Dark net episode 4 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 4

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 4

అలా తరువాత భాస్కర్ ప్రాజెక్ట్ కిరణ్ కి ఇవ్వడం తో కిరణ్ ఆఫీసులో ఆఫీస్ లో వర్క్ చేసే ఎంప్లాయిస్  కి అందరికీ శాలరీస్ పెంచుతాడు. భాస్కర్ కిరణ్ కి ప్రాజెక్ట్ ఇచ్చిన తరువాత ఒక 20 నిమిషాలకి కిరణ్ కి  ఒక unknown నెంబర్ నుండి కాల్ వస్తుంది. అలా కిరణ్ ఆ unknown నెంబర్ నుండి వచ్చిన కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. కిరణ్ హలో అన సెకండ్ కే కిరణ్ చెవిలో నుండి  రక్తం కారి  కిరణ్ కిందపడి   గిలగిలా కొట్టుకుంటూ  అక్కడికి అక్కడే  చనిపోతాడు.

 అసలు కిరణ్ కి  unknown నెంబర్ నుండి కాల్ రావడం ఏంటి? 

కిరణ్ ఆ unknown నెంబర్ లిఫ్ట్ చేసిన వెంటనే చెవి లో నుండి రక్తం కారి చనిపోవడం ఏంటి? అసలు కిరణ్ ఎలా చనిపోయాడు? కిరణ్ ని ఎవరైనా చంపేరా? ఒక వేళ కిరణ్ ని ఎవరైనా చంపితే? ఎందుకు? చంపేరు? కిరణ్ చనిపోవడానికి కారణం తెలుసు కోవాలి అని అనుకుంటే డార్క్ నెట్ వెబ్ సిరీస్ ని చుడండి.

అలా తరువాత కిరణ్ ఆఫీస్ వర్క్ చేసే రమ్య కిరణ్ కేబిన్ దగరికి వెళ్ళుతుంది. రమ్య కింద పడిన కిరణ్ ని చూసి భయపడుతుంది. అంటే కిరణ్ క్యాబిన్  మొత్తం రక్తంతో  తడిసిపోయి ఉంటుంది. రమ్య కి చాలా భయం వేస్తుంది. అంటే తనకి కాళ్లు చేతులు ఆడవు. దీనితో రమ్య గట్టిగా అరుస్తుంది. రమ్య గట్టిగా అరవడంతో ఆఫీసులో  వర్క్ చేసే స్టాఫ్ మొత్తం కిరణ్ క్యాబిన్ దగ్గరికి వస్తారు. 

అలా తరువాత రమేష్ కిరణ్ ని ఆ పరిస్థితుల్లో చూసి  కిరణ్ చనిపోయాడు. అని నిదరిస్తాడు. దీనితో తరువాత రమేష్ పోలీసు వాళ్లకి  కాల్ చేసాడు.

అలా తరువాత హీరో ఎంట్రీ పేరు : ఆర్య ( Sp )

ఆర్య బిజీ గా ఉండటం తో ఆర్య ఫ్రెండ్ అయినా విక్రమ్ ని అక్కడికి ఆర్య పంపిస్తాడు.

 అలా కిరణ్ ఆఫీస్ కి  పోలీసు వాళ్ళు  వస్తారు. ఆధారాలు ఏమైనా దొరుకుతాయి ఏమో అని అక్కడ చూస్తే  ఏం ఆధారాలు కనబడవు. దీంతో విక్రమ్  ఇది ఆత్మహత్య అని చెప్తాడు. 

తరువాత విక్రమ్ కిరణ్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు.

 విక్రమ్ జరిగింది మొత్తం ప్రణతి కి చెప్పాడు. ప్రణతి చాలా భయంతో టెన్షన్ టెన్షన్ గా అక్కడికి వస్తుంది. ప్రణతి కిరణ్ ని ఆ పరిస్థితిలో చూసి చాలా ఏడుస్తుంది. భయపడుతుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రణతి కిరణ్ ని ఆ పరిస్థితిలో చూసి ఏడుపు ఆపుకోలేదు.


అలా తరువాత విక్రమ్ ప్రణతి ని ఓదారుస్తాడు.


తరువాత విక్రమ్ ప్రణతి ని కిరణ్ గురించి అడుగుతాడు.


( విక్రమ్ ) : అమ్మా మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థం అవుతుంది. అమ్మా కానీ మీరు నా విచారణ కి కొంచెం కోపరేట్ చేస్తే నేను మీకు ఇదిగో 

నాయ్యం చేయగలను. అమ్మ

అని విక్రమ్ ప్రణతి తో చెప్పుతాడు.

( ప్రణతి ) : మా అబ్బాయి చాలా మంచోడు. సార్ టైం అంటే టైం కి ఆఫీస్ కి వెళ్లి మళ్ళీ టైం కి ఇంటికి వచ్చేవాడు సార్.


( విక్రమ్ ) : మీ అబ్బాయి కి ఎవరితోనైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అంటే ఎవరైనా శత్రువులు అలా ఉన్నారా అంటే అమ్మ అది మీ అబ్బాయి అంటే ఎవరైనా గిట్టని వాళ్ళు ఉన్నారా


అని విక్రమ్ ప్రణతి తో అడుగుతాడు.


( ప్రణతి ) : నాకు తెలిసి మా అబ్బాయికి ఎవరితో గొడవలు లేవు. అలాగే మా అబ్బాయి ఎవరితో గొడవలు కూడా పెట్టుకోండి సార్ మా అబ్బాయి జోలికి ఎవరు రారు. అలాగే మా అబ్బాయి కూడా ఎవరి జోలికి వెళ్ళడు సార్.


అని ప్రణతి విక్రమ్ తో చెప్తుంది.

( విక్రమ్ ) : సరే అమ్మ మీరు కొంచెం యాక్టివ్ గా ఉండండి. అమ్మ బాధపడకండి. మీతో నాకు అవసరం ఉన్నపుడు కాల్ చేస్తాను. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. మీరు నాకు చెప్పకుండా ఈ ఊరు దాటి అలాగే సిటీ దాటి ఎక్కడికి వెళ్ళకండి. అమ్మ


అని విక్రమ్ ప్రణతి తో చెప్పుతాడు.


అలా తర్వాత విక్రమ్ కిరణ్ వాళ్ళ అమ్మ బాధని చూడలేక పోతాడు. అలా తరువాత విక్రమ్ కిరణ్ ఆఫీసులో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని విచారిస్తాడు. కిరణ్ ఆఫీసులో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ కిరణ్ గురించి మంచిగానే చెప్తారు. దీంతో కిరణ్ ఎలా చనిపోయాడో విక్రమ్ కి అర్థం కాక ఆలోచనలో పడతాడు.


తరువాత ప్రణతి భయంతో కిరణ్ వాళ్ళ అన్న రంగ కి కాల్ చేసి జరిగింది. మొత్తం చెప్తుంది. అలా రంగ ప్రణతి కి ధైర్యం చెప్తాడు.

అని రంగా కూడా ప్రణతి కన్నా ఎక్కువగా బాధపడతాడు. ఎందుకంటే రంగా కిరణ్ అన్నదమ్ముల కాదు. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ల ఒక్కరిని విడిచి ఒకరు ఉండేవారు కారు. అలా తర్వాత బెంగళూరులో ఉండే రంగ అప్పటికప్పుడు బెంగళూరు నుండి బయలుదేరి హైదరాబాద్ కి వస్తాడు. అంటే రంగ ఇంటికి వస్తాడు.


ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 4 ముగిసింది.


ఇంతటి తో అయిపోలేదు.


బెంగళూరులో ఉండే రంగ ఇంటికి వచ్చాక ఏం జరిగిందో అని తెలుసుకోవాలి అని అనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 5 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.


కొనసాగుతుంది.