pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 24

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 24

శ్రీహరి నుండి రక్షించిన ప్రభ గీతికతో బండి యొక్క మంట ఎక్కనని తల తిప్పుతూ ఉండగా
ఒక్క క్షణం ప్రభ ఏమి మాట్లాడక ఆమె వైపే చూస్తూ  "ఏంటి రావా ఇక్కడే చావాలని ఉందా?" అన్నాడు.

 అవును, చచ్చిపోతే బాగుండేది అంది అరుస్తూ గీతిక.

 హలో ! చచ్చిపోయి ఉంటే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అంజలి ఘటించి , మూడు దోసెళ్ల మట్టి వేసి కప్పేసే వాళ్ళు . కానీ జరగరానిదేదైనా జరిగి ఉంటే జీవితాంతం చస్తూ బతకాల్సి వచ్చేది అది అర్థం చేసుకో. " ఆనాడు ప్రభ. 

 నేను అర్థం చేసుకోను.  ఈ భూమి మీద అందరూ మోసగాళ్లే ! ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు నన్ను వదిలేయ్ నేనే వెళ్తాను.

 అరే! ఇలాంటి పరిస్థితిలో కూడా ఇలా మాట్లాడతావేంటి? ముందు బండి ఎక్కు అంటూ బండిమీద కూర్చోగా ఆమె ఎక్కకుండా మెల్లగా అడుగులు వేస్తూ మరోవైపుకు వెళుతున్న గీతికను చూసి నీకు ఇష్టం వచ్చినట్టు చావు.' అనుకొని భూమి మీద అందరూ మోసగాళ్లేనంట మోసగాళ్ళు అంటూ బండిని స్టార్ట్ చేసి అద్దంలో చూడగా శ్రీహరి ఇనుపరాడ్  ని గీతికపై విసరాడానికి ప్రయత్నించడం చూసిన ప్రభ "గీతిక !  కూర్చో అని గట్టిగా అరిచి బండిని తిప్పి వెనక నుండి వెళ్లి చక్రాన్ని శ్రీహరికి ఢీకొట్టగా శ్రీహరి విసిరిన రాడ్ గురి తప్పగా, అతను కన్స్ట్రక్షన్ కోసం ట్రాన్స్ఫార్మర్ నుండి కనెక్ట్ చేసిన వైరు వంగి ఉండడంతో వాళ్లు పీస్ జాయింట్ చేసిన ప్లేస్ లో పడగానే వైర్ కట్ అయ్యి కరెంట్ షాక్ తగిలి శరీరం మడత పెట్టినట్లయితే అక్కడికక్కడే మరణించాడు శ్రీహరి.

 అంత ఆవేశంతో శ్రీహరిని చంపిన ప్రభ ని చూడాలంటే నే భయం అనిపిస్తుంది గీతికకి.

అటునుండి బండిని తిప్పుతూ ఈసారి గీతిక వైపుకు రాకుండా బండిని ముందుకు పోనిస్తూ ఉండగా వెనుక  వస్తున్న గీతికని చూసి వెనక్కి వచ్చాడు ప్రభ.  గీతిక కూర్చోగానే బండిని వేగంగా పోనిస్తూ ఉంటే స్కూటీ అడ్డం పడి ఉండడంతో కొంచెం బైకును కాస్త స్లో చేయగా ఎవరిది స్కూటీ?   యాక్సిడెంట్ అయినట్లుంది అన్నాడు ప్రభ .

అది విన్న గీతిక అటువైపు చూడడంతో స్కూటీని చూసి గుర్తుపట్టి  "ఇది మాలతీ స్కూటీ కదా " ఎందుకు ఇక్కడ పడి ఉంది అనుకొని చుట్టూ చూస్తుండడం గమనించిన ప్రభా " ఏంటి !నీకు స్కూటీ ఎవరిదో తెలిసినట్టుగా అటు ఇటు చూస్తున్నావు అడిగాడు". గీతిక ఊ అని ఒకసారి ఊహు  అని ఒకసారి  తల తిప్పడంతో , "నువ్వు నాకెప్పటికీ అర్థం కావులే. ఎవరు పోతే  నాకేంటి సరిగ్గా కూర్చో అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా   బైకు లైట్ కి రోడ్డు పక్కన ఏదో మెరిసినట్లు అనిపించడంతో బైకులైట్ ని అటువైపు తిప్పగా ఎవరో అమ్మాయి పడి ఉన్నట్లు అనిపించడంతో ఎవరో పాపం యాక్సిడెంట్ జరిగినట్టుంది .అమ్మాయి బతికి ఉందో,  చనిపోయిందో అని  ప్రభ పైకే అంటూ ఉండగా కచ్చితంగా  మాలతి అయి ఉండొచ్చని గీతిక తిరిగి చూస్తే అక్కడ పడి ఉన్నది మాలతి .గీతిక మాలతి శవాన్ని చూస్తూ ఉన్నప్పుడు ముక కవళికలు గమనించిన ప్రభ కచ్చితంగా ఈ అమ్మాయి గీతికకి తెలిసి ఉంటుంది అనుకొని బైక్ ఆపి " గీతిక ! నిన్ను చూస్తుంటే నీకు ఈ అమ్మాయి ఆచూకీ నీకు తెలుసని నాకనిపిస్తుంది .నిజం చెప్పు గీతిక నువ్వు అటు వెళ్లినప్పుడే ఈ అమ్మాయికి కూడా యాక్సిడెంట్ అయినట్టుంది ఎప్పుడు బయలుదేరారు అడిగాడు ప్రభ .

