you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 20

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 20

ప్రియా అలా వెళ్ళగానే ప్రేమ్ కూడా ప్రియా వెనకాలే వెళ్తాడు.
వాళ్ళిద్దరిని అనుసరిస్తూ నితిన్ కూడా వాళ్ళ వెనకే వెళ్ళిబోతుంటే నిఖిల్ నితిన్ నీ అడ్డుకుంటూ "ఎక్కడికి రా?" అని అడుగుతాడు .

’వీడు ఒకడు నా ప్రాణానికి ఎప్పుడూ నాకు అడ్డుపడుతూనే ఉంటాడు'  అని తన మనసులో నిఖిల్ నీ బండ బూతులు తిట్టుకుంటూ ఉంటాడు .

"  ప్రియా దగ్గరికి " అని అంటాడు.

"  ప్రియా సిద్ధూ దగ్గరికి వెళ్ళింది తెలుసు కదా " అని అంటాడు .

" తెలుసు అయితే ? " అని అడుగుతాడు నితిన్ .

" సిద్ధూ కి ప్రియా తప్ప ఎవరు తన దగ్గరికి వెళ్ళినా నచ్చదు,  ఆ విషయం తెలుసుగా నీకు , ఇంకా నిన్ను చూస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నీకు బాగా తెలుసు"  అని అంటాడు నిఖిల్.

నితిన్ కి కొంచెం భయం వేసినా కూడా ధైర్యం నటిస్తూ " మరి ప్రేమ్ వెళ్ళాడు కదా"  అని అనగానే .
"ప్రియా చూసుకుంటుందిలే నువ్వు మాత్రం వెళ్ళకు , సిద్ధూ కి కోపం వస్తుంది " అని అంటాడు నిఖిల్.

" సిద్ధూ గురించి మనందరికీ తెలిసిందే కదా అది స్వీటీ ని తప్ప ఎవరిని కూడా దగ్గరికి రానివ్వదు  . ఇప్పుడు ప్రేమ్ వెళ్లి సిద్ధూ నీ కలుస్తాడు కదా  సిద్ధూ కోపం వాడికి తెలుస్తుంది . ఒకసారి ఎక్స్పీరియన్స్ ఐతే వాడికే తెలుస్తుందిలే ,  నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో"  అని అంటాడు అరుణ్.

సిద్ధూ ప్రియా తో తప్ప ఎవరితోనో క్లోజ్ గా మూ అవదు అందులోనూ ప్రియా ఇంకా సిద్దు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వాళ్ల దగ్గరికి వస్తే సిద్ధూ కి చాలా కోపం వస్తుంది. 

సిద్ధూ ప్రియా  ఫ్రెండ్స్ ని కూడా ఎవరిని దగ్గరికి అంతగా రానివ్వదు ఒకసారి నితిన్ కావాలని సిద్ధూ తో క్లోజ్ అవుదామని ప్రియా లేని టైంలో సిద్ధూ దగ్గరికి వెళ్లి దానికి ఫుడ్ పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ సిద్ధూ కి కోపం వచ్చి నితిన్ నీ బైక్ చేస్తుంది , చివరికి ప్రియా వల్ల ఆరోజు నితిన్ సేవ్ అవుతాడు , అప్పటినుంచి కూడా నితిన్ కి సిద్ధూ అంటే చాలా భయం.

ఇప్పుడు ప్రేమ్ కోసం రిస్క్ తీసుకోవాలని నితిన్ అనుకోలేదు అందుకే సైలెంట్ గా కూర్చున్నాడు.

ఇంతకీ ఈ సిద్ధూ ఎవరు అబ్బా అని అనుకుంటున్నారు కదా సిద్ధూ అంటే ఎవరు కాదండి మన ప్రియ ఒక పెంపుడు జంతువు (పెట్) ఆది  ఒక  స్టార్ తాబేలు 🐢.

ఆదిత్య ఇంకా ప్రేమ్ కి ఇ సిద్ధూ గురించి తెలుసు ఎందుకంటే అక్షయ ఎప్పుడు కూడా ప్రియా గురించి చెప్తూనే ఉంటుంది కాబట్టి.

సిద్ధూ కోపం గురించి తెలిసిన ఆదిత్య అక్షయ వైపు చూస్తూ "ఇప్పుడు ఆ సిద్ధూ ప్రేమ్ నీ ఏమి చేయదు కదా"  అని అడుగుతాడు.

" ప్రియా ఉంటుందిగా సిద్దుతో ఏమి కాదులే, కానీ  ప్రేమ్ ఆ సిద్ధూ నీ ఇంప్రెస్ చేస్తే  కనుక ప్రయా నీ ఈజీగా గెలవ గలడు " అని అంటుంది అక్షయ. 

" ఇప్పుడు ప్రియ ణి ఇంప్రెస్ చేయడం కోసం ఆ తాబేలుతో కరిపించుకోమంటావా ఏంటి?  మా తమ్ముడిని ? "అని అంటాడు ఆదిత్య.

" అధి గారు మీ తమ్ముడి మీద మీకు నమ్మకం లేదేమో కానీ నా మారది మీద మాత్రం నాకు చాలా నమ్మకం ఉంది,  చూసుకోండి మా ఎవ్వరికి దగ్గరి అవ్వని సిద్ధూ గాడు ప్రేమ్ కి కచ్చితంగా దగ్గర అవుతాడని నా గట్టి నమ్మకం"  అని అంటుంది అక్షయ.

అక్షయ మాటలకి అరుణ్ మాట్లాడుతూ " ఛాన్స్ ఏ లేదు సిద్ధూ ప్రియా దగ్గరికి వచ్చి దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పటినుంచి మనం దాని దగ్గరికి వెళ్లడానికి సిద్ధూ నీ మనకి క్లోజ్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేశాం,  మన ఎవరి వల్ల కానిది ఆ ప్రేమ్ వల్ల అవుతుందా"  అని నవ్వుతాడు. 

" సరే అయితే మనం బెట్ వేసుకుందాం ఓకేనా"  అని అక్షయ అనగానే అక్కడ ఉన్న ప్రియా ఫ్రెండ్స్ ఆదిత్య కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ " సరే అయితే వేసుకుందాం"  అని అంటారు .

...
వీళ్ళు ఇక్కడ ఇలా వేసుకుంటూనే ఉంటారులే కానీ మన హీరో హీరోయిన్ ఏం చేస్తున్నారో చూసేద్దామా మరి.
....

ప్రియా ఒక ట్రే లో ఫ్రూట్ ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకుని,  తను  సిద్ధూ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఒక నీటి కొలను దగ్గరికి వెళ్తుంది. అది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. 

ప్రియా పక్కనే ఉన్న ఒక మాట్ ఆ గడ్డి మీద పరుచుకొని ఆ వెజిటేబుల్ ట్రే  తన ఒడిలో పెట్టుకుని అక్కడ  కూర్చుని "  సిద్ధూ ఎక్కడున్నావ్ బయటికి రా " అని పిలుస్తుంది.

ప్రియా మాట వినగానే నీటిలో నుంచి ఒక చిన్న తలకాయ బయటికి వస్తుంది వెంటనే వాటర్ కదులుతూ  ఉంటుంది , కొంచెం సేపటి తర్వాత నీటిలో నుంచి ఒక స్టార్ తాబేలు మెల్లగా అడుగులు వేసుకుంటూ ప్రియా దగ్గరికి వస్తుంది. ఆది ఒక 7 ఇంచ్ వరకు ఉంటుది.ఇంకా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ తో చాలా క్యూట్ అండ్ అందంగా ఉంటుంది.

సిద్ధూ దగ్గరికి రాగానే సిద్ధూ ని తన చేతిలోకి తీసుకొని పక్కనే ఉన్న టవల్ తో దానిని శుభ్రంగా తుడిచి పక్కనే ఇంకో మాట్ వేసి ఆ మాట్ మీద దాని ఉంచి దానికి చేతితో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్  తినిపిస్తూ ఉంటుంది.

అంతలో ప్రేమ్ రావడంతో సిద్దు ఆ వెజిటేబుల్స్ తినడం ఆపేసి ప్రేమ్ వైఫై చూస్తూ ఉంటుంది. 
అది గమనించిన ప్రియా వెంటనే సిద్ధూ నీ నిమురుతూ " సిద్ధూ కోప్పడకు ఓకేనా , ఇతను మన ఫ్యామిలీ , ఇకమీదట మనతోనే ఉంటాడు , మన అత్తయ్య కొడుకు " అని అంటుంది. సిద్ధూ ఇంకా కోపంగా ప్రేమ్ వైఫై చూస్తూ ఉండడంతో.

ప్రియా ప్రేమ్ వైఫై కొంచెం అసహనంగా చూస్తూ " ప్రేమ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు?  ఇక్కడినుంచి వెళ్ళు ఎవరైనా వస్తే సిద్ధూ సరిగ్గా తినదు ప్లీజ్ ఇక్కడినుంచి వెళ్ళు నీతో నేను తర్వాత మాట్లాడుతాను"  అని అంటుంది.

ప్రేమ్ బుంగమూతి పెట్టుకుంటూ " ఇదేమి బాగోలేదు బంగారం. ఇప్పుడే కదా మామయ్యతో బావ అని పిలుస్తాను అని అన్నావు ,ఇప్పుడు మళ్ళీ ఫ్రేమ్ అని పిలుస్తావ్ ఏంటి ? అయినా నీ పెట్స్ ని నాకు పరిచయం చేయవా? "  అని అంటాడు.

" సిద్ధూ కొత్త వాళ్ళతో అంత తొందరగా కలవదు " అని అంటుంది ప్రియ.

" ఏం పర్వాలేదు బంగారం నేను అలవాటు చేసుకుంటాలే ఎలాగో మన పెళ్లయిన తర్వాత దాన్ని నేను కూడా చూసుకోవాలిగా నీతో కలిసి"  అని అంటూ ప్రియా దగ్గరికి వెళ్తాడు ప్రేమ్.

సిద్దుకి కోపం వస్తుందని గమనించిన ప్రియా వెంటనే ప్రేమ్ నీ వారిస్తూ " ప్రేమ్ దగ్గరికి రాకు సిద్ధూకి కోపం వచ్చిందంటే కరుస్తుంది " అని అంటుంది.

" అదిగో మళ్ళీ ప్రేమ్ అని పిలుస్తావ్ బావ అని పిలవమని చెప్పానా"  అని అంటూ ప్రియా దగ్గరికి రానే వస్తాడు,  ఇంతలో సిద్ధూ కోపంగా ప్రేమ్ వైపు వెళుతుంది.

సిద్ధూ ప్రేమ్ ని ఎక్కడ కరుస్తుందో అని భయపడిన ప్రియా వెంటనే "బావ ప్లీజ్ దగ్గరికి రాకు"  అని అరుస్తుంది.

ప్రియా తనని మొదటిసారిగా బావ అని పిలిచేసరికి షాక్ అయ్యి ఉన్నచోటనే ఆగిపోతాడు ప్రేమ్.

ప్రేమ్ నీ  ఎక్కడ కరుస్తుందో అని భయపడిన ప్రియా సిద్దు ని వెనక్కి లాగుదాం అని సిద్ధూ దగ్గరికి వెళ్లేసరికి,  ప్రేమ్ దగ్గరికి కోపంగా వెళ్ళిన సిద్ధూ ఏమి చేయకుండా అలా ఉంటాడు  , సిద్ధూ ప్రేమ్ ని ఏమి చేయకపోవడం తో కొంచెం రిలాక్స్ అవుతుంది ప్రియ.

సిద్దు దగ్గరికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఈ పాటికి ఖచ్చితంగా కరిచి తీరుతుంది అది ఎవరైనా సరే .
కానీ ప్రేమ్ ని మాత్రం ఏమీ అనకుండా అతని దగ్గరికి వెళ్లి అలా ఉండిపోయింది.

ప్రియా వెంటనే సిద్దు ప్రేమ్ నీ ఏమి చేయకముందే సిద్ధుని ప్రేమ్ నుంచి దూరం చేయాలి అని వెంటనే సిద్ధుని తన చేతిలోకి తీసుకుంటుంది.

ప్రేమ్ ప్రియ వైపు చూస్తూ "  ఎంత ముద్దుగా పిలిచావే బావా అని ఇంకోసారి పిలవచ్చు కదా"  అని అడుగుతాడు.

సిద్ధూ  ప్రియా చేతిలో గుంజుకుంటూ ఉంటుంది ప్రేమ్ దగ్గరికి వెళ్లడానికి. అది గమనించిన ప్రేమ్ సిద్ధూని ప్రియా చేతిలో నుంచి తీసుకుంటాడు.  ప్రియా కి అడ్డుకునే సమయం కూడా ఉండదు.

"  బావ జాగ్రత్త కారుస్తుంది"  కొంచెం కంగారుగా అంటుంది.

" లేదు బంగారం ఇది నన్నేం చెయ్యదు లే, దీనికి నేను నచ్చాను అనుకుంటా"  అని అంటాడు ప్రేమ్.

నిజంగానే సిద్ధూ ప్రేమ్ ని కరవకుండా అతని చేతిలో చాలా ప్రశాంతంగా ఉంది,  ఇంకా ప్రేమ్ స్పర్శ కోరుకుంటున్నాట్లు ప్రేమ్ చేతిలో చాలా హాయిగా ఉంది .
సిద్దు ప్రేమ్ మీద ఉన్న తన ఇష్టాన్ని తెలుపుతున్నాడు , తన తలని ఒంటిని ప్రేమ్ చేతికి రుద్దుతూ ఉంది. 

సిద్ధూ తన ఇష్టాన్ని ఇలాగే తెలుపుతుంది, అది చూసిన ప్రియ ఆశ్చర్యపోయింది. 
సిద్దు ఇలా ఒకరిపై తన ఇష్టం చూపించడం ప్రియా ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు.
అది చూసిన  ప్రియా సంతోష పడుతూ " బావ దానికి నువ్వు చాలా బాగా నచ్చినట్టు ఉన్నావు" అని అంటుంది.

ప్రేమ్ సిద్ధూ తల కింద పొట్ట మీద నిమురుతూ ఉనాడు, అలా చేస్తే సిద్దు కి బాగా ఇష్టం .
" అవును దీనికి నేను నచ్చినట్టు ఉనాను, ఇంకా దినిక నేను థాంక్స్ చెప్పాలి ఇది నన్ను ఎక్కడ కరుస్తుందో అని కంగారులో నువ్వు నన్ను బావ అని పిలిచావు" అని అంటాడు ప్రేమ్.

ప్రియా ప్రేమ్ కి రియాక్ట్ అవ్వకుండా సిద్దు నే చేస్తూ ఉంది.

ఇంతలో బయటికి వచ్చిన ప్రియ ఫ్రెండ్స్ అండ్ ఆదిత్య,  సిద్దు ఇంకా ప్రేమ్ నీ చూసి షాక్ అవుతారు.
సిద్దు దగ్గరకి ఎవరు అంత సులువుగా వెళ్లలేరు కానీ ప్రేమ సిద్దు ని తన చేతిలో పట్టుకొని ఆడిస్తున్నాడు.

అక్షయ హ్యాపీగా " చూశారా నేనే గెలిచాను " అని అంటుంది. 

నితిన్ కి  సిద్దు అలా ప్రేమ్ నీ  దగ్గరికి  రానివ్వడం చూస్తుంటే కోపం వస్తుంది. ' సిద్దు నన్ను దగ్గరికి కూడా రానివ్వదు ఇప్పుడు ఆ ఫ్రేమ్ దగ్గర ఏంటి అంత ఫ్రీగా ఉంది, ఆ ప్రేమ గాడు  సిద్దు కి ఏదో మందు పెట్టి ఉంటాడు ' అని అనుకుంటాడు తన మనసులో.

" ఇదేంట్రా ప్రేమ్ ని స్వీటీ కి దూరం చేద్దామని మనం ఎన్ని ప్లాన్స్ చేస్తుంటే వాడు స్వీటీకి అంత దగ్గరవుతున్నాడు " అని అసహనంగా అంటాడు అరుణ్.

" వాడికి అన్నీ అలా కలిసి వస్తున్నాయి ఏం చేయమంటావ్"  అని కోపంగా అంటాడు నితిన్.

" డోంట్ వర్రీ ఇది జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది ఈ లోపల ఏదో ఒకటి చెయ్యొచ్చు" అని అంటాడు అరుణ్ , నితిన్ వైపు చూస్తూ.

" వాడిని ఏదో ఒకటి చేయాలి రా " అని పళ్ళు నూరుతూ కోపంగా ప్రేమ్ నీ  చూస్తూ అంటాడు నితిన్.

ప్రేమ్ నీ  చూస్తున నా శైలు " ఈ ప్రేమ్ లో ఏదో మ్యాజిక్ ఉంది "  అని  గట్టిగా అంటుంది .

" సరే పదండి మనం కూడా వెళ్లి సిద్దు కి హాయ్ చెబుదాం"  అని అంటాడు ఆదిత్య. ప్రేమ్ ఇంకా సిద్దు ని అంత దగ్గరగా చూస్తుంటే వీళ్ళు చెప్పినట్లుగా సిద్దు ఏమి అంత డేంజర్ కాదేమో అని అనుకుంటాడు ఆదిత్య.

" అధి  , సిద్ధూ  ప్రేమ్ దగ్గర అంత క్లోజ్ గా ఉంది అని నువ్వు అది డేంజర్ కాదేమో అని అనుకుంటున్నావు , కానీ అది కొంచెం వైల్డ్ గానే ఉంటుంది , మమ్మల్ని ఎవరినీ కూడా దగ్గరికి రానివ్వదు. కావాలంటే నితిన్ నీ  అడుగు ఒకసారి వాడిని ఎలా కరిచిందో"  అని అంటుంది అక్షయ. 

శైలు కూడా అక్షయ మాటలకి ఏకీభవిస్తూ " అవును ఆదిత్య గారు అది నితిన్ ని అల కరించిన అప్పటినుంచి మేము ఎవరం కూడా సిద్దు దగ్గరికి వెళ్ళాము,  అదంటే మాకు కొంచెం భయం కూడా"  అని అంటుంది.

" ఏమో మీరు చెప్పిన వాటి మీద నాకు అంత నమ్మకం కుదరడం లేదు,  ఒకసారి వెళ్లి చూద్దాం పదండి " అని ఆదిత్య అంటాడు వాళ్లని ముందుకు పదమని చెప్తూ.

ఆదిత్య వాళ్ళ మాటలను నమ్మట్లేదని గమనించిన అక్షయ " సరే ఆదిత్య గారు వెళదాము , కానీ మేము కొంచెం దూరంగానే ఉంటాము మీరే వెళ్ళండి , అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్దు మిమ్మల్ని ఏమన్నా చేస్తే దానికి నన్ను బాధ్యురాలు చేయొద్దు ముందే చెప్తున్నాను " అని అంటుంది.

" మీరు దాని మూడ్ బాగోలేని టైంలో వెళ్లారేమో అందుకే అది అంత వైల్డ్ గా బిహేవ్ చేసి ఉండి ఉంటుంది ఇప్పుడు చూడండి ప్రేమ్ చేతిలో చక్కగా ఉంది దాని మూడ్ ఇప్పుడు బాగానే ఉంది అనుకుంటా వెళ్లి కలుద్దాం రండి "  అని అంటాడు ఆదిత్య.

" సరే వెళ్దాం పదండి ఎలాగో నానమ్మ ప్రియా ఇంకా ప్రేమ్ నీ పూజకి టైం అవుతుంది రమ్మని పిలమ్మని చెప్పింది కదా వెళ్లి పిలుద్దాం. ఒకవేళ సిద్దు ఏమన్నా వైల్డ్ గా బిహేవ్ చేస్తే ప్రియా చూసుకుంటుందిలే  పదండి " అని అంటాడు నిఖిల్.

ఊర్మిళాదేవి గారు ఎంగేజ్మెంట్ కి మందు ప్రియా ఇంకా ప్రేమతో ఏదో పూజ చేయించాలి అని అనుకుంటారు.   వాళ్లు హాల్లో లేకపోవడంతో నిఖిల్ ని పిలిచి వాళ్ళని తీసుకురమ్మని చెప్తుంది . ఎలాగో అక్షయ బెట్టింగ్ వేసింది కాబట్టి ప్రేమ్ సిద్దు దగ్గరికి వెళ్ళాడా లేదా చూద్దామా అని అనుకొని అందరూ కలిసి బయటికి వచ్చి ఉంటారు. కానీ ప్రేమ్ సిద్దుతో ఇంత క్లోజ్ గా ఉంటాడని ఊహించలేదు.

ఎలాగో వాళ్ళని పిలవాలి కాబట్టి వాళ్లు అందరూ కూడా ప్రియ ఇంకా ప్రేమ్ దగ్గరకు వస్తారు .
సిద్ధూ వాళ్ళని చూసి ప్రేమ్ షర్ట్ లో దాని హెడ్ నీ దాచుకోవడానికి ట్రై చేస్తుంది .

ఆది చూసి, ప్రియ ఇంకా ప్రియ ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు .
ప్రేమ్ సిద్దు చేస్తున్న పనికి చూసి నవ్వుతూ " సిద్దు అలా చేయకు బయటికి రా నా షర్ట్ లో నుంచి" అని అంటాడు నవ్వుతూ.

  సిద్దు చేస్తున్న బిహేవియర్ చూస్తుంటే , ప్రియ ఫ్రెండ్స్ కి  ఒకరు గుర్తుకు వస్తారు, సిద్దు ఎక్కువగా అతనితో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తూ ఉండేది.

శైలు వెంటనే " సిద్ధూ విన్ను తో ఉన్నపుడు ఎలా బిహేవ్ చేసేదో  ఇపుడు ప్రేమ్ తో కూడా అలాగే బిహేవ్ చేస్తుంది కాదు  " అని అంటుంది.
వెంటనే నిఖిల్ శైలు నోరు మూసేస్తాడు, శైలుకి తను చేసిన తప్పేంటో అప్పుడు గుర్తుకు వస్తుంది.

శైలు ఒకసారిగా ఆ పేరు తీయగానే అక్కడ అందరి మొహాల్లో ఏదో కలవరం అందరూ ఒకేసారి ప్రియా మొహం వైపు చూస్తారు.
అప్పటివరకు సంతోషం తొంగి చూసిన ప్రియా మొహంలో చిరునవ్వు మాయమై తన కంట్లో నుంచి అప్రయత్నంగా నీళ్లు కారుతూ ఉంటుంది. 

కొనసాగుతుంది...

ఇంతకీ ఈ విన్ను ఎవరు? అతని పేరు వినగానే ప్రియా ఎందుకు ఏడుస్తుంది?. తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్లి పోదామా

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.