pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 16

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 16

ప్రభ    వెనదిరిగి రెండు అడుగులు వేయగా అక్కడ సొమ్మసిల్లి  పడి ఉన్న నడి వయస్సు  వ్యక్తి ముఖం మీద నీళ్లు చెల్లి లేపే సరికి అతను చేతులెక్కి మొక్కుతూ "తను వైజాగ్ వెళ్లాలని చెప్పడంతో వైజాగ్ బస్సు వచ్చేసరికి ఎక్కించి వైన్ షాప్ కెళ్ళి మరొక బాటిల్ కొనుక్కొని బండి దగ్గరకు వస్తే పంచరై ఉండడం చూసి షాప్ కి వెళ్తే అక్కడ  చాలా బండ్లు ఉండడంతో లేట్ అవుతుందని చెప్పగా బండిని అక్కడే వదిలి పప్పు ఎలాగూ ఇక్కడికి వస్తూ ఉంటాడు కాబట్టి తీసుకొస్తాడు అని అనుకుని వాళ్లతో అదే మాట చెప్పి  అక్కడి నుంచి కొంచెం దూరం నడిచేసరికి ఒక మెడికల్ షాప్ దగ్గర  వెళ్లడానికి రెడీగా ఉన్న ఆటోలో ఎక్కాడు ప్రభ .

 ఆటోలో  ఎక్కి కూర్చోబోతుంటే ఆకుపచ్చని డ్రెస్  వేసుకున్న ఒక అమ్మాయి అటువైపు తిరిగి కూర్చుని  ఉంది.

 మేడం!  మేడం ! అని రెండుసార్లు పిలిచిన తర్వాత ఆ అమ్మాయి ఇటు తిరిగి చూసేసరికి  ఓ!  అని ప్రభ కూర్చోవాలా వద్దా అని ఆలోచిస్తుండగా ఆటో వాలా బ్రదర్ ఎందుకు ఆలోచిస్తున్నారు కూర్చోండి అనడంతో తలెత్తి చూసిన గీతిక ఇదేంటి ఇతను నేను ఆటో ఎక్కడ చూసాడా అందుకే ఆటోలోనే వస్తున్నాడా పోనీ నేనే ఆటో దిగి వెళ్ళిపోనా అని అనుకున్న ఇంతలో వెనక వెహే కలుస్తూ ఉండడంతో ప్రవహింపమని మాట డ్రైవర్  చెప్పేసరికి ఎక్కి కూర్చుంటాడు ప్రభ.
అంతలో గీతిక ఆటో అన్నా ఆటో  ఆపండి అని 
అడుగుతున్నా   ఆటో డ్రైవర్ FM లో పాటలు వింటూ ఆ మాట వినిపించకపోవడంతో అతను స్టార్ట్ చేసి వెళుతున్నాడు.  ప్రభ, గీతిక నేను కూర్చున్నానని ఫీల్ అవుతూ ఉందేమో ఆరోజు థాంక్స్ అన్నగారు ఒక్క మాట తప్ప ఇప్పటివరకు నమ్మకాన్ని కూడా చూడలేదు ఇప్పుడు ఇంత దగ్గరగా నేను ఇచ్చినట్టునే నువ్వు ఎందుకు ఎక్కావు అన్నట్టు ప్రశ్నిస్తూ ఉన్నాయి. నేను కూర్చోవాలి కానీ తన ఓణీ కోన అంచు సీటు మీద పడి ఉంది దాని తీసుకోమని ఎలా చెప్పాలి అనుకుంటూ వోనీ వైపు చూస్తూ ఉంటే అర్థం చేసుకున్న గీతిక వోనీని పక్కకు  తీసుకుంటూ ఇంత కష్టపడకపోతే డ్రైవర్ పక్కన కూర్చోవచ్చు కదా అని పైకి అన్నది గీతిక .అది ఆటో డ్రైవర్ విన్నాడో ఏమో కానీ సిస్టర్ నా సీటు పక్కన ఇంకా పెట్టెను ఉంచలేదు ఇది కేవలం సింగల్ సీటు మాత్రమే అని చెప్పేసరికి నేను ఆపమున్నప్పుడు మాత్రం చెవి వినపడలేదు కానీ ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి అంటూ ప్రకృతి కనిపించేలా ఆటో సీటుకి చివరికి జరిగి కూర్చుంటుంది. అది చూసినప్పుడు లేదు ఒక్కొక్క మాట ఆణిముత్యం లా బయటికి వస్తున్నాయి అంటే నేను సందర్భాన్ని అప్పుడు అలా ఎదురుపడటం మంచిది అనుకుంటా మాటల మంత్రం బంధాన్ని బలం చేస్తుందేమో అని మనసులో అనుకుని ఆకాశం వైపు చూస్తే నీలాకాశం కాస్త  నల్ల మబ్బులతో నిండి ఉరుములు మొదలవడంతో జడుసుకుని కొంచెం సీటు మధ్యకి జరిగింది గీతిక.

   అంతలో  మెరుపు కూడా మెరవడంతో,  గీతిక కళ్ళలో కాస్త భయం అని కనిపించేసరికి "గీతిక    అటు పక్కన కట్టిన దారం విప్పు  క్లాత్ అడ్డం పడుతుంది లైటింగ్ పడదు" అని ప్రభ చెప్పాలని అనుకుంటే డ్రైవర్ కల్పించుకుని " సిస్టర్ ఆటోను  నిలబెట్టడానికి మనం దాదాపు స్ట్రీట్ కి దగ్గరగా వచ్చాము కాబట్టి ఆ తెరకు కట్టిన దారాన్ని విప్పి   కాస్త ఆ తెరనుందించండి" అని డ్రైవర్ చెప్పడంతో ప్రయత్నించిన గీతికకి అది రాకపోగా అన్నా ఆ దారం బాగా గంటుపడినట్టుంది అది విప్పడానికి రావట్లేదు అని గీతిక  చెబుతూ తనకల్లు ప్రభ వైపు చూసేసరికి   ప్రభుకి నేను ఆధారం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా భయ్యా మీరైనా విప్పండి పాపం సిస్టర్ తడిసిపోతారేమో  "అని డ్రైవర్ చెప్పడంతో   
 ప్రభ  కూర్చున్న చోటు నుంచి కొంచెం వంగి దారాన్ని విప్పడానికి చేతులు  చాచడంతో  వెంటనే గీతిక కాస్త వెనక్కి జరిగి సీటుకి అతుక్కున్నట్లు కూర్చునేసరికి ఆమెను చూసి చిరునవ్వు నవ్వి దారం విప్పుతుంటే సీటుకు అతుక్కుపోయినట్టున్న గీతికకు ప్రభ గాలి ఎక్కువ  వీస్తున్నందుకు తన చెవికి కట్టిన కర్చీఫ్ ఆమె ముఖాన్ని అక్కడక్కడ తాకుతూ ఉంటే గిలిగింతలు పెట్టినట్టుగా ఏదో తెలియని తీపి స్పర్శలా అనిపిస్తుంటే  అది చూడకనే చూసాడు ప్రభ అయినా ఆలస్యం చేయకుండా దారం విప్పి వెనక్కి  మెల్లమెల్లగా జరుగుతూ గీతిక వైపు చూస్తుంటే అంతసేపు తీపి అనుభూతిని పొందిన గీతిక వెంటనే ఆ అనుభూతి నుంచి బయటికి వచ్చి సరిగ్గా కూర్చుంది . పర్లేదు ఆటోలో రైన్లో జర్నీ   బాగానే  ఉంది అని తను చిరునవ్వు నవ్వుకుంటూ  అలా ఉరుములు మెరుపులు వస్తూ వర్షం మాత్రం  ఏదో అక్కడక్కడ తుంపర్లు   పడుతూ మేఘాలు గాలికి ఎటో వెళ్లి ఎక్కడో వర్షం పడుతున్నందుకు మట్టి వాసన మాత్రం చాలా బాగా వస్తుంది ఆ మట్టి వాసన పీల్చుకుంటూ ప్రభా  తన చేతిలోని కవర్ని జార విడచడంతో గీతిక ఒళ్ళో పడింది.సారీ ! అంటూ అది ఇవ్వమనట్టు ముఖం పెట్టిన ప్రభని  కోపంగా చూసింది గీతిక. ప్లీజ్ ఆ కవర్ ఇటివ్వవా ? అది చాలా ఇంపార్టెంట్ అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా ప్రభ.
సరేలే, ఇతనితో నాకేంటి అతని వస్తువు నాకు అవసరం లేదు అని అనుకొని ప్రభాకీ ఇవ్వబోతుండగా అది కాస్త ఓపెన్ అవడంతో బాటిల్ ని చూసి ఆశ్చర్యపోయింది గీతిక . వెంటనే అతని చేతికి ఇవ్వకుండా సీటు మధ్యలో పెట్టి నీలో ఈ  కోణం కూడా ఉందా?  అన్నట్టు ప్రభ ని  చూడడంతో ప్రభ ముఖం చిన్న బోయినట్లు అవ్వగా  వెంటనే చూపు తిప్పుకుంది గీతిక.

 సార్,  మేడం మీ వీధి దగ్గర ఉన్నాం దిగండి అని ఆటో డ్రైవర్ చెప్పేంతవరకు ఇద్దరికీ వాళ్లు ఎక్కడ దిగాలి అన్న విషయం కూడా మర్చిపోయారు.  ప్రభ దిగుతూనే పరిగెత్తుకొచ్చాడు శైలజ భర్త.  ప్రభ చేతిలోనే కవర్ తీసుకొని అపార్ట్మెంట్ వైపు వెళుతుంటే ఆటో దిగిన గీతిక అది చూసి ఆశ్చర్యపోయింది. అయినా ఇవన్నీ నాకెందుకులే అనుకుని ఇంటి ముఖం పుట్టింది గీతికఆటో డబ్బులు ఇచ్చి వెలుతూ ఉన్న ప్రభాకి కాస్త మనసు బేజారయింది. నేనెంత జాగ్రత్త పడినా "కానున్నది కాక మానదు " అన్నట్టు పోయి పోయి ఆ శైలు భర్త  గీతిక ముందా బాటిల్ తీసుకునేది . తను నన్ను ఏమనుకుంటుంది.  ముందే తన స్నేహితురాలు ఊరికి వెళ్ళింది.  ఆమె లేనప్పుడు నేను ఇలాంటి వ్యవహారాలు జరిపిస్తానని అనుకోదా, "  ఒరేయ్!  నీకెంత తాగే వ్యామోహం ఉంటే నన్ను ఇలా ఇరికిస్తావారా ముందే తను అంతంత మాత్రం నాతో మాట్లాడుతుంది ఇక అసలు ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అని అనుకొని గుండెల్లో దడ పుట్టించావు కదరా ఛి వెధవ  "అనుకొని గది కి వెళ్ళాడు ప్రభ.

  ప్రభ రూమ్ కి వెళ్ళగానే   ప్రభ ఏంటి అలా డల్ గా ఉన్నావ్?  అడిగాడు పప్పు.

 ఏం లేదు లేరా.

 లేదు. నువ్వు చాలా డల్ గా కనిపిస్తున్నావు  ఏం జరిగింది?

 పై రూమ్లో ఉన్న శైలు హస్బెండ్ ఉన్నాడుగా వాడు ఎదురు తగిలాడులే రెండు వేల బొక్క నాకు. వేస్ట్ ఫెలో ఏ టైం లో వచ్చాడో ఏమో అని తిట్టుకుంటూ విషయం చెప్పాడు ప్రభ.

 అయితే బాటిల్ యుద్ధం చేసి బాగా అలసిపోయావు ముందు ఫ్రెష్ అయిరా మంచి టీ ఇస్తాను. అని   స్ట్రాంగ్ టీ చేసి ఇచ్చి ముందు కాసేపు రెస్ట్ తీసుకో నేను పని చూసుకుని వస్తానని కిందికి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు పప్పు.

 రెస్ట్ కోసమని పడుకున్న ప్రభాకి కళ్ళు మూసినా కళ్ళల్లో గీతికే మెదులుతోంది.  రెండు చేతుల్ని తల కింద పెట్టి  కాలి  మీద కాలు వేసి కుడి కాలు  ఊగిస్తూ  " గీతికా! ఎంతైనా నీతో కాసేపు జర్నీ అయినా చాలా హ్యాపీ అనిపించింది . నువ్వు మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుంది.మరి జీవితాంతం నీ తో జర్నీ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానని నాకు నమ్మకం ఉంది.    నిజంగా చెప్పాలంటే నీ స్నేహితురాలి భర్త నాకు మంచే చేశాడు పోతే 2000 పోయింది కానీ నీతో బ్యూటిఫుల్ జర్నీ లభించింది అంతే చాలు అనుకొని కళ్ళు మూసుకున్నాడు ప్రభ.

 ఆటో దిగి ఇంటికి వచ్చి తాతయ్య!  ఈరోజు  ఎన్ని మెడికల్ షాప్స్ లో అడిగిన నీ టాబ్లెట్ దొరకలేదు తెలుసా ! ఎంత దూరం వెళ్లానో అంది గీతిక.

 మరొక రోజు కదమ్మా మళ్లీ రిస్క్ ఎందుకు తీసుకున్నావు? 

 నీకు ఆ టాబ్లెట్స్ తీసుకోకపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకే వెళ్లాను.  అని తాతయ్యకి టాబ్లెట్స్ ఇచ్చి జేజి వంట రూమ్ లో లేకపోవడంతో నీళ్లు తాగి రూమ్ కి వెళ్ళింది గీతిక.   తాతయ్యకి టాబ్లెట్ తెచ్చిన కవర్ తో పాటు పండ్లు తెచ్చిన బ్యాగ్  లోని పండ్లుతీసి పెడదామని అనుకుంటూ  బ్యాగ్ లో  చెయ్యి పెట్టగా కర్చీఫ్  కనిపించడంతో  ఇది నాది కాదే అనుకొని తీసి చూస్తే ఆటోలో ప్రభ చెవికి కట్టిందని గుర్తుకు రావడంతో చి ! వీడేంటి నా బ్యాగ్ లో వేశాడు అంటూ పక్కకు పడేసి  ఏదో నా తమ్ముడిని వెతికి తెచ్చాడని ఒక్క థ్యాంక్స్  చెబితే ఎక్కడికెళ్తే అక్కడే తారసపడతాడా. నేను మాట్లాడకూడదనుకున్నాను,   కానీ మాట్లాడేలా చేశాడు ఇకనుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ అమ్మో !  వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం.  నాకు ఆఫీస్ పని పెండింగ్ ఉంది ట్రైనింగ్ వేరే ఉంది కాబట్టి ఆ వర్క్ చూద్దాం అని చెప్పి లాప్టాప్ ముందర వేసుకొని కూర్చుని పని చేయసాగింది గీతిక