ప్రేమ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గానీ ప్రియా మాత్రం ఉన్న చోట అలాగే ఉండిపోయింది. ప్రేమ్ పెదవుల తడి ఇంకా తన నుదుటిపై అలాగే ఉంది. ప్రేమ్ చెప్పిన మాటలు ఇంకా తన చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి, ప్రేమ్ చివరలో చెప్పిన ఒక్క మాట "నాకు ఒక్క అవకాశం ఇవ్వవే" అన్నమాట పదేపదే తన చెవులలో వినిపిస్తుంది.
ప్రియ గుండె రాయి కాదు కదా... ప్రేమ్ మాటలు ఆమెను కదిలించాయి. నిజం చెప్పాలంటే, ఆమెకూ ప్రేమ్ పట్ల తన మనసు మూలల్లో ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ ఒక భయం ఆమెను ఆపేస్తోంది.
"నాకు ప్రేమ్‌ని పూర్తిగా ప్రేమించగల శక్తి ఉందా?" అని.
మనం ఒకరిని ఎంతగా ప్రేమించినా కూడా, వాళ్ల గురించి అన్ని తెలుసుకు కూడా, కొన్ని సందర్భాల్లో ఘాతం వాళ్ళని బాధిస్తూనే ఉంటుంది.
ప్రేమ్ ప్రియా నీ అంగీకరించాడు. ఆమె గతాన్ని, ఆమె బాధను, ఆమె మౌనాన్ని కూడా ప్రేమించాడు. కానీ ప్రియ గుండెల్లో విన్ని ఉన్నాడు. ఆ ప్రేమ ఇప్పటికీ జీవిస్తుంది. అదే ప్రేమ… ప్రేమ్ మనసును గాయపరచకూడదన్న భయం ప్రియను ఆపేస్తోంది.
అక్షయ ప్రేమ్ వెళ్లిపోగానే ప్రియా పరిస్థితి ఏంటో తెలుసుకుందామని లోపలికి వస్తుంది అక్కడ ప్రియ ఒక శిలా విగ్రహం లాగా ఏదో ఆలోచిస్తూ అలా నిలుచొని ఉంటుంది.
అక్షయ ప్రియ నీ కదిలిస్తూ " ఏమైంది అలా ఉన్నావ్, ప్రేమ్ నిన్నేమైనా చేశాడా" అని అడుగుతుంది.
ప్రియా , అక్షయ మాటలకి ఈ లోకంలోకి వస్తూ "లేదు అతను ఏమి చేయలేదు" అని అంటుంది .
" అసలు మీ ఇద్దరు ఒకే బాత్రూమ్ లో... అసలు ఏం జరిగిందే" అని అడుగుతుంది.
ప్రియా జరిగింది మొత్తం క్లియర్ గా అక్షయకి చెప్తుంది.
ప్రియా చెప్పింది మొత్తం విన్న అక్షయ ప్రియ మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ ప్రేమగా " స్వీటీ ప్రేమ్ నా మరిది అనో ,లేకపోతే నువ్వు నా తోటి కోడలు అయితే బాగుంటుంది అనో , నేను ఇలా చెప్పడం లేదు ప్రేమ్ నీ నేను రోజా చూస్తూ ఉంటాను అతను చాలా మంచివాడే , నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు వాడికి నువ్వంటే పిచ్చి, వాడికి ఒకే ఒక అవకాశం ఇచ్చి చూడవే అప్పటికి కూడా నీ మనసు మారకపోతే నేను నీ వైపే ఉంటాను. కానీ ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పలేదు కదా" అని అంటుంది.
మళ్లీ తనే మాట్లాడుతూ" స్వీటీ ఈ యొక్క విషయం మాత్రం మర్చిపోకు విన్ను ఆఖరి కోరిక ఏంటో తెలుసా, నీ లైఫ్ లో మూవాన్ అవ్వాలి అని, అతను చనిపోయే ముందు చెప్పిన చివరి మాటల ఇవే , నీకు కూడా తెలుసు, కనీసం విన్ను కోసమైనా ప్రేమ్ కి ఒక అవకాశం ఇచ్చి చూడు, ఇంతకుమించి ఇక ఏమి చెప్పను, సరే ఆంటీ వస్తూ ఉంటారు త్వరగా స్నానం చేసి రా" అని చెప్పి ప్రియ ని అక్కడే వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది.
...
ప్రియా లో మార్పు గమనించిన ప్రేమ్ పెళ్లి లోపు తన మనసు మార్చగలనని కాన్ఫిడెన్స్ తో విజిల్ వేసుకుంటూ తను రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ మంచం మీద కాలు మీద కాలు వేసుకుని ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు.
"ఏరా మనవడా బాత్రూం రొమాన్స్ వరకు వెళ్లిందా కథ " అని అడుగుతుంది ఊర్మిళాదేవి, ప్రేమ్ వైపు చూస్తూ.
ప్రేమ్ వెంటనే డోర్ క్లోజ్ చేసి ఊర్మిళాదేవి గారి దగ్గరికి వచ్చి " అయ్యో అమ్మమ్మ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు లోపల" అని అంటాడు.
వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా " అవును అమ్మమ్మ లోపల నేను ఉన్నానని నువ్వెలా కనిపెట్టావ్ " అని అడుగుతాడు.
" అదా ఏమీ లేదు రా మనవడా, నా మనవరాలు ఇంటి పైకపు లేచిపోయేలాగా అరిచింది ,దాని అరుపు వింటే నువ్వు ఒక క్షణం కూడా ఉండవు వెంటనే దాని దగ్గరికి వస్తావు, కానీ ఆ రూమ్ లో అందరం ఉన్నాము గాని నువు లేవు, అందులోనూ దాని మటల్లో టెన్షన్ నాకు కనపడింది ఏదో దస్తుంది అని, అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది, తర్వాత నువ్వు నీ రూమ్ లో లేకపోవడం, ఇదిగో ఇలా దాని టవల్ కట్టుకొని రావడం చూసి పూర్తిగా కన్ఫామ్ చేసుకున్నా" అని అంటుంది.
ప్రియా తనని చూసేసింది అన్న కంగారులో టవర్ తన తడి ఒంటికి చుట్టూకొంటాడు . స్నానం చేసిన తర్వాత అతని తడి టవల్ అక్కడ వదిలేసి, ప్రియ టవల్ చుట్టుకుని వస్తాడు.
"అబ్బా ...నీ అనాలసిస్ సూపరే అమ్మమ్మ " అని అంటూ ఊర్మిళాదేవి బుగ్గ మీద ముద్దు పెడతాడు.
ఊర్మిళాదేవి గారు చిన్న పిల్లలాగా ఆసక్తిగా "ఇంతకీ బాత్రూమ్ లో ఏం చేశారు మనవడా మీ ఇద్దరూ, కొంపదీసి పెళ్లికి ముందే నన్ను ముతతమని చేయడం లేదు కదా" అని అడుగుతుంది.
"అబ్బా అమ్మమ్మ నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు" అని జరిగింది మొత్తం వివరిస్తాడు .
....
ఇది ఇక్కడ ఇలా ఉంటే ఆదిత్య గదిలో.
ఆదిత్య స్నానం చేసే బయటికి రావడం ఆలస్యం ఎదురుగా గాయత్రి గారు రుద్రకాళి లాగా కనిపిస్తుంది.
వాళ్ళ అమ్మని అలా చూసి ఒక్కసారి దడుచుకుంటాడు . కళ్ళు నులుముకొని వచ్చింది వాళ్ళ అమ్మేనా, చూస్తుంది తననేనా , అని ఒకసారి చూస్తాడు . గాయత్రి గారు ఆదిత్య ను ఇంకా కోపంగా చేస్తూనే ఉంటుంది.
'అమ్మేంటి నన్ను ఇంత కోపంగా చూస్తుంది, ఇ అక్షయ గానీ నా గురించి ఏమైనా కంప్లైంట్ చేసిందా ఏంటి ? అయినా నేను ఏమి మానలేదుగా ఈరోజు దానిని, అయినా అనడానికి అది రాత్రి నుంచి నాకు కానే పడలేదు' అని మనసులో అనుకుని.
" అమ్మ నువ్వేంటి ఇక్కడ? ఏమైనా పని మీద వచ్చావా? "అని చిన్నగా అడుగుతాడు.
గాయత్రి గారు తన వెనకనుంచి ఒక కర్ర బయటికి తీసి " ఆ నీ బడితి పూజ చేయడానికి వచ్చాను " అని అంటుంది.
ఆదిత్య కి ఏమి అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందో అతనికి అర్థం అయ్యేలోపు గాయత్రి గారి చేతిలో ఉన్న కర్ర అతనికి కిస్ ఇస్తుంది .
" అబ్బా... అమ్మ " అని గట్టిగా అరుస్తాడు నొప్పికి.
గాయత్రి గారు "ఉష్.. అరిచావనుకో ఇంకా గట్టిగా కొడతాను" అని చెప్పి మళ్ళీ కొట్టడం స్టార్ట్ చేస్తుంది.
ఆదిత్య గాయత్రీ గారి నుంచే తప్పించుకుంటూ "అబ్బా అమ్మ ఎందుకు కొడుతున్నావో క్లారిఫై ఇచ్చి కొట్టవే " అని అడుగుతాడు.
" మావయ్య పడిపోతే ఆయనకి సహాయం చేయడం మానేసి నవ్వుతావా, అసలు బుద్ధి ఉందా నీకు, నా తమ్ముడు అలా పడిపోతే చూసి నవ్వుతావు రా నువ్వు" అని అంటూ మళ్ళీ కొడుతుంది.
గాయత్రి గారికి జగదీష్ చంద్ర అంటే చాలా ఇష్టం, తన తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకునేవారు కాదు, ఆఖరికి అది వాళ్ళ నాన్న అయినా సరే చిన్నప్పుడు జగదీష్ చంద్ర ని బాగా ప్రేమగా చూసుకునేది, ఇప్పుడు తన కొడుకు అలా తన తమ్ముడు పడిపోవడం చూసి నవ్వడంతో చాలా కోపం వచ్చింది ఆవిడకి అందుకే ఆదిత్య కి ఇలా కర్రతో బుద్ధి చెబుతుంది
ఆదిత్య వాళ్ళ అమ్మ కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక "అబ్బా ...నేను మావయ్య పడినందుకు నవ్వలేదే నేను , ప్రియా ప్రేమ్ నీ పందికొక్కు అన్నదానికి నవ్వాను" అని వెంటనే అంటాడు.
"ఏంటి?" అని గాయత్రి కొట్టడం ఆపేసి ఆదిత్య వైపు చేస్తుంది.
' ఒరేయ్ ప్రేమ్ నేనొక్కడినే తన్నులు తినాలా, అమ్మ చేతిలో నిన్ను కూడా తనిస్తాను చూడు' అని మనసులో ఈవెనింగ్ గా నవ్వుకుంటూ.
" నేను నవ్వి నందుకు కారణం ఏంటో తెలుసుకోకుండా, నీ తమ్ముడు పడినందుకు నవ్వానని, నీ తమ్ముడు కోసం నన్ను ఇంతలా కొట్టావు, అదే నీ చిన్న కొడుకు నీ తమ్ముడి కూతురి బాత్రూం లోకి వెళ్లి ఎంత రచ్చ చేశాడో తెలిస్తే ఏం చేస్తావో ఏంటో. " అని అంటాడు.
ఆదిత్య చెప్పిన మాటలు గాయత్రి గారికి అర్థం కాదు "ఒరేయ్ జరిగిందేంటో క్లియర్‌గా చెప్పలేదు అనుకో ఇంకా నాలుగు పడతాయి జరిగిందేంటో క్లియర్‌గా చెప్పు నాకు ముందు" అని అడుగుతుంది.
గాయత్రి ఇంకా అనుమానంగా చూస్తూ ఉంటే. ఆదిత్య మాట్లాడుతూ, " ఇందాకడ ప్రియా అంత గట్టిగా ఎందుకు అరిచింది అంటావు? వాడి వల్లే అరిచింది . అదంతా కాదు ప్రియ అరుపుకి మనమందరం తన రూమ్ దగ్గరికి వెళ్ళాము, ఆఖరికి స్నానం చేస్తున్న నాకు కూడా తన అరుపు కి ఏమైందో అని కంగారుగా వచ్చాను కానీ ప్రేమ్ గాడు వచ్చాడా ? లేడు ఎందుకంటే ఆ ప్రేమ్ గాడు ప్రియా తోనే ఉన్నాడు కాబట్టి , వెళ్లి వాడికి బుద్ధి చెప్పు" అని అంటాడు.
