జగదీష్ చంద్ర అలా డిక్లేర్ చేయగానే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం షాక్ అయిపోతారు.
అక్షయ ఇంకా శైలు వెంటనే మాట్లాడుతూ " అయ్యో అంకుల్ మేమేదో సరదాకి అలా చేశాము" అని అంటారు . వాళ్ల ఇదంతా కూడా జస్ట్ ఫన్ కోసం చేసి ఉంటారు కానీ జగదీష్ చంద్ర అందరి ముందు ఇలా చెప్తాడు అని ఊహించలేదు .
" లేదు తల్లి మీరు సరదాకి చేసిన , మేము ఇది ఇంతకుముందే అనుకున విషయమే" అని అంటారు జగదీష్ చంద్ర.
" మావయ్య మీరు మీ కూతురు ప్రియా ని నాకు ఇస్తే చాలు ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు " అని అంటాడు ప్రేమ్.
" ప్రేమ్ నాకు ఉన్నది ఒకటే కూతురు దానికి పెళ్లి చేసి నా బాధ్యతలు అన్నీ కూడా అల్లుడికి అప్పగించి , ఇక నేను విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నాను , అందులోనూ ఇప్పుడు మా అక్క తిరిగి నా దగ్గరికి వచ్చేసింది , ఇకపైన నా సమయం అంతా కూడా నా అక్క తోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను " అని అంటాడు జగదీష్ చంద్ర.
" మీరు మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి పంపిస్తున్నారు ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుంది. అయినా మాకు చాలానే ఉంది ఇంకా మాకు ఏమీ అవసరం లేదు , ఆ మహాలక్ష్మి మా ఇంట్లో అడిగి పెడితే చాలు" అని అంటారు గుర్దీప్ గారు.
గాయత్రి గారు కూడా మాట్లాడుతూ " అవును నా మేనకోడలు నా ఇంటికి వస్తే చాలు మాకు ఇంకేమి లాంచనాలు అవసరం లేదు" అని అంటారు.
" లేదక్కా నాన్నగారు ఇప్పుడు ఉన్న నాన్నగారు కూడా ఇదే చేసేవారేమో, ఇంకా అందులోనూ ఈ బిజినెస్ చుసుకుని చూసుకొని నేను అలసిపోయాను అక్క నాకు విశ్రాంతి కావాలి "అని అంటాడు జగదీష్ చంద్ర.
ప్రియా కి ఈ డిస్కషన్ ఇప్పుడు గెస్ట్ అందరి ముందు మాట్లాడటం ఇష్టం లేదు, "డాడ్ ఈ విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా అవసరమా" అని చిన్నగా అంటుంది.
ప్రేమ్ మాత్రం జగదీష్ చంద్ర వైపు చూసి" మావయ్య మీకు విశ్రాంతి కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఆ సీఈవోగా నేను ఛార్జ్ అయితే తీసుకోగలను కానీ , దానికి సంబంధించిన టోటల్ రైట్స్ కూడా ప్రియా చేతుల్లోనే ఉంటాయి, ఆస్తి విషయం అంటారా నాకు ఎటువంటి ఆస్తి అక్కర్లేదు ఆ ఆస్తి అంతా కూడా ప్రియా పేరు మీదే రాయాలని నేను కోరుకుంటున్నాను, అలాగే నా ఆస్తి కూడా నేను ప్రియా పేరు మీద రాస్తున్నాను" అని అంటాడు ప్రేమ్.
'ఏంటి వీడి ఆస్తి కూడా నా పేరు మీద రాస్తాడా , వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా ఎందుకు చేస్తున్నారు " అని అనుకుంటుంది ప్రియా తన మనసులో. తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ 'ఇదంతా కూడా వీలు మొదలు పెట్టారు. నేను అప్పటికే వద్దు అంటూనే ఉన్నాను' అని అనుకుంటుంది.
