Immoral ...... Yandamuri Virendranath Novel Book review. books and stories free download online pdf in Telugu

అనైతికం...... యండమూరి వీరేంద్రనాథ్ నవల Book review.

" పుస్తక సమీక్ష " ..........లో..............నవలా సమీక్ష......... అందులోనూ అశేష తెలుగు పాఠకులను ,ఆనందింప , ఆలోచింపజేయగల్గిన, ఆధునిక నవలా దిగ్గజ రచయిత , నా అభిమాని
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి " అనైతికం " మన ముందున్నది. ఏ పుస్తకమైనా " సమీక్ష " స్థాయిలో వుంది అంటే అందులో ఎంతో కొంత " మనసును కదిలించేది , రిలాక్స్ చేసేది , ఆలోచింప జేసేది , ఏదో చేయాలని ప్రేరేపించింది". తప్పకుండా ఉంటుంది .
ప్రపంచమంతా ఒకే నినాదం తో , "women empowerment" "నారీ ప్రధాన భారత దేశం లో " సాధికార , సమర్ధ స్త్రీ " లక్ష్యం గా ఎన్నో చట్టాలు తీసుకువస్తూ , చట్టసభల్లో చర్చిస్తూ , " స్త్రీ "కి సమాజంలో
ఉత్తమ స్థానం ఇస్తున్నాం అనుకుంటూ ప్రతి దేశం హోరాహోరీగా ప్రకటించుకుంటున్నాయి .
సాహిత్యం లోనూ, సినిమా ప్రపంచంలోనూ , సాంఘిక
ఆచారం వ్యవహారాల ల్లోనూ స్త్రీ ఎలా పురుషుడి తో సమానంగా , చాలా వాటిల్లో మెరుగైన సామర్థ్యం చూపుతూ
తనకిష్టమైన క్షేత్రం లో " శభాష్ " అనిపించుకుంటూ ముందడుగు వేస్తూంది . ......కదా. !

మరి యండమూరి గారు " ఆమె(స్త్రీ )" నాధారంగా చేసుకొని ఈ * అనైతికం * ఎందుకు రాసినట్లు ?

*అహల్య , అచ్చమ్మ , శ్యామల * అని ముగ్గురు స్త్రీల కధలనెందుకు మన ముందు * యథాతథంగా* ఉంచినట్లు ?

అవన్నీ కొత్త కథలా , నీతి సూత్రాలా ? నైతికత ను ప్రబోధించే
సంఘటనలా ?

మనుధర్మ శాస్త్రం నుండీ , నేటి స్త్రీ సంబంధిత ప్రతి వాక్యం లోనూ స్త్రీ ని బుద్ధికీ, మనసుకూ ప్రతీక కా చెబుతూ,
ఆమె లేనిదీ స్రృష్టే లేదు అని నొక్కి వక్కాణిస్తూ ,
భగవంతుని ప్రతిరూపంగా భావిస్తున్నామంటూ, భావిస్తూ( అందరిలో కొందరు , బహు కొందరు ) ఉన్న సమాజంలో
"నీతి, నైతికత" అన్న విలువలు "స్త్రీ" కే ఎక్కువ ఆపాదిస్తారెందుకు ? అనే " స్త్రీ " వాదులకూ ...............

అసలు" స్త్రీ* అంటే .............పురుషుని కంటే లవలేశమైనా, కంట్లో నలుసంతైనా , తక్కువే........ఏ కారణమైనా కావచ్చు..బలహీనురాలే, అసమానురాలే, అలుసే......... అనుకునే పురుషాధిక్య సమాజానికి ,.............

అందం, ఆకర్షణ, అమాయకత్వం , అశక్తత నుండి పెరిగిన ఆత్మవిశ్వాసం , ఆత్మాభిమానానికి ప్రతీకలుగా నిలిచే అచ్చమ్మ లకూ..................


ఇండిపెండెన్స్ .............. స్త్రీ సర్వ స్వతంత్రురాలు. స్త్రీ తన ఆనందం కోసం పురుషుడి పై ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. తను నమ్ముకున్న సిద్దాంతాన్ని పురుషుడి అనుమతి , సహకారం లేకుండానే పాటించగలదు , అనే

స్వేచ్ఛ స్త్రీ కోరుకునే ప్రస్తుత , అనివార్య హక్కు..........
దానికై అందరూ పోరాడాలి అనుకుంటూ ఉండిన శ్యామల కూ ..........................

తనకొక గుర్తింపు, ఓదార్పు, అభిమానించే వ్యక్తి, ఎదురైనప్పుడు పునాది లేని ప్రేమ లో చిక్కి , సాలెగూడని తెలుసుకుని , ఆలస్యంగానైనా వివేకాన్ని కల్గిన అహల్య లకూ
ఈ నవల ఒక చక్కని మనోవైజ్ఞానిక విశ్లేషణ.

ఎవరినీ సమర్థించలేదు రచయిత గారు........
ఇదీ ప్రస్తుత సమాజం, ...........
ఇవీ విభిన్న పరిస్థితులలో స్త్రీ విభిన్న రూపాలు

ప్రతి పరిస్థితి లోనూ ఏదో ఒక రూపంలో ఓ మగవారి ఎంట్రీ.......... ,
తన అతి తెలివి తో నో ,
ముసుగు వేసుకున్న సంస్కారం చూపిస్తూనో,
అసమర్థత తోనో ,
ఆచరించని సిధ్థాంతాలతోనో,
మౌలికమైన స్త్రీ రూపం , ఎన్నో రూపాలు మార్చుకునేలా చేయగల పురుష ప్రపంచం .
యండమూరి వీరేంద్రనాథ్ గారు " అనైతికం " ద్వారా
సమాజానికి ఏం చెప్పదలచుకున్నారు అని అర్థమైందంటే
............" అనైతికం" అన్న జీవన ". నిషిద్ధ విరుద్ధ విలువ" కు
". మూలం ( root ) ఎక్కడుందో .... దానికి. కారణమెవరు........ " వారిని, ఎందుకు,. ఎప్పుడు. ఎవరు
శిక్షించాలి ?
". స్త్రీ విమోచనం " ......." స్త్రీ హక్కుల సంరక్షణ". " పురుషాధిక్య సమాజం ". ........" స్త్రీ కానీ పురుషుడికి కాని " అసలేం. కావాలి ? .............." వాటిని ఎలా సాధించుకోవాలి ?"
ఇవన్నీ అర్థమవుతాయి . ....
సమస్య క్లారిటీ తో అర్థమైతే సమాధానం కూడా స్పష్టంగా అందుతుంది .
ఒక "చేష్ట " అంటే ఒకరు తన భావాన్ని వ్యక్త పరిచే విధానం
వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవేమీ తెలియకుండా ఏ చేష్ట పైనా " నైతికం "...."అనైతికం " అనే ముద్రను ఎలా వేయగలం .....unless and until we are too close to understand the person who shows that objectionable act.
అలా అని ఎవరేం చేసినా దానిని సమర్థించనూ లేము.అలా చేస్తే " మానవ మృగాలు.......(. స్త్రీ లింగం మైనా.../. పుంలింగమైనా..,అంటే ఆడదైనా../.... మగాడైనా) . ఈ సమాజంలో తమ చేష్టలు బాహాటంగా చేస్తూ ముందు తరాలకు " Negative role models" అయ్యే ప్రమాదం ఉంది.
ఈ నవలలో , రచయిత చెప్పిన మూడు కథలు మన కళ్ళ ముందు జరిగేవే.....జరిగినవే....... ఎక్కడో కాదు .......మన మధ్యలోనే.


అచ్చమ్మ ,. .....అహల్య..... ఇద్దరూ తమ కథల ద్వారా తమ కష్టాలు తమ కోణంలో నుంచి పరిష్కారం వెతుక్కుంటూ ఉన్నారు. అది తాత్కాలికమే అని తెలుసు. అందుకనే
మనసులో ఘర్షణ. ఆ ఘర్షణ తర్వాత మళ్ళీ మామూలే.

ఇద్దరి కష్టాలూ రెండు వేర్వేరు కోణాల్లోంచి వచ్చినవి! ఒకరివి- అంతర్గతమైన అసంతృప్తి వల్ల (మైక్రో), మరొకరివి బయట సామాజిక దురన్యాయం వల్ల (మాక్రో) కలిగినవి.

. మన ప్రవర్తనని ఇతరుల కోణంలోంచి చూస్తే- అది ఒక్కోసారి ఎంత అజ్ఞానంగానూ, అమాయకంగానూ, అసహ్యంగానూ, తర్కరహితంగానూ, అనాలోచితంగానూ కనపడుతుందో- . మనం మన ప్రవర్తనని ఎంత కన్వీనియెంట్ గా సమర్ధించుకుంటామో, అహల్య కూడా అలాగే సమర్ధించుకుంటుంది. ఒక్కోసారి ఆత్మవిమర్శ చేసుకుంటుంది కూడా. కానీ ఆ ఆత్మవిమర్శ కేవలం 'కుక్క -దాలిగుంట" సామెత లాగా.


అహల్య కథలో శైలి, అమాయకంగానూ- సరళంగానూ వుంటుంది. అచ్చమ్మ కథ ప్రారంభమే అదోలాటి 'కసి'తో మొదలవుతుంది. చిన్నతనం నుంచీ అనుభవించిన బాధలవల్ల వచ్చిన కసి అది!

