pranaya geethika in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 29

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 29

రాణి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కృష్ణ మురళి "రాణి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకొని కాసేపు నిద్రపో అని టాబ్లెట్ ఇచ్చి రాని పడుకునేసరికి అతని లోపలికి వెళ్ళమని చెప్పి కృష్ణ బయటికి వస్తుండగా భుజంగం తన మనుషులకి ఏదో చెబుతుంటే చెవిని అటు ఉంచేసరికి విని ఉలిక్కిపడ్డాడు ఇంత సంతోష సమయంలో ఇతను చేస్తున్న పనేంటి  "ఈ సమాజంలో కొడుకు పై ఉన్న ప్రేమ కూతురిపై ఉండదా" కూతుర్ని చూడడానికని వచ్చి సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తున్నాడేంటి , ఈ విషయం రాణికి  తెలిస్తే మళ్లీ టెన్షన్ పడుతుంది. నేను కూడా సమస్యలో పడాల్సి వస్తుంది కాబట్టి తెలియనట్లు రూమ్ కి వెళ్లడమే మంచిది అనుకొని రాని రూమ్ కి రావడంతో  రాణి అమ్మ హాల్లోకి వెళ్ళింది. 

 రాణి ! మీ నాన్న ఏమో అనుకున్న సీసీ కెమెరాని కూడా చెక్ చేస్తున్నట్టున్నాడు. పొరపాటున నువ్వు గాని లేచి ఉంటే నేను ఆల్రెడీ సీసీ కెమెరా తీసిన సంగతి చెప్పే దానివి ఎందుకంటే  నువ్వు మీ నాన్నకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటావు. ఎలాగో నా కడుపున పడ్డ నా చిట్టి ఏంజెల్ నన్ను రక్షించింది అని మనసులోఅనుకొని భార్య పక్కన పడుకున్నాడు కృష్ణ.

 సీసీ కెమెరాలను తీసుకొని చెక్ చేయాలని దానికి నేనే ముందు ఉంటే బాగుంటుందని అనుకొని భార్యకు  రాణిని బాగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయలుదేరాను భుజంగం. 

 ఇంటికెళ్లి కంప్యూటర్ కేసి చూడగా కొన్ని బాగా కనిపించిన అవి వేరే వాళ్ళ ముఖాలు బండ్లు ఉన్నాయి. శ్రీహరి చనిపోయిన రోజు లోపల సీసీ కెమెరాలు ఎటువంటి ఫోటో వీడియోలు లేవు. గేటు బయట ఉన్న ఫొటోస్ మాత్రం బ్లర్ అయి ఉండి ముఖాలు ఏమి సరిగ్గా కనిపించట్లేదు. ఎన్నిసార్లు చూసినా అలాగే కనిపించడంతో "చ!  ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది ఇదేం కర్మరా నా కొడుకు కేవలం ఒక ఆడదాని కోసం ప్రాణాలను కోల్పోయాడంటే నాకు సిగ్గుచేటు వాడికి అది కావాలని నాతో ఒక మాట చెప్పుంటే క్షణంలో దాన్ని వాడి కాలి దగ్గర పడేసేవాన్ని అయినా వాడికేo  మహారాజు. అప్సరసలాంటి అమ్మాయిని చూశాను. అది కాదని ఇలా చేశాడేoట్రా  అంటూ హాలంతా తిరుగుతూ సీసీ కెమెరాలను పగలగొట్టి దొరికిన వస్తువుల్ని కొట్టేస్తూ,  ఎత్తి పడేస్తూ తన బాధ లోని కోపాన్ని వస్తువులపై చూపిస్తూ చివరికి గన్ తీసుకుని ఒక తూట పేల్చేసరికి ఎదురుగా ఉన్న శ్రీహరి ఫోటో కి తగలడంతో అద్దం పగిలి కింద పడేసరికి ఒక గాజు ముక్క తన చేతికి తగలడంతో మనుషులు పరిగెత్తుకొచ్చి అతనికి ప్రథమ చికిత్స చేసారు. రక్తం  ఎక్కువ పోవడంతో డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చేసరికి అలాగే నిద్రపోయాడు భుజంగం.
*
 కోర్టు దగ్గర నుండి రూమ్ కి వచ్చిన తర్వాత " ప్రభ! ఆ లవ్లీ కోర్టు విచారణ చేసేటప్పుడు నీ వైపు రెండుసార్లు భయపడుతూ చూసినట్టు నాకనిపించింది అసలు నీవు కోర్టు వరకు ఎందుకు వెళ్లావు. "అని అడిగాడు పప్పు.

