Ventaade Needalu - 20 in Telugu Thriller by sivaramakrishna kotra books and stories PDF | వెంటాడే నీడలు - 20

Featured Books
Categories
Share

వెంటాడే నీడలు - 20

వెంటాడే నీడలు

( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)

కొట్ర శివ రామ కృష్ణ

"అయితే నువ్వది అతనితో ట్రై చేసి చూడు. ఆ విషయం లో అతనితో సక్సెస్ అయితే, నీకున్న అపోహ పోతుంది. ఒక ప్రాబ్లెమ్ సాల్వ్ అయినట్టుగా అవుతుంది. అది తక్కిన ప్రోబ్లెంస్ అన్నీ సాల్వ్ అవ్వడానికి కూడా ఉపయోగపడొచ్చు. మీరిద్దరూ ఎలాగు పెళ్లికూడా చేసుకోబోతున్నారు కాబట్టి ఇందులో పెద్దగా ఆలోచించాల్సినది కూడా ఏమీ లేదు."

"ఒకే డాక్టర్. అలాగే అయితే." సారిక బుగ్గలు మాక్జిమం ఎరుపెక్కాయి.

"సాధ్యమైనంత వరకూ ఎవరన్నా కంపెనీతో ఉండడానికి ట్రై చెయ్యి. నీలో ఏదన్నా డిఫరెన్స్ వస్తూన్నట్టుగా అనిపిస్తే అది వాళ్లతో షేర్ చేసుకో. నీకున్నది కేవలం ఒక సైకలాజికల్ డిజార్డర్ మాత్రమే. నువ్వు కాన్ఫిడెంట్ గా ఫీలయితే అది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. నా హెల్ప్ నీకు హండ్రెడ్ పెర్సన్ట్ ఉంటుంది."

"థాంక్ యు వెరీ మచ్ డాక్టర్. మీరు చెప్పినట్టుగానే చేస్తాను." నవ్వుతూ అంది సారిక.

"మరింక నేను వస్తాను. నా ఫోన్ నెంబర్ నీ ఫ్రెండ్ దగ్గర వుంది.  నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఆ, అన్నట్టు మరిచిపోయాను, నువ్వు మళ్ళీ ఆ ఒంటె మొహం వున్న మనిషి బొమ్మ వేసావా?"

"ఈ మధ్య మళ్ళీ వెయ్యలేదు. నేను లేటెస్ట్ గా వేసింది మీకు వెంటనే వాట్సాప్ చేశా."

"అది నేను నా సీనియర్ కి చూపించాను. నువ్వెందుకు ఆ బొమ్మ వేస్తున్నావో కొంచెం టిపికల్ గానే వుంది. బట్ ఐ ప్రామిస్, నీ ప్రాబ్లెమ్ నేను సాల్వ్ చేస్తాను. నువ్వు ధైర్యంగా వుండు."

"మీరలా అన్నాక నేనెందుకు భయపడతాను?" నవ్వింది సారిక.

"సరే అయితే, మరి నేను వస్తాను"

"చిన్న విషయం డాక్టర్." వెళ్లిపోవడానికి సిద్ధమవుతూవున్న సమీర ని ఆపుతూ అంది సారిక. "నేను మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉందిక్కడ."

"ఏమిటది?" వెళ్ళబోయేదల్లా ఆగి, ఆసక్తిగా నొసలు చిట్లించింది సమీర.

"యంగ్ గర్ల్స్ లో సెక్స్ వాంఛలు వుంటాయని నాకు తెలుసు. వాటిని కొన్ని సందర్భాల్లో తట్టుకోవడం కష్టంగా ఉంటుందనీ నాకు తెలుసు. అందుకనే నా అర్జ్ ని  ఒకళ్ళిద్దరితో శాటిస్ఫై చేసుకోవడానికి ట్రై చేసి అలా ఫెయిల్ అయ్యాను."

అంటూ ఆగింది ఎలా చెప్పాలో తెలియటం లేదన్నట్టుగా.

"ఒకే, దెన్." ఎంకరేజింగ్ గా చూస్తూ అంది సమీర.

"కానీ కొన్నిరోజులుగా నాలో ఆ సెక్స్ అర్జ్ చాలా భయంకరంగా వుంది. అసలు తట్టుకోలేకపోతూఉన్నాను. ముఖ్యంగా ఆ మూడురోజులు మరీ నరకం గా వుంది."

