you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ -36

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ -36

ప్రేమ్ ప్రియా కళలోకి చూస్తూ "  ప్రియా లుక్ ఇన్ టు మై ఐస్ . నన్ను నమ్ముతావు కాదు" అని డీప్ వాయిస్ లో అడుగుతాడు. 

ప్రియా అప్రయత్నంగా నమ్ముతాను అన్నట్లు తలకాయ ఊపుతుంది. 

ప్రేమ్ ఆ కీస్ తీసుకొని తను ముందుగా ఎక్కి బైక్ స్టార్ట్ చేసి ప్రియా కి చేయి అందిస్తాడు,  ప్రియా అతని చేతిలో చెయ్యి వేయగానే ప్రేమ్ కొంచెం వెనక్కి జరిగి ప్రియ ని అతని ముందు కూర్చోబెట్టి , ప్రియా చేతిని పట్టుకొని ప్రియా చేత్తో బైక్ స్టార్ట్ చేపిస్తాడు. 

బైక్ స్టార్ట్ అవ్వగానే ప్రియా కొంచెం భయంతో కళ్ళు మూసుకుంటుంది  అది గమనించిన ప్రేమ్ ప్రియా చేతి మీద అతను చెయ్యి ఉంచి ఎక్సెలరేటర్  రైస్ చేసి బైక్  ముందుకు పోనిస్తాడు .

ప్రేమ్ ప్రియా వెనక కూర్చుని ప్రియా చేతులు పట్టుకొని బైక్ రైడ్ చేపిస్తూ ఉంటాడు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ప్రియా చెవిలో "  ఓపెన్ యువర్ ఐస్ "  అని అంటాడు.

ప్రేమ్ ఊపిరి వెచ్చగా తన మేడ మీద తాకుతూ ఉంటే మెల్లగా కళ్ళు తెరుస్తుంది ప్రియా అ రోడ్డు మీద ఎక్కువ జనాభా ఉండరు రాత్రి సమయం అవ్వడంతో.

" బంగారం భయపడకు ఇది చాలా సింపుల్ టాస్క్,  నీ భయం వల్ల ఇది నీకు కష్టంగా అనిపిస్తుంది ,  ఒకసారి    నీ భయం వదిలేసి బైక్ రైడ్ ని ఎంజాయ్ చెయ్ " అని అంటాడు.

ప్రియా అలా కొంచెం దూరం వెళ్లాక , తన భయాన్ని పక్కన పెట్టి బైక్ రైడ్ ని ఎంజాయ్ చేస్తుంది,  ప్రియా కి సపోర్ట్ చేస్తూ బైక్ ముందుకు పోనిస్తూ ఉంటాడు ప్రేమ్. 
ప్రియా కి తెలియకుండానే అతని చెయ్యి వెనక్కి తీసుకుంటాడు.  ప్రియ ఒకటే ఆ బైక్ రైడ్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అలా ఒక గంట పాటు సిటీ అంతా కూడా చక్కర్లు కొడుతుంది. 

కొంచెం సేపటికి ప్రేమ్ ప్రియా వెళుతున్న డైరెక్షన్ మారుస్తాడు అది చూసి "ఎక్కడికి వెళ్తున్నాం"  అని అడుగుతుంది.

" నువ్వే చూస్తావుగా"  అని అంటూ ఒక హిల్ టాప్ ఏరియా కి తీసుకువెళ్తాడు. 
అక్కడికి వెళ్ళగానే ప్రియా కళ్ళు మూసి " ఒక నిమిషం బంగారం నేను చెప్పే వరకు కళ్ళు తెరవదు" అని చెప్పి తనని నడిపించుకుంటూ తీసుకెళ్తాడు .

కొంచెం సేపటి తర్వాత ప్రియా కల్లు మీద ఉన్న చెయ్యి తీసి" ఇప్పుడు చూడు " అని అంటాడు.

ఆ హిల్ టాప్ ఏరియా నుంచి చూస్తుంటే సిటి అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ లైట్ , రాత్రివేళలో నిద్రిస్తున్న ఆ సిటీ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది .

" వావ్... చాలా బాగుంది"  అని అంటుంది ప్రియ .

" నచ్చిందా"  అని అంటాడు.

