you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 11

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 11

ప్రేమ్ ,ఆదిత్య ఇంకా అక్షయ,  ప్రియా గదిలోకి
రాగానే అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యంలో వారి కళ్ళు పెద్దవి అయ్యాయి. ఎందుకంటే అక్కడ ప్రియా ఉగ్రకాలి లాగా నితిన్ ఇంకా అరుణ్ నీ కొడుతూ ఉంటే . నిఖిల్ కూల్ గా సోఫాలో కూర్చుని అక్కడ జరిగిందంతా ఒక మూవీ చూసినట్టు చూస్తున్నాడు, శైలు కి మాత్రం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ ఇంకా జాలిగా నితిన్ ఇంకా అరుణ్ నీ చూస్తుంది.

ప్రియా ని అలా చూసిన ఆదిత్య కొంచెం భయపడుతూ ప్రేమ్ వైపు చూసి "  ఈ పిల్ల నీకు కరెక్టేనంటావా రా,  చూసావా ఎలా కొడుతుందొ వాళ్ళ ఫ్రెండ్స్ ని, రేపొద్దున నీ పరిస్థితి ఏంటి అంటావ్"  అని జాలి పడతాడు.
పెళ్లయిన తర్వాత ప్రేమ్ ప్రియా మాట వినకపోతే ప్రియా ప్రేమ్ ని పట్టుకొని ఇలా కొట్టడం ఆదిత్య ఇమేజింగ్ చేసుకుంటూ ఉంటాడు.
" ఒరేయ్ ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు ఒకసారి ఆలోచించుకోరా"  అని అడుగుతాడు ఆదిత్య ప్రేమ్ వైపు చూస్తా. 

అక్షయ ఆదిత్య డొక్కలో తన మోచేతితో పొడుస్తూ " నువ్వు ఊరుకో అది,  ప్రియ ఎప్పుడు ఎవరిని కొట్టదు , వీళ్లు ఏదో తింగర పని చేసి ఉంటారు అందుకే వీళ్ళని లైన్ లో పెడతాకి అలా కొడుతుంది అంతే"  అని అంటుంది. ఏదో టీచర్ స్టూడెంట్లీ లైన్లో పెట్టినట్లుగా , తల్లిదండ్రులు తమ పిల్లల్ని  లైన్ లో పెట్టినట్లుగా అన్నట్టు చెబుతుంది అక్షయ.

ఆదిత్య అక్షయ కొట్టిన చోట కొంచెం నొప్పిగా ఉండటంతో అక్కడ రుద్దుకుంటూ " అబ్బా ... ఏంటే ఇంత గట్టిగా కొట్టావు మొగుడిని అని కూడా చూడకుండా "అని అంటాడు. 

అక్షయ కొంచెం కోపంగా " లేకపోతే ఏంటి అది గారు వాళ్ళిద్దరిని కలిపే ప్లాన్స్ ఇవ్వకుండా ఆలోచించుకో అని అంటారేంటి మీరు, నేనేమో చక్కగా ప్రియా ప్రేమ్ ని పెళ్లి చేసుకుంటే నాతోనే ఉండిపోతుందని నేను కలలు అంటుంటే"  అని అంటుంది.

ఆదిత్య అక్షయ వైపు చూస్తూ "  అంటే ఏంటే ని ఉద్దేశం ,నీ స్వార్థం కోసం నా తమ్ముని  బల్లి చేస్తావా, ఒక్కసారి అటు చూడు ఎలా కొడుతుందో వాళ్ళని రేప్పొద్దున్న నా తమ్ముడి పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా " అని అంటాడు. అతని తమ్ముడు ఫ్యూచర్ ని గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోతూ.

అక్షయ కళ్ళు చిన్నవి చేస్తూ  " ఇదిగోండి నేను మీకు ముందే చెప్తున్నాను నా ప్రియా ని ఏమన్నా అంటే ఊరుకోను, వాళ్లు ఏదో తింగరి పని చేసి ఉంటారు అందుకే తన్నులు తింటున్నారు " అని చాలా కూల్ గా చెప్తుంది. 