"ఐ సీ" సాలోచనగా తలూపింది సమీర.

"ఇప్పటివరకూ ఎప్పుడూ లేనిది, ఓరల్ సెక్స్ మీద కూడా విపరీతమైన కోరిక కలుగుతూంది. నేను తట్టుకోలేమపోతున్నాను. ఏం చెయ్యాలో బోధపడడం లేదు."

"నువ్విప్పటివరకూ అందుకోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యావు. అందువల్ల అది ఇంక తీర్చుకోవడం నీ వల్ల కాదేమో అన్న ఆలోచన నీకు వస్తూంది. ఏదన్నా మనం ఇంక పొందలేమేమో అనిపించినప్పుడు దానిమీద మనకున్న కోరిక ఇంకా విపరీతం అవుతుంది. ఇక్కడ నీ విషయం లో ఇదే జరుగుతూంది." నవ్వింది సమీర. "మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయం అదే కదా. నువ్వు నీ లవర్ తో అందులో సకెస్ఫుల్ గా పార్టిసిపేట్ చెయ్యగలిగినప్పుడు నీ కోరిక, ఈ సమస్య రెండూ తీరిపోతాయి. సో, ఇలా కూడా ఫీల్ అవుతున్నావ్ కాబట్టి, ఏజ్ సూన్ ఏజ్ పాజిబుల్, మీరిద్దరూ అది పూర్తిచేయండి."

"ఒకే డాక్టర్." బుగ్గలు మరోసారి సిగ్గుతో ఎర్రబడ్డాయి సారిక కి.

"ఇంక ఓరల్ సెక్స్. మరీ అంత అన్-నాచురల్ ఏం కాదు కానీ ఆరోగ్యకరం కూడా కాదు. మరీ అంత తట్టుకోలేని కోరిక అయితే, జెనిటల్స్ క్లీన్ గా ఉంచుకుని చెయ్యాలి. తనకీ ఇష్టమైతే దట్స్ నాట్ ఏ ప్రాబ్లెమ్."

"అర్ధమైంది డాక్టర్." ఇంక ఎర్రబడ్డానికి అవకాశం లేనంతగా ఎర్రబడిపోయాయి సారిక బుగ్గలు.               

"సరే అయితే. మరి నేను వస్తాను." అని బయటకి నడిచిన సమీర ని అనుసరిస్తూనే సారిక కూడా నడిచింది. 

&&&

"నువ్వు సారిక నీతో అలా మాట్లాడిన విషయం, బిహేవ్ చేసిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు?"  శ్రవణ్, ప్రమీల శ్రవణ్ రూమ్ లో ఉండగా మాలతి వచ్చి అడిగింది బెడ్ ఎడ్జ్ లో ప్రమీల పక్కన కూలబడుతూ.

ప్రమీల బెడ్ కి అపోజిట్ లో వున్నకుర్చీలో కూచుని వుంది.

"నాకు గుర్తు లేదు మామ్. అంత ఇంపార్టెంట్ అని కూడా అనుకోలేదు."  శ్రవణ్ అన్నాడు. "కానీ ఆ సైకియాట్రిస్ట్ అలా అడిగాక అది గుర్తుకువచ్చి చెప్పాలనిపించింది."

"ఏం ఆంటీ. ఆ విషయం మీరెందుకు అంత ప్రత్యేకంగా అడుగుతున్నారు?" ప్రమీల అడిగింది.  

"తనలా బిహేవ్ చేసింది, మాట్లాడింది అంటే నాకూ ఆశ్చర్యంగా వుంది." బెడ్ మీద ఇంకొంచం అడ్జస్ట్ అవుతూ అంది మాలతి. " ఆ పనిమనిషి కొంతకాలం ఈ ఇంట్లోవుంది. తను ఉండగానే శ్రవణ్ పుట్టి మూడేళ్ళ వాడివరకూ అయ్యాడు. తను శ్రవణ్ ని ఆడిస్తూ ఉండేది.."

"మరి తనెందుకు వెళ్ళిపోయింది?" శ్రవణ్ అడిగాడు.

"సర్వెంట్ మైడ్స్ కి ఏముంది శ్రవణ్? ఇచ్చే జీతం నచ్చక పోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడా అంతే జరిగివుంటుంది." ప్రమీల అంది.

