you are my destiny in Telugu Love Stories by priyanka books and stories PDF | యూ ఆర్ మై డెస్టినీ -37

Featured Books
Categories
Share

యూ ఆర్ మై డెస్టినీ -37

ప్రేమ్ బైక్ ని స్పీడ్ గా నడుపుతుంటే "  ఏంటి ఆ స్పీడ్ మెల్లగా వెళ్లొచ్చు కదా,  ఎవరో తరుముతున్నట్లు అంత స్పీడ్ గా వెళ్తున్నావ్"  అని అంటుంది ప్రియా  ప్రేమ్ ని గట్టిగా పట్టుకుంటూ.

" ప్రియురాలు పక్కన ఉంటే ఎవడైనా ఎడ్ల బండి లాగా మెల్లగా వెళ్తాడా ఏంటి, స్పీడ్ గా వెళ్తేనే కదా ఇలాంటి హాగ్లు  దొరికేవి"   అని అంటాడు ప్రేమ్ అలరిగా.

ఆ మాట వినగానే  ప్రేమ్ చుట్టూ ఉన్న తన చేతులు తీయబోతుంటే " ఏ బంగారం ఊరికే అన్నాను గట్టిగా పట్టుకో పడిపోతావ్ " అని అంటాడు.

ప్రియా ప్రేమ్ తల మీద ఒక మొట్టికాయ వేసి "మందు ఈ స్పీడ్ తగ్గించు"  అని అంటుంది.

" అబ్బా ఏంటి అలా కొడుతున్నావ్ తల అనుకుంటున్నావా తబలా అనుకుంటున్నావా" 

"నువ్వు ఈ స్పీడ్ తగ్గించకపోతే ఇంకా నాలుగు పడతాయి" 

" అది కాదు బంగారం బాగా ఆకలిగా ఉంది  ,ఇక్కడ దగ్గర్లో ఫుడ్ కోర్ట్ ఉంది తినేసేసి బయలుదేరుదాం , మళ్లీ మీ ఫ్రెండ్స్ వచ్చే టైం కి అక్కడికి చేరుకోవాలి కదా" అని అంటాడు ప్రేమ్.

’ఆకలితో ఉండడం వల్ల ఇంత స్పీడ్ గా వెళ్తున్నాడేమో’ అని అనుకొని.
"  సర్లే వాళ్ళు వెయిట్ చేస్తారు కొంచెం మెల్లగా పోనివ్వు " అని అంటుంది.

ప్రేమ్ కొంచెం స్పీడ్ తగ్గిస్తాడు. కానీ స్పీడ్ గానే వెళ్తూ ఉంటాడు . ఇంతలో ప్రియా కి ఆకాశంలో ఒక డ్రోన్ వెళ్తూ కనిపిస్తుంది .

" ఏ ప్రేమ్  అటు చూడు ఒక డ్రోన్ " అంటూ  అటువైపు చూపిస్తుంది. 

ఆ డ్రోన్ ని చూడగానే ప్రేమ్ కళ్ళు ఎర్రబడతాయి.
ఈ డ్రోన్  నీ ప్రేమ్ ఇంతకుముందు హిల్ టాప్ లో చూసి ఉంటాడు , దగ్గరలో ఎవరైనా వదిలి ఉంటారేమో అని అనుకుంటాడు , కానీ కొంచెం అనుమానం గానే ఉంటుంది , ప్రియా తన పక్కన ఉండగా రిస్క్ తీసుకోవడం అనవసరం అనుకుని ప్రియ నీ ఆ హిల్ టాప్ నుంచి తీసుకువచ్చేస్తాడు.  
కానీ ఆ డ్రోన్ వీళ్ల వెంటే ఫాలో అవ్వడం గమనించి ,  అతని అనుమానం నిజమవుతుంది.
అంటే ఎవరో వాళ్లని ఫాలో చేస్తున్నారు అని, పొద్దున ప్రియ నీ  అటాక్ చేసిన వాళ్లేనా అని అనుమానం వస్తుంది ప్రేమ్ కి.

వెంటనే అతని ఫోన్ నుంచి అతని సెక్యూరిటీ కి అలర్ట్ మెసేజ్ పంపిస్తాడు. 

ఆ డ్రోన్ ప్రేమ్ బైక్ ముందుకు కొంచెం దూరంలో పైన ఎగురుతూ ఉంటుంది. ప్రేమ్ ఇంకా ప్రియా చూస్తూ ఉండగా దాని టాప్ ఓపెన్ అవుతుంది అది ఒక స్క్రీన్ . ఆ స్క్రీన్ మీద " గో స్లో " "వేగంగా వెళ్లితే హాస్పిటల్ దగ్గరే బ్రేక్ పడుతుంది... నెమ్మదిగా వెళ్లి ఇంటికే చేరు!" "వేగంగా వెళ్తే జీవిత భాగస్వామి బాగుండదు… నెమ్మదిగా నడిపించు, వెనుక భార్య ఉన్న సంగతి మర్చిపోవద్దు!" అన్న లేటెస్ట్ వాటి మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. 
"నీ ప్రాణాలకి నాకు పెద్దగా కేర్ లేదు... కానీ నీ వెనుక కూర్చున్న అందాల భామకి చాలా కేర్ ఉంది! కాబట్టి నెమ్మదిగా వెళ్లు!"

ప్రియా వాటి మీద స్క్రోల్  అవుతున్న లెటర్స్ చూసి నవ్వుకుంటూ "  హే.. ఇది భలే ఉంది మన ట్రాఫిక్ పోలీసులు కొత్తగా కనిపెట్టారా ఏంటి ఈ సిస్టం.   ఇలా డ్రోన్ పంపించి వేగంగా వెళ్లే వారిని  వారించడానికి." అని అంటుంది. 

’ఎవడు వీడు,  ఇలా మెసేజెస్ చేస్తున్నాడు, ఎవరైనా ఆకతాయి వెధవ, లేకపోతే ఆ ఈగల్ గ్యాంగ్ వల్ల?  , ప్రియ గురించి కేర్ ఉందా ? ఎవరు ఐన సరే , ఐ హవా టు బి అలెర్ట్ ’ అని అనుకుంటాడు .

ప్రేమ్ కి ఆ డ్రోన్ చూస్తుంటే కొంచెం అనుమానం గా ఉన్న వాటిమీద స్క్రోల్ అవుతున్న లెటర్స్ చూస్తుంటే ఇది ఎవరో ఆకతాయి చేసిన పనేమో అని కూడా అనుకుంటాడు.

ఇంతలో ఫుడ్ కోర్ట్ రావడంతో బైక్  ఒక పక్కగా పార్క్ చేస్తాడు. ఆ డ్రోన్ వాళ్లకి కొంచెం  పైన ఎదురుగా వచ్చి గల్లీలో ఎగురుతూ ఉంటుంది .
దాని స్క్రీన్ మీద ఇంకా అక్షరాలు స్క్రోల్ అవుతూ ఉంటాయి " హో ..ఫుడ్ కోర్ట్ కి వచ్చారా? ఇక్కడ బొంగులో బిర్యాని చాలా బాగుంటుంది ట్రై చేయండి, దాని తర్వాత ఫిఫ్త్ స్టాల్ లో ఫలుదా ట్రై చేయండి"  అని ఉంటుంది.

" ఈ డ్రోన్ ఓనర్ ఇక్కడికి తరచూ వస్తాడు అనుకుంటా అందుకే ఇక్కడ ఏది బాగుంటుంది, అనాది అంత క్లియర్ గా మెన్షన్ చేశారు"  అని అంటుంది ప్రియా. ఆ స్క్రీన్ మీద ప్లే అవుతున్న దాన్ని చదువుతూ.

" ఎవడు ఈ క్రేజీ ఫెలో మన వెంట పడ్డాడు"  అని అంటాడు ప్రేమ్.

" ఎవరైతే ఏమి ఇక్కడ ఏది బాగుంటుందో చెప్తున్నాడు కదా , ట్రై చేద్దాం "  అని అంటూ ప్రేమ్ చెయ్యి పట్టుకుని ఫుడ్ కోర్ట్ లోపలికి తీసుకు వెళ్తుంది  ప్రియా.
మారువేషంలో ఉన్న ప్రేమ్ సెక్యూరిటీ కూడా వాళ్ల వెనకాలే వెళ్తూ , జనాల్లో మామూలు వ్యక్తులుగా కలిసిపోయి వాళ్లకి కొంచెం దూరంలో ఉంటూ చుట్టూ అబ్సర్వ్ చేస్తూ వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు.

ఆ డ్రోన్ చెప్పినట్లు బొంగులో బిర్యాని ట్రై చేద్దామని  వెళతారు . ప్రేమ్ టూ ప్లేట్స్ ఆర్డర్ చేస్తుంటే .
" ప్రేమ్ ఒక ప్లేట్ చాలు వేస్ట్ అవుతుంది"  అని అంటుంది ప్రియా.

ప్రేమ్  అలాగే అన్నట్లు ఒక ప్లేట్లో బొంగుల్లో బిర్యాని తీసుకొచ్చి ప్రియ ముందు పెడతాడు.
"  ఒక ప్లేట్ చెప్పాను అంటే ఒక ప్లేట్ బిర్యానీ చాలు అని అర్థం . ఇంకొక ఎక్స్ట్రా ప్లేట్ అడగొచ్చు కదా , ఇద్దరం షేర్ చేసుకుని తినే వాళ్ళ"  అని అంటుంది .

" పాపం వాడి దగ్గర ప్లేట్స్ తక్కువగా ఉన్నాయి అంట,  అయినా ఇప్పుడైతే ఏమి బంగారం ఇద్దరం కలిసి ఒక ప్లేట్లో తిందాం " అని అంటాడు.

ప్రేమ్ ఇదంతా కావాలనే చేస్తున్నాడని ఫ్రేమ్ వైపు అనుమానంగా చూస్తుంది ప్రియ .
అది గమనించి "  అయ్యో నిజంగా చెప్తున్నాను కావాలంటే నువ్వే వెళ్లి ఇంకో ప్లేట్ తెచ్చుకో నేను అబద్ధం చెబితే"  అని అంటాడు ప్రేమ్.

ఎంతలో షాప్ వాడు అతని పక్కనోడి మీద అరుస్తాడు  " ఒరేయ్ త్వరగా ప్లేట్స్ తీసుకురా ఇక్కడ ప్లేట్స్ అయిపోయాయి"  అని అంటూ.

ప్రియా ఇంకా చేసేదేమీ లేక ప్రేమ్ తో  కలిసి అదే ప్లేట్ లో తింటుంది . నిజంగా ఆ బిర్యానీ చాలా బాగుంటుంది.
" ప్రేమ్ బిర్యాని చాలా బాగుంది కదా"  అని అంటుంది .
ప్రేమ్ అవును అన్నట్లు తలకాయ ఉప్పుతాడు.
ఇంతలో ప్రియా కి పొలమారుతుంది  అప్పుడే అక్కడికి డ్రోన్ వస్తుంది దానికి ఒక కవర్ అటాచ్ అయి ఉంటుంది ఆ కవర్లో వాటర్ బాటిల్.

ప్రియా ఆ వాటర్ బాటిల్ తీసుకొబోతుంటే .
" వదు ప్రియా , ఇది సేఫ్ కాదు,  నేను వాటర్ తీసుకొస్తాను"  అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు.

ప్రియా కూడా తెలియని వాళ్ళ దగ్గర ఇలా వాటర్ తాగడం సేఫ్ కాదు అనుకుని ప్రేమ్ వెళ్లిన వైపు చూస్తూ ఉంటుంది
ఇంతలో స్క్రీన్ మీద "  ప్రియ నేను రుద్ర ముందు వాటర్ తాగు"  అని పడుతుంది .

అది చూసి ప్రియా ఆశ్చర్య పోతుంది. అండ్ స్క్రీన్ మీద ప్రియా ఇంకా రుద్ర కలిసి దిగిన ఫోటో కనిపిస్తుంది. అది చూడగానే ప్రియా చాలా సంతోష పడిపోతూ " రుద్ర నువ్వు "అని అంటుంది. 

" అవును ప్రియా నేనే ఫస్ట్ వాటర్ తాగు"  అని పడుతుంది .
ప్రియా ఇంకేమీ ఆలోచించకుండా ఆ వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది.

ఇంతలో ప్రేమ్  అక్కడికి వస్తాడు ప్రియ  వాటర్ తాగడం చూసి , కంగారుపడి ఒక్క అడుగులో తన దగ్గరికి చేరుకొని  ఆ వాటర్ తన దగ్గర నుంచి తీసుకుంటూ " ప్రియా , ఈ వాటర్ తాగద్దు అని చెప్పాను కదా , వెంటనే ఒసేయ్,  అది సేపు కాదు"  అని కొంచెం సీరియస్  ఇంకా ప్రియా కి ఏమవుతుంది అన్న కంగారుగా  అంటాడు.  ఎందుకంటే ప్రియా అప్పటికే హాఫ్ బాటిల్ వాటర్ తాగేసి ఉంటుంది.

ప్రియా కూల్ గా ఆ వాటర్ బాటిల్ రిటన్ తీసుకుంటూ " టెన్షన్ పడకు ప్రేమ్ , ఇది పంపించింది నాకు తెలిసిన వాళ్లే , భయపడకు, ఇది సేఫ్ వాటర్ , ఇందులో ఏమి మిక్స్ చేయలేదు లే"  అని అంటుంది. 

" నీకు తెలిసిన వాళ్ళ?  ఎవరు? "  అని  ప్రేమ్ అడుగుతుండంగా.

" నేనే"  అని అంటూ ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. 

అతను బ్లాక్ హుడ్డి వేసుకొని ఫేస్ వాష్ తో ఉంటాడు.
అతని చూస్తుంటే  ప్రేమ్ కి తెలిసిన వ్యక్తి లాగా అనిపించాడు. ఇంకా అతని వాయిస్ చాలా ఫ్యామిలియర్  గా అనిపించింది ప్రేమ్ కి.
వెంటనే  అలర్ట్ అవుతాడు ప్రేమ్ అతను ఎవరో గెస్ చేసి . అతని వైపు కోపంగా చూస్తూ.
ఆది చూసి రుద్ర చిన్నగా నవ్వుతూ. అతని మాస్ తీస్తాడు.

రుద్రానీ చూసి ప్రియా చాలా సంతోష పడిపోతూ "రుద్ర"  అని అంటూ వెళ్లి అతని హగ్ చేసుకుంటుంది .

అది చూసి ప్రేమ్ ఇంకా షాక్ అయిపోతాడు. ప్రియా ఇంకా రుద్ర అంతా క్లోజ్ గా ఉండడం చూసి ప్రేమ్ కింద భూమి కనిపించినట్లు అవుతుంది ప్రేమ్ కి.

కొనసాగుతుంది...

ప్రియా ఇంకా రుద్రాకి మధ్య సంబంధం ఏమిటి? రుద్రా నీ చూసిన ప్రేమ్ ఏం చేస్తాడు? 

తపుళ్లు ఏమైనా రాసి ఉంటే క్షమించగలరు...