ప్రేమ్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మెరిసే కళ్ళతో ప్రియా నే చూస్తూ ఉండిపోయాడు.

శైలు వీళ్లు వచ్చిన సంగతి గమనించి వెంటనే అక్షయ దగ్గరికి వెళ్లి " ఒసేయ్ దాన్ని నువ్వన్నా ఆపవే ఈరోజు వాళ్ళని చంపేసేటట్టుంది " అని అంటుంది.

ఆదిత్య కోపంగా ఉన్న ప్రియా వైపు చూసి " ఏంటి ప్రియా ని ఆపడం మా వల్ల అవుతుందా?  ఒకసారి తనని చూడు ఎంత కోపంగా ఉందో , అడ్డుగా వెళితే,  వెళ్లిన వాళ్ల కూడా తనులు పడేటట్టు ఉన్నాయి అక్కడ"  అని అంటాడు.
అలాగే నిఖిల్ వైపు చూసి" ఒక్కసారి నీ బాయ్ ఫ్రెండ్ చూడు వాడే ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఒక మూల కూర్చున్నాడు ఇప్పుడు అక్షయ వెళ్ళింది అనుకో వాళ్లతో పాటు దీన్ని కొమ్ముతుంది ,అసలే నా పెళ్ళాం ప్రెగ్నెంట్ , మమ్మల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు ". అక్షయా నీ పట్టుకొని వెళ్లొద్దు అని అంటు. 

శైలు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రేమ్ వైపు వెళ్లి రిక్వెస్ట్ చేస్తూ " ప్రేమ్  ప్లీజ్ నువ్వు అన్న దాని ఆపవా" అని అడుగుతాడు.

ప్రేమ్ మాత్రం ప్రయా నీ చూస్తూ ఏదో ట్రాన్స్ లో " నా బంగారం ఇలా కొడుతుంటే ఎంత ముద్దొస్తుందో "  అని అంటారు.

ఆ మాటకి ఆదిత్య తన తమ్ముని వింతగా చూస్తుంటే అక్షయ ఇంకా శైలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. 
శైలు వెంటనే తీరుకుంటూ, ప్రేమ్ నీ కదిలిస్తూ " ప్రేమ్ ముందు దాన్ని వెళ్లి ఆపుతావా ఆపవా " అని అంటుంది.

నిఖిల్ కూడా నితిన్ ఇంకా అరుణ్ కి పడిన తన్నులు సరిపోతాయి అని అనుకుంటూ " స్వీటీ చాల్లేరా ఇంకా వాళ్ళని వదిలేసేయ్ " అని అంటాడు.

ప్రియా మాత్రం అదేమీ పట్టించుకోకుండా వాళ్లని కొట్టే పనిలోనే ఉంది. 

అక్షయ కి కూడా తన ఫ్రెండ్స్ అలా తన్నులు తింటే కొంచెం జాలిగా అనిపించింది.
" స్వీటీ ఇంకా చాల్లేరా ఆపేసే"  అని అంటుంది. 
శైలు కూడా తన దగ్గరికి వెళ్తూ " చాల్లే వే ఇప్పటికే చాలా కొట్టేసావ్ వాళ్ళని , ఆపేసేయ్ " అని అంటుంది. 

కానీ ప్రియా ఎవరి మాట వినడం లేదు తన ఫ్లోలో తను ఉంది. 

" మందు ఎవరైనా వచ్చి దీని వెనక్కి లాగండ్రా బాబు , ఇక్కడ చచ్చిపోయేలాగా ఉన్నాము " అని అరుణ్ ఏడుస్తాడు.

అదే టైంలో నిఖిల్ ఇంకా ప్రేమ్ ఒకరిని ఒకరు చూసుకొని  నవ్వుకుంటూ ముందుకు వెళతారు . ఫ్రేమ్ ప్రియా నడుం పట్టుకొని వెనక్కి లాగుతాడు. ప్రేమ్ తనని వెనక్కి లాగినా , ఫ్రేమ్ చేతిలో ఉన్న ప్రియ గుంజుకొంటూ ఉంటుంది " నన్ను వదలండి నన్ను వదలండి " అంటూ.

