంటె తల మనిషిబొమ్మని చూసివుంటాడు. వాడిలో గిల్టీ ఫీలింగ్ ఇంకా భయం సమపాళ్లలో పెరిగిపోయాయి. ఇందంతా వాడిలో సబ్-కాన్షస్ గా అటువంటి బిహేవియర్ ని ట్రిగ్గర్ చేసి వాడలా నూతిలో దూకి చనిపోయేలా చేసివుంటాయి." సమీర అంది.
"మరెందుకు తనప్పుడప్పుడు ఒంటెలా శబ్దాలు చేసి, బిహేవ్ చేసింది?" ప్రదీప్ అడిగాడు
"తనా ఒంటె బొమ్మతో కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అందుకనే తనకి తెలీకుండానే ఒంటెలా బిహేవ్ చేసింది."
"నీ దగ్గర ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లానేషన్ వుంది సమీరా" నవ్వుతూ అన్నాడు నిరంజన్
దానికి ప్రదీప్ ఎదో చెప్పబోతూవుంటే సారిక పిలిచింది "మనం ఇప్పుడు పేరు పెట్టబోతూ వున్నాం. నువ్వక్కడ ఉండిపోతే ఎలా? ఇలా రా."
ఎదో కోలాహలంగా ఉండడం తో ఆ పెట్టిన పేరు ఏమిటో ఎవరికీ సరిగ్గా వినిపించలేదు. అందువల్ల అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో గట్టిగా అంది సారిక "ఇక్కడనుండి మా అమ్మాయి పేరు 'మల్లిక'."
"వండర్ఫుల్ నేమ్." సమీర అంది. "ఇంతకీ ఆ నేమ్ సెలెక్షన్ ఎవరిదీ?"
"నా మామ్ ది." తన తల్లివైపు చూస్తూ అంది సారిక.
ఆ తరువాత కూడా అక్కడ అందరూ చాలా సేపు ఆనందంగా నవ్వుతూ గడిపారు
అయిపోయింది
ఇక్కడితో ఈ నవల పూర్తయింది. మీకు నచ్చిందనే ఆశిస్తున్నా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.