Vennela Poolu - 20 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెన్నెల పూలు - 20

Featured Books
Categories
Share

వెన్నెల పూలు - 20

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"వాడు తన మీద తను నమ్మకం కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. సో, అలా చేసి వాడిమీద వాడికి నమ్మకం కలిగించడం లో తప్పులేదనిపించింది." అలా చెపుతూంటే తనూజ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోయాయి.

"ఆల్రైట్. ఇప్పుడు అసలు సమస్య ఏమిటి? నువ్వు దేనిగురించి ఆందోళన పడుతున్నావ్?" అని అడిగింది సమీర.

"వాడిప్పుడు నన్నే పెళ్లిచేసుకుంటానని కూచున్నాడు. నన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు." చిరాకు ఎక్కువ అయిపోయింది తనూజలో.

నవ్వకుండా వుండలేకపోయింది సమీర. నవ్వాపుకుని అంది. "రీజనబుల్ గానే ఉందికదక్కా. మగాడిని కాదనుకుని నిస్పృహలోకి వెళ్ళిపోతున్నవాడిని, నువ్వు ఎవరూ చేయనిది చేసి నమ్మకం కలిగించావు. ఇద్దరు భార్యాభర్తల మధ్య జరగాల్సినదే, మీ ఇద్దరి మధ్య జరిగింది. నిన్నుతను పెళ్లిచేసుకుందామనుకోవడం లో తప్పేముంది?"

"మా ఇద్దరి మధ్య చాలా ఏజ్ గాప్ వుంది. ఎలా పెళ్లి చేసుకోమంటావ్?" కోపం గా అడిగింది తనూజ.

"మరి నువ్వు అతనితో సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఈ ఏజ్ గాప్ నీకు గుర్తుకు రాలేదా?" ఆ చిరునవ్వు అలాగే వుంది సమీర పెదాల మీద.

"సెక్స్ వేరు. జీవితం పంచుకోవడం వేరు. ఇప్పుడు అతనకి నన్ను పెళ్ళిచేసుకోవాలని అనిపించొచ్చు. కానీ ముందు ముందు నన్ను చేసుకోకపోతే నాకన్నా బాగా యంగ్ గా వున్నా అమ్మాయిని చేసుకుని ఉండేవాడిని అని తనకనిపిస్తే?" కొశ్చిన్ మార్క్ మొహం పెట్టింది తనూజ.

"అలాగే నిన్ను చేసుకోకుండా ఇంకెవరిని చేసుకున్నాతనని అర్ధం చేసుకుని లైఫ్ ని ఇచ్చిన అమ్మాయిని  భార్యగా  చేస్కోలేకపోయానని కూడా తనకి అనిపించొచ్చు కదా. అదే ప్రకారంగా నిన్నుకాకుండా ఇంకెవరినన్నా చేసుకుని అతను సుఖంగా వుండగలడని మాత్రం గ్యారంటీ ఏమిటి?"

"ఏమోనే, నాకు ఫ్యామిలీ లైఫ్ మీద అంత ఇంటరెస్ట్ లేదు. పెళ్ళిచేసుకోవాలని అనిపించదు."

"అదేమిటక్కా నీ ఆశయాల్ని, నిన్నూ అర్ధం చేసుకునే మనిషి దొరికితే పెళ్లిచేసుకుంటాను అంటుంటావు కదా. ఇంతకీ నీ సిద్ధాంతాలేమిటో, నువ్వెలా ఆలోచిస్తావో అతనికి క్లియర్ గా చెప్పవా? అవి వింటే వెనక్కి తగ్గేవాడేమో."

"నా ఆశయాలు గురించి మాత్రమే కాదు, గతం లో నేనేం చేసానో కూడా చెప్పాను. అది విన్నాక కూడా అతనిలో మార్పు ఏమీ లేదు.  నా సిద్ధాంతాలతో అతనికి ఇబ్బంది ఏమీ లేదన్నాడు."

"మరింకెంటక్కా, నిన్ను ఇంతగా అర్ధం చేసుకునే మనిషి దొరికితే పెళ్ళికి ఒప్పుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నావ్. నువ్వు చెప్తూన్న ఏజ్ చాలా సిల్లీ ఇష్యూ. అంతకన్నా చాలా పెద్ద ఏజ్ గాప్ తో ఆనందం గా జీవిస్తూన్న దంపతులు వున్నారు."  

   దానికి ఏమీ మాట్లాకుండా మౌనంగానే వుంది తనూజ.

"అయితే అతనికి అల్టిమేట్ గా ఏం చెప్పి ఇలా వచ్చావ్?"

"తనని పెళ్లిచేసుకోవడం కుదరదని ఖరాఖండీ గా చెప్పేసాను. అతనికి చెప్పకుండానే ఇలా వచ్చి, అతని నంబర్ కూడా బ్లాక్ చేసేసాను." 

"సరేలే అయితే. తనది వృధా ప్రయాస అని అర్ధమై కొన్నిరోజులకి నిన్ను మర్చిపోతాడు. ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించకు." సమీర చెప్పింది.

ఒక ఇబ్బంది కరమైన ఎక్స్ప్రెషన్ తో, తనూజ మౌనంగా ఉండిపోయింది.

"అక్కా నువ్వు దేనిగురించో ఇంకా మధన పడుతున్నావ్. నీ చెల్లెలి దగ్గర చెప్పడానికి కూడా నీకు మొహమాటామా?"

"అతనికి అలా చెప్పి వచ్చేసి తప్పుచేసానేమో అనిపిస్తూంది. అతని నంబర్ కూడా బ్లాక్ లో పెట్టేసాను. నాకు చాలా సార్లు కాల్ చేసివుంటాడు కూడా. నాకు అతన్ని చేసుకోవడం ఇష్టం లేకపోయినా, అతని లవ్ లో ఏదో సిన్సియారిటీ కనిపిస్తూవుంది నాకు."

"నువ్వు తప్పు చేసావనడం లో సందేహం ఏమీలేదు. నిన్ను అంతగా ప్రేమిస్తూ, పెళ్లిచేసుకుందామనుకుంటూన్న వ్యక్తికీ  అంత ఖరాఖండీగా అలాచెప్పేసి, చెప్పకుండా ఇలావచ్చేసి నువ్వు  తప్పుచేసావ్."    

సమీర నుండి అదివినగానే దెబ్బతిన్నట్టుగా చూసింది తనూజ.

"కానీ ఇప్పటికీ నీ తప్పుని దిద్దుకునే అవకాశం నీకుంది అక్కా. వెంటనే అతనికి ఫోన్ చేసి, అతని ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నానని, అతన్ని పెళ్లిచేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదని చెప్పు. ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోతుంది. "

"అంతేనంటావా?" తనూజ అడిగింది.

"ఖచ్చితంగా అంతే." దృఢస్వరం తో చెప్పింది సమీర. "నీలో కూడా అతని పట్ల ఫీలింగ్ స్టార్ట్ అయింది. అందుకనే ఇంత మధన పడుతున్నావు. నువ్వు లేకుండా అతను మాత్రమే కాదు,  అతను లేకుండా నువ్వు కూడా ఉండలేవు."

షాక్ తిన్నట్టుగా చూసింది తనూజ. "యూ ఆర్ రైట్. నువ్వు నిజం కనిపెట్టేశావ్ సమీ." అంది

"అంతేకాదు. నువ్వు మరీ ఆలస్యం చేస్తే అతను మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్లి, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడొచ్చు కూడా."

"నువ్వు నన్ను మరీ భయపెట్టకే తల్లీ. వాడికి నేనిప్పుడే ఫోన్ చేసి నువ్వు చెప్పమన్నట్టుగా చెప్తాను." అని పక్కన పెట్టిన తన సెల్ ఫోన్ తీసుకుని అభినవ్ ఫోన్ నంబర్ బ్లాక్ రిలీజ్ చేసింది. అతనికి ఫోన్ చేద్దామనుకుంటూంటే ఎదో అన్నోన్ నంబర్ నుండి కాల్ రావడం మొదలైంది.

"ఎదో అన్నోన్ నంబర్ నుండి కాల్. ఎవరో క్లయింట్ నుండి అనుకుంటా. ముందు ఈ నంబర్ తో మాట్లాడి, అభినవ్ కి కాల్ చేస్తాను." అంటూ ఆ కాల్ అటెండ్ చేసి "హలో" అంది

"తనూ, ప్లీజ్. నా కాల్ కట్ చెయ్యకు. నువ్వు నా నంబర్ బ్లాక్ చెయ్యడం వల్ల వేరేనంబర్ నుండి చేసాను." అవతలిపక్క అభినవ్.