నిఖిల్ వెళ్లి నితిన్ ఇంకా అరుణ్ కి సహాయం చేస్తాడు.
ప్రియా కొట్టిన దెబ్బలకి బాగా నొప్పి పుట్టడంతో నితిన్ ఆ ఫ్రస్టేషన్ అంతా నిఖిల్ వైపు చూపిస్తూ " మిత్ర ద్రోహి ఇదంతా నీవల్లేరా, మాకు సహాయం చేయడం మానేసి,  దాంతో నన్ను కొట్టిస్తావా,  నాకు ఒక టైం వస్తుంది అప్పుడు చెప్తారా నీ సంగతి"  అని అంటాడు.

అరుణ్ మాత్రం నితిన్ మీద కోపం చూపిస్తూ "  ఒరేయ్ సచ్చినోడా నీ వల్లే కదరా అది నన్ను కూడా కొట్టింది,  నువ్వు చచ్చేది చావకుండా నన్ను కూడా ఇరికిస్తావా , ఇంకెప్పుడైనా నీకు సహాయం చేస్తే  చెప్పించుకొని కొట్టు." అని అంటూ తను దెబ్బలకి నొప్పిగా ఉన్నా కూడా ఓపిక తెచ్చుకుని నితిన్ ని కొట్టడం స్టార్ట్ చేశాడు. 

నితిన్ ఆ దెబ్బలకు ఇంకా ఏడుస్తూ " ఒరేయ్ అది ఇప్పటివరకు కుమ్మేసింది రా, ఇప్పుడు మళ్లీ నువ్వు స్టార్ట్ చేశావా ఈరోజు నా దినం పెడతారా ఏంట్రా మీరందరూ కలిసి"  అని ఏరవడం స్టార్ట్ చేస్తాడు అరుణ్ కొడుతున్న దెబ్బలు తింటూ. 

నిఖిల్ అరుణ్ నీ ఆపుతూ "  ఒరేయ్ నువ్వు ఆగరా ఇప్పటికే పాపం వాడు చాలా తన్నులు తిన్నాడు" అని అంటాడు.

అరుణ్ మాత్రం కోపంలో " ఏంట్రా ఆపేది ప్రియా మా ఇద్దరినీ కొడుతున్నప్పుడు సినిమా చూస్తున్నట్టు చూసావు గాని ఆపడానికి వచ్చావా?  ఇప్పుడు వీడిని కొడుతుంటే నన్ను ఆపుతావా . నువ్వు పక్కకు , అసలు వీడి వల్లే కదరా నాకు ఈరోజు ఇలా తన్నులు పడ్డాయి ", అని అంటూ ప్రియా కొట్టిన తన్నులు వల్ల వచ్చిన ప్రస్టేషన్ అంతా కూడా నితిన్ మీద చూపిస్తాడు.

నితిన్ తన్నులు తింటూ " ఒరేయ్ అసలు ఆ కర్ర ప్రియా కి తెచ్చి ఇచ్చింది నిఖిల్ గాడు ముందు వాడిని కొట్టరా"  అని అంటాడు.

అరుణ్ నిఖిల్ వైఫ్ చూస్తూ " అవును దానికి కర్ర ఇచ్చింది నువ్వే కదా,  మమ్మల్ని కొట్టమని ఏదో మనసులో పెట్టుకుని చేసావు కదా నువ్వు , అపుంటే దాన్ని అప్పుడే ఆపగలవు నువ్వు , కానీ ఆపకుండా దానికి కర్ర ఇచ్చే మరి మమ్మల్ని కొట్టడానికి ప్రోత్సహించారు , పైగా అది మమ్మల్ని కొడుతుంటే కూర్చొని సినిమా చూసినట్లు చూస్తావా"  అని అంటాడు.