దానికి ప్రత్యేకంగా ఏం మాట్లాడకుండా అంది మాలతి. "తను గ్రౌండ్ ఫ్లోర్ లో వున్న రూమ్ లో వుండేది. నిన్ను అక్కడికి తీసుకెళ్లి ఆడిస్తూ ఉండేది."

"నాకు అదంతా కొంచెం, కొంచెం గుర్తు వుంది. ఆరోజు ఎందుకనో సడన్ గా ఆ రూమ్ లోకి వెళ్లాలనిపించింది. వెళ్ళాను. ఆశ్చర్యకరమైన విషయం! తనకి తెలియకుండానే సారిక కూడా ఆ రూమ్ లోకి వచ్చింది. నాతో అలా మాట్లాడింది."

"ఇందులో ఏదీ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. తన జీవితం లో మొదటినుండి వున్న అబ్నార్మాలిటీ వల్ల తను చేసే ప్రతివిషయాన్నీ మనం కొంచెం ఎక్స్ట్రీమ్ గా తీసుకుంటున్నాం." ప్రమీల అంది.

"కానీ ప్రమీ......"

"తను ఒక సైకలాజికల్ డిజార్డర్ తో సఫర్ అవుతూంది. తనతో పాటుగా మనమందరం అంగీకరించిన విషయమే ఇది. అది క్యూర్ చెయ్యడానికే కదా మనం సైకియాట్రిస్ట్ ని కూడా పిలిచింది. మనం ఈ ప్రాబ్లెమ్ ని అలాగే చూద్దాం. ఇందులో పారానార్మల్ ఏమీ లేదు."

"ఈ ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పారు కదా. నువ్వింకా ఆ విషయం గురించి ఆందోళన పడకు మామ్." శ్రవణ్ నవ్వుతూ అన్నాడు.              

"నీ ఫ్రెండ్ బాధ్యత నీదే. మా అందరితో కన్నా కూడా తను నీతో ఎక్కువ క్లోజ్."   బెడ్ మీద నుండి దిగుతూ అంది మాలతి.

"ఆ విషయం మీరు నాకు చెప్పాలా? మీరు నిశ్చింతగా వుండండి." చిరునవ్వుతో అంది ప్రమీల.

తరువాత ఆ రూమ్ లో నుండి వెళ్ళిపోయింది మాలతి. 

&&&

భుజంగరావు ఆఫీస్ లో తన వర్క్ లో బిజీ గా ఉండగా ఓబులేసు భార్యనుండి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఓబులేసు భార్య ఆ రోజు అలా చెప్పగానే, తన అకౌంట్లోకి బాగా డబ్బులు పంపించి ఓబులేసు ని ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించమని చెప్పాడు. ఆ తరువాత ఒకరోజు ఓబులేసు తో మాట్లాడ్డానికి ప్రయత్నించాడు ఫోన్లో కానీ, తను మాట్లాడే పరిస్థితులలో లేడు, బాగా అప్సెట్ అయిపోయివున్నాడని తన భార్య చెప్పింది. సరే ఇంకా ఎమన్నా అవసరం వస్తే తనకి ఫోన్ చెయ్యమని చెప్పి, ఫోన్ కట్ చేసాడు. ఒక వారమో ఎంతో గడిచింది, మళ్ళీ ఇదే ఓబులేసు భార్యనుండి తనకి ఫోన్ రావడం.

 "బాబూ ఇంక ఓబులేసు మనకి లేడు, చనిపోయాడు." హిస్టీరికల్ గా ఏడుస్తూ చెప్పింది ఓబులేసు భార్య.

"అదేమిటి, అదెలా చనిపోయాడు?" ఆశ్చర్యపోతూ అడిగాడు భుజంగరావు.

"ఊరి చివర వున్న పాడుబడ్డ బావిదగ్గరికి వెళ్లి అందులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు." ఇంక అతని భార్య మాట్లాడే స్థితిలో లేదని తెలుసుకుని, పక్కనే వుండి ఆ సంభాషణ వింటున్నవాళ్ళు ఫోన్ తీసుకుని చెప్పారు. వాళ్ళే తనకి ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టివుంటారు. "గత కొద్దీ రోజులుగా ఓబులేసు చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఎగురుతాడు, గెంటుతాడు, నోటితో చిత్రమైన శబ్దాలు చేస్తాడు. నిన్న రాత్రి వెళ్లి ఆ నూతిలో దూకేసాడు. అర్ధరాత్రి కావడం వల్ల ఎవరం కనిపెట్ట లేకపోయాం." ఆ వ్యక్తి అన్నాడు.

"మరి ఇంత జరుగుతూ ఉంటే నాకెందుకు చెప్పి చావలేదు?" కోపంగా అరిచాడు భుజంగరావు.

"మీరేదో డబ్బు బాగానే ఇచ్చారని చెప్పింది తను. ఇంకా మిమ్మల్ని ఏం ఇబ్బంది పెడతాం లే అని చెప్పలేదు."

"తెలివి తెల్లారినట్టే వుంది. నేనెక్కడికి వస్తున్నాను." కోపంగా అని ఫోన్ కట్ చేసాడు భుజంగరావు.       

&&&

"నాకసలు ఏం మాట్లాడాలో బోధపడడం లేదు. ఓబులేసు లాంటివాడు అలా బిహేవ్ చెయ్యడం ఏమిటి?" ఆశ్చర్యపోతూ అడిగాడు మోహనరావు.

ఆఫీస్ లో తాను ఆ రోజు చూడాల్సిన వ్యవహారాలు వేరొకళ్ళకి అప్పజెప్పి వెంటనే ఇంటికి వచ్చి మోహనరావు ని కలిసాడు భుజంగరావు. ఇద్దరూ మోహనరావు గదిలో కుర్చీల్లో కూచుని మాట్లాడుకుంటూవున్నారు.

"అప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు తను చిత్రంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. నీళ్లు పుక్కిలిస్తున్నట్టుగా చప్పుడు చెయ్యడం, తలని అటూ ఇటూ ఊపడం, ఆ తరువాత పిచ్చి ఇంకా బాగా ముదిరినట్టుంది. ఎగరడం, గెంతడం, ఆఖరికి వెళ్లి ఊరిచివర వున్న పాడుబడ్డ నూతిలో దూకేసాడు."

"ఇదంతా సారిక తన మీద అటాక్ చేసిన రోజునుండి మొదలయిందని చెప్పిందన్నావు కదా. అదే నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతూంది." కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ అన్నాడు మోహనరావు. "వాడలా బిహేవ్ చేయడం ఆ రోజునుండి ఎందుకు ప్రారంభం కావలి? అంతకు ముందు కొద్దిరోజులనుండో, ఆ తరువాత కొద్దిరోజులనుండో ప్రారంభం కావచ్చు కదా."

"అంతకన్నా ఎక్కువ డిస్టర్బ్ చేసే విషయం ఇంకొకటి వుంది. నిన్న మీరు లేరు కదా."

"లేదు. ఒక ఫ్రెండ్ ని కలవడానికి తప్పనిసరై వెళ్ళాను. వాడు ఫ్యామిలీ తో సహా నిన్న ఈవెనింగ్ ఫారిన్ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రెండుసంవత్సరాలవరకూ రాడు. వెళ్లే ముందు నాతొ టైం స్పెండ్ చేసి వెళ్తానంటే వెళ్ళాను." కాస్త ఆగాడు భుజంగరావు. "ఇంతకీ నిన్న ఏం జరిగింది?"

మాలతి తనతో చెప్పిన విషయం మోహనరావు తో చెప్పాడు భుజంగరావు. "ఏదో వింత శబ్దాలు విని తను లేచి లైట్ వేసి చూస్తే సారిక అలా కనిపించింది. తల అటూ ఇటూ ఊపుతూ, నోటితో వింత శబ్దాలు చేస్తూ. నాకు అది వినగానే ఓబులేసు భార్య చెప్పినదే గుర్తుకువచ్చింది. తనూ మొదట అలాగే బిహేవ్ చేసేవాడు."

"ఏమిటి నువ్వు చెప్తున్నది?" షాక్ తో కుర్చీలో ముందుకువంగాడు మోహనరావు. "నాకు చాలా భయం వేస్తూంది ఇది వింటూంటే."

"మీ అంత భయంగానూ నాకూ వుంది. తన బిహేవియర్ లో ఓబులేసు తో సిమిలారిటీ లేకపోతె నేనింత భయపడకపోను. వాడు మొదట అలా నోటితో వింత శబ్దాలు చేస్తూ, తల అటూ ఇటూ ఊపడం తో మొదలుపెట్టాడు. చివరికి ఆ పిచ్చి ముదిరి వెళ్లి నూతిలో దూకి చనిపోయాడు. మన సారిక.........."

