వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
“ఐ హోప్ సొ” మనోహరంగా నవ్వింది సమీర. “ఇందులో మరో యాంగిల్ కూడా వుంది, అది వింటే యు ఫీల్ ఆమ్యూజెడ్.”
“అదేంటో కూడా చెప్పు మరి.” ఒక చిరునవ్వు వచ్చి చేరింది అరవింద్ పెదవుల మీదకి.
లాస్ట్ మూమెంట్ లో సారిక కి సెక్స్ లో ఫైల్యూర్ గురించి చెప్పింది. “తనకి ప్రెజెంట్ ఒక లవర్ కూడా వున్నాడు. ఒక ప్రశాంతమైన వాతావరణం లో అతని తో అది ట్రై చేయమని చెప్పాను. ఫైనల్ కొచ్చేసరికి అతని తో కూడా అది చేయలేకపోయింది. ఫోర్ ప్లే వరకూ పరవాలేదు, కానీ సెక్సుయల్ ఇంటర్ కోర్స్ మాత్రం కావడం లేదు.”
“సడన్ గా వచ్చే మోరల్ కాన్సస్ నెస్స్ వల్ల అవటం లేదేమో? సాధారణం గా గర్ల్స్ కి సెక్స్ విషయమై ఇంట్లో మదర్స్ గైడెన్స్ వుంటుంది. పెళ్లయ్యేవరకూ సెక్స్ గురించి ఆలోచించడమే తప్పన్నట్టుగా చెప్తూ వుంటారు. అందువల్ల సబ్‌కాన్షస్ గా గర్ల్స్ లో ఒక ఫియర్ డెవలప్ అవుతుంది. తట్టుకోలేని కోరిక వల్ల లాస్ట్ మూమెంట్ వరకూ వచ్చినా, సబ్‌కాన్షస్ గా వున్న ఫియర్ వల్ల సరిగ్గా ఆ మూమెంట్ లో ఫ్రిజిడిటి రావచ్చు.”
“ఓహ్ గాడ్! ఇది ఫ్రిజిడిటి కాదు.” అంటూ తన జీవితం లో సెక్స్ సమయం లో ఏం జరుగుతోందో చెప్పింది. “తన లవర్ తో ట్రై చేసిన సమయం లో కూడా అదే ప్రకారం గా జరిగినది. కాబట్టి చిన్నప్పటినుండీ వున్న మోరల్ గైడెన్స్ వల్ల సడన్ గా వచ్చిన ప్రాబ్లం కాదు. వేరే ఏదో రీజన్ వుందనిపిస్తూంది.”
“సరే ఆ రీజన్ ఏమిటో నువ్వూ, నీ సీనియర్ కలిసి రేపు కనుక్కోండి. నాకు నిద్రవస్తూంది. మన డెవిల్ లేచి డిస్టర్బ్ చేయకముందే నువ్వూ విశ్రాంతి తీసుకో.” అని కళ్ళుమూసుకున్నాడు అరవింద్.
అరవింద్ అలా అన్నాక ఇంకేమీ అనకుండా కళ్ళు మూసుకుంది సమీర. ఎప్పుడు నిద్రలోకి జారిపోయింది తనకే గుర్తులేదు.
&&&
ఆ సమయం లో ఆ స్పెషల్ రూమ్ లో సారిక, సమీర, ఇంకా నిరంజన్ వున్నారు. ఆ రూమ్ ని పేషంట్స్ ని హిప్నోటైజ్ చేయడానికి, ఇంకా తక్కిన ట్రీట్మెంట్ ల గురించి వాడుతూ వుంటారు. ఆ రూమ్ లో వెనక్కి జారగిలబడి కూచోగల చైర్ లో సారిక వెనక్కి జారగిలబడి కూచుంది. సారిక కి అపొజిట్ గా వున్న చైర్ లో పక్క పక్కన వున్న కుర్చీల్లో కూచునివున్నారు నిరంజన్, సమీర.
“సారిక నువ్వు కేవలం ఒక సైకలాజికల్ డిజార్డర్ తో మాత్రమే సఫర్ అవుతూ వున్నావు. అదేమిటో తెలుసుకుని ట్రీట్ చేయడానికి మేమిక్కడ వున్నాం. నీ జీవితం లో వున్న అబ్నార్మలిటీ గురించి ఇప్పటికే డిస్కషన్స్ జరిగాయి. వాటిమీద మాకూ ఒక అవగాహన వచ్చింది. నీ జీవితం గురించి వెరీ ఫస్ట్ నుండి డిస్కస్ చేసి, తరవాత నిన్ను హిప్నటైజ్ చేసి నీ ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెడతాం. యు జస్ట్ ఫీల్ రిలాక్స్ అండ్ హాపీ.”
“ఒకే డాక్టర్” చిరునవ్వు నవ్వింది సారిక. “ఐ యాం ఫీలింగ్ రిలాక్స్ అండ్ హాపీ నవ్.”
“దట్స్ గుడ్” తనూ నవ్వింది సమీర. “ఇప్పుడు మనం నీ వెరీ ఎర్లీ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం.” అని గట్టిగా వూపిరి పీల్చుకుని వదిలి, కుర్చీలో ఇంకా మోర్ కంఫర్ట్ కి అడ్జస్ట్ అయింది సమీర. “లైఫ్ లో మొట్టమొదట నీ గురించి నీకు నాలెడ్జ్ వచ్చేసరికి నీ లైఫ్ ఎలా వుంది? నీకు ఏమనిపిస్తూ వుండేది? నీ పేరెంట్స్ నీతో ఎలా వుండేవారు?”
“దీసీజ్ ఇండీడ్ టిపికల్ క్వశ్చన్.” నవ్వింది సారిక. “లైఫ్ లో మొట్టమొదట నాకు నామీద నాలెడ్జ్ రావటం ఏమిటి?”
“మనమందరం మొదట నిల్ నాలెడ్జ్ తో పుడతాం. మనకి మూడు నాలుగు, సంవత్సరాల వయసు వచ్చేసరికి మన పేరెంట్స్ గురించి, ఇంకా మన ఫామిలీ గురించి మనకి తెలుస్తుంది. వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తున్నారా లేక మనల్ని కోపంగా చూస్తున్నారా అన్నది కూడా అప్పుడు తెలుస్తుంది. ఆ సమయం లో మనకి అర్ధం చేసుకునే శక్తి లేకపోయినా, అప్పటి పరిస్తితులు మన సబ్‌కాన్షస్ మీద ఇంప్రెషన్స్ వేస్తాయి. ఆ ఇంప్రెషన్స్ తరవాత మనం లీడ్ చేసే లైఫ్ లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి.” నిరంజన్ అన్నాడు.
“ఓకే” చిరునవ్వు నవ్వింది సారిక. “నాకు నా పేరెంట్స్ గురించి, ఫామిలీ గురించి నాలెడ్జ్ వచ్చేసరికి నా వయసు ఎంతో నాకు గుర్తులేదు. కానీ నా పేరెంట్స్ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారన్న విషయం మాత్రం గుర్తుంది. నన్ను నిమిషం కూడా విడిచిపెట్టేవారు కాదు.”
“నీ పేరెంట్స్ లో నిన్ను ఎవరు ఎక్కువ ప్రేమగా చూసేవారో చెప్పగలవా?” సమీర అడిగింది.
“నో, దటీజ్ ఇంపాజిబుల్.” మరోసారి నవ్వింది సారిక. “నా మామ్ నాకన్నీ చేస్తూండేది. నా మామ్ నాకు చేసే పనులన్నీ నా డాడ్ నాకు చెయ్యలేదు. కానీ....” కాస్త ఆగి అంది. “.. అందువల్ల నా డాడ్ నన్ను తక్కువ ప్రేమించారని చెప్పలేను. నన్ను ఎంతో అభిమానం గా, ముద్దుగా చూసేవారు. సొ, వాళ్లిద్దరిలో నన్ను ఒకరు ఎక్కువ ప్రేమించారు, తక్కువ ప్రేమించారు అని చెప్పలేను.”
“తక్కిన ఫామిలీ మెంబర్స్?”
“నెక్స్ట్ కమ్స్ మై గ్రాండ్ పా.” ఆ చిరునవ్వు అలాగే వుంది సారిక పెదవుల మీద. “అసలు నన్ను ఎంతో ఎక్కువగా ప్రేమించేవాళ్ళ గురించి చెప్పాలంటే నేను నా గ్రాండ్ పా గురించి చెప్పాలి. నా పేరెంట్స్ నన్ను ఎప్పుడన్నా దెబ్బ లాడేవారు. కానీ నా గ్రాండ్ పా నన్ను ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను అడిగినది ఏదన్నా నా పేరెంట్స్ కొన్ని సమయాల్లో ఇచ్చేవారు కాదేమో, కానీ నా గ్రాండ్ పా నేను అడిగినది ప్రతీదీ ఇచ్చేవారు. నేనంటే చాలా ప్రేమ నా గ్రాండ్ పా కి.”
“దటీజ్ ఇండీడ్ నైస్” నవ్వింది సమీర. సమీర తో పాటుగా నిరంజన్ కూడా నవ్వాడు.
“ఇంకా తక్కిన నా ఫామిలీ మెంబర్స్, నా బ్రదర్స్.” సమీర అడగడానికి ముందే చెప్పడం ప్రారంభించింది సారిక. “నా ఎల్డర్ బ్రదర్ శ్రవణ్ నాకన్నా ఐదు సంవత్సరాలు అలా పెద్ద. నా యంగర్ బ్రదర్ వంశీ నాకన్నా రెండు సంవత్సరాలు అలా పెద్ద. మేము కలిసి ఆడుకునేవాళ్ళం ఆ చిన్న వయసులో పూర్తి న్యూడ్ గా కూడా. ఆ సమయం లో నాకు తరచూ వచ్చే డౌట్ ఇప్పటికీ గుర్తుంది నాకు.”
“ఏమిటది?” చిరునవ్వుతో అడిగింది సమీర.
“వాళ్లకున్న లిటిల్ థింగ్స్ నాకెందుకు లేదు అని. కేవలం బాయ్స్ కి మాత్రమే తప్ప గర్ల్స్ కి అది వుండదు అని తెలియని చిన్న వయసు అది.” చెప్పింది కానీ సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి సారిక కి.
అది విని సమీర, నిరంజన్ కూడా నవ్వారు.
“ఏజ్ లో నాకూ వాళ్ళకీ మరీ అంత పెద్ద డీఫెరెన్స్ ఏమీ లేదు. కానీ నేను మాత్రం వాళ్ళకి చాలా చిన్న పిల్లనే. నన్ను ఓవర్ ప్రొటెక్టెడ్ గా వాళ్ళు చూసే తీరు చూసి అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది. కాకపోతే నన్ను అంతగా ప్రేమించే బ్రదర్స్ దొరకడం నా అదృష్టం. నిజం చెప్పాలి అంటే………” తను చెప్పబోయేది నొక్కి చెప్పడానికి అన్నట్టుగా ఆగింది సారిక. “………… నా అయిదుగురు ఫామిలీ మెంబర్స్ లో నన్నెవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే నేను చెప్పలేను. వాళ్ళందరూ నన్ను ఈక్వల్ గా ప్రేమిస్తూ, అభిమానిస్తున్నట్టుగానే నాకు అనిపిస్తుంది.”
“నిజంగానే నీదోక లక్కీ లైఫ్. అలా ప్రేమించే ఫామిలీ మెంబర్స్ దొరకడం నిజంగా అదృష్టం.” సమీర అంది.
“ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కారక్టర్ గురించి కూడా చెప్పాలి. అది నా ఫ్రెండ్ ప్రమీల. తను నాకన్నా రెండు సంవత్సరాలు అలా పెద్దది. కానీ నాకు మంచి ఫ్రెండ్ అయింది. మేమిద్దరం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మి అంటే, ఎప్పుడూ నా కంపనీ కోసం తను నా బ్రదర్ ని పెళ్లిచేసుకుంది.”
"ప్రమీల .......నాకు తెలిసిన అమ్మాయే కదా. చాలా తెలివైన స్టూడెంట్. తనవల్ల కదా నువ్వు మాకు పరిచయం అయింది." సమీర అంది.
"మా మధ్య వున్న ఆ ఏజ్ గాప్ మా స్నేహానికి ఏం అడ్డుకోలేదు. కలిసి ఆడుకునేవాళ్ళం. ఎన్నో విషయాలు షేర్ చేసుకునేవాళ్లం. తనకీ నేనంటే ఎంతోఅభిమానం. అలాగే తనంటే నాక్కూడా."
"నీ కంపెనీ గురించి నీ బ్రదర్ ని పెళ్లిచేసుకుందంటే ఆ విషయం అర్ధం చేసుకోవచ్చు." నవ్వింది సమీర.
"నా బ్రదర్ ని పెళ్లిచేసుకోవడం వల్ల నా కంపెనీ ఒక అడ్వాంటేజ్ కావచ్చు, కానీ తను నా బ్రదర్ ని కూడా చాలా ఇష్టపడే పెళ్లిచేసుకుంది. తర్వాత తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే వాళ్లిద్దరూ లవ్ లో వున్నారని."
"ఇది నిజంగా ఇంటరెస్టింగ్!" నిరంజన్ అన్నాడు.
"ఒకవేళ నేను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే నా కంపెనీ మిస్సయిపోతానని తన భయం. అందుకని నేనెప్పుడూ తనతో ఉండేలా ఒక ఇల్లరికపు అల్లుడిని కూడా మా యింటికి సెట్ చేసింది. ఆ వ్యక్తి తన తమ్ముడు ప్రదీప్. ప్రదీప్ ది, నాది ఒకటే ఏజ్. మేమిద్దరం కలిసి చదువుకుంటున్నాం కూడా."
"అటువంటప్పుడు ప్రదీప్ కి నీకూ కూడా మంచి ఇంటిమసీ ఉండాలి కదా." మళ్ళీ నిరంజనే అన్నాడు.
"మేమిద్దరం కూడా చాలా చనువుగానే ఉండేవాళ్ళం. కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ప్రమీల కి నాకూ మధ్య డెవలప్ అయినలాంటి ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్యా డెవలప్ అవ్వలేదు."
"ప్రమీలా, నువ్వూ ఒకటే సెక్స్ కావడం మీ ఇద్దరిమధ్య ఎక్కువ ఫ్రెండ్షిప్ కారణం అయివుండొచ్చు." సమీర అంది.
"మే బి." నవ్వింది సారిక. "ప్రదీప్ నేనూ కలిసి ఆడుకునేవాళ్ళం, చాలా ఇంటిమేట్ గానే ఉండేవాళ్ళం. కానీ ఇటీవల వరకూ నాకు తనని పెళ్ళిచేసుకోవాలని ఆలోచన మాత్రం లేదు."
"ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్?"
గట్టిగా నిట్టూర్చింది సారిక. "ప్రదీప్ కి నా ప్రస్తుత పరిస్థితి పూర్తిగా తెలుసు. తెలిసీ నన్ను ఇష్టపడుతూ వున్నాడు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్ ప్రమీల నేను తనని పెళ్ళిచేసుకోవాలని కోరుకుంటూంది. సో, నేనూ అందుకు అంగీకరించేను."
"ఇప్పటికి నీ హోల్ లైఫ్ మీద ఒక పెర్ఫెక్ట్ పిక్చర్ వచ్చింది. ఇప్పటివరకూ నిన్నందరూ ఇష్టపడేవాళ్ళే వున్నారు. నువ్వు ఇష్టపడే వాళ్లే వున్నారు." కాస్త ఆగింది సమీర. "నువ్వు ఇష్టపడకుండా కోపం తెచ్చుకునేవాళ్ళు కూడా ఎవరన్నా వున్నారా?"
"ఓహ్, నేను ఇష్టపడని వాళ్ళా?" నవ్వింది సారిక. "నో, ఎవరూ లేరు. అందరూ నన్ను ప్రేమించేవాళ్లే వున్నారు. సో నేనూ అందర్నీ ఇష్టపడతాను."
"వన్ వీక్ క్రితం నీ మీద గ్యాంగ్ రేప్ అటెంప్ట్ జరిగింది. ఒక ముగ్గురు వెధవలు నిన్ను కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేయబోయారు. వాళ్ళమీద కూడా నీకెలాంటి కోపం లేదా?" సమీర అడిగింది.
"డాక్టర్ అదీ..........." అది వినగానే ఇబ్బందిగా మారింది సారిక మొహం లో ఎక్స్ప్రెషన్.
"చూడు సారికా. నీలో యాంగర్ రైజ్ చేసే అంశం ఏదున్నా అది తెలియాలి. ఎందుకంటే నీ జీవితం లో పెద్ద ప్రాబ్లెమ్ క్రియేట్ చేస్తూన్నది ఆ యాంగరే. సో, నీకు ఎవరి మీద కోపం వస్తూవున్నా ఆ విషయం నాకు చెప్పు. అదేమన్నా తక్కిన వాళ్ళమీద కోపం రైజ్ కావడానికి కారణం అవుతూవుందేమో చూస్తాను."
"నాకు వాళ్ళమీద కోపం ఏమీ లేదు. వాళ్లంతగా తెగించడానికి ఒకరకంగా కారణం కూడా నేనే." అంటూ కాస్త ఆగింది సారిక. "మీకు చెప్పానుగా నేను సెక్స్ విషయం లో ఎలా బిహేవ్ చేస్తూ వచ్చానో. నేను సెక్స్ ట్రై చేసింది ఆ ముగ్గురి తోటే. లాస్ట్ మూమెంట్ లో అది పూర్తికాకుండా వాళ్ళని డెస్పెరేట్ గా ఆలా వదిలేసి వచ్చేసాను. సో, నేను వాళ్ళల్లో రైజ్ చేసిన కోరిక వల్ల కావచ్చు, లేదా నా బిహేవియర్ వల్ల నా మీద పెరిగిన కోపం వల్ల కావచ్చు, వాళ్ళు నామీద అది ట్రై చేసారు. అక్కడ కూడా లాస్ట్ మూమెంట్ లో సర్ప్రైజింగ్ గా నేను నా కట్లు విప్పుకుని వాళ్ల మీద టెరిబుల్ అటాక్ చేసాను. ఆ అటాక్ లో నేను చేసిన గాయాలకు వాళ్ళు చచ్చిపోకుండా బతికిబయట పడ్డం నా అదృష్టం. అందువల్ల వాళ్ళమీద కూడా నాకేమీ కోపం లేదు."
"సో, స్పెసిఫిగ్గా నీకు ఎవరిమీద ఎటువంటి కోపం లేదు. ఎవరి మీద ఎటువంటి కోపం రాదు."
"అలాగే అనుకోవచ్చు." నవ్వింది సారిక.
"అసలు నీకు ఎప్పుడన్నా కోపం వస్తుందా? నీకసలు యాంగర్ ఫీలింగ్ వస్తుందా? కొంచెం ఆలోచించుకుని చెప్పు." నిరంజన్ అన్నాడు.
కింద పెదవిని పెదవుల మధ్య బిగించి ఆలోచనలో పడింది సారిక. "అసలు నాకు కోపం ఎప్పుడూ రాదని చెప్పలేను. అందరిలాగే అప్పుడప్పుడు నాకూ కోపం వస్తుంది. ఐ యామ్ నాట్ దట్ మచ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ యాంగర్ ఫీలింగ్." కొన్ని సెకన్ల నిశబ్దం తర్వాత నవ్వి చెప్పింది.
"కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరికన్నా సరే వాళ్ళ పేరెంట్స్ మీద కోపం వస్తుంది. అలా నీ పేరెంట్స్ మీద నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా? ఏ చిన్న విషయానికైనా సరే. కొంచెం జాగ్రత్తగా అలోచించి చెప్పు."
"దిసీజ్ ఇండీడ్ ఏ పనిష్మెంట్ ఐ షుడ్ సే." సారిక నవ్వింది. "నిజం చెప్పాలంటే ........... నాకు అప్పుడప్పుడు ..........." సడన్ గా సారిక మొహం లో ఎక్స్ప్రెషన్ మారింది. "........... వస్తుంది. చాలా కోపం వస్తుంది. చంపేయాలన్నంత కోపం వస్తుంది." గట్టిగా అరుస్తూ లేచి నిలబడింది.
నివ్వెరపోయి మొహామొహాలు చూసుకుని లేచి నిలబడ్డారు సమీర, నిరంజన్.
"రిలాక్స్ డియర్. రిలాక్స్. రిలాక్స్ యువర్ సెల్ఫ్." సారిక ని దగ్గరికి తీసుకుని, సముదాయించడానికి ప్రయత్నిస్తూ అంది సమీర.
"నేను వాళ్ళని చంపెయ్యాలి. నేనిప్పుడే వాళ్ళని వెళ్లి చంపేస్తాను. ఆ ఓబులేసు ని చంపేసాను. నా తల్లి ని, తండ్రి నీ, తాత ని కూడా చంపేస్తాను. వాళ్ళు ముగ్గురు అంటే నాకు అసహ్యం, కోపం." సమీర పట్టునుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది సారిక.
"నువ్వే చెప్పావు. నీ తల్లి, తండ్రి, తాత నిన్నెంతో ప్రేమగా చూసుకుంటారని. వాళ్ళని చంపేస్తావా?" సారిక ని కదలకుండా పట్టుకోవడం సమీర కి కష్టం అయిపోతూవుంది.
"నేనెప్పుడూ అలా చెప్పలేదు. వాళ్లెప్పుడూ నన్ను ప్రేమగా చూడలేదు. నేను వాళ్ళని చంపెయ్యాలి. నన్ను వెళ్లనీ, నన్ను వెళ్లనీ.........." సమీర పట్టునుండి విడిపించుకుని వేగంగా ద్వారం వైపు అడుగులు వేసింది సారిక.
అప్పుడు నిరంజన్, సమీరా ఇద్దరూ సారిక భుజాల్ని చెరోవైపునుండి పట్టుకుని ఆపారు. "స్టాప్, నువ్వెక్కడికీ వెళ్లడం లేదు." గట్టిగా అంది సమీర.
సడన్ గా ఆగిపోయింది సారిక. "డాక్టర్ నాకేమైంది? మీరిద్దరూ ఎందుకు నా చెరోవైపు ఇలా పట్టుకునివున్నారు?"
"థాంక్ గాడ్! యు బికేం యువర్ ఓన్ సెల్ఫ్." గట్టిగా నిట్టూర్చింది సమీర. "రా. మళ్ళీ ఆ కుర్చీలో కూచుందువుకాని."
"ఆ సమయం లో తన పేరెంట్స్ కానీ, తన గ్రాండ్ పా కానీ తన దగ్గర ఉండివుంటే తను వాళ్ళమీద చాలా టెరిబుల్ అటాక్ చేసివుండేది." సారిక ని మళ్ళీ తన కుర్చీలో కూచోబెట్టి, తామిద్దరూ ఆమెకి అపోజిట్ గా వున్నా కుర్చీల్లో కూచున్నాక, సమీర మొహంలోకి చూస్తూ అన్నాడు నిరంజన్.
"అసలు ఏం జరిగింది డాక్టర్?" అయోమయంగా చూస్తూ అడిగింది సారిక.
ఏం జరిగిందో చెప్పింది సమీర. "నీకు సడన్గా నీ పేరెంట్స్ మీద, గ్రాండ్ పా మీద, ఇంకా ఓబులేసు మీద చాలా కోపం వచ్చింది. ఆ ఓబులేసు ని చంపేశానని చెప్పావు. నీ పేరెంట్స్ ని, గ్రాండ్ పా ని చంపేయాలని బయలుదేరావు. వుయ్ ఇండీడ్ ఫుట్ ఎన్ ఎఫర్ట్ టు స్టాప్ యు." సమీర అంది.
"నీ పేరెంట్స్ ఇంకా గ్రాండ్ పా నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పావు. మరి సడన్ గా వాళ్ళమీద నీకు ఎందుకు అంత కోపం వచ్చింది?" నిరంజన్ అడిగాడు.
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)