నిఖిల్ మాత్రం"  అవున్రా కావాలని కొట్టించాను. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆపినందుకు సంతోషించండి,  ఒకసారి దాన్ని చూడండి " అని ప్రియా వైపే చూపిస్తాడు. ప్రేమ్ ప్రియా ని పట్టుకున్న , ప్రియా ఇంకా కోపంలో ఊగి పోతుంది " ప్రేమ్ నీ దాన్ని వదలమని చెప్పనా మీకు ఇంకో రౌండ్ వేస్తుంది"  అని అంటాడు.

అరుణ్,  నితిన్  ప్రియా కొట్టిన దెబ్బల గుర్తుకు వచ్చి భయంతో ఇద్దరు ఒకేసారి " వద్దు వద్దు " అని అంటారు. 

నిఖిల్ చిన్నగా నవ్వుకుంటూ"  గుడ్ " అని చెప్పి శైలు వైపు తిరిగి "  శైలు వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వు " అని అంటాడు.

శైలు అప్పటికే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచి ఉండి ఉంటుంది. 

ఆదిత్య అక్కడ జరిగేదంతా చూస్తూ అక్షయ వైపు తిరిగి  " మీ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా ఇంతేనా , భలే కామెడీగా ఉంటారు తెలుసా, మీలో మీరే కొట్టుకు చస్తారు ఒక్కొక్కసారి , మళ్లీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఎవరి జోలికైనా వస్తే అందరూ ఏకమైపోతారు మీ బాండింగ్ బాగుంటుంది అలాగే మీరు చేసే పనులు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి " అని అంటాడు.

ఆదిత్య కి అక్షయ ఫ్రెండ్స్ బ్యాచ్ అంటే చాలా ఇష్టం ఈ ఆరుగురు కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెరిగారు అని అతనికి తెలుసు అలాగే వీళ్ళని టూ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాడు వీళ్ళ బాండింగ్ వీలు చేసే పనులు అంతా కూడా ఆదిత్యా కి చాలా నచ్చుతాయి, వీళ్ళ అందరి మధ్యలో కూడా ఎటువంటి సీక్రెట్స్ ఉంచుకోరు , వీళ్లలో ఒకరికి ప్రాబ్లం అంటే చాలు అందరూ ఏకమవుతారు ,  ఆదిత్య ఒకొక్కసారి ఫీల్ అవుతూ ఉంటాడు  ఇలాంటి బ్యాచ్ తనకి ఎందుకు లేదు అని.

ఆదిత్య మాటలకు అక్షయ ఆదిత్య వైపు చూసి  "మీరు ఇప్పుడు మమ్మల్ని పొగిడారా, తిట్టారా? " అని అంటుంది.
ఆదిత్య నవ్వుతూ " ఇంత ఇంటలిజెంట్ బ్రెయిన్ కి నేను పొగిడానో తిట్టానో అర్థం కాలేదా " అని  అంటాడు ఐబ్రో రైస్ చేస్తూ.

ప్రియా మాత్రం ఇంకా ప్రేమ్ చేతిలో గుంజుకుంటూనే ఉంటుంది వదలు పెట్టమని .
ప్రేమ్ తన చెవి దగ్గరికి వెళ్లి " నువ్వు ఇలాగే  గుంజుకున్నావు అనుకో ముద్దు పెట్టేస్తాను జాగ్రత్త , అందులోనూ అమ్మమ్మ నిన్ను ముద్దు పెట్టుకునే ఫుల్ రైట్స్ నాకు ఇచ్చేసింది " అని అంటాడు.

ప్రేమ్ వెచ్చని ఊపిరి తానా చెవి వెనకాల తగులుతూ అతని  మాటలు తన చెవి దగ్గరగా వినిపిస్తూ ఉంటే ఒకసారిగా ఆగిపోయి  తల వెనక్కి తెప్పి ప్రేమ్ వైపు చూస్తుంది. ప్రేమ్ మొహం తనకి చాలా దగ్గరగా అంటుంది .  
తనని ఎవరో పట్టుకుని వెనక్కి లాగారు అని తెలిసింది గాని అది ప్రేమ్ అనుకోలేదు ప్రియా. ప్రేమ్ చేతలు ప్రియా నడుముని  పట్టుకుని ఉంటాయి.
ప్రియా అలా వెనక్కి తిరగగానే ప్రేమ్ మొహం  తన మొహానికి చాలా దగ్గరగా ఉంటుంది వాళ్ళ ఇద్దరి పెదవులకి కేవలం త్రీ ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంటుంది.
ప్రేమ్ తనకి అంత దగ్గరగా ఉండేసరికి తన హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది.

ప్రియా కూడా తనకి అంత దగ్గరగా ఉండడం వల్ల ప్రేమ్ హార్ట్ బీట్ కూడా  పెరుగుతుంది .
తన అందమైన చందమామ లాంటి మొహం , నక్షత్రా లాంటి  అందమైన కళ్ళు టప టపా లాడిస్తూ ఉంటే ,  దానికి పైన ఉన్న ఆమె అందమైన కనుబొమ్మలు వాటి రెండిటి మధ్యలో మెరుస్తున్న ఒక చిన్ని స్టిక్కర్ దాని కింద చిన్న కుంకుమ , శిల్పి చెక్కినట్లుగా ఉన్న తన ముక్కు దానికి  ఉన్న ఒక చిన్న ముక్కుపుడక , అందమైన శంఖంలాంటి చిన్ని చెవులు దానికి అందాన్ని చేకూరుస్తూ ఉన్న చెవి బుట్టలు. లిప్స్టిక్ కూడా అవసరం లేని ఆమె గులాబీ పెదాలు , చూస్తుంటే ప్రేమ్ కి మతి తప్పిపోతుంది.
ఆ పెదవులు రుచి చూడడానికి దహించిపోతుంది అతని మనసు.

ప్రేమ్ తనకి అంత దగ్గరగా ఉండే సరికి బొమ్మలాగా బిగుసుకుపోయి అతనిని చూస్తూ ఉండిపోయింది.

ప్రియ నీ అంత దగ్గరగా చూసిన ప్రేమ్ తన పరిసరాలు మరచిపోయి తన పెదవులు అందుకోవడానికి అన్నట్లుగా కొంచెం ముందుకు వెళ్తున్నాడు, అతను తన దగ్గరికి రావడం చూసిన ప్రియ అప్రయత్నాంగా కళ్ళు మూసుకుంటుంది, అతని వెచ్చని ఊపిరి తన మొహనికి తగలుతుంటే  , ప్రేమ్ తన దగ్గరగా వస్తుంటే ప్రియా కి ఏదో తెలియని ఫీలింగ్.

అక్షయ , ప్రియ ఇంకా ప్రేమ్ అంత దగ్గరగా ఉండటం , అందులోను ప్రేమ్ ప్రియా కి కిస్ ఇవ్వడానికి ముందుకు వెళ్లడం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది . అది చూసిన ఆదిత్య వెంటనే అక్షయ కళ్ళు మూసేస్తాడు.

ప్రేమ్ ఇంకా ప్రియా అంత దగ్గరగా ఉండడం చూసిన నితిన్ ఇంకా ప్రేమ్ ఏం చేయబోతున్నాడు మందు గానే ఊహించి ఒక్కసారిగా " ప్రియా నాకెందుకో ప్రేమ్ దీని అంతటికీ కారణం అనిపిస్తుంది , వాడే కావాలని వాడి ఇన్ఫర్మేషన్ నీకు దొరక్కుండా చేసి ఉంటాడు ఇదంతా వాడి ప్రీప్లానెడ్ గా చేసినట్టు ఉన్నాడు"  అని గట్టిగా అరుస్తాడు.

నితిన్ మాటలకు తేరుకున్న ప్రియ వెంటనే  కళ్ళు తెరిచి తనకి దగ్గరగా ఉన్న ప్రేమ్ నీ దూరంగా నెట్టేస్తుంది.
" దూరంగా ఉండు నాకు" 

కొనసాగుతోంది.....

**
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.