పప్పు , ప్రభలిద్దరూ గీతిక గురించి మాట్లాడిన తర్వాత ప్రభ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాక "గీతిక నువ్వు ఎంత వద్దనుకున్నా నాకు మాత్రం నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది అంతేకాదు "నువ్వు నా అనుకున్నా అందుకే ఎంత కష్టమైనా సరే నిన్ను వదులుకోను. నీవు కూడా నన్ను నా అనుకునే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను . నువ్వంటే ఇంత ప్రేమ ఎందుకో తెలుసా ? నీ మనసేంటో నాకు తెలుసు. నీవు నీ తల్లిదండ్రులకు ఇచ్చే విలువ ,గౌరవం నాకు ఎంతగానో నచ్చాయి. మా అమ్మని కూడా బాగా చూసుకుంటావు అన్న నమ్మకం నాకుంది అందుకే...ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పొంది తీరుతాను." అని నిర్ణయించుకుని అద్దంలో చూసి ఓ చిన్న స్మైల్ ఇచ్చి "గుడ్ కీప్ ఇట్ అప్ ప్రభ" అని తనకు తానే చెప్పుకొని ఆరోజు రాత్రి పని ఉండడంతో డైరీ కి వెళ్లాలనుకున్నాడు ప్రభ.
**
జేజి, తాతయ్యలతో మరొకసారి ఉద్యోగ ప్రయత్నంప్రయత్నం చేస్తానని చెప్పిన గీతిక ఉదయం 8 గంటలకి చాలా సింపుల్ డ్రెస్ వేసుకొని జుట్టు వదులుగా వదులుకోకుండా జడవేసింది.
వాచి వైపు చూసి "ఈరోజు త్వరగా వెళ్ళాలి. పిన్ని కొడుకు చంద్రహాస్ ఆఫీసులోకి వెళ్లే లోగా వాడిని మాట్లాడించి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అప్పుడు నాకు కాస్త బలం ఉన్నట్టు అవుతుంది అనుకొని బ్యాగ్ కుడి భుజంపై తగిలించి హాల్లో ఉన్న జేజే దగ్గరికి వచ్చి ' జేజీ వెళ్లొస్తా' అంది గీతిక.
"సరే గీతిక, ఈసారి జాగ్రత్త సుమా! ఈసారి ఆచితూచి అడుగు ముందుకు వెయ్యి . ముందు నిన్ను నీవు నమ్ముకో . అంత తొందరపడి ..ఎవరిని నమ్మొద్దు. తాతయ్య గేటు వరకు వచ్చి వదిలిపెట్టి వస్తారు" అని జేజీ చెప్పేసరికి తాతయ్య గేటు వరకు వదిలి వచ్చేసరికి బయలుదేరింది గీతిక.
బస్సులో జరిగిన డిస్ట్రబెన్స్ వలన బస్సు దిగాల్సిన చోటు కాకుండా వేరే స్టాప్ లో దిగింది గీతిక.
పిన్ని కొడుకు చంద్రహాస్ కి ఫోన్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా టవర్ ప్రాబ్లం వినపడట్లేదు అంటుంటే మెసేజ్ చేసింది గీతిక. అయినా అటువైపు నుండి రెస్పాన్స్ రాకపోగా బహుశా టవర్ ప్రాబ్లంఅయి ఉంటుందేమో అనుకొని అక్కడ ఉన్న వాళ్ళను కంపెనీ పేరు చెప్పి అడ్రస్ అడిగి ఆటో ఎక్కి వెనక స్టాప్ కి బయలుదేరింది గీతిక.
కంపెనీకి ఎదురుగా ఆటో నిలబడడంతో ఆటో దిగి వడివడిగా వచ్చింది గీతిక.
చంద్రహాస్ ఎక్కడైనా కనిపిస్తాడేమోనాని చూడగా ఎక్కడ వాడి జాడలేదు. ఇక ఇంటర్వ్యూ కి వెళ్ళి వరుసలో కూర్చోగా తన వంతు రావడంతో "మే ఐ కం ఇన్ సర్" అంటూ అనుమతి అడుగుతుంది డోర్ దగ్గర నిలబడి.
" ఎస్ కం ఇన్" అన్న ఎం.డి ముందుకు వెళ్లి" గుడ్ మార్నింగ్ సార్ "అంది గీతిక.
"వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ సిట్ డౌన్ "అన్నాడు తను
..కుర్చీ చూపిస్తూ..
గీతిక కూర్చోగానే 'యువర్ నేమ్' అడిగాడు అతడు.
"మై నేమ్ ఇస్ గీతిక సర్ " చెప్పింది గీతిక
..ఎస్, మిస్ గీతిక ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అని అడిగాడు అతను.
నో సర్, జస్ట్ ఐ ప్రాక్టీస్డ్ ఇన్ ట్రైనింగ్ టైం ఓన్లీ అండి గీతిక తడుముకోకుండా .
ఓకే, నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను దానిని అరగంటలో ఫినిష్ చేయాలి అని ఎండి చెప్పడంతో, " ఐ విల్ ట్రై ఇట్ సర్ "అంది గీతిక.
అతను ఫార్మసీ కి సంబంధించిన టాస్క్ ఇవ్వడంతో తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అరగంటకు ఐదు నిమిషాలు ముందే ఆ టాస్క్ ని ముగించింది గీతిక."
ఎం. డి తన పీఏని పిలిచి "గీతిక ఫినిష్ చేసిన టాస్క్ ఇలా తీసుకుని రా "అని చెప్పడంతో అతను తీసుకెళ్లి ఇచ్చాడు .
ఎండి మొత్తం పరిశీలించి "ఏ అనుభవం లేకుండా ఈ చిన్న ప్రాజెక్టుని ఇంత త్వరగా ఎలా ఫినిష్ చేసింది రియల్లీ ఇంటెలిజెంట్ "అనుకొని గీతికని పిలవడంతో వచ్చింది గీతిక.
గీతిక తిరుగులేదు నీకిక "అన్న ఎం డి మాటలు విని చాలా సంతోషం అనిపించింది గీతికకి . తప్పకుండా ఇక్కడ నాకు జాబ్ ఇస్తారని నమ్మకం కలిగి సర్ ఏం చెప్తాడోనని అతని వైపు చూసింది గీతిక .
గీతిక నువ్వింక వెళ్ళొచ్చు తర్వాత మేము కాల్ చేస్తాం అని అతను చెప్పడంతో ముఖం చిన్న పోయింది గీతికకి.
అయినా కాస్త ధైర్యం తెచ్చుకుని 'థాంక్స్ సర్' అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్తుంటే ఆ కంపెనీ షేర్స్ కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు అటే వస్తున్నారు.
గీతిక ఎటు చూడకుండా బయటికి వెళ్ళింది.
ముగ్గురిలో ఒకతను వెనక్కి తిరిగి...చూసి తనని నేను ఎక్కడో చూసానే ఎక్కడ
అని అనుకుంటుండగానే గేటు దాటింది గీతిక.
ముగ్గురు వ్యక్తులు ఆఫీసుకెళ్లగా ఒక వ్యక్తి తన ఎండీ (M.D.) తో మాట్లాడుతూ, ఇంతకుముందు ఇక్కడి నుండి ఒక అమ్మాయి వెళ్ళిందని చెప్తాడు. దానికి ఆ ఎండీ "ఎవరు ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయినా?" అని అడుగుతాడు.
అవతలి వ్యక్తి "అవును" అని సమాధానం ఇస్తాడు.
ఆ వ్యక్తి ఎండీని "ఆ అమ్మాయి మీకు ఏమైనా తెలుసా?" అని అడుగుతాడు.
దానికి ఎండీ సమాధానమిస్తూ... "అవును, ఆ అమ్మాయి నాకు తెలుసు. తను చాలా తెలివైనది, చురుకైనది. కాకపోతే కొంచెం మెత్తనైన స్వభావం కలది. మనం ఎంత మంచిగా చూసుకుంటే, అంత బాగా పని చేస్తుంది. ప్రాజెక్ట్ డెమో కూడా చాలా బాగా ఇచ్చింది" అని ఆమెను మెచ్చుకుంటాడు.
అప్పుడు ఆ వ్యక్తి "అవునా సర్! కానీ నేను ఎక్స్పీరియన్స్ (అనుభవం) గురించి అడిగితే లేదు అని చెప్పింది" అని ఎండీ అంటాడు.
దానికి ఆ వ్యక్తి "చెప్పిండొచ్చు, ఎందుకంటే ఇంతకుముందు తను కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మాకు డెమో ఇచ్చింది. పాపం తనకి ఏదైనా సమస్య వల్ల ఆ కంపెనీ మానేసిందేమో లేదా కంపెనీ నుంచి ఏదైనా సమస్య వచ్చిందో ఏమో ఇవన్నీ మనకి కామన్ కదా. పనిచేసే వారికి వంద కంపెనీలు ఉంటాయి అలాగే కంపెనీలకి వేల మంది పని వాళ్ళు ఉంటారు ఏమంటే పనితనం ముఖ్యం అంతే అన్నాడు అతను.
అందుకే సర్ నేను పెండింగ్లో ఉంచాను. నేను ఇచ్చిన టాస్క్ ఎంత త్వరగా ఫినిష్ చేసింది. అందుకే నాకు అనుమానం వచ్చింది పాపం నేను ముందు మాట్లాడినప్పుడు తన కళ్ళల్లోని కాంతి కనబడింది తర్వాత కాల్ చేస్తానన్నప్పుడు తగ్గిపోయింది అన్నాడు ఎం డి.
సరే , సరే నేను చూసింది చెప్పాను. మీ కనిపించింది మీరు చేశారు కానీ ఆ అమ్మాయికి జాబ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను లేదా నాకు తను ఫోన్ నెంబర్ ఇస్తే నేనే నా కంపెనీలో జాబ్ ఇస్తాను...
