ప్రేమ్ కి వాళ్ళిద్దరిని అలా చూసే పాటికి కోపం వచ్చి" వాడేమీ చిన్న పిల్లలు కాదు వాడు తాగుతాడు కదా , నువు తగిచల్ల " అని అంటాడు .
ప్రియ మాత్రం ప్రేమ్ నీ పట్టించుకోకుండా నితిన్ కి తగ్గిస్తుంది.
"హ్మ్మ్ ..మొత్తం తాగాలి కొంచెం వదిలిపెట్టిన ఊరుకోను తాగు " అని అంటూ నితిన్ కి తాగిస్తుంది.
ప్రేమ్ జలసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది.
అక్షయ కి ఆదిత్య జలసీ గురించి బాగా తెలుసు ఇప్పుడు ప్రేమ్ కూడా ప్రియా విషయంలో జలసి చూపిస్తుంటే చిన్నగా నవ్వుకుంటుంది .
ఆదిత్య అక్షయ వైపు చూసి " ఇప్పుడు నావు ఎందుకు వస్తుంది బంగారం నీకు " అని అంటాడు .
" ఏం లేదు నీకున్న జెలసి చూశాను , ఇప్పుడు మీ తమ్ముడు జలసి చూస్తున్నాను. మీ ఫ్యామిలీ అంతా కూడా కొంచెం జలసి ఎక్కువే కదా" అని నవ్వుతూ అంటుంది.
" ప్రేమలో జెలసీ కామన్ బంగారం, అలా అని మనం ప్రేమించిన వాళ్ల మీద నమ్మకం లేక కాదు, ఎదుటి వారి మీద నమ్మకం లేక, అదంతా వదిలేయ్ కానీ ముందు ఇది తాగు" అని అంటాడు ఆదిత్య. అక్షయ కి బనానా స్మూతీ తాగిస్తూ .
ఎవడి లవ్ ఇష్యూ వలె సాల్వ్ చేసుకోవాలి అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఎవరికి వాళ్ళు సైలెంట్ గా కూర్చుంటారు.
ప్రేమ్ కి అలా కోపం తెప్పిస్తుంటే నితిన్ కి చాలా నచ్చింది. ’చూడరా ప్రియా నా గురించి ఎంత ఆలోచిస్తుందో నీకు తెలియాలి , నీలో ఈ జెలసి నీ ఉపయోగించుకొని ప్రియా నీ నాకు దగ్గర చేసుకుంటూ నిన్ను తనకి ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు , ప్రియ నీ ఎలాగైనా సరే నాకు దగ్గర చేసుకుంటాను , నిన్ను తనకి శాశ్వతంగా దూరం చేసి , ఆ శాస్త్రి పెట్టిన ముహూర్తానికి ప్రియ నీ పెళ్లి చేసుకొని చూపిస్తాను. చూడు ' అని తన మనసులో అనుకుంటాడు.
"ప్రియ .." అని ప్రేమ్ గట్టిగా అరుస్తాడు.
ప్రేమ్ అలా గట్టిగా అరిచేసరికి అక్షయ కొంచెం బెదురుగా చూస్తుంది ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్యలో గొడవగాని జరుగుతుంది ఏమో అని. ఆదిత్య అదేమీ పట్టించుకోకుండా " నువ్వు తాగు వాళ్ళ సంగతి వదిలెయ్ " అని అంటాడు.
శైలు కూడా కొంచెం బెదురుగా నిఖిల్ వైపు చూస్తుంది నిఖిల్ ఏమీ కాదులే అన్నట్లు కళ్ళు ఆర్పుతాడు శైలు సరే అన్నట్లు సైలెంట్ గా ఉండి అక్కడ జరుగుతున్నది చూస్తూ ఉంటుంది
ప్రేమ్ , ప్రియా మీద అలా గట్టిగా అరుస్తుంటే అరుణ్ కి కొంచెం కోపం వస్తుంది అరుణ్ ఏదో అనే లోగా నిఖిల్ అరుణ్ చెయ్యి పట్టుకొని వద్దు అన్నట్లు చెప్తాడు.
" ప్రియ హ్యాండిల్ చేస్తుందిలే, నువ్వు వదిలేయ్ అంతగా ఎక్కువ అయితే అప్పుడు చూద్దాం" అని అంటాడు.
అరుణ్ సరే అన్నట్లు కూర్చుని ప్రేమ్ వైపు కొంచెం కోపంగా చూస్తూ ఉంటాడు.
" అరవకు నాకు వినిపిస్తుంది" అని అంటుంది ప్రియా, ప్రేమ్ వైపు చూడకుండానే.
నితిన్ ప్రియా తగిస్తున్న చేతిని పట్టుకొని " చాలు స్వీటీ" అని అంటాడు .
" అస్సలు కుదరదు, ఇదంతా పూర్తి చేయాలి నువ్వు , తాగు" అని మళ్ళీ అతనికి బలవంతంగా పట్టిస్తుంది ప్రియా. నితిన్ ప్రియా చేతిని పట్టుకొని తన తాగిస్తుంటే తాగుతూ ప్రేమ్ వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు.
ప్రేమ్ కి ఇంకా కోపం వచ్చి ప్రియా చేతిని పట్టుకొని "వాడు చాలు అంటున్నాడు కదా వాడికెందుకు అంత బలవంతంగా పట్టిస్తున్నావ్" అని అంటాడు.
ప్రేమ్ అలా ప్రియా చేయ పట్టుకోగానే అరుణ్ కొంచెం కోపంగా " ప్రేమ ! ..చెయ్ వదులు "అని అంటాడు.
ప్రేమ్ అంతే కోపంగా " వదలను" అని అంటాడు.
అరుణ్ కోపంతో పైకి లేస్తే అరుణ్ణి ఆగు అన్నట్లు ప్రియా చేతితో సైగ చేసి ప్రేమ్ వైపు చూసి
" ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను" అని అంటుంది అసహనంగా .
నితిన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడ జరుగుతున్న షో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
'మీ ఇద్దరూ కొట్టుకోవాలి ఇంకా గొడవలు పడాలి అప్పుడే కదా మీ ఇద్దరిని నేను ఈజీగా విడదీయగలుగుతాను' అని అనుకుంటాడు తన మనసులో
" నువ్వు అలా వాడికి క్లోజ్ గా ఉండడం నాకు నచ్చట్లేదు" అంటాడు ప్రేమ్ తన జెలసి అంతా కూడా తన మొహం లో చూపిస్తూ.
" చూడు ప్రేమ్ మేమందరం కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటినుంచి కలిసే పెరిగామూ ,కలిసే చదువుకున్నాము, కలిసే ఉంటాము మా చివరి శ్వాస వరకు. మా గురించి మాకు బాగా తెలుసు, మా లిమిట్స్ ఏంటో కూడా మాకు బాగా తెలుసు, మా మధ్యల సీక్రెట్స్ కూడా ఏమీ ఉండవు , అలా ఉంటుంది మా బాండింగ్ . అలాగే మాకు వచ్చే పార్ట్నర్స్ కూడా మా బాండింగ్ అర్థం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి అని మేము అందరం కోరుకుంటాము. నేను నా ఫ్రెండ్స్ అందరిని కూడా ఒకేలాగా కేరింగ్ తీసుకుంటాను, నీకు కనక మా ఫ్రెండ్షిప్ తో ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక, ఈ పెళ్లిని ఇప్పుడే రద్దు చేయవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు , ఇలా నీ జెలసి మా ఫ్రెండ్షిప్ మీద చూపిస్తే కనుక నేను ఊరుకోను " అని ముక్కుసూటిగా చెప్తుంది.
" అవును ప్రేమ్ నీకు ఇబ్బందిగా ఉంటే ఈ పెళ్లి కాన్సల్ చేసుకోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము మాత్రం ఇలాగే ఉంటాం " అని ఒత్తి పలుకుతాడు నితిన్.
ప్రేమ్ కి నితిన్ నీ చూస్తుంటే చాలా కోపం వస్తుంది.
ప్రేమ్ కి ప్రియా గురించి బాగా తెలుసు ప్రియా కి నితిన్ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు అని కూడా తనకి బాగా తెలుసు, కానీ నితిన్ మనసులో ఏమైందో కూడా ప్రేమ్ కి తెలుసు, అందుకే ప్రియా నితిన్ కి అలా పట్టిస్తుంటే తనలోని జలసి వల్ల ప్రియా ని అడ్డుకున్నాడు అంతేగాని ప్రియా మీద నమ్మకం లేక కాదు. ప్రియా కొంచెం హాట్ అయిందని అర్థమై ప్రియ చేతిని వదిలేస్తాడు.
ప్రేమ్ వైపు చూస్తూ " ఇందాక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వీడు సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అండ్ వీడు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయకపోతే వీడికి గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది, అందుకే నేను బనానా స్మూతీ చేసుకొని వచ్చి వాడికి ఇచ్చాను , ఇంకా ఇది వీడి ఫేవరెట్ కూడా. అండ్ ఎందుకు తాగిస్తున్నావు అని అంటున్నావు కదా, వాడు మారం చేశాడు కాబట్టి తాగించాను, మేమందరం కూడా ఇలాగే ఉంటాము . ఒకవేళ నీకు తప్పుగా అనిపిస్తే వెళ్లి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో నాకేం అభ్యంతరం లేదు" అని అంటూ భుజాలు ఎగరేస్తూ.
నితిన్ ఆ స్మూతీ తాగుతూ " ప్రియా కి నా ఇస్తా ఇష్టాలు ఏంటో అన్ని బాగా తెలుసు" అని ప్రేమ్ వైపు సైడ్ స్మైల్ ఇచ్చి అంటాడు.
ప్రియా నితిన్ వైపు చూసి " మందు తాగు " అని నితిన్ కి తాగిస్తుంటుంది. నితిన్ అది తాగుతూ ప్రేమ్ వైపు చూస్తూ ఉంటాడు.
' ఏంటిది పెళ్లి కాన్సల్ చేసుకో పెళ్లి కాన్సల్ చేసుకో అని అంటుంది' అని అనుకుంటారు తన మనసులో.
అలాగే ప్రియా తనతో ఛాలెంజ్ చేసిన విషయం కూడా గుర్తుకొస్తుంది , ప్రేమ్ తన నోటితో ఈ పెళ్లి కాన్సల్ చేసేలాగా చేస్తాను అని తనతో ఛాలెంజ్ చేసింది ప్రియ .
' ఓహో.. నా బంగారం ఇదంతా కూడా పెళ్లి కాన్సల్ చేయడానికి చేస్తుందన్నమాట ' అని అనుకుంటాడు తన మనసులో.
నితిన్ కి పూర్తిగా తాగించి ఆ గ్లాస్ పనిమనిషికి ఇచ్చేసి వెళ్లి అక్షయ పక్కన కూర్చుంటుంది. అది ఫోర్ సిట్టింగ్ సోఫా.
" థాంక్యూ స్వీటీ నువ్వు చేసే స్మూతీ అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు చాలా బాగా చేసావు , అయినా నీ చేతి వంట తినాలి అంటే రాసిపెట్టి ఉండాలి అది మాకు మాత్రమే సాధ్యం , ఇలా చుట్టం చూపుగా వచ్చే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదులే, పాపం అది తెలియక ఎన్నో కలలు కంటూ ఉంటారు " అని అంటాడు నితిన్.
నితిన్ ఇన్ డైరెక్ట్ గా ప్రేమ్ ని అంటున్నాడు అని అక్కడ అందరికీ అర్థమయింది.
ప్రియా నితిన్ మాటలకు రియాక్ట్ అవ్వకుండా , అక్షయ బనానా స్మూతీ పూర్తిగా తాగేలాగా చూస్తుంది.
' సో ఈ పెళ్లి జరగనివ్వను అని ఇండైరెక్టుగా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా' అని తన మనసులో అనుకొని నితిన్ వైపు చూస్తాడు ప్రేమ్.
ఎక్సాక్ట్లీ అన్నట్లు నితిన్ ప్రేమ్ వైపు చూసి స్మైల్ ఇస్తాడు.
ప్రేమ్ కూడా నితిన్ వైపు చూసి స్మైల్ ఇస్తూ ,' నీ ప్రయత్నాలు నువ్వు చెయ్ అలాగే నా ప్రయత్నాలు కూడా నేను చేస్తాను . ఎవరు గెలుస్తారో చివరిలో తెలుస్తుంది రా నీకు' అని అనుకుంటూ
వెళ్లి ప్రియ పక్కన అదే సోఫాలో కూర్చుంటాడు అలా ప్రేమ్ సడన్గా వచ్చి తన పక్కన కూర్చోనేసరికి "హే ..నా పక్కన కూర్చున్నావ్ ఏంటి? అక్కడికి వెళ్లి కూర్చో పో" అని సింగిల్ గా ఉన్న సోఫా చూపిస్తుంది.
ప్రేమ్ అలా చేసే సరికి నితిన్ కి కూడా కోపం వస్తుంది కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కూర్చుంటాడు.
" నాకు ఇక్కడే బాగుంది" అని అంటాడు.
ప్రియా ప్రేమ్ వైపు కోపంగా చూసి అక్కడ నుంచి లేచి సింగిల్ సోఫాలో కూర్చుందాం అని లేవబోతుంటే అప్పుడే ఊర్మిళాదేవి గారు వచ్చి ఆ సింగిల్ సోఫాలో కూర్చుంటుంది.
నితిన్ కూర్చున్నది టూ సిట్టింగ్ సోఫా . నితిన్ ప్రియా వైపు చూసి " స్వీటీ ఇక్కడికి వచ్చా కూర్చో " అని అంటాడు .
ప్రియ అలాగే అని లేవబోతుంటే ప్రేమ్ తన చేయ పట్టుకుని వెనక్కి లాగుతాడు ప్రియా వెళ్లి ప్రేమ్ వడిలో పడుతుంది " ఏ ఏంటి అలా లాగుతున్నావ్" అని కోపంగా అంటుంది.
ప్రియా కి మాత్రమే వినిపించేలాగా " చూడు బంగారం ఇప్పుడు నువ్వు వెళ్లి వాడి పక్కన కూర్చున్నావ్ అనుకో నా జలసి పిక్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది, అప్పుడు ఎవరున్నారు ఎక్కడున్నాము అని చూడకుండా , నీకు ముద్దు పెట్టేస్తాను , ఎలాగో నీకు ముద్దు పెట్టుకోవడానికి నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి , అమ్మమ్మ నాకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది ఆ సంగతి గుర్తు పెట్టుకో" అని అంటాడు.
ప్రేమ్ చిన్నగా అన్నా సరే ఆ మాటలు పక్కనే ఉన్న ఆదిత్య ఇంకా అక్షయకి వినిపిస్తాయి వాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వకుండా ఉంటారు.
ప్రేమ్ మాటలకి కోపం వచ్చిన ప్రియ తన రెండు చేతులు ప్రేమ్ మెడ వైపు పోనిస్తూ " నిన్ను ...." అని కోపంగా ఉంటుంది.
ఊర్మిళాదేవి అది చూసి " ఏ... ఏ ..ఏం చేస్తున్నావే వాడు పీక పిసికేద్దామనుకుంటున్నావా ఏంటి?" అని అంటుంది.
ప్రేమ్ అమాయకంగా ప్రియా కి భయపడుతున్నట్లు నటిస్తూ " చూడు అమ్మమ్మ ఇది నన్ను చంపేస్తుంది అంట , నువ్వే కాపాడాలి" అని అంటాడు.
ప్రియా ఇంకా ప్రేమ్ అల్లరి అక్కడ చూస్తున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే నితిన్ ఇంకా అరుణ్ కి మాత్రం కోపం వస్తుంది.
" నా మనవడి మీద చెయ్ పడిందా, ఊరుకోను, ఆ .." అని ఊర్మిళాదేవి తన చేతి కర్రని నేలకేసి కొడుతుంది అంటుంది.
ప్రియా తన మనసులో ' ఇదంతా నువ్వు ఇచ్చిన ఆ ముద్దుల పర్మిషన్ వల్లే కదే వీడు నాతో ఇలా ఆడుకుంటున్నాడు' అని అనుకొని ప్రియా, ప్రేమ్ నీ వదిలి ఊర్మిళాదేవి వైపు చూస్తూ "వాడిని కాదే ముందు నిన్ను చంపాలి" అని ఊర్మిళాదేవి వైపు వెళ్ళబోతుంటే.
ప్రియా ఆవిడ దగ్గరకి చేరికోక ముందే ఊర్మిళాదేవి గారు గట్టిగ అరుస్తూ " ఒరేయ్ చందు.. నీ కూతురు నన్ను చంపేసేలాగా ఉంది రా" అని టాప్ లేచిపోయేలాగా అరుస్తుంది.
ప్రియా వెంటనే " ఏ ...నానమ్మ నీ దగ్గరికి రాను కూడా రాలేదు అలా అరుస్తావేంటే" అని అంటుంది.
ఇంతలో ఊర్మిళాదేవి అరుపులు విన్న గాయత్రీ గారు ,జగదీష్ గారు ,సునంద ఇంకా గుర్దీప్ అక్కడికి రానే వస్తారు.
వాళ్లు రావడం చూసిన ప్రేమ్ వెంటనే జగదీష్ చంద్ర వైపు వెళ్తూ " మావయ్య నీ కూతురు చూడండి మమ్మల్ని చంపేసే లాగా ఉంది" అని ప్రియా మీద కంప్లైంట్ చేస్తాడు.
ప్రియా వెంటనే " డాడీ ...! వాడి మాటలు అసలు నమ్మొద్దు వాడే నన్ను ఏడిపిస్తున్నాడు" అని అంటుంది.
" నా మనవడు ఏమీ దాన్ని ఏడిపించట్లేదు అదే మా మీద వచ్చి పడిపోతుంది" అని ఊర్మిళాదేవి గారు ప్రేమ్ కి సపోర్టింగ్ గా మాట్లాడతారు.
గాయత్రి గారు ఊర్మిళాదేవి గారి వైపు చూసి "ఏంటమ్మా నువ్వు కూడా చిన్న పిల్ల లాగా వాళ్లతో కలిసి" అని అంటారు.
" నువ్వు ఉండవే ఇది నా మనవడిని అంటే ఊరుకుంటానా ఏంటి నేను, దీని సంగతి తేల్చేస్తాను ఈరోజు" అని అంటారు ఊర్మిళాదేవి గారు ప్రియా వైపు చూస్తూ
" నానమ్మ మొన్నటి వరకు నాకు సపోర్టింగ్గా వచ్చి ఇప్పుడు వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి " అని కోపంగా అడుగుతుంది ప్రియా.
" ఏంటే? నా మనవడిని వాడు గీడు అంటున్నావ్, చక్కగా వాడికొక పేరు ఉంది . పిలిస్తే ప్రేమ్ అని పేరుతో పిలువు లేకపోతే బావ అని పిలువు" అని ఊర్మిళాదేవి కొంచెం గట్టిగానే చెప్తుంది.
" ఏంటి బావ అని పిలవాలా? " అని నోరు తెరిచి ఊర్మిళ దేవి వైపు చూస్తుంది.
" వాడు నీ మేనత్త కొడుకు బావ అని పిలవక ఏమని పిలుస్తావే " అని అంటుంది.
" అవును తల్లి ఇకమీదట ప్రేమ్ ని బావ అని పిలువు" అని అంటాడు జగదీష్ చంద్ర కూడా.
అది వినగానే ప్రేమ్ పెదవులపై చిరునవ్వు అది ప్రియా గమనిస్తూనే ఉంటుంది.
ప్రియా కి ఫ్లాష్బాక్ గుర్తుకు వస్తుంది.
అక్షయ కి ఆదిత్య కి మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు . ఆదిత్య ని బావ అని పిలిచేది సరదాగా.
అప్పుడు ప్రేమ్ " అన్నయ్యని బావ అని పిలుస్తున్నావు కదా ఆ లెక్కన చూసుకుంటే నేను కూడా నీకు బావ అవుతాను సో నన్ను కూడా బావ అని పిలువు " అని అంటాడు.
ప్రియా " వాట్ ? నిన్ను బావ అని పిలవాలా? అది ఈ జన్మలో జరగదు" అని అంటుంది .
ప్రేమ్ " ఎప్పటికైనా నీ నోటితో నన్ను బావ అని పిలిపించుకునేలాగా చేస్తాను చూడు" అని చాలెంజ్ చేస్తాడు .
***
" ఏంటే? ఏం ఆలోచిస్తున్నావ్ బావ అని పిలవమంటే " అని అంటారు ఊర్మిళాదేవి గారు .ఆవిడ మాటలకి వాస్తవం లోకి వస్తుంది ప్రియా.
ప్రియా " నేను పిలవను" అని అంటుంది.
" తప్పు తల్లి అలా అనకూడదు, అత్త కొడుకే కదా ఇకమీదట ప్రేమ్ ని బావ అని పిలువు" అని జగదీష్ చంద్ర కూడా అంటారు.
వాళ్ల నాన్నకి ఎదురు చెప్పడం ఇష్టం లేక, అందులోను గాయత్రి గారు ఫీల్ అవుతారేమో అని అనుకొని " సరే " అని చిన్నగా చెప్తుంది.
ప్రియా ఒప్పుకోవడంతో ప్రేమ్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ క్షణం ప్రియా నీ ఎత్తుకొని తిప్పాలి అని అనిపిస్తుంది కానీ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ప్రియా వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు.
జగదీష్ చంద్ర ప్రియా నుదిటి మీద ముద్దు పెట్టుకుని " నా బంగారు తల్లి నాన్న చెప్పింది ప్రతీది వింటుంది" అని అంటాడు.
ఇంతలో గెస్ట్లు రావడం మొదలైంది అని గోపి చెప్పడంతో వాళ్లని వదిలి గెస్ట్ లని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు పెద్దలు.
ప్రేమ్ తన వైపే చూస్తున్నాడు అని తెలిసి కూడా ప్రియ , ప్రేమ్ నీ ఇగ్నోర్ చేస్తూ, " నేను సిదు దగ్గరికి వెళ్తున్నాను " అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
కొనసాగుతుంది...
***
తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.
****