 ముందు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అన్న గీతిక మాటలు వినిపించుకొని సరే ఎక్కు  వెళదామని చెప్పి ఎక్కించుకొని వస్తూ ఉండగా జ్యూస్  అంగడి దగ్గర బైక్ ఆపి గీతికకి జ్యూస్ ఇప్పించి తాగమని చెప్పగా  మాట్లాడకుండా గట గట తాగేసింది గీతిక.

 పాపం ఎంత ఆకలిగా ఉందో అనుకొని ఇంకా ఏమైనా తింటావా అని అడిగాడు ప్రభ.

 లేదన్నట్లు తల ఊపి  చేతి వైపు టైం అని చూపించడంతో  "ఓ పదా అన్న ప్రభ బైక్ ఎక్కబోతున్న గీతికను   "నువ్వు నిజం చెప్పు, నీకు ఆ అమ్మాయి తెలుసా?

 తెలుసు అన్నట్టు తల ఊపింది గీతిక.

  అయితే ఆ అమ్మాయి వెళ్ళిన రూటు,  నువ్వు వెళ్ళిన రూటు ఒకటే . అంటే ఇద్దరు కలిసి వెళ్లారా? 

 అవునన్నట్లు తలూపింది.

 ఇంతకీ మీరిద్దరు ఎక్కడికి వెళ్లారు? 

 గీతిక జరిగిన విషయం అంతా చెప్పింది ప్రభకి. 

 "అందుకే మోసం వినాశనానికి దారితీస్తుందని పెద్దలు ఊరికే చెప్పలేదు" నిన్ను చంపాలని వచ్చి తనే చనిపోయింది. ఎలాగో సమయానికి నేను వచ్చాను కాబట్టి నువ్వు సేఫ్, అంతే చాలు. సరే! బండి ఎక్కు, ఇప్పటికే మీ జేజి , తాతయ్యలు శృతి కి ఫోన్ చేసి ఉంటారేమో!  పాపం, ముసలి వాళ్లు . నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పడంతో గీతిక బైక్ ఎక్కగా  నేరుగా గార్డెన్ హౌస్ గేటు దగ్గర బైకు నిలిపి నిలపగా దిగిన గీతికను " ఒక్క నిమిషం !  అని ప్రభ అనడంతో  నిలబడిన గీతికతో ముందు  నీ వోణిని సరి వేసుకో, వెంట్రుకల్ని  సరి చేసుకుని వెళ్ళు అని చెబుతాడు. 

గీతిక అలాగే చేసి గేటు తీసి లోపలికి వెళ్లగా తాత,  జేజేలు ఎదురు రావడంతో వచ్చి,రాని నవ్వుతో నవ్వింది గీతిక. 

గీతిక ! శృతి వాళ్ళింటికి వెళ్తానని చెప్పావు సరే, టైం చూసుకోవాలి కదా . ఒకవేళ రావడానికి కుదరదు అనుకుంటే ఒక ఫోన్ చేయాలి. అర్ధరాత్రి గడిచిపోయింది అయినా నువ్వు ఉదయం వెళ్లేటప్పుడు ఎంత ఆక్టివ్ గా ఉన్నావు ఇప్పుడు ఎందుకు ఫేస్ డల్ గా కనిపిస్తూ ఉంది. అని ప్రశ్నల మీద ప్రశ్నలు జేజీ వేస్తున్న మౌనంగా అన్నిటికీ తలూపడం తప్ప ఏమీ సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది గీతిక.

 ఏమండీ ! పోయి  పోయి నారాయణ ఈరోజే వచ్చాడు. కనీసం వస్తానని చెప్పి ఉంటే గీతికని నేను ఆపేదాన్ని అలా కూడా చెప్పలేదు సడన్గా మధ్యాహ్నం వచ్చి ఇంతవరకు కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కనీసం అన్నమైన తినలేదు కూతురు అంటే తనకి ఎంత ప్రాణం అంది జేజి.

 "అవును , అది నిజమే . కానీ గీతిక ఎందుకు ఈరోజు ఇలా చేసింది నారాయణ ఏమంటాడో ఏమో తనను చూసినట్లు లేదు లోపల ఉన్నట్టున్నాడు " అని తాతయ్య చెప్పగా సరే పదండి ఎలా ఉంటే అలా అవుతుంది అని జేజి అంటుంటే నువ్వేమో అంత ఈజీగా మాట్లాడుతున్నావు తన కూతురి విషయంలో తను చాలా  జాగ్రత్త తీసుకుంటాడు.  చూద్దాం , ఏం జరుగుతుందో పద అంటూ ఇద్దరూ లోపలికి వెళ్లారు.

 నారాయణ  మిద్దె పైనుండి కిందికి దిగి వచ్చి హాల్లోకి రావడంతో  జేజి  గీతిక గదికి వెళ్లి  "గీతికా!  త్వరగా  ఫ్రెష్ అయిరా.  మీ నాన్న నీకోసం మధ్యాహ్నం నుంచి ఎదురుచూస్తూ ఉన్నాడు."అని చెప్పడంతో గీతిక త్వరగా  ఫ్రెష్ అప్ అయ్యి వేరే డ్రెస్ వేసుకొని హాల్లోకి వచ్చింది.

 నాన్న ఎప్పుడు వచ్చారు ?

 నేను వచ్చి  సగం రోజు ముగిసింది .  ముందు మీ జేజి వాళ్ళని పిలు. ముందు అన్నం తినండి అందరూ అని చెప్పి అందరూ కూర్చుని భోజనం చేశారు . కూతురు ముఖాన్ని పదే పదే చూస్తున్న నారాయణని చూసి జేజి గుండె దడ దడ అని వేగంగా కొట్టుకుంటుంది. అది గమనించిన గీతికకి కూడా అన్నం తింటూ ఉండగా ఆలోచిస్తూ ఉండడంతో  పొలమారింది ." గీతికా!  నెమ్మదిగా తిను " అని అతనే గ్లాసు తీసుకుని నీళ్లు తాగించాడు.  నాన్నను చూసి చిరునవ్వు నవ్వింది గీతిక. నాన్న! అమ్మ , బంగారం బాగున్నారా ?అడిగింది గీతిక.

 బాగున్నారమ్మ . అప్పటికీ  నీ తమ్ముడిని తీసుకురావాలనుకున్న .వాడికి పరీక్షలు ఉన్నాయి అని వాళ్ళు పంపించలేదు అందుకే నేను ఒక్కడినే వచ్చాను అని చెబుతూ మరొకసారి గీతిక  కళ్ళలోకి చూశాడు నారాయణ.

 అలా నాన్న అప్పుడప్పుడు తన కళ్ళలోకి చూస్తూ ఉండడం చూసి గీతికకి చాలా భయం వేసింది.  అన్నం కూడా తక్కువ పెట్టుకుని త్వరగానే తిని ఆవులింతలు  వరుసగా రావడంతో తన వైపు చూసిన గీతికని గమనించిన నారాయణ  "గీతిక ! ముందు పోయి పడుకో పో "అని చెప్పగా గీతిక వెళ్లి తన గదిలో పడుకోగా కొద్దిసేపు జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి మనసంతా చాలా బరువుగా అనిపించడంతో నాన్న ఒడిలో    పడకుందామని అనుకున్నా ఎందుకొ భయంగా ఉన్నట్టు అనిపించింది . అందుకే ఉదయం 5 గంటలైనా కూడా నిద్ర రాకుండా ఆలోచిస్తూ ఉంటే ఏడుపు ముంచుకొస్తోంది . లేచి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే ఎప్పటికో నిద్రపోయింది.ప్రభ అటే రావడంతో రక్షించి గార్డెన్ హౌస్ ముందు వదిలి అపార్ట్మెంట్ కి వెళ్లి తన రూమ్ తలుపు తట్టడంతో పప్పు వచ్చి తలుపు తీయగా లోపలికి వెళ్లిన ప్రభ నేరుగా బాత్రూంలోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి బయటకి రావడంతో పప్పు " ఎందుకు లేట్ అయింది."అని అడగాలనుకున్న , ప్రభ  బెడ్ మీదకి వెళ్లేసరికి , 'ప్రభ అన్నం...' అని అంటూ ఉండగా అతను మౌనంగా ఉండేసరికి లేచి వచ్చి చూసిన పప్పు ప్రభ నిద్ర లోకి జారుకోగా  " బండిలో తిరిగి స్ట్రెస్ అయిందేమో!" అనుకుని పడుకున్నాడు పప్పు.

   నిద్రపోయిన గీతిక  ఉదయం పది అయినా లేవలేదు. జేజి వచ్చి ఒకసారి గీతిక నుదుటన చెయ్ పెట్టి చూడగా జ్వరం లాంటిదేమీ లేకపోవడంతో అక్కడి నుండి జేజి బయటికి వెళ్ళిన కాసేపటికి గీతిక నిద్ర లేచి హాల్లోకి వెళ్లి అక్కడి నుండి నారాయణ పడుకున్న గది వైపు వెళుతుండగా "  బుజ్జి " అంటూ పిలిచాడు నారాయణ హాల్లోకి వస్తూ. అయినా గీతిక వినిపించుకోకుండా ముందుకు వెళుతుంటే " గీతిక  "అని నాన్న వాయిస్ కాస్త గట్టిగానే వచ్చేసరికి ఆ అంటూ వెనక్కి తిరిగి చూసింది గీతిక.

 "పిలుస్తుంటే వినబడలేదా? "అన్న మాటలు విని ' నాన్న' అంటూ దగ్గరికి వచ్చింది గీతిక.