ఆరోజు ఆఫీస్ మీటింగ్ ఉండడంవల్ల బయట డిన్నర్ చేసి ఇంటికి ఆలస్యంగా వస్తుంది ప్రియా తన ఇంటికి వస్తూ ఉండంగా తన నాన్న ఇంకా నానమ్మ మాటలు వినిపిస్తూ ఉంటాయి.
ఊర్మిళాదేవి మాట్లాడుతూ " ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను ఇన్నాళ్ళకి నా కూతురు జాడ తెలిసింది" అని ఎంతో సంతోష పడుతూ ఉంటారు, ఆవిడ మాటల్లో కూడా కొంచెం దుఃఖం తొంగి చూస్తుంది.
ఊర్మిళ దేవి మాటలకు సునంద గారు మాట్లాడుతూ " అవును అత్తయ్య గారు ఇన్నాళ్ళకి మీ ప్రార్ధనలు అన్నీ ఆ కృష్ణయ్య వినడు అందుకే వదినా జాడ తెలుసుకోగలిగాము " అని అంటారు.
" ఆ కృష్ణయ్య నా ఈ ఇంకో ప్రార్థన కూడా ఎప్పుడు ఆలకించి దాని నెరవేరుస్తాడో ఏమో" అంటారు ఊర్మిళాదేవి గారు.
" ఏంటమ్మా అది?" అని అడుగుతాడు జగదీష్ చంద్ర.
" ఇంకేముంటుందిరా, నా మనవరాలి పెళ్లి, దాని పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది , కానీ అదేమో పెళ్లి చేసుకోనని కూర్చుంది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతాను అని అంటుంది , దాని మనసు మార్చే మార్గం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే అది మాత్రం పెళ్లి చేసుకోను అంటే, చేసుకోను అని అంటుంది, ఆ కృష్ణయ్య దాని మనసు మార్చే లాగా చేయాలని రోజు ప్రార్థిస్తున్నాను " అని అంటారు ఊర్మిళాదేవి గారు.
జగదీష్ చంద్ర గారు కూడా కొంచెం బాధపడుతూ "అవునమ్మా దాని మనసు మార్చాలని , తన గతం నుంచి బయటికి రావడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ అది మొండిపట్టు పట్టుకొని కూర్చుంది దాన్ని ఎలా మార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు" . అని అంటారు ఆయన.
ఆయనకి తన కూతురి భవిష్యత్తు గురించి కొంచెం బెంగగా ఉంటుంది.
" ఆ కృష్ణయ్య ఏదో ఒక మాయ చేసి దాన మనసు మార్చితే బాగుంటుంది" అని అంటారు ఊర్మిళాదేవి గారు.
ఇది రోజు తను ఇంట్లో లేనప్పుడు జరిగే డిస్కషన్ , ప్రియా కి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా తన గురించి ఎలా ఆలోచిస్తారో అనేది.
ఇంతలో సునంద మాట్లాడుతూ " ఏవండి వదిన గారికి ఎంతమంది పిల్లలు మీకు ఏమైనా తెలుసా " అని అడుగుతుంది.
జగదీష్ చంద్ర గారు ఆలోచిస్తూ ఏదో గుర్తుతెచ్చుకుంటూ " నాకు తెలిసిన దాని ప్రకారం అక్కకి కొడుకు ఉన్నాడని తెలిసింది అతను బిజినెస్ వ్యవహారాలు అన్ని చూసుకుంటున్నాడు అంట ఇంకా పిల్లలు ఉన్నారో లేదో నాకు అంతగా తెలియదు" అని అంటాడు ఆయన.
ఊర్మిళాదేవి గారికి సడన్ గా బుర్రలో ఒక ఆలోచన తట్టింది " ఒరేయ్ నా కూతురి కొడుక్కి, నీ కూతురిని ఇస్తే ఎలా ఉంటుంది అంటావు" అని అడుగుతాడు.