"ఇంక చెప్పకు. వింటూవుంటే నా భయం ఇంకా ఎక్కువ అయిపోతూంది." భుజంగరావు ని ఆపుతూ అన్నాడు మోహనరావు. "ఇంతకీ ఆ సైకియాట్రిస్ట్ ఎంతకాలం తీసుకుంటుంది తన సీనియర్ తో డిస్కస్ చెయ్యడానికి. అవసరం అయితే మనం వేరే మెంటల్ కేర్ కి ఎక్కడికన్నా తీసుకెళ్లడం సారికని."

"నిన్న తను వచ్చింది. మేము కొంతసేపు విషయం డిస్కస్ చేసాం. మాలతి ఈ విషయం కూడా తనతో చెప్పింది. సారిక ఎందుకు అలా బిహేవ్ చేస్తూంది అన్న విషయమై తనూ ఏం చెప్పలేకపోతూంది."

"అది సరే. ఇంతకీ సారిక కి ఎప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టబోతున్నారుట? ఆ విషయం చెప్పు." చిరాగ్గా అన్నాడు మోహనరావు.

"మనం కొంతకాలం వెయిట్ చెయ్యడం మంచిదని చెప్పింది." అంటూ తమకీ సమీర కి జరిగిన సంభాషణ వివరం గా చెప్పాడు భుజంగరావు. " సారిక పూచీ పూర్తిగా తనదని, కొంతకాలం పాటు వేచి చూడమని చెప్పింది. ఈ లోపుగా వచ్చే మార్పులని నిశితంగా గమనిస్తూండమని  చెప్పింది. ఒక రకంగా చూస్తే తను చెప్పింది సబబు గానే వుంది."

"ఏమిటో, నాకేమీ బోధపడడం లేదు.  ఓబులేసు లాంటివాడు అలా కావడమేమిటి? ఆఖరికి వాడు నూతిలో దూకి చనిపోవడమేమిటి? వాడు గునపం లా ఉండేవాడు. మామూలు జబ్బులు కూడా వాడికి ఏ రోజూ రాలేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడి అన్నాడు మోహనరావు

"అదే నాకూ అర్ధం కావడం లేదు." భుజంగరావు కూడా కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు. "వాడి భార్య అలా చెప్పగానే వాడిని ఏదన్న పిచ్చాసుపత్రికి తీసుకువెళ్ళుండాల్సింది. ఇంత త్వరగా వాడి పిచ్చి ముదిరి ఇలా నూతిలోకి దూకేస్తాడని నేననుకోలేదు."

"ఓబులేసు బిహేవియర్ తో సిమిలారిటీ లేకపోతె సారిక అలా బిహేవ్ చేసినందుకు నేను టెన్షన్ పడను. కానీ ఆ ఓబులేసు చిత్రమైన నోటిశబ్దాలు, తల ఊపడం తో మొదలుపెట్టి, నూతిలో దూకడం వరకూ వెళ్ళాడు. ఇప్పుడు సారిక అలాగే తల వూపుతూంది. నోటితో శబ్దాలు చేస్తూంది. వదిలేస్తే తనెంత వరకూ వెళుతుందో. నువ్వు వెంటనే మరోసారి ఆ సైకియాట్రిస్ట్ తో మాట్లాడి దీనికి ట్రీట్మెంట్ మొదలుపెట్టాలా చూడు. అలాగే ఓబులేసు ఎలా బిహేవ్ చెయ్యడం ప్రారంభించి ఏమయ్యాడో కూడా చెప్పు. అప్పుడే వాళ్ళకి విషయం లో సీరియస్నెస్ అర్ధం అవుతుంది."

"అలాగే కానీ......." అంటూ ఆగాడు భుజంగరావు.

"ఇంకా ఏమిటి?" మళ్ళీ చిరాకు పడ్డాడు మోహనరావు.

"మన సారిక ఇలా బిహేవ్ చెయ్యడానికి, ఆ ఓబులేసు అలా బిహేవ్ చెయ్యడానికి కారణం కేవలం సైకలాజికల్ డిజార్డర్ మాత్రమేనా, ఇంకేం అయి వుండదా?"

