ప్రియా ప్రేమ్ వైపు చూసి ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా" పొద్దునుంచి ఏమైనా తిన్నావా నువ్వు?" అని అడుగుతుంది.
ప్రేమ్ ప్రియా వైపే చూసి కళ్ళు ఎగరేస్తూ " ఏంటి బంగారం మన ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందో లేదో అప్పుడే నా గురించి కేర్ తీసుకోవడం మొదలు పెట్టావా గుడ్ గుడ్ ఐ లవ్ ఇట్" అని అంటాడు.
" నోరు మూసుకొని నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. పొద్దున్నే వచ్చారు కదా అత్తయ్య వాళ్ళ టిఫిన్ చేశారా లేదా" అని అడుగుతుంది.
" నోరు మూసుకుంటే సమాధానం ఎలా చెప్పను బంగారం" అని అంటాడు నవ్వుతూ ప్రేమ్.
ప్రియా అసహనంగా " ప్రేమ్..." అని కొంచెం గట్టిగా అంటుంది.
" సరే సరే కోప్పడకు .లేదు ఏమి తినలేదు పొద్దున్నే అమ్మ ఇక్కడికి హడావిడిగా రావాలి అనడంతో ఆ హడావిడిలో టిఫిన్ చేయలేదు. వదిన మాత్రం పాలు తాగింది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఫ్రూట్స్ పెట్టావు కదా అంతే " అని అంటాడు ప్రేమ్.
ప్రియా వెంటనే టైం చూసేపాటికి 9: 45 అవుతుంది. "అయ్యో 9: 45 అవుతుంది ఇంకా టిఫిన్ చేయలేదా" అని అంటూ ఊర్మిళాదేవి వైపు తిరిగి "నానమ్మ నీ కూతురుకి, అల్లుడికి మాటలతోనే ఆకలి తీర్చే లాగా ఉన్నావు , టైం చుసావా ఎంత అయిందో ఇప్పటివరకు కూడా ఎవరో టిఫిన్ చేయలేదు , పదండి ముందు అందరం టిఫిన్ చేద్దాం" అని అంటుంది.
ఊర్మిళాదేవి గారు వెంటనే "అయ్యో మాటల్లో పడి దాని సంగతే మర్చిపోయాను రండి టిఫిన్ చేద్దాం అందరూ" అని అందరిని డైనింగ్ ఏరియా వైపు తీసుకువెళ్తుంది.
శాస్త్రి గారు వద్దు అన్న బలవంతం చేస్తూ జగదీశ్ చంద్ర ఇంకా ఊర్మిళాదేవి ఆయన గారిని కూడా డైనింగ్ ఏరియా వైపు నడిపిస్తారు.
పెద్దవాళ్లు అందరూ ముందు వెళ్తుంటే చిన్నవాళ్ళు అందరూ కూడా వారి వెనకాల అనుసరించారు.
అందరూ వెళ్తుంటే ప్రియా ప్రేమ్ షార్ట్ పట్టుకొని వెనక్కి లాగుతుంది, ప్రియా అలా షార్ట్ పట్టుకొని వెనక్కి లాగడంతో, ప్రియా వైపు కొంటెగా చూస్తూ " ఏంటి బంగారం" అని అడుగుతాడు.
ప్రియా వెంటనే తన చున్నీతో ప్రేమ్ లిప్స్ మీద అన్న లిప్స్టిక్ మార్క్స్ తుడిచేస్తుంది . ప్రేమ్ కి దాని ఆపే ఛాన్స్ ఉండదు.
" ఏంటి బంగారం ఇలా చేశావు " అని బుంగమూతి పెట్టుకొని అడుగుతాడు.
" లేకపోతే ఇలా రోజంతా తిరుగుతూ ఉందామనుకుంటున్నావా " అని కోపంగా అడుగుతుంది ప్రియా.
" అది కాదు బంగారం ఇది మన ఫస్ట్ కిస్ దాని గుర్తుగా ఫోటో తీసుకుందాం అనుకున్నాను, ఫోటో తీసుకోకుండానే అలా చేరిపేసావ్ ఏంటి నువ్వు " అలిగినట్టుగా అడుగుతాడు .