గాయత్రి గారు ఆలోచనలో పడుతుంది, ఇందాక జరిగింది మొత్తం గుర్తుకు తెచ్చుకుంటుంది. ప్రియా దేన్నో చూసి అరవడం. ప్రియా మాటల్లో కంగారు , అంతకన్నా ముఖ్యం ప్రేమ్ అక్కడ లేకపోవడం ఇదంతా కలిపి చూస్తే ఆదిత్య చెప్పింది కరెక్టే అనిపించింది ఆవిడకి.
" ఒరేయ్ ప్రేమ్.." అని అరుస్తూ ప్రేమ్ గది వైపు వెళుతుంది.
గాయత్రి గారు ఆలోచిస్తున్న టైం లో ఆదిత్య గబగబా తన బట్టలు వేసేసుకుంటాడు.
ఆదిత్య సక్సెస్ అయినందుకు కొయ్య డాన్స్ వేసుకుని, గాయత్రి గారు వింటే వెళ్తాడు.
గాయత్రి గారు ప్రేమ్ గది దగ్గరికి వచ్చేసరికి ఊర్మిళదేవి గారు మాటలు వినపడి అక్కడే ఆగిపోతుంది.
"అంటే మీ మధ్య ఏమి జరగలేదా మనవడా ఆ బాత్రూమ్ లో" అని నీరసంగా అడుగుతుంది ఊర్మిళాదేవి.
ప్రేమ్ బట్టలు వేసుకుంటూ "నీ మనవరాలు నాకు అంత ఛాన్స్ ఇస్తుంది అంటావా అమ్మమ్మ , నా సిక్స్ ప్యాక్ బాడీ చూపించినా కూడా అది టెంప్ట్ అవ్వలేదు, ఒకవేళ నేనే ఏమన్నా చేద్దామనీ ముందుకు వెళ్తే రాత్రి కొట్టింది చూడు కొట్టుడు , అలా ఇంకొక రౌండ్ వేసుకునేది" అని అంటాడు.
ప్రేమ్ రాత్రి సంగతి చెప్పగానే ఊర్మిళాదేవి గారు నైట్ ప్రియా ప్రేమ్ ని ఎందుకు కొట్టిందో కనుక్కుందామనే టైం కి గాయత్రి గారు లోపలికి కోపంగా వస్తుంది.
గాయత్రి గారు అలా సడన్‌గా లోపలికి వచ్చేపాటికి ప్రేమ్ ఇంకా ఊర్మిళాదేవి గారు ఇద్దరు షాక్ అయిపోతారు.
' కొంపతీసి అమ్మ , ఇప్పుడు నేను అమ్మమ్మకి చెప్పిందంతా వినలేదు కదా' అని భయపడతూ గాయత్రి గారి వైపు చూస్తాడు.
గాయత్రి గారి కోపంగా ఊగిపోతూ చేతిలో ఉన్న కర్రను పట్టుకుని ప్రేమ్ వైపు చూస్తుంది.
ఆదిత్య వెనక నుంచి "అయిపోయావురా ఈరోజు నువ్వు అమ్మ చేతిలో" అన్నట్లు సైగ చేస్తూ , వెంటనే తలుపులు మోసేస్తాడు ప్రేమ్ అరుపుల విని ఇంకెవరైనా వచ్చి ప్రేమ్ ని సేవ చేస్తారేమో అన్న దానితో.
"ఏరా అమ్మాయిల బాత్రూం లోకి దూరడం మొదలు పెట్టావా నువ్వు ఇంకా దాని మనసు మారుస్తానంటే ఏం చేసి మారుస్తావో అనుకున్నాను ఇలా అనుకోలేదు" అని అంటూ ప్రేమ్ ని వీర కొట్టుడు కొట్టడం మొదలు పెట్టింది.
ప్రేమ్ గాయత్రి గారి నుంచి తప్పించుకుంటూ రూమ్ అంత పరుగులు పెడుతూ "అమ్మ నేను చెప్పేది ముందు వినవే "అని అంటాడు.
