you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 32

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 32

ప్రియా ఊర్మిళాదేవి గారి మాటలు తిప్పి ఆవిడకే తిప్పి కొట్టడంతో అక్కడున్న వాళ్ళకి నవ్వు వచ్చింది కానీ నవ్వితే ఊర్మిళాదేవి గారు ఊరుకోరు అని సైలెంట్ గా ఉంటారు.

ఊర్మిళాదేవి గారు జగదీశ్ చంద్ర వైపు కోపంగా చూసి "చూసావా రా నీ కూతురు నన్ను ఎనేసి మాటలు అంటుందో అంతా నీ గారాబం వల్లే అది అలా తయారయింది, ఒక్కటే కూతురు కదా అని నెత్తిన పెట్టుకున్నావ్ ఇప్పుడు చూడు నా నెత్తి మీద నుంచుని ఎలా నాట్యం ఆడుతుందో, మందు దాని కాదురా నిన్ను నాలుగు పీకితే దానికి  బుద్ధి వస్తుంది" అని జగదీష్ చంద్రని తిడుతుంది.

సునంద గారు చిన్నగా "మీరే అంటారుగా అత్తయ్య నా మనవరాలికి అన్ని నా పోలికలే అని మరి ప్రియా కూడా అదే కదా అత్తయ్య చెప్పింది"  అని అంటుంది.

దానికి ఊర్మిళ దేవి గారు సునంద వైపు కోపంగా చూసి "  అంటే ఏంటే నీ ఉద్దేశం నేను గయ్యాళిని అన్నా  నువ్వు నీ కూతురు అంటున్నది"  అని సునంద గారి మీద అరుస్తుంది.

" అయ్యో అత్తయ్య నా ఉద్దేశం అది కాదు"  అని అంటున్నారు సునంద. 

" మరి ఏంటే నీ ఉద్దేశం నీ కూతురి ఉద్దేశం"  అని అరుస్తారు ఊర్మిళాదేవి గారు సునంద గారి మీద.

వాళ్ళ అత్తయ్య గారు అలా కోప్పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక జగదీష్ చంద్రవైపు చేస్తుంది సునంద.

జగదీష్ చంద్ర సునంద వైపు చూసి నేను పడుతున్నాను కదా నీకు అవసరమా అన్నట్లు ఒక లుక్ ఇస్తాడు. 

అప్పుడే గాయత్రి గారు " అమ్మ.. అదేదో చిన్న పిల్ల,  అది ఏదో అనాది అనుకో నువ్వు కూడా చిన్న పిల్లలాగా ఏంటి?  దాన్ని మాట పట్టుకొని ఇలా అనాలా, అయినా మొదట మొదలు పెట్టింది నువ్వే కదా "  అని అంటుంది.

" సరిపోయింది మొన్నటి వరకు నీ తమ్ముడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నీ కోడలు నీ వెనకేసుకుని రావడం మొదలు పెట్టావా.  అందరూ దాని వెనకేసుకొస్తే మన నెత్తి మీదకి ఎక్కి నాట్యం ఆడుతుంది అది, అయినా దాన్ని చిన్న పిల్ల అంటున్నావా , దానికి పెళ్లి చేసి ఉంటే ఈపాటికి నిన్ను నానమ్మని నన్ను జేజమ్మ నీ  చేసేది ఈపాటికి "  అని అంటారు ఊర్మిళాదేవి గారు సోఫాల కూర్చుంటూ. 

ప్రేమ్ వైపు చూసి " ఒరేయ్ మనవడా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ,  దాని ముక్కు తాడేసి నువ్వే దాన్ని వంచాలి" అని అంటారు. 

ఆ మాటకి ఆదిత్య మాట్లాడుతూ " సరిపోయింది అడక్క అడక్క వాడినే అడిగావా ,  వీడి సంగతి పక్కన పెడితే , నీ మనవరాలే వీడిని ఒక ఆట ఆడిస్తుంది"  అని అంటాడు ఆదిత్య.

ఆ మాటకి ఆదిత్య వైపు చూసి " అంతేనంటావా మనవడా " అని నీరసంగా అడుగుతుంది.

"  అంతే " అని అంటాడు ఆదిత్య.

" హమ్..ఏం చేద్దాం ఆ కృష్ణయ్య ఇలా రాసి ఉంటే మనమేం చేయగలం " అని అంటారు ఊర్మిళాదేవి గారు.

ఇంతలా గోపి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ "అమ్మగారు మన చిన్నమ్మ గారి గురించి టీవీలో వస్తుందండి " అని అంటారు.

ఆదిత్య రిమోట్ తీసుకొని హాల్లో ఉన్న టీవీ ఆన్ చేస్తాడు అప్పుడే టీవీలో ప్రేమ్ ఇంకా ప్రియా ఎంగేజ్మెంట్ న్యూస్ రన్ అవుతూ ఉంటుంది. 

**** ఈరోజు మన సిటీ లోని నెంబర్ వన్ బిజినెస్ మాన్ అయినా జగదీష్ చంద్ర గారి ఏకైక పుత్రిక ప్రియా గారి  ఎంగేజ్మెంట్ జరిగింది . వరుడు జగదీష్ చంద్ర గారి అక్క కొడుకు. అంతేకాదు  ఆవిడ తండ్రికి తగ్గ కూతురిగా ఆవిడకి అంటూ  ఒక పేరు తెచ్చుకున్నారు బిజినెస్ వరల్డ్ లో . ఈరోజు ప్రియా గారు సొంతంగా డిజైన్ చేసిన కపుల్ డ్రెస్  ఈరోజు ఆవిడ ఎంగేజ్మెంట్ పార్టీలో ఆవిడే వేసుకుని అడ్వటైజ్మెంట్ చేశారు, ఆ డ్రెస్ కి ఇప్పుడు అన్న మార్కెట్లో చాలా క్రేజ్ వచ్చింది***
అని అంటూ యాంకర్ ప్రియా ఇంకా ప్రేమ్ ఫొటోస్ చూపిస్తూ ఆ డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా ఆ డ్రెస్ కి ఇప్పట్లో మార్కెట్లో అన్న క్రాస్ గురించి కూడా.

ఆ న్యూస్ చూసి అందరూ షాక్ అవుతారు. మన ప్రేమ్ తప్ప.
జగదీష్ చంద్ర తన కూతుర్ని అలా న్యూస్ చానల్లో పొగుడుతూ ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు.

గాయత్రి గారు చిన్నగా సునంద గారిని ఇలా అడుగుతారు " మరదలా నీకు నిజంగా ఆ డ్రెస్ ప్రియా డిజైన్ చేసిన డ్రెస్ అని నీకు తెలియదా?" అని అడుగుతుంది.

"  నిజం వదిన అది ప్రియా డిజైన్ చేసిన డ్రెస్ అని నాకు అసలు తెలియదు, తెలిసి ఉంటే ఆ రోజు నీతో కలిసి ఆ డ్రెస్ ఎందుకు తీసుకుంటాను చెప్పండి ,అంత రేటు పెట్టి. "  అని అంటారు.

సునంద మాటలు కూడా కరెక్టే అనిపిస్తాయి గాయత్రి గారికి.
" పర్వాలేదు నా కోడలికి బిజినెస్ స్టేటజీస్  బాగా తెలుసు , బిజినెస్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది , ఒకవేళ నా బిజినెస్ అంతా కూడా తనకు ఇచ్చేసినా కూడా " అని అంటారా గుర్దీప్ . 

" ఎవరికి మావయ్య ఏదో ఇచ్చేస్తానంటున్నారు " అని  అడుగుతుంది  ప్రియా ,  అక్షయ చేయి పట్టుకొని  కిందకి వస్తు.

బ్యూటిషన్ తనకు చేసిన అలంకరణ అంతా కూడా తీసేసి ఫ్రెష్ అయి తన జడ ని మళ్లీ మామూలుగా అల్లుకొని , వైట్ చుడిదార్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ వేసుకొని , తన సహజమైన నాచురల్  బ్యూటీతో ఇంకా అందంగా మెరిసిపోతు కనిపించింది. 

తను అలా కిందకి వస్తూ ఉంటే ప్రేమ్ మైమరిచిపోయి తనని అలా చూస్తూ ఉండిపోతాడు.

" ఇంకెవరికి తల్లి నీకే నా బిజినెస్ అంతా కూడా నీకే రాసి ఇద్దాం అని అనుకుంటున్నాను"  అని అంటాడు గుర్దీప్.

" అంత పని మాత్రం అస్సలు చేయొద్దు మావయ్య ఇప్పుడున్న బిజినెస్ కే నాకు అసలు ఫ్రీ టైం దొరకట్లేదు, ఇప్పుడు అది కూడా నా భుజాల మీద వేసుకుంటే 24 గంటలు ఒక మిషన్ లాగా అయిపోతాను , నాకు అలా అవ్వాలని అస్సలు లేదు , ఐ వాన ఫ్లై లైక్ ఏ ఫ్రీ బర్డ్"  అని అంటూ అక్షయ ని సోఫాలో ఆదిత్య పక్కన  మెల్లగా కూర్చోబెడుతుంది.

సునంద గారు వెంటనే మాట్లాడుతూ " ఈరోజు వేసుకున్న డ్రెస్ నువ్వు డిజైన్ చేసింది అని నాకు ఎందుకు చెప్పలేదు " అని అడుగుతుంది.

ప్రియా , గాయత్రి ఇంకా సునంద గారి వైపు కోపంగా చూసి " ముందు నాకు ఇది చెప్పండి ఫస్ట్ , అది కపుల్ డ్రెస్ . అంటే కపుల్స్ మాత్రమే తీసుకోవాలి. మీ ఇద్దరూ కలిసి ఆ సేల్స్ గర్ల్ ని బురిడీ కొట్టించి నా డ్రెస్ ని అలా విడదీస్తారా , ఆ డ్రెస్ ని అలా విడదీస్తే దానికి విలువ ఉంటుందా, నేను దాన్ని ఎంత కష్టపడి డిజైన్ చేశానో మీకు తెలుసా?  " అని అడుగుతుంది.

గాయత్రి ఇంకా సునంద గారు తల దించుకొని " సారీ మాకు అ డ్రస్ బాగా నచ్చింది " అని ఇద్దరు ఒకేసారి అంటారు.

గాయత్రి గారు చిన్నగా " ఆ డ్రెస్ ప్రేమ్ కి బాగుంటుందని అనిపించింది , అడిగితే విడిగా ఇవ్వను అని అన్నారు అందుకే ఆరోజు అలా....
... , చేశాను " అని  అంటారు.
మళ్లీ వెంటనే " ఆ రోజు మేము చెప్పిన అబద్ధం ఈరోజు నిజం అయింది, అయినా మేము ఆ డ్రెస్ విడదీయలేదుగా " అని అంటారు సంతోషంగా.

" అవును తల్లి అక్క ఇంకా  మీ అమ్మ తెలియక చేసిన , ఈరోజు మీ ఇద్దరు కపుల్స్ గా ఆ డ్రెస్ వేసుకున్నారు,   అండ్ ఇంకొకటి ఈ డ్రెస్ కి ఇప్పుడు మార్కెట్లో క్రేజ్ ఎంత పెరిగిందో తెలుసా న్యూస్ లో దాని గురించే వేస్తున్నారు ఒకసారి చూడు"  అని టీవీ వైపు చూపిస్తారు జగదీష్ చంద్ర.

పొద్దున వాళ్ళ అమ్మ ఆ డ్రెస్ ఎంతో ప్రేమగా తెచ్చి వేసుకోమని అనడంతో వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక ఒప్పుకుంటుంది ప్రియా , తర్వాత వాళ్ళ అమ్మతో చెప్తాము అనుకుంది ఫంక్షన్ అయ్యాక. కానీ తర్వాత ప్రేమ్ నీ అ కపుల్ డ్రస్ లో అలా చూసి కొంచెం ఆశ్చర్య పోతుంది . అత్తయ్య ఇంకా అమ్మ కలిసి ఆ సేల్స్ గర్ల్ కి ఏదో చెప్పి తీసుకున్నారు అని అనుకుంటుంది.
తర్వాత ఆ డ్రెస్ తీసేద్దాం అని అనుకుంటుంది కానీ ప్రెస్ వాళ్లు కూడా వస్తున్నారు అని తెలిసి అ డ్రస్ అలా ఉంచుకుంటుంది . ఈ రకంగా తన డిజైన్ ని ఫ్రీగా అడ్వర్టైజ్ చేయొచ్చు అని ఆలోచించింది . తన అనుకున్నట్లే  అది సక్సెస్ అయ్యింది కూడా.
అందులోను వాళ్ళ అత్తయ్య ఇంకా అమ్మ,  ప్రేమ్ ఇంకా తన మీద ఉన్న ప్రేమతో అలా చేశారు అని ఏమీ అనలేక పోతుంది కూడా.

మెల్లగా వెళ్లి వాళ్ళ అమ్మ కూర్చున్నా సోఫా హ్యాండ్ మీద  కూర్చొని ఒక చెయ్యి అలా అమ్మ మీద వేసి "ఇప్పుడు చేస్తే చేశారు కానీ ఇంకెప్పుడో చేయొద్దు " అని అంటుంది.

హాల్లో అన్న సోఫాలో అందరూ కూర్చుంటారు.  ప్రేమ్ పక్కన అన్న చోటు మాత్రమే ఖాళీగా ఉంటుంది , వెళ్లి ప్రేమ్ పక్కన కూర్చోవడం ఇష్టం లేక వాళ్ళ అమ్మ కూర్చుని ఉన్న సోఫా హ్యాండ్  మీద అలా కూర్చొని ఉంటుంది ప్రియా. ప్రేమ్ ఒక పక్కన ప్రియా చేస్తున్న పనిని గమనిస్తూనే ఉంటాడు. 

ఇంతలో ఊర్మిళాదేవి గారి మాట్లాడుతూ " ఏంటే కాబోయే మొగుడి పక్కన కూర్చుంటే మేమందరం ఏమైనా అనుకుంటా మన వెళ్ళి అక్కడ కూర్చున్నావా మేమేమీ అనుకోములే వచ్చి మీ ఆయన పక్కన కూర్చో"  అని అంటారు ఊర్మిళాదేవి గారు.

’అబ్బా అమ్మమ్మ నువ్వు  గ్రేట్ అసలు , ఇలా నువ్వు  నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ ఇస్తే చాలు , నీ మనవరాలి చేత పెళ్లి అయి నేల తిరగకుండానే పుల్ల మామిడికాయ తినిపిస్తాను ’ అని మనసులో అనుకుంటాడు ప్రేమ్.

ప్రియా ఊర్మిళాదేవి గారి వైపు ఉరిమి చూస్తే , ’ఒసేయ్ మనవరాల ఇప్పటివరకు ఒక లెక్క ఇకమీదట ఒక లెక్క నా మనవడు వచ్చాడు ఇక చూసుకో ’ అని మనసులో అనుకుంటూ తానే లేసి ప్రియా ని బలవంతంగా ప్రేమ్ పక్కన కూర్చోబెడుతుంది.
ఇక చేసేది ఏమీ లేక అందులోనూ పెద్దవాళ్ళు అందరూ అక్కడే ఉండడంతో సైలెంట్ గా కూర్చుంటుంది ప్రియా. 

" ఎంత చూడమచ్చటగా ఉన్నారో , మీ ఇద్దరికీ ఎవరి దృష్టి తగలకూడదు " అని అంటూ  ఊర్మిళాదేవి గారు వారిద్దరికీ కలిపి వేటికలు విరుస్తుంది.

ఆదిత్య వాళ్ళిద్దరిని కలిపి ఫొటోస్ తీస్తాడు. తీసిన ఫొటోస్ చెక్ చేసుకుంటూ " ఇంతకీ ఈరోజు ప్లాన్స్ ఏంటి ఫ్రేమ్ ? ఎక్కడికైనా ప్లాన్ చేసావా ప్రియా తో , మూవీస్ లాంటివి అయితే నేను చెక్ చేశాను , సెకండ్ షోస్ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి వెళ్తారా టికెట్స్ బుక్ చేయమంటారా"  అని అడుగుతాడు ఆదిత్య .

" లేదు అన్నయ్య మాకు నైట్ వేరే ప్లాన్స్ ఉన్నాయిలే" అని అంటాడు ప్రేమ్ .

ప్రేమ్ అలా అనగానే ప్రియా వెంటనే తన మో చేతితో  ప్రేమ్ డొక్కలో పొడుస్తుంది .
ప్రేమ్ వెంటనే కవర్ చేస్తూ " అదే ..అదే ..నేను ఆల్రెడీ  మూవీ ప్లాన్ చేసుకున్నాను అని అంటున్నాను"  అని వెంటనే అంటాడు.

ప్రేమ్ నైట్ ప్లాన్స్ అనగానే అక్షయకి ఏదో క్లిక్ అయినట్టు అనిపిస్తుంది. ఈరోజు డేట్ గుర్తుకు వచ్చి ’ఓహో సో ప్రేమ్ కూడా వెళ్తున్నాడా ఈరోజు ప్రియా తో’ అని అనుకుంటుంది తన మనసులో.

" ప్రేమ్ మూవీ ప్లాన్ చేసుకునే మందు అత్తయ్యని మావయ్యని అడిగావా"  అని అడుగుతారు గాయత్రి గారు, 
ఎందుకంటే ప్రేమ్ దీని గురించి ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు కాబట్టి.  ఆయన ఆడపిల్లని బయటికి తీసుకెళ్లే ముందు వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి అని ఆవిడ ఉద్దేశం, అది ఎవరైనా సరే.

జగదీష్ చంద్ర వెంటనే మాట్లాడుతూ "  అక్క దీనికి అడగాల్సిన పనేముంది . నా కూతురు ఇప్పుడు ప్రేమ్ కి కాబోయే భార్య ఇప్పుడు వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లొచ్చు నేను ఏమి ఆడు అడ్డు చెప్పను" అని అంటాడు.

" అయ్యో అమ్మ , మావయ్య ..ఇది నేను చేసిన ప్లాన్ కాదు , ప్రియా నే చేసింది , కావాలంటే ప్రియా ని అడగండి"  అని ప్రియ  వైపు చూసి కన్ను కొడతాడు ప్రేమ్. 

అందరూ ప్రేమ్ చెప్పింది నమ్మసక్యం కాక ప్రియా వైపే చూస్తూ ఉంటారు.

’దొంగ సచ్చినోడు  నన్ను బాగా ఇరికించాడు, ఇప్పుడు వీళ్ళ మైండ్స్ లో ఏమి రన్ అవుతుందో ఏంటో ’. అని మనసులో అనుకోని. 

అందరి వైపు చూసి ఒక వెరీ నవ్వు నవ్వి " అవును నేనే ప్లాన్ చేశాను "  అని అంటుంది ప్రియా.

ఎందుకంటే ఈరోజు నైట్ అలా బయటికి వెళ్లే ప్లాన్ ప్రియా దే కాబట్టి తాను ఇన్వైట్ చేయకపోయినా ప్రేమ్ ఏ వస్తాను అని అన్నాడు .ఎలాగో తను చేసిన ప్లాన్ కాబట్టి అలా చెప్పింది.

ప్రియా నే బయటకి వెళ్లడానికి ప్లాన్ చేసింది అని తెలుసుకొని అందరూ సంతోషపడతారు.

కొనసాగుతుంది....

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.