"ఇంకోసారి ఫస్ట్ కిస్ గెస్ట్ కిస్ అన్నావ్ అనుకో మూతి పగలగొడతాను" అని కోపంగా అంటుంది ప్రియా.
వారి వెనకాలే మెల్లగా వస్తున్న అక్షయ ఇంకా ఆదిత్య వాళ్ల ఇద్దరి మాటలు విని " ఏంటే నా మరిది మూతి పగలగొడతావా, వాడికి ఇచ్చే ముద్దులు అన్ని ఇచ్చి ఇప్పుడు మూతి పగలగొడతాను అని అంటావా" అని అంటుంది అక్షయ.
ప్రియా వెంటనే "లేదు నేను వాడికి ముద్దు పెట్టలేదు" అని అంటుంది.
" నువ్వు ముద్దు పెట్టకుండానే ప్రేమ్ లిప్స్ మీద నీ లిప్స్టిక్ మార్క్స్ ఎలా వచ్చాయి , అందులోనూ నీ లిప్స్టిక్ షేడ్ కూడా తగ్గింది, ఆ మాత్రం తెలుసుకోలేము మేము" అని అంటుంది అక్షయ.
శైలు కూడా అక్షయ మాటలకు ఏకీభవిస్తూ " అవును మనం చూసాము కాబట్టి ఇప్పుడు ఆ లిప్స్టిక్ మార్క్స్ వల్ల వీళ్ళిద్దరూ ముద్దు పెట్టుకున్నారని తెలిసింది. ఏమో ఎవరికి తెలుసు మనకు తెలియకుండా ఎన్ని ముద్దులు పెట్టుకున్నారో ఎన్ని హాగ్ లు ఇచ్చుకున్నారు ఎవరికి తెలుసు" అని అంటుంది.
ఆ మాటలు వినగానే నితిన్ కి చాలా కోపం వస్తుంది వెంటనే ప్రేమ్ ని కొట్టడానికి అని ముందుకు వెళ్ళబోతుంటే ప్రియా మాటలు విని ఆగిపోతాడు.
శైలు మాటలకు ప్రియా వెంటనే " లేదు లేదు ఇదే మా ఫస్ట్ కిస్ ఇంతకుముందు మేము ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదు" అని వెంటనే చెప్తుంది.
’అంటే ప్రియా వీడు నిజంగానే ముద్దు పెట్టుకున్నారా వాడు ముద్దు పెడితే ప్రియా ఏమి అనలేదా , అంటే ప్రియా కి కూడా వీడు అంటే ఇష్టమేనా ' అని అనుకుంటాడు నితిన్, తన ప్రేమ గురించి ప్రియా కి మందుగా చెప్పి ఉంటే బాగుండేది అని బాధపడతాడు.
ప్రియా మాటలకి నిఖిల్ ,శైలు ,ఆదిత్య ఇంకా అక్షయ ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటారు. ప్రేమ్ పెదవులపై చిరునవ్వు.
అక్షయ తన నవ్వని ఆపుకుంటూ " అంటే మీ ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు అన్నమాట " అని అడుగుతుంది , తన చేతులు రెండు ఫోల్డ్ చేసుకుంటూ.
ప్రియా వెంటనే ప్రేమ్ వైపు చూపిస్తూ " లేదు వీడే ముద్దులు పెట్టాడు నేనేం పెట్టలేదు" అని అంటుంది.
ప్రియా ముద్దులు అని అనగానే అందరూ కొంచెం షాక్ అవుతారు , విల్ ఇద్దరు జస్ట్ ఒక ముద్దే పెట్టుకున్నారు అనుకున్నారు. ఇప్పుడు ప్రియ ముద్దులు అని అనే పాటకి వీరిద్దరూ కలిసి ఎని ముద్దులు పెట్టుకున్నారో అని వాళ్ళ నవ్వుకుంటూ ఉంటారు.
ప్రియా అలా ప్రేమ్ నీ పాయింట్ అవుట్ చేసేపాటికి "నేను మొద్దు పెడితే మరి నువ్వు ఎందుకు పెట్టించుకున్నావ్ , నన్ను తోసేయచ్చు కదా , అలా కాకుండా నేను ముద్దు పెట్టినంత సేపు కూడా నన్ను ఏమీ అనలేదు కదా , నా మెడ చుట్టూ చేతులేసి మరి నాకు కోపరేట్ చేశావు , ఆ లెక్కన చూస్తే నువ్వు కూడా నన్ను ముద్దు పెట్టుకున్నట్లే వస్తుంది తెలుసా" అని అంటారు.
ప్రియా వెంటనే "నువ్వు అలా నా ఫేస్ అంతా కిస్సెస్ పెట్టే సరికి నాకు ఏమీ అర్థం కాలేదు, అయినా.. అది నీ తప్పే నువ్వే పెట్టావు నేను పెట్టలేదు" అని ప్రేమ్ తో వాదిస్తుంది చుట్టూ ఎవరున్నారు అని చూసుకోకుండా .
వాళ్లు అలా ముద్దు గురించి ఫైట్ చేసుకుంటే ఫన్నీగా అనిపించింది అక్షయ, ఆదిత్య, శైలు ఇంకా నిఖిల్ కి.
నితిన్ కి మాత్రం చాలా కోపం వస్తుంది.
అరుణ్ మాత్రం ప్రియని అలా చూస్తూనే ఉన్నాడు ప్రియా అని ఇలా సరదాగా , అల్లరిగా, చిన్న పిల్లలాగా మాట్లాడడం చూసి చాలా సంవత్సరాలు అయింది, మళ్లీ తను తన పాత ప్రియ ణి చూస్తున్నట్లు అనిపించింది.
ప్రేమ్ కొంచెం కోపంగా "ముద్దు పెట్టిచ్చుకున్నప్పుడేమో బుజ్జి కుక్కపిల్ల లాగా బాగానే పెట్టించుకున్నావ్ ఇప్పుడేమో నామీద నెట్టేస్తున్నావా నువ్వు" అని అంటాడు.
ప్రేమ్ తనని బుజ్జి కుక్కపిల్ల అనగానే కోపం వచ్చిన ప్రియ " నన్ను బుజ్జి కుక్కపిల్ల అంటావా? నువ్వే పంది పిల్లవి. మొన్నటి వరకు బంగారం కింగారం అని, ఇప్పుడు నన్ను బుజ్జి కుక్కపిల్ల అని అంటావా" అని అరుస్తుంది.
ఊర్మిళాదేవి పిల్లలందరూ కూడా అక్కడే ఉండిపోయి ఏదో మాట్లాడుతున్నారు అని గమనించి "పిల్లలు టిఫిన్ చేయకుండా ఏంటి అక్కడ డిస్కషన్ ముందు వచ్చి టిఫిన్ చేయండి " అని అరుస్తుంది.
ప్రియా ప్రేమ్ వైపు కోపంగా చూసి "నన్ను కుక్కపిల్ల అని అంటావు కదూ ఈ విషయం మా డాడీకి చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను ఉండు" అని కోపంగా అని నేలని క్లీన్ చేస్తున్నా తన గాగ్ర ని కొంచెం పైకి చేతులతో పట్టుకొని గట్టిగ అడుగులు వేస్తూ డైనింగ్ ఏరియా వైపు వెళ్తుంది.
ప్రియా అలా లోపలికి వెళ్ళగానే అప్పటివరకు ఆపుకున్న నవ్వుని అందరూ స్వేచ్ఛ ఇస్తారు . ప్రేమ్ అయితే పొట్ట పట్టుకుని మరి నవ్వి " నిజంగా నా బుజ్జి కుక్క పిల్లవే నువ్వు" అని అంటాడు.
అక్షయ, శైలు, నిఖిల్ ముగ్గురు ప్రేమ్ వైపు చూసి ఒకేసారి థాంక్యూ చెప్తారు.
ఆదిత్య ఇంకా ప్రేమ్ కి వాళ్ళు ఎందుకు థాంక్స్ చెప్పారో అర్థం కాదు.
ముందుగా అక్షయ మాట్లాడుతూ " నా ప్రియా ని ఇలా చూసి చాలా సంవత్సరాలు అయింది తనలో ఈ చిలిపితనం ఈ అల్లరితనం ఇక పైన చూడలేము అని మేము అనుకున్నాము కానీ నీవల్ల మా పాత ప్రియ ని చూడగలుగుతున్నాము థాంక్యూ ప్రేమ్" అని అంటూ కళ్ళ నీరు పెట్టుకుంటుంది అక్షయ.
అక్షయ అలా కళ్ళ నీరు పెట్టుకోగానే ఆదిత్య వెంటనే తనని హగ్ చేసుకుంటూ " ఏంటిది ? అలా ఎవరైనా ఏడుస్తారా నీ ప్రియ నీ ఇంతకు మందులాగా చేసి నీకు ఇచ్చే బాధ్యత నా తమ్ముడిది ఓకేనా" అని అంటారు .
ప్రేమ్ కూడా " వదిన ఏంటిది? ప్లీజ్ ఏడవకండి" అని అంటాడు .
నిఖిల్ మాట్లాడుతూ" నిజంగా ప్రేమ్ మా పాత ప్రియ నీ మేము ఇకపై చూడలేము అని అనుకున్నాను . తను ఇంతకుముందు ఇలాగే అల్లరి చేస్తూ మా అందరితో సరదాగా ఉండేది . నాలుగు సంవత్సరాల క్రితం తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తన ఆనందం అంతా కూడా దూరమైపోయింది , ఇకపైన తనని మళ్లీ పాత ప్రియ లాగా చూడలేము అని అనుకున్నాను కానీ నీ వల్లే సాధ్యమైంది థాంక్యూ" అని అంటాడు.
" తను ఇంతకుముందు ఎలా ఉందో నాకు తెలియదు కానీ తాను ఇప్పుడు ఉన్నట్లుగా ఎప్పుడు ఉండేలాగా నేను చూస్తాను ఇది నా ప్రామిస్" అని అంటాడు ప్రేమ్.
ఇంతలో ఊర్మిళాదేవి పిలుపులు మళ్లీ వినిపించడంతో " పదండి లోపలికి అమ్మమ్మ పిలుస్తుంది" అని అందరిని లోపలికి తీసుకువెళ్తాడు.
అరుణ్ కూడా ప్రేమ్ వైపు చూసి థాంక్స్ అన్నట్లు చిన్నగా చెప్తాడు. ప్రేమ్ ఒక చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్తాడు.
ప్రియా కోపంగా లోపలికి రావడం చేసిన జగదీష్ చంద్ర " ఏమైంది తల్లి కోపంగా ఉన్నట్లు ఉన్నావు" అని అడుగుతాడు.
ప్రియా కోపంతో కాళ్లు నేలకేసి కొడుతూ " డాడీ నేను వాడిని పెళ్లి చేసుకోను" అని అంటుంది.
జగదీష్ చంద్ర , ప్రియా మాటలకు కొంచెం కంగారుపడుతూ " ఏమైంది తల్లి " అని అడుగుతాడు.
ప్రియా కొంచెం కోపంగా " వాడు నన్ను బుజ్జి కుక్కపిల్ల అని తిడుతున్నాడు, వాడు నాకు వద్దు" అని చిన్నపిల్లల అంటుంది .
ప్రియా పెళ్లి వద్దు అనడానికి చెప్పిన రీజన్ విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటారు.
జగదీశ్ చంద్ర ఇంకేం జరిగిందో అని భయపడతాడు కానీ ప్రియా చెప్పిన రీజన్ కి ఊపిరి పీల్చుకుంటాడు.
గుర్దీప్ మాట్లాడుతూ " నిన్ను అంత మాట అన్నాడా వాడు? వాడు రాని వాడికి బుద్ధి చెప్తాను " అని అంటాడు.
ప్రియా వెంటనే ఊర్మిళాదేవి గారి చేతి కర్ర తీసుకొని గుర్దీప్ గారికి ఇస్తూ "ఇదిగోండి మావయ్య దీంతో కొట్టండి వాడిని" అని అంటుంది.
గుర్దీప్ దాన్ని తీసుకుంటూ "తప్పకుండా తల్లి నీ ముందే వారిని కొడతాను చూడు" అని అంటాడు.
సునంద నవ్వుకుంటూ " చాల్లే కాబోయే మొగుడిని కొట్టిస్తావంట వచ్చి కూర్చో టిఫిన్ చేదువు గాని" అని అంటుంది.
ప్రియా వాళ్ళ అమ్మ వైపు కోపంగా చూస్తూ వెళ్లి చైర్ లో కూర్చుంటూ "మమ్మీ నువ్వేంటి వాడికి సపోర్ట్ ఇస్తున్నావు వాడు నీ కూతుర్ని కుక్కపిల్ల అని తిట్టాడు" అని అంటుంది.
గాయత్రి గారు ప్రియా కి సపోర్ట్ చేస్తూ " నువ్వు కూర్చో బంగారం వాడు వచ్చాక నేను వాడికి రెండు ఇస్తాలే "అని అంటుంది.
ఇంతలో లోపలికి వచ్చిన ప్రేమ్ మాట్లాడుతూ "ఎవరికి మమ్మీ ఇచ్చేది" అని అడుగుతాడు.
గుర్దీప్ ప్రియా ఇచ్చిన కర్రతో ఫ్రేమ్ ని ఒకటి ఇస్తూ "ఏరా నా కోడల్ని ఏదో అన్నావంట " అని అంటాడు .
" అబ్బా... డాడీ ఏంటి ఇలా కొడుతున్నావు" అని అంటూ దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటాడు.
గాయత్రి గారు కూడా ప్రేమ్ చెవులు మెలిపెడుతూ "సారీ చెప్పు ముందు దానికి" అని అంటుంది.
" అబ్బా మమ్మీ వదులు నొప్పి పెడుతుంది " అని ప్రేమ్ అరుస్తూ ఉంటాడు.
ప్రియా మాత్రం ప్రేమ్ అలా తన్నులు తినడం చూసి ఎంజాయ్ చేస్తుంది.
ఊర్మిళాదేవి గారు ప్రేమ్ కి సపోర్ట్ చేస్తూ " ఏంటే నా మనవడి చెవులు అలా మెలిపెడుతున్నవ్ ముందు వదులు నా మనవడిని " అని గాయత్రి గారిని అంటారు.
"ఇదిగో" అని ప్రియ వైపు వేలు చూపిస్తూ "ఇదే ఏదో చేసి ఉంటుంది అందుకే వాడు అలా అని ఉంటాడు అని అంటుంది .
వాళ్ళ నాన్నమ్మ ప్రేమ్ కి సపోర్ట్ చేస్తుంటే కోపం వచ్చిన ప్రియా " నానమ్మ నాకు సపోర్ట్ ఇవ్వకుండా వారికి సపోర్ట్ ఇస్తావ్ ఏంటి నువ్వు" అని అరుస్తుంది.
" అసలు మీ ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చిందో అది చెప్పండి ముందు" అని అడుగుతుంది ఊర్మిళాదేవి.
" ఆ ...ఏముంది ముద్దుల గురించి " అని నవ్వుతూ అంటూ అక్షయ కూర్చోడానికి చైర్ లాగుతాడు ఆదిత్య.
అక్కడున్న వాళ్ళందరూ "ముద్దుల ?" అని నోరు తెరవగానే. అదే సమయానికి నీళ్లు తాగుతున్న ప్రియా కి పొలమారుతుంది.
గట్టిగా పొలమారడంతో ప్రియా గట్టిగా దగ్గడంతో అందరూ కంగారుపడి ప్రియా దగ్గరికి వెళ్తారు తనకి ఎలా ఉందో అని .
ప్రియా తనకు తాను సమాలించుకొని "అయామ్ ఓకే" అని అంటుంది .
జగదీష్ చంద్ర ఇంకా గుర్దీప్ "జాగ్రత్త తల్లి" అని ప్రేమగా అంటారు.
ప్రియా వెంటనే " నేను బాగానే ఉన్నాను , కమాన్ ఫస్ట్ అందరూ ఫాస్ట్గా టిఫిన్ చెయ్యండి, గెస్ట్ వచ్చే టైం అయ్యింది" అని హడావిడి చేస్తుంది టాపిక్ డైవర్ట్ చేయడానికి .
నిజంగానే గెస్ట్లు వచ్చే టైం అవ్వడంతో అందరూ ఎవరి ప్లేస్ లో వాళ్ల సెటిల్ అయ్యి టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తారు .
ప్రియ కి అటువైపు నితిన్ ఇటు వైపు ప్రేమ్ కూర్చుంటారు.
ప్రేమ్ ప్రియా వైపు చూసి తనకు వినిపించేలాగా "నన్ను మా మమ్మీ డాడీ దగ్గర ఇరికిస్తావు కాదు నీ పని తర్వాత చెప్తాను " అని అంటాడు.
"తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం గాని ముందు టిఫిన్ చెయ్ " అని అంటూ తనకి ఇష్టమైన తన ఫేవరెట్ నెయ్యితో వేసిన మసాలా దోశ తన ప్లేట్లో పెట్టుకుని ఆస్వాదిస్తూ తినటం మొదలుపెట్టింది.
ప్రేమ్ కూడా తన ప్లేట్లో మసాలా దోశ పెట్టుకోబోతుంటే అది గమనించి అతనిని ఆపి "ఇది స్పైసీగా ఉంది , గారెలు తిను" అని అంటు ప్రేమ్ ప్లేట్ లో గారెలు ఇంకా ఇడ్లీ వడ్డించి చట్నీ ఇంకా సాంబార్ బౌల్లో పోసి ఇస్తుంది.
ప్రేమ్ ఏమి మాట్లాడకుండా ప్రియా పెట్టింది తింటూ ఉన్నాడు.
ప్రియా అలా ప్రేమ్ కి స్వయంగా వడ్డించడం ఇది తిను అది తిను అని ప్రేమ్ కి పెడుతుంటే నితిన్ కి నచ్చడం లేదు.
ప్రియ అలా ప్రేమ్ కి వడ్డిస్తుంటే , వాళ్లని అలా చుసిన అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది.
ప్రియా తను తింటూ ప్రేమ్ కి ఏమి కావాలో అందిస్తూ చక్కగా తన ఫేవరెట్ అయిన మసాలా దోశలు మూడు లాగించింది.
నితిన్ సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదని గమనిస్తూనే ఉంది ప్రియా.
నితిన్ వైపూ తిరిగి " ఏంటి సరిగ్గా తినట్లేదు బ్రేక్ ఫాస్ట్ నచ్చలేదా" అని అడుగుతుంది.
" ఆకలిగా లేదు" అనీ ముభావంగా చెప్తాడు నితిన్.
'వీడు నేను పొద్దున అలా కొట్టినందుకు బాగా ఫీల్ అయినట్లు ఉన్నాడు' అని అనుకుంటుంది తన మనసులో.
అందరూ బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత పెద్దవారు అందరూ కూడా ఎంగేజ్మెంట్ కి కావాల్సిన వాటికోసం ఏమేమి కావాలో అని చూసుకుంటూ బిజీ అయిపోతే పిల్లలు అందరు కూడా హాల్లో సెటిల్ అయ్యారు. అందరూ సరదాగా మాట్లాడుతుంటే నితిన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుని ఉంటాడు.
ప్రియా మాత్రం కిచెన్ లో ఏదో తయారు చేయడానికి వెళుతుంది.
" నా బంగారం కిచెన్లో ఏం చేయడానికి వెళ్ళింది వదిన" అని అక్షయ అని అడుగుతాడు ప్రేమ్.
"అక్షయ ప్రెగ్నెంట్ కదా అక్షయ కోసం ఏమైనా చేయడానికి వెళ్లి ఉంటుంది " అని అంటుంది శైలు.
అక్షయ కూడా అవును అన్నట్లు తలకాయ ఊపుతుంది.
" నా బంగారానికి నీ మీద కేరింగ్ ఎక్కువ కద వదిన" అని అడుగుతాడు ప్రేమ్.
" అవును తను అందరి గురించి కేర్ ఎక్కువగానే తీసుకుంటుంది తన అనుకున్న వాళ్ళ గురించి కొంచెం కేరింగ్ తనకి ఎక్కువే, ఎవరిని పట్టించుకోనట్టే ఉంటుంది కానీ అని గమనిస్తుంది " అని అంటుంది అక్షయ
కొంచెం సేపటి తర్వాత చేతిలో ట్రై లో రెండు గ్లాసుల బనానా స్మూతీ తీసుకొని వస్తుంది.
ప్రియ రెండో గ్లాస్ తీసుకురావడం చూసిన ప్రేమ్ "నా బంగారం నాకోసం కూడా చేసినట్లుంది, చూశారా నా బంగారానికి నేను అంటే ఎంత ఇష్టమో " అని అంటూ ఎక్సైట్ అవుతాడు.
" అంతగా ఎక్సైట్ అవకు , ఆది నీకు కాదేమో" అని అంటాడు ఆదిత్య.
ప్రేమ్ ఆదిత్య వైపు చూసి" నీకు చేయలేదు అని కుళ్ళుర నీకు , చూసుకో ఆది నా కోసమే అయ్యుంటుంది " అని అంటాడు .
" సరే చూద్దాం " అని అంటాడు ఆదిత్య.
ఇంతలో ప్రియ ఒక గ్లాస్ తీసుకెళ్లి అక్షయ కి ఇస్తుంది.
ఇంకొక గ్లాస్ ప్రేమ్ తీసుకోబోతుంటే " ఇది నీకు కాదు" అని అంటుంది.
ప్రియ అలా అనేసరికి ఆదిత్య ప్రేమ్ వైపు చూసి నవ్వుతాడు.
ఆ గ్లాస్ నేరుగా వెళ్లి నితిన్ ముందు పెడుతుంది.
నితిన్ ఆ గ్లాస్ వైపు చూసి " నాకు వద్దు" అని అంటాడు.
ప్రేమ్ ఆ గ్లాస్ ని అందుకుంటాకి ట్రై చేస్తూ "వాడు వద్దు అంటున్నాడు కదా నాకు ఇవ్వచ్చు కదా " అని అంటాడు.
ప్రియా గ్లాస్ అందుకుంటాకి ట్రై చేస్తున ప్రేమ్ చేతి మీద ఒకటి ఇచ్చి . ప్రేమ్ వైపు ఒకసారి కోపంగా చూసి నితిన్ వైపు తిరిగి " నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు ముందు ఈ గ్లాస్ తీసుకుంటావా రెండు వేయమంటావా " అని కోపంగా అంటుంది.
నితిన్ ప్రేమ్ వైపు చూసి సైడ్ స్మైల్ ఇస్తాడు .
నితిన్ కావాలని బుంగమూతి పెడుతూ " నాకు వద్దు" అని అలిగినట్టు అంటాడు.
నితిన్ చేస్తున్న యాక్షన్ కి ప్రేమ్ కి కోపం వస్తుంది 'వీడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు' అని అనుకుంటాడు తన మనసులో
నితిన్ నీ చూస్తుంటే ప్రేమ్ కి కోపం వస్తుంది .
ప్రియ ఆ గ్లాస్ నితిన్ నోటికి అందిస్తూ " తాగు" అని తనే నితిన్ కి తగ్గిస్తుంది .
ప్రియా తగ్గిస్తూ ఉంటే నితిన్ అది తాగుతూ ప్రేమ్ వైపు చూస్తాడు. ప్రేమ్ కి ప్రియ అలా నితిన్ కి తగిస్తుంటే చాలా కోపం వస్తుంది.
ఆదిత్య పకనుంచి " ఏదో కళ్ళుతున వాసన వస్తోంది ఏంటీ? " అని అంటాడు
ప్రేమ్ కి కోపం వచి " వాడేమీ చిన్న పిల్లలు కాదు వాడు తాగుతాడు కదా , నువు తగిచల్ల " అని అంటాడు .
ప్రియ ప్రేమ్ నీ పట్టించుకోకుండా నితిన్ కి తగ్గిస్తుంది.
"ప్రియ .." అని ప్రేమ్ గట్టిగా అరుస్తాడు.
కొనసాగుతుంది....
****
ప్రియా అలా నితిన్ కి క్లోజ్ గా ఉంటే ప్రేమ్ ఏం చేస్తాడు? , వీళ్ళ ఇద్దరి మధ్య నితిన్ గొడవలు పెట్టగలుగుతాడా? నితిన్ వీళ్ళ ఇద్దరిని విడదీయ గాలుగుతాడా? మీరేమనుకుంటున్నారు?
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు