you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 14

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 14

ప్రెసెంట్ (ప్రస్తుతం):
అలా జరిగింది అంతా కూడా డీటెయిల్ గా వివరించి చెప్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. 

" నిన్న ఈవినింగ్ ఫైల్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చదువుతున్నప్పుడు ఫొటోస్ లేవు అని గమనించాను అతనికి ఫోన్ చేస్తే అన్రిచబుల్ అని వచ్చింది . ఈరోజు పొద్దున్న కాల్ చేసి ఆ ఫొటోస్ వివరాలు అడుగుదాం అని అనుకున్నాను.  నాకేం తెలుసు ఇలా రాత్రికి రాత్రి డాడీ కాల్ చేసి అత్తయ్యతో మాట్లాడుతారు అని , అత్తయ్య ఇలా పొద్దున్నే ఫ్యామిలీతో వస్తుంది అని " అని అంటూ బెడ్ మీద కూలబడిపోతుంది. 

పాపం ప్రియ బ్యాడ్ లక్ కి తన ఫ్రెండ్స్ అందరు కూడా ఫీల్ అవుతారు ఇలా ఒక్క నైట్ లో తన లైఫ్ మొత్తం తలకిందులు అవుతుందని ఎవరు ఊహించలేదు.

కానీ జరిగిందంతా విన్న ప్రేమ్ మాత్రం చాలా సంతోషపడతాడు. " వావ్.. బంగారం నాకు మాత్రం భలే థ్రిల్లింగ్ గా ఉంది తెలుసా నేను నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇలా అరేజ్ మ్యారేజ్ అవుతుందని అసలు అనుకోలేదు ఏదైతే నువ్వు మాత్రం నాకు వైఫ్ అవబోతున్నావ్ ఐ యాం సో హ్యాపీ " అని అంటాడు ప్రేమ్.

ప్రేమ్ మాటలు వినగానే ఏడడం స్టార్ట్ చేస్తుంది ప్రియా
ఆ😭.... ఆ 😭...... ఆ 😭......

ప్రియా అలా ఏడవగానే ప్రియా ఫ్రెండ్స్ అందరూ  కంగారుపడతారు. 

ప్రేమ్ మాత్రం ప్రియా ఏడడం చూసి ఫన్నీగా అనిపించి , కింద పడిపోయి మరి పందిలా దొలుతూ నవ్వుతూ ఉంటాడు. హ😂.... హ 😂....
హ 😂...
అలా నవ్వడం వల్ల ప్రేమ్ కంట్లోకి నీళ్లు కూడా వచ్చేస్తాయి.

ప్రేమ్ నవ్వు చూసి ప్రియా ఫ్రెండ్స్ అందరికీ కూడా కోపం వస్తుంది ఇంక్లూడింగ్ అక్షయ.

ప్రేమ్ అలా తను ఏడవడం చూసి నవ్వుతుంటే వెంటనే ఏడవడం  ఆపేసి ఫ్రేమ్ వైపు కోపంగా చూస్తుంది.

ఆదిత్య , అందరూ ప్రేమ్ నీ  కోపంగా చూడడం చూసి  ప్రేమ్ దగ్గరికి వెళ్లి "  ఒరేయ్ కొంచెం ఆ నవ్వు ఆపరా బాబు , ఒకసారి చుట్టూ చూడు , చూపులతోనే చంపేసేటట్టు ఉన్నారు ఇక్కడ  " అని అంటాడు.

ప్రేమ్ నవ్వడం ఆపేసి కళ్ళు తుడుచుకొని చుట్టూ చూస్తే అందరూ తన వైపే కోపంగా చూడడం కనిపిస్తుంది వెంటనే స్టెప్ గా నుంచుంటాడు తననవ్వని వీలైనంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ. 

నితిన్ కోపంగా "  చూశారా వాడు ఎలా నవ్వుతున్నాడో  స్వీటీ ఏడుస్తుంటే,  వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు అంటే రేపు స్వీటీ వీడిని చేసుకుంటే దాని పరిస్థితి ఏంటో ఊహించగలరా, అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను"  అని అంటాడు.

ప్రేమ్ ఏదో అనే లోగా నితిన్ వైపు ఒక కర్ర గాలిలో ఎగురుకుంటూ వచ్చి పడుతుంది అది గట్టిగా తగలడంతో నితిన్ బాధతో అరుస్తాడు " చచనురా.....దేవుడా" .

నితిన్ ని కొట్టింది ఎవరో కాదు మన ప్రియా. 

ప్రియా తనని కొట్టడంతో కోపం వచ్చిన నితిన్ " నన్ను ఎందుకు కొడుతున్నావే , నవ్వినందుకు వాడిని  కొట్టకుండా ?" అని అంటాడు దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ. 

" అసలు ఇదంతా జరిగింది నీ వల్లే కదరా దరిద్రుడా ..నీ మీద నమ్మకంతో ఆ డిటెక్టివ్  ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని అనుకొని మా నానమ్మ దగ్గర మంగమ్మ  శబథం చేసి చచ్చాను , అత్త కొడుకుని చేసుకుంటా అని.  ఇప్పుడు చచ్చినట్లు వీడిని పెళ్లి చేసుకోవాలి" అని ప్రేమ్ వైపు చూపిస్తుంది .  "ఇదంతా అయ్యింది నీ వల్లే కదరా " అని అంటూ మళ్లీ తన కోపాన్ని నితిన్ మీద చూపిస్తూ కొట్టడం స్టార్ట్ చేస్తుంది.

నితిన్ మళ్లీ అదే మాట రిపీట్ చేస్తూ " నాకెందుకో ఈ ప్రేమ్ గారి మీదే డౌటే నువ్వు లేని టైం చూసి వాడి ఇన్ఫర్మేషన్ ఉన్న పేపర్స్ నీకు కనపడకుండా చేసి ఉంటాడు"  అని అంటాడు.

ప్రియా నితిన్ ని ఇంకా కోపంగా కడుతూ " ఆపరా .. నాకు తెలుసు ప్రేమ్ దీని వెనకాల లేడు అన్న సంగతి. ఇంకా ప్రేమ్  అలా చేయడు అని కూడా నాకు తెలుసు . నువ్వే  కావాలని నీ తప్పుని కప్పిపుచ్చడానికి ప్రేమ్ మీద అలా చెప్తున్నావు అని  నాకు తెలుసు " అని అంటుంది.

ప్రియా తనని అంతలా నమ్ముతున్నందుకు ప్రేమ్ చాలా సంతోషపడతాడు .ప్రేమగా ప్రియ వైపే చూస్తూ ఉంటాడు.

ఆ మాటలు విన్నా నితిన్ కి చాలా కోపం వస్తుంది "అంటే నాకన్నా నీకు వాడి మీద నమ్మకం ఎక్కువ " అని అడుగుతాడు.

నితిన్ మాటలకు కోపం వచ్చిన ఆదిత్య మాట్లాడుతూ " అసలు లాస్ట్ టూ డేస్ ప్రేమ్ ఈ ఊరిలోనే లేడు, ఆఫీస్ పనిమీద నేనే బెంగళూరు పంపించాను,  వాడిని స్వయంగా నేనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చాను వాడు నిన్న నైట్ 12:00 కి ఇంటికి వచ్చాడు , అది కూడా నేనే వెళ్లి తీసుకు వచ్చాను , మేము ఇంటికి రాగానే అమ్మ ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పింది.  అది ఇక్కడికి అని అప్పుడు మాకు తెలీదు, ప్రియా మా మామయ్య వాళ్ళ కూతురు అన్న సంగతి ఇక్కడికి వచ్చాకే మాకు తెలిసింది, నీకు అంతగా డౌట్ ఉంటే ఎంక్వయిరీ చేసుకో, అంతేకానీ లేనిపోని ఊహలతో నా తమ్ముడిని అంటే మాత్రం మర్యాదగా ఉండదు " అని బేస్ వాయిస్ తో చెప్పాడు.

అక్షయ కూడా మాట్లాడుతూ నితిన్ వైపే చూసి "అవునురా ప్రేమ్ ఇక్కడ లేడు, అలాంటప్పుడు ఇక్కడ జరిగిందంతా కూడా ప్రేమ్ కి ఎలా తెలుస్తుంది అసలు స్వీటీ ఆ డిటెక్టివ్ ని ఎందుకు అడిగిన సంగతి మీకు కూడా తెలియదు స్వీటీ చెప్పే వరకు కూడా" 

నితిన్ ఫ్రేమ్ ని ఇరికిద్దాం అనుకున్నాడు కానీ అలా కుదరకపోయేసరికి " నాకేం తెలిసే వాడు అలా సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి చస్తాడని , అసలు ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చింది  అరుణ్ గాడు" అని అంటాడు. 

' సచ్చినోడు.. వీడు మళ్ళీ నన్ను ఇరికిస్తున్నాడు .. ఇప్పుడు వరకు పడిన తన్నుల వల్ల వొళ్లు హూనం  అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వీడి మాటలు విని  స్వీటీ నన్ను కొడుతుందా ఏంటి.' అని అనుకుంటాడు అరుణ్ తన మనసులో  నితిన్ నీ బండ బూతులు తిట్టుకుంటూ . భయంగా ప్రియా వైఫై చూస్తూ ఉంటాడు ఎక్కడ ప్రియా మళ్ళీ అతన్ని కొడుతుందేమో అని .

ప్రియా ఇంకా నితిన్ ని కొడుతూ ఉండడంతో  అక్షయ ప్రయా నీ ఆపుతుంది " ఆపవే ఇప్పటివరకు కుమ్మేసావ్ వాడిని ఇంకా కొడితే చచ్చే లాగా ఉన్నాడు, నీ కోపం ఆ డిటెక్టివ్ గాడి మీద చూపించు, నీకు సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు "  అని అంటుంది.

అరుణ్ కూడా అక్షయ మాటలకు ఏకీభవిస్తూ "అవును.. అవును...మనకి సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆ డిటెక్టివ్ గాడిని తన్నాలి ముందు"  అని అంటాడు.

ప్రియా కోపంగా అరుణ్ వైపు చూసి " అసలు ఆ డిటెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇచ్చింది నువ్వే కదరా ముందు నితిన్ గాడిని కాదు  నిన్ను తన్నాలి .." అని అంటూ నితిన్ నీ వదిలి అరుణ్ వైపు వెళ్తుంది.

అరుణ్ భయంతో శైలు ని గట్టిగా పట్టుకొని " ఒసేయ్ నన్ను కాపాడవే.. నువ్వు ఇప్పుడు వరకు ఇచ్చిన ట్రీట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ప్లీజ్... 😭😭..ఇక తన్నులు తినడం నావల్ల కాదు😭😭😭"  అని ఏడుస్తాడు

ఈసారి నిఖిల్  ప్రీయా నీ పట్టుకొని అరుణ్ ఇంకా నితిన్ వైపు చూస్తూ " ఒరేయ్ ముందు ఫస్ట్ మీ ఇద్దరూ ఇక్కడి నుంచి దొబ్బేయండి , స్వీటీ కోపం తగ్గాక వద్దురు గానీ లేకపోతే రోజంతా మిమ్మల్ని కొడుతూనే ఉంటుంది,  వెళ్ళండి"  అని అంటాడు.

నితిన్ ఇంకా అరుణ్ అదే కరెక్ట్ అనిపించి అక్కడి నుంచి పారిపోతారు.

వాళ్లు అలా పారిపోతుంటే శైలు " ఒరేయ్ ఆగండి రా ... పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళండి " అని అంటుంది .

" నీ స్టేట్మెంట్ కోసం ఇక్కడే ఉంటే దాని చేతిలో చచ్చేలాగా ఉన్నా మేము"  అని ఇద్దరు పారిపోతారు

వాళ్లు అలా బయటికి పారిపోవడం గోపి బ్యూటిషన్ ని అక్కడికి తీసుకురావడం ఒకేసారి జరుగుతుంది.

"  చిన్నమ్మ గారు, అయ్యగారు ఈవిడని మీ గదికి పంపించమని చెప్పారండి , ఈవిడ మిమ్మల్ని తయారు చేయడానికి సహాయం చేస్తుందంట . మిమ్మల్ని త్వరగా తయారు అవ్వమని పెద్దయ్య గారు చెప్పారు. గెస్ట్లీ వచ్చే టైం అయ్యిందని మీకు చెప్పమని చెప్పారు అమ్మ , మిమ్మల్ని త్వరగా తయారు కమ్మని చెప్పారు"  అని అంటాడు గోపి.

ఆ మాట వినగానే నీరసంగా నిఖిల్ వైఫ్ చూసి "నువ్వు అయినా ఏదో ఒకటి చేయొచ్చు కదా"  అని అడుగుతుంది దీనంగా.

నిఖిల్ ప్రియా మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ " స్వీటీ నేను చెప్పేది వినరా నాకైతే నువ్వు ఈ పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది . నీ నోటితో నువ్వే ఈ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. ఇప్పుడు నీ మాటకి  వెనక్కి అయితే వెళ్లలేవు కదా.  అయినా ఫ్రేమ్ చాలా మంచోడు రా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అన్నది నా గట్టి నమ్మకం , ఒక్కసారి అతనికి ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా " అని అంటాడు.

ప్రియా తన ఫ్రెండ్స్ లో ఎక్కువగా నిఖిల్ మాట బాగా వింటుంది ఇప్పుడు నిఖిల్ ప్రియా ని కన్వీస్ చేస్తుంటే ఆదిత్య కి కొంచెం హ్యాపీగా అనిపించింది.

అక్షయ కూడా ప్రియా కి నచ్చచెప్పుతూ " స్వీటీ నా మాట విను ప్రేమ్ చాలా మంచోడు, నువ్వంటే ప్రాణమే వాడికి , బహుశా ఆ కృష్ణయ్య కూడా ఇదే కోరుకుంటున్నాడేమో , లేకపోతే మా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఉండి ప్రేమ్ డీటెయిల్స్ మాత్రమే ఎలా మాయమయ్యాయి అంటావు, ఇదంతా కూడా ఆ కృష్ణయ్య మాయ లాగా అనిపించట్లేదు , నువ్వు నమ్మి నీ కృష్ణయ్య ఇదంతా చేసి ఉంటాడు నీ నోటితో  నువు ఈ పెళ్లికి ఒప్పుకునే లాగా చేశాడు"  అంటుంది అక్షయ.

ప్రియా కొంచెం బాధగా " అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా అంటున్నారా"  అని అంటుంది. 

ఈసారి అక్షయ కొంచెం గట్టిగా అంటూ " అన్నీ తెలుసు కాబట్టి ప్రేమ్ ని పెళ్లి చేసుకో అంటున్నాము , గతంలో ఉండిపోవడం కరెక్ట్ కాదు ప్రియ లైఫ్ లాంగ్ ఇలా ఉండిపోవడం కూడా కరెక్ట్ కాదు, లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి " అని అంటుంది. 

అక్షయ ప్రెగ్నెంట్ అవడంతో ఇలా గట్టిగా మాట్లాడితే స్ట్రెస్  తీసుకుంటుంది ఏమో అని భయపడ్డాడు ఆదిత్య , వెంటనే అక్షయ వైపు వెళ్లి తన వెన్ను నిమురుతూ కంట్రోల్ చేసుకోమని అంటాడు.

ప్రియా కి ఏం చేయాలో అర్థం కావట్లేదు తన ఫ్రెండ్స్ కూడా ప్రేమ్ కి సపోర్ట్ ఇస్తున్నారు . పోనీ ప్రేమ్ ని బతిమాలి ఈ పెళ్లి ఆపుదాము అనుకుంటే ప్రేమ్ దానికి అసలు ఒప్పుకోడు ,ఏం చేయాలో తనకి అర్థం కావట్లేదు ప్రెసెంట్ ఇప్పుడు ఈ నిశ్చితార్థం తప్పించుకోలేదని  తనకి బాగా అర్థమయింది,  తర్వాత ఏదో ఒకటి ప్లాన్ చేయచ్చు అనుకొని సైలెంట్ గా ఉండిపోతుంది. 

ప్రియా అలా సైలెంట్ గా ఉండడం చూసిన అక్షయ ఏదో మాట్లాడబోతుంటే  నితిన్ వద్దు అన్నట్లు సాయిగా చేస్తాడు.

ప్రేమ్, ప్రియా మనసులో ఏమనుకుంటుందో చదవగలడు. ' బంగారం ఇంతకాలం సహనంతో నిను గెలుచుకుందాం అనుకున్నాను , నీ మొండితనం వల్ల అది సాధ్యం కాదని నాకు అర్థం అయింది , ఇకనుంచి నేను కూడా నీ వే లోనే వెళ్తాను నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుని తీరుతాను , నా ప్రేమను నీకు అర్థం అయ్యేలా చేస్తాను ' అని అనుకుంటాడు తన మనసులో. 

అక్కడ జరుగుతున్న డిస్కషన్  బ్యూటిషన్ కి అర్థం కాక " మేడం రెడీ చేయమంటారా సర్ మిమ్మల్ని హాఫెన్ అవర్ లో రెడీ చేయమని ఆర్డర్ చేశారు " అని అంటుంది.

ప్రేమ్ మాట్లాడుతూ " ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్ , నా రాపుంజెల్ ని ఎంత అందంగా రెడీ చేయాలి అంటే నాకు కాబోయే పెళ్ళాన్ని చూసి ఈ లోకమంతా కూడా కుళ్ళుకుచావాలి అంత అందంగా రెడీ చేయండి , ఆప్కోస్ మీరు రెడీ చేయకపోయినా అది అందంగానే ఉంటుందనుకోండి " అని అంటూ ప్రియ వైపు చూస్తాడు. 

( ఇంతకీ ప్రియ నీ రాపుంజెల్ అంటున్నాడు ఏంటి  , ఇంతకీ తాను ఎవరు అని అనుకుంటున్నారా,  రాపుంజెల్ , టాంగ్లెడ్ ( ఇంగ్లీష్ కార్టూన్ మూవీ ) అనే మూవీలో హీరోయిన్, ఆ మూవీలో హీరోయిన్ జడ చాలా పొడుగ్గా ఉంటుంది ప్రియా జడ కూడా  పొడుగ్గానే ఉంటుంది, ఎంత అంటే తన పిక్కల వరకు  , ప్రియ నిటారుగా నుంచుంటే తన జడ భూమికి కేవలం వన్ ఫీట్ ఎత్తులో మాత్రమే ఉంటుంది ) .

ప్రియా మాత్రం ప్రేమ్ వైపు కోపంగా ఒక చూపు విసిరి చూపు పక్కకు తిప్పుకుంటుంది.
ప్రియా ని అలా చూసిన ప్రేమ్ " అబ్బా ..ఏముంటావే కోపంలో,  అందాల రాక్షసి "  అనీ ముద్దుగా తిట్టుకుంటాడు తన మనసులో .

" సరే ప్రేమ్ నీ వైఫ్ ని నేను దగ్గర ఉండి మరి రెడీ చేయిస్తాను గానీ మీరు కిందకి వెళ్లి మిగతా పనులు చూసుకోండి"  అని అంటుంది అక్షయ.

నిఖిల్ ఇంకోసారి ప్రియా తో మాట్లాడుతూ " స్వీటీ ఒకసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించరా, నేను ఎప్పుడు కూడా నీ మంచి కోసమే చెప్తాను , ఆ విషయం గుర్తుంచుకో,  అయినా సరే నీ మొండితనం నీదే అని అంటావా అప్పుడు కూడా నేను నీకే సపోర్ట్ ఇస్తాను " అని అంటాడు.

నిఖిల్ మాటకు అక్షయ ఏదో అనపోతుంటే అక్షయ కి కళ్ళతోనే  చేస్తాడు వద్దు అన్నట్లు.
నిఖిల్ ఏం చేసినా సరే ఒక అర్థం ఉంటుంది అని అక్షయకి తెలుసు. సో ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. 

నిఖిల్ , ప్రేమ్ అండ్ ఆదిత్య  ప్రియ రూమ్ నుంచి బయటకి వస్తారు.

నిఖిల్ ప్రేమ్ వైపు చూస్తూ " నాకు నీ మీద నమ్మకం ఉంది ప్రేమ్ నువ్వు స్వీటీ ఆలోచనని మార్చగలవు అని ,  ఇంతవరకు కూడా తను నీకు దూరంగా ఉంది ఇప్పుడు నువ్వు తనతో ఈ ఇంట్లో ఉండబోతున్నావు రోజు తనతోనే ఉంటావు,  ఏం చేస్తావో నాకు తెలియదు తన మనసు మార్చడం నీ పని, తను పెళ్లి పీటల మీద ఆనందంగా కూర్చోవాలి , అలా నువ్వే చేయాలి , ఇందులో నీకు నా అవసరం ఉంటే కచ్చితంగా చేస్తాను" అని అంటాడు. 

ప్రేమ్ నిఖిల్ ని హాగ్ చేసుకుంటూ " థాంక్స్ బ్రో ఈ కొంచెం సపోర్ట్ చాలు తనని ఎలాగైనా నేను మార్చగలను అన్న నమ్మకం నాకు ఉంది"  అని అంటాడు.

" నాకు ప్రియ సంతోషం ముఖ్యం,  నాలుగు సవత్సరాల క్రితం జరిగిన దానివల్ల ప్రియా తనని తాను మర్చిపోయింది , కానీ నువ్వు వచ్చాకే తనలో మార్పు నేను గమనించాను , నీతో ఉంటే తనలో ఉన్న మునుపటి అల్లరి నాకు కనిపిస్తుంది,  నీతో ఉంటే తను తన లాగా  ఉంటుంది, తనకి నువ్వంటే ఇష్టం ఉంది,  ఆ విషయం నాకు కూడా అర్థమైంది,  కానీ దాన్ని ఒప్పుకోవడానికి ప్రియా ఇష్టపడటం లేదు నువ్వు ఎలాగైనా సరే ఆ ప్రేమని బయటికి తీయాలి" అని అంటాడు. 

" తప్పకుండా "  అని అంటాడు ప్రేమ్ చిరునవ్వుతో.

" అండ్ ఇంకో విషయం ఈ పెళ్లిలో నా సపోర్ట్ నీకు ఉన్న,  నితిన్ ఇంకా అరుణ్ సపోర్ట్ అయితే నీకు ఉండదు వాళ్ళిద్దరూ కలిసి ఈ పెళ్లిని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు ప్రియా తో కలిసి, వాళ్లని నువ్వే హ్యాండిల్ చేయాలి నేనైతే చేయలేను"  అని ముందే చెప్తాడు నిఖిల్. 

" డోంట్ వర్రీ వాళ్ళని నా బామ్మర్దుల కింద ఎప్పుడో అనుకున్నాను,  సో వాళ్లు చేసిన ప్రతిదానికి తిప్పికొట్టే ప్లాన్స్ నా దగ్గర ఎప్పుడూ ఉంటాయిలే"  అని అంటాడు.

" సరే అయితే పదండి కిందకి వెళ్లి నిశ్చితార్థానికి అవసరమైన అన్ని చూసుకోవాలి " అని అంటాడు ఆదిత్య వాళ్ళ ఇద్దరి మధ్యలో మాట్లాడుతూ. 

ప్రియ రూమ్.

బ్యూటిషన్ ప్రియా ని రెడీ చేసే పనిలో పడింది. 

శైలు ఆ ఫైల్ చూస్తూ " స్వీటీ ఆ డిటెక్టివ్ నీకు ఈ ఫైల్ ఇచ్చినప్పుడు ఎన్ని పేపర్స్ ఉన్నాయి అని చెప్పాడు" .అని అడుగుతుంది.

" ఇప్పుడు అది అంత అవసరమా ?" అడుగుతుంది ప్రియా అసహనంగా.

శైలు ఫైల్ చూపిస్తూ " లేదురా నువ్వు 23 పేజెస్ అన్నాడు అని చెప్పావు కదా,  కానీ ఇందులో 20 పేజెస్ మాత్రమే ఉన్నాయి ఒకసారి చూడు"  అని అంటుంది.

ప్రియా గుర్తుతెచ్చుకుంటూ ఆ రోజు డిటెక్టివ్ 23 పేజెస్ అని చెప్పడం తనకి గుర్తుకు వస్తుంది అంతేకాదు తనకి ఫైల్ ఇచ్చేయమందు డిటెక్టివ్ ఒకసారి పేజెస్ లెక్క పెట్టి మరి 23 పేజెస్ అని చెప్పి ఉంటాడు. ప్రియా శైలు చేతులు నుంచి ఆ ఫైల్ తీసుకొని లెక్కపెట్టి చూస్తే 20 పేజెస్ మాత్రమే ఉంటాయి , అందులో మధ్యలో కొన్ని పేజెస్ మిస్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతి పేజీ కింద పేజి నెంబర్ వేసి ఉంటుంది ,  మధ్యలో 7, 8, 9 పేజెస్ మాత్రం ఉండవు.
" అంటే నేనే ఈ పేజెస్ మిస్ చేసుకుని ఉంటాను అంటావా " అని అడుగుతుంది ప్రియా శైలు వైపు చూసి.

" ఏమో? కావచ్చు"  అని భుజాలు ఎగరేస్తుంది శైలు. 

వీళ్ళ డిస్కషన్ వింటున్న అక్షయ"  ఏ ఆపండి అయిపోయిన పెళ్ళికి డోలు బాజాలు అన్నట్టు ఇప్పుడు అయిపోయిన విషయాన్ని మళ్లీ గుర్తు తెచ్చుకుంటే లాభం ఏమైనా ఉందా , ఇప్పుడు ఎలాగో ప్రియా కి ప్రేమ్ తన బావ అన్న విషయం తెలిసిపోయింది అండ్ ప్రియా తన భావ నీ చేసుకుంటాను అని మాట కూడా ఇచ్చింది,  సో దీన్నైతే మనం మార్చలేము కదా ఇప్పుడు ఆ డిటెక్టివ్ గాడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో అన్న సంగతి ఇప్పుడు అదంతా అవసరమా"  అని అడుగుతుంది.

" లేదు అక్షయ ఈ డిటెక్టివ్ గురించి నేను కూడా విన్నాను , ఇతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆది ఏది అయినా సరే కరెక్ట్ గా ఉంటుంది అని.  నాకు తెలిసి వాడు కరెక్ట్ గానే ఇచ్చి ఉంటాడు ఇదే ఎక్కడో మిస్ చేసుకుని ఉండి ఉంటుంది " అని అంటుంది శైలు.

" అయితే ఇప్పుడు నీ బాధ ఏంటి ?" అని అడుగుతుంది అక్షయ.

" నాకెందుకో నితిన్ ఇంకా అరుణ్ తప్పేమీ లేదేమో అనిపిస్తుంది పాపం,  ఇదే ఏమీ తెలుసుకోకుండా వాళ్ళని పాపం ఎలా కొట్టిందో"  అని తెగ బాధ పడిపోతుంది శైలు . ప్రియా నితిన్ ఇంకా అరుణ్ ని కొట్టడం గుర్తుతెచ్చుకొని.

" వాళ్లకి ఆ తన్నులు పడడంలో తప్పేం లేదులే"  అని అంటుంది అక్షయ.

శైలు కొంచెం కోపంగా " అంటే ఏంటే నీ ఉద్దేశం వాళ్ళకి తన్నులు పడడంలో తప్పులేదు అనడంలో,  ఏం తప్పు చేయకుండా వాళ్ళు తన్నులు ఎందుకు తినాలి" అని అడుగుతుంది.

ప్రియా  వీళ్ళ డిస్కషన్ ని అడ్డుకుంటూ శైలు వైపు చేస్తూ " నా అంచనా కరెక్ట్ అయితే ఈ పార్టీకి అరుణ్ ఇంకా నితిన్ వాళ్ళ తప్పు లేదు అని నిరూపించుకోవడంలో  బిజీగా ఉండి ఉంటారు, ఇంకో వన్ ఆర్ టూ అవర్స్ లో ఆరోజు ఏం జరిగింది అసలు పేపర్స్ మిస్ అయ్యాయా లేకపోతే డిటెక్టివ్ డే తప్ప అన్న విషయం నా ముందు ఉంటుంది చూసుకో " అని అంటుంది .

కొనసాగుతుంది.....


ఇంతకీ నితిన్ ఇంకా అరుణ్ ఆ పేపర్స్ ఎలా మిస్ అయ్యాయో తెలుసుకోగలుగుతారా , అవి ప్రియా ముందు పెట్టి వాళ్ళు ఇన్నోసెంట్ అని నిరూపించుకోగలరా మీరేమనుకుంటున్నారు. 
ఇంతకీ ఆ పేపర్స్ తీసింది ఎవరు అంటారు మీకు ఏమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి.


***