"  చాలా నచ్చింది, నైట్ పూట సిటీలో తిరుగుతూ ఉంటాను గాని,  ఇలా నేను  పుట్టి పెరిగిన సిటీ ని ఎలా  చూడడం ఇదే మొదటి సారి , చాలా బాగుంది" అని అంటుంది.

  ప్రేమ్ చిన్నగా నవ్వుతూ " అరవాలి అని ఉందా " అని అంటాడు.

ప్రియా ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటే.
"  నీ పేరు ఈ సిటీ అంతా వినిపించేలాగా అరువు బంగారం"  అని అంటూ. 
ప్రేమ్  అరుస్తూ "థాంక్యూ..... వెరీ... మచ్... సిటీ...!"  అని అరుస్తాడు

ప్రియా ఆశ్చర్యంగా " థాంక్స్ ఎందుకు చెప్తున్నావు ?" అని అడుగుతుంది

" ఎందుకంటే ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది నేను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చింది,  అలాగే మా అమ్మ కుటుంబాన్ని, అలాగే అంతులేని సంతోషాన్ని , మొదట్లో ఈ ఊరు రావడం నాకు ఇష్టం లేదు,  కానీ ఇప్పుడు ఈ ఊరు వదలడం ఇష్టం లేదు " అని అంటాడు.

ప్రియా కూడా " థాంక్యూ...! " అని అరుస్తుంది. 

" నువ్వు థాంక్స్ ఎందుకు చెప్పావు బంగారం" .

" ఎందుకంటే ఇది నా ఊరు,  నేను పుట్టింది ఇక్కడ పెరిగింది ఇక్కడ అంతేకాదు ఈ ఊరు నాకు ఎన్నో ఇచ్చింది ఫ్రెండ్స్ , ఫ్యామిలీ ఇంకా చాలా అందుకే థాంక్స్ చెప్పాను"  అని అంటుంది.

" ప్రియా ... ఐ ..లవ్.. యు! "  అని  మళ్ళీ గట్టిగా అరుస్తాడు ప్రేమ్.

అదే టైమ్ లో  ఒక డ్రోన్ వీళ్ల పైనుంచి వెళ్లి ఒక చెట్టు  పైన ల్యాండ్ అవుతుంది , ఇంకా వీళ్ళు మాట్లాడే ప్రతి మాట అందులో రికార్డ్ అవుతా ఉంటుంది

ఆ మాటకి ప్రియా ప్రేమ్ వైపు చూసి " నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు ప్రేమ్"  అని అడుగుతుంది.

"  అదేం ప్రశ్న బంగారం. ఎందుకు ప్రేమిస్తున్నాను అనడం కన్నా ఎంత ప్రేమిస్తున్నానో అని అడగొచ్చు కదా" అని అంటాడు. 

ప్రేమ్ తో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకోని "ప్రేమ్ నీకు ముందే తెలుసు నా పాస్ట్ గురించి నేను విన్ను నీ ఎంతగా ప్రేమించా నో అని నేను విన్ను కి తప్ప ఈ మనసులో ఎవరికీ స్నానం ఇవ్వలేను నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న కూడా నువ్వు అనుకున్న ప్రేమ నేను నీకు ఇవ్వలేను ప్రేమ్,  ప్లీజ్ అర్థం చేసుకో , నా ఈ మనసులో విన్ను కి తప్ప ఎవరికీ చోటు ఇవ్వలేను, విన్ను నా శ్వాస... నా జీవితం... నా కలలన్నీ. అతను పోయిన రోజు నుంచీ... నేను బతకడం ఆపేశా ప్రేమ్. నీ ప్రేమ గొప్పదని నాకు తెలుసు. కానీ నా హృదయంలో విన్ను కు తప్ప ఇంకెవరికీ స్థానం లేదు,  ఇవ్వను కూడా"  అని ఎమోషనల్ గా చెప్తుంది.

ప్రియా వైపు చూసి తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని " చూడు  ప్రియ నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావో నాకు బాగా తెలుసు.  నేను నీ మనసులోకి వస్తే నీ విన్ను ఎక్కడ దూరం అయిపోతాడు అనేదేగా నీ  భయం. నేను నీ జీవితంలోకి వస్తే నీ విన్ను నీకు దూరం ఎప్పటికీ అవ్వడు , నీ విన్ను నీతోనే ఉంటాడు.  నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నీ విన్ను నిన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా నిన్ను అలాగే ప్రేమిస్తాను.  నీ ఇష్టాలకి గౌరవం ఇస్తాను , నిను ఎప్పటికీ హార్ట్ చేయను ,నీ మనసులో ఒక చిన్న చోటు నాకు దొరికిన చాలు బంగారం. ఈ జన్మకి"  అని అంటాడు.

ప్రియా మాత్రం కన్నీళ్ళతో " ప్రేమ్ ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు చెప్పినంత సులువు కాదు,  నేను నిన్ను నువ్వు అనుకున్న విధంగా అయితే ప్రేమ పంచలేను , నా మనసులో విన్ను ఉన్నంతకాలం ఆ చోటు ఎవరికి ఇవ్వలేను ఈ జన్మకి నా మనసు విన్ను కి మాత్రమే సొంతం ,నేను విన్ను ను మరిచిపోలేను ప్రేమ్" అని అంటుంది.

"నిన్ను ఎవరు మరచిపోమని చెప్పారు? నీ ప్రేమను గౌరవిస్తాను. కానీ నా ప్రేమకు కూడా ఓ చోట ఇవేవీ నీ మనసులో ప్లీజ్ " అని అంటాడు.

ప్రియా మాత్రం ఏమీ మాట్లాడకుండా ప్రేమ కళ్ళల్లో అలా చూస్తూ ఉండిపోతుంది. ఎలా చెప్తే ప్రేమ్ కి అర్థం అవుతుందా తనకి అర్థం కావట్లేదు.

" ప్రియా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు , ఆది ని మనసుకి తెలుస్తుంది కానీ  నీ ఆలోచనలు  దానికి ఒప్పుకోవడం లేదు" .

ఆ మాటలకు ప్రియా కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ వైఫై చూస్తుంది. 
" అవును ప్రియా... నీవు నన్ను ప్రేమిస్తున్నావు. కానీ నీవు నీ మనసులో విన్ను ను కోల్పోతాననే భయంతో నన్ను అంగీకరించలేకపోతున్నావు.  నీకు నీవే అర్ధం చేసుకోవాలి. ప్రేమ కొత్తను అంగీకరించడం కాదు. గతాన్ని మరచిపోవడం కూడా కాదు. ప్రేమ అనేది మన హృదయంలో ఒక చోట ఇచ్చే ధైర్యం."

ప్రేమ్ మాటలు  తన హృదయానికి తాకిన కూడా అవి ఒప్పుకోవడానికి  తన మనసు అంగీకరించట్లేదు.

" నేనంటే ఇష్టం లేని అమ్మాయి వెంటపడి నన్ను ప్రేమించు అని తనను ఇబ్బంది పెట్టే అబ్బాయిని అయితే నేను కాదు, నీ  మనసులో నేను ఉన్నాను , నాపై ఉన్న ప్రేమ నీ కలల్లో కనిపిస్తూ ఉంటుంది,  నీ చేష్టల్లో నామీద  ప్రేమ కనిపిస్తుంది , నువ్వు చెప్పకపోయినా ,నీ ఈ కళ్ళు అబద్ధం చెప్పావు" .

ఆ మాట వినగానే ప్రియా వెంటనే కళ్ళు దించేస్తుంది .
ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ "మనం  పెళ్లికి ఇంకా ఒక నెల ఉంది ప్రియా, ఈ నెల రోజుల్లో నేను నీకు నా ప్రేమను రుజువు చేస్తాను, నీలో నాపై ఉన్న ప్రేమను బయటకు తీస్తాను , నువ్వు పెళ్లి పీటలు నాపై ఉనా ప్రేమతో ఎక్కుతావు ,  ఇది ఒక ప్రేమ పోరాటం కాదు, ఇది నీ హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయాణం. నేను ఓడిపోతే... నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాను. కానీ గెలిస్తే... నీవు నన్ను ప్రేమిస్తావని నాకు తెలుసు."

*****

రుద్రా బయటికి వెళ్లడానికి బైక్ తీస్తూ ఉంటే జోన్స్  "రుద్ర ఎక్కడికి రా?  , ఈ టైం లో బయటికి వెళ్తున్నావ్  ? ఇది సేఫ్ కాదు , నా  మాట విను ఆ ప్రేమ్ ఇంకా అతని టీమ్ నీకోసం వెతుకుతున్నారు,   ఈ టైం లో నువ్వు దొరికితే నిన్ను చంపేస్తాడు ప్లీజ్ నా మాట వినరా " అని అంటాడు.

రుద్ర మాత్రం కూల్ గా సమాధానం ఇస్తూ "భయపడకు రా ఏమీ కాదు జస్ట్ అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను అంతే " అని అంటాడు.

" ఒరేయ్ లీల సార్ కి నువ్వు ఇలా రీసెర్చ్ వదిలేసి బయటికి వెళ్లావు అని తెలిస్తే చంపేస్తాడు రా ప్లీజ్ నా మాట విను" అని అంటూ జోన్స్ బతిమాలుతాడు. 

లీలా అనే పేరు వినగానే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ " ఆయన నన్ను చంపలేడులే నా అవసరం ఆయనకి ఉంది,  భయపడకు . ఆయన నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చిన నేను చూసుకుంటాను"  అని చెప్పి ఇంకో మాటకి తాగు ఇవ్వకుండా స్పీడ్ గా బైక్ మీద వెళ్ళిపోతాడు.

రుద్ర కి ఒక చెయ్యి లేకపోయినా కూడా అతని కృత్రిమ చేయతో చాలా ఈజీగా బైక్ రైడ్ చేయగలుగుతాడు .

" నీకే బాబు అతను మీ బాబు కాబట్టి అంత లైట్ గా తీసుకుంటున్నావు. నువ్వు ఇలా బయటికి వెళ్లావు అని తెలిస్తే కొడుకు కాబట్టి నిన్ను ఏమీ అనడు,  నన్ను మాత్రం చంపేస్తాడు"  అని అనుకుంటాడు జోన్స్.

ఇంతలో జోన్స్ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూస్తాడు స్క్రీన్ మీద " లీల సర్ " అని చూసి వనికిపోతో లిఫ్ట్ చేస్తాడు " హలో సార్"  అని అంటూ. 

" వేర్ ఇస్ హి , ల్యాబ్ సెక్యూరిటీ కెమెరాలో కనిపించలేదు"  అని ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది.

జోన్స్ కి ఏం చెప్పాలో అర్థం గాక గుటకలు  మింగుతూ ఉంటాడు. " సర్ ఆది..." 

జోన్స్ ఇంకా ఏమి చెప్పక ముందే " గాట్ ఐటీ "  అని ఫోన్ కట్ చేస్తాడు.

లీలా విసురుగా ఫోన్ గోడకి ఏసి  కొట్టి " ఆ.....  వాడిని అప్పుడే చంపేయాల్సింది నాకు ఏదో ఉపయోగపడతాడు కదా అని ఉంచాను ఇప్పుడు వీడిని లేపేసే టైం వచ్చేసింది " అని అంటూ ఈవిల్  స్మైల్ ఇస్తాడు.

ఇతను ఎవరో అనుకుంటున్నారా , ఇతను ఎవరో కాదు అండి ఇంతకుముందు మీకు చెప్పాను చూశారు ఎపిసోడ్ 26 లో  అతనే ఇతను ఇతని పేరు లీలా , ఇతను రుద్రా ఫాదర్ ఏంటి ? సొంత కొడుకుని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు?  ఇతనికి ప్రియా కి సంబంధం ఏంటి ? అసలు ప్రియా కి రుద్రా కి సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారు కదా . మందు మందు మీకే తెలుస్తుంది లేండి. ఇతను ఎంత ఈవిల్ పర్సన్ నో , ఇతని వల్ల ప్రియా తన లైఫ్ లో ఏమేమి కోల్పోయిందో కూడా. 