"అభినవ్ లైన్ లో వున్నాడు." కంగారుగా ఫోన్ కిందపెట్టేసింది.

"అతనే ఫోన్ చేస్తే నీకు మాట్లాడ్డానికి అభ్యంతరమేమిటి? నువ్వే అతనికి ఫోన్ చేద్దామనుకున్నావుగా?" కోపంగా అని ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని "హలొ" అంది సమీర.

"మీరెవరు? నేనిప్పుడే తనూజ గొంతువిన్నాను." అవతలిపక్కనుండి అభినవ్ అన్నాడు.

"నేను తన చెల్లెలు సమీర ని."

"అవునా? మీ గురించి తను చెప్పింది. మీరుపెద్ద సైకియాట్రిస్ట్ అట కదా."

"పెద్ద, చిన్న అని చెప్పలేను. సైకియాట్రిస్ట్ ని." నవ్వుతూ అంది సమీర.

"మీరు ఒక్కసారి ఆ ఫోన్ తనకి ఇస్తారా? కేవలం రెండుమాటలు చెప్పి ఫోన్ పెట్టేస్తాను. ఎక్కువగా విసిగించను."

"తనతో ఏం చెప్పదలుచుకున్నారో నాకు చెప్పండి, నేను తనకి చెప్పేస్తాను."

"నేను ఇంక ఫోన్లోనే కాదు ఏ రకంగానూ విసిగించాను. ఇకపై నా బాధ తనకి ఉండదు. నేను తనకి కనిపించను. ఇదే మీరు నేను చెప్పినట్టుగా ఆమెకి చెప్పండి."

"హలో, మీరు ఎలాంటి ఎక్స్ట్రీమ్ డిసీజన్ తీసుకోకండి. మిమ్మల్ని పెళ్లిచేసుకోడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరిద్దరూ భార్యాభర్తలు కావచ్చును. తను తన నిర్ణయం మార్చుకుంది." అభినవ్ అంటున్నది విన్నాక వెంటనే విషయానికి రావడం మంచిదనిపించింది సమీరకి.

"ఏమిటి మీరు అంటున్నది? నాకు అర్ధం కావడం లేదు. ఇలా సడన్గా ఎలా అంగీకరించింది?" అభినవ్ గొంతులో ఆశ్చర్యం, ఆనందం సమపాళ్లలో వున్నాయి.

 "ఇదేం సడన్గా జరగలేదు. మీ విషయం అంతా తను నాకు చెప్పాక, మిమ్మల్ని కాదని తను ఎంతపొరపాటు చేస్తూందో తనకి నేను అర్ధం అయ్యేలా చెప్పాను.  తను నిర్ణయం మార్చుకునేలా చేసాను."

"థాంక్ యు సమీరా,  థాంక్ యు వెరీ మచ్!" ఆనందం పుష్కలంగా వుంది అభినవ్ గొంతులో. "అయినా ఇది నేను తను చెప్తేనే కానీ నమ్మలేను."

"సరే, తను చెప్తేనే నమ్ము." ఫోన్ లో అలా అన్నాక అది తనూజ కి ఇస్తూ అంది సమీర. "నువ్వు చెప్తేనే కానీ నమ్మడుట."

"నా చెల్లెలు చెప్పింది నిజం. నిన్ను పెళ్లిచేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నీ ప్రేమ ని ఎక్స్పెట్ చేస్తున్నా." సిగ్గుతో బుగ్గలు మాక్జిమం ఎర్రబడిపోతూవుంటే అంది తనూజ.

"నిజంగా నీలో ఇంత మార్పు నీ చెల్లెలు ఎలా తీసుకురాగలింగింది? నువ్వసలు మారతావని అనుకోలేదు నేను." ఆశ్చర్యం, ఆనందం అలాగే వున్నాయి అభినవ్ లో.

"అదంతా ఇప్పుడు నీకు చెప్పే ఓపిక నాకు లేదు. కాకపోతే నేను మారాను. నిన్ను పెళ్లిచేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు." తనూజ లో సిగ్గూ అలాగే అంది.

"ఆ ఫోన్ నాకు ఒకసారి ఇవ్వు." తనూజ చేతిలో ఫోన్ లాక్కుని అభినవ్ తో అంది సమీర. "మిస్టర్ అభినవ్. మీరు స్ట్రెయిట్ గా ఇక్కడికి వచ్చేకూడదూ. ఇక్కడ నేను తనని ఎలా మార్చానో అంతా వివరంగా చెప్తాను."

"స్యూర్. తప్పకుండా వస్తాను. ఎలా రావాలో మీ అడ్రస్ అదీ ఇవ్వండి."

సమీర అడ్రస్ అదీ చెప్పాకే మరోసారి థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసాడు అభినవ్.         

"చాలా పెద్ద ప్రాబ్లెమ్ సాల్వుడ్ కదా." ఫోన్ పక్కన పెడుతూ చిరునవ్వుతో అంది సమీర. "ఇన్నిరోజులూ నువ్వు పెళ్లిచేసుకోకుండా ఉండిపోయావన్న దిగులు ఉండేది నాకు. ఇప్పుడు ఆ దిగులు కూడా తీరుతూంది."

"నేనెప్పుడూ ప్రేమలో పడతాననుకోలేదు. ఫ్యామిలీ లైఫ్, పెళ్లి అంటేనే ఇష్టం లేనిదానిని వాటికీ ఎలాఒప్పుకున్నానో నాకు అర్ధం కావడం లేదు. నాకసలు ఇష్టంలేనివాటిమీద నాకు ఇష్టం ఎలా ఏర్పడిందో, అసలు బోధపడ్డం లేదు.  బి ఏ సైకాలజీ తో చదివాను, కానీ నా మనసే నాకు అర్ధం కావడం లేదు." తనూజ అంది.

"అంటే ఇది కేవలం అతనేదన్నాచేసుకంటాడేమోనని కాదు, అతనిమీద నీకు ప్రేమ వచ్చిందన్నమాట." చిరునవ్వుతో అంది సమీర.

బుగ్గలు మరోసారి సిగ్గుతో ఎర్రబడిపోగా, మౌనంగా ఉండిపోయింది తనూజ. 

"ప్రేమ హృదయానికి సంభందించింది. హృదయాన్ని సైకాలజిస్ట్ లు, సైకియాట్రిస్ట్ లు అర్ధం చేసుకోలేరు, వాళ్ళు అర్ధం చేసుకుని సలహాలు ఇవ్వగలిగింది, ట్రీట్ చెయ్యగలిగింది కేవలం మనసు కి మాత్రమే. పేషేంట్స్ తో ఎప్పుడూ నాకు పెర్సనల్ రెలాషన్షిప్ వుండకూడదనుకున్నాను. కానీ అలా ఉండగలిగానా? అరవింద్ తో ప్రేమలో పడి అతన్ని పెళ్లిచేసుకోలేదా?" సమీర అంది.   

"నువ్వు చెప్పింది నిజమే." తలూపి అంది తనూజ.

ఆ తరువాత మరికొంతసేపు ఆ రూమ్ లోనే, అలాగే మాట్లాడుకుంటూవుండిపోయారు ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ.

&&&

"ఒకసారి మనం ఆ బంగ్లా కి వెళ్ళొద్దామా? మీ సిస్టర్ కి కొంత కాలక్షేపంగా ఉంటుంది." హాల్లో సమీర, తనూజ పక్కపక్కని కూచునివుండగా, సుస్మిత వచ్చి అడిగింది.

"ఆల్రెడీ మనం ఆ బంగ్లా లోకి వెళ్లివచ్చాం కదా, నీ బ్రో ని కూడా తీసుకుని.  అందులో అంతప్రత్యేకంగా ఏమీ లేదు." సమీర అంది.

"అందులో ఎదో ప్రత్యేకంగా ఉందని కాదు. నీ సిస్ కి కొంత కాలక్షేపం అవుతుంది కదా. ఊరికినే పాపం ఇంట్లో ఎంతసేపు కూచునివుంటుంది?" సుస్మిత అంది.

"అయితే మీరిద్దరూ వెళ్ళండి. నేను మెంటల్ కేర్ కి వెళ్ళాలి. మీ బ్రో ఆఫీస్ కి వెళ్లడం మొదలుపెట్టాక, నేనూ మెంటల్ కేర్ కి వెళుతున్నాను కదా." సమీర అంది.    

"ఈ ఒక్కరోజు కి సెలవు పెట్టి నాతో గడపకూడదూ? మనం ముగ్గురం కలిసి అన్నీ చూద్దాం. ఒక్కరోజు కి నిరంజన్ ఒప్పుకోడా?" తనూజ అంది.

"నిరంజన్ ఒప్పుకోకపోవడం సమస్యే లేదు. సరే అయితే, ఫోన్ చేసి రావడం లేదని చెప్తాను. తరువాత మనం ముగ్గురం కలిసి ఆ బంగ్లాకి వెళదాం."

తరువాత సమీర నిరంజన్ కి ఫోన్ చేసి తను రావడం లేదని చెప్పాక, ముగ్గురూ కలిసి కారులో సుస్మిత డ్రైవ్ చేస్తూండగా ఆ బంగ్లాకి వెళ్లారు. 

"ఈ బంగ్లా మా మామ్ కి, డాడ్ కి ప్రత్యేకం. ఇందులో వాళ్లిద్దరూ మాత్రమే గడిపేవారు."

ఆ బంగ్లాలో వున్నహాల్లో కుర్చీల్లో కూచున్నాక సుస్మిత అంది.

"అంటే మిమ్మల్ని ఎవర్నీ ఇక్కడికి రానిచ్చేవారు కాదా?" తనూజ అడిగింది.

"అలాని కాదు." నవ్వింది సుస్మిత. "మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి తీసుకువచ్చేవారు కాదు. వాళ్ళు ఆ బంగ్లాలో ఉంటే ఇంటిదగ్గర మమ్మల్ని సర్వెంట్ మైడ్స్ చూసేవారు. కానీ ఒక్కమాట." సడన్ గా ధృడంగా మారింది సుస్మిత స్వరం. "మా మామ్ మమ్మల్ని చూసినంత ప్రేమగా ఏ మామ్ తన పిల్లల్ని చూసి ఉండదు."

"నీ డాడ్ ని కలపవేం, కేవలం నీ మామ్ మాత్రమే అంటావ్." చిరునవ్వుతో మళ్ళీ తనూజె అడిగింది.

"మా డాడ్ చనిపోయే సమయానికి నా వయసు ఒకటిన్నర సంవత్సరాలు. అందువల్ల తన జ్ఞాపకాలు నాకంతగా లేవు. నాకున్నదల్లా మా మామ్ మమ్మల్నెన్త కష్టపడి చూసేది అన్నదే. అంత పెద్ద కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్ అయివుండి మా ఇద్దరి చాలా విషయాలు తనే స్వయంగా చూసేది. ఒక్కోసారి కంపెనీ పరంగా ఎంత ప్రెజర్ పేస్ చేసేదో, అయినా అదేదీ మా మీద చూపేది కాదు, మాకు చేసేవాటిని వేటిని ఆపేది కాదు. అదే ప్రేమ, అదే మమకారం."

"కానీ నువ్వు ఇప్పటికీ నీ మామ్ కి భయపడుతూ ఉంటావ్ కదా." సమీర అంది.

"కొన్ని విషయాల్లో తను స్ట్రిక్ట్ గానే ఉంటుంది. డిసిప్లిన్ తప్పనివ్వదు. మంచి మామ్ లు అలాగే వుంటారు కదా."

"కానీ ఆవిడలో నేను అర్ధం చేసుకోలేని విషయం ఒకటుంది." సమీర అంది. "అంత పెద్ద కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్ అయివుండీ, అంత మెచ్యూరిటీ ఉండీ ఆవిడ సర్వెంట్స్ తో ఎందుకలా బిహేవ్ చేస్తుంది? పాపం ఆ టిబ్బూ ని ఎందుకలా తిట్టి దెబ్బలాడుతుంది?"

"నా మామ్ లో అది నేనూ అర్ధం చేసుకోలేని విషయమే." సుస్మిత అంది. "అడిగితె సర్వెంట్స్ ని అలాగే చూడాలి లేకపోతె వాళ్ళు నెత్తిమీదకి ఎక్కి కూచుంటారు అంటుంది. అందులోనూ ఆ టిబ్బూ తీసుకొచ్చిన చింటూ ఆలా బిహేవ్ చేసాక, టిబ్బూ మీద మా మామ్ కోపం ఇంకా ఎక్కువ అయిపోయింది."    

"ఆ చింటూ ఏం చేసేడసలు?" కనుబొమలు ముడేసి ఆసక్తిగా అడిగింది తనూజ. సమీర ఆ విషయం గురించి చెప్పింది మర్చిపోయింది. 

"ఈ బంగ్లా లోకి ఆ రోజు నా బ్రో వచ్చేలా చేసింది చింటూనే.  ఈ బంగ్లా లోనే కదా నా బ్రో మైల్డ్ మాడ్ గా మారింది." సుస్మిత అంది. "మేమిద్దరం ఈ బంగ్లా కి వచ్చి పోతూంటాం. కానీ ఆ రోజు ఆ టైం లో నా బ్రో ఈ బంగ్లా లో ఉండడానికి కారణం మాత్రం చింటూనే."

"ఎస్, సమీర చింటూ చేసింది చెప్పింది. నేను మర్చిపోయాను." తనూజ అంది "సమీ. దట్ మీన్స్, అరవింద్ నిజంగానే ఈ బంగ్లాలో ఎదో చూసి అలా అయ్యాడా?"

"అవునక్కా, తను డైజెస్ట్ చేసుకోలేనిది ఈ బంగ్లాలో ఎదో చూసి, విపరీతమైన షాక్ కి గురై అరవింద్ బ్లాంక్ మాడ్ గా అయిపోయాడు. ఆ తరువాత అతనిని తన సెన్సెస్ కి తెప్పించినా, తన గతం లో విషయాలన్నింటినీ అతను పూర్తిగా మర్చిపోయాడు, ఇంక్లూడింగ్ తను ఇక్కడ ఏం చూసాడు అన్నదానితో సహా."

"అంతగా షాక్ అయ్యేలా తను ఇక్కడ ఏం చూసివుంటాడు?" ఆశ్చర్యంతో అడిగింది తనూజ.

"అదే మేమంతా ఎంతగా బుర్ర బద్దలుకొట్టుకుంటున్నా అర్ధం కాని విషయం.  అంతగా షాక్ అయ్యేలా తను ఇక్కడ ఏం చూసివుంటాడు అన్నది మేమెవరం కొంచెం కూడా గెస్ చేయలేకపోతున్నాం, మా మామ్ తో సహా. మమ్మల్ని ఇంకా పజిల్ చేస్తూ ఈ చీఫ్ ఒకడు వెలుగులోకి వచ్చాడు." సుస్మిత అంది.

"ఈ కొత్త కోణం ఏమిటి ఇందులో?"

"అదీ చెప్తాను." అలా అన్నాక, శరత్ చింటూ ఉంటూన్న గ్రామానికి వెళ్లి తెలుసుకున్న విషయాలు, తను రేవతి ఇంటికి వెళ్లి తెలుసుకున్న విషయాలు వివరంగా చెప్పింది సుస్మిత.

"గాడ్! ఇదంతా పెద్ద సినిమా స్టోరీలానే వుంది." నవ్వి అంది తనూజ.

"ఈ పజిల్ అంతా విడిపోవాలంటే నా అన్నయ్య ఆ రోజు ఇక్కడ ఏం చూశాడో గుర్తు చేసుకోగలగాలి. నా అన్నయ్యని తన సెన్సెస్ కి అలా తీసుకురాగలిగిన నా వదినకి, తన గతం అంతా గుర్తుకు వచ్చేలా చెయ్యడం కష్టం కాదని నా అభిప్రాయం. కానీ తను మాత్రం తనకి అదంతా సహజం గానే గుర్తుకు రావాలి కానీ, ప్రత్యేక ప్రయత్నం ద్వారా కాదంటుంది. నా మామ్  నా వదినకి ఫుల్ సపోర్ట్. ఇంక నా బ్రో విషయం అయితే చెప్పనవసరమే లేదు. ఈవిడేమో ఏది గుర్తుచేసుకునే ప్రయత్నం చేసి స్ట్రైన్ అవ్వొద్దని చెప్పిందిట, ఆ ప్రయత్నమే మానేసాడు." సమీర వైపు చూస్తూ నిష్టూరంగా అంది సుస్మిత.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)