ప్రియా మనసులో ఏమనుకుంటుందో గ్రహించిన శైలు ఇంకా అక్షయ చిన్నగా సారీ చెప్తారు.
జగదీష్ చంద్ర ప్రేమ్ మాటలకు కొంచెం ఆశ్చర్యపోతారు తన ఆస్తి వద్దు అన్నారు అంటే పర్వాలేదు గానీ ప్రేమ్ పేరు మీద ఉన్న ఆస్తి కూడా ప్రియా పేరు మీద రాయడం ఆయనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.
జగదీష్ చంద్ర ఏదో మాట్లాడే లోగో ప్రేమ్ మాట్లాడుతూ " మా ఇంట్లో ఇది ఆనవాయితీ మావయ్య మా నాన్న తన ఆస్తి మొత్తం మా అమ్మ పేరు మీద రాశాడు , మా అమ్మ తన ఆస్తి మొత్తం కూడా తన ఇద్దరి కొడుకుల పేరు మీద రాసింది. మా అన్నయ్య తన ఆస్తి తన భార్య , అదే మా వదిన అక్షయ పేరు మీద రాశాడు , అలాగే నా ఆస్తి నాకు కాబోయే భార్య ప్రియా పేరు మీద రాస్తున్నాను , మీరు మీ ఆస్తి అల్లుడు కూతురు పేరు మీద రాసిన నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా ప్రియాకే చెందుతుంది" అని అంటాడు.
ఆ మాటలు వినగానే అక్షయ ఆశ్చర్యపోయి ఆదిత్యవైపు చేస్తుంది ఆదిత్య ఆస్తి తన పేరు మీద ఎప్పుడు రాశాడో అక్షయకి అసలు తెలియదు.
జగదీష్ చంద్ర ఆస్తి కోసం చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ఫాక్ట్ అతని ఆస్తి చూసి ప్రియాని చేసుకోవాలని చాలామంది ముందుకు వచ్చారు కానీ జగదీష్ చంద్ర ప్రియా కి సరిపడే జోడి, ప్రియా కి తగ్గవాడు, ప్రియా ఇష్టపడే వాడి కోసం వెతికాడు గాని , ఆస్తి అంతస్తులు ఉన్న వాడి కోసం మాత్రం కాదు , ఇప్పుడు ప్రేమ్ తన ఆస్తి కూడా ప్రియా పేరు మీద రాసేస్తాను అని అనగానే అతనికి ఆశ్చర్యం ఇంకా సంతోషం కలిగాయి , అక్క పెంపకం మీద ఇంకా గౌరవం వచ్చింది.
ప్రేమ్ ఇలా తన ఆస్తి మొత్తాన్ని కూడా ప్రియా పేరు మీద రాయడం ప్రియా కి అంతగా నచ్చలేదు. అలాగే ఇప్పుడు ఈ విషయం అందరి ముందు మాట్లాడి ఈ విషయాన్ని ఇంకా పొడిగించడం కూడా ప్రియా కి ఇష్టం లేదు, ఈ విషయం గురించి తర్వాత ప్రేమ్ తో మాట్లాడాలి అని అనుకుంది. ఎందుకంటే అక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు వీళ్లు ఈ ఆస్తుల గురించి డిస్కషన్ చేస్తే ఆ మీడియా వాళ్ళు చిన్నదానిని కొండంత చూపిస్తారు అని ప్రియా కి బాగా తెలుసు.
ప్రియా ప్రేమ్ వైపు చూసి చిన్నగా మాట్లాడుతూ "ప్రేమ్ ఈ డిస్కషన్ మనం తర్వాత మన ఫ్యామిలీ ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు ముందు ఈ ఫంక్షన్ ని కంప్లీట్ చేస్తే బెస్ట్ . ఒకసారి చుట్టూ చూడు మీడియా వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు" అంటుంది.
ప్రేమ్ చిన్నగా నవ్వుతూ " నువ్వు ఎలా అంటే అలా బంగారం" అని అంటాడు.
ప్రియా ఊర్మిళాదేవి వైపు చూసి " నానమ్మ ఇప్పుడు మీ మనవడి మెడలో ఈ మాల వేయమంటావా వద్దంటావా , లేకపోతే ఆస్తి పంపకాలు అన్ని అయిపోయాక వెయ్యమంటావా" అని అడుగుతుంది.
ఊర్మిళాదేవి గారు చిన్నగా నవ్వుతూ " ముందు దండలు కార్యక్రమం పూర్తి అవనివ్వండి తర్వాత మాట్లాడుకుందాం " అని అంటారు.
ప్రియా ఇంకో సెకండ్ ఆలోచించకుండా వెంటనే తన చేతిలో ఉన్న పూలమాల ప్రేమ్ మెడలో వేసేస్తుంది.
" ఏంటి బంగారం అంత స్పీడ్ గా వేసేసావ్ ? అంత బాగా నచ్చేసానా ఏంటి?" అని కను కొడతాడు.
ప్రియా ప్రేమ్ వైపు కోపంగా చూస్తుంటే, ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ ప్రియా మెడలో పూలమాల వేస్తాడు చుట్టూ ఉన్నవాళ్లు క్లాప్ కొడతారు.
ఇక పెద్దలు అందరూ , వచ్చినా గెస్ట్లు అందరూ కూడా వచ్చి ప్రియా ఇంకా ప్రేమ్ ని ఆశీర్వదిస్తూ ఉంటారు.
అక్షయ ఆదిత్య వైపు చూస్తూ " మీరు మీ ఆస్తిని నా పేరు మీద ఎప్పుడు రాశారు ఈ విషయం నాకెందుకు తెలియలేదు " అని అడుగుతుంది.
ఆదిత్య చిన్నగా నవ్వుతూ " మన పెళ్లయిన కొత్తలో నీ చేతితో కొన్ని పేపర్ సాన్ చేయించాను గుర్తుందా" అని అంటాడు.
అక్షయ ఏదో గుర్తొచ్చిన దానిలాగా " ఆ గుర్తుంది కానీ అవి మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏమో అనుకున్నాను అవి ఆస్తి కాగితాల " అని అంటుంది.
" అవును బంగారం. నా పేరు మీద ఆస్తి మొత్తం నీ పేరు మీద ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేసేసాను" అని అంటారు ఆదిత్య నవ్వుతూ.
" ఒకవేళ నేను మీ ఆస్తి మొత్తాన్ని తీసేసుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తారు" అని అక్షయ జోక్ వేస్తుంది.
ఆదిత్య చిన్నగా నవ్వుతూ సూటిగా అక్షయ కలలోకి చూస్తూ " నాకు నా ప్రేమ మీద , నేను ప్రేమించిన అమ్మాయి మీద నమ్మకం ఉంది బంగారం" అని అంటాడు.
ఆ మాటలు వినగానే అక్షయ ఆదిత్యా నీ సైడ్ హాగ్ చేసుకుంటూ " ఐ లవ్ యు అది " అని ప్రేమగా ఉంటుంది.
శైలు చూట్టు చూస్తూ " అవును ఇంతకీ ఈ నితిన్ ఇంకా అరుణ్ గాడు ఏరి కనిపించట్లేదు వీళ్ళు అక్కడికి వెళ్లారు" అని అడుగుతుంది.
" ఏముంది ఈ పెళ్లి ఎలా ఆపాలి అని ఏదో మూల కూర్చొని ప్లాన్స్ వేస్తూ ఉంటారు " అని అంటాడు నిఖిల్.
శైలు నిఖిల్ వైఫ్ కొంచెం కోపంగా చూసి " ఎప్పుడు వాళ్ల గురించి నెగటివ్ గానే ఎందుకు చెప్తావు నువ్వు?" అని అడుగుతుంది.
" చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళని , వాళ్ళు ఎప్పుడు ఏమి చేస్తారో, ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదా" అని అంటాడు నిఖిల్.
" గెస్ట్ నీ రిసీవ్ చేసుకోవడానికి కూడా వెళ్లి ఉండొచ్చు కదా" అని అంటుంది శైలు.
మళ్లీ శైలు మాట్లాడుతూ " నేను వెళ్లి వాళ్ళు ఎక్కడున్నారో చూసి వస్తాను " అని వెళ్తుంది.
**
నితిన్ ఎవరి లేను చోటకి వెళ్తాడు, అతనికి తెలియకుండానే అతని కంట్లో నుంచి నీరు కారుతూనే ఉంటుంది.
అతని వెనకాల వెళ్లిన అరుణ్ నితిన్ ఏడవడం చూసి "ఒరేయ్ ఏంట్రా ఇది చిన్న పిల్లోడి లాగా" అని అంటాడు.
నితిన్ అరుణ్ నీ హాగ్ చేసుకుంటూ గట్టిగా ఏడుస్తూ " నన్ను ఏం చేయమంటావ్ రా ప్రియ అలా వేరొకడికి ఐ లవ్ యు చెప్తుంటే నేను చూడలేకపోతున్నాను" అని అంటాడు.
" నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ మనసులోని మాట ప్రియా కి చెప్పే అని కానీ నువ్వే వినకుండా ఇంతవరకు తెచ్చుకున్నావ్ , ఇప్పుడు ఏడుస్తే ఏమి లాభం" అని అంటాడు.
" చెప్పేయడం అంత సులువు అనుకుంటున్నావా , ప్రియా ని చిన్నప్పటినుంచి ఇష్టపడ్డాను అప్పుడే చెబుదాము అనుకుంటే అప్పుడు ఆ విన్ను వచ్చాడు. నా అదృష్టం కొద్ది విన్ను ప్రియా కి దూరం అయ్యాడు , ఇక ప్రియా కి మెల్లగా నా ప్రేమ చెప్పి తనని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే ఇప్పుడు ఈ ప్రేమ్ గాడు వచ్చాడు . ప్రియ ఇక నాతో ఉండలేదా. ప్రియ తో నేను కన్నా కళలు అన్నీ కూడా వ్యర్థమేనా. ప్రియా అంటే నాకు ప్రాణం రా. దాన్ని చూడకుండా నేను ఒక రోజు కూడా ఉండలేను, అందుకే కదా మా డాడీని మా బిజినెస్ అన్నీ కూడా వదిలేసుకొని ప్రియా దగ్గర నేను వర్క్ చేసేది , తనని రోజు చూడొచ్చు అనే కారణంతో , తనకి మెల్లగా నా ప్రేమ అర్థమయ్యేలాగా చెప్పగలను అని నమ్మకంతోనే కదరా . అది ఇంకొకడితో ఉంటే నేను చూడలేను. తనకి నా ప్రేమ విషయం చెబుదాం అనుకుంటే ఈ స్నేహం కూడా దూరం అవుతుందేమో అని భయం రా నాకు" అని ఏడుస్తాడు.
" నితిన్ భయంతో ఎప్పుడూ కూడా ప్రేమను గెలవలేము. నువ్వు చెప్తేనే కదా తనంటే నీకు ఎంత ఇష్టమో తనకి తెలిసేది . నువ్వు ఇలా చెప్పకుండా మూగ ప్రేమికుడి లాగా ఉంటే తనకి ఎలా అర్థం అవుతుంది రా. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు ధైర్యం చేసి తను పెళ్లి చేసుకునే లోపు నీ మనసులోని మాట తనకి చెప్పేసేయ్ . ప్రియా నిన్ను బాగా కేర్ చేస్తుంది మా అందరిలో ఎక్కువగా నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది , నాకెందుకో తనకి కూడా నువ్వంటే ఇష్టం ఉండీ ఉంటుంది . తనకి నువ్వు అంటే ఇష్టం ఉంటే కనుక కచ్చితంగా ఆ పెళ్లి ఆపేసి నీతో వచ్చేస్తుంది. ప్రియా ఏం చేసినా వాళ్ళ ఫ్యామిలీ తనకే సపోర్ట్ చేస్తుంది అన్న సంగతి మర్చిపోకు. ప్రియా ఒకవేళ నిన్ను చేసుకుంటాను అని చెప్తే అంకుల్ కచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తారు, ఆ పెళ్లి వెంటనే కాన్సల్ చేసి నీతో పెళ్లి కూడా చేస్తారు అంకుల్ . నువ్వు చెప్పకుండా ఇలా ఉంటే కనుక లైఫ్ లాంగ్ రిగ్రేట్ అవ్వవలసి వస్తుంది " అని అంటాడు.
నితిన్ అరుణ్ వైపు హోప్ తో చూస్తూ ఉంటే.
" అవును రా చెప్తేనే కదా తెలిసేది. ధైర్యం తెచ్చుకొని ప్రియా కి నీ మనసులోని మాట చెప్పేసేయ్ నాకెందుకో నువ్వు చెప్తే ప్రియా కచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది " అని అంటాడు అరుణ్.
నితిన్ కళ్ళు తుడుచుకుంటూ " అంతేనంటావా ప్రియా నన్ను యాక్సెప్ట్ చేస్తుందా ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఈ ఫ్రెండ్షిప్ కూడా దూరం అవుతుంది ఏమో రా" అని అనుమానంగా అంటాడు నితిన్.
" నీకు అంత అనుమానంగా ఉంటే చెప్పకు మానెయి . చక్కగా ఆ ప్రేమ్ గాడు ప్రియా ని పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగేలోగా ఒక బాబునో పాప నో కానీ , బేబీ సిట్టర్ గా నిన్ను కూర్చో పెడతాడు అప్పుడు ప్రియా బేబీస్ ని చూసుకుంటూ ఉందువు గాని " అని అంటాడు అరుణ్.
అరుణ్ మాటలకు నితిన్ కి కోపం వచ్చి " ఒరేయ్ ఇంకోసారి అలా అన్నావ్ అనుకో చంపేస్తాను, ఆ ప్రేమ్ గాడు ప్రియా చుట్టుపక్కల ఉన్న నాకు ఒళ్ళు కంపరంగా ఉంటుంది" అని అంటాడు.
అరుణ్ చిన్నగా నవ్వుతూ " ఒరేయ్ ఒక విషయం గుర్తుపెట్టుకో మనం అందరం కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నువ్వు ఇప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేస్తే ప్రియా నీకు దూరం అవుతుంది అని అనుకుంటున్నావ్ చూడు ఆ థాట్ పక్కన పెట్టేసేయ్ ప్రియా ఫ్రెండ్షిప్ కి చాలా విలువ ఇస్తుంది ఒకవేళ నువ్వు చెప్పినా కూడా, తనకి ఇష్టం అంటే ఓకే చెప్తుంది లేదంటే నో చెప్తుంది కానీ నీ ఫ్రెండ్షిప్ ఐతే వదలదు " అని అంటాడు.
నితిన్ కొంచెం ధైర్యం తెచ్చుకుని " ఓకే రా ఎలాగైనా సరే నా ప్రేమ విషయం ప్రియా కి చెప్తాను" అని అంటాడు.
" వాట్ ? నువ్వు ప్రియా ని ప్రేమిస్తున్నావా? " అని వినిపించిన మాటలకి అటువైపు చూస్తారు అరుణ్ ఇంకా నితిన్.
షాక్ అయిపోతారు.
కొనసాగుతుంది....
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.
మళ్లీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్.