***.

రుద్రా తన ఫోన్లో ప్రియా ఇంకా ప్రేమ్  మధ్య జరుగుతున్న డిస్కషన్ అంతా కూడా చూస్తూ బైక్ రైడ్  చేస్తున్నాడు.
యాక్చువల్లీ చెప్పాలి అంటే రుద్ర బైక్ రైడ్  చేయట్లేదు అది ఆటోమేటిక్ గా  వెళుతుంది . ఇది రుద్రా స్పెషల్ గా డిజైన్ చేసుకున్నా బైక్ , ఇది మ్యానువల్ గా ఇంకా రోబోటిక్ గా  కూడా రన్ అవుతుంది.

" సో వీడు ప్రియ నీ లవ్ చేస్తున్నాడు అనమాట, విడి కాలాల్లో ప్రియ మీద అన్న ప్రేమ కనిపిస్తుంది, ప్రియా నిజంగా వీడిని ప్రేమిస్తే నా చేతిలో బతికి పోతాడు , ప్రియా కోసం వీడిని నేను కాపాడతాను , లేకపోతే నా చేతుల్లో చస్తాడు , వీడికి కేవలం వన్ మంత్ టైం మాత్రమే ఉంది,  వీడి చావు లేదా బతుకు  ఇప్పుడు ప్రియ వీడిని ప్రేమించడంలో ఉంది " అని అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తాడు  రుద్ర.

వీడియోలో ప్రియ నీ చూస్తూ " నా ప్రియా ని చూసి చాలా రోజులు అవుతుంది ఈరోజు తనని చూడాలి " అనుకుంటూ  నావిగేషన్ మార్క్ సహాయంతో ప్రియా ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాడు. 

****.

ప్రేమ్ ప్రియా తో మాట్లాడుతూనే తన పరిసరాలు గమనిస్తూ ఉంటాడు అతనికి ఏదో తేడాగా అనిపిస్తుంది.
అతని కళ్ళు చుట్టూ స్కాన్ చేస్తూ డ్రోన్ ఉన్న చెట్టు మీద ఆగుతాయి.

వీడియోలో వీళ్ళనే చూస్తున్న రుద్ర , ప్రేమ్  కదలికల చూస్తూ ఉంటాడు , ప్రేమ్ డ్రోన్  అక్కడే ఉంది అని కనిపెట్టాడు అని రుద్రా కి అర్థమవుతుంది.
" నాట్ బ్యాడ్ విడి అలాట్నెస్ బాగానే ఉంది" అని అనుకుంటాడు రుద్ర. 

ప్రియా ని అక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్లాలి అనుకుని ప్రేమ్ నార్మల్ గా మాట్లాడుతూ " బంగారం చాలా టైం అయింది పద వెళ్దాం నీ ఫ్రెండ్స్ ఈపాటికి స్టార్ట్ అయ్యి ఉంటారు,  వాళ్ళని కలవాలి కదా , మళ్ళీ నువ్వు లేకపోతే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు , వెళ్దాం "  అని అంటూ  ప్రియ ని అక్కడ నుంచి తీసుకువెళ్తాడు.

ఈసారి బైక్  ప్రేమ్ రైడ్ చేస్తాడు. ప్రేమ్ స్పీడ్ గా తోలడంతో ప్రియా ప్రేమ్ నీ  గట్టిగా పట్టుకొని " ఏంటి అంత స్పీడ్ గా వెళ్తున్నావ్  మెల్లగా వెళ్లొచ్చు కదా "  అని అంటుంది.

" డోంట్ వర్రీ బంగారం నన్ను గట్టిగా పట్టుకో నీకేం కాదులే " అని అంటాడు.

ప్రియా ఆకాశంలో చూడగానే అక్కడ ఒక డ్రోన్ కనిపిస్తుంది " హే ప్రేమ్ అక్కడ చూడు ఒక డ్రోన్ " కానీ అంటుంది. 

ఆ మాట వినగానే ప్రేమ్ కళ్ళు ఎర్రగా అవుతాయి. 

కానసాగుతుంది...

ఇంతకీ రుద్ర ప్రియ నీ  కలుస్తాడా? డ్రోన్ వాళ్ళ వెంట పడడం చూసిన ప్రేమ్ ఏం చేస్తాడు? రుద్ర ఇంకా ప్రేమ్ ఎదురుపడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? 

తపుళ్లు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.