లేదు, లేదు సార్. నేనే కాల్ చేస్తాను అంత నాలెడ్జ్ ఉన్న జాబర్ని నేను వదులుకోలేను అన్నాడు ఎం డి.
సరే ఆ పని చెయ్ బాగుంటుంది అని చెప్పి వెళ్ళాడు అతను.
గీతిక గేటు దాటి బయటికి వెళుతూ దప్పిక అనిపించడంతో ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని ఫ్రూట్ జ్యూస్ అంగడికి వెళుతుంది. అక్కడ జనాలు బిజీగా ఉండడంతో ఒక టేబుల్ దగ్గర ఉన్న చైర్ లో కూర్చుంది గీతిక.
షాప్ అబ్బాయి వచ్చి "మేడమ్ చెప్పండి" అనడంతో ఒక వాటర్ బాటిల్ ఇవ్వు అని చెప్పింది గీతిక.
ఆ అబ్బాయి తెచ్చి ఇవ్వగా మూత తీసి తాగాలని నోటి దగ్గర పెడుతుంటే చంద్రహాస్ మాటలు వినిపించడంతో అటువైపు చూసింది గీతిక.
చంద్రహాస్ పక్కన ఒక అమ్మాయి ఇంకా ఒక అబ్బాయి మరొక జంట రావడం చూసి ఇటు తిరిగింది గీతిక. లేచి వెళదామనే లోగా వాళ్ళు తన కూర్చున్న టేబుల్ వెనక కూర్చో...కూర్చోగా ఇక లేచి వెళ్లలేకపోయింది గీతిక.
చందు, నిన్ను వారం రోజుల నుండి చూస్తున్నాను అసలు ఎక్కడికెళ్తున్నావ్ ?ఫోన్ చేస్తే తీసేది లేదు పైగా ఎవరో అమ్మాయి నీతో రావడం నేను చూశాను అంది చంద్రహాస్ పక్కన కూర్చున్న అమ్మాయి .
ఈరోజు వాలంటైన్స్ డే కదా పోయి పోయి ఈరోజు వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అన్నాడు చంద్రహాస్.
"హలో! నిన్ను చూస్తే అంత బాగా తనని బండిమీద ఎక్కించుకొని ఊరేగుతుంటివి ఇప్పుడు వేరే ఎవరో అంటున్నావ్ "అంది అమ్మాయి కోపంతో మూతి ముడిచి.
నాకు అర్థమైంది డియర్ నువ్వు ఈరోజు ఆ అమ్మాయి విషయం చెప్పే వరకు నన్ను వాలెంటైన్స్ డే జరపనివ్వవు కాబట్టి నాకు చెప్పక తప్పదు అంటే గీతిక గురించి ఇలా చెబుతాడు.
ఆ అమ్మాయి పేరు గీతిక. మా పెద్దమ్మ పెంచుకున్న అమ్మాయి. మా తమ్ముడిని తొట్టిలోకి పడేసిందని మా పెద్దమ్మకి తనంటే అస్సలు పడదు. అయినా మా పెద్దనాన్న ఉన్నారే అసలు ఆమె మాట వినడు. ఆ అమ్మాయికి ఇల్లు కొని , ఇంత ఆస్తి కూడా చేశాడు. ఇక అది నచ్చక ఈ టౌన్ లోనే ఉన్న ఒక ఇంట్లో వదిలిపెట్టారు. అయితే నెల రోజుల నుండి ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ పెద్దనాన్న ఇంటికొచ్చిన అతని ముఖంలో చిరునవ్వే లేదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ముఖం మాడిపోయి ఉంటుంది . అందుకోసం మా పెద్దమ్మ నన్ను ఆ ఇంటికి ఒకసారి వెళ్లి అక్కడి పరిస్థితి ఏంటో నాకు చెప్పమని చెప్పింది. అందుకే నేను గీతిక ఉన్న ఇంటికి వెళ్లాను. తనతో బాగా మాట్లాడేసరికి కొన్ని విషయాలు మాత్రమే తెలిసాయి. అసలు విషయంఇప్పటికీ తెలీదు తను చాలా తెలివైనది అందుకే తెలియనివ్వలేదు. అదే విషయం పెద్దమ్మతో చెప్పగా భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారని తెలిసింది. తనను ఏ మోక్షాన వాళ్ళింట్లోకి తెచ్చుకున్నారో గాని వారికి మనశాంతి లేదు. ఇక మా తమ్ముడు బంగారానికి ఏం పెట్టిందో ఏమో తెలియదు గానీ వాడు మాత్రం ఆ అమ్మాయి వైపే . తనతో మాట్లాడి నందుకు నీవు నన్ను అపార్థం చేసుకున్నావు అన్నాడు చంద్రహాస్ ఆ అమ్మాయిని చూస్తూ .
.