"ఇంకేం అయివుంటుంది లేకపోతె. వెనక ఏదన్న దయ్యామో, భూతమో ఉందని నీ అభిప్రాయమా?" నవ్వుతూ కుర్చీలోనుండి లేచాడు మోహనరావు. "వాళ్లిద్దరూ ఒకేలా ప్రవర్తించడం కేవలం కోఇన్సిడెంటల్. మన సారిక వాడి మీద అలా అటాక్ చేసిన రోజునుండి వాడాలా బిహేవ్ చెయ్యడం కూడా కేవలం కో-ఇన్సిడెంట్ మాత్రమే. మన సారిక అలా బిహేవ్ చెయ్యడానికి కూడా కారణం ఒక మైనర్ సైకలాజికల్ డిజార్డర్ తప్ప ఇంకేమీ కాదు నువ్వు కూడా వేరొకలా ఆలోచించొద్దు."

"సరే అయితే." తనూ కుర్చీలోనుండి లేచాడు భుజంగరావు.

"అవునూ, ఓబులేసు ఇలా బిహేవ్ చెయ్యడం గురించి, వాడిలా నూతిలో దూకేడం గురించి, నువ్వు ఇంట్లో ఎవరికన్నా చెప్పావా?" బయటకి వెళ్లబోతూన్నవాడల్లా ఆగి, భుజంగరావు మొహంలోకి చూస్తూ అడిగాడు మోహనరావు.

"లేదు. వాళ్లంతా సారిక బిహేవియర్ తో అప్సెట్ అయివున్నారు. ఈ విషయం చెప్పి వాళ్ళని ఇంకా అప్సెట్ చెయ్యడం ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ విషయం సారిక కి తెలియడం నాకిష్టం లేదు. తనసలే తన అబ్నార్మల్ బిహేవియర్ గురించి బాధపడుతూంది. ఇది వింటే ఇంకా బాధపడుతూంది."

"మంచిపని చేసావ్. ఇకపైన కూడా ఈ విషయం వాళ్ళెవరికీ చెప్పకు." అలా అన్నాక మోహనరావు ఆ రూమ్ లోనుండి వెళ్ళిపోయాడు.

నిట్టూరుస్తూ ఆయనవెనకాతలే భుజంగరావు కూడా బయటకి వచ్చాడు.                  

&&&

"ఇది చాలా వండర్ఫుల్ సజెషన్. నేను ఆ సైకియాట్రిస్ట్ కి థాంక్స్ చెప్పాలి." ప్రదీప్ అన్నాడు సారిక కళ్ళల్లోకి చూస్తూ. "లేకపోతె ఈ ముద్దుగుమ్మని అనుభవించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని నేను అనుకోలేదు."

"థాంక్స్ అలాగే చెపుదాం. కానీ ముందు అది అయిందనిపించు. ఇంతకుముందు రెండుమూడుసార్లు లాస్ట్ మూమెంట్ వరకూ వచ్చాక నేనలా బిహేవ్ చేసాను. ఈ సారీ నేనలా బిహేవ్ చేస్తానేమో అని నాకు భయం గా వుంది." భయం సారిక మొహం లో ద్యోతకమవుతూ వుంది.

సారిక సైకియాట్రిస్ట్ ఇచ్చిన సజెషన్ గురించి ప్రదీప్ కి చెప్పగానే, ఏ డిస్టర్బన్స్ లేకుండా అది చేసుకునేందుకు ఒక హోటల్ రూమ్ బుక్ చేసాడు.  

ఆ హోటల్ రూమ్ లోనే బెడ్ దగ్గర ఒకళ్ళకొకళ్ళు అపోజిట్ గా నిలబడివున్నారు సారిక, ప్రదీప్.

"నువ్వనవసరం గా కంగారు పడకు. ఈసారి అలా జరగదు. నువ్వొకవేళ అలా తప్పించుకోవడానికి ప్రయత్నించినా............" ఆగి నవ్వాడు ప్రదీప్. ".......... నిన్ను రేప్ చేసి కానీ ఇక్కడనుండి వెళ్లనివ్వను."

"వాగుడు ఆపి ముందు పనిచూడు." ప్రదీప్ దగ్గరికి వచ్చి అతని షర్ట్ బటన్స్ రిలీజ్ చేస్తూ అంది సారిక.

(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)