ప్రేమ్ ఎంత తప్పించుకుంటాకి ట్రై చేసిన గాయత్రి గారు ఫ్రేమ్ ని వదలకుండా కొడుతూనే ఉన్నారు, రూమ్ అంతా ప్రేమ్ తో పాటు తిరుగుతూ.
ఊర్మిళాదేవి తన కూతుర్ని ఆపుతూ " ఒసేయ్ ఒసేయ్ ఆగవే, పిల్లోడిని చంపేస్తావా ఏంటి ? అసలు ఏం జరిగిందో వినకుండా వాడిని అలా కొడుతున్నావ్ ఏంటే" అని అంటుంది.
గాయత్రి గారు ఊర్మిళాదేవి గారి వైపు చూసి "అమ్మ నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే ఊరుకునేది లేదు , ఇక్కడికి వచ్చాక వాడి అల్లరి ఇంకా ఎక్కువయ్యింది . తప్పుకో ముందు నువ్వు, వాడు ఈరోజు అయిపోయాడు నా చేతిలో" అని అంటుంది.
ప్రేమ్ గాయత్రీ నుంచి తప్పించుకుంటూ "అమ్మ నేనేమి దాని బాత్రూంలోకి వెళ్ళలేదే, అదే నేను స్నానం చేస్తుంటే , పిల్లాడు స్నానం చేస్తున్నాడని కూడా లేకుండా అదే వచ్చిందే " అని అంటాడు ఏడుపు గొంతుతో.
గాయత్రి గారు కోపంగా "నాటకాలు ఆడకు దాని బాత్రూంలో నువ్వు వెళ్తే అది వచ్చిందంటావు ఏంట్రా" అని అంటుంది.
"అమ్మ హ.. హ.. హ.. నిజమే" అని చిందుళ్ళు తోకుతూ , ఏడుస్తూ అంటాడు.
ఊర్మిళాదేవి గారు కూడా మాట్లాడుతూ " వాడు చెప్పేది నిజమే వాడి బాత్రూమ్ రిపేర్ లో ఉందని తెలుసు కదా మనకి . వాడు స్నానం చేద్దామనుకొని దాని బాత్రూంలోకి వెళ్ళాడు , కానీ పాపం వాడు చూసుకోలేదంట డోర్ సరిగ్గా పడలేదు , అదే టైంకి అది లోపలికి వచ్చింది అంతే ,తాంతకు మించి ఏం జరగలేదు అంట" అని అంటుంది.
గాయత్రి గారు అనుమానంగా చూస్తుండడంతో "ఆ కృష్ణయ్య మీదొట్టే అంతకుమించి ఏం జరగలేదు ఇదే జరిగింది" అని వెంటనే అంటాడు ప్రేమ్.
గాయత్రి గారు కొంచెం శాంతిస్తూ " సరే ఈసారికి నమ్ముతున్నాను. పెళ్లికి ముందు ఇలాంటి కొంటే వేషాలు మళ్లీ వేశావనుకో ఈసారి నిజంగానే అట్లకాడ కాల్చి వాత పెడతాను" అని అంటుంది.
ప్రేమ్ అలాగే అన్నట్లు తలకాయ ఊపి.
" చి.. చి.. అత్తగారిఇంట్లో నేను అడుగుపెట్టిన వేల విశేషం అసలు బాగున్నట్టు లేదు, రాహుకాలంలో అడుగు పెట్టి ఉంటాను . నిన్నేమో దాని చేత తన్నులు తిన్నాను, ఈరోజు ఏమో నీ చేత , ఇక ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో" అని అంటాడు.
ఊర్మిళాదేవి గారు వెంటనే మాట్లాడుతూ "అవును రా మనవడా అడగడం మర్చిపోయాను నిన్న అది నిన్ను ఎందుకు కొట్టింది రా"అని అడుగుతుంది.
ప్రేమ్ కి సరిగ్గా తన్నులు పడలేదు అని ఫీల్ అవుతున్న ఆదిత్య కి ఊర్మిళాదేవి గారు అన్న మాటలకి మొహంలో ఒక కొత్త వెలుగు వచ్చి చేరింది.
కొనసాగుతుంది...
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు....