Dark net episode 6 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 6

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 6

అలా ఆర్య ఈ కేసు ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. అలాగే అంతే కాకుండా చాలా సీరియస్ గా  ఈ కేసు మీదే ఆర్య  ఫోకస్ పెడతాడు. తరువాత ఆర్య కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ని చెక్ చేసాడు. కిరణ్ ఇంటి బయట  ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లో  ఏం ఉండదు. డైలీ నార్మల్ గానే ఉంటుంది. ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో  అనుమానించేలా ఆర్య కి  ఎవరు కనబడరు.

 కిరణ్ ఇంటి బయట ఉన్న  సీసీ టీవీ  ఫుటేజ్ లో  ఏం కనబడక పోయే సరికి ఆర్య  తరువాత  కిరణ్ వాళ్ళ  ఆఫీస్ కి  బయలుదేరుతాడు. అలా ఆర్య  కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి  వెళతాడు. అరే కిరణ్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాక  కిరణ్ కేబిన్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్  ని చెక్ చేసాడు. కిరణ్ కేబిన్ లో ఉన్న సీసీ టీవీ లో కూడా ఆర్య కి అనుమానించేలా ఎవరు కనపడరు. అలాగే అనుమానించేలా ఎవరు ఉండరు. కూడా దీనితో ఆర్య కిరణ్ ఆఫీస్ లో వర్క్ చేసే ప్రతి ఒకరిని కిరణ్ గురించి అలాగే కిరణ్ ఎలాంటి వాడు అని ఆర్య కిరణ్ ఆఫీస్ లో వర్క్ చేసే ప్రతి ఒకరిని విచారణ జరుపుతాడు. కిరణ్ ఆఫీస్ లో వర్క్ చేసే ప్రతి ఒకరు కిరణ్ గారు చాలా మంచివారు అని చెప్పుతారు. కానీ కిరణ్ గారు ఎలా చనిపోయారు అనేది మాకు కూడా అర్ధం కావడం లేదు అని ఆఫీస్ లో వర్క్ చేసే ప్రతి ఒకరు ఆర్య తో చెప్పుతారు.

తరువాత ఆర్య కిరణ్ ఆఫీస్ లో వర్క్ చేసే రమ్య అనగా కిరణ్ చనిపోయాక కిరణ్ ని కేబిన్ దగ్గర చుసిన రమ్య ని ఆర్య విచారిస్తాడు.

అలా ఆర్య కి రమ్య కి మద్య సంభాషణ జరుగుతుంది.

( ఆర్య ) : చూడు రమ్య  నువ్వు లోపలికి వెళ్లేసరికి ఏం జరిగింది.

అని ఆర్య రమ్య తో అడుగుతాడు.

( రమ్య ) : సార్ నేను  ఒక ముఖ్యమైన ఆఫీస్ ఫైల్  లో కిరణ్ గారి సంతకం చేపించుకోవడం కోసం  కిరణ్ గారి కేబిన్ దగరికి వెళ్లెను సార్ అయితే కిరణ్ గారు అప్పటికే కిందపడి  కిరణ్ గారి క్యాబిన్ మొత్తం రక్తం తో తడిసిపోయి ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో నేను భయం తో అలాగే భయాందోళన తో గట్టిగా అరిచాను. తరువాత ఆఫీసు లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు వచ్చారు. కిరణ్ గారు చనిపోయిన తర్వాత  నేను మూడు రోజులు అదే భయం లో ఉన్న  ఏం జరిగింది ఏం జరుగుతుంది. అని అర్థం కాక నాకు అయితే  ఇప్పటికీ  భయం గా టెన్షన్ గా  ఉంది. సార్ అంత మంచి వారు ఏలా చనిపోయారని 

( ఆర్య ) : చూడు రమ్య కిరణ్ గారు ఏలా చనిపోయారు. అనేది మేము విచారణ  జరిపి తెలుసుకుంటాం. మీరు ఏం టెన్షన్ పడకండి. అంతవరకు ఈ ఆఫీస్ ని  రంగా చూసుకుంటాడు.

అలా తరువాత ఆర్య కిరణ్ కి టీ తెచ్చి ఇచ్చిన రమేష్ ని కూడా విచారిస్తాడు.

అలా ఆర్య కి రమేష్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.

( ఆర్య ) : చూడు రమేష్ కిరణ్ నిన్ను టీ తీసుకొని రా అన్నపుడు కిరణ్ ఎలా ఉన్నాడు. అంటే హ్యాపీ గా ఉన్నారా లేదా టెన్షన్ గా ఉన్నారా రమేష్ కిరణ్ అప్పుడు 

అని ఆర్య రమేష్ ని అడుగుతాడు.

( రమేష్ ) : సార్ కిరణ్ గారు ఏం టెన్షన్ గా  లేరు. కిరణ్ గారు భాస్కర్ గారు ఇస్తాను అన్న  ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సార్ అప్పుడు 

అని రమేష్ ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : అవును కదా కిరణ్ కి  భాస్కర్ అనే వ్యక్తి ప్రాజెక్టు ఇస్తాను అన్నారు కధ 

అని ఆర్య రమేష్ తో అడుగుతాడు.

( రమేష్ ) : అవును సార్ కిరణ్ గారికి భాస్కర్ గారు ఇచ్చిన ప్రాజెక్టు పూర్తి చేస్తే కిరణ్ గారి కంపెనీ చాలా బాగా డెవలప్ అయ్యేది. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం  కూడా లభించేది.

అని రమేష్ ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : భాస్కర్ భాస్కర్ గారు ఇచ్చిన ప్రాజెక్టు కిరణ్ చేస్తే కిరణ్ గారి కంపెనీ బాగా డెవలప్  అయ్యేంతవరకు ఓకే  కానీ ఈ ప్రాజెక్టు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం  ఎలా లభిస్తుంది.

అని ఆర్య రమేష్ తో అడుగుతాడు.

( రమేష్ ) : ఇది నాకు కూడా తెలియదు సార్  నాకే కాదు సార్ ఈ కంపెనీ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి  తెలియదు. సార్  కానీ భాస్కర్ గారు ఇచ్చిన  ప్రాజెక్ట్ ని  కిరణ్ గారు భాస్కర్ గారికి పూర్తి చేసి ఇస్తే  మాత్రం కిరణ్ గారి కంపెనీ చాలా డెవలప్ అయ్యేది అని మాత్రం మాకు తెలుసు సార్ 

అని రమేష్ ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : సరే కానీ రమేష్  కిరణ్  ఏలాంటి వాడు అనగా కంపెనీ లో మీ మీ అందరితో ఎలా ఉండేవాడు.

అని ఆర్య రమేష్ తో అడుగుతాడు.

( రమేష్ ) : కిరణ్ గారు చాలా మంచివారు సార్. మాతో ఒక సార్ ల కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు. అందరితో చాలా బాగా కలిసిపోయేవాడు.

అని రమేష్ ఆర్య తో చెప్పుతాడు.

 అలా తర్వాత  ఆర్య  సరే రమేష్  నువ్వు ఇంకా వెళ్ళొచ్చు.  ఎప్పుడైనా నీతో  నాకు అవసరం పడితే  పిలుస్తాను. నువ్వు అప్పుడు కచ్చితంగా రావాలి. 

అని ఆర్య రమేష్ తో చెప్పుతాడు.

అలా సరే అని రమేష్ వర్క్ లోకి వెళతాడు.

 ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 6 ముగిసింది.

 ఇంతటి తో అయిపోలేదు.

తరువాత ఆర్య కి భాస్కర్ పే అనుమానం వస్తుంది. భాస్కర్ కిరణ్ కి  ప్రాజెక్టు ఇస్సాను అన్న తర్వాత  కిరణ్ చనిపోయాడు. కిరణ్ చనిపోవడానికి  భాస్కర్ కి ఏమైనా సంబంధం ఉందా? అలాగే కిరణ్  కి భాస్కర్ ఇస్తాను అన ప్రాజెక్ట్ దేని గురించి? ఆ ప్రాజెక్ట్ లో ఏం ఉంది? అలాగే తరువాత ఆర్య భాస్కర్ ని విచారించ? లేదా? అని తెలుసుకోవాలనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 7 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

 కొనసాగుతుంది.