జగదీష్ చంద్ర ఇంకా సునంద గారు ఊర్మిళాదేవి మాటలకు ఆశ్చర్యపోయి ఆవిడ వైపు చూస్తారు.
బయట నుంచి వీళ్ళ మాటలు అన్నీ వింటున్నా ప్రియా కి ఊర్మిళాదేవి మాటలు షాక్ కొట్టినట్లు అనిపిస్తాయి 'అమ్మ ముసలి ఎంత ప్లాన్ వేస్తున్నావే నా వెనకాల' అని అక్కడే ఉండి వాళ్ళ మాటలు విందాం అని అక్కడే ఉంటుంది.
" ఏంటి అలా చూస్తున్నారు , ఎలాగో మీ అక్కకి ఒక కొడుకు ఉన్నాడని తెలిసింది కదా, ఇంకా మీ అక్క మనకి దూరమై చాలా సంవత్సరాలు అయ్యింది ఈ పెళ్లితోనైనా దాన్ని మన దగ్గరికి తెచ్చుకోవచ్చు , అల్లుడిని దాని కుటుంబాన్ని అంతా కూడా ఇల్లరికం తెచ్చుకోవచ్చు, నీ బిజినెస్ అంతా కూడా నీ అల్లుడికి అప్పగించొచ్చు. నా కూతురు నా దగ్గరే ఉండిపోతుంది , ఒక రకంగా చెప్పాలి అంటే ఏదో ఒకటి చేసి ప్రియా ని లాక్ చేయొచ్చు ఇందులో, ఎన్ని సంవత్సరాలుగా దూరంగా ఉన్న అత్త మన దగ్గరికి రావాలి అంటే దాని కొడుకుని చేసుకోవడమే సరైనది అని దాన్ని ఎలాగైనా ఒప్పించొచ్చు , నీ సంతోషం కోసం అయితే అది కచ్చితంగా ఒప్పుకుంటుంది " అని అంటారు ఊర్మిళాదేవి.
ఈ సలహా సునంద కి కూడా బాగా నచ్చుతుంది తన కూతురు ఎక్కడికి వెళ్లకుండా తన దగ్గరే ఉంటుంది అన్న సంతోషం ఆవిడలో.
జగదీష్ చంద్ర ఆలోచనలో పడతాడు .
కొడుకు ఆలోచనలో పడడం చూసిన ఊర్మిళాదేవి "ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు మీ అక్క నీ దగ్గరికి రావడం నీకు ఇష్టం లేదా?" అని అడుగుతుంది .
వెంటనే జగదీష్ చంద్ర " లేదమ్మా అలా ఏమీ లేదు , అక్క నా దగ్గరికి వస్తుంది అంటే నా కన్నా సంతోషపడేవాడు ఈ లోకంలో ఎవరు ఉండరు , కానీ అక్క కొడుకు గురించి ఏమీ తెలియకుండా ఇలా పెళ్లి అంటే... " అని అంటున్న జగదీష్ మాటలకు ఊర్మిళాదేవి అడ్డుపడుతూ " నా కూతురి గురించి నాకు బాగా తెలుసు దాని పిల్లల పెంపకం గురించి కూడా నాకు ఒక అవగాహన ఉంది , దాని కొడుకు అన్ని విధాల మన ప్రియా కి సరితూగుతాడు అన్నది నా నమ్మకం, నువ్వు ఓకే అంటే దాన్ని ఎలాగైనా ఒప్పిదం" అని అంటుంది .
అత్తయ్య గారి మాటలకు సునంద మాట్లాడుతూ "అవునండి ఇది కొంచెం నాకు సరిగానే అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి , మీ అక్క మీ దగ్గరే ఉంటుంది , అలాగే మీ కూతురు కూడా మన దగ్గరే ఉండిపోతుంది" అని అంటుంది.