శ్యామల ఓ లాయరు గా " స్త్రీ వాది " అంటే స్త్రీ కి విద్యార్హత ఉండి, న్యాయం కోసం పోరాడే ధైర్యం ఉండాలి, పురుషుడి అవసరం లేకుండా జీవించగలిగి ఉండాలి అన్న అభిప్రాయం కలిగినది.
" స్త్రీ సున్నితత్వాన్ని, అమాయకత్వాన్ని ఇక మనం
కనుమరుగు చేసుకుంటామేమో , ఆత్మ ప్రబోధం పక్కన పెట్టి
గాలికి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు స్త్రీ జీవితాల్లో
స్వాగతింపబడుతున్నాయి. కల్పించబడుతున్నాయి.
కొన్ని సందర్భాల్లో అలాంటి విపరీత పోకడలు పోయే
స్త్రీలు అదొక నకిలీ జీవితం గడుపుతున్నారు.
" అనైతికం" అన్నది పురాణ కాలం నుండి ఉన్నప్పటికీ, దేశం మాత్రం , హద్దుల్లో, మాటున దాగి ఉండింది . అందుకే ఈ తరం వారు పురాణాలాను ఎద్దేవా చేస్తున్నారు.
ఈ తరంలో " అనైతికం " బాహాటంగా చేస్తూ, దానికి తమకు అనుకూలంగా రీజనింగ్ ఇచ్చుకుంటున్నారు , ఇద్దరూ . ఇందులో అక్షరాలా స్త్రీ " సమాన హక్కులు" సాధించింది . ప్రతి కుటుంబం ........... దాదాపు 70%
". మేడిపండు జీవితం". అనుభవిస్తూ ఉన్నారు .
అందుకే ఒకరిని తప్పు పట్టకుండా , అహల్య ,అచ్చమ్మ, శ్యామల జీవిత కధలను ( నిజ జీవిత గాంధీలు ), యధాతధంగా రాసి, శ్యామల పాత్ర ద్వారా స్త్రీ కి కావలసిన అసలైన హక్కులు తెలియజేశారు యండమూరి.
అచ్చమ్మ కూతురి పాత్ర ద్వారా.......... ఆధునిక కాలం లో , ఈ తరం లో

" స్త్రీ తను , తన కుటుంబం సంతోషంగా, సగర్వంగా, శుద్ధంగా ఉండడానికి , ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ముందుకు పోవడానికి , తాను విద్యావంతురాలై, తన పిల్లలను విద్యావంతులను చేస్తూ, అవసరమైనప్పుడు
ఉద్యోగానికి వెళ్ళేలా , ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది."
అని చెప్పించారు . ఇది కూడా ఒక సలహా నే.

ఎవరి జీవితం ఎలా ఉండాలి, ఉంటుంది అన్నది వారికి వారే
నిర్ణయించుకోవాలి. అందులో ఆత్మ వంచన లేకుండా ఉంటే చాలు . క్షణికానందాలకు తావివ్వకుండా ఉంటే చాలు.
అహల్య. ,. అచ్చమ్మ ల్లో , ఎన్ని అసంత్రృప్తులున్నా
విద్య చేతిలో ఉన్నది కాబట్టే ఎవరూ ". ఆత్మహత్య" ల జోలికి పోలేదు . ఆ స్థాయి దాటి , తమ తర్వాతి తరాన్ని అన్ని విధాలా " స్ర్టాంగ్" చేయడానికి ,తమ జీవిత ప్రయాణాన్ని ఎన్నో మలుపులు తిప్పారు .కాదు తిరిగాయి.
చివరికి సాధించారు. అహల్య మరియు ఆమె కూతురు శ్యామల వారి వారి. క్షేత్రాల్లో సాధించిన కృషి కి ఉత్తమ" స్త్రీ"
అవార్డులు కూడా అందుకున్నారు .
ఒక మంచి నవల చదివిన త్రృప్తి ఉంది . మనోరంజకంగా లేక పోయినా మానసిక పరిధి పెంచుకోవటానికి తప్పకుండా ప్రేరణ ఇస్తుంది . ఇంకొకరిని
సరిదిద్దడానికి " కౌన్సెలింగ్" చిట్కాలు ఇస్తుంది. చదివిన
ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. తను ఎంత " కరెక్ట్ " అనీ చెబుతుంది.
" వెన్నెల్లో ఆడపిల్ల. " నవలకు కవర్ పేజీ , ముఖచిత్రం అద్భుతంగా ఉంటుంది. . ఈ నవల ముఖచిత్రం కూడా చాలా అందంగా , ముగ్గురి పాత్ర ల " క్యారెక్టర్ " స్పష్టంగా
అర్థమయ్యేలా డిజైన్ చేయబడింది.
యండమూరి వీరేంద్రనాథ్ గారి అభిమాని గా కాకుండా ,
ఆడపిల్లల తల్లిదండ్రులు గా చదివిన వాళ్ళం .
వింత పోకడలు పోయే కుటుంబ వ్యవస్థ ను చూస్తున్న వాళ్ళం. చెత్తను చూస్తూ ఉన్నవాళ్ళం . ఆ చెత్త ను శుభ్రం చేయాలంటే , దానికి సిద్ధం కావాలి కదా .
అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.చాలా మందికి స్ఫూర్తి దాయకం.
నా తో మెలిగిన సౌమ్య, సరళి , జాహ్నవి లో జీవితానికి ఓ ఊరట . ఇక ఎవరికీ అలాంటి జీవితం వద్దని ప్రార్ధన.
లక్కవరం. శ్రీనివాసరావు