 ఏం చేయాలి నేను ఈ విషయంలో కల్పించుకోకుండా ఉంటే ఆ లవ్లీ గీతిక పేరు పొరపాటున చెబితే ఏమైనా ఉందా ఆ భుజంగం  గీతిక వెళ్ళినందుకే తన కొడుకు చనిపోయాడు అంటే ఆ అమ్మాయిని బతకనిస్తాడా అసలు వదిలిపెట్టడు అందుకే వెళ్ళక తప్పలేదు అని చెప్పాడు ప్రభ   టీ షర్ట్ వేసుకుంటూ.

 ఇంతకీ లవ్లీని ఎక్కడ కలిశావు?  అసలు ఏం జరిగింది అంటూ మరో కృష్ణ వేశాడు పప్పు.

  గీతిక వాళ్ళ నాన్న వెళ్లిన రోజు ఎలాగైనా కానీ తనకు ఇంత జరిగింది కదా ఎవరి నుండైనా అపాయం రావొచ్చేమో అని నాకు సందేహం వచ్చింది.అందుకే నా మొబైల్ నెంబర్ గీతిక సెల్ కి సేవ్ చేయకుండా నీ నెంబర్ తన సెల్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేసి నా మొబైల్ కి వేసాను కదా అప్పటినుండి తను ఎవరితో మాట్లాడిన నాకు తెలుస్తోంది. అలా వాళ్ల కంపెనీ ఓనర్ కృష్ణ మురళి అతను గీతికతో  జాగ్రత్తగా ఉండమని ఏవో విషయాలు చెబుతూ శ్రీహరి చనిపోవడానికి కారణం ఎవరు అన్నది నిఘా పెడతానని అందుకే ఇక్కడ ఒక అమ్మాయిని అనుమానం వచ్చి ఫాలో అవుతున్నానని చెప్పడం విన్నాను. వెంటనే ఆ అమ్మాయిని నేను కూడా వెంబడించగా తను టూ వీలర్ ని మరో వైపు తిప్పగా నేను వేగంగా వెళ్లేసరికి ఓ పాడు బండ   ఇంటిలోకి పరిగెత్తింది. నేను వెళ్లి ఆగు!  అనడంతో " ఎవరు నువ్వు, నన్ను ఎందుకు వెంబడిస్తున్నావ్ " అని ప్రశ్నించింది.

 నేనెవరైతే నీకేంటి ముందు నువ్వు గెస్టు హౌస్ కి ఎందుకు వెళుతున్నావు చెప్పు అనేసరికి 'అది నీకు అనవసరం ముందు పక్కకు తప్పుకో 'అంటూ నన్ను నెట్టి బయటికి వెళ్లడానికి ప్రయత్నించగా చేయి పట్టి విసురుగా లాగేసరికి ముఖానికి వేసిన వోణీ వాకిలికి తగలడంతో చినిగిపోయి తన ముఖం కనిపించడంతో  "లవ్లీ నువ్వా ! " అని నేను అనేసరికి నా పేరు నీకెలా తెలుసు అని అడిగింది. ముఖాన్ని కున్న హెల్మెట్ తీయగా " మీరా!  మీరెందుకు "..... అని లవ్లీ ఏదో చెప్పబోగా " నా గురించి పక్కన పెట్టు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అని నేను అనడంతో ఏంటి నీ ప్రశ్న అంటూ మాటల్లో మర్యాద మారి మార్చింది లవ్లీ.

 "కృష్ణ మురళి ఇంటికి  మాలతి అనే అమ్మాయి వేసుకెళ్ళిన స్కూటీ నీదేనా " అని అడిగాను. అవును, నాదే నేనే పంపించాను. దాని గురించి మీకెందుకు మంది గడుసుగా లవ్లీ.

  "నీ స్కూటీ గురించి నాకు అనవసరం. మాలతితో పాటు వెళ్ళిందే ఆ అమ్మాయి గురించి" అని నేను అన్నందుకు 'ఆ గీతిక మీకు తెలుసా!  తను మల్టీ టాలెంటెడ్ ఫెలో ఇలాంటి వాళ్ళనైనా ఇట్టే ఆకర్షిస్తుంది. " అంది లవ్లీ.

 'అదే ఆ మల్టీ టాలెంటెడ్ ఫెలో గురించి నువ్వు ఆలోచించకూడదని నేను చెబుతున్న 'అని నేను అనడంతో ఆశ్చర్యంగా చూస్తూ నిన్ను కూడా బకరా చేసిందా దానికి సపోర్ట్ చేస్తున్నావ్. అని లవ్లీ అనడంతో కొట్టాలని చేఎత్తి 'అసలు నువ్వు ఆడదానివేనా ' నీకు నీకంటే నైపుణ్యం ఉన్నవాళ్లు నీకంటే ఎదిగే వాళ్ళని చూస్తే ఇంత జలసి ఉందని నాకు ఇప్పుడు అర్థం అయింది .చి ! ఆ రోజు నేను ఇలాంటి దానివని తెలియక బ్లడ్ డొనేట్  చేసి తప్పు చేశాను. ఆరోజే చచ్చుoటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు .అని నేను సీరియస్గా అంటుంటే ఏంటి ఆ ఘోరం దానికేం జరిగింది. అది ఎప్పుడు బాగుంటుందిలే. ఎందుకంటే దానికి ఎప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూనే ఉంటారు అంది  లవ్లీ. 

 ఇది విన్న నాకు లవ్లీకి ఘోరం అనే నేనెందుకు అన్నానో అర్థం కాలేదని,  మాలతి మరణించిన విషయంగాని, గీతికకి జరిగిన సంఘటన గాని తెలీదని నేను మనసులో అనుకుంటూ ఉండగా క్షణంలో నిలుచున్న చోటు నుండి పరిగెత్తింది .తిరిగి చూస్తే కనిపించకపోయేసరికి నేను ముఖద్వారం దగ్గర నిలబడి చూడగా ఎక్కడ కనిపించలేదు.  కొంచెం ముందుకు వచ్చి చూస్తే పోలీసులు రావడం గమనించాను. అంతేకాక మరో వ్యక్తి ఓ చెట్టు కింద నిలబడి ఫోన్లో మాట్లాడుతుంటే లవ్లీ లోపలే ఎక్కడో పొరపాటున మరొక ద్వారం వైపు వెళ్లి ఉంటుందని మెల్లగా లోపలికి వెళ్లి చూస్తే ముఖద్వారం వైపే వస్తోంది . నన్ను చూసి  'అడ్డు తీ! నాకు ముఖ్యమైన పనుంది నేను వెళ్ళాలి.' అంది గడుసుగా.

 సరే, అడ్డు తప్పుకుంటాను. ముందు నేను చెప్పేది విను. నువ్వు ఎక్కడైనా సరే గీతిక పేరును . ప్రస్తావించకూడదు అని నేను అనేసరికి చెబితే ఏంటి ,చెప్పకపోతే నీకేంటి ముందు దారి వదులు అని విసురుగా నన్ను తోయబోగా నేను ఆడపిల్ల అని మర్యాదగా చెబుతుంటే అర్థం కాదా నీకు అంటూ చెంపకి ఒకటి ఇచ్చాను.  అంతే లవ్లీ కింద పడడంతో అక్కడ పడి ఉన్న మన తేలిన రాయి తీసుకుని నన్ను పొడవబోగా, ' ఏంటే !నన్ను చంపడానికి వస్తున్నావా, నిన్ను చంపడానికి నాకు క్షణం చాలు అయినా నీవు నీ కర్మమంతా అనుభవించి చావాలి. అంతవరకు   గీతిక పేరు ఎక్కడా చెప్పకు నేను కూడా ప్రాణం పోసి ఒక డాక్టర్ని కానీ ప్రాణం తీయడం కూడా నాకు తెలుసు. నువ్వెక్కడైనా పొరపాటున గీతిక పేరుని నీ పెదవులు కదిలేలోపే నేను నిన్ను కాల్చిపారేస్తాను ' అని వార్నింగ్ ఇస్తూ ఉండగానే చేతిలో మట్టి తీసి నా ముఖానికి విసిరి ముఖ ద్వారం వైపు పరిగెత్తింది
నేను నా కళ్ళు తుడుచుకుని బయటికి వచ్చేలోగా తను గెస్ట్ హౌస్ గేటు తీసి లోపలికి వెళుతూ ఉండడం చూసి నాకు నవ్వొచ్చింది . వెళ్ళు! వెళ్ళు!  నీ అంతకు నువ్వు యమలోకానికి చేరుతున్నావు . నేను నిన్ను చంపి పాపం మూట కట్టుకోలేను . యమధర్మరాజు భుజంగం ఉన్నాడుగా ! నిన్ను వదిలిపెట్టడు అనుకుని గీతిక పేరు బయటికి రాకూడదని మార్నింగ్ ఇచ్చాను కాబట్టి దానికి గుర్తుందని అనుకుంటున్నాను . ఒకవేళ మరిచి నోరు విప్పితే అక్కడే శవం అవ్వడం మాత్రం ఖాయం . నిన్ను వెంబడిస్తూనే ఉంటాను అనుకొని అక్కడ నుంచి వచ్చేసాను. 

 మరసటి రోజు  నాకు తెలిసిన వాళ్ళ కేసుకు సంబంధించి న విషయంలో  అదే  పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా మరొకసారి తనకి సైగతో వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఆపాటికి తనకి శ్రీహరి మరణం గురించి తెలిసిందనుకుంటా మాటల్లేవు  ,ముఖం వాడిపోయి ఉంది .నన్ను చూసి ఏడుపు ముఖం పెట్టేసింది. అయినా తన మీద ఎందుకో కనికరం ఉండకూడదని  గట్టిగా నా మనసుకి చెప్పుకున్నాను.

 ఇక కోర్టుకి తీసుకువచ్చే సమయంలో అతను ఇక బతకదు అనుకుందో ఏమో పోలీసులు తనని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఒక పక్కకి నిలుచున్న నాకు నా కాళ్ళ దగ్గరికి ఒక పే వెనక నుండి ఒక పేపర్ విసిరింది లవ్లీ.

 "దుష్ట శిక్షణ తప్పదు."   అనుకుని కోర్టు  ద్వారం దగ్గరే నిలుచున్న . చివరికి లవ్లీ  తన ప్రాణం తీసుకుందే గాని గీతిక పేరు వెల్లడించలేదు అని చెప్పాడు ప్రభ.

 "ప్రభా!  యువర్ గ్రేట్ "అన్నాడు పప్పు.

 ఎందుకు ఆ గీతిక నన్ను చీదరించిందనా?  తనకి నేను సాయం చేశాననా ? అడిగాడు  ప్రభ. 

 చ!  అవేo మాటలు రా. నువ్వు ఎంత కావాలనుకున్న తను అంత దూరం చేసుకుంటోంది. తనకి ఎప్పుడు మంచి కాలం వస్తుందో ఏంటో అన్నాడు పప్పు.