" కానీ అమ్మ అక్కకి కొడుకు ఉన్నాడు అన్న మాట నిజమే కానీ , వాడికి పెళ్లయిందా, లేకపోతే ఎవరైనా ప్రేమిస్తున్నాడా , ఇవేమీ తెలియకుండా మనం ఇలా మాట్లాడటం కరెక్టే నంటావా " అని అడుగుతాడు జగదీష్ చంద్ర.
తన తండ్రి మాటల విన్న ప్రియ ' కనీసం మా డాడీ ఆలోచించినట్టు , ఈ ముసలి ఆలోచించట్లేదు ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి అనే ధ్యాసలోనే ఉంటుంది ' అని అనుకుంటుంది ప్రియా.
" నాకు ఆ కృష్ణయ్య మీద పూర్తి నమ్మకం ఉందిరా, నాకెందుకొ ఈ పెళ్లి జరుగుతుంది అనిపిస్తుంది, ఈ పెళ్లితో నా కూతురు నా దగ్గరికి వస్తుంది అన్నా గట్టి నమ్మకం" అని అంటారు ఊర్మిళాదేవి గారు.
"సరే అమ్మ నీ నమ్మకమే నిజం అవ్వాలని కోరుకుంటున్నాను , దాన్ని మీరు ఒప్పించగలిగితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ప్రియా కి ఇష్టం లేకుండా అయితే నేను నిర్ణయం తీసుకోలేను " అని అంటాడు జగదీశ్ చంద్ర.
ఊర్మిళాదేవి సంతోష పడుతూ " ఇక మిగతాది నాకు వదిలేయ్ ఇక చూసుకో దాని పెళ్లికి ఎలా ఒప్పిస్తానో" అని అంటుంది ఊర్మిళాదేవి.
లోపల జరిగిన డిస్కషన్ అంతా విన ప్రియ తన గుండె మీద చేయి వేసుకొని "అమ్మ ...ముసలిదానా ....ఎంత ప్లాన్ వేసావే ..వావ్👌 ..నీ ఐడియాలజీకి హ్యాండ్ ఆఫ్ ... నువ్వు కానీ బిసినెస్ వరల్డ్ లో ఉండి ఉంటే నీకు తిరుగు ఉండరేమో" అని అనుకుంటూ లోపల ఉన్న తన నాన్నమ్మ వైపు చూస్తుంది .
" కానీ పాపం నీకు తెలియని విషయం ఏమిటంటే నీ కూతురికి కొడుకు ఉన్నాడు కానీ వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది , నాకు పెళ్లి చెయ్యాలి అన్న నీ ఈ ఆలోచన ఇక్కడే అడ్డుకట్ట వెయ్యాలి , అది ఎలా చేయాలో నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయిగా , ఇకపైన నా పెళ్లి గురించి నువ్వు ఆలోచన చేయకుండా నేను చూస్తాను గా , నీ యాక్షన్ నువ్వు కంటిన్యూ చెయ్ నా యాక్షన్ నేను చేస్తాను " అని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది ప్రియా.
ఊర్మిళాదేవి సునంద వైపు చూస్తూ " ఏంటే నీ కూతురు ఇంకా రాలేదు రాత్రి 9 అవుతున్నా సరే " అని అంటుంది.
" ఏదో బిజినెస్ మీటింగ్ ఉంది అని చెప్పింది అత్తయ్య , డిన్నర్ కూడా అక్కడ చేసి వస్తాను అని చెప్పింది ఈ పాటికల్లా వచ్చేస్తూ ఉండొచ్చు " అని అంటుంది సునంద.
ఈ లోపల బయటకు చూసిన ఊర్మిళాదేవికి ప్రియా లోపలికి వస్తూ కనిపిస్తుంది.
వెంటనే కొడుకు వైపు కోడలు వైపు చూస్తూ " నేను ఇప్పుడు ఏం చేసినా సరే నాకు సహకరించండి , అంతేగాని ఎదురు ప్రశ్న వేయకూడదు, నీ కూతురిని ఎలాగైనా సరే ఈరోజు పెళ్లికి ఒప్పిస్తా చూడండి" అని అంటుంది.
వెంటనే ఊర్మిళాదేవి సోఫాలో కూర్చుని చాలా బాధపడుతున్నట్టుగా ఫేస్ పెడుతుంది.
ప్రియా లోపలికి వచ్చి బాధగా కూర్చున్న ఊర్మిళ దేవి వైపు , సైలెంట్ గా ఉన్న తన తల్లిదండ్రుల వైపు చూసి ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్లి " నానమ్మ ఏమైంది అలా ఉన్నావ్" అని అడుగుతుంది.
ఊర్మిళాదేవి గారు తన కొడుకు ఇంకా కోడలు వైపు చూసి ఇక చూసుకోండి నా యాక్టింగ్ అన్నట్లు కళ్ళు ఎగరేసి వాళ్ల వైపు చూసి , ప్రియా ని పట్టుకొని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది.
" అయ్యో ....నేనేం చేసేది రా దేవుడా.... కష్టాలన్నీ నాకే ఇచ్చావు ... వా😭...వా😭....వా😭.. ఇప్పుడు నేను ఏం చేసేది ...." అని గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది.
వాళ్ళ అమ్మ సడన్గా అలా ఏడ్చేసే సరికి చూసి జగదీష్ చంద్ర ఆశ్చర్యపోయి నోరు వెళ్ళబెట్టి మరి ఊర్మిళాదేవిని చూస్తూ ఉండిపోయాడు .
సునంద మాత్రం వాళ్ళ అత్తయ్య గారు యాక్టింగ్ కి లోపల ముసిముసిగా నవ్వుకుంటుంది.
తనని పట్టుకొని ఏడుస్తున్న వాళ్ళ నాన్నమ్మ వైపు చూసిన ప్రియ 'నానమ్మ చాలా బాగా ఏడుస్తున్నావ్ ఇదే యాక్టింగ్ గనక ఏ సినిమాలో కానీ చేసి ఉంటే ఆ రోజుల్లో హీరోయిన్ సావిత్రి గారి కంటే పెద్ద హీరోయిన్ అయిపోయే దానివి ' అని తన మనసులో అనుకుంటుంది.
ప్రియా కూడా తన యాక్టింగ్ మొదలు పెడుతూ
" అయ్యో... నానమ్మ ఏమైందే అలా ఏడుస్తున్నావు నేనున్నాను కదా నీకు ఏ ప్రాబ్లం వచ్చిన నాకు చెప్పు" అని అంటుంది.
ఊర్మిళాదేవి గారు అదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తూ "ఏం చెప్పేదే మనవరాలా నా కూతురు జాడ ఇన్నాళ్ళకి తెలిసింది" అని అంటుంది.
" తెలిస్తే మంచి విషయమే కదా దానికి సంతోష పడటం మానేసి ఇలా ఏడుస్తారా " అని అంటుంది ప్రియా.
" కానీ అది మన ఇంటికి రాదు ,దానికి నామీద చాలా కోపం ఉంది , ఆ రోజుల్లో దాని పెళ్లికి మేము ఒప్పుకోలేదు అని" అని అంటుంది ఊర్మిళాదేవి.
" అవునా మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం" అని అడుగుతుంది ప్రియా తన నానమ్మ వైపు చూస్తూ.
" నా కూతురికి కోపం తగ్గి మన ఇంటికి శాశ్వతంగా రావాలి అంటే ఒకటే మార్గం ఉంది , కానీ ఆ కృష్ణయ్య ఆ మార్కాన్ని చాలా కఠినం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు" అని అంటుంది.
" అవునా నానమ్మ ఏంటా మార్గం? నాకు చెప్పవా నావల్ల అయితే కచ్చితంగా నేను చేస్తాను " అని అంటుంది ప్రియా . తన నానమ్మ చెప్పబోయే విషయం ముందుగానే ఊహించి.
ఊర్మిళాదేవి కొంచెం సంతోష పడుతూ ' ఇప్పుడు దొరికింది నాకు ఇక చూస్తూ నిన్ను ఎలా లాక్ చేస్తానో అని' తన మనసులో అనుకుంటుంది. జగదీష్ వాయిద్య చూసి కన్ను కొట్టి.
" అవునే మనవరాలా అది నీ ఒక్క దానివల్లే సాధ్యం అవుతుంది, మీ నాన్నకి వాళ్ళ అక్కంటే ఎంతో ఇష్టం. కానీ ఆరోజు జరిగిన దానివల్ల మీ అత్త మన ఇంటికి రాదు . ఆ కుటుంబం ఈ కుటుంబం ఎప్పటికీ కలవదు. కానీ కలసే మార్గం ఉంది అది నీ పెళ్లి , ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నీకేమో పెళ్లి అంటే ఇష్టం లేదు " అని ఏడవడం స్టార్ట్ చేస్తుంది ఊర్మిలాదేవి.
ప్రియా కొంచెం కన్ఫ్యూజ్ ఫేస్ పెడుతూ" నా పెళ్లి ...అంటే నాకు అర్థం కాలేదు కొంచెం వివరంగా చెప్తావా" అని అడుగుతుంది అమాయకంగా ఫేస్ పెట్టి.
" ఏమీ లేదే మీ అత్తకి ఒక కొడుకు ఉన్నాడు నిన్ను దాని కొడుకు ఇచ్చి పెళ్లి చేసి , తన కొడుకుని తన కుటుంబాన్ని అంతా ఇల్లరికం తెచ్చుకొని మన ఇంట్లో ఉంచుకుందాం అని మేము అనుకుంటున్నాము, ఆ రకంగా అయినా మీ అత్త మన దగ్గరికి శాశ్వతంగా వచ్చేస్తుంది అన్న చిన్న ఆశ, కానీ నువ్వు పెళ్లికి ఒప్పుకోవు కదా " అని అంటుంది ఊర్మిళాదేవి.
మళ్లీ ఊర్మిళాదేవి మాట్లాడుతూ" మీ నాన్న మీ అత్త కోసం ఎంత కాలంగా ఎదురు చూస్తున్నాడు , తన అక్క మన ఇంటిలో ఉంది పోవాలి అంటే ఈ పెళ్లి ఒకటే మార్గం. మీ నాన్న కోసం అయినా నువ్వు మనసు మార్చుకుంటావేమో అన్న చిన్న ఆశ, కానీ నువ్వు ఒప్పుకోవు కదా " అని ఎడవడం స్టార్ట్ చేసింది
" వా 😭... వా 😭... కృష్ణయ్య ఏమిటయ్యా నాకి పరీక్ష ఈ వయసులో, నా కూతురు జాడ తెలిసిన కూడా దాన్ని ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి , నా మనవరాలేమో ఈ పెళ్లికి ఒప్పుకోదు , నా కూతురిని ఇంటికి తెచ్చే మార్గమే లేదా వా😭.. వా 😭....."
ప్రియా ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి " అంటే ఇప్పుడు నా పెళ్లి వల్ల అత్త మన ఇంటికి వస్తుంది అంటావు అంతేనా" అని అడుగుతుంది .
ఊర్మిళాదేవి గారు వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంటూ " అవును తల్లి ...అవును ...అదొక్కటే మార్గం" అని అంటుంది.
ప్రియా తన తండ్రి వైపు చూస్తూ " ఒకవేళ నా ఈ పెళ్లి , నాన్న గారికి సంతోషం తెచ్చి పెడుతుంది అంటే కచ్చితంగా చేసుకుంటాను " అని అంటుంది.
ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు .
ప్రియా ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకుంటుంది అంటే వాళ్ళు నమ్మలేకపోయారు.
ఊర్మిళాదేవి మాత్రం సంతోష పడిపోతూ " నాకు తెలిసే నా బంగారు తల్లి , తన తండ్రి కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొంటుంది " అని అంటుంది.
సునంద గారు ఆశ్చర్యపోతూ " నువ్వు చెప్పేదంతా నిజమే కదా" అని అడుగుతారు.
ప్రియా కాన్ఫిడెన్స్ గా " నిజమే అమ్మ ఆ కృష్ణయ్య సాక్షిగా చెప్తున్నాను " అని అంటుంది.
తన దగ్గర ఆల్రెడీ వల అత్త ఫ్యామిలీ బయోడేటా ఉండడంతో, ఆ కాన్ఫిడెన్స్ తో అలా మాట ఇస్తుంది ప్రియా.
జగదీష్ చంద్ర వచ్చి ప్రియ నీ హగ్ చేసుకుంటూ "చాలా థ్యాంక్స్ తల్లి నువ్వు చెప్పిన ఈ ఒక్క మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, ఇక మా అక్క మాతో ఉండిపోతుంది ఈ పెళ్లి వల్ల. చాలా థాంక్స్ తల్లి " అని ప్రియ ని హగ్ చేసుకుని కొంచెం ఎమోషనల్ అవుతాడు.
ప్రియా తన నాన్నతో " మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను డాడీ " అని అంటుంది.
జగదీష్ చంద్ర ఆ మాటకి ఇంకా సంతోష పడిపోతాడు.
" నా బంగారు తల్లి" అని అంటూ ప్రియ నుదుటి పైన ముద్దు పెట్టుకుంటాడు.
ఊర్మిళా దేవి గారు సునంద వైపు చూసి చూసావా ఎలా ఒప్పించానో అన్నట్టు కళ్ళు ఎగరేస్తుంది .
సునంద 'మీరు గ్రేట్ అత్తయ్య 👌👏 ' అని సైగతో చెప్తుంది.
ఇదంతా కూడా ప్రియా ఊరకంట చూస్తూనే ఉంది.
ప్రియా ఊర్మిళాదేవి వైపు చూస్తూ" కానీ నానమ్మ నేను బావకి నచ్చకపోతే" అని అడుగుతుంది .
ఊర్మిళాదేవి " నిన్ను నచ్చని వాళ్ళ అంటూ ఉంటారా? ." అని నవ్వుతూ " నిన్ను చూశాక నువ్వు నచ్చలేదు అని వాడు అనగలడా ఛాన్సే లేదు తల్లి " అని అంటుంది.
" ఒకవేళ అంటే" అని అంటుంది ప్రియా .
" అనడు తల్లి నాకు తెలుసు కదా" అని అంటుంది ఊర్మిళాదేవి
" సరే నానమ్మ నేను అత్త కొడుకుని చేసుకుంటాకి ఒప్పుకుంటున్నాను, కానీ నాదొక కండిషన్ , నేను నచ్చలేదు అని బావ అంటే గనక నేను ఈ పెళ్లి చేసుకోను , అంతేకాదు ఇక పైన నా పెళ్లి ప్రస్తావన ఇంట్లో రావడానికి వీల్లేదు" అని అంటుంది ప్రియా.
ప్రియా పెట్టిన కండిషన్ కి ఊర్మిళాదేవి కొంచెం ఆలోచించి " సరే అయితే ఒకవేళ వాడికి నువ్వు నచ్చలేదు, ఈ పెళ్లి చేసుకోను అని అంటే కనుక , నేను ఎప్పుడూ కూడా నీ పెళ్లి టాపిక్ ఈ జన్మలో తీసుకురాను , సరేనా" అని అంటుంది .
" సరే నానమ్మ మీరు చెప్పినట్లుగానే ఈ పెళ్లి చేసుకుంటాను కానీ నా కండిషన్ మాత్రం మర్చిపోవద్దు, సరే అయితే నాకు నిద్ర వస్తుంది వెళ్లి పడుకుంటాను" అని పైకి వెళ్ళిపోతుంది ప్రియా.
........
కొనసాగుతుంది...
***
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.