you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ - 26

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ - 26

" వాట్ ? నువ్వు ప్రియా ని ప్రేమిస్తున్నావా? "  అని వినిపించిన మాటలకి అటువైపు చూస్తారు అరుణ్ ఇంకా నితిన్. 

అక్కడ శైలు నీ చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. 

" ఇది ఎప్పుడు వచ్చింది ఇక్కడికి ? మన మాటలను అని వినేసి ఉంటుంది అంటావా? "  అని అడుగుతాడు అరుణ్ , నితిన్  వైపు చూస్తూ.

" ఒరేయ్ దీని నోట్లో ఏది ఆగదు ఇప్పుడు గాని ఇది వెళ్లి ప్రియా కి చెప్తే మొత్తం పెంట పెంట అవుతుంది, ఏదో ఒకటి చేయరా " అని టెన్షన్ పడతాడు నితిన్. 

" చెప్పనివ్వరా ఈ రకంగా అయినా ప్రియా కి నీ ప్రేమ విషయం తెలుస్తుంది"  అని అంటాడు అరుణ్ చిన్నగా.

" ఒరేయ్ ఎవడి ప్రేమ వాడు చెప్పుకోవాలి ఇలా పక్కన వాడితో రాయబారం పంపకూడదు, ఇదంతా కాదు ముందు ఏం చేయాలో అది చెప్పు " అని అంటాడు నితిన్ కోపంగా.

" ఏంటి నువ్వు ప్రియ నీ ప్రేమిస్తున్నావా? ఇది ఎప్పటినుంచి రా?  నాకు తెలియదు.  అయినా  నువ్వు  ప్రియ నీ ప్రేమిస్తున్న సంగతి ప్రియా కి తెలుసా?   లేదు లేదు తెలిసుంటే ఈ ఎంగేజ్మెంట్ చేసుకునేది కాదు ప్రియ.  అంటే ఇప్పటివరకు నీ ప్రేమ విషయం ప్రియా కి చెప్పలేదా ? ఇంతకీ ఈ విషయం ఎవరెవరికి తెలుసు ? నిఖిల్ కి కూడా తెలుసా? , ఏంటిరా మాట్లాడరు నేను వాగుతూనే ఉన్నాను మీ పాటికి మీరు సైలెంట్ గా ఉన్నారు"  అని కోషన్స్ మీద కోషన్స్ వేస్తూనే అంటుంది శైలు. 

" అబ్బా ....శైలు మాకు మాట్లాడే ఛాన్స్ నువ్వు ఎక్కడ ఇస్తున్నావే.  నీ పాలిటి నువ్వే మాట్లాడుకుంటూ  పోతున్నావ్ "  అని అంటాడు అరుణ్.

" నువ్వు ఆగరా " అని అరుణ్ నీ ఆపుతూ  నితిన్ వైపు చూసి " నువ్వు చెప్పరా ప్రియ నీ  ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావ్ ఈ విషయం ప్రియా కి చెప్పకుండా ఇన్నాళ్లు ఎందుకు ఉన్నావ్ ? అయినా ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచావు "  అని అంటుంది.

శైలు ఎలాగొ వినేసింది కాబట్టి దాచడం కుదరదు అనుకొని " అవును నేను ప్రియా ని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను కానీ తనకి చెప్పలేకపోయాను ప్లీజ్ నువ్వే నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలి శైలు" అని శైలు ని అడుగుతాడు.

" కానీ నువ్వు చాలా ఆలస్యం చేసావురా,  ఇప్పుడు ప్రియా కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది , పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు"  అని అంటుంది.

నితిన్ వెంటనే శైలు చేతులు పట్టుకొని " ప్లీజ్ శైలు  , ఆ పెళ్లి ఆపడంలో నువ్వు కూడా మాకు హెల్ప్ చేయాలి, నువ్వు కూడా మాకు హెల్ప్ చేస్తే నేను ప్రియా అని పెళ్లి చేసుకోగలుగుతాను"  అని అంటాడు.

శైలు సతమతమైపోతూ "  కానీ ప్రియా కి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా " అని అంటుంది .

" ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది పెళ్లి అవ్వలేదు"  అని అంటాడు అరుణ్.

నితిన్ అవును అన్నట్లు "  అవును. ఇది జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే కదా నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను ప్రియ ని పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ శైలు నువ్వే నాకు హెల్ప్ చేయాలి .నేను నీ లవ్ మ్యాటర్ లో ఎంత హెల్ప్ చేశాను నీకు గుర్తుంది కదా ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ " అని అంటాడు .

" కానీ ప్రియా కి ప్రేమ్ అంటే ఇష్టం ఉంది కదరా"  అని అంటుంది శైలు.

"  ఎవరు చెప్పారే ప్రియా కి ప్రేమ్ అంటే ఇష్టమని . లేదు అదంతా ట్రాష్ . ప్రియా కి ప్రేమ్ అంటే ఎప్పుడు ఇష్టం ఉండదు. ఆ ప్రేమ్  గాడే ప్రియా నీ మనుపులేట్ చేస్తూ ఉన్నాడు.  ప్రియా ని వాడికన్నా నేనే బాగా చూసుకుంటాను,  ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా . మనమందరం ఫ్రెండ్స్.  ప్రియా నీ చిన్నప్పటినుంచి చూస్తున్నాం తన గురించి నాకు బాగా తెలుసు . తన పాస్ట్ గురించి కూడా నాకు బాగా తెలుసు తనని నేనే బాగా అర్థం చేసుకోగలను." అని అంటాడు .

శైలు ఆలోచనలో పడుతుంది " కానీ ప్రేమ్.."  అనీ ఏదో అనే లోపు

"ప్రియ విన్ను నీ ఎంత లవ్ చేసిందో మనందరికీ బాగా తెలుసు.  ఇంకా విన్ను  ప్రియ మనసులోనే ఉన్నాడు.  ఒకసారి ఆలోచించు  , పెళ్లి చేసుకున్న భర్త తన భార్య తననే ప్రేమించాలని అనుకుంటాడు ఇలా ప్రియా విన్ను జ్ఞాపకాలతో ఇంకా ఉంది అని తెలిస్తే వాళ్ళ మధ్యలో గొడవలు రావా ఒకసారి నువ్వు ఆలోచించు ప్రియా గురించి నితిన్ కి  అన్నీ తెలుసు. ప్రేమ్ ప్రియ నీ విన్ను విషయంలో అర్థం చేసుకోగలడు అంటావా? ,  స్వీటీ నితిన్ తో ఉంటేనే కరెక్ట్ " అని అంటాడు అరుణ్.

శైలు ఆలోచనలో పడుతుంది ఫ్రేమ్ ప్రియా నీ లవ్ చేస్తున్నాడు గాని,  ప్రియా మనసులో ఇంకా విన్ను ఉన్నాడని తెలిస్తే ఇలాగే లవ్ చేయగలడా అని అనుకుంటుంది. 

తను స్టేట్స్ లో ఉండి చదువుకున్నప్పుడు తన  రూమ్మేట్  , ఇలాంటి ఒక సిచువేషన్ ని ఫేస్ చేసింది. తన రూమ్మేట్ ఆల్రెడీ ఒక అబ్బాయి నీ లవ్ చేసింది బట్ ఆ అబ్బాయి తనని వదిలి వెళ్ళిపోయాడు . బట్ ఆ అమ్మాయి ఆ అబ్బాయి మెమోరీస్ తోనే ఉండేది . నెక్స్ట్ వాళ్ల పేరెంట్స్ చూసిన సంబంధం పెళ్లి చేసుకుంది . పెళ్లి చేసుకుని అబ్బాయి తనని చాలా బాగా చూసుకునేవాడు కానీ ఒకరోజు ఆ అమ్మాయికి ఇలా పాస్ ఉందని తెలిసిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు తర్వాత చివరికి వాళ్లు డివోర్స్ దాకా వెళ్లారు. 

ప్రేమ్ ఇప్పుడు ప్రియ నీ చాలా ఇష్టపడుతున్నాడు బట్ ఒన్స్ తనకి ప్రియా పాస్ట్  గురించి తెలిసి ఇంకా ప్రియా తన పాస్ లవ్ ని ఇంకా మర్చిపోలేదు అని తెలిస్తే ప్రేమ్ కూడా ప్రియా నీ అలాగే దూరం పెడతాడేమో అన్న అనుమానం తనలో మొదలైంది. 

తనకి ప్రేమ్ గురించి అంతగా తెలియదు కానీ అక్షయ ఇంకా నిఖిల్  ప్రేమ్ కి సపోర్ట్  ఇస్తుంటే తాను కూడా ప్రేమ్ కి సపోర్టింగ్ గా ఉంది , కానీ ప్రేమ్ మీద తనకి అంతగా నమ్మకం లేదు.

అందులోనూ తాను నితిన్ కి సపోర్ట్ చేయాలా ప్రేమ్ కి సపోర్ట్ చేయాలా అని సంఘర్షణ వస్తే   తను మాత్రం నితిన్ కే సపోర్ట్ గా  వస్తుంది ఎందుకంటే  తను నితిన్ నీ చిన్నప్పటి నుంచి చూస్తుంది నితిన్  ప్రియా నీ ఎలా చూసుకుంటాడో ఎలా అర్థం చేసుకుంటాడో తనకి బాగా తెలుసు కాబట్టి . ఇలా ఏమీ తెలియని ప్రేమ్ మీద అయితే నమ్మకం పెట్టుకోలేదు తను.

వీటి అన్నిటిని ఆలోచించి . శైలు ఒక నిర్ణయానికి వచ్చి  నితిన్ కి సపోర్ట్ గా ఉంటేనే  కరెక్ట్ అని అనుకొని " సరే రా నేను నీకు సపోర్ట్ చేస్తాను"  అని అంటుంది.

ఆ మాట వినగానే అరుణ్ ఇంకా నితిన్ చాలా సంతోషపడతారు నితిన్ శైలు ని గట్టిగా హాగ్ చేసుకుని " థాంక్యూ వెరీ మచ్ రా " అని అంటాడు. 

" మనమందరం ఫ్రెండ్స్ రా థాంక్స్ ఎందుకు , అందులోను ప్రియా కి ఏది మంచిది అని నాకు అనిపిస్తే అదే చేస్తాను నేను " అని అంటుంది శైలు.

అరుణ్ వెంటనే " శైలు ఇంకొక విషయం ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి నిఖిల్ కి చెప్పకు " అని అంటాడు.

శైలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ"  కానీ ఎందుకు చెప్పకూడదు మనం నిఖిల్ కి చెప్తే వాడు కూడా మనకి సపోర్ట్ చేస్తాడు కదా "  అని అంటుంది.

" లేదే వాడు నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు వాడెప్పుడూ కూడా ఆ ప్రేమ్ గాడికే సపోర్టింగ్ గా ఉంటున్నాడు అందుకే వాడికి చెప్పద్దు అని అంటున్నాం " అని అంటాడు నితిన్.

" లేదు నేను ఒకసారి చెప్పి చూస్తాను వాడు కచ్చితంగా సపోర్ట్ చేస్తాడు నీకు"  అని అంటుంది శైలు. 

శైలు వాళ్ళ మాట వినదని అర్థమయింది నితిన్ ఇంకా అరుణ్ కి వాళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఒక్క నిమిషం ఆలోచించి శైలు వైపు చూసి " సరే శైలు నీ ఇష్టం వాడిని ఒకసారి అడుగు చూడు వాడి కచ్చితంగా ఆ ప్రేమ్ గాడికే సపోర్టింగ్ గా ఉంటాడు నాకు సపోర్ట్ చెయ్యడు.  కానీ ఒక విషయం నువ్వు మాకు సపోర్టింగ్ గా ఉన్న సంగతి మాత్రం  నిఖిల్ కి చెప్పకు"  అని అంటాడు అరుణ్. 

శైలు ఒక నిమిషం ఆలోచించి " హమ్ ...సరే అయితే నేను వాడిని అడిగి చూస్తాను వాడు ప్రేమ్ కే సపోర్ట్ చేస్తే కనుక,  మన ముగ్గురం మన సీక్రెట్ ప్లాంట్స్ మనం చేద్దాం ఓకేనా " అని అంటుంది శైలు.

" ఓకే డన్"  అని ముగ్గురు ఫ్రెండ్స్ చేతులు కలుపుతారు.

*****

ఒక పెద్ద ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్ లో ఒక వ్యక్తి తన బాత్ రోబ్ లో ఉన్నాడు. అతని చేతిలో సిగరెట్ వెలుగుతూ ఉంది అతని కళ్ళు మాత్రం టీవీ స్క్రీన్ మీద అతుక్కొని ఉన్నాయి.

ఆ టీవీ స్క్రీన్ మీద ప్రియా ఇంకా ప్రేమ్ ఎంగేజ్మెంట్ న్యూస్ వస్తూ ఉంది . ప్రియా ఇంకా ప్రేమ్ ఒకరితో ఒకరు హ్యాపీ గా మాట్లాడుకోవడం ఆ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తూ ఉంది . అది చూస్తుంటే కోపంతో అతని పిడికిలి బిగుసుకున్నాయి.

" హమ్ ..ప్రియా ... మై బేబీ ....ఫైనల్ గా పెళ్లి చేసుకుంటున్నావు అన్నమాట , అది కూడా మీ అత్త కొడుకుతో .  నాట్ బ్యాడ్ బాగానే ఉన్నాడు .చూద్దాం వీడి ఆయుష్షు ఎక్కడి వరకు ఉందో " అని గట్టిగా నవ్వుతాడు. 

అంతలో వెనక నుండి టవల్ తో ఉన్న ఒక అమ్మాయి అతనిని చుట్టేస్తుంది. " డార్లింగ్ మొదల పెడదామా"  అని హస్కీ వాయిస్ తో అంటుంది.


" షూర్ బేబీ , గెట్ రెడీ ఫర్ ద బెస్ట్ అటాక్ "  అని అంటూ ఆ అమ్మాయిని విసురుగా మంచం మీదకి నెట్టేస్తాడు.

రెండు గంటల తర్వాత అతనీ సెక్యూరిటీ కి ఫోన్ చేసి లోపలికి రమ్మని అంటాడు.
అతని సెక్యూరిటీ లోపలికి రాగానే అచేతనంగా పడి ఉన్న అమ్మాయి వైపు చూపిస్తూ" క్లియర్ దా మెస్"  అని అంటాడు.
మళ్లీ సిగరెట్ వెలిగిస్తూ ఆ అమ్మాయి వైపు చూసి సైడ్ స్మైల్ ఇస్తూ. 

" నేను కోపంలో ఉన్నప్పుడు నన్ను గెలికితే ఇలాగే ఉంటుంది బేబీ"  అని చిన్నగా అని నవ్వుకుంటాడు.

సెక్యూరిటీ గార్డ్స్ ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్లిపోతారు. ఫైవ్ మినిట్స్ లో బ్లడ్ మార్క్స్ ఉన్న బెడ్షీట్ మార్చేసి మళ్లీ కొత్త బెడ్షీట్ వేసి రూమ్ అంతా క్లియర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

అతను తన ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తాడు. 
" చెప్పండి బాస్ " అని అవతలి వ్యక్తి అనగానే. 

" ఒక చిన్న ఆట , నిఖిల్ అలట్నెస్ టెస్ట్ చెయ్ , బట్ డోంట్ హార్మ్  హర్" అంటాడు.

" ఎస్ బాస్ " అంటూ  అవతల వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు.

అతను తన రూమ్ లో ఉన్న పేద  ఫోటో వైపు చూస్తాడు .అందులో ప్రియ ఇంకా తన ఫ్రెండ్స్ ఇన్క్లూడింగ్  విన్ను ఉంటారు .

పక్కనే ఉన్న ఒక ఆరో తీసుకొని ఆ ఫోటో వైపు విసురుతాడు. ఆ ఆరో కరెక్టుగా వెళ్లి ఆ ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి నుదుటి మీద ఫిక్స్ అవుతుంది .
ఆది చూసి చిన్నగా నవ్వుతూ, " నా గురి ఎప్పుడు తప్పదు" అని గట్టిగా నవ్వుతాడు.

..
కొనసాగుతుంది...

తప్పులు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు.

ఇంతకీ ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఇతని వల్ల ఫ్రేమ్ , ప్రియా ఫ్రెండ్స్ ఇంకా ప్రియా లైఫ్లో ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? , ఇంతకీ ఈ వ్యక్తికి ప్రియా కి సంబంధం ఏమిటి? . తెలుసుకోవాలని ఉందా   ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ చాప్టర్స్ లోకి వెళ్లి పోదామా.

నా స్టోరీ మీకు